Sea
-
సముద్రంలో ఈతకు వెళ్లి ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతు
ముత్తుకూరు(నెల్లూరు జిల్లా)/కోనేరుసెంటర్ (మచిలీపట్నం) : స్నేహితులతో కలిసి సముద్రంలో ఈతకెళ్లి ఓ ఎంబీబీఎస్ విద్యార్థి గల్లంతయ్యాడు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం నేలటూరు పట్టపుపాళెం ఏపీజెన్కో బ్రేక్ వాటర్స్ వద్ద ఈ ఘటన జరిగింది. కృష్ణపట్నం సీఐ రవినాయక్, ఎస్ఐ శ్రీనివాసరెడ్డి తెలిపిన వివరాలు.. నెల్లూరులో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 9 మంది విద్యార్థులు ఆదివారం నేలటూరు పట్టపుపాళెం సముద్ర తీరానికి విహారానికి వెళ్లారు. ఆటపాటలతో సెల్ఫీలు తీసుకుంటూ సరదాగా ఈత కొట్టేందుకు సముద్రంలోకి వెళ్లారు. వీరిలో విశాఖపటా్ననికి చెందిన షణ్ముగనాయుడు(19) ఈతకొట్టే క్రమంలో ప్రమాదవశాత్తు లోతు ఉన్న చోట సముద్రపు నీటిలో గల్లంతయ్యాడు. గమనించిన స్నేహితులు పెద్దగా కేకలు వేశారు. స్థానికులతో కలిసి రక్షించేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విశాఖలో ఉన్న విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. 30 మందికి పైగా మత్స్యకారులు పడవల ద్వారా షణ్ముగనాయుడి కోసం గాలించారు. మరో ఐదుగురు గజ ఈతగాళ్లను కూడా రప్పించారు. సాయంత్రం చీకటిపడే వరకూ అన్వేషించినా ఫలితం లేకపోయింది. మత్స్యకారుడు గల్లంతు కృష్ణా జిల్లా మచిలీపట్నం బండలం మంగినపూడి బీచ్‌లో ఓ మత్స్యకారుడు గల్లంతయ్యాడు. బందరు మండలం సత్రవపాలేనికి చెందిన చింతా ఏడుకొండలు శనివారం సాయంత్రం తోటి మత్స్యకారులతో కలిసి వేటకు వెళ్లాడు. సముద్రంలో చేపలు పడుతుండగా రాత్రి 12 గంటల సమయంలో వలలాగే క్రమంలో సముద్రంలో పడిపోయాడు.బోటులో ఉన్న మిగిలిన మత్స్యకారులు ఏడుకొండలును కాపాడేందుకు సముద్రంలోకి దూకి గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వేట ఆపి ఆదివారం ఉదయాన్నే ఒడ్డుకు చేరుకున్నారు. జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు, పోలీసులకు తెలపడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
సముద్రంలో 150 కి.మీ ఈత
కాకినాడ రూరల్ : సముద్రంలో 150 కిలోమీటర్లు ఈది ఆసియాలోనే అరుదైన ఘనతను సాధించారు స్విమ్మర్ శ్యామల గోలి. గత నెల 28న విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద సముద్రంలో ఈత ప్రారంభించిన ఆమె ఏడో రోజైన శుక్రవారం కాకినాడ తీరం చేరుకున్నారు. మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో కాకినాడ బీచ్‌కు చేరుకున్న శ్యామలకు కాకినాడ నగర కమిషనర్ భావన, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తదితరులు స్వాగతం పలికారు. ఐదు పదుల వయసులో అలవోకగా సముద్రాలు ఈదుతూ సాహస యాత్రతో అబ్బుర పరుస్తున్న శ్యామలను చూసేందుకు, ఆమెకు స్వాగతం పలికేందుకు విద్యార్థులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ సంస్థల ప్రతినిధులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా శ్యామల మీడియాతో మాట్లాడుతూ.. తాను చిన్నప్పట్నుంచీ స్విమ్మర్‌ను కాదని చెప్పారు. జీరో లెవెల్ నుంచి 150 కిలోమీటర్ల మేర స్విమ్ చేసేలా తనను కోచ్ జాన్ సిద్ధిక్ తీర్చిదిద్దారన్నారు. 2021లో శ్రీలంక – ఇండియా మధ్య రామ్‌సేతును ఈదానని, తాజాగా ఫిబ్రవరిలో లక్షద్వీప్‌లో స్విమ్ చేశానని గుర్తు చేశారు. 28వ తేదీ ఉదయం 11 గంటలకు సముద్రంలో దిగి.. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఒడ్డుకు వచ్చానని.. ఈ లెక్కన ఆరు రోజుల్లోనే లక్ష్యం చేరానన్నారు. స్విమ్మింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని, మహిళల్లో గైనిక్ సమస్యలు తగ్గుతాయని చెప్పారు. -
తీరం వెంబడి కృత్రిమ దిబ్బలు
సాక్షి, అమరావతి: మత్స్య సంపద వృద్ధి, జీవవైవిధ్యం పెంపు లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి కృత్రిమ దిబ్బలు (ఆర్టిఫిషియల్ రీఫ్స్) ఏర్పాటు చేయబోతున్నారు. సముద్రపు లోతుల్లో సంచరించే చేపలను ఆకర్షించి, తీరం సమీపానికి రప్పించేలా త్రిభుజాకారం, పూల ఆకారం, భారీ పైపుల ఆకృతుల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. ఇవి మత్స్య సంపదను ఆకర్షిస్తాయి. తద్వారా మత్స్యకారులకు తీరానికి సమీపంలోనే భారీగా మత్స్య సంపద లభిస్తుంది. ఒకప్పుడు సముద్రంలో తీరానికి అతి సమీపంలోనే లభించే మత్స్యసంపద పర్యావరణ కాలుష్యం, తీరంలో పెరుగుతున్న చమురు కార్యకలాపాలతో దూరమైపోయింది. కనుచూపు మేరలో మత్స్యసంపద దొరకని పరిస్థితి ఏర్పడింది. జీవవైవిధ్యం కూడా దెబ్బతింటోంది. ఈ సమస్యకు కృత్రిమ దిబ్బల ఏర్పాటు చక్కటి పరిష్కారమని కేంద్ర సముద్ర మత్స్య పరిశోధన సంస్థ (సీఎంఎఫ్ఆర్ఐ) గుర్తించింది. ఇప్పటికే మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేసి, సత్ఫలితాలను సాధించింది. ఇప్పుడు సువిశాల ఏపీ తీరంలో వీటిని ఏర్పాటు చేస్తోంది. 184 ప్రాంతాల్లో 500 యూనిట్లు ఏపీ తీరంలో 533 మత్స్యకార గ్రామాలున్నాయి. చేపల వేటపై ఆధారపడి 8 లక్షల మందికి పైగా జీవిస్తున్నారు. తీరానికి సమీపంలో ఆశించిన స్థాయిలో మత్స్య సంపద లేకపోవడంతో రాష్ట్ర మత్స్యకారులు గుజరాత్, అండమాన్ నికోబార్ దీవుల వైపు వెళ్తున్నారు. వీరి జీవనోపాధిని మెరుగుపరచడంతోపాటు జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి కృత్రిమ దిబ్బలు ఏర్పాటు చేయాలని సీఎంఎఫ్ఆర్ఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. 2022–23లోనే రీఫ్లకు అనువైన ప్రాంతాలను గుర్తించింది. 300 మత్స్యకార గ్రామాల పరిధిలో 184 ప్రాంతాల్లో 500 రీఫ్ యూనిట్ల ఏర్పాటుకు వైఎస్ జగన్ ప్రభుత్వం 2023 జూలైలో కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్వై) కింద వీటికి అనుమతి ఇచ్చిoది. తొలుత 210 యూనిట్లు ఏర్పాటు చేస్తారు. ఒక్కో యూనిట్లో 500 దిబ్బలు ఉంటాయి. ఒక్కో యూనిట్ రూ.35 లక్షల అంచనాతో తొలి దశలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 22 చోట్ల ఏర్పాటు చేస్తారు. దశల వారీగా మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు కేరళలో ్చఈ ప్రాజెక్టును విజయవంతంగా అమలు చేసిన కేఎస్సీఏడీసీ లిమిటెడ్‌తో అవగాహన ఒప్పందం చేసుకోనుంది.కృత్రిమ దిబ్బలతో ప్రయోజనాలుఎన్నో.. సాధారణంగా సముద్రంలో మునిగిపోయిన బోట్లు, వస్తువులు చేపలను ఆకర్షిస్తాయి. పూర్వం చేపలను ఆకర్షించడానికి భారీ కలప దుంగలు వాడేవారు. ప్రస్తుతం రంధ్రాలు, పగుళ్లతో రూపొందించిన కాంక్రీట్ నిర్మాణాలను ఉపయోగిస్తున్నారు. ఏళ్ల తరబడి చెక్కు చెదరకుండా ఉంటూ లార్వా, పాచి, ఇతర జీవులు, చేపలను ఆకర్షించడంతో పాటు వాటి సంతానోత్పత్తికి ఇవి దోహదపడతాయి. వీటి ద్వారా లోతు జలాల్లో లభించే కింగ్ ఫిష్, ట్యూనా, రెడ్స్నాపర్స్, పీతలు, రొయ్యలు, స్క్వడ్స్, కొన్ని సార్లు ఆక్టోపస్ వంటివి కూడా 2.5 కిలోమీటర్ల దూరంలోనే వలకు చిక్కుతాయి. ఖర్చు కూడా 70 నుంచి 80 శాతం తగ్గుతుంది.2023లోనే ప్రతిపాదించాం మత్స్య సంపద సుస్థిరత, తీర ప్రాంత మత్స్యకారుల జీవనోపాధి పెంపు లక్ష్యంతో 2022–23లోనే కృత్రిమ దిబ్బల ఏర్పాటుకు బ్లూ ప్రింట్ తయారుచేశాం. పీఎంఎంఎస్వై ద్వారా ఏపీలో 184 ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు 2023లోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటి ఏర్పాటు కోసం ఇప్పటికే ఆ ప్రాంతాల్లో మత్స్యకారులకు అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే వీటి ఏర్పాటు ప్రారంభిస్తాం. – డాక్టర్ జియో కె.కుజాకుదన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, సీఎంఎఫ్ఆర్ఐ, విశాఖపట్నం -
నదీజలం.. వృథా అధికం
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు గోదావరి, కృష్ణా, వంశధార నదుల నుంచి 5,021.58 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. రాష్ట్రంలో ఆయా నదీ పరీవాహక ప్రాంతాల(బేసిన్)లలో వినియోగించుకున్న, రిజర్వాయర్లలో నిల్వ ఉన్న నీటి కంటే నాలుగు రెట్లు అధికంగా కడలిలో కలిశాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిశాయి. కృష్ణా, గోదావరి, వంశధార బేసిన్ల పరిధిలోని రాష్ట్రాల్లోను విస్తారంగా వర్షాలు కురిశాయి. దాంతో ఈ నదులు వరద నీటితో పోటెత్తాయి. నీటి సంవత్సరం జూన్ 1న ప్రారంభమై... మే 31వ తేదీన ముగుస్తుంది. కేవలం ఆరు నెలల్లోనే 5,021.58 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలవడం విశేషం.నదుల వారీగా నీటి వినియోగం.. సముద్రంలోకి వదిలిన జలాల వివరాలు...ప్రస్తుత నీటి సంవత్సరంలో జూన్ ఒకటో తేదీ నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకు గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,266.53 టీఎంసీల ప్రవాహం రాగా... గోదావరి డెల్టాలో పంటల సాగుకు 136.28 టీఎంసీలు వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 4,130.25 టీఎంసీలను సముద్రంలోకి వదిలేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే గరిష్టంగా గోదావరి వరద జలాలను ఒడిసి పట్టి బంజరు భూములకు మళ్లించి సస్యశ్యామలం చేయడానికి అవకాశం ఉంటుంది.కృష్ణా నది నుంచి ప్రకాశం బ్యారేజీకి 1,006.36 టీఎంసీల ప్రవాహం వచ్చింది. కృష్ణా డెల్టాలో పంటల సాగుకు 136.64 టీఎంసీలు వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 869.72 టీఎంసీలను బ్యారేజీ నుంచి సముద్రంలోకి వదిలేశారు. ఉమ్మడి రాష్ట్రానికి 75 శాతం లభ్యత ఆధారంగా 811 టీఎంసీల కృష్ణా జలాలను కేడబ్ల్యూడీటీ–1 (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్–) కేటాయించింది. ఈ ఏడాది జూన్ ఒకటి నుంచి ఇప్పటి వరకు అంతకంటే ఎక్కువ నీరు సముద్రంలో కలవడం గమనార్హం.వంశధార నుంచి గొట్టా బ్యారేజీలోకి 41.49 టీఎంసీలు వచ్చాయి. ఆయకట్టు పంటల సాగుకు 19.88 టీఎంసీలను వినియోగించుకున్నారు. మిగులుగా ఉన్న 21.61 టీఎంసీలను సముద్రంలోకి వదిలేశారు. గొట్టా బ్యారేజీ వద్ద 115 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన వంశధార ట్రిబ్యునల్... ఆంధ్రప్రదేశ్, ఒడిశాలకు చెరి సగం కేటాయించింది. వంశధార ట్రిబ్యునల్ అంచనా వేసిన దాని కంటే 73.51 టీఎంసీలు తక్కువగా వచ్చాయి. వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టు కింద వంశధార జలాలను పూర్తి స్థాయిలో ఒడిసి పట్టాలంటే నేరడి బ్యారేజ్ లేదా వంశధార ఎత్తిపోతల పథకం పూర్తి చేయాల్సి ఉంది. -
తీరం తరుక్కుపోతోంది..
సాక్షి, అమలాపురం/ అల్లవరం: కోస్తా తీరం భారీగా కోతకు గురవుతోంది. వాయుగుండాలు, అల్పపీడనాలు, తుపాన్లు ఏర్పడిన సమయంలో కోత అధికంగా ఉంటోంది. తాజాగా ఫెంగల్ తుపాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో తీరం పొడవునా కోత అధికమైంది. మన రాష్ట్రంలో 972 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 140 కిలోమీటర్ల మేర ఉంది.కోనసీమ జిల్లాలో అంతర్వేది సముద్ర సంగమ ప్రాంతం నుంచి ఐ.పోలవరం మండలం బైరుపాలెం వరకూ 90 కిలోమీటర్లు కాగా, తాళ్లరేవు మండలం గాడిమొగ నుంచి తుని మండలం వరకూ సుమారు 50 కిలోమీటర్ల మేర తీరం ఉంది. పచ్చని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి నదీ పాయల కోత వల్ల ఇప్పటికే వందలాది ఎకరాల కొబ్బరి తోటలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి. ఇదే సమయంలో తీరం పొడవునా సముద్ర కోత కూడా అధికంగా ఉంటోంది. కోనసీమ జిల్లాలో ఓడలరేవు, కేశనపల్లి, అంతర్వేది, కొమరగిరిపట్నంలో ప్రభావం ఎక్కువగా ఉంది. భూములు, సరుగుడు తోటలు సముద్రంలో కలసిపోతున్నాయి. గడచిన పదేళ్లలో కోత తీవ్రత రెట్టింపు అయ్యింది. ఓడలరేవులో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ తీరాన్ని ఆనుకుని ఏర్పాటు చేసిన ఓఎన్జీసీ చమురు బావులు ఇప్పుడు సముద్రంలో ఉన్నాయి.ఎనిమిదేళ్ల కిందట ఓడలరేవు బీచ్‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకం వరకూ సముద్రం చొచ్చుకువచ్చి భూమి కోతకు గురవుతోంది. అంతర్వేది బీచ్‌లో అలల ఉధృతి స్థానికంగా ఉన్న రిసార్ట్స్ వరకూ వస్తోంది. స్థానికంగా ఉన్న పల్లిపాలెం గ్రామంలోకి సైతం అలలు అప్పుడప్పుడు వచ్చి ఇళ్లను ముంచెత్తుతున్నాయి. కేశవదాసుపాలెం తూర్పులంక వంటి గ్రామాల్లోకి ఉప్పు నీరు ముంచెత్తడంతో కొబ్బరి తోటలు నాశనం అవుతున్నాయి. కాలుష్యాన్ని కలిపేస్తూ.. అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతం అత్యంత ప్రమాదకరం. దేశంలో చాలా వరకూ నదులన్నీ దీనిలోనే కలుస్తాయి. ఉత్తరాదిన గంగా, బ్రహ్మపుత్ర, మధ్యభాగంలో మహానది, దిగువన గోదావరి, కృష్ణ, పెన్నా, కావేరి, వంశధార, నాగావళి వంటి నదుల సంగమం బంగాళాఖాతంలోనే. దేశంలో చాలా వరకూ కాలుష్యాన్ని మోసుకువస్తున్న ఈ నదులు దానిని బంగాళాఖాతంలో కలిపేస్తున్నాయి. ఫలితంగా బంగాళాఖాతం త్వరగా వేడెక్కుతోంది. దీనివల్ల తరచూ తుపాన్లు ఏర్పడుతున్నాయి. అందుకే అరేబియా సముద్రం కన్నా బంగాళాఖాతంలోనే తుపాన్లు, వాయుగుండాలు, అల్పపీడనాలు అధికం. వీటి ప్రభావంతో అలలు ఎగసిపడి కోత ఉధృతి పెరుగుతోంది. తమిళనాడు నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ భూభాగ నైసర్గిక స్వరూపం సముద్రంలోకి చొచ్చుకు వచ్చినట్టు ఉంటుంది. దక్షిణాయన కాలంలో అంటే జూలై 16 నుంచి జనవరి 13 వరకూ బంగాళాఖాతంలో అలలన్నీ దక్షిణం నుంచి ఉత్తరం వైపునకు వస్తాయి. ఫలితంగా అప కేంద్ర బలాలతో తీరం పొడవునా కోత తీవ్రత పెరిగిందని శాస్త్రవేత్తలు నిర్ధారిస్తున్నారు. అలలు ఎగసిపడి.. కాకినాడ జిల్లా ఉప్పాడ, కోనపాపపేట తీరం కోతకు తరుక్కుపోతుంది. కాకినాడ తీరం సమీపంలో హోప్ ఐలెండ్ ఉండడం, డీప్ వాటర్ పోర్టు కోసం సముద్రంలో ఇసుక తవ్వకాల ప్రభావం సమీపంలోని “ఉప్పాడ’ గ్రామంపై పడుతోంది. సముద్రంలో తవ్వకాలు చేసిన ప్రాంతాల్లో తిరిగి ఇసుక పూడుకునేటప్పుడు ఏర్పడుతున్న ఒత్తిడితో ఉప్పాడ వద్ద అలలు ఎగసిపడుతున్నాయి. హోప్ ఐలెండ్ వద్ద తీరం పెరుగుతుండగా, ఉప్పాడ వద్ద కోత పెరుగుతోంది. కోత ఇలా కొనసాగితే కొద్ది సంవత్సరాల్లో ఉప్పాడ గ్రామం కనుమరుగు కానుంది. భూములను కలిపేసుకుని.. ప్రకృతి ప్రకోపానికి ఓడలరేవు నదీ సంగమం నుంచి రిసార్ట్స్ వరకూ వందలాది ఎకరాల జిరాయితీ, డీపట్టా భూములు సముద్రంలో కలసిపోయాయి. 25 ఏళ్లుగా సముద్రం 500 మీటర్లకు పైగా ముందుకు వచ్చింది. ఇటీవల నెల రోజుల్లో రెండు పర్యాయాలుగా సముద్రం ముందుకు వచ్చి 936, 937 సర్వే నంబర్ గల జిరాయితీ, డీ పట్టా భూములు సుమారు 17 ఎకరాలను సముద్రం తనలో కలిపేసుకుంది. దీంతో ఓడలరేవులో సీతారామస్వామి దేవస్థానానికి చెందిన 11 ఎకరాలు, పెమ్మాడి సూర్యనారాయణ, ఇల్లింగి కాసులమ్మ, తదితరులకు చెందిన మరో ఆరు ఎకరాలు భూమి కోతకు గురైంది. –పాల వర్మ, ఓడలరేవు, అల్లవరం మండలం ప్రమాదంలో ఓఎన్జీసీ టెర్మినల్ కోనసీమ జిల్లా పరిధిలోని ఓడలరేవు ఓఎన్జీసీ వశిష్ట టెర్మినల్‌లోకి సముద్రం నీరు చొచ్చుకు రావడంతో ఉద్యోగులు, స్థానికులు ఆందోళన చెందారు. సముద్ర అలల తాకిడికి ఈ టెరి్మనల్ ప్రధాన గోడ వరకూ భూమి కోతకు గురైంది. ఇప్పుడున్న టెరి్మనల్ గోడకు సముద్ర తీరం సుమారు కిలోమీటరు దూరంలో ఉండేది. నెమ్మది నెమ్మదిగా సముద్రం చొచ్చుకొస్తూ గోడ వరకు వచ్చింది. కోత నివారణకు జియోట్యూబ్ పద్ధతిలో రాళ్లు వేసినా కోత ఆగడం లేదు. తాజాగా తుపాన్లతో అలల ఉధృతికి కోత తీవ్రత మరింత పెరిగింది. భారీ రక్షణ గోడ ఏర్పాటు చేస్తే తప్ప ఇక్కడ కోత ఆగే పరిస్థితి లేదు. మానవ తప్పిదాలే కారణం ప్రకృతిలో జరుగుతున్న మార్పుల కన్నా మానవ తప్పిదాల కారణంగానే సముద్రాలు గతి తప్పుతున్నాయి. సముద్ర ఉషో్టగ్రతలు పెరిగి తుపాన్లకు దారి తీస్తున్నాయి. తీరానికి రక్షణగా ఉండే మడ అడవులు, సరుగుడు తోటలను ఇష్టానుసారంగా నరికేస్తున్నారు. సముద్ర తీరంలో ఇసుక తవ్వకాలు, ఆక్వా చెరువులతో కూడా తీరం కోతకు గురవుతోంది. ఇటీవల కాలంలో చంద్రుడు, భూమికి మధ్య ఆకర్షణ శక్తి పెరుగుతోందని, ఫలితంగా అలల ఉధృతి పెరిగిందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. -
సినీ ఫక్కీలో హత్య.. ఫిషింగ్ హార్బర్లో మృతదేహం
సాక్షి,విశాఖపట్నం: సినీ తరహాలో జరిగిన దారుణ హత్య విశాఖపట్నంలో ఆలస్యంగా వెలుగుచూసింది. కాలికి బరువైన బండరాయి కట్టేసిన ఓ వ్యక్తిని సముద్రంలో పడేసి హత్య చేశారు. ఫిషింగ్ హార్బర్ జెట్టి నంబర్ 10 వద్ద మృతదేహం సముద్రంలో తేలుతూ కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని మంగళవారం(నవంబర్ 26) బయటికి తీశారు.మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉంది.ఈ హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీ చదవండి: అనారోగ్యంతో భార్యాభర్తల ఆత్మహత్య -
పాతాళంలోనూ ఇస్రో పరిశోధనలు
సూళ్లూరుపేట: ఆకాశం వైపు గురిపెట్టి అంతరిక్ష ప్రయోగాలు చేయడానికే పరిమితమైన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అడుగు ముందుకేసి పాతాళంలోకి వెళ్లి పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. సముద్రయాన్ పేరిట ఈ ప్రయోగాలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టినా.. ఇంతటి సాంకేతికతను ఉపయోగించలేదు. 1980లోనే సముద్రాలపై అధ్యయనం చేయడానికి స్కూబా డైవింగ్ పద్ధతిలో అధ్యయనానికే పరిమితమయ్యారు.దేశం చుట్టూ 7 వేల కిలోమీటర్ల సముద్ర తీరం ఉండటంతో దీనిపై అధ్యయనం చేయాలనే ఆలోచన పురుడు పోసుకుంది. 2019 నుంచి ఈ ప్రయత్నాలు సాగిస్తున్నా.. ఇప్పటికి దీనికి ఓ రూపం వచ్చింది. ప్రస్తుతం సముద్ర గర్భంలో సుమారు 6వేల మీటర్ల లోతుకెళ్లి అధ్యయనం చేసేందుకు సముద్రయాన్ పేరుతో మత్స్య–6000 అనే సబ్మెర్సిబుల్ నౌకను పంపేందుకు ఇస్రో సిద్ధమవుతోంది.సబ్మెర్సిబుల్ వాహనంలో.. ప్రపంచంలో మానవ రహిత జలాంతర్గాములు ఉన్నాయి. భారత్ విషయానికి వస్తే మానవ సహిత జలాంతర్గామిని తయారు చేసిన చరిత్ర ఉంది. సముద్రయాన్ ప్రాజెక్ట్‌లో భాగంగా సముద్ర గర్భంలోకి వెళ్లి పరిశోధనలు చేసేందుకు వీలుగా సబ్మెర్సిబుల్ వాహనాన్ని ఎన్ఐఓటీ డిజైన్ చేసి అభివృద్ధి చేస్తోంది. ఈ వాహనానికి మత్స్య–6000 అని నామకరణం చేశారు. ఈ వాహనం 6 కిలోమీటర్ల లోతుకు వెళ్లినపుడు నీటి పీడనం 600 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.ఈ పీడనాన్ని తగ్గించేందుకు టైటానియం అలాయ్‌ను ఉపయోగించి నీటి పీడనాన్ని తట్టుకునేలా సబ్మెర్సిబుల్ వాహనాన్ని డిజైన్ చేస్తున్నారు. 2022 డిసెంబర్లో ‘సాగర్ నిధి’ నౌకను హిందూ మహాసముద్రంలోకి పంపిన విషయం తెలిసిందే. ఓషన్ మినరల్ ఎక్స్‌ప్లోరల్ పేరిట సముద్ర గర్భంలో 5,271 మీటర్ల లోతులో అన్వేషణ సాగించారు. అక్కడున్న మాంగనీస్‌పై పరిశోధించారు. ఇప్పుడు మత్స్య–6000 ప్రయోగంలో ముగ్గురు వ్యక్తులు వాహనంలో వెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో ఒకరు సబ్మెర్సిబుల్ వాహనం ఆపరేటర్ కాగా.. మిగిలిన ఇద్దరు పరిశోధకులు ఉంటారు. గంటల తరబడి సముద్రంలోనే.. ఈ వాహనం సముద్ర గర్భంలో 108 గంటలు ఉండేలా వాహనాన్ని డిజైన్ చేస్తున్నారు. సముద్ర గర్భంలోకి పోవడానికి 3 గంటలు, మళ్లీ పైకి రావడానికి 3 గంటలు సమయం తీసుకుంటుందని ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ సంస్థకు ఇస్రో కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించింది. ఇస్రో చేసిన చంద్రయాన్–3 ప్రయోగం, భవిష్యత్‌లో చేయబోతున్న గగన్‌యాన్ మిషన్ ప్రయోగ సాంకేతిక పరిజ్ఞానాన్ని కొంతమేరకు వినియోగించుకుంటున్నారు. మత్స్య–6000 జలాంతర్గామిని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో తయారు చేశారు.ఈ వాహనం సంక్లిష్టమైన సమయంలో 96 గంటలు నీటిలోనే ఉండేందుకు వీలుగా 67 ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. సముద్రంలో అత్యంత లోతైన ప్రాంతంలో 108 గంటలపాటు సముద్రంలోనే ఉండేలా మత్స్య–6000 డిజైన్ చేశారు. ఈ పరిశోధనల్లో సముద్ర గర్భంలో ఉన్న మాంగనీస్ కోబాల్ట్, నికెల్ లాంటి ఖనిజాల అన్వేషణలతో పాటు సముద్ర గర్భంలో వాతావరణ పరిస్థితులు రుతుపవనాల రాకపోకలు లాంటి వాటిపై అధ్యయనం చేయడానికి ఇది దోహదపడుతుంది.ఖనిజాలు.. వాతావరణ పరిస్థితులపై అధ్యయనానికి.. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్స్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓçషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంయుక్తంగా సముద్ర గర్భంలో ఖనిజాల అన్వేషణ, సముద్రాల నుంచి వచ్చే రుతు పవనాలు, వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు మత్స్య–6000 అనే పేరుతో సముద్రయాన్ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. సముద్రపు అడుగున ఏముందో పరిశోధనలు చేసేందుకు ఈ ప్రయోగాన్ని చేపడుతున్నారు. సుమారు రూ.4 వేల కోట్లతో 2026 నాటికి ఈ ప్రయోగాన్ని చేసేందుకు ఓషన్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు, ఇస్రో శాస్త్రవేత్తలు సంయుక్తంగా కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. -
శక్తి: ఆటుపోట్లకు వెరవని ‘షి’జర్నీ
ప్రమాదాల సముద్రం మీద 8 నెలల పాటు ప్రపంచ దేశాలు తిరిగి రావడానికి ఇద్దరు సాహస నేవీ మహిళా అధికారులు దిల్నా, రూపా అక్టోబర్ 2న గోవా నుంచి బయలుదేరారు. కేవలం వారిద్దరు మాత్రమే ఉండే ఈ సాహసభరిత యాత్రలో వారు తోడు తీసుకెళుతున్నవి ఏమిటి? వారికి తోడుండేవి ఏమిటి? ఇంత సాహసం చేసే వీరిని చూస్తే ప్రతి అమ్మాయిలోనూ కలగదా సముద్రమంత సాహస భావన!‘గమ్యం ఎలాగూ ముఖ్యమే. కాని ప్రయాణం కూడా ముఖ్యం. ఈ యాత్రలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదించండి’ అని అక్టోబర్ 2న గోవాలో జెండా ఊపి భవిష్యత్ చరిత్రలో చిరస్థాయిగా నిలబడనున్న ‘నావికా సాగర్ పరిక్రమ–2’ను ప్రారంభించారు నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి. కేవలం ఇద్దరు మహిళా నేవీ ఆఫీసర్లు ఐఎన్ఎస్వి తారిణి పేరున్న సెయిల్ బోట్లో ఎనిమిది నెలల పాటు చేయనున్న ఈ సాహసయాత్ర విజయవంతం కావాలని ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు.ఐదు అంచెల యాత్రయాభై ఆరు అడుగుల ΄పొడవుండే సెయిల్ బోట్ తారిణిలో కమాండర్లు దిల్నా, రూప ఒకరికి ఒకరు తోడుగా నిలిచి మొత్తం 23000 నాటికల్ మైళ్లు అంటే 40000 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. అక్టోబర్ 2న గోవా నుంచి బయలుదేరిన వీరు ఈ యాత్రను ఐదు భాగాలుగా చేస్తారు. ⇒ గోవా నుంచి ఆస్ట్రేలియా 2.ఆస్ట్రేలియా నుంచి న్యూజిలాండ్ 3. న్యూజిల్యాండ్ నుంచి ఫాక్‌ల్యాండ్ ఐలాండ్స్ (దక్షిణ పసిఫిక్ సముద్రం) 4.ఫాక్‌ల్యాండ్ నుంచి సౌత్ ఆఫ్రికా 5. సౌత్ ఆఫ్రికా నుంచి గోవా. భారతీయ మహిళలు అత్యంత శక్తిమంతులని ప్రపంచ దేశాలకు చాటి చెప్పేందుకు సాగుతున్న ఈ యాత్ర కోసం తరిణికి సారధిగా లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా.కే వ్యవహరిస్తుండగా.. మరో లెఫ్టినెంట్ కమాండర్ రూపా సారథ్యం వహిస్తున్నారు.మైక్రోప్లాస్టిక్స్‌పై పరిశోధన‘నావికా సాగర్ పరిక్రమ–2’ మన స్త్రీ శక్తిని నిరూపించడానికే కాదు ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ’తో అనుసంధానమై సముద్రజలాల్లోని మైక్రోప్లాస్టిక్స్‌ను అధ్యయనం చేయడానికి కూడా ఉపయోగపడనుంది. అలాగే ‘వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’తో కలిసి సముద్రాలలోని పుష్పపత్రాలు, భారీ సముద్ర జీవులపై కూడా పరిశోధనకు అవసరమైన సమాచారం కూడా సేకరిస్తారు. వీటన్నింటికి వీలుగా ‘తారిణి’ని సిద్ధం చేశారు. ఈ బోట్ ముందు భాగంలో మాస్ట్సెయిల్స్ ఉంటాయి.వెనుక భాగంలో రెండు స్టీరింగ్ వీల్స్, ఆటో పైలట్ సిస్టమ్, నెలకు 20 జీబీ వినియోగించుకునే సౌకర్యంతో కూడిన శాటిలైట్ యాంటెన్నా ఉంటుంది. సముద్ర జలాల్ని శుద్ధి చేసి గంటకు 30 లీటర్లు మంచినీరు ఇవ్వగల ఆర్వో ప్లాంట్ అమర్చారు. అవసరమైన సందర్భాల్లో వినియోగించుకునేందుకు 22 తాళ్లను అందుబాటులో ఉంచారు. ల్యాప్‌టాప్‌లు, మ్యూజిక్ సిస్టం సైతం బోట్లో ఉన్నాయి. బోట్ తయారీలో అధికభాగం ఫైబర్ గ్లాస్‌ను ఉపయోగించారు. వీరి యాత్రను జీపీఎస్ విధానం ద్వారా ట్రాక్ చేస్తూ ప్రయాణం ఎలా సాగుతోందో భారత నౌకాదళం నిరంతరం పర్యవేక్షిస్తుంటుంది.సోదరి ఇచ్చిన పాండా బొమ్మతో ‘ప్రయాణం చేయడానికి భయం లేదని చెప్పడం లేదు. కానీ అంతకుమించిన ఆత్మ విశ్వాసం కూడా ఉంది. ఈ ప్రయాణంలో నాకు తోడుగా ఉంటుందని నా సోదరి పాన్పాన్ అని పిలుచుకునే పాండా బొమ్మ ఇచ్చింది. దీంతోపాటు ఖగోళశాస్త్రవేత్త కార్ల్‌సాగన్ రచించిన పుస్తకాలు తోడు తీసుకెళ్తున్నాను’ అంది లెఫ్టినెంట్ కమాండర్ రూపా ఈ సందర్భంగా.అమ్మ చేసిన ఊరగాయలతో‘సముద్రం ఒక గొప్ప గురువు. మాకు సహనాన్ని నేర్పిస్తుంది. బోట్‌ను మనం మంచిగా చూసుకుంటే, అది మనల్ని మంచిగా చూసుకుంటుందనే సూత్రాన్నే పాటిస్తాను. తరిణిలో మేమే ఇంజినీర్లం, ఎలక్ట్రీషియన్లం, కార్పెంటర్లం. వాతావరణ నివేదికల్ని అనుసరిస్తూ ప్రయాణం సాగించాలి. ఎనిమిది నెలల పాటు తరిణిలోనే మా నివాసం కాబట్టి పుస్తకాలు తెచ్చుకున్నా. కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్ ఇచ్చిన గిఫ్ట్స్, సంగీత వాద్య పరికరాలతోపాటు అమ్మ చేసిన ఊరగాయలు, కాలికట్ చిప్స్, టాపియోకా చిప్స్ తీసుకెళ్తున్నా. ఈ ప్రయాణం మొత్తానికి సరిపడా దోశల పిండి కూడా మా వెంట తీసుకువెళుతున్నాం. డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లేబొరేటరీ రూ΄పొందించిన ప్రత్యేకమైన ఆహారాన్ని మాకు అందుబాటులో ఉంచారు’ అని తెలిపింది లెఫ్టినెంట్ కమాండర్ దిల్నా. వీరి యాత్ర సఫలం కావాలని కోరుకుందాం. – కరుకోల గోపీకిశోర్ రాజా, సాక్షి, విశాఖపట్నం -
walking fish: నడిచే చేపల గురించి విన్నారా?
