Avika Gor reveals her beauty secrets - Sakshi
Sakshi News home page

Avika Gor: ఆ హీరో అంటే చాలా ఇష్టం.. ఆయన స్టైల్స్‌, డాన్స్‌ అదుర్స్‌: అవికా గోర్‌

Nov 15 2021 6:47 PM | Updated on Nov 16 2021 1:04 PM

Avika Gor Opens Her Beauty Secrets - Sakshi

చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌ అంటే చాలు అందరికి గుర్తుకొచ్చే ఏకైక పేరు అవికా గోర్‌. ఆ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది ఈ నార్త్‌ బ్యూటీ.  చైల్డ్‌ అర్టిస్ట్‌గా బుల్లితెరపై కెరీర్‌ని ప్రారంభించిన అవికా.. ప్రస్తుతం వెండితెరపై దూసుకెళ్తోంది. తెలుగులో 'ఉయ్యాల జంపాల' మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది ఈ ‘చిన్నారి పెళ్లికూతురు’. తొలి సినిమాతోనే తనదైన నటనతో అందరిని ఆకర్షించింది.

తాజాగా ఈ బ్యూటీ నవీన్‌ చంద్రతో కలిసి ‘బ్రో’సినిమాలో నటిస్తోంది. మరాఠీలో విజయవంతమైన ‘హ్యాపీ జర్నీ’కు రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రంలో నవీన్‌ చంద్రకు చెల్లెలిగా నటించింది అవికా. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చింది.

ఈ సందర్భంగా అవికా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. తనపై వచ్చే రూమర్స్‌ని పెద్దగా పట్టించుకోనని చెప్పింది. తనకు ముగ్గురు, నలుగు బాయ్‌ఫ్రెండ్స్‌ ఉన్నారని, ఓ బేబీకి జన్మనిచ్చిందని కూడా పుకార్లు వచ్చాయని, వాటిని చూసి నవ్వుకుంటానే తప్ప.. పెద్దగా పట్టించుకోనని చెప్పింది. ఇక తన బ్యూటీ రహస్యం ఏంటని అడగ్గా.. వాటర్‌ని బాగా తాగాలని, 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోవాలని, వర్కౌట్‌ బాగా చేయాలని చెప్పింది. ఈ విషయంలో తనకు కత్రినాకైఫ్‌, పూజా హెగ్డే, రష్మికలే ఆదర్శమని చెప్పింది. ఇక తనకు టాలీవుడ్‌గా ఇష్టమైన హీరో అల్లు అర్జున్‌ అని, ఆయన డాన్స్‌ అంటే చాలా ఇష్టమని చెప్పింది. బన్నీతో పాటు నాగార్జున అంటే కూడా చాలా ఇష్టమని తెలిపిందే. వీరిద్దరి సినిమాల్లో నటించే అవకాశం వస్తే అస్సలు వదుకోనని చెప్పింది. ఇంకా అవికా ఏమేమి చెప్పిందో ఈ వీడియోలో చూడండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement