Waves
-
అమెరికాలో భారీ భూకంపం
కాలిఫోర్నియా:అమెరికాలోని కాలిఫోర్నియా తీర ప్రాంతంలో అమెరికా కాలమానం ప్రకారం గురువారం(డిసెంబర్5) ఉదయం 10.44 గంటలకు భారీ భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై ఏడుగా నమోదైంది. ఫెర్నడెల్ పట్టణంలో భూకంప కేంద్రం నమోదైంది. ఈ విషయాన్ని అమెరికా జియోగ్రఫికల్ సర్వే విభాగం వెల్లడించింది.తీర ప్రాంతంలో భారీ భూకంపం రావడంతో అమెరికా సునామీ కేంద్రం ముందస్తు చర్యగా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప ప్రభావంతో పెట్రోలియా, స్కాటియా, కాబ్ తదితర ప్రాంతాల్లో శక్తిమంతమైన ప్రకంపనలు నమోదయ్యాయి.Shocking Footage of California's 7.0 Mega Quake Captured on Cam!Mother Earth just showed off her raw power with a 7.0 shaker in Cali, and folks, it's all on camera! From swimming pools doing the wave to dogs sensing the rumble before humans, this earthquake video is the talk of… pic.twitter.com/j2hHVBj7JL— 𝕏VN (@xveritasnow) December 5, 2024ఉత్తర దిశలో వచ్చన భూ ప్రకంపనలు దక్షిణ ప్రాంతంలోని శాన్ఫ్రాన్సిస్కో దాకా వచ్చాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు.భూకంపం వల్ల భవనాల్లోని ప్రజలు కొంత సేపు అటుఇటు ఊగిపోయారు. భూకంపం ముగిసిన తర్వాత కూడా అనంతర ప్రకంపనలు వచ్చాయి. భూకంపం ధాటికి ప్రాణ,ఆస్తి నష్టాలు ఏమైనా సంభవించాయా అనేది తెలియాల్సి ఉంది. -
12 భాషలలో 'ఓటీటీ ప్లాట్'ఫామ్‌ను ప్రకటించిన ప్రసార భారతి
సాంకేతిక పరిజ్ఞానం నానాటికీ అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక కాలంలో కాలక్షేప మాధ్యమాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే పలు ప్రైవేట్ ఓటీటీ సంస్థలు పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పట్టికలో వేవ్స్ పేరుతో మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రసారం అవుతున్న ప్రసార భారతి ఈ ఓటీటీని భారత్ నెట్వర్క్ సంస్థతో కలిసి ప్రారంభించింది. ఈ ఓటీటీలో ఆంగ్లం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాత్, పంజాబీ, అస్సామీ తదితర 12 భాషలలో 10కి పైగా వివిధ రకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను ప్రసారం చేయనుందని వేవ్స్ ఓటీటీ సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. వీటితోపాటు ఆకాశవాణి ప్రసారాలు, 65కు పైగా టీవీ ఛానళ్ల ప్రసార కార్యక్రమాలను ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. మంకీ కింగ్ హీరో, టాకీ అవెంజర్స్, చోటా భీమ్, తెనాలి రామన్, అక్బర్ బీర్బల్ తదితర సీరియళ్లు వేవ్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతాయన్నారు. అలా అన్ని వర్గాలు ప్రేక్షకులను అలరించే ప్రసారాల్లో భాగంగా సంగీత, భక్తిరస కార్యక్రమాలు చోటు చేసుకుంటాయని నిర్వాహకులు తెలిపారు. -
చనిపోయే క్షణాల్లో మెదడు ఆలోచించగలదా? అలాంటివి..
చనిపోయే క్షణాల్లో మన మెదడులో జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ప్లే అవుతాయని తాజా అధ్యయనంలో తేలింది. ఆ సమయంలో కూడా మెదడు కలలు కనే తరంగాలను ఉత్పత్తి చేసిందన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టే ముందు చివరి క్షణాల్లో మనతో ఉండే ఆలోచనలను మరింత లోతుగా అర్థం చేసుకోనే ప్రయత్నంలో భాగంగా 87 ఏళ్ల వ్యక్తి మొదడు తరంగాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఆ వ్యక్తి మూర్చ వ్యాధితో బాధపడుతున్న రోగి అని, చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. కలలు కంటున్నప్పుడు లేదా ఏవైనా విషయాలను గుర్తు చేసుకుంటున్నప్పుడు మెదడులో ఎలాంటి తరంగాలు జనిస్తాయో అచ్చం అలాంటి తరంగాలే చనిపోవడానికి 30 సెకన్ల ముందు సదరు వ్యక్తి మెదడులో పరిశోధకులు గుర్తించారు. జీవితం చివరి క్షణాల్లో మరచిపోలేని అన్ని విషయాలను గుర్తు చేసుకోవడానికి ఈ తరంగాలు సంకేతం కావొచ్చని ఏజింగ్ న్యూరోసైన్స్ మ్యాగజైన్లో ప్రచురితమైన అధ్యయనంలో వివరించారు. మరణిస్తున్న మెదడులో మేం అనుకోకుండా ఇలాంటి తరంగాలను రికార్డు చేయగలిగామని పరిశోధనలో పాలుపంచుకున్న డాక్టర్ అజ్మన్ జెమ్మర్ చెప్పారు. వాస్తవానికి తాము ఇలా మెదడులోని తరంగాలను రికార్డు చేయాలని భావించలేదని, అనుకోకుండా ఇదంతా జరిగిందని అన్నారు. ఆఖరి నిమిషంలో మధుర క్షణాలు లేదా మనకిష్టమైన వారితో గడిపిన క్షణాలు గుర్తు చేసుకోవచ్చేమో అని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇలా గుర్తుచేసుకోవాలనే ఘటనలు ఒక్కొక్కరికి ఒక్కోలా ఉండొచ్చని అన్నారు. మెదడుకు రక్త సరఫరా నిలిచిపోవడానికి 30 సెకన్ల ముందు.. ఏకాగ్రత పెట్టడం, కలలు కనడం, ఏవైనా సంగతులను గుర్తు చేసుకోవడం లాంటి సమయంలో మెదడులో ఎలా అయితే తరంగాలు జనిస్తాయో అవే ఆ టైంలో కూడా ఉత్పత్తవ్వడం గుర్తించామని న్యూరో సర్జన్ జెమ్మర్ అన్నారు. తరంగాలు 30 సెకన్లపాటు కనిపించాయి. ఆ తర్వాత గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అంటే సదరు వ్యక్తి మరణించాడని అర్థం. చనిపోయే ముందు మన జీవితంలో మరుపురాని సంఘటనలు చివరిసారిగా మన మెదడులో ప్లే అవుతాయని ఈ కేసులో తేలిందని అన్నారు. ఈ పరిశోధన సరిగ్గా ప్రాణం ఎప్పుడు? ఎలా పోతుంది? గుండె ఎప్పుడు కొట్టుకోవడం ఆగిపోతుంది? లేదా మెదడు ఎప్పుడు పనిచేయడం ఆగిపోతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేందుకు ఈ అధ్యయనం దోహదపడుతుందని అన్నారు. (చదవండి: కన్నతల్లి ఆచూకీకై పరితపిస్తున్న స్వీడిష్ యువతి!) -