సీ రాబిన్ చేపల్లో కొత్త రకం జాతుల వైవిధ్యమైన లక్షణాలను శాస్తవేత్తలు తాజాగా కనుగొన్నారు. సీ రాబిన్స్ చేపల్లోని ప్రియోనాటస్ కారోలైనస్ జాతుల మొప్పల వెనకాల రెక్కలతోపాటు, కిందిభాగంలో పీత ఉన్న మాదిరిగా ఆరు కాళ్లను గుర్తించారు. చేప ఈ కాళ్లతో ఎంచక్కా సముద్రగర్భం అడుగుభాగంపై చకచకా ముందుకు కదులుతోంది. ఆ కాళ్లకు మరో ప్రత్యేకత ఉంది. వాటి అడుగున ఉన్న పాదాల్లాంటి మెత్తని భాగానికి జ్ఞానేంద్రియంలాంటి గుణం ఉండటం విశేషం. సముద్రం అడుగున మట్టి కింద ఏదైనా చిన్న జీవి దాక్కున్నా, ఇంకేదైనా ఆహారం ఉన్నా ఈ చేప తన కాళ్లతోనే గుర్తించగలదు. అవసరమైతే మట్టిలో కూరుకుపోయిన ఆహారాన్ని తవ్వి బయటకు తీయగలదు. ఇలాంటి కొత్త విషయాలతో కూడిన అధ్యయన వివరాలు తాజాగా ‘కరెంట్ బయోలజీ’సైన్స్ జర్నల్‌లో గురువారం ప్రచురితమయ్యాయి. మట్టి అడుగున అమైనో ఆమ్లాలను కల్గిన చిన్న జీవి జాడనూ చేప గుర్తించగలదు. అక్కడి ఆహారం, జీవి నుంచి విడుదలయ్యే రసాయనాలను గుర్తించే ఏర్పాట్లు సీ రాబిన్ పాదాల్లో ఉన్నాయి. పాదాల్లోని నరాలు ఇందుకు అనుగుణంగా స్పందిస్తున్నాయని అధ్యయనకారులు తెలిపారు. మనిషి నాలుక మీద ఉండే రుచి మొగ్గల లాంటి బొడిపెలు ఈ చేప పాదాల కింద ఉన్నాయి. వీటి సాయంతో అది తన ఆహారం జాడ కనిపెడుతోందని అధ్యయనం వెల్లడించింది. -
నేల మీద కాకుండా.. నీటిలో తేలియాడే ఇల్లును ఎప్పుడైనా చూశారా!
నేల మీద ఇల్లు కట్టుకోవడం అంత తేలిక కాదు. ముఖ్యంగా స్థలాల ధరలు చుక్కలను తాకే నగరాల్లో ఇల్లు కట్టుకోవాలంటే, ఖర్చు తడిసి మోపెడవుతుంది. అందుకే, నేల మీద కాకుండా నీటిలో తేలియాడే ఇల్లుకు చైనీస్ ఆర్కిటెక్ట్‌లు రూపకల్పన చేశారు. బీజింగ్‌కు చెందిన ‘క్రాస్బౌండరీస్ ఆర్కిటెక్చర్ స్టూడియో’కు చెందిన నిపుణులు సాధారణమైన ఇంటికి కావలసిన అన్ని వసతులతో కూడిన పడవలాంటి ఈ ఇంటిని తయారు చేశారు.నదుల్లోను, సముద్రంలోనూ తేలుతూ ప్రయాణించేలా దీన్ని తీర్చిదిద్దారు. పడవలాంటి ఈ ఇంటికి ‘ఫాంగ్ సాంగ్’ అని పేరు పెట్టారు. పడవలు నడవాలంటే ఇంధనం కావాలి. పడవలాంటి ఈ 667 చదరపు అడుగుల ఇంటికి మాత్రం ఇంధనం అక్కర్లేదు. ఇది పూర్తిగా సౌరశక్తితో పనిచేస్తుంది. దీని పైకప్పుల మీద అమర్చిన సోలార్ ప్యానల్స్ ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తు ఈ ఇంటి అవసరాలన్నింటికీ పూర్తిగా సరిపోతుంది. ఈ ఇంటి ధర 26 వేల డాలర్లు (రూ.21.85 లక్షలు). ఈ తేలే ఇంటిని కొనేందుకు యూరోపియన్లు సైతం ఎగబడుతుండటం విశేషం. -
చమురు నౌక మునక: ఎనిమిది మంది భారతీయులు సురక్షితం
ఒమన్ తీరంలో మునిగిన చమురు నౌకలో చిక్కుకున్న 13 మంది భారతీయులలో ఎనిమిదిమందిని ఇండియన్ నేవీకి చెందిన ఐఎన్ఎస్ ట్యాగ్ సురక్షింతగా బయటకు తీసుకువచ్చింది. ఈ చమురు నౌక సముద్రంలో మునిగిపోయినప్పుడు దానిలో మొత్తం 16 మంది ఉన్నారు. వీరిలో 13 మంది భారతీయులు. ఈ ప్రమాదంలో మునిగిన ఒక శ్రీలంక పౌరుడిని కూడా ఇండియన్ నేవీ రక్షించింది. మరో శ్రీలంక పౌరుని మృతదేహాన్ని వెలికితీసింది.ఒమన్ తీరంలో మునిగిపోయిన కార్గో షిప్‌ను గుర్తించడానికి భారత్‌కు చెందిన యుద్ధనౌక ఐఎస్ఎస్ టెగ్ను రెస్క్యూ ఆపరేషన్‌కు పంపారు. ఒమన్‌లోని రాస్ మద్రాక్కు ఆగ్నేయంగా 25 నాటికల్ మైళ్ల దూరంలో జులై 15న ఈ నౌక మునిగిపోయింది. ఒమన్ అధికారుల సమన్వయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని భారత నౌకాదళం తెలిపింది. ఎంటీ ఫాల్కన్ ప్రెస్టీజ్ అనే కార్గో నౌకలో 13 మంది భారతీయులు,ముగ్గురు శ్రీలంక పౌరులు ఉన్నారని ఒమన్ మారిటైమ్ సేఫ్టీ సెంటర్ (ఎంఎస్సీ)పేర్కొంది. -
శేషాచలంలో సాగర ఘోష!
ఉత్తర భారతదేశంలోని సంగీత సాధకులు కొందరు తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోదలిచారు. అదే విషయం తమ సంగీత విద్వాంసుడికి చెప్పారు. ఆ విద్వాంసుడు చాలా సంతోషించి ‘అలాగే, అక్కడి శేషాచలం కొండల్లోని సముద్రాన్ని చూసి రమ్మని’ చెప్పి పంపాడు.ప్రయాణం మొదలైనప్పటినుంచీ ఆ సాధకుల్లో ఓ సందేహం మొదలయ్యింది. ‘తిరుమల శేషాచలం కొండల దగ్గర సముద్రం ఉందని ఎన్నడూ వినలేదు, మరి గురువు ఎందుకు అలా చెప్పాడో...’ అని. ఎన్ని పుస్తకాలు తిరగేసినా, ఎందరో పండితులను విచారించినా తిరుమల కొండ సమీపంలో సముద్రం ఏదీ లేదని తెలుసుకున్నారు. ‘అయినా గురువు తప్పు చెప్పడు కదా!’ అని ఆలోచించారు. ‘ఎలాగూ వెళ్తున్నాము కదా, కొండ పరిసరాల్లో వెదికి చూద్దాం!’ అనుకున్నారు. అలిపిరి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు చేరుకున్నారు. గుండు గీయడమంటే పాపాలు పోగొట్టుకోవడమే అని నమ్మిన ఆ సాధకులు స్వామికి తలనీలాలు సమర్పించారు. పుష్కరిణిలో స్నానం చేసి స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. లడ్డు ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే, వారికి గురువు చెప్పింది గుర్తుకొచ్చింది. కనిపించిన భక్తులతో సముద్రం గురించి ఆరా తీశారు. వారు సమాధానం ఇవ్వకపోగా వీరి వైపు వింతగా చూశారు. ‘తిరుమల కొండలపైన సముద్రం కాకపోయినా, సముద్రం లాంటిదేమైనా ఉంటుందేమో చూద్దామని’ బయలుదేరారు. ఆకాశ గంగ, పాపవినాశనం, జాపాలి, పాండవ తీర్థం లాంటి ప్రదేశాలన్నీ గాలించారు. వారికెక్కడా సముద్రం ఆనవాలు కనిపించలేదు. గురువు పొరపాటుగా చెప్పినట్లున్నారని తీర్మానించుకుని కొండ దిగడం ్రపారంభించారు.వారికి దారిలో ఏడవ మైలు వద్ద ఆకాశం ఎత్తు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం కనిపించింది. భక్తితో నమస్కరించి కళ్ళు మూసుకుని, ప్రశాంతంగా కూర్చున్నారు. వారి చెవులకు... లీలగా... మైకులో నుంచి ‘అదివో అల్లదివో శ్రీహరి వాసము... పదివేల శేషుల పడగల మయము‘ అనే అన్నమాచార్య కీర్తన వినిపించింది. వారి ఒళ్ళు పులకరించింది. ముఖాల్లో నేతి దీపాల మెరుపు మొదలయ్యింది. గురువు చెప్పిన ‘సముద్రం’ లోతు తెలిసింది. ఏడు స్వరాలు ఏడుకొండలై అన్నమయ్య సంగీత స్వరంతో ప్రవహించడం గమనించారు.‘మనమనుకునే ఉప్పు నీటి సముద్రం శేషాచలం కొండల్లో లేదు కానీ అన్నమయ్య గానామృత సముద్రం ఈ కొండల దగ్గర ఉంది’ అని తెలుసుకున్నారు. పండితులను, పామరులను సైతం ఓలలాడించే ముప్పది రెండువేల సంకీర్తనలు తెలుగులో అందించిన ఆ పదకవితా పితా మహుడికి మనస్సులోనే ధన్యవాదాలు తెలిపారు. గోవింద నామస్మరణలు చేస్తూ కొండ దిగారు. – ఆర్.సి. కృష్ణస్వామి రాజు -
రీల్స్ పిచ్చి పీక్స్‌కు.. సముద్రంలో కార్లతో ఇరుక్కపోయిన యువకులు
కొంతమందిలో సోషల్ మీడియా పిచ్చి రోజురోజుకీ పెరిగిపోతుంది. చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ల వరకు సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోవటంతో.. ఆ క్రేజ్‌ను ఉపయోగించుకుని ఓవర్ నైట్ స్టార్ కావాలని పిచ్చి పిచ్చి ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. త్వరగా ఫేమస్ అయిపోవాలని, తమ వీడియోలు వైరల్ అవ్వాలని కొన్నిసార్లు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయకూడదని ఎంతమంది చెప్పినా తమ ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు. తాగా ఇలాంటి ఘటనలో మరొకటి వెలుగు చూసింది.ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం కొంతమంది యువకులు తమ కారును సముద్రంలోకి నడిపి ప్రమాదంలో చిక్కుకున్నారు. ఈ ఘటన గుజరాత్‌లోని కచ్ సముద్ర తీరంలో జరిగింది. ఇద్దరు యుకులు రీల్స్ కోసం తమ రెండు మహీంద్రా థార్ ఎస్యూవీ కారులను ముంద్రా సముద్ర తీరంలోకి పోనిచ్చారు. నీరు లోతు పెరగడం, అలల కారణంగా రెండు వాహనాలు దాదాపు నీటిలో మునిగిపోయాయి. దీంతో యువకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రెడ్, వైట్ మహీంద్రా థార్ వాహనాలను నీటిలో నుంచి బయటకు తీయడానికి చాలా కష్టపడ్డారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. స్థానికుల సహాయంతో ఎట్టకేలకు వాహనాలను నీటిలో నుంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, కచ్ పోలీసులు ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రెండు ఎస్వీలను స్వాధీనం చేసుకున్నామని, చట్టపరమైన చర్యలు ప్రారంభించామని పోలీసు అధికారి తెలిపారు.Gujarat: In an attempt to make a reel, two young men drove 2 Thar vehicles into the deep waters near the seashore in Mundra, Kutch due to which both vehicles get stuck in the water. With the help of locals, both vehicles were retrieved, also Kutch police filed an FIR against the… pic.twitter.com/m9YR0ByK7b— IANS (@ians_india) June 23, 2024 -
సముద్రంలో మునిగి ఇద్దరు మృతి
వేటపాలెం: దూరప్రాంతాల నుంచి విహారం కోసం వస్తున్న పర్యాటకులు అనుకోని పరిస్థితుల్లో మృత్యువాత పడుతున్నారు. రామాపురం బీచ్‌లో నలుగురు యువకులు మృత్యువాత పడి రెండురోజులు గడవక ముందే అదే ప్రాంతంలో ఆదివారం మరో ఇద్దరు సముద్ర కెరటాలకు బలైపోయారు. వివరాల్లోకి వెళితే.. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు విహారయాత్ర కోసం రామాపురం బీచ్‌కు చేరుకున్నారు. స్నేహితులంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ గడిపారు.సముద్రం నీటిలో మునుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు అలల తాకిడికి నలుగురు కొట్టుకుపోతుండగా గమనించిన స్నేహితులు ఇద్దరిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. మరో ఇద్దరు నాగేశ్వరరావు (27), బాలసాయి (26) మృత్యువాత పడ్డారు. వీరంతా విజయవాడలోని వివిధ బంగారం షాపుల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఈపురుపాలెం ఎస్సై శివకుమార్ యాదవ్ పరిశీలించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.అయితే రెండురోజుల వ్యవధిలో రెండు సంఘటనలు చోటుచేసుకోవడంతో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చీరాల, వేటపాలెం ఎస్సైలకు పలు సూచనలు ఇచ్చారు. సముద్ర తీరం వద్ద నిఘా పెంచాలని, గజ ఈతగాళ్లు, మెరైన్ పోలీసులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. దూరప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు బీచ్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. -
సముద్రంలో తిరగబడిన బోటు
