
ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు హాజరైన బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. సినిమాల్లో నాకు మామయ్య మెగాస్టార్ చిరంజీవినే ఆదర్శమని ఐకాన్ స్టార్ ప్రశంసలు కురిపించారు. ఆయన ప్రభావం తనపై ఎప్పటికీ ఉంటుందని బన్నీ అన్నారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కాగా.. గతేడాది పుష్ప-2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బన్నీ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో జతకట్టారు. జవాన్‌తో సూపర్ హిట్ సాధించిన అట్లీతో కలిసి బన్నీ పనిచేయనున్నారు. ఇటీవలే వీరి సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు. బన్నీ కెరీర్‌లో 22వ సినిమాగా రానున్న ఈ సినిమాపై ఐకాన్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా గురించి కూడా అల్లు అర్జున్ ఈవెంట్‌లో ప్రస్తావించారు. తప్పకుండా అభిమానులు ఆశించిన స్థాయిలో విజువల్ ప్రెజెంటేషన్ ఉంటుందని బన్నీ చెప్పుకొచ్చారు.
The MEGASTAR | It's A Brand 🔥😎
Finally AA About Our Boss 😎❤️🔥
Evaraina Naa Chiranjeevi Tharuvathey@KChiruTweets #Chiranjeevi@alluarjun #AlluArjun #MegastarChiranjeevi pic.twitter.com/YimIk1NXIA— We Love Chiranjeevi (@WeLoveMegastar) May 1, 2025