bro
-
Uttarakhand Tunnel Crash: కొండ పైనుంచి టన్నెల్లోకి రంధ్రం
ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో సిల్క్యారా సొరంగం కూలి అప్పుడే ఏడు రోజులైంది. లోపల చిక్కుకున్న 40 మంది కార్మికుల భద్రతపై ఆందోళనలు తీవ్రమవుతుండగా, అధికారులు మరో ప్రత్యామ్నాయాన్ని ముందుకు తెచ్చారు. శుక్రవారం నిలిపివేసిన అమెరికన్ ఆగర్ యంత్రం డ్రిల్లింగ్ పనులను మళ్లీ ప్రారంభించారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్(బీఆర్వో) రూపొందించిన తాజా ప్రణాళిక ప్రకారం..సొరంగం నిర్మాణ పనులు సాగుతున్న కొండ పైనుంచి సొరంగంలోకి సమాంతరంగా రంధ్రం చేయాల్సి ఉంది. కొండ పైనుంచి 1,000 నుంచి 11,00 మీటర్ల పొడవైన రంధ్రం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే పనులు ప్రారంభించాం. రేపు మధ్యాహ్నం కల్లా ఇది సిద్ధమవుతుంది’అని బీఆర్వోకు చెందిన మేజర్ నమన్ నరులా చెప్పారు. ‘ముందుగా 4–6 అంగుళాల రంధ్రాన్ని తొలిచి లోపల చిక్కుబడిపోయిన వారికి అత్యవసరాలను అందిస్తాం. పరిస్థితులు అనుకూలిస్తే మూడడుగుల వెడల్పుండే రంధ్రాన్ని 900 మీటర్ల పొడవున తొలుస్తాం. దీని గుండా లోపలున్న వారు కూడా బయటకు చేరుకోవచ్చు’అని బోర్డర్ రోడ్స్ డీజీ ఆర్ఎస్ రావు చెప్పారు. ప్రధానమంత్రి కార్యాలయం అధికారుల బృందం కూడా ఘటనాస్థలానికి చేరుకుంది. కార్మికులను కాపాడేందుకు నిపుణులు వివిధ రకాలైన అయిదు ప్రణాళికలను సిద్ధం చేసినట్లు ప్రధాని మాజీ సలహాదారు, ప్రస్తుతం ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఓఎస్డీ భాస్కర్ ఖుల్బే చెప్పారు. ఇలా ఉండగా, శిథిలాల నుంచి డ్రిల్లింగ్‌ను మరింత సమర్థంగా కొనసాగించేందుకు శనివారం ఇండోర్ నుంచి ఒక యంత్రాన్ని తీసుకువచ్చారు. దీనిని కూడా బిగించి, డ్రిల్లింగ్ కొనసాగిస్తామని అధికారులు తెలిపారు. డ్రిల్లింగ్ పనులు మళ్లీ మొదలు: శుక్రవారం మధ్యాహ్నం 2.45 గంటల సమయంలో అయిదో పైపును లోపలికి పంపేందుకు డ్రిల్లింగ్ పనులు సాగుతుండగా సొరంగంలో ఒక్కసారిగా పెళ్లుమనే శబ్దం వినిపించింది. దీంతో, వెంటనే పనులను నిలిపివేశామని అధికారులు తెలిపారు. ఈ శబ్ధం సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బందిలో వణుకు పుట్టించింది. డ్రిల్లింగ్‌ను కొనసాగిస్తే టన్నెల్ మరింతగా కూలే ప్రమాదముందని నిపుణుడొకరు చెప్పారు. మొత్తం 60 మీటర్లకు గాను 24 మీటర్లలో శిథిలాల గుండా డ్రిల్లింగ్ పూర్తయిందన్నారు. ఇలా ఉండగా, సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికుల సంఖ్య 41గా తేలినట్లు అధికారులు వివరించారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన దీపక్ కుమార్ కూడా లోపలే ఉండిపోయారని అన్నారు. -
అంజూ ఘటన: ఆ కుటుంబానికి ఉపాధే కరువైంది!