వేటపాలెం: బాపట్ల జిల్లా, వేటపాలెం మండలం, పొట్టిసుబ్బయ్యపాలెం మత్స్యకారులకు సంబంధించిన బోటు సముద్రంలో సోమవారం రాత్రి బోల్తాకొట్టింది. అందులో వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రంలోనే ఉండిపోయారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి చెందిన కొండూరు రాములు, పెద్ద కుమారుడు కొండూరు గోవిందు, చిన్నకుమారుడు చిట్టిబాబు, కఠారివారిపాలేనికి చెందిన కఠారి శ్రీను నలుగురు కలిసి సోమవారం సాయంకాలం బోటులో సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే రాత్రి 8 గంటల సమయంలో వేట సాగించేటప్పుడు అలల తాకిడికి బోటులోకి సముద్రం నీరు పెద్ద మొత్తంలో చేరుకొని తిరగబడింది. అందులో ఉన్న నలుగురు సముద్రం నీటిలో పడిపోయారు. వీరి పై వేట సాగించే వల పడింది. నలుగురు సముద్రం నీటిలోపలకు వెళ్లి వలను తప్పించుకొని ఈతకొట్టుకొంటూ తిరగబడిన బోటు పై భాగానికి ఎక్కి కూర్చున్నారు. వీరి వద్ద ఉన్న సెల్ఫోన్లు నీటిలో పడిపోవడంతో సమాచారం ఇవ్వడానికి వీలు పడలేదు. ఆరు గంటల పాటు తిరగబడిన బోటు పైనే కూర్చున్నారు. చిన్నగంజాం మండలం, చిన్నంగారివారిపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులు మంగళవారం తెల్లవారుజామున వేట ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన బోటు పై భాగంలో కూర్చొని ఉన్న నలుగురిని గమనించారు. వెంటనే వారిని తమ బోటులో ఎక్కించుకొని తెల్లవారుజామున 5 గంటలకు పొట్టిసుబ్బయ్యపాలెం గ్రామానికి తీసుకొచ్చారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆరు గంటల పాటు సముద్రం నీటిలోనే ఉండిపోయామని మత్స్యకారులు తెలిపారు. వల, బోటు, ఇంజన్లు ఎందుకూ పనికిరాకుండా పోవడంతో రూ.6.50 లక్షలు నష్ట పోయామని వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. -
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పరిచిత, అపరిచిత, వింత, క్రూర.. రకరకాల జీవులు మనకు సవాలు విసురుతాయి. సాహసం ఏమాత్రం నీరు కారి΄ోయినా జీవితం నీటిపాలు కావాల్సిందే. అందుకే సముద్ర గర్భంలో ప్రతి క్షణం...విలువైన సాహసమే. సముద్ర గర్భంలో సాహస యాత్ర చేయాలని ఉందా? అయితే ఈ గేమ్ మీ కోసమే.అడ్వెంచర్ సిమ్యూలెషన్ గేమ్ ‘ఎండ్లెస్ ఒషియన్ లుమినస్’ విడుదలైంది. జపాన్ గేమింగ్ కంపెనీ ‘అరిక’ డెవలప్ చేసిన గేమ్ ఇది. ‘ఎండ్లెస్ ఓషన్’ సిరీస్‌లో వస్తున్న థర్డ్ గేమ్. సముద్రగర్భ ప్రపంచాన్ని రికార్డ్ చేయడానికి ఈ గేమ్‌లో ప్లేయర్ స్కూబా డైవర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది.ప్లాట్‌ఫామ్: నిన్టెండో స్విచ్,జానర్స్: అడ్వెంచర్, సిమ్యులేషన్,మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీ ప్లేయర్ -
ఉన్నట్టుండి రంగు మారిన కాకినాడ సముద్రం..
-
తెగిన తేలియాడే వంతెన.. సముద్రంలో పడిపోయిన టూరిస్టులు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం వర్కల బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిన ఘటనలో 13 మంది పర్యాటకులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం(మార్చ్ 9) సాయంత్రం 5 గంటలకు జరిగింది. సముద్రంలో పడిపోయి గాయపడిన వారిలో ఇద్దరు చిన్నపిల్లలున్నారు. సందర్శకులు సముద్రంలో బ్రిడ్జిపై నిలుచున్నపుడు ఒక్కసారిగా భారీ అలలు రావడంతో బ్రిడ్జి హ్యాండ్ రెయిల్ విరిగిపోయింది. దీంతో అది పట్టుకుని నిల్చున్నవారంతా సముద్రంలో పడిపోయారు. అయితే సందర్శకులంతా లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో వారిని వెంటనే రక్షించి తీరానికి తీసుకురాగలిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 14 ఏళ్ల చిన్నారి తప్ప మిగిలిన వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. సాధారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి మూసి ఉంటుందని అయితే శనివారం సాయంత్రం భారీ అలలు వస్తున్నప్పటికీ సందర్శకులను దానిపైకి అనుమతించడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. STORY | Floating bridge accident at Varkala beach; 11 injured: Police READ: https://t.co/DVzkSIMP3v VIDEO: pic.twitter.com/wjRfXkMUHx — Press Trust of India (@PTI_News) March 9, 2024 ఇదీ చదవండి.. ఫోక్రాన్ యుద్ధ విన్యాసాల్లో రోబో డాగ్ ప్రత్యేకత -
Mumbai Trans Harbour Link: పొడవైన సముద్రవంతెన.. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం!
ముంబయి: భారత్‌లోనే అతిపొడవైన సముద్ర వంతెన అటల్ సేతుని ప్రధాని నరేంద్ర మోదీ రేపు (జనవరి 12)న ప్రారంభించనున్నారు. భారత్‌లోనే అతిపెద్ద సముద్ర వంతెన రవాణా వినియోగానికి అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ వంతెనపై రాకపోకలకు పలు ఆంక్షలు విధించారు. వంతెనపై గరిష్ఠ వేగం గంటకు 100కిలోమీటర్ల దాటకూడదని ఆదేశాలు జారీ చేశారు. మోటార్‌బైక్‌లు, ఆటోలు, ట్రాక్టర్లు వంటి వాహనాలుకు అనుమతిని నిరాకరించారు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికిల్స్, మిని బస్సులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వంతెన ఎక్కేప్పుడు, దిగేప్పుడు వాహనాల వేగం 40 కిలోమీటర్లకు పరిమితం చేశారు. రూ. 18,000 కోట్ల వ్యయంతో నిర్మించిన అటల్ బ్రిడ్జ్.. ముంబైలోని సెవ్రీ నుండి ప్రారంభం అవుతుంది. రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్ తాలూకాలోని న్హవా షెవాలో ముగుస్తుంది. అటల్ వంతెన అనేది 6-లేన్ సముద్రం లింక్. ఇది సముద్రం మీద 16.50 కిలోమీటర్లు, భూమిపై 5.5 కి.మీ. ఉంటుంది. ఈ వంతెనతో వాహనదారులు ముంబయి, నవీ ముంబయి మధ్య దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో అధిగమించగలరు. ఈ వంతెన లేకపోతే 2 గంటల సమయం పడుతుంది. ఇదీ చదవండి: సీఎం స్టాలిన్ సంక్రాంతి కానుక -
సముద్రపు వంతెన ‘అటల్ సేతు’.. ప్రత్యేకతలివే!
దేశంలోనే అత్యంత పొడవైన, ఆధునిక సముద్రపు వంతెన నిర్మాణం పూర్తయింది. దీనిని జనవరి 12న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ముంబయి- నవీ ముంబయిలను కలిపే ఈ అతిపెద్ద సముద్రపు వంతెన పొడవు 22 కిలోమీటర్లు. దీనికి ‘అటల్ సేతు’ అనే పేరు పెట్టారు. దీని విశేషాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అటల్ సేతు వంతెన నిర్మాణంలో పర్యావరణంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. వంతెనపై 400 సీసీటీవీ కెమెరాలను అమర్చారు. ఇవి భద్రత పరంగా ఎంతో ఉపయోగపడతాయి. దీనిపై ఏదైనా వాహనం ఆగిపోయినా, పాడయిపోయినా, ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా ఇక్కడి కెమెరాలు ఆ సమాచారాన్ని వెంటనే కంట్రోల్ రూమ్‌కి అందిస్తాయి. రూ. 20 వేల కోట్లతో నిర్మించిన ఈ వంతెనలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ వంతెన కారణంగా ముంబై నుండి నవీ ముంబైకి ప్రయాణం చాలా సులభతరం అవుతుంది. ఈ వంతెన ఏర్పాటుతో దక్షిణ ముంబై నుండి నవీ ముంబైకి చేరుకోవడానికి కేవలం 20 నుండి 25 నిమిషాలు పడుతుంది. ఇంతవరకూ ఈ దూరం ప్రయాణించడానికి రెండు గంటల సమయం పట్టేది. ఈ వంతెన ప్రారంభంతో ఈ ప్రాంతంలో ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ సముద్రపు వంతెన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వే, ముంబై-గోవా హైవేలను కలుపుతుంది. ఈ వంతెన మహారాష్ట్రలోని రెండు పెద్ద నగరాలను కలుపుతుంది. ఇది ఆరు లేన్ల వంతెన. ఈ వంతెనలోని 16.5 కిలోమీటర్ల రహదారి సముద్రం మీద నిర్మితమయ్యింది. దాదాపు 5.5 కిలోమీటర్ల రహదారి భూభాగంపై ఉంది. దేశంలోనే అత్యంత పొడవైన అటల్ బ్రిడ్జిపై ఒకవైపు రూ.250 టోల్ వసూలు చేయనున్నారు. శీతాకాలంలో ఇక్కడి సముద్రానికి వచ్చే ఫ్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనకు ఒకవైపు సౌండ్ బారియర్‌ను ఏర్పాటు చేశారు. అలాగే సముద్ర జీవులకు హాని కలగని లైట్లను ఏర్పాటు చేశారు. ఈ వంతెన దక్షిణ ముంబైలోని శివడి నుండి ప్రారంభమై, ఎలిఫెంటా ద్వీపానికి ఉత్తరాన ఉన్న థానే క్రీక్‌ను దాటుతుంది. -
#Lakshadweep : ప్రకృతి చెక్కిన ‘అందాలు’.. లక్షదీప్ చూసొద్దామా.. (ఫొటోలు)
-
నడి సముద్రంలో తప్పిన పెనుముప్పు
కాకినాడ క్రైం: భారీ మత్స్య సంపదతో తీరానికి చేరుతున్నామని పట్టరాని ఆనందంలో ఉన్న 11 మంది మత్స్యకారుల తలరాత క్షణాల్లో మారిపోయింది. ఆనందపు అంచుల నుంచి ఒక్కసారిగా మృత్యు ఒడికి దాదాపుగా జారుకున్నారు. సంద్రపు అలని తలదన్నే ఎత్తులో అగ్నికీలలు ఆకాశాన్ని తాకుతుంటే నివ్వెరపోయారు. ఆ కీలలన్నీ తమ బోటు నుంచేనని తెలిసే లోపే మంటల్లో చిక్కుకున్నారు. తక్షణమే లైఫ్ జాకెట్లు వేసుకుని సముద్రంలోకి దూకేశారు. ఒకొక్కరూ గంటకు పైగా మృత్యువుతో పోరాడారు. చివరికి అటుగా వచ్చిన సహ మత్స్యకారులు, కార్పోరేట్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న మరో బోటులోని సిబ్బంది.. వారి ప్రాణాలు కాపాడి తమ బోటులోకి చేర్చుకున్నారు. ఈ ఘటన కాకినాడ జిల్లాలోని ఓడలరేవు తీరం భైరవపాలెం సముద్ర ఉపరితలంలో శుక్రవారం జరిగింది. కాకినాడలోని జగన్నాథపురం, ఏటిమొగకు చెందిన 11 మంది కాకినాడ ఫిషింగ్ హార్బర్ నుంచి ఈ నెల 1న బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ బోటు యజమాని పరం రామకృష్ణ. నారాయణ అనే మత్స్యకారుడు బోటు మాస్టర్. ఈ 11 మంది కాకినాడ తీరం నుంచి సుదూరానికి వెళుతూ...వెళ్లే దారిలో తిరుగు ప్రయాణంలో భైరవపాలెం వద్ద ఒక భారీ వల వేశారు. సముద్ర తీరంలో 135 నాటికల్ మైళ్ల దూరంలో వేటలో ఉండగా గురువారం రాత్రి కోస్ట్‌గార్డ్ బృందం తుఫాను హెచ్చరికలు చేసి తీరానికి వెళ్లిపోవాలని వీరిని అప్రమత్తం చేసింది. వీరు శుక్రవారం తెల్లవారుజామున కాకినాడ తీరానికి బయల్దేరారు. భైరవపాలెంలో వేసిన వల తీసేందుకు వెళ్లి ఆ దారిలో కాకినాడ తీరం వైపుగా వెళ్లాలని అనుకున్నారు. భైరవపాలెంలో వల తీస్తుండగా అప్పటికే వేడెక్కి ఉన్న ఇంజన్ నుంచి ఇంధనం ట్యాంకులకు అనుసంధానం చేసిన పైపుల నుంచి డీజిల్ చిమ్మింది. గొట్టాల పరిసరాలన్నీ ఇంధనంతో తడిసి..ఇంధన ట్యాంక్‌పై చమురు చిమ్మి మంటలు అంటుకున్నాయి. ఈ మంటలు దావనలంలా వ్యాపించాయి. ఓడ పూర్తిగా దగ్ధమై నీట మునిగిపోతున్న చివరి క్రమంలో వీరు సముద్రంలోకి దూకేశారు. సరిగ్గా అటుగా వస్తు్తన్న మత్స్యకార బృంద ఈ11 మందిని చూశారు. రిలయన్స్ సిబ్బందితో కలిసి వారు 11 మందిని రక్షించారు. కోస్ట్‌గార్డ్ సిబ్బంది మత్స్యకారులను ఐసీజీఎస్ చార్లీ–438 ఫిప్ ద్వారా కాకినాడ తీరానికి చేర్చారు. కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ విశ్వాస్ తాపా ఆధ్వర్యంలో 10 మంది కోస్ట్‌గార్డు సిబ్బంది మత్స్యకారుల్ని కాకినాడ తీరానికి చేర్చారు. మొత్తం రూ.70 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనపై ఓడలరేవు మెరైన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. మృత్యుంజయులు వీరే... బొమ్మిడి వీరబాబు, సంగాడి నారాయణ, పెమ్మాడి సత్యం, చెక్కా నాగూర్, పాలెపు నూకరాజు, పినపోతు తాతారావు, ఆదం ధనరాజు, కొప్పిడి సత్యనారాయణ, పంతాడి సతీష్, పినపోతు ధర్మరాజు, దోమ వీరబాబు -
సముద్రంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం
-
బుర్జ్ ఖలీఫా ఎత్తును దాటేసిన పర్వతం.. ఎక్కడుందంటే..