California: తీరాన్ని ముంచెత్తుతున్న రాకాసి అలలు
కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా తీరాన్ని సునామీ తరహాలో రాకాసి అలలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉరుములు, మెరుపులతో పసిఫిక్ మహా సముద్రం అలజడిగా మారడంతో భారీ అలలు వస్తున్నాయి. రాకాసి అలలు వేగంగా తీరాన్ని తాకుతుండడంతో తీరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో అక్కడి నుంచి తరలివెళ్లాల్సిందిగా తీర ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వెంచూరా ప్రాంతంలో ఒక రాకాసి అల తీరాన్ని బలంగా తాకడంతో అక్కడ ఉన్న వారంతా భయపడుతూ పరుగులు తీయాల్సి వచ్చింది. నీళ్లు వేగంగా వారిని వెంబడించాయి. కాలిఫోర్నియాలోని మారిన్ కౌంటీతో పాటు క్యాపిటోలా గ్రామంలో ప్రజలను తరలివెళ్లాల్సిందిగా హెచ్చరికలు జారీ చేశారు. రాకాసి అలలు ఒక్కొక్కటి 28 నుంచి 33 అడుగుల ఎత్తు వరకు వస్తాయని, ఒక్కో అల 40 అడుగుల ఎత్తు వరకు ఉండొచ్చని నేషనల్ వెదర్ సర్వీసు కేంద్రం తెలిపింది. లోతట్టు ప్రాంతాల్లో వరదలు రావొచ్చని హెచ్చరించింది.ఈ వారంతంలో అలలు మరింత భయానకంగా మారొచ్చని సాన్‌డియాగో ప్రాంతంలో అత్యంత భారీ అలలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సముద్రం ఒడ్డున ఉండే రాళ్లు, జెట్టీలు, పియర్స్ లాంటివాటిపై ఎవరూ ఉండరాదని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. Wait for it! Big surf and high tide El Niño flooding in Pierpont, Ventura, California #flooding #Ventura Video by Colin Hoag pic.twitter.com/BlvqIVNFC5 — Permaculture Practitioner (@eldoobie) December 29, 2023 ఇదీచదవండి..యూఎన్ బృందంపై ఇజ్రాయెల్ ఆర్మీ కాల్పులు -
కాకినాడ తీరంలో తిరగబడ్డ తెప్ప.. ఇద్దరు మత్స్యకారుల మృతి
సాక్షి, కాకినాడ: కాకినాడ తీరంలో తెప్ప తిరగబడటంతో ఇద్దరు మత్స్యకారులు సముద్రంలో గల్లంతై మృతిచెందారు. సోమవారం రాత్రి సూర్యారావుపేట నుంచి హోప్ ఐల్యాండ్ వరకు అయిదుగురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. వేటక ముగించుకొని తిరిగి వస్తుండగా కెరటాల ధాటికి తెప్ప తిరగడింది. ఈ ఘటనలో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. బాధితులు దుమ్మలపేటకు చెందిన మైలపల్లి కృపాదాస్, సూర్యరావుపేటకు చెందిన సత్తిరాజుగా గుర్తించారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. తెప్ప తిరగబడి సముద్రంలో పడటంతో ఇద్దరు మత్స్యకారులు మృతి చెందిన విషయాన్ని కాకినాడ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ దృష్టికి తీసుకెళ్లారు. మత్స్యకారుల మృతి విషయాన్ని తెలుసుకున్న సీఎం చలించిపోయి వెంటనే ఒక్కొక్కరికి తక్షణ సాయంగా రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.10 లక్షలు నష్టపరిహారం మంజూరు చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. -
మనిషి బ్రెయిన్ వేవ్స్‌తో..ఏకంగా "పాట"..
మనిషి తన టాలెంట్‌ని వెలకితీసి మరీ రకరకాలుగా సంగీతాన్ని సృష్టిస్తున్నాడు. తన గాత్రంతో లేదా తన అవయవాలతో రకరకాల విన్యాసాలు చేసి మరి సృష్టించడం చూశాం. మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా మ్యూజిక్‌ని సృష్టించడం గురించి విన్నారా!. ఔను తాజాగా సైంటిస్టులు ఆ కొత్త విషయాన్ని కనిపెట్టారు. కేవలం మనిషిలోని మెదడు తరంగాల ఆధారంగా సంగీతాన్ని పునర్నిర్మించారు. అందుకు అమెరికాలోని బర్కలీలో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకుల బృందం మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. 1979 నాటి పింక్ ఫ్లాయిడ్ మూవీలోని క్లాసిక్ పాట "అనదర్ బ్రిక్ ఇన్ ది వాల్" పాటను మూర్చ రోగులకు వినిపించారు. ఆ సమయంలో వారి మెదడులో ఉత్ఫన్నమయ్యే సంకేతాల ను పదాలుగా అర్థమయ్యేలా ప్రసంగంగా మార్చి పునర్నిర్మించడంలో విజయవంతమయ్యారు పరిశోధకులు. తొలిసారిగా శాస్త్రవేత్తలు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్‌ఫేస్‌లను(బీసీఐ) ఉపయోగించి సంగీతాన్ని పునః సృష్టించారు. 2009 నుంచి 2015 మధ్య న్యూయార్క్‌లోని అల్బానీ మెడికల్ సెంటర్లో చికిత్స పొందిన దాదాపు 29 మంది మూర్చ రోగులపై పరిశోధనలు జరిపారు. గాయకుడు వాల్టర్స్ పాడిన "అనదర్ బ్రిక్ ఇన్ ది వాల్" పాటను ఆ రోగుల ముందు ప్లే చేసేటప్పుడే వారి మెదడులకు ఎలక్ట్రోడ్లను అమర్చారు. అవి బ్రెయిన్లో సంగీతానికి స్పందించే సంకేతాలను ఎన్కోడింగ్ చేసింది. ఆ తర్వాత డేటాను అర్థ చేసుకునేందుకి రిగ్రెషన్ ఆధారిత నమునాలను ఉపయోగించారు. తద్వారా స్పెక్ట్రోగ్రామ్(పాట)ను పునః సృష్టిచగలిగారు. మెదడు సంకేతాలు ఎలా ఫ్రీక్వెన్సీలుగా మారతాయో తెలుపుతోంది ఈ ఆడియో ఫైల్. మెదడు సంగీత శ్రావ్యత, లయ, ఒత్తిడి, స్వరం, ధ్వని వంటి అంశాలన్నింటినికి మెదడు నుంచి వచ్చే తరంగాలను ఎలా అర్థవంతమైన పదాలుగా మలిచి పాటను పునర్నిర్మించొచ్చు అనేది ఈ అధ్యయనంలో వెల్లడైందన్నారు శాస్తవేత్తలు. ఇది భవిష్యత్తులో జరిగబోవు మెదడు ఇంప్లాంటేషన్ శస్త్రచికిత్సలకు సంగీతం ఉపకరిస్తుందని ఈ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయన్నారు శాస్త్రవేత్తలు. అయినా ఇప్పటికే వైద్యులు కొంతమంది రోగులకు బ్రెయిన్‌కి సంబంధించిన శస్త్ర చికిత్సల కోసం వారికి నచ్చిన మ్యూజిక్‌ని ప్లే చేసి మరి ఆపరేషన్లు చేసిన ఉందంతాలను చూశాం. (చదవండి: పూజారి కమ్ బైక్ రేసర్.. ఒకేసారి రెండు విభిన్న రంగాల్లో..) -
China: భవిష్యత్ యుద్ధాల్లో ఇక విధ్వంసమే..!