జైపూర్: మధ్యప్రదేశ్‌కు చెందిన అంజూ అనే వివాహిత పాక్‌కు వెళ్లి అక్కడే తన ప్రియున్ని వివాహమాడిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనల అనంతరం అంజూ కుటుంబం స్థానికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అంజూ నిర్వాకం తర్వాత స్థానికులు ఆ కుటుంబం నుంచి దూరంగా ఉంటున్నారట. కేవలం గ్రామంలోనే గాక ఉద్యోగంలో కూడా వెలివేతకు గురికావాల్సి వస్తోందని సమాచారం. అంజూ తండ్రి గయా ప్రసాద్ థామస్ బౌనా అనే గ్రామంలో బట్టల కుట్టే వృత్తి చేస్తున్నారు. తన కూతురు అంజూ పాక్‌కు వెళ్లిపోయిన తర్వాత ఎవరూ తనకు ఉపాధిని కల్పించడం లేదని చెప్పారు. మొదట సానుభూతి చూపిన గ్రామస్థులే.. ఇప్పుడు దూరంగా ఉంటున్నారని వాపోయారు. అటు.. అంజూ సోదరుడు, భర్తకు కూడా తమ కంపెనీల్లో ఇదే పరిస్థితి ఎదురవుతోందట. అంజూ సోదరుడు డేవిడ్ ఓ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్నాడు. అయితే.. అంజూ వ్యవహారం తర్వాత తాను పనిచేసే సంస్థ డేవిడ్‌ను ఇంటివద్దే ఉండమని చెప్పేసిందని చెప్పారు. అంజూ భర్తను కూడా ఆయన పనిచేసే కంపెనీ బెంచ్‌కే పరిమితం చేసిందట. ఏ పని అప్పగించడం లేదట. ఖాలీ గానే ఉంచున్నారని వెల్లడించారు. అంజూ అనే వివాహిత ఇద్దరు పిల్లలు, భర్తను వదిలి ప్రియుని కోసం పాకిస్థాన్‌కు కొన్ని రోజుల క్రితం వెళ్లిపోయింది. అక్కడే తన పేరును ఫాతిమాగా మార్చుకుని పెళ్లి కూడా చేసుకుంది. ఈ ఘటనల తర్వాత అంజూపై ఆమె తండ్రి తీవ్ర ఆరోపణలు చేశాడు. తనకు చెప్పకుండానే పాకిస్థాన్‌కు వెళ్లిందని అంజూ భర్త తెలిపారు. పాక్ వెళ్లాక రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ వస్తానని చెప్పినట్లు వెల్లడించారు. అయితే.. అంజూ పాక్ వెళ్లిన తర్వాత అక్కడ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ అంజూ కొత్త జంటకు భూములు వంటి అనేక కానుకలు సమర్పించారు. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా.. అంతర్జాతీయ కుట్ర కోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తునకు ఆదేశించారు. ఇదీ చదవండి: భర్త కోసం త్యాగం.. ఇలాంటి అమ్మాయి భార్యగా వస్తే ఎంత బాగుంటుందో! -
BRO Pre Release Event Photos: బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
BRO Pre Release Event : బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్.. సందడి చేసిన కేతిక, ప్రియా ప్రకాశ్, ఊర్వశి రౌతేలా (ఫొటోలు)
-
కేతిక శర్మ స్టన్నింగ్ లుక్స్‌కు ఫిదా అవుతున్న ఫ్యాన్స్ (ఫోటోలు)
-
రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ
డెహ్రాడూన్: సముద్ర మట్టానికి 11,300 అడుగుల ఎత్తున రేకుల పైకప్పుతో నిర్మించిన తాత్కాలిక గదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి పూట నిద్రించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) కార్మికుల కోసం వండిన కిచిడీని ఆరగించారు. శనివారం ఉత్తరాఖండ్ పర్యటనలో ఈ విశేషాలు చోటుచేసుకున్నాయి. మనా పట్టణ సమీపంలో బీఆర్ఓ డిటాచ్మెంట్ సెంటర్‌ను మోదీ సందర్శించిన సంగతి తెలిసిందే. ఓ కార్మికుడు సిద్ధం చేసిన కిచిడీ, మాండ్వీ కీ రోటీ, స్థానిక పచ్చడి, జాగోర్ కీ ఖీర్‌ను ఆహారంగా తీసుకున్నారని అధికారులు చెప్పారు. అంతేకాకుండా రేకుల పైకప్పుతో అప్పటికప్పుడు నిర్మించిన తాత్కాలిక నిర్మాణంలో సేదతీరారని వెల్లడించారు. ఈ గదిలో చిన్నపాటి ఎలక్ట్రిక్ హీటర్ మాత్రం ఉంది. రోడ్ల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కూలీలతో మోదీ సంభాషించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ బీఆర్ఓ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. శ్రమయేవ సర్వం సాధ్యం (శ్రమతో ఏదైనా సాధ్యమే) అని విజిటర్స్ బుక్‌లో రాశారు. -
ఆ విషయంలో కత్రినా, రష్మిక, పూజా హెగ్డేలే ఆదర్శం: అవికా గోర్
చిన్నారి పెళ్లికూతురు సీరియల్ అంటే చాలు అందరికి గుర్తుకొచ్చే ఏకైక పేరు అవికా గోర్. ఆ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ నార్త్ బ్యూటీ. చైల్డ్ అర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ని ప్రారంభించిన అవికా.. ప్రస్తుతం వెండితెరపై దూసుకెళ్తోంది. తెలుగులో 'ఉయ్యాల జంపాల' మూవీతో హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’. తొలి సినిమాతోనే తనదైన నటనతో అందరిని ఆకర్షించింది. తాజాగా ఈ బ్యూటీ నవీన్ చంద్రతో కలిసి ‘బ్రో’సినిమాలో నటిస్తోంది. మరాఠీలో విజయవంతమైన ‘హ్యాపీ జర్నీ’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో నవీన్ చంద్రకు చెల్లెలిగా నటించింది అవికా. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా అవికా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనపై వచ్చే రూమర్స్‌ని పెద్దగా పట్టించుకోనని చెప్పింది. తనకు ముగ్గురు, నలుగు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని, ఓ బేబీకి జన్మనిచ్చిందని కూడా పుకార్లు వచ్చాయని, వాటిని చూసి నవ్వుకుంటానే తప్ప.. పెద్దగా పట్టించుకోనని చెప్పింది. ఇక తన బ్యూటీ రహస్యం ఏంటని అడగ్గా.. వాటర్‌ని బాగా తాగాలని, 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని, వర్కౌట్ బాగా చేయాలని చెప్పింది. ఈ విషయంలో తనకు కత్రినాకైఫ్, పూజా హెగ్డే, రష్మికలే ఆదర్శమని చెప్పింది. ఇక తనకు టాలీవుడ్‌గా ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని, ఆయన డాన్స్ అంటే చాలా ఇష్టమని చెప్పింది. బన్నీతో పాటు నాగార్జున అంటే కూడా చాలా ఇష్టమని తెలిపిందే. వీరిద్దరి సినిమాల్లో నటించే అవకాశం వస్తే అస్సలు వదుకోనని చెప్పింది. ఇంకా అవికా ఏమేమి చెప్పిందో ఈ వీడియోలో చూడండి -
ప్రపంచంలోనే ఎత్తయిన రహదారి
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రోడ్డును సరిహద్దు రహదారుల సంస్థ(బీఆర్ఓ) నిర్మించింది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎగువన తూర్పు లద్దాఖ్‌లోని ఉమ్లింగ్లా పాస్ వద్ద 52 కిలోమీటర్ల పొడవునా వాహనాలు వెళ్లగలిగే (మోటరబుల్) ఈ రహదారిని నిర్మించినట్లు భారత రక్షణ శాఖ బుధవారం వెల్లడించింది. ఇప్పటిదాకా ఎత్తయిన మోటరబుల్ రోడ్డుగా బొలీవియాలోని రహదారి రికార్డుకెక్కింది. అక్కడ 18,953 అడుగుల ఎత్తులో రోడ్డు నిర్మించారు. ఉమ్లింగ్లా పాస్ వద్ద నిర్మించిన రహదారి తూర్పు లద్దాఖ్‌లో చుమార్ సెక్టార్‌లోని ముఖ్యమైన పట్టణాలను అనుసంధానిస్తోంది. లేహ్ నుంచి చిసుమ్లే, డెమ్‌చోక్‌కు చేరుకోవడం సులభతరం అయ్యిందని రక్షణ శాఖ తెలిపింది. ఈ రహదారితో లద్దాఖ్‌లో పర్యాటక రంగం వృద్ధి చెంది స్థానికుల ఆర్థిక స్థితిగతులు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎగువన శీతాకాలంలో మైనస్ 40 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతుంది. -