ప్రపంచంలో అత్యంత ఎత్తయినది ఏదంటే ఎవరైనా వెంటనే బుర్జ్ ఖలీఫా అని చెబుతారు. అయితే దీనికి మించినది మరొకటి ఉందని తెలిస్తే ఆశ్చర్యపోతారు. పైగా అది భూమి మీద కాకుండా సముద్రపు లోతుల్లో ఉందని తెలిస్తే.. దీనిని కనుగొన్న శాస్త్రవేత్తలకు సలాం చేయకుండా ఉండలేరు. దక్షిణ అమెరికా దేశమైన గ్వాటెమాల తీరంలో నీటి అడుగున ఒక భారీ పర్వతాన్ని పరిశోధకులు కనుగొన్నారు. సముద్ర మట్టాన్ని మ్యాపింగ్ చేసే శాస్త్రవేత్తలు దీనిని ఆవిష్కరించారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఈ పర్వతం ఎత్తు 5,249 అడుగులకు పైగానే ఉంది. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనం ఎత్తు 2 వేల 722 అడుగులు. ఈ భారీ పర్వతం భూ ఉపరితరం నుంచి 7 వేల 874 అడుగుల దిగువన ఉంది. ఈ పర్వతాన్ని స్మిత్ ఓపెన్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు కనుగొన్నారు. స్మిత్ ఓషన్ ఇన్స్టిట్యూట్ సహ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు వెండీ స్మిత్ ఒక ప్రకటనలో ఫాకర్ యాత్రలో ఉన్న పరిశోధకులు.. ఊహించని, విస్మయం కలిగించే అంశాన్ని కనుగొన్నారని ఒక ప్రకటనలో తెలిపారు. సముద్రంలో మనకు అంతుచిక్కని అంశాలు వెల్లడైనప్పుడు ఎంతో ఆసక్తి కలుగుతుంది. దీనిపై అన్వేషణ కొనసాగించడానికి సంతోషిస్తున్నామన్నారు. ఈ పర్వతం 14 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని పరిశోధకులు చెబుతున్నారు. వారు సముద్రపు అడుగుభాగపు మ్యాప్‌ను రూపొందించడానికి మల్టీబీమ్ ఎకోసౌండర్ అనే పరికరాన్ని ఉపయోగించారు. ఇది కూడా చదవండి: ‘మహాబోధి’ మహోత్సవానికి భారీగా బౌద్ధ అనుచరుల రాక! -
సముద్రంలో రెస్టారెంట్.. చూడటానికి రెండు కళ్లు సరిపోవు
సముద్రంలో రెస్టారెంట్ సముద్రంలో బయటకు పొడుచుకొచ్చిన ఒక కొండ మీద పూరిగుడిసెలా కనిపిస్తున్నది ఒక రెస్టారెంట్. కొండ కొమ్ముమీద నిర్మించడం వల్ల దీనికి ‘ది రాక్’ అని పేరుపెట్టారు. టాంజానియాలోని జాంజిబార్ ద్వీపసమూహంలో ఒకటైన ఉంగుజా ద్వీప తీరానికి ఆవల హిందూ మహాసముద్రంలో ఉందిది. ఈ రెస్టారెంట్లో భోంచేయాలంటే, ఉంగుజా దీవి నుంచి పడవ మీద వెళ్లాల్సిందే! పీతలు, రొయ్యలు, ఆక్టోపస్ వంటి సీఫుడ్‌కు ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు. టాంజానియాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లో చాలామంది పనిగట్టుకుని మరీ ఈ రెస్టారెంట్‌కు వచ్చి, ఇక్కడి రుచులను ఆరగించి వెళుతుంటారు. View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) View this post on Instagram A post shared by ZANZIBAR DRONE SERVICES 📸🛸 (@dronezanzibar) విగ్గుతో గిన్నిస్ రికార్డ్ విగ్గుల వాడకం అందరికీ తెలిసిందే! సినీ నాటక రంగాల్లో విగ్గుల వాడకం ఎక్కువ. ఇటీవలి కాలంలో బట్టతలలు గల సాధారణ వ్యక్తులు కూడా విగ్గులు వాడుతున్నారు. సాధారణంగా వాడుకలో ఉన్న ఈ విగ్గులు నెత్తిని జుట్టుతో నిండుగా కప్పేంత పరిమాణంలో ఉంటాయి. కొన్ని విచిత్రవేషాల కోసం వాడే విగ్గులైతే తల మీద దాదాపు ఒక అడుగు మందం వరకు కూడా ఉంటాయి. అయితే, అలాంటి విగ్గులు చాలా అరుదు. ఇక ఇటీవల ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ డిజైనర్ డానీ రేనాల్డ్స్ రూపొందించిన అతిభారీ విగ్ గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకుంది. బైక్ హెల్మెట్‌ను చట్రంగా చేసుకుని రూపొందించిన ఈ విగ్గు వెడల్పు ఎనిమిది అడుగుల ఆరంగుళాలట. దీని తయారీకి పీవీసీ పైపులు, అల్యూమినియం రాడ్లు, కేబుల్ వైర్లు వంటి వస్తువులను ఉపయోగించడం విశేషం. ఈ విగ్గు ప్రపంచంలోనే అత్యంత వెడల్పాటి విగ్గుగా గిన్నిస్ రికార్డు సాధించింది. View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
విశాఖ తీరంలో అత్యంత అరుదైన సీ హార్స్
సాక్షి, విశాఖపట్నం: అత్యంత అరుదైన సీ హార్స్ మత్స్యకారుల వలలకు చిక్కుతున్నాయి. విశాఖ తీరంలో అప్పుడప్పుడు ఇవి దర్శనమిస్తున్నాయి. ఇవి రెండు మూడు అంగుళాల సైజులో రొయ్యలను పోలి ఉంటాయి. ఇవి రొయ్యల్లో కలిసిపోతుండడం వల్ల మత్స్యకారులు వీటిని పెద్దగా పట్టించుకోరు. తాజాగా మంగళవారం విశాఖ మత్స్యకారుల వలకు ఇవి దొరికాయి. నగరంలోని ఒక వ్యక్తి సాయంత్రం హార్బర్లో రొయ్యలను కొనుగోలు చేశాడు. ఇంటికి తెచ్చి చూడగా రొయ్యలతో పాటు ఈ సీ హార్స్ కూడా అందులో ఉన్నట్టు కె.విజయ్‌కుమార్ అనే వ్యక్తి గుర్తించారు. దొరికిన సీ హార్స్‌ను తన వాట్సాప్ స్టేటస్‌లో పెట్టడంతో ఈ విషయం బయట పడింది. కాగా సముద్ర గుర్రంగా పిలిచే ఈ చిన్న చేపలు (సీ హార్స్) ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణమండల, సమశీతోష్ణ జలాల్లో కనిపిస్తాయి. వీటికి వంకర మెడలు, పొడవైన గొంతు, తల, శరీరం నిటారుగా ఉండి తోక వంకరగా ఉంటుంది. ఈ జంతువులకు నోట్లో పళ్లుండవు. పగడపు దిబ్బలు, మడ అడవులు వంటి ప్రాంతాల్లో నివశిస్తాయి. నిట్టనిలువుగా నిలిచి ఈదుతాయి. మగ సముద్రపు గుర్రాలు తమ శరీరం ముందు భాగంలో సంతానాన్ని పొదగడానికి అనువైన ఒక సంచి వంటి అరను కలిగి ఉంటాయి. జతకట్టే సమయంలో ఆడ చేప గుడ్లను ఈ మగ చేప సంచిలోకి విడుస్తుంది. అప్పుడు మగ చేప వాటిని అంతర్గతంగా ఫలదీకరణ చేసి పిల్లలు గుడ్లలో నుంచి బయటకు వచ్చాక వాటిని నీటిలోకి విడుదల చేస్తుందని మత్స్యశాఖ జిల్లా అధికారి జి.విజయ ‘సాక్షి’కి చెప్పారు. విశాఖ ప్రాంత సముద్ర జలాల్లో సీ హార్స్‌ల ఉనికి అరుదు అని తెలిపారు. -
నడి సముద్రంలో చిక్కుకున్న తమిళనాడు మత్స్యకారులు
-
ఉనికి కోల్పోతున్న బొక్కు సొర చేప
సాక్షిప్రతినిధి, కాకినాడ: సముద్ర కాలుష్య నివారణలో కీలకపాత్ర పోషించే బొక్కు సొర చేప కాలక్రమేణా ఉనికిని కోల్పోతోంది. వేల్ షార్క్‌గా పిలిచే ఈ చేప ‘రిన్ కో డాంటిడే’ జాతికి చెందింది. ఏళ్ల సంవత్సరాల కిందట డైనోసార్లతో సముద్ర జలాల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన అతి ప్రాచీన సముద్ర జీవిగా ప్రసిద్ధి. 65 కోట్ల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ సాదు జీవి మనుగడ కోసం ప్రస్తుతం పోరాడుతోంది. ఈ జీవి ప్రపంచవ్యాప్తంగా 20వేల వరకు ఉండగా ప్రస్తుతం 10 వేలకు తగ్గిపోయనట్లు ‘ఐయూసీఎన్( ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్) తన నివేదికలో పేర్కొంది. అలాగే తన నివేదికలో ఇది అంతరించిపోతున్న జాతుల్లో ఒకటిగా రెడ్‌బుక్‌లో పేర్కొంది. నిశ్శబ్ద జలాల్లోనే నివాసం.. ఈ చేపలు నిశ్శబ్దంగా ఉండే సముద్ర జలాల్లోనే ఉండటానికి ఇష్టపడతాయి. ఎప్పుడైన ఓడలు, బోట్లు ఫ్యాన్లు తగిలితే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. చూస్తే భయంతో వణికిపోయేలా భారీ ఆకారంతో తిమింగలానికి నాలుగు రెట్లు అధికంగా ఉండే వేల్ షార్క్(»ొక్కు సొర) ఎవరికీ ఏ హాని తలపెట్టదు. ఈ చేపలు 13 మీటర్లు(42 అడుగులు) పొడవు, 20 నుంచి 25 మెట్రిక్ టన్నుల బరువుతో భారీ ఆకారంతో ఉంటాయి. ప్రపంచంలోనే అతి పెద్ద చేపగా వేల్షార్క్కు పేరుంది. తీరం నుంచి 50 నుంచి 60 కిలో మీటర్లు (డీప్సీ)దూరంలో సముద్రంలో సుమారు ఐదు కిలోమీటర్ల లోతులో ఇవి ఉంటాయి. సముద్ర ఉపరితలంపై ఎక్కడా కనిపించవు. లోతు జలాల్లో ఉండే అరుదైన జలచరం ఇది. రెండేళ్ల కిందట విశాఖలో ప్రత్యక్షం ఈ చేప చమురు, మాంసం, రెక్కలు, అంతర్జాతీయంగా వాణిజ్య విలువలతో మంచి డిమాండ్ ఉంది. ఉష్ణ మండలం, సమశీతోష్ణ సముద్ర జలాల్లో కనిపిస్తుంటాయి. సేనిగల్ నుంచి గునియా, న్యూయార్క్ నుంచి కరేబియన్, మెక్సికో నుంచి టోంగా, తూర్పు ఆఫ్రికా నుంచి థాయిలాండ్, ఎర్ర సముద్రం, యూఎస్ఏ, అరేబియన్, గల్ఫ్, జపాన్, ఆ్రస్టేలియా, బ్రెజిల్, పిలిపీన్స్ సముద్ర జలాల్లో ఇవి విస్తరించి ఉన్నాయి. దేశంలో గుజరాత్, తమిళనాడు, ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని విశాఖ, నెల్లూరు, ఉప్పాడ, కోనపాపపేట, కాకినాడ కుంభాభిషేకం, భైరవపాలెం తదితర తీరప్రాంతాల్లో వేట సమయంలో సముద్రంలో మత్స్యకారులకు కనిపిస్తుంటాయి. రెండేళ్ల కిందట విశాఖబీచ్కు వచ్చిన బొక్కు సొరను రక్షించి తిరిగి సముద్రంలో విడిచిపెట్టారు. వేల్‌షార్క్ సంరక్షణపై అవగాహన.. గతంలో ఈ చేపలను చూసి భయంతో వేటకు వెళ్లే మత్స్యకారులు చంపేసేవారు. అటవీశాఖ వన్యప్రాణి విభాగం కల్పిస్తోన్న అవగాహనతో తీర ప్రాంతంలో కొంతవరకు సత్ఫలితాలన్నిస్తున్నాయి. తూర్పు తీరంలో పరిరక్షణ కోసం వన్యప్రాణి సంరక్షణ విభాగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. వేల్‌షార్క్ సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా తూర్పు తీరంలోని మత్స్యకార గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం, అవగాహన కార్యక్రమాలు ప్రారంభించి ఈ నెలాఖరు వరకు నిర్వహిస్తోంది. నేరుగా పిల్లలను పెట్టే ఒకే ఒక చేప.. దక్షిణాఫ్రికా తీరంలో మొట్టమొదటిసారి ఈ తిమింగలం సొరను డాక్టర్ ఆండ్రూ స్మిత్ గుర్తించాడు. 70 నుంచి 100 సంవత్సరాల జీవితకాలం కలిగిన ఈ చేపలు లైంగిక పరిపక్వతకు రావడానికి 30 సంవత్సరాలు పడుతుంది. సహజంగా చేపలన్నీ గుడ్లు పెట్టి చేప పిల్లలుగా రూపాంతరం చెందుతాయి. కానీ బొక్కు సొర మాత్రం నేరుగా పిల్లలను పెడుతుంది. అదీ కూడా రెండు, మూడు చేప పిల్లలను మాత్రమే పెట్టడం ప్రత్యేకం. ఇది గుడ్లు పెట్టినా బయటకు రిలీజ్ చేయదు. తన అంతర్భాగంలోనే దాచుకుంటుంది. ఒకేసారి 200–300 గుడ్లు వరకు పెడుతుంది. 2–3 ఏళ్ల అనంతరం నేరుగా పిల్లల రూపంలో బయటకు వదులుతుంది. ప్లైటో ప్లాంటాన్స్ అనే మొక్కలే ఆహారం. సముద్ర కాలుష్యాన్ని తగ్గించడంలో ఈ చేపలు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్లైటో ప్లాంటాన్స్(సృష్టిలో మొదటిగా వచ్చాయి) అనే మొక్కలను పోలిన జీవులను ఆహారంగా తీసుకుంటాయి. ప్లైటో ప్లాంటాన్స్ ఎక్కువగా పెరిగితే సముద్రంలో పైకి తెట్టులా పెరిగిపోయి ఆక్సిజన్ తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఈ బొక్కు సొర దానిని తినడం వల్ల సముద్రంలో ప్లైటో ప్లాంటాన్స్ పెరగకుండా సముద్ర కాలుష్యాన్ని తగ్గిస్తోంది. సముద్రంలోని సూక్ష్మ మృత జీవరాశులు, సముద్రకాలుష్యాన్ని శుద్ధి చేయడంలో ముఖ్య భూమిక పోషిస్తుంటుంది. పులులతో సమాన హోదా... వన్యప్రాణి పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బొక్కు సొర చేపను పరిరక్షిస్తున్నాం. గత కొన్నేళ్లుగా తీర ప్రాంత ప్రజల్లో, మత్స్యకారుల్లో అవగాహన కల్పిస్తున్నాం. అడవుల్లో ఉండే పులులకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో అంతే ప్రాధాన్యం బొక్కు సొరకు ఇస్తున్నాం. బొక్కు సొరను చంపినా, శరీర భాగాలను విక్రయించినా వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సెక్షన్ 50, 51 ప్రకారం ఏడేళ్ల జైలు శిక్ష, అధిక మొత్తంలో జరిమానా విధిస్తాం. – ఎస్ఎస్ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వన్యప్రాణి విభాగం -
ఈ క్యారవాన్‌కు లైసెన్స్ అక్కర్లేదు, నీటిలోనూ సూపర్ స్పీడ్