ఆయుధ శక్తి టెక్నాలజీలో చైనా సరికొత్త మైలురాయిని అందుకుంది. ఖండాంతరాలు దాటే ఆయుధ శక్తిని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. లేజర్ వ్యవస్థ అనంత దూరం వెళ్లే విధంగా కూలింగ్ సిస్టమ్‌ను తయారు చేసినట్లు సౌత్ చైనా మార్నింగ్ పోస్టు తెలిపింది. ఈ ఆవిష్కరణ భవిష్యత్ యుద్ధ తంత్రాన్ని పూర్తిగా మార్చివేస్తుందని నేషనల్ యూనివర్సిటీ డిఫెన్స్ టీం వెల్లడించింది. అత్యంత శక్తివంతమైన లేజర్లను ప్రయోగించేప్పుడు అత్యధిక వేడి ఉత్పత్తి అవుతుంది. ఇదే అతిపెద్ద అవరోధంగా మారేది. దీని కారణంగా ఆయుధాల్లో సాంకేతిక లోపాలు వస్తుండేవి. ఇలా కాకుండా ప్రస్తుతం లేజర్ ఎంత శక్తి ఉత్పత్తి చేసినా.. అందుకు అనుగుణంగా పనిచేసే కూలింగా వ్యవస్థను ఆవిష్కరించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల లేజర్లు ఎంత దూరమైనా తమ కాంతిశక్తి పంపించగలవు. అధిక శక్తి లేజర్ వ్యవస్థల పనితీరును మెరుగుపరచడంలో ఇది ఒక భారీ పురోగతి అని లేజర్ ఆయుధ శాస్త్రవేత్త యువాన్ షెంగ్ఫు తెలిపారు. లేజర్ వ్యవస్థల అభివృద్ధిలో కూలింగ్ సిస్ఠమ్ అతిపెద్ద సవాలుగా ఉండేదని అన్నారు. హై గ్రేడ్ లేజర్ సిస్టమ్‌లను అభివృద్ధి పరచడంలో అమెరికా కూడా ప్రయత్నాలను మొదలుపెట్టింది. నావీ అడ్వాన్సుడ్ కెమికల్ లేజర్, మిడిల్ ఇన్ఫారెడ్ అడ్వాన్స్డ్ కెమికల్ లేజర్, టాక్టికల్ హై ఎనర్జీ లేజర్, స్పేస్ బేస్ లేజర్లను అభివృద్ధి చేసింది. ఈ లేజర్లను క్షేత్రస్థాయిలో కూడా ప్రయోగించింది. ఈ లేజర్లు సూపర్ సోనిక్ మిసైల్లను కూడా ధ్వంసం చేయగలుగుతున్నాయి. కానీ ఇవన్నీ కొన్ని కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించగలుగుతున్నాయి. ప్రస్తుతం చైనా ఆవిష్కరణతో లేజర్లు ఎంత దూరమైనా తమ శక్తిని ప్రసరింపజేయగలవు. లేజర్ అనేది కృత్రిమంగా సృష్టించిన ఓ ప్రత్యేకమైన లైటింగ్ సిస్టమ్. ఒకే రకమైన తరంగదైర్ఘ్యాలతో సన్నగా అతి ఎక్కువ దూరం ప్రయాణించడం దీని ప్రత్యేకత అని నాసా తెలిపింది. ఇదీ చదవండి: Amphibious Caravan: ఈ క్యారవాన్‌కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్ -
బాలుడిని రక్షించిన ఫొటోగ్రాఫర్
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): బీచ్‌లో అలల తాకిడికి కొట్టుకుపోతున్న బాలుడిని బీచ్‌లో ఫొటోలు తీసుకునే ఫొటోగ్రాఫర్ రక్షించాడు. ఆదివారం ఓ కుటుంబం బాలుడితోపాటు ఆర్కే బీచ్‌కు వచ్చింది. కుటుంబ సభ్యులంతా ఫొటోలు తీసుకోవటంలో బిజీగా ఉండటంతో బాలుడు తీరంలో ఆడుకునేందుకు వెళ్లాడు. ఒక్కసారిగా పెద్దగా వచ్చిన కెరటం బాలుడిని లోపలకు లాక్కుపోయింది. అక్కడ ఉన్న బీచ్ ఫొటోగ్రాఫర్ భాస్కరరెడ్డి వెంటనే స్పందించి బాలుడిని రక్షించాడు. ఓ చేత్తో ఖరీదైన కెమెరాను మరో చేతితో బాలుడిని రక్షించాడు. బాలుడిని వాళ్లు కుటుంబ సభ్యులకు అప్పగించగా.. భాస్కరరెడ్డిని బాలుడు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు అభినందించారు. -
కొడుకును కాపాడబోయి...
న్యూయార్క్: భారతీయ అమెరికన్ ఒకరు తన కొడుకును కాపాడే క్రమంలో ప్రాణాలు కోల్పోయారు. కాలిఫోర్నియాలోని శాంటాక్రజ్ కౌంటీలో వారం క్రితం ఈ విషాదం చోటుచేసుకుంది. జొన్నలగడ్డ శ్రీనివాసమూర్తి కుటుంబంతో పాంథెర్ బీచ్‌కు వెళ్లారు. అలల్లో కొట్టుకుపోతున్న 12 ఏళ్ల కొడుకును కాపాడేందుకు నీళ్లలోకి దిగారు. మరొకరి సాయంతో కొడుకును ఒడ్డుకు తీసుకొచ్చారు. అంతలో బలమైన అల మూర్తిని లోపలికి లాక్కెళ్లింది. ఈత రాని ఆయన లోతైన నీళ్లలో మునిగిపోయారు. తీవ్రంగా గాయపడిన మూర్తిని సహాయక సిబ్బంది బయటికి తీసి హెలికాప్టర్లో హాస్పిటల్‌కు తరలించినా ప్రాణాలు దక్కలేదు. -
సునామీ భయం ప్రాణాలు తోడేసింది
మనీలా: సునామీ భయం ఫిలిప్పీన్స్ పర్వతప్రాంత ప్రజల ప్రాణాలు తీసింది. అక్కడ కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం భారీ అలలు వచ్చి పడటంతో సునామీ ముంచుకొస్తోందని మగుందనావో ప్రావిన్స్‌లోని కుసియాంగ్ గ్రామవాసులు భయపడ్డారు. గతంలో ఆ గ్రామాన్ని భయంకర సునామీ ముంచెత్తింది. నాటి నేటికీ వెంటాడుతున్నాయి. దాంతో వారంతా హుటాహుటిన కొండ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాల ధాటికి అక్కడ మట్టి, బురదచరియలు విరిగిపడి ఉన్నాయి. ఆ ఊబిలో చిక్కి దాదాపు 20 మంది సజీవ సమాధి అయ్యారు. అయితే, ఈసారి మృత్యువు మరో రూపంలో వారిని కబళించింది. వాయవ్య ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తున్న నాల్గే తుపాను కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ. ఈ తుపాను ప్రభావ వర్షాల కారణంగానే కుసియాంగ్ గ్రామంలో బురదచరియలు విరిగిపడ్డాయి. ‘ఏటా ఇక్కడి వారు సునామీ వస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఘటన జరిగినప్పుడు సైతం వార్నింగ్ బెల్స్ మోగడంతో చాలా మంది కొండ వద్ద ఉన్న చర్చి వద్దకు పరుగులు తీశారు. అదే వారి ఉసురు తీసింది’’ అని ఆ ప్రావిన్స్ మంత్రి చెప్పారు. -
అల ఖడ్గం.. మానవ తప్పిదాలే కారణం!
సముద్ర కెరటాల మధ్య ఓఎన్జీసీ క్యాపింగ్ వేసిన ఈ రెండు బావులు రెండున్నర దశాబ్దాల కిందట ఓడలరేవు తీరాన్ని ఆనుకుని (ఆన్‌షోర్) డ్రిల్లింగ్ చేసిన ప్రాంతంలో ఉన్నాయి. 2004 సునామీ నాటికి ఈ బావులు గట్టు మీద ఉన్నాయి. తరువాత ఇవి సముద్రంలో కలిసిపోయాయి. ఈ బావులను దాటుకుని సముద్రం 20 మీటర్లు ముందుకు వచ్చేసింది. ఏటా సముద్రం ఎంత ముందుకు వస్తోందని చెప్పేందుకు ఈ నిదర్శనం చాలు. కడలి ముట్టడిలో: ఓడలరేవు వద్ద చమురు బావుల పరిస్థితి ఈ ఫొటోలు అల్లవరం మండలం ఓడలరేవు ఓఎన్జీసీ టెర్మినల్ గోడ వద్ద తీసినవి. తొలి ఫొటో 2018లో తీసినది. టెర్మినల్ గోడను ఆనుకుని పచ్చని సరుగుడు తోటలున్నాయి. రెండో ఫొటో ఈ నెల 2న తీసినది. తరచూ సముద్రం చొచ్చుకు రావడం.. అలలు ఎగసిపడుతుండడంతో ఇక్కడి సరుగుడు తోటలు కొట్టుకుపోయాయి. సముద్రం ముందుకు వచ్చి కెరటాలు గోడను తాకుతున్నాయి. నాడు హరితం: 2018లో ఓఎన్జీసీ టెర్మినల్ గోడకు సమీపాన ఉన్న సరుగుడు తోటలు (ఫైల్) నేడు మాయం: కెరటాలు చొచ్చుకు రావడంతో సముద్రంలో కలిసిపోయిన సరుగుడు తోట సాక్షి అమలాపురం: కోనసీమ తీరంలో ‘అల’జడి కొనసాగుతూనే ఉంది. గడచిన వారం రోజులుగా సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. తీరం పొడవునా సముద్రం ముందుకు చొచ్చుకు వస్తోంది. దీంతో అంతర్వేది నుంచి బలుసుతిప్ప వరకూ జిల్లాలో పలుచోట్ల సముద్రతీరం కోతకు గురవుతోంది. తీరం కోతకు ప్రకృతి ప్రకోపం సగం కారణం కాగా.. నిలువెత్తు స్వార్థంతో మనిషి ప్రకృతికి చేస్తున్న హాని సగం కారణమవుతోంది. జిల్లాలో అంతర్వేది నుంచి భైరవపాలెం వరకూ సుమారు 95 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉంది. వారం రోజులుగా కెరటాలు చొచ్చుకు వస్తూండటంతో తీరంలోని ఇసుక భారీగా కోతకు గురవుతోంది. వందల ఎకరాల్లో సరుగుడు తోటలు సముద్రంలో కలిసిపోతున్నాయి. వీటిలో ప్రభుత్వంతో పాటు, రైతుల భూములు కూడా ఉన్నాయి. సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, మలికిపురం మండలం కేశనపల్లి, అల్లవరం మండలం ఓడలరేవు, కొమరగిరిపట్నం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, కాట్రేనికోన మండలం నీళ్లరేవు, చిర్రయానాం గ్రామాల్లో ఒడ్డు కోతకు గురవుతోంది. గత ఏడాది ఆగస్టులో ఒక రోజు అంతర్వేది వద్ద సముద్రం 45 మీటర్లు ముందుకు వస్తే, మరునాడు కిలోమీటరు వెనక్కి వెళ్లిపోయింది. గత దశాబ్ద కాలంలో ఆయా ప్రాంతాల్లో అర కిలోమీటరు నుంచి కిలో మీటరు మేర సముద్రం ముందుకు వచ్చిందని అంచనా. మన పాపాలే... శాపాలు అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే దేశంలోని నదులు ఎక్కువగా కలుస్తాయి. గంగ, బ్రహ్మపుత్ర, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి, వంశధార, నాగవళి వంటి నదులు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ఇవి చాలా కాలుష్యాన్ని మోసుకు వస్తున్నాయి. కాలుష్యం పెరగడంతో బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. గతంలో ఏడాదికి ఒకటో రెండో తుపాన్లు వస్తే.. ఇప్పుడు ఏడాదికి ఎనిమిది వరకూ వస్తున్నాయి. ఫలితంగా ఎగసిపడుతున్న అలలతో సముద్రం తీరాన్ని కోసివేస్తోంది. చెలియలి కట్ట దాటుతూ.. : అల్లవరం మండలం ఓడలరేవు వద్ద తీరంపై విరుచుకుపడుతున్న అలలు కోస్తా తీరానికి ప్రకృతి కల్పించిన రక్షణ కవచం ‘మడ అడవులు’. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో సుమారు 8 చదరపు కిలోమీటర్ల మేర మడ అడవులు విస్తరించి ఉన్నాయి. వాస్తవానికి అక్రమార్కుల వల్ల ఇవి ప్రస్తుతం 5 చదరపు కిలోమీటర్ల మేర మాత్రమే మిగిలాయని అంచనా. తీరంపై కెరటాలు విరుచుకు పడినా.. సముద్రం చొచ్చుకు వచ్చినా ఈ మడ అడవులు ‘స్ప్రింగ్‌ల’ మాదిరిగా అడ్డుకుని, వెనక్కు గెంటేస్తాయి. సునామీలను సైతం అడ్డుకుంటాయి. ఇంతటి ప్రాధాన్యం ఉన్న మడ అడవులను ఆక్వా సాగు, కలప సేకరణ కోసం అడ్డగోలుగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక దోపిడీ కూడా కోత పెరగడానికి కారణమవుతోంది. తీరంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలకు విరుద్ధంగా తీరంలో ఆక్వా చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగుతోంది. ఇవన్నీ సముద్ర ఉగ్రరూపానికి.. తీరం కోతకు కారణమవుతున్నాయి. వెల్లువెత్తుతూ.. విరుచుకుపడుతూ.. : అంతర్వేది వద్ద ముందుకు చొచ్చుకు వస్తున్న సముద్రం (ఫైల్) అంతర్వేది వద్ద సముద్రం ఒక్కసారిగా చొచ్చుకు వస్తుంది. తీరంలోని కట్టడాలను ముంచెత్తుతుంది. ఒక్కోసారి కిలోమీటర్ల మేర వెనుకకు పోతుంది. ముందుకు వచ్చిన సమయంలో ఇలా తీరాన్ని ఆనుకుని ఉన్న అతిథి గృహాలు, రైతులు వేసుకున్న పాకలను ముంచెత్తుతోంది. ఉప్పాడ తరహాలో కోత తప్పదు కోనసీమ తీరం భౌగోళికంగా బంగాళాఖాతంలోకి అర్ధవృత్తాకారంలో చొచ్చుకు వెళ్లినట్టుగా ఉంటుంది. దక్షిణాయన కాలం జూలై 16 నుంచి జవవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపు వస్తాయి. ఫలితంగా అలల్లో అపకేంద్ర బలాలు ఏర్పడి ఈ భూభాగాన్ని సముద్రంలో కలిపేస్తున్నాయి. కాకినాడ డీప్ వాటర్ పోర్టు కోసం మిలియన్ టన్నుల కొద్దీ ఇసుకను తవ్వేయడంతో ఉప్పాడ తీరం తీవ్రమైన కోతకు గురవుతోంది. కోనసీమ జిల్లాలో మడ అడవులను నిర్మూలిస్తుండటం, ఇసుక తవ్వకాలు, సీఆర్‌జెడ్‌లో ఆక్వా సాగు వలన కోనసీమ తీరం కూడా ఉప్పాడ తరహాలోనే కనుమరుగయ్యే పరిస్థితులు పొంచి ఉన్నాయి. – డాక్టర్ పెచ్చెట్టి కృష్ణకిషోర్, ఏయూ సాగర అధ్యయన పరిశోధకుడు, ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్, అమలాపురం -
సముద్రంలో కుప్పకూలిన హెలికాప్టర్
ఇంతవరకు మనం హెలకాప్టర్ క్రాష్‌కి సంబంధించిన పలు ఘటనలు గురించి విన్నాం. ఇటీవల యూకేలోని యూనిస్ తుపాను కారణంగా వీచిన ఈదురు గాలుల బీభత్సానికి విమానం ఎంత ప్రమాదకరంగా ల్యాండ్ అయ్యిందో చూశాం. అయితే ఇక్కడొక హెలికాప్టర్ ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తిందో గానీ అందరూ చూస్తుండగానే బీచ్‌లోని అలల పైకి దూసుకుపోయింది. అసలు విషయంలోకెళ్తే...అట్లాంటిక్ మహాసముద్రంలో ఒక హెలికాప్టర్ కూలిపోయింది. భారత కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 1.20 నిమిషాలకు ఫ్లోరిడాలోని రద్దీగా ఉండే మియామీ బీచ్‌లో ముగ్గురు ప్రయాణికులతో కూడిన రాబిన్సన్ R44 హెలికాప్టర్ కూలిపోయిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్‌తో హెలికాప్టర్ క్రాష్‌కి గల కారణాన్ని ఏజెన్సీ దర్యాప్తు చేస్తోంది. ఈ మేరకు మయామి బీచ్ పోలీసులు, అగ్నిమాపక విభాగాలు ఘటనాస్థలికి వచ్చి ఇద్దరు ప్రయాణికులను స్థానిక ఆసుపత్రికి తరలించినట్లు ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. This afternoon at 1:10 p.m., MBPD received a call of a helicopter crash in the ocean near 10 Street. Police and @MiamiBeachFire responded to the scene along with several partner agencies. Two occupants have been transported to Jackson Memorial Hospital in stable condition. 1/2 pic.twitter.com/heSIqnQtle — Miami Beach Police (@MiamiBeachPD) February 19, 2022 (చదవండి: హెలికాప్టర్ బొమ్మతో ఆడుకుంటుండగా హేళన.. సీరియస్‌గా తీసుకుని కొడుకు పెళ్లికి ఏకంగా హెలికాప్టర్!) -
అలలు చెక్కిన శిల్పాలు
పెదగంట్యాడ (గాజువాక): ఉవ్వెత్తున ఎగసి పడే అలలు.. అలుపు సొలుపు లేని కెరటాలు.. ఒక దాని వెంట మరొకటి వస్తూ.. అక్కడ ఉన్న బండరాళ్లను సుతారంగా తాకు తూ.. అద్భుతమైన శిల్పాలుగా చెక్కుతున్నాయి.. ఆ ప్రదేశాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నాయి.. చూపరులను ఆశ్చర్య చకితుల ను చేస్తున్నాయి.. శిలలపై శిల్పాలు చెక్కినారు అన్నాడో సినీ కవి.. కానీ ఇక్కడి రాళ్లను చూస్తే.. వాటి ఆకృతులను పరిశీలిస్తే అలలు చెక్కిన శిల్పాలు అనాల్సిందే.. అందమైన సాగర తీరం విశాఖ సొంతం.. ఆహ్లాదాన్ని పంచే ఆర్కే బీచ్, రుషికొండ బీచ్‌తో పాటు యారాడ బీచ్ కూడా విశాఖ ఖ్యాతిని ఇనుమడింపజేస్తాయనడంలో అతిశయోక్తి లేదు.. ఎంతో సువిశాలమైన విశాఖ సాగర తీరంలో.. పెద్దగా ప్రచారం లేని మరోప్రాంతం పెదగంట్యాడ మండలంలోని పాత గంగవరంలో ఉంది.. గంగవరం పోర్టు వెనుక గల సముద్ర తీరం ఆహ్లాదాన్ని పంచుతోంది.. పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తోంది.. ఇక్కడి కొండపై కొలువుదీరిన రాధామాధవ స్వామి ఆలయం వెనుక.. సముద్రం ఒడ్డున ఉన్న ఓ కొండ అందమైన గుహలతో విరాజిల్లుతోంది.. రాధామాధవ స్వామి ఆలయం నుంచి కిందకు దిగుతున్న కొద్దీ వివిధ రూపాల్లో ఉన్న రాళ్లు ఇట్టే ఆకర్షిస్తున్నాయి.. కొండను ఆనుకొని సముద్రం ఉండడంతో సాగరం నుంచి వచ్చే అలలు వాటిని తాకుతూ అందమైన శిల్పాలుగా మల్చడంతో ఈ ప్రాంతం ఇప్పుడు మండలంలో ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇటీవల కాలంలో పాతగంగవరం పేరు మారుమోగుతోందంటే దానికి కారణంగా సముద్రం ఒడ్డు న ఉన్న రాళ్లే.. ఇప్పుడు ఈ ప్రాంతం ఒక పర్యాటక కేంద్రంగా మారింది. నిత్యం ఎంతోమంది రాధా మాధవస్వామి ఆలయానికి వెళ్తే.. అక్కడి నుంచి కిందకు దిగుతూ అందంగా పేర్చినట్టు ఉండే రాళ్ల మధ్య ఆటలాడుతూ.. ఫొటోలు దిగుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ అక్కడే ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడుపుతున్నారు.. అక్కడే ఉన్న సొరంగాల్లోకి వెళ్తూ.. కేరింతలు కొడుతున్నారు.. ఇంత సుందరమైన సాగర తీరాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు యువత ఉర్రూతలూగుతున్నారు. ఇక్కడి వాతావరణంలో తేలియాడుతున్నారు. -
తెగబడే అల ఎదురైతే.. తలపడే తీరం ఈమె!
అల చూశారుగా.. ఎంత పెద్దగా ఉందో.. తెగబడుతున్నట్టు ఎలా పరుగెత్తుకొస్తోందో. చూస్తేనే వణుకుపుట్టేలా ఉన్న ఈ అలతో భయం లేకుండా తలపడుతోందో అమ్మాయి. అంత పెద్ద అలమాటున చిన్న రేణువులా కనబడుతోంది చూశారుగా. ఈమె పేరు మాయా గబెయిరా. బిగ్ వేవ్ సర్ఫర్. పోర్చుగల్‌లోని ప్రయా డో నోర్టే ప్రాంతంలో సర్ఫింగ్ చేస్తుండగా తీశారీ ఫొటో. NEW RECORD: Largest wave surfed - unlimited (female) - 73.5 foot (22.4 metres). Congratulations to Brazil's Maya Gabeira 🌊🏄🏻♀️ 🎥 @wsl / Pedro Miranda pic.twitter.com/I71oqKYadS — Guinness World Records (@GWR) September 10, 2020 -
మూడో వేవ్‌పై అప్రమత్తత అవసరం
నాగార్జునసాగర్/ మిర్యాలగూడ/ నకిరేకల్: కరోనా మూడో వేవ్‌పై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి రిజ్వీ ఆదేశించారు. ఆదివారం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నకిరేకల్‌లలో నిర్వహించిన సమావేశాల్లో వైద్య సిబ్బంది, అధికారులకు పలు సూచనలు చేశారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న గ్రామాల్లో టెస్టింగ్ క్యాంపులు ఏర్పాటుచేయాలని, కరోనా నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు. ప్రధానంగా వివాçహాలు, జాతరలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సీజనల్ వ్యాధులపైనా నజర్ ► ఆదివారం జిల్లాల్లో పర్యటించిన ఉన్నత స్థాయి బృందం పలు కీలక సూచనలు చేసింది. జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని పేర్కొంది. ముఖ్యంగా ఫీవర్ సర్వేకు సంబంధించి ముఖ్యమైన ఆదేశాలు ఇచ్చింది. ఆ అంశాలివీ.. ► నాలుగో విడత ఫీవర్ సర్వేను పటిష్టంగా నిర్వహించాలి. విద్య, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు, సిబ్బంది సమన్వయంతో కార్యక్రమాన్ని కొనసాగించాలి. ► కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఐసోలేషన్ కిట్లు అందించాలి. ►కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాల్లో వైద్య సేవలు అందించాలి. వారు అంతకుముందు మూడు నాలుగు రోజుల్లో ఎవరిని కలిశారో గుర్తించి వారికి కరోనా టెస్టులు చేయాలి. ►సరిహద్దు జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో కరోనా వైరస్ సోకకుండా గట్టి నిఘా పెంచాలి. మండల, జిల్లా స్థాయి బృందాలు ఆ దిశగా పటిష్ట చర్యలు తీసుకోవాలి. ►జిల్లాల్లో టెస్టుల సంఖ్య పెంచాలి. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి. ప్రతి పీహెచ్సీలో మందులను అందుబాటులో ఉంచాలి. ►రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున సీజనల్, అంటువ్యాధులు, దోమలు, ఇతర కీటకాల ద్వారా వ్యాపించే జబ్బులను నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. ►జిల్లా వైద్యాధికారులు, ఏరియా ఆస్పత్రుల పర్యవేక్షకులు, సర్వే అధికారులు రోజూ సమస్యలపై విశ్లేషించుకొని చర్యలు చేపట్టాలి. ► పీహెచ్‌సీల వారీగా వైద్యాధికారులు ఫీవర్ సర్వేలో తప్పక పాల్గొనాలి. ముఖ్యంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలి. క్షేత్రస్థాయి పర్యటనలు చేసి బాధితులకు మెరుగైన చికిత్స అందించాలి. ► వైద్యాధికారులు, డాక్టర్లు విధుల్లో తప్పక ఉండాలి. సెలవులు పెట్టకూడదు. -
Covid Third Wave: అప్రమత్తమైన వైద్యశాఖ, పిల్లల కోసం ప్రత్యేక పడకలు..
కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తోంది. మొదటి దశలో వైరస్ సాధారణంగా ప్రభావం చూపినా రెండో దశలో జిల్లా ప్రజలను వణికించింది. దీంతో ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. వైద్యం కోసం అప్పుసొప్పు చేసి చికిత్స పొందారు. ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. రెండో దశ ముగియడంతో మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. పిల్లలపై కోవిడ్ వైరస్ ప్రభావం చూపితే వైద్యం అందించేందుకు తగు చర్యలు చేపడుతున్నారు. జిల్లాకు తలమానికంగా ఉన్న రిమ్స్‌లో పిల్లల కోసం ప్రత్యేక పడకలు, ఆక్సిజన్ సిలెండర్లు, వెంటిలెటర్లు, వైద్య సిబ్బందిని నియమించేందుకు ప్రత్యేక చర్యలు ముమ్మరం చేశారు. సాక్షి, ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో 22 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లతో పాటు రిమ్స్ వైద్య కళాశాల ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, అర్బన్ హెల్త్ సెంటర్లలో పిల్లలకు సంబంధించిన వైద్య నిపుణులు లేరు. పిల్లలకు వైద్యం అందించేందుకు రిమ్స్ ఆస్పత్రే పెద్ద దిక్కుగా ఉంది. కోవిడ్ మహమ్మారి పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరిని వదలడం లేదు. రెండో దశ ఇంకా ముగియకముందే మూడో దశ చిన్నారులపై ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు సూచించారు. దీంతో పిల్లల తల్లిదండ్రుల్లో వణుకు పుడుతోంది. రిమ్స్ ఆస్పత్రిలో మొత్తం 768 పడకలు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం పెద్దల కోసం 416 ఐసీయూ, ఆక్సిజన్ బెడ్లను ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నారు. వీటికి తోడుగా పది ప్రైవేట్ ఆస్పత్రుల్లో 175 బెడ్లను ఏర్పాటు చేసి వైద్యసేవలు అందించారు. పిల్లలపై ప్రభావం చూపుతుందనే నేపథ్యంలో పిల్లల వార్డులో 60 ఆక్సిజన్ బెడ్లను రిమ్స్ అధికారులు సిద్ధం చేశారు. 10 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేయగా, మరో పది బెడ్లను అదనంగా ఏర్పాటు చేయనున్నారు. అన్ని రోగాలకు సంబంధించి రిమ్స్‌లో ప్రస్తుతం 280 మంది చికిత్స పొందుతున్నారు. అప్రమత్తమైన వైద్య శాఖ థర్డ్‌వేవ్‌లో చిన్నారులపై ప్రభావం చూపుతుందన్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ, రిమ్స్ అధికారులు ముందుచూపుతో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బెడ్లను ఏర్పాటు చేయగా, మందులను అందుబాటులో ఉంచేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు రిమ్స్ ఆస్పత్రిలో కరోనా బారిన పడి 4వేలకు పైగా చికిత్స పొందారు. 80కి పైగా మృత్యువాత పడ్డారు. మొదటి, రెండో విడతలో కలిపి మొత్తం 5శాతం మంది కూడా చిన్నారులు కోవిడ్ బారిన పడలేదని రిమ్స్ డైరెక్టర్ వివరించారు. దాదాపు 50 మంది వరకు కోవిడ్ బారిన పడి కోలుకున్నారని తెలిపారు. మరణాలు కూడా తక్కువగానే ఉంటాయని పేర్కొంటున్నారు. తగ్గుముఖం పట్టిన కోవిడ్ కోవిడ్ మహమ్మారి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. గతేడాది మార్చి నెలలో జిల్లాలో మొదటి కేసు నమోదు కాగా, జూలై, ఆగస్టు మాసాల్లో కేసులు పెరిగాయి. ఆ తర్వాత అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు పదుల సంఖ్యలో కేసులు నమోదు కాగా, ఈ ఏడాది మార్చిలో మరోసారి విజృంభించి ఏప్రిల్ నెలలో వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. గత నెలలో లాక్డౌన్ విధించడంతో మళ్లీ కేసులు తగ్గాయి. ప్రస్తుతం 5 నుంచి 10 లోపు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 3,70,648 పరీక్షలు చేయగా 16,252 మందికి పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. 3,54,193 మందికి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. ప్రస్తుతం జిల్లాలో 84 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు జిల్లాలో 16,084 మంది కోవిడ్‌ను జయించారు. దాదాపు 200 మందికి పైగా కోవిడ్ బారిన పడి మృత్యువాత పడ్డారు. కానీ జిల్లా వైద్యారోగ్య శాఖాధికారుల లెక్కల ప్రకారం 84 మంది మృతిచెందారు. భయపడాల్సిన అవసరం లేదు థర్డ్ వేవ్ నేపథ్యంలో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదు. పెద్దవారికి సోకినంతగా వైరస్ చిన్నారులకు సోకదు. వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. పిల్లలు కూడా మాస్కులు ధరించేలా చూడాలి. భౌతిక దూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. తల్లిదండ్రులు చిన్నారులను అనవసరంగా బయటకు తీసుకెళ్లొద్దు. చిరుతిండ్లకు దూరంగా ఉంచాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకునేలా చూడాలి. అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. చిన్నారుల్లో జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, విరేచనాలు, కడుపునొప్పి తదితర లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. – బానోత్ బలరాం, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్ చదవండి: ఔను, ఆ యువతులిద్దరూ ఒక్కటయ్యారు.! -
Yaas Cyclone: తుపానా ? సునామీనా ?
సునామీని మించిన బీభత్సం సృష్టిస్తోంది బంగళాఖాతం. యాస్ తుపాను దాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో ఎగిసిపడుతున్న అలలు, హోరున వినిపిస్తున శబ్ధాలు 2004 నాటి పరిస్థితులను గుర్తుకు తెస్తున్నాయి. పౌర్ణమి , చంద్ర గ్రహణం ఏర్పడిన రోజే యాస్ తుపాను తీరానికి చేరువగా రావడంతో రాకాసి అలలు తీరాన్ని ముంచెత్తాయి. సముద్రానికి, తీరానికి సమీపంలో ఉన్న గ్రామాల మధ్య సరిహద్దులు చెరిపేశాయి.తీరం దాటేప్పుడు ప్రళయాకారంగా మారిన సముద్రం వీడియో నెట్టింట్ హల్చల్ చేస్తోంది. తుపాను తీరం దాటుతున్నప్పుడు సముద్రం ఎంత ప్రమాదకరంగా మారిందో ఈ వీడియోలో చూడండి చదవండి: yaas cyclone ప్రచండ గాలులు yaas cyclone తుపాను బీభత్సం #YaasCyclone video. pic.twitter.com/Jcta8Bh3KN — Mr Logician #Maskup 🇮🇳 (@MrLogician_) May 26, 2021 -
'అల'జడి
కృష్ణాజిల్లా,కోడూరు : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపాన్‌గా మారి శుక్రవారం ఉదయం తీరాన్ని తాకే సమయంలో హంసలదీవిలోని సాగరతీరం, పాలకాయతిప్ప బీచ్ ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. సముద్రం సుమారు 150మీటర్ల మేర ముందుకు చొచ్చుకు వచ్చి, రోడ్డును తాకగా, సంగమం వద్ద విశ్రాంతి భవనం వరకు చేరాయి. వాయుగుండం ప్రభావం పూర్తిగా పోయే వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదంటూ పాలకాయతిప్ప మెరైన్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. భారీగా కోత.. అలల ఉధృతికి సాగరతీరం పొడవునా ఉన్న ఇసుకతిన్నెలు భారీస్థాయిలో కోతకు గురయ్యాయి. సముద్రం నుంచి సంగమం వరకు ఉన్న మూడు కిలోమీటర్ల మేర తీరం రహదారిలో గుంతలు ఏర్పడ్డాయి. సాగరతీరం వద్ద భయానక పరిస్థితులు చోటు చేసుకోవడంతో మెరైన్ పోలీసులు మధ్యాహ్నం వరకు పర్యాటకులను బీచ్‌లోకి అనుమతించలేదు. సాయంత్రం నుంచి నిబంధనలను సడలించి, స్నానాలకు అనుమతిచ్చారు. -
విమానాలు మునిగిపోవడానికి కారణమేంటి..?
