జపాన్ తీర ప్రాంత గ్రామాలకు అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలని సూచించారు. గురువారం చిలీలో 8.3 తీవ్రతతో భూకంపం సంభవించి 11 మంది మృత్యువాత పడ్డారు. చిలీ కూడా సునామీ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో 'సునామీ' పై క్విక్ రివ్యూ...
సునామీ అంటే?
Tsunami అనే పదం Tsu(Harbour), nami(waves) అనే జపాన్ పదాల కలయిక. తీరపు అల(రాకాసి అల) అని దీనర్థం. సముద్రపు అడుగు భాగంలో భూకంపాలు సంభవించడం, అగ్ని పర్వతాల ఉద్భేదనం, భూతాపాల వల్ల ఏర్పడిన అధిక శక్తి కలిగిన సముద్ర కెరటాలు తీరాన్ని చేరడాన్ని 'సునామీ'అంటారు. ఈ కెరటాలకు తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అధిక మొత్తంలో నీరు తీరాన్ని తాకి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.
సునామీ ఎప్పుడు వస్తుంది?
భూకంప తీవ్రత 6.5 కంటే అధికంగా ఉంటే సునామీ వచ్చే ప్రమాదం ఉంది. సాధారణంగా సముద్ర గర్భంలో సునామీలు రావడానికి చాలా కారణాలున్నాయి. అయితే ఎక్కువగా భూకంపాల వల్ల 75 శాతం, అగ్ని పర్వతాల వల్ల 5 శాతం, సముద్రంలో భూతాపం వల్ల 8-10 శాతం, ఇతర కారణాల వల్ల 10 శాతం, వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల వల్ల 2 శాతం సునామీలు సంభవిస్తున్నాయి. సునామీ వేగం నీటి లోతును బట్టి ఉంటుంది. 4 వేల మీటర్ల లోతులో అయితే దీని వేగం గంటకు 500- 700 కి.మీ ఉంటుంది. అదే 10 మీటర్ల నీటి లోతులో దీని వేగం గంటకు 36 కి.మీ.కు తగ్గుతుంది.
సునామీ నీటి కెరటమా?
సాధారణంగా సునామీలు అలలలాగే కన్పిస్తాయి. కానీ సునామీకి సాధారణ కెరటాలకు తేడా ఉంది. కెరటాలు గాలి వల్ల లేచి 5 నుంచి 20 సెకన్లలో పూర్తవుతాయి. అయితే సునామీ అలా కాదు. 5 నిమిషాల నుంచి దాదాపు గంటన్నర వరకు ఉంటుంది. సముద్రంలో కనిపించే గాలి కెరటాలు అంత లోతైనవి కావు. ఈ కెరటాలు తక్కువ వేగాన్ని కలిగి ఉంటాయి. సునామీలు అధిక వేగం కలిగి ఉండి తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. ఉదాహరణకు 2004, 2011లో వచ్చిన సునామీల వల్ల భవనాలు, పడవలు, భారీ నిర్మాణాలు కూడా ధ్వంసమయ్యాయి.
సునామీ ఎందుకు వస్తుంది..?
Published Sat, Sep 19 2015 12:08 PM | Last Updated on Sun, Sep 3 2017 9:38 AM
Advertisement
Advertisement