ఇది రోడ్డు మీద పరుగులు తీసేటప్పుడు వ్యాను. నీటిలో ప్రయాణించేటప్పుడు బోటు. నేల మీదనే కాదు నీటిలోనూ ప్రయాణించగల ఉభయచర వాహనం ఇది. జర్మనీకి చెందిన వాహనాల తయారీ సంస్థ ‘సీల్ వ్యాన్స్’ ఈ విచిత్ర ఉభయచర వాహనాన్ని రూపొందించింది. నేల మీద పరుగులు తీసేటప్పుడు ఇది 50 హార్స్పవర్ హోండా మోటారు సాయంతో పనిచేస్తుంది. నీటిలో ప్రయాణించేటప్పుడు ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇది 4.20 మీటర్ల మోడల్‌లోను, 7.50 మీటర్ల మోడల్‌లోను దొరుకుతుంది. ‘సీల్‌వ్యాన్స్’ 4.20 మీటర్ల వాహనంలో ఇద్దరు ప్రయాణించడానికి వీలవుతుంది. ఇక 7.50 మీటర్ల మోడల్లో ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలు సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. యూరోప్‌లో దీనికి లైసెన్స్ అవసరం లేదు, వాహనబీమా తప్పనిసరి కాదు. నీటిలో ఇది గంటకు 13 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ధర మోడల్‌ను బట్టి 30,500 డాలర్ల (రూ.25.25 లక్షలు) నుంచి 63,800 డాలర్ల (రూ.49.86 లక్షలు) వరకు ఉంటుంది. -
36 కిలోమీటర్లు సముద్రాన్ని ఈదిన మహిళ.. వైరల్ వీడియో
నీళ్లతో ఆడుకోవడం చాలా మందికి సరదా. అందుకే చాలామంది ఈత అంటే ఇష్టపడతారు. అయితే.. ఎంతసేపు ఈత కొట్టగలుగుతారు? ఎంత దూరం ఈద గలుగుతారు? ఓ కిలోమీటర్కూడా కష్టమే కదా! కానీ ఏకంగా 36 కిలోమీటర్లు ఏకబిగిన ఈదిందో మహిళ. అరేబియా సముద్రంలో వర్లీ సీలింక్ నుంచి గేట్‌వే ఆఫ్ ఇండియా వరకు 36 కి.మీ ఈత కొట్టి రికార్డు సృష్టించారు ముంబైకి చెందిన సుచేతా బర్మన్. ఈత వీడియోను ఇన్‌స్ట్రాగామ్‌లో పంచుకున్నారు. ఆ వీడియో ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఆ్రల్టా–మారథాన్ స్విమ్మర్ అయిన సుచేతా దేవ్ బర్మన్.. పోస్ట్ ఇన్‌స్ట్రాగామ్‌లో దాదాపు 4 మిలియన్ల మంది చూశారు. ఆమె సాధించిన విజయాన్ని కొందరు ప్రశంసిస్తుంటే.. మరికొందరు అరేబియా సముద్రంలో ఈతేంటి? అత్యంత కలుషితమైన ఆ నీటిలో ఈత కొట్టడం ప్రమాదాలే ఎక్కువని కామెంట్స్ చేశారు. ఇలాంటి ఇన్ఫ్లూయర్స్మనకు కావాలి, వీళ్లే చాలామందిని ప్రభావితం చేస్తారని మరికొందరు స్ఫూర్తిదాయకంగా రాశారు. ముంబై ట్రాఫిక్ని చూస్తే, ప్రతి ఒక్కరూ ఇలా చేస్తే బెటరేమో అనిపిస్తుందని మరో వినియోగదారు రాశారు. 36 కి.మీ ఈత కొట్టడానికి ఎంత సమయం, పట్టుదల కావాలో నాకు తెలుసంటూ ఓ స్విమ్మర్ వ్యాఖ్యానించారు. ఏదేమైనా.. కొన్ని గంటలపాటు పదుల కిలోమీటర్లు సముద్రంలో ఈదడమంటే మామూలు విషయం కాదుకదా అంటున్నారు. View this post on Instagram A post shared by Sucheta Deb Burman (@suchetadebburman) -
అంతా క్షణాల్లో జరిగిపోయింది.. సముద్రంలోకి జారి పడిన యువతి, చివరికి
ఏ నిమిషానికి ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. అందుకే బయట ప్రాంతాలకు వెళ్లి జాగ్రత్తగా ఉండాలని అంటుంటారు. ఏ మాత్రం ఆజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఇటీవల ఓ యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని బయటపడింది. ఈ ఘటన యూకేలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో కొందరు పీర్ స్లిప్‌వేపై ఆడుకుంటూ ఉంటారు. సముద్ర అలలు వస్తూ పోతూ ఉండగా వారు దాన్ని ఆనందిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి చోట ఆటలే కాదు అజాగ్రతగా ఉన్నా ప్రమాదమే అని తెలియక వాళ్లు అక్కడ గంతులెస్తుంటారు. అకస్మాత్తుగా, ఊహించని విధంగా ఒక బలమైన కెరటం అందులోని ఓ యువతిని తాకింది. దీంతో ఆమె తన బ్యాలెన్స్ కోల్పోయి సముద్రంలోకి వెళ్లిపోయింది. ఒడ్డుకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ కెరటాల ధాటికి యువతి చేరుకోలేకపోతుంది. చివరికి ఆమెను కాపాడేందుకు సముద్రంలో ఎగసిపడుతున్న కెరటాలకు ఎదురెళ్లి ఓ వ్యక్తి బాలికను రక్షించగలిగాడు. ఈ ప్రమాదం నుంచి బయటక పడిన యువతికి స్వల్ప గాయలయ్యాయి. నార్త్ డెవాన్ కౌన్సిల్ అత్యవసర హెచ్చరికతో పాటు ట్విట్టర్లో ఈ వీడియోని షేర్ చేసింది. సముద్రం తీరం వద్ద అధిక ఆటుపోట్లు ఉన్నప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలను కోరింది. "సముద్రంలోని అలలు పరిస్థితులు బట్టి మారుతుంటాయ్.. కొన్ని సార్లు ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయి,. కాబట్టి దయచేసి తీరం వెంబడి జాగ్రత్తగా ఉండాలంటూ సూచించింది. Sea conditions can be changeable and volatile, so please be mindful along the coast. This incident took place at Ilfracombe Harbour on Thursday evening and could have been much more serious were it not for quick-thinking members of the public. pic.twitter.com/TA7r9Itz83 — North Devon Council (@ndevoncouncil) August 8, 2023 -
సరదాగా ఎంజాయ్ చేద్దామని వెళ్తే..చివరికి ఒక్కడే సముద్రంలో..
చావు అంచులదాక వెళ్లి బతికితే మృత్యుంజయుడి అంటాం. కానీ చుట్టూ నీరు కనుచూపు మేరలో ఎవ్వరూ లేకుండా ఒక్కడే 24 గంటలు పైగా గడిపి ప్రాణాలతో బయటపడితే ఏం అనాలో చెప్పండి. వింటేనే వామ్మో అనిపిస్తుంది. బఆశలన్ని వదులుకునే స్థితిలో అదికూడా 24 గంటల పైగా అంటే మాటలు కాదుకదా. అంతటి కష్టాన్ని జయించి చివరి దాక ఆశను వదలక ప్రాణాలతో బయటపడి ఔరా! అనిపించుకున్నాడో ఓవ్యక్తి. ఈ భయానక ఘటన ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..25 ఏళ్ల చార్లెస్ గ్రెగొరీ తన బోట్‌పై శుక్రవారం ఫ్లోరిడా తీరానికి 12 మైళ్ల దూరంలో ప్రయాణిస్తుండగా.. సడెన్‌గా ఓ రాకాసి అల అతని బోట్‌ని గట్టిగా తాకింది. దీంతో ఒక్కసారిగా బోటు మునిగిపోపయింది. దీంతో అతడు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు. ఏకంగా 24 గంటలు పాటు అలానే సముద్రంలో ఒంటరిగా బిక్కుబిక్కమంటూ ఉన్నాడు. ఓ పక్క ఆకలితో ఉన్న సోర చేపలు, జెల్లి ఫిష్‌లు దగ్గర నుంచి వెళ్తుంటే..బతుకుతానా ఆహారమైపోతానా అన్నట్లు భయాందోళలనతో గడిపాడు. శనివారానికి ఓ కోస్ట్‌గార్డ్ గ్రెగోరి పడవ మునిగిపోవడాన్ని గుర్తించి అతన్ని రక్షించి ఒడ్డుకు తీసుకువచ్చి వైద్యసాయం అందించాడు. ఈ మేరకు సదరు కోస్ట్‌గార్డు నిక్ బారో మాట్టాడుతూ.. ఆ వ్యక్తి తల్లిదండ్రుల తమ కుమారుడు పడవతో వెళ్లాక తిరిగి అగస్టిన్‌కి తిరిగి రాకపోవడంతో భయంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో తాము రంగంలోకి దిగి అతన్ని రక్షించినట్లు చెప్పాడు. ఐనా ఇలా ఎప్పుడైనా ఇలా సముద్రంలోకి వెళ్లాలనుకుంటే మాత్రం లైఫ్ జాకెట్, విహెచ్బై మెరైన్ గ్రేడ్ రేడియో, సిగ్నలింగ్ పరికారాలు తోపాటు ఎలాంటి ఆపదలోనైనా చిక్కుకుంటే సమాచారం అందించ గలిగేలా ఎమర్జెన్సీ పర్సనల్ లొకేటర్ బెకన్ని తదితర రక్షణను ఏర్పాటు చేసుకుని వెళ్లాల్సిందిగా హెచ్చరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. #FinalUpdate @USCG crews rescued 25YO Charles Gregory, Saturday, after he went missing on a 12-foot jon boat, 12 miles offshore of #StAugustine, #Florida. Press release: https://t.co/OGaPL6S6nS#USCG #CoastGuard #SAR pic.twitter.com/WezyZHEXB8 — USCGSoutheast (@USCGSoutheast) August 5, 2023 (చదవండి: సింపుల్ ఫుడ్ ఛాలెంజ్! కానీ అంత ఈజీ కాదు!) -
సముద్ర గర్భంలో సంగీత కచేరి!..ఈదుకుంటూ వచ్చి మరీ వింటారట!
ఎన్నో రకాల సంగీత కచేరీల గురించి విని ఉంటారు. నీటి అడుగును ప్రేక్షకులను అలరించేలా మ్యూజిక్ షో నిర్వహించడం గురి విని ఉన్నారా. అదికూడా సముద్రంలోనా! అసలు ఎలా ప్లే చేయగలం. వినేవాళ్లు ఎవర?... ఎవరబ్బా?.. ఇలాంటి మ్యూజిక్ షో నిర్వహించాలనుకున్నారు.. అసలు ఇది ఎక్కడ జరుగుతుంది? ఏంటీ అనే కథ కమామీషు గురించి చూద్దాం! వివరాల్లోకెళ్తే..అమెరికాలోని ఫ్లోరిడాలో అభయారణ్యానికి సుమారు 201 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫ్లోరిడా కీస్ నేషనల్ మైరైన్ శాంక్చురీ ప్రాంతంలోని లూకీ రీఫ్లో ఈ మ్యూజిక్ షో జరుగుతుంది. దీన్ని "లోయర్ కీస్ అండర్‌వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్" అంటారు. ప్రతి ఏడాది ఆగస్టులో నిర్వహిస్తుంటారు. ఎంతోమంది డైవింగ్ చేసుకుంటూ వచ్చి మరీ ఆ మ్యూజిక్ షాలో పాల్గొంటారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు అక్కడి అధికారులు. ఆ సంగీతాన్ని వినేందుకు ఔత్సాహికులు ఈదుకుంటూ వచ్చి మరీ పాల్గొనడం విశేషం. పగడపు దిబ్బలపై పర్యావరణ ప్రభావాలను తగ్గించేలా అవగాహన కల్పించడమే ముఖ్యోద్దేశంగా ఇలా వినూత్న రీతిలో మ్యూజిక్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు ఫ్లోరిడా అధికారులు. ఆ సంగీత కచేరిలో సింగర్స్ 'వాటర్' నేపథ్య సంగీతాన్ని అలపిస్తారు. వాటర్‌ప్రూఫ్ స్పీకర్ల ద్వారా సంగీతం సముద్రంలోకి పైప్ చేస్తారు. అంతేకాదు పగడపు దిబ్బల రక్షణపై అవగాహన కల్పించేలా ప్రతి ఏడాది ఒక్కో థీమ్‌తో ఈ మ్యూజిక్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తారు. చూసేందుకు అవకాశం లేని ప్రజల కోసం ఈ మ్యూజిక్‌ని స్థానిక ఎఫ్ఎం రేడియోస్టేషన్లో కూడా ప్రసారం చేయడం విశేషం. ఈ కార్యక్రమం నాలుగు గంటల పాటు ఆహ్లాదభరితంగా జరుగుతుంది. ఈ పగడపు దిబ్బలను వారంతా సముద్రపు వర్షారణ్యాలు అని పిలుస్తారు. కాగా, ఈ ఏడాది శనివారం జరిగిన 39వ వార్షిక లోయర్ కీస్ అండర్ వాటర్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు డజన్ల కొద్దీ డైవర్లు, స్నార్కెలర్లు హాజరయ్యారు. పర్యావరణంపై స్ప్రుహ కలిగించేలా ఇంతటి సాహసోపేతమైన కార్యక్రమాలు నిర్వహించడం గ్రేట్ కదా!. (చదవండి: అతనో రాజవంశస్తుడు..'గే' కావడంతో..ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి..) -
సముద్రం మధ్యలో టూరిస్ట్ బోటు బోల్తా
-
నెదర్లాండ్స్ నౌకలో భారీ అగ్నిప్రమాదం
ది హేగ్: నెదర్లాండ్స్‌లోని ఉత్తర సముద్రంలో సరుకు రవాణా చేసే ఒక నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో నౌకలో ఉన్న 3 వేల కార్లు దగ్ధమైనట్టు అంచనా. నౌక సిబ్బందిలో ఒకరు మంటల్లో చిక్కుకొని మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు ప్రాణరక్షణ కోసం సముద్రంలో దూకారు. ఆ నౌకలో దట్టంగా పొగ అలుముకోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి 22 మంది నౌకా సిబ్బందిని ఆస్పత్రికి తరలించినట్టుగా డచ్ కోస్ట్‌గార్డ్ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నౌకలో ఉన్న 25 ఎలక్ట్రిక్ కారుల్లో ఒక దానిలో మంటలు చెలరేగడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. జర్మనీలోని బ్రెమర్‌హెవన్ పోర్టు నుంచి ఈజిప్టులో మరో పోర్టుకి ఈ నౌక వెళుతుండగా మంగళవారం రాత్రి అమెలాండ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌకలో మంటలు కొద్ది రోజుల పాటు కొనసాగుతాయని డచ్ కోస్ట్ గార్డ్ అంచనా వేస్తోంది. నౌకకి ఇరువైపులా నీళ్లు పోస్తూ మంటల్ని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల నీళ్లు వేస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు తరలించడం కూడా ఒక ముప్పుగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. -
మిస్టరీ: సముద్రంలో దాగి ఉన్న రహదారి.. ఎప్పటిదో తెలుసా?