వ్యూహాత్మక రోడ్డుకోసం భారీ నిర్మాణ సామగ్రి
పితోర్‌గఢ్: భారత్–చైనా సరిహద్దుల్లోని హిమాలయ పర్వత సానువుల్లో కీలకమైన వ్యూహాత్మక రోడ్డు నిర్మాణం వేగవంతం చేసేందుకుగాను భారీ యంత్ర సామగ్రిని హెలీకాప్టర్ల ద్వారా తరలించినట్లు సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్వో) తెలిపింది. ఉత్తరాఖండ్ రాష్ట్రం పితోర్‌గఢ్ జిల్లా జోహార్ లోయలో మున్సియారీ–బుగ్డియార్–మిలాం మార్గంలో రోడ్డు నిర్మాణం పూర్తయితే చైనా సరిహద్దులకు అతి సమీపంలోకి చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. కానీ, భారీ కొండరాళ్లు అడ్డురావడంతో రహదారి నిర్మాణ పనులు నిలిచిపోయాయి. ఈ రాళ్లను అడ్డుతొలగించేందుకు అవసరమైన భారీ యంత్ర సామగ్రిని అక్కడికి తరలించేందుకు బీఆర్వో 2019లో చేసిన అనేక ప్రయత్నాలు విఫలమయ్యాయి. తాజాగా, యంత్ర సామగ్రితో బయలుదేరిన హెలీకాప్టర్లు ఆ మార్గానికి దగ్గర్లోని లాప్సిలో విజయవంతంగా దిగాయి. దీంతో పనులు వేగం పుంజుకుని ఈ రహదారి నిర్మాణం వచ్చే మూడేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉందని బీఆర్వో చీఫ్ ఇంజినీర్ బిమల్ గోస్వామి వెల్లడించారు. 2010లో ప్రారంభమైన ఈ రహదారి కోసం ప్రభుత్వం రూ.325 కోట్లు కేటాయించింది. దాదాపు 65 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారిలోని మొదటి, చివరి భాగాలు పూర్తి కాగా భారీ కొండరాళ్ల కారణంగా 22 కిలోమీటర్ల నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. -
2020 లక్ష్యం
న్యూఢిల్లీ : డోక్లాం వివాదం తరువాత భారత్.. సరిహద్దుల్లో యుద్ధ ప్రాతిపదికన రహదారి నిర్మాణాలను చేపడుతోంది. ప్రధానంగా చైనా సరిహద్దుకు దగ్గరగా మౌలిక వసతుల కల్పన, రహదారులకు భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆర్మీ వర్గాలు శుక్రవారం ప్రకటించాయి. ప్రధానంగా చైనా సరిహద్దుకు అనుకుని ఉన్న నిటీ, లిపులేహ్, తాంగ్లా, సాంగ్చోలా ప్రాంతాలను కలుపుతూ రహదారి నిర్మాణాన్ని మరింత వేగవంతం చేస్తున్నట్లు ఆర్మీ తెలిపింది. నాలుగు ప్రాంతాలను కలుపుతూ నిర్మించే ఈ రహదారిని 2020లోపు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. నార్త్ర్న్ ఆర్మీ కమాండ్ పరిధిలోకి వచ్చే ఈ రహదారులు.. సరిహద్దులో అత్యంత కీలకమవుతాయని ఆర్మీ చెబుతోంది. ఈ రహదారులను బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ నిర్మిస్తోంది. ఇదిలాఉండగా.. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా మిలటరీ కేంద్రాలను ఆధునీకరంచేందుకు ప్రణాళికలను ఆర్మీ అధికారులు రూపొదించారు. -
బీఆర్వోలతో సరిపెడుతున్న సర్కారు