-
బెర్ముడా ట్రయాంగిల్.. మిస్టరీ వీడింది
‘బెర్ముడా ట్రయాంగిల్’.. ఎంతో కాలం నుంచి శాస్త్రవేత్తలకు పెను సవాలుగా.. సామాన్యులకు అత్యంత ఆసక్తికరంగా.. అట్లాంటిక్ సముద్రంలో ప్రయాణించే ఓడలకు మృత్యు శాసనంగా మారింది. అసలు ఏముంది అక్కడ, ఇన్ని ఓడలు మునిగిపోవడానికి కారణమేంటి..? ఏలియన్లా.. లేక ఏదైనా బ్లాక్ మ్యాజికా.. ఇన్నాళ్లుగా సామన్యుల నుంచి శాస్త్రవేత్తల దాకా ఆలోచింపచేసిన ఈ మిస్టరీకి సమాధానం దొరికిందంటున్నారు సైంటిస్టులు. బెర్ముడా ట్రయాంగిల్ ఇంత ప్రమాదకరంగా మారడానికి కారణం ఏలియన్‌లో, కృష్ణబిలాలో కాదంట. మరి ఏంటి అనుకుంటున్నారా.. ‘అలలు’. అవును వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. కేవలం అలల వల్లనే ఈ ప్రాంతం ఇంత ప్రమాదకరంగా మారిందంటున్నారు శాస్త్రవేత్తలు. సముద్రం అన్నాక అలలు సహజం. మరి ఏ సముద్రంలోనూ ఇలాంటి విపరీతాలు జరగడం లేదు కదా అంటే.. ఇక్కడ పుట్టే అలలు మాములు అలలు కాదంట. భారీ ఎత్తులో అంటే దాదాపు 100 అడుగుల ఎత్తులో ఉద్భవించే అలలే ఇందుకు కారణమని తేల్చారు శాస్త్రవేత్తలు. వీటికి ‘రోగ్ వేవ్స్’గా నామకరణం చేశారు. ఎక్కడుంది బెర్ముడా ట్రయాంగిల్ అట్లాంటిక్ సముద్రంలో మయామి, సాన్ యువాన్, ప్యూర్టో రికో మధ్యన గల 7 లక్షల చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి బెర్ముడా ట్రయాంగిల్ అని పేరు. మృత్యువుకు మారు పేరుగా, ఓడలకు మరణశాసనంగా మారింది ఈ ప్రాంతం. అప్పటి వరకూ బాగానే ఉన్న వాతావరణ పరిస్థితులు బెర్ముడా వద్దకు చేరగానే ఒక్కసారిగా తారుమారవుతాయి. అసలు ఏం జరుగుతుందో అర్ధమయ్యేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. గత వందేళ్లలో దాదాపు 75 విమానాలు, లెక్కలేనన్ని నౌకలు అక్కడ గల్లంతయ్యాయి. ఈ రాకాసి ప్రాంతం ఇప్పటి వరకూ దాదాపు వెయ్యిమందిని తనలో కలుపున్నట్లు సమాచారం. ఏలియన్లా.. కృష్ణబిలాలా..? ఓడలు, విమానాలు గల్లంతువుతున్నాయి. ఆపైన వాటి ఆచూకీ కూడా లభ్యం కావడం లేదు. అసలు దీనంతటికి కారణం ఏంటి..? అనే అంశంపై ఎన్నో కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. కొందరు సముద్రంలో ఉండే పిరమిడ్లు కారణమంటే.. మరి కొందరు ఏలియన్లు కారణమని వాదించారు. అయితే ఇవేవీ నిజం కాదని అసలు నిజం వేరే ఉందని ప్రముఖ ఆంగ్ల టెలివిజన్ చానెల్5 వెల్లడించింది. ఈ రహస్యాన్ని చేధించే క్రమంలో పలువురు శాస్త్రవేత్తలతో మాట్లాడింది. ఎన్నో ప్రయోగాలు చేసి, డాక్యుమెంటరీని రూపొందించింది. చివరకు అసలు కారణాన్ని కనిపెట్టింది. అది ఏంటంటే.. దాదాపు 100 అడుగుల వరకు ఎగిసే ‘రాకాసి అలలే’ ఇన్ని ఘోరాలకు కారణమని తేల్చింది. వీటికి ‘రోగ్ వేవ్స్’ అని పేరుపెట్టింది. రోగ్ వేవ్స్... ‘రోగ్ వేవ్స్’ పేరుకు తగ్గట్టుగానే ఇవి రోగ్ పనులే చేస్తాయంటున్నారు శాస్త్రవేత్తలు. మాములుగా సముద్రాల్లో వచ్చే అలల కన్నా చాలా ఎత్తుగా.. ఒకదానివెంట మరొకటి అతివేగంగా విరుచుకుపడతాయంట. అయితే ఈ అలలు ఇంత తీవ్ర స్థాయిలో విరుచుకుపడడానికి కారణం.. సముద్రంలో ఒకేసారి వేరువేరు దిశల నుంచి చుట్టుముట్టే తుఫాన్లట. దాంతో అంతసేపు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ప్రళయ రూపం ధరిస్తుందట. ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు వాహానాలను నడపడం అంత తేలిక కాదంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణం మారడంతోనే ఆందోళన ప్రారంభమవుతుంది. దాని నుంచి బయటపడే లోపే అపార నష్టం జరుగుతుంది. ఈ భిన్నమైన పరిస్థితుల వల్లే బెర్ముడా ట్రయాంగిల్లో ఇన్ని ఓడలు మునిగాయంటున్నారు శాస్త్రవేత్తలు. -
ముప్పు ముంగిట ఓడలరేవు
అల్లవరం (అమలాపురం): తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు వద్ద ఎగసిపడుతున్న అలల తాకిడికి సముద్రం 50 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. బుధవారం ప్రారంభమైన అలలు క్రమేపీ పెరుగుతూ సోమవారం నాటికి ఉగ్రరూపం దాల్చాయి. తీరానికి ఆనుకుని ఉన్న సరుగుడు తోటలు, ఆక్వా చెరువులు, పల్లపు ప్రాంతాలు సముద్రం నీటితో నిండిపోయాయి. సముద్ర రిసార్ట్స్ నుంచి నదీ సంగమం వరకూ తీరం కోతకు గురైంది. మునుపెన్నడూ లేని విధంగా కెరటాలు ఎగసిపడుతున్నాయి. పెద్ద పెద్ద వృక్షాలు నెలకొరుగుతున్నాయి. కెరటాల ఉధృతికి సరుగుడు తోటల్లో ఇసుక మేటలు వేసింది. అలల ఎగసిపడుతుండటంతో ఓడలరేవుకు పర్యాటకులు రావడానికే భయపడుతున్నారు. తీరం వెంబడి సముద్రంలో చమురు నిక్షేపాల ఆన్వేషణకు చమురు సంస్థలు చేస్తున్న కార్యకలాపాలతో తీర గ్రామాలకు ముప్పు పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. ఓఎన్జీసీ కార్యకలాపాలతో సముద్రగర్భం విధ్వంసం ఓడలరేవు సముద్ర లోతు జలాల్లో లభ్యమవుతున్న చమురును పైపుల ద్వారా తరలించి సొమ్ము చేసుకుంటున్న ఓఎన్జీసీ ఆయా ప్రాంతాలను నిర్లక్ష్యం చేస్తోందనేది నగ్నసత్యం. చమురు అన్వేషణకు సిస్మిక్ సర్వేలో విధ్వంసకర బాంబులను భూమిలోకి పంపి బాంబింగ్ చేయడం వల్ల భూమి కుంగిపోతోంది. రెండు దశాబ్దాలకు ముందు, ఇప్పటి ఓడలరేవుకి ఎంతో తేడా కనిపిస్తోంది. 20 ఏళ్లలో సముద్రం 150 మీటర్ల పొడవున ముందుకు చొచ్చుకొచ్చిందంటే ఏ స్థాయిలో తీరం కోతకు గురవుతుందో అర్థమవుతోంది. తీరంలో ఓఎన్జీసీ బావులే అందుకు సాక్ష్యం. 2004లో సునామీ రాక ముందు ఓఎన్జీసీ బావులకు కనీసం 100 మీటర్ల దూరంలో సముద్రం ఉండేది. 