కడలి అడుగున పురాతన రహదారి బయటపడింది. క్రొయేషియా తీరానికి ఆవల ఉన్న ఆడ్రియాటిక్ సముద్రగర్భంలో శాస్త్రవేత్తలు ఇటీవల అన్వేషణలు జరుపుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఈ పురాతన రహదారి కనిపించింది. ఇటీవల సముద్రంలో మునిగిపోయిన క్రోయులా దీవిని అనుసంధానిస్తూ ఈ పురాతన రహదారిని నిర్మించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది కొత్తరాతి యుగంలోని మంచుయుగం చివరి రోజులకు చెందినది కావచ్చని, కనీసం ఏడువేల ఏళ్ల కిందట దీనిని నిర్మించి ఉంటారని చెబుతున్నారు. సముద్ర గర్భానికి పదహారు అడుగుల లోతున దీనిని కనుగొన్నారు. జదార్ యూనివర్సిటీకి చెందిన ఆర్కియాలజిస్ట్ మేట్ పారికా నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం సముద్రంలో దాగి ఉన్న ఈ పురాతన రహదారిని కనుగొంది. ఈ రహదారిపై రాతి గొడ్డళ్లు, పలుగులను కార్బన్ డేటింగ్ ద్వారా పరీక్షించి, ఇవి క్రీస్తుపూర్వం 4,900 నాటివని తేల్చారు. వీటిని ఉపయోగించి జంతు బలులు ఇచ్చిన ఆనవాళ్లు కూడా ఇక్కడ లభించాయి. -
‘మత్స్య కన్య’గా మారిన ఇంగ్లీష్ టీచర్.. చూసేందుకు జనం పరుగులు!
ప్రపంచంలో లెక్కకుమించినంతమంది తమ ఉద్యోగాలను అయిష్టంతోనే చేస్తుంటారనే వాదన వినిపిస్తుంటుంది. అయితే వారు తమ హాబీతో ఏమైనా సాధించవచ్చని తపన పడుతుంటారు. అయినా అందుకు తగిన ప్రయత్నాలు చేయరు. కొందరు మాత్రం ఈ ప్రపంచం ఏమనుకున్నా, ఎటుపోయినా తాము అనుకున్నది చేసి చూపిస్తారు. అద్భుతాలు అందిస్తారు. ఇదే కోవలోకి వచ్చే ఒక మహిళ తన హాబీనే తన ఉద్యోగంగా మలచుకుని అత్యధికంగా సంపాదిస్తోంది. ఇందుకోసం ఆమె ఇంతవరకూ చేస్తూ వచ్చిన బోరింగ్ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసింది. మత్స్య కన్యగా మారిన మాస్ గ్రీన్ మాస్ గ్రీన్ అనే యువతి స్కూలులో ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేసేది. అయితే ఇప్పుడామె ‘మత్స్య కన్య’గా మారిపోయింది. ఇది వినేందుకు వింతగా అనిపిస్తుంది. ఆమె ఒక ఫుల్‌టైమ్ ‘రియల్ లైఫ్ మత్స్య కన్య’గా మారేందుకు తన ఉద్యోగాన్ని వదిలివేసింది.యూకేలోని ‘మెట్రో’తో మాట్లాడిన ఆమె ‘మత్స్య కన్య’గా ఉండటం తనకు ఎంతో ఇష్టమైన వ్యాపకమని, తన కెరియర్ మార్చుకున్నాక ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపింది. డెవొన్కు చెందిన 33 ఏళ్ల మాస్ గ్రీన్ ఇంగ్లీషు నేర్చుకునేందుకు 2016లో సిసిలీ వెళ్లింది. మత్స్య కన్యగానే ఎందుకు.. మీడియాతో మాట్లాడిన మాస్ తాను గతంలో ఒక సాగర తీరంలో మత్స్యకన్య మేకప్‌తో ఒక వ్యక్తిని చూశానని, అప్పటి నుంచి తనకు మత్స్యకన్యగా మారాలనే ఆలోచన తరచూ వచ్చేదని తెలిపింది. అయితే అప్పుడు తాను చూసినది ఒక ఇంద్రజాలమని, అయితే తాను నిజంగా మత్స్యకన్యగా మారిపోవాలనుకున్నానని తెలిపింది. ఇది వినేందుకు అందరికీ విచిత్రంగా అనిపిస్తుంది. కానీ దీనిని తాను చేసి చూపించానని మాస్ గర్వంగా తెలిపింది. తనను చూసేందుకు జనం విపరీతంగా రావడం తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని పేర్కొంది. అభిరుచే ఆదాయమార్గంగా మారి.. ‘రియల్ లైఫ్ మత్స్యకన్య’గా మారాక తాను నీటిలో సయ్యాటలాడున్నప్పుడు తన తోక భాగాన్ని చూసి అందరూ ఆనందిస్తారని తెలిపింది. తనకు సముద్రంలో అధిక సమయం గడపడమంటే ఎంతో ఇష్టమని మాస్ తెలిపింది. తాను సముద్రతీర సందర్శనకు వచ్చే పర్యాటకులకు పర్యావరణ పరిరక్షణ గురించి తెలియజేస్తానని పేర్కొంది. మత్స్యకన్యగా మారేందుకు తాను అధిక సమయం ఊపిరి నిలిపివుంచే శిక్షణ పొందానని తెలిపింది. తాను తనకు ఎంతో ఇష్టమైన అభిరుచిని నెరవేర్చుకోవడంతో పాటు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నానని మాస్ గ్రీన్ ఆనందంగా తెలిపింది. ఇది కూడా చదవండి: ఉన్నట్టుండి షాపింగ్ మాల్లో తుపాకీ కాల్పుల మోత.. టెక్సాస్‌లో ఏం జరిగిందంటే.. -
34 ఏళ్లుగా సముద్రంలో తేలాడిన ఆ బాటిల్... ఆమె చేతికి చిక్కడంతో...
కెనడాకు చెందిన ఒక మహిళకు 34 సంవత్సరాల క్రితం నాటి ఒక బాటిల్ సముద్రపు ఒడ్డున దొరికింది. ఆ బాటిల్లోని ఒక కాగితంలో ఒక మెసేజ్ ఉంది. దానిని చదివిన ఆ మహిళ తెగ ఆశ్చర్యపోయింది. ఆ మెసేజ్ ఆధారంగా ఆ మహిళ ఆ బాటిల్ యజమాని కోసం వెదికింది. అప్పుడు ఆమెకు ఒక విషయం తెలియడంతో నిలువునా వణికిపోయింది. పురాతన కాలం నాటి వస్తువు ఏదైనా దొరికితే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. అలాగే ఏదైనా మెసేజ్ లాంటిది ఏదైనా లభ్యమైతే ఇక అప్పుడు కలిగే ఆసక్తికి హద్దులు ఉండవు. కెనడాకు చెందిన ఒక మహిళ విషయంలో ఇదే జరిగింది. షెల్టెర్ అనే మహిళకు సముద్రపు బీచ్‌ను శుభ్రం చేస్తుండగా ఒక వస్తువు దొరికింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. 34 ఏళ్లుగా నీటిపై తేలుతున్న బాటిల్ ఆ మహిళ ఒక బాటిల్ ఫొటోను, ఒక మెసేజ్‌ను షేర్ చేసింది. ఆ మెసేస్‌పై 1989, మే 29 తేదీ ఉంది. అంటే ఆ బాటిల్ 34 ఏళ్ల క్రితం నీటిలో పడవేశారు. అది ఇన్నేళ్లుగా నీటిలో కొన్ని వేల మైళ్లు దూరం వరకూ తేలుతూవస్తోంది. షెల్టెర్ ఆ పోస్టులో ఇలా రాసింది.. ‘నాకు ఎప్పటికై నా ఏదైనా పురాతన వస్తువు దొరుకుతుందని తరచూ అనిపించేంది. ఇప్పుడు అది దొరికింది’ అని పేర్కొంది. బాటిల్లో ఏం మెసేజ్ ఉంది? నిజానికి అ బాటిల్లో ప్రత్యేకమైన ఉద్దేశంతో కూడిన ఎటువంటి మెజేస్ లేదు. అయినా దీనిలో ప్రత్యేకత ఉన్నట్లే కనిపిస్తుంది. దానిలో కొన్ని ఏళ్ల క్రితం నాడు రాసిన మెసేజ్ ..‘ఇది ఒక సన్నీ డే, గాలి వీయడం లేదు’ అని ఉంది. ఎవరో వినోదం కోసం ఈ మెసేజ్ రాసి, దానిని బాటిల్లో ఉంచి, నీటిలో పడవేశారు. ఏదో ఒకరోజు ఎవరికో ఒకరికి ఈ బాటిల్ లభ్యమవుతుందని వారు భావించివుంటారు. బాటిల్ యజమాని ఎవరంటే.. షెల్టెర్ తన ఫేస్బుక్ పోస్టులో ఒక అప్డేట్ కూడా ఇచ్చింది. దానిలో ఆమె తనకు ఈ బాటిల్ యజమాని చిరునామా తెలిసిందని పేర్కొంది. న్యూఫౌండ్ల్యాండ్కి చెందిన గిల్బర్ట్ హేమలిన్ 1989 మే 29న ఈ బాటిల్‌ను తాను ప్రయాణిస్తున్న బోటు నుంచి సముద్రంలోకి విసిరేశారు. దీనిని పోర్ట్ ఓ చోక్స్కు 10 మైళ్ల దూరంలో నీటిలో విసిరివేశారు. ఆ బాటిల్వెనుక భాగంలో ఒక చిరునామా ఉంది. ఆ ప్రాంతం సెయింట్ ఆగస్టాన్ నది, క్యూబెక్‌కు 12 మైళ్ల దూరంలో ఉంది. అక్కడకు వెళ్లిన షెల్టెర్ ఆ బాటిల్ యజమానిని కలుసుకునే ప్రయత్నం చేసింది. అయితే అతను రెండేళ్ల క్రితమే మృతి చెందారని షెల్టెర్కు తెలిసింది. దీంతో ఆమె అతని కుమారునికి ఫోనులో విషయమంతా చెప్పింది. త్వరలోనే ఈ బాటిల్ పంపిస్తానని అతనికి తెలిపింది. ఇది కూడా చదవండి: చైనాలో మరో అద్భుతం: బిల్డింగ్ మధ్య నుంచి దూసుకుపోయే రైలు -
ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన 10 సముద్ర జీవులు
-
అదే ఆరోగ్యానికి కేరాఫ్ అడ్రస్.. 15 వేలమందిపై సర్వే.. ఆసక్తికర వివరాలు వెల్లడి!