- ఆర్థిక సంవత్సరం ముగియడంతో మురిగిపోయిన నిధులు - చెల్లించిన వడ్డీలు రీయింబర్స్ కాక ఎస్‌హెచ్‌జీ మహిళల గగ్గోలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలకు ప్రభుత్వం నిధులివ్వకుండా కేవలం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో)తో మభ్యపెడుతోంది. ‘వడ్డీ లేని రుణాలు’పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్వయంసహాయక సంఘాల మహిళలకు రూ.1,245.35 కోట్లు ఇస్తున్నట్లుగా గత నెల 13న ప్రభుత్వం బీఆర్వో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. మార్చి 31 లోగా నిధులు విడుదల చేయకపోవడంతో గత బడ్జెట్లో కేటాయించిన నిధులు మురిగిపోయాయి. ఫలితంగా బీఆర్వో చెల్లుబాటు కాని చిత్తు కాగితమైంది. వాస్తవానికి వడ్డీలేని రుణాల పథకం కింద 3.5 లక్షల స్వయంసహాయక సంఘాలకు చెందిన దాదాపు 24 లక్షల మంది మహిళలు పొందిన రుణాన్ని వడ్డీతో సహా చెల్లించారు. కానీ ఆ వడ్డీని రీయింబర్స్ చేయాల్సిన ప్రభుత్వం రెండేళ్లుగా పట్టించుకోవడం లేదు. దాదాపు రూ.1,110 కోట్ల వడ్డీ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోతుండడంతో ఎస్‌హెచ్ జీ మహిళలు బెంబేలెత్తుతున్నారు. సెర్ప్ ఉద్యోగుల వేతనాలకూ తిప్పలు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న 4,224 మంది ఉద్యోగుల వేతనాలకు రెండు నెలలుగా సర్కారు నిధులు విడుదల చేయలేదు. గతేడాది ఫిబ్రవరి వేతనాల బీఆర్వోను మార్చి 30న జారీ చేసింది. బీఆర్వోతో మార్చి31న ఆర్థిక శాఖ వద్దకు వెళ్లిన అధికారులు... క్లియరెన్స్ కోసం ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసిపోవడంతో సదరు బీఆర్వో ఎందుకూ పనికి రాకుండా పోయింది. -
20లోగా స్కాలర్షిప్ బకాయిలు చెల్లించాలి: కడియం
సాక్షి, హైదరాబాద్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ఈ నెల 20లోగా చెల్లించాలని వివిధ సంక్షేమ శాఖలను ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆదేశించారు. గురువారం సచివాలయంలో సీఎస్ రాజీవ్ శర్మ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సమక్షేమ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న ఫీజుల వివరాలను ఆయన తెలుసుకున్నారు. విద్యార్థులకు మెస్ ఫీజులు, స్కాలర్‌షిప్‌ల బకాయిలు త్వరగా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎంటీఎఫ్‌లను అక్టోబర్‌లోగా, ఆర్‌టీఎఫ్‌లను డిసెంబర్‌లోగా చెల్లించాలని ఆదేశించినట్లు సమాచారం. ఫీజు రీయింబర్స్మెంట్ (2014-15)కు రిజిస్టర్ చేసుకోని విద్యార్థులు, కాలేజీలు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువిచ్చినందున, 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి దరఖాస్తులను వారంలోగా ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇంకా పెద్ద మొత్తంలో బకాయిలు.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఇప్పటివరకు ఆర్టీఎఫ్ ఎంటీఎఫ్ కలుపుకొని మొత్తం రూ.820 కోట్ల బడ్జెట్ విడుదల చేయగా, అందులో ఇప్పటివరకు రూ.444 కోట్లు మంజూరుచేసినట్లు సమాచారం. ఆర్టీఎఫ్ కింద 1,884.26 కోట్లు అవసరం ఉండగా, రూ.499.81 కోట్లు బడ్జెట్ విడుదల ఉత్తర్వులిచ్చినట్లు తెలిసింది. ఎంటీఎఫ్ కింద రూ.567.76 కోట్లు అవసరం ఉండగా, రూ.313 కోట్లకు బీఆర్వోలు విడుదల చేసినట్లు సమాచారం. 2014-15కు సంబంధించి ఇప్పటివరకు 14,31,469 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 13,62,860 మంది విద్యార్థుల వెరిఫికేషన్ పూర్తయినట్లు తెలిసింది.