2004లో సునామీ రాకతో తీరంలో చమురు అన్వేషణకు ఓఎన్జీసీ తవ్విన బావులు వరకూ కోతకు గురయింది. తుపాన్లప్పుడు మినహా సుమారు 18 ఏళ్లపాటు ఓఎన్జీసీ బావులను దాటి రాని సముద్రం ఇప్పుడు బీభత్సం సృష్టిస్తోంది. ఆ హామీ ఏమైంది? సునామీ వచ్చాక ఓఎన్జీసీ టెర్మినల్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రహించిన ఓఎన్జీసీ అధికారులు కొమరగిరిపట్నం ఏడ్ల రేవు నుంచి ఓడలరేవు నదీ సంగమం వరకూ రూ.100 కోట్లతో రక్షణ గోడ నిర్మాణానికి చర్యలు చేపడతామని 2011లో ప్రతిపాదనలు చేశారు. తర్వాత వశిష్ట టెర్మినల్‌లో విస్తరణలో భాగంగా 2014 ఆగస్టులో మంత్రి రాజప్ప, ఎమ్మెల్యే ఆనందరావు, అప్పటి ఆర్డీవో సమక్షంలో గ్రామస్థులతో చేసుకున్న ఒప్పంద సమయంలో రక్షణ గోడ తెరపైకొచ్చింది. టెర్మినల్ రక్షణకు నాలుగు కిలోమీటర్ల పొడవునా తీరం వెంబడి గోడ నిర్మాణానికి ఓఎన్జీసీ హామీ ఇచ్చింది గానీ అది ఇంతవరక కార్యరూపం దాల్చలేదు. తీరంలో దట్టంగా ఉండే సరుగుడు తోటలను దాటుకుని రైతుల భూములకు హద్దులుగా ఉండే తాటిచెట్లను సైతం సముద్రం నేడు తనలో కలుపుకొంటోంది. ఐదు రోజులుగా సాగుతున్న కెరటాల ఉధృతికి మెరక ప్రాంతాల్లో 50 మీటర్లు, పల్లపు ప్రాంతాల్లో 70 మీటర్ల పొడవునా సముద్రం ముందుకొచ్చింది. అలల ఉధృతి ఇలాగే కొనసాగితే తీరానికి 100 మీటర్ల దూరంలో ఉన్న ఓఎన్జీసీ టెర్మినల్‌కు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. రక్షణగోడ ఎప్పుడు నిర్మిస్తారో తెలియదు తీరంలో 150 మీటర్ల పొడవునా సరుగుడు తోటలుండేవి. అటవీ భూములు అన్యాక్రాంతమవడంతో సరుగుడు తోటలను నరికేశారు. రక్షణ గోడను ఎప్పడు నిర్మిస్తారో కూడా తెలియడం లేదు. సముద్రం ఉధృతి చూశాకైనా ప్రభుత్వం స్పందించాలి. – సోమాని వెంకటరమణ, ఓడలరేవు, అల్లవరం మండలం -
ఏడాదిన్నర తర్వాత.. అదే బీచ్‌లో.. అవే దుస్తులతో
సుకబూమి(ఇండోనేసియా) : ఇండోనేసియాలో ఓ నమ్మలేని ఘటన చోటుచేసుకుంది. 2017 జనవరిలో నైనింగ్ సున్సారి అనే మహిళ సుకబూమిలోని సిటేపస్ బీచ్‌లో అలల దాటికి కొట్టుకుపోయారు. ఫ్యామిలీతో కలసి హాలిడేకు వెళ్లిన నైనింగ్ బీచ్‌లో సరదాగా గడుపుతున్న సమయంలో పెద్ద అల రావడంతో ప్రవాహంలో చిక్కుకున్నారు. అలల తీవ్రత అధికంగా ఉండటంతో కుటుంబసభ్యులు ఆమెను రక్షించలేని స్థితిలో ఉండిపోయారు. అధికారులు కూడా ఆమె కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అయిన ఫలితం లేకపోయింది. కనీసం ఆమె మృతదేహం అయిన దొరకాలని బంధువులు కోరుకున్నారు. కానీ అది కూడా సాధ్యపడలేదు.. దీంతో అధికారులు ఆమె మరణించినట్టు ప్రకటించారు. తీరా చూస్తే.. 18 నెలల తర్వాత శనివారం రోజున ఆమె అదే బీచ్‌లోని ఇసుకలో అపస్మారక స్థితిలో కనిపించారు.ఆమె అలల దాటికి గురయినప్పుడు ఏ దుస్తులైతే ధరించిందో.. అవే దుస్తుల్లో ఆమె కనిపించినట్టు ఇండోనేసియా మీడియా పేర్కొంది. ప్రస్తుతం ఆమెను వైద్య పరీక్షలు నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య కదలికలు స్థిరంగానే ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయిలో కొలుకోవాల్సి ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై నైనింగ్ కుటుంబసభ్యులు మాట్లాడుతూ.. నైనింగ్ అలల దాటికి కొట్టుకుపోయినప్పటికీ.. ఆమె ఆచూకీ లభించకపోవడంతో బతికి ఉంటుందనే ఆశ తమలో సజీవంగానే ఉందని తెలిపారు. నెల రోజుల నుంచి నైనింగ్ తండ్రికి ఆమెకు సంబంధించి కలలు రాసాగాయని వారు పేర్కొన్నారు. దీంతో తాము బీచ్‌లో నైనింగ్ కోసం వెతకడం ప్రారంభించామని.. చివరికి తమ అన్వేషణ ఫలించదన్నారు. -
23.8 మీటర్ల ఎత్తున రాకాసి అల
-
చరిత్రలోనే అతిపెద్ద రాకాసి అల..!!
వెల్లింగ్టన్, న్యూజిలాండ్ : దక్షిణార్థగోళంలో భారీ ఎత్తైన రాకాసి అలను న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. దాదాపు 23.8 మీటర్ల ఎత్తున రాకాసి అల నౌకపై విరుచుకుపడినట్లు వెల్లడించారు. అల ఎత్తు ఎనిమిది అంతస్తుల మేడకు సమానంగా ఉంటుందని పేర్కొన్నారు. న్యూజిలాండ్‌కు దక్షిణాన 700 కిలోమీటర్ల దూరంలో గల క్యాంప్‌బెల్ ద్వీప సమీపాన ఈ ఘటన జరిగినట్లు వివరించారు. 2012లో కూడా ఇదే ప్రాంతంలో 22.03 మీటర్ల ఎత్తుగల భారీ అల సంభవించింది. వీటికంటే అతి భారీ అలలు సంభవిస్తాయని భావిస్తున్నట్లు వివరించారు. కాగా, ఇప్పటివరకూ భూమి మీద అతిపెద్ద రాకాసి అల అలస్కా తీరంలోని లితుయా అగాథం వద్ద సంభవించింది. 1958లో సంభవించిన ఓ భారీ భూకంపం కారణంగా ఇక్కడ అలలు 30.5 మీటర్ల ఎత్తున ఎగసిపడ్డాయి. -
కడలి అలజడి.. అసలేం జరిగింది?
సాక్షి, విశాఖపట్నం: కడలిలో అకస్మాత్తుగా అలజడి రేగింది. ఒకపక్క పెనుగాలులతో కూడిన వర్షం, మరోపక్క ఎగసిపడుతున్న సముద్ర కెరటాలను చూసి జనం ఆందోళన చెందారు. మళ్లీ సునామీ వచ్చేస్తోందంటూ పుకార్లు షికార్లు చేశాయి. కానీ ఇదంతా ప్రచారమేనని వాతావరణ శాఖ స్పష్టం చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే..? సోమవారం అర్థరాత్రి నుంచి సముద్రంలో కెరటాల ఉధృతి మొదలైంది. మంగళవారం ఉదయానికి వాటి తీవ్రత మరింత పెరిగింది. హిందూ మహాసముద్రానికి (భూమధ్యరేఖకు) బాగా దిగువన మడగాస్కర్ ప్రాంతంలో గాలుల వేగం ఎక్కువగా ఉంటోంది. ఫలితంగా అలలు సుమారు 2 మీటర్లకు పైగా ఎగసిపడుతున్నాయి. ఈ ప్రభావం మహారాష్ట్ర, కేరళ, కర్నాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలో ఉత్తర కోస్తాలో దీని ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో పాటు అలలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. తీరప్రాంతంలో గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో నైరుతి దిశ నుంచి బలంగా గాలులు వీస్తున్నాయి. అప్రమత్తం చేసిన ఇన్కాయిస్.. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్కాయిస్) ఆయా రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీరంలో లంగరేసిన బోట్లు దెబ్బతినకుండా దూరంగా ఉండేలా చూసుకోవాలని మత్స్యకారులకు సూచించింది. బుధవారం అర్ధరాత్రి వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది. సునామీ ప్రచారం నమ్మొద్దు.. ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడం, అలలు ఎగసి పడడంతో మీడియా, సోషల్ మీడియాలో సునామీ రాబోతోందంటూ మంగళవారం విపరీతమైన ప్రచారం జరిగింది. కొన్ని టీవీ చానళ్లలోనూ ఈ అంశాన్నే ప్రముఖంగా ప్రసారం చేశాయి. అయితే సముద్రంలో భూకంపాలు సంభవించినప్పుడు మాత్రమే సునామీ వస్తుంది తప్ప కెరటాలు ఎగసిపడినా, అకాల వర్షాలు కురిసినా సునామీ రాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి ‘సాక్షి’కి చెప్పారు.