మనిషి ప్రకృతికి ఎంత దగ్గరగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటాడని చెబుతారు. శాంతియుతంగా జీవించాలన్నా, ఆనందంగా ఉండాలన్నా ఇదే ఉత్తమ మార్గమని పరిశోధకులు, నిపుణులు కూడా చెబుతుంటారు. ఈ సలహాలు, సూచనల నేపధ్యంలోనే చాలామంది ప్రకృతితో మమేకమై జీవించాలనుకుంటారు. తాజాగా పరిశోధకులు ఈ అంశానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలిపారు. సముద్రతీరంలో నివసించేవారు అరోగ్యంగా ఉంటారని వారు పేర్కొన్నారు. ‘కమ్యూనికేషన్ అర్త్ అండ్ ఎన్విరాన్మెంట్’లో ప్రచురితమైన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనాన్ని యూనివర్శిటీ ఆఫ్ వియానాకు చెందిన ఎన్విరాన్మెంటల్ సైకాలజీ గ్రూప్ చేపట్టింది. ఈ బృందానికి సాండ్రా జోయిగర్ సారధ్యం వహించారు. సముద్రతీరం మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని ఈ అధ్యయనంలో పేర్కొన్నారు. అందుకే మనుషులు సాగరతీరంలో కాలం గడిపేందుకు ప్రయత్నించాలని సూచించారు. చాలా దేశాలు సముద్రతీరం వెంబడి ఉన్నాయని, సాగరతీర ప్రాంతాల్లో ఉన్నవారు మిగిలినవారికన్నా ఆరోగ్యంగా ఉంటున్నట్లు తేలిందన్నారు. పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం 1660వ సంవత్సరంలోనే దీనిపై పరిశోధనలు ప్రారంభమయ్యాయన్నారు. ఆ కాలంలో ఆంగ్ల ఫిజీషియన్లు తమ దగ్గరకు వచ్చేవారికి సముద్ర స్నానం చేయాలని, సముద్రతీరంలో నడవాలని సూచించేవారు. ఈ దిశగా ప్రోత్సహించేవారు. అలాగే 19వ శతాబ్ధపు మధ్యభాగంలో యూరప్‌కు చెందిన ధనవంతులు సముద్ర తీరంలో సేదతీరేందుకు తహతహలాడిపోయేవారు. 20వ శతాబ్ధంలో ఈ దిశగా జనం ఆసక్తి తగ్గింది. అయితే ఇప్పుడు తాజాగా పరిశోధకులు సముద్రతీరప్రాంతంలో పర్యటించడం ఆరోగ్యకరమని చెబుతున్నారు. ఈ అధ్యయనంలో భాగంగా పరిశోధనకులు సముద్రతీర ప్రాంతాల్లో నివసించే 15 వేల జనాభా ఆరోగ్యంపై సర్వేచేశారు. దీనిని క్రోడీకరించి సముద్రతీరంలో నివాసం ఉండటం ఎంతో లాభదాయకమని తేల్చిచెప్పారు. -
ఆలివ్ రిడ్లే.. సముద్రంలోకి వెడలె
సాక్షి, అమరావతి: ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ చర్యల్లో భాగంగా ట్రీ ఫౌండేషన్, రాష్ట్ర అటవీ శాఖ రాష్ట్రంలోని సముద్ర తీరప్రాంతం వెంబడి ఈ ఏడాదిలో ఇప్పటివరకు 3,036 తాబేళ్ల గూళ్లను రక్షించాయి. ఆ గూళ్లలో 3.41 లక్షల గుడ్లను కాపాడగా.. వాటినుంచి 2.39 లక్షల తాబేళ్ల పిల్లలు పుట్టుకొచ్చాయి. వాటన్నిటినీ సముద్రంలోకి వదిలారు. శ్రీకాకుళం, విజయ నగరం, కృష్ణా, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, సూళ్లూరుపేట జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 23న అంతర్జాతీయ తాబేళ్ల దినోత్సవం సందర్భంగా అటవీ శాఖ ఈ వివరాలను విడుదల చేసింది. ట్రీ ఫౌండేషన్ అటవీ శాఖతో కలిసి గత 16 సంవత్సరాలుగా సముద్ర తాబేళ్ల రక్షణ, సముద్ర జీవ సంరక్షణలో పాలుపంచుకుంటోంది. ఈ 16 సంవత్సరాల్లో ఇప్పటివరకు 33.68 లక్షలకు పైగా సముద్ర తాబేలు పిల్లలను సముద్రంలో వదిలారు. వేల కిలోమీటర్లు ప్రయాణించి.. ఆగ్నేయ సముద్ర తీర ప్రాంతంలోని ఒడిశా, ఆంధ్రా ప్రాంతాలు ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లు గుడ్లు పెట్టడానికి అనువైనవి. ఏటా ఈ తీరాల్లో గుడ్లు పెట్టేందుకు వేల తాబేళ్లు సముద్రంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ తీరానికి వచ్చి గుడ్లు పెడతాయి. తీరంలో గుడ్లు పెట్టిన తాబేళ్లు వెళ్లిపోయాక.. ఆ గూళ్లు ప్రమాదంలో పడుతున్నాయి. అందుకే చాలా సంవత్సరాలుగా ట్రీ ఫౌండేషన్ వంటి సంస్థలు అటవీ శాఖతో కలిసి వాటి సంరక్షణకు నడుం బిగించాయి. వెయ్యి తాబేళ్లలో ఒకటే.. ప్రతి ఆడ తాబేలు ఒక సీజన్లో (డిసెంబర్ నుంచి మార్చి) రెండుసార్లు గుడ్లు పెట్టడానికి సముద్రం నుంచి తీర ప్రాంతానికి వస్తుంది. గుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి 48 నుంచి 60 రోజులు పడుతుంది. ఉష్ణోగ్రత 25 నుంచి 30 డిగ్రీలుంటే.. మగ పిల్లలు, 30 నుంచి 35 డిగ్రీలుంటే ఆడ పిల్లలు జన్మిస్తాయి. గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లు నక్షత్రాలు, చంద్రుడి వెలుతురు ఆధారంగా సముద్రంలోకి చేరుకుంటాయి. పిల్ల తాబేళ్లకు బొడ్డు దగ్గర యోక్ సాక్ (పచ్చసొనలా) ఉంటుంది. దీని ద్వారానే పిల్ల తాబేళ్లకు 48 గంటల వరకు పోషకాహారం అందుతుంది. అందుకే గుడ్డు నుంచి బయటకు వచ్చిన పిల్ల తాబేళ్లను వెంటనే సముద్రం తీరంలో విడిచిపెట్టాలి. ఈ పనిని చాలాకాలంగా మేం చేస్తున్నాం. పుట్టిన తాబేళ్లకు వాటి మెదడు కణాల చూట్టూ మేగ్నటైట్ సెల్స్ ఉంటాయి. ఇవి వాటికి జీపీఎస్‌లా ఉపయోగపడతాయి. అందుకే ఆడ తాబేళ్లు 12 నుంచి 15 సంవత్సరాలకు అవి పుట్టిన తీరానికి గుడ్లు పెట్టడానికి వస్తాయి. వెయ్యి తాబేలు పిల్లలు సముద్రంలోకి వెళితే గుడ్లు పెట్టే సమయానికి ఒకే ఒక తాబేలు మాత్రమే మిగులుతుంది. మిగిలిన 999 పిల్లలు పెద్ద చేపలకు ఆహారమైపోతాయి. – డాక్టర్ సుప్రజ ధారిని, ఛైర్పర్సన్, ట్రీ ఫౌండేషన్ -
హైదరాబాద్ లో సముద్రం ఎక్స్ పీరియన్స్
-
మే రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా
సాక్షి, అమరావతి: రెండునెలల విరామం కోసం బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. చేపల పునరుత్పత్తి కోసం సముద్రంలో 61 రోజుల పాటు అమలు చేయనున్న వేట నిషేధం శనివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుంది. వేట నిషేధాన్ని పక్కాగా అమలు చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం వచ్చేనెల రెండోవారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా (వేటనిషేధ భృతి) పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. వేట విరామాన్ని ఉల్లంఘించిన వారి బోట్లను సీజ్ చేయడమేగాక సంక్షేమ పథకాలు కట్ చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో తడ మొదలు ఇచ్ఛాపురం వరకు 974 కిలోమీటర్ల మేర విస్తరించిన సముద్రతీరంలో 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మత్స్యకార కుటుంబాలున్నాయి. వీటిలో 1.60 లక్షల కుటుంబాలు వేటపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా పెరుగుతున్న బోట్లు డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచడంతో ఏటా వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. మొత్తం బోట్ల సంఖ్య 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య ఏకంగా 29,964కు చేరింది. వీటిలో 1,610 మెకనైజ్డ్, 22,011 మోటరైజ్డ్, 6,343 సంప్రదాయ బోట్లున్నాయి. వీటిపై వేట సాగించే మత్స్యకార కుటుంబాలకు వేట విరామ సమయంలో రూ.4 వేల చొప్పున ఇచ్చే వేటనిషేధ భృతిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రూ.10 వేలకు పెంచింది. పైగా ఈ మొత్తాన్ని నిషేధకాలం ముగియకుండానే బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేస్తూ గంగపుత్రులకు అండగా నిలుస్తోంది. టీడీపీ ఐదేళ్లలో 3 లక్షల మందికి రూ.104.62 కోట్ల భృతిని అందించగా, గడిచిన 4 ఏళ్లలో ఈ ప్రభుత్వం 4.14 లక్షల మందికి రూ.414.49 కోట్ల భృతిని అందించింది. అదేరీతిలో ఈ ఏడాది కూడా మే రెండో వారంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా అందజేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అర్హుల గుర్తింపునకు బృందాలు ఆర్బీకేల్లో పనిచేసే గ్రామ మత్స్య సహాయకునితో పాటు వలంటీర్, సాగరమిత్రలతో ఏర్పాటు చేసిన బృందాలతో ఈ నెల 17వ తేదీన లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ చేపట్టనుంది. ఆరోజు తీరంలో లంగరేసిన బోట్లను ఈ బృందాలు పరిశీలించి వివరాలు నమోదు చేస్తాయి. గుర్తింపు సమయంలో బోటు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, ఫిషింగ్ లైసెన్సు, ఆధార్, రైస్‌కార్డుతోపాటు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. 18వ తేదీ గ్రామ సచివాలయ డిపార్టుమెంట్ రూపొందించే సాప్ట్‌వేర్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ డేటా ఆధారంగా ఆరుదశల వెరిఫికేషన్ తర్వాత అర్హుల జాబితాలను సామాజిక తనిఖీకి ఆర్బీకేల్లో ప్రదర్శిస్తారు. అనర్హత పొందిన వారి నుంచి అభ్యంతరాలు స్వీకరించి క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హత ఉంటే జాబితాల్లో చేర్చి తుది జాబితాలను సిద్ధం చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియ ఈ నెలాఖరులోగా పూర్తిచేసేందుకు మత్స్యశాఖ ఏర్పాట్లు చేసింది. అర్హులు వీరే.. ♦ 18 మీటర్లకుపైన పొడవు ఉండే మెకనైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా 10 మంది, 18 మీటర్ల లోపులో ఉండే మోటరైజ్డ్ బోట్లకు యజమాని కాకుండా ఎనిమిదిమంది, ఇతర మోటరైజ్డ్ బోట్లకు యజమానితో కలిపి ఆరుగురు, సంప్రదాయ, నాన్ మోటరైజ్డ్ బోట్లకు యజమానితో సహా ముగ్గురు చొప్పున అర్హులు. ♦ వయసు 18–60 ఏళ్ల మధ్య ఉండాలి. ♦ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, అర్బన్ ప్రాంతాల్లో 1.44 లక్షలలోపు ఉండాలి. ♦ సంక్షేమ పథకాలు పొందినవారు, మత్స్యకార పింఛన్ పొందుతున్నవారు, కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలు చేస్తున్నవారు. 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట, లేదా రెండు కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉండకూడదు. ♦ అర్బన్ ప్రాంతాల్లో కనీసం వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇల్లు ఉండకూడదు. ఆదాయపన్ను చెల్లింపుదారులై ఉండకూడదు. -
కాంతులీనుతున్న సాగరతీరం.. రాత్రి వేళ నీలిరంగులోకి భీమిలి బీచ్
సాక్షి, విశాఖపట్నం: సాగరతీర అందాలకు స్వర్గధామంగా ఉన్న విశాఖలో ఇప్పుడు మరో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పగలంతా అలల సవ్వడితో పర్యాటకులను అలరిస్తున్న భీమిలి బీచ్.. వారం రోజులుగా రాత్రి సమయంలో నీలివర్ణంతో కాంతులీనుతూ కనువిందు చేస్తోంది. బయోలుమినిసెంట్ తరంగాల కారణంగా అలల పొంగులో కాంతి వెదజల్లుతుండటంతో పర్యాటకులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. వారం రోజుల కిందట భీమిలి బీచ్ వద్ద పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆహ్లాదకరంగా కనిపించే సాగరతీరం... రాత్రి సమయంలో నీలివర్ణంలో వెలిగిపోతోంది. మొదట్లో ఏమవుతుందో అర్థంకాక పర్యాటకులు ఆందోళనకు గురయ్యారు. కానీ.. నీలి అలలు ఎగసిపడుతుంటే.. క్రమంగా వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ ప్రాంతంలో ముందెన్నడూ చూడని అద్భుతమైన సహజసిద్ధ సముద్ర అందాలను చూసి పులకించిపోతున్నారు. మరోవైపు సముద్రంలో ఏదో జరిగిందంటూ కొందరు ఆందోళన చెందుతున్నారు. బయోలుమినిసెంట్ కారణంగా... బీచ్‌లో ఈ తరహా మార్పులు చూసేందుకు ఆహ్లాదకరంగా ఉన్నా... ఒకింత ఆందోళన కూడా కలిగిస్తోందని నిపుణులు చెబుతున్నారు. ఫైటో ప్లాంక్టన్ అని పిలిచే చిన్నచిన్న సముద్ర జీవులు విడుదల చేసిన రసాయనాల కారణంగా ప్రకాశవంతమైన నీలి కాంతి విడుదలవుతుంది. దీంతో బయోలుమినిసెంట్ తరంగాలు ఏర్పడుతున్నాయి. అయితే, సముద్రంలోని అతి సూక్ష్మ నీలి, ఆకుపచ్చ శైవలాలే (ఆల్గే) భీమిలి బీచ్ నీలివర్ణంలో మెరిసిపోవడానికి కారణమని నిపుణులు వివరిస్తున్నారు. కొన్నిరకాల ఆల్గేల వల్ల బీచ్‌లు ఆకుపచ్చ వర్ణంలోనూ మెరుస్తుంటాయని, నీటిలో పోషకాలు పుష్కలంగా ఉన్నంతవరకూ బీచ్ ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఎక్కువ రోజులు ఉంటే ఆందోళనకరమే... దేశంలో ఈ విధంగా బీచ్‌లు తళుక్కున మెరిసిపోవడం కొత్తేమీ కాదు. లక్షదీవులు, అండమాన్ నికోబార్ దీవుల్లోని హేవ్‌లాక్ ద్వీపం, రాధానగర్ బీచ్, మహారాష్ట్రలోని కొంకణ్ తీరం, మాల్దీవుల్లోని వాధూ ద్వీపంతోపాటు చెన్నైలోని మెరీనా బీచ్లోనూ కొన్నిసార్లు ఈ తరహా బయోలుమినిసెన్స్ కనిపించింది. ఈ గ్లో–ఇన్–డార్క్కు కారణమైన ఆల్గేలు భారీగా ఉంటే చాలా ఆక్సిజన్‌ను తీసుకుంటాయి. దీనివల్ల సముద్రంలో ఆక్సిజన్ కొరత రావొచ్చు. ఎక్కువ పోషకాలు, వ్యర్థాలు ఉన్నచోట ఈ ఆల్గే పోగుపడుతుంది. ఎక్కువ రోజులు ఈ నీలి మెరుపులు ఉంటే ఆ ప్రాంతంలోని సముద్ర జలాల్లో ఆక్సిజన్ తగ్గి సాగరజలాల్లోని జీవరాశులకు కాస్త ప్రమాదకరమైన వాతావరణం ఏర్పడుతుందనే ఆందోళన కూడా ఉంది. ఏది ఏమైనా... భీమిలి బీచ్‌లో ఈ తరహా అద్భుతం మాత్రం ఆహ్వానించదగిన పరిణామం. – సాయి కిరణ్, వాతావరణ నిపుణుడు -
సముద్రాన్నే నివాసంగా..నీటి అడుగున 100 రోజులు జీవించనున్న మనిషి
పురాణాల్లో వింటుంటాం సముద్రాల్లో నీటి అడుగున జీవించే మనుషుల గురించి. అంతేందుకు మహాభారతంలో దుర్యోధనడు నీటి అడుగున్న ధ్యానం చేయగల ధీరుడని విన్నాం. అవన్నీ వినడమే గానీ నిజంగా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మాములుగా ఓడల్లో సముద్ర ప్రయాణాలు రోజుల తరబడి జరిగినప్పటికీ అది నీటిపైనే కానీ అడుగున కాదు. ఐతే నీటి అడుగున జీవించగలమా అక్కడ పరిస్థితులను మన శరీరీం తట్టుకోగలదా అనే దానిపై చాలా సందేహాలు శాస్తవేత్తలను మదిలో ప్రశ్నలుగా మిగిలాయి. ఈ నేపథ్యంలోనే ఎలాగైన వాటి గురించి తెలుసుకోవాలనే కుతూహలంతో ఫ్లోరిడాకు చెందిన ప్రోఫెసర్ జో డిటూరి ఒక అసాధారణమైన ప్రయోగానికి నాంది పలికారు. బయో మెడికల్ ఇంజనీరింగ్ పీహెచ్డీ చేసిన డిటూరి అనేక వ్యాధులను నివారించగల మెడికల్ టెక్నాలజీపై కూడా పలు పరిశోధనలు చేశారు. ఈ మేరకు ఆయన సముద్రాన్ని మూడు నెలలపాటు తన నివాసంగా మార్చుకున్నాడు. అతను సముద్రంలోని 30 అడుగుల లోతుల్లో 100 రోజులు జీవించే ప్రయాగాన్ని నిర్వహించాడు. ఈ ప్రయోగానికి నెఫ్ట్యూన్ 100 అని పేరు పెట్టాడు. ఈ ప్రయోగం కోసం రిటైర్డ్ యూఎస్ నేవీ కమాండర్ ప్రోఫెసర్‌గా ఎంచుకున్నాడు. పనిలో పనిగా మనస్తత్వ వేత్త ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తాడు. అంతరిక్ష పర్యాటనకు సమానమైన వాతావరణంలో ఉన్నప్పుడూ మనిషి మానసిక స్థితి, ప్రభావాలు ఎలా ఉంటాయనేద దానిపై వారు పర్యవేక్షిస్తారు. ఈ ప్రయోగం సక్స్స్ అయితే భూమిపై అనుభవించిన ఒత్తిడికి 1.6 రెట్ల ఒత్తిడిని అధిగమించి బతికిబట్టగట్ట గలిగితే ప్రపంచ రికార్డుగా నిలుస్తుంది. వాస్తవానికి మానవ శరీరం నీటి అడుగున ఇంత కాలం ఉండలేదని ప్రోఫెసర్ డిటూరి అన్నారు. కాబట్టి నా శరీరం ఏమౌవుతోందో అనేది అధ్యయనాలకు ముఖ్య భూమికగా ఉపయోగపడుతుంది. అలాగే నా శరీరాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశం పరిశోధనకు ఉపకరిస్తుంది. ఒకవేళ నీటి అడుగున ఒత్తిడిని ఎదుర్కొనగలిగితే తన ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశాలు ఉంటయని చెబుతున్నారు. ఈ మేరకు డిటూరి ఈప్రయోగాన్ని మార్చి1న ప్రారంభించారు. ఐతే తాను సూపర్ హ్యుమన్‌గా బయటకు వస్తానో లేదో అనేది కాస్త సందేహంగానే ఉందన్నారు. View this post on Instagram A post shared by Joe Dituri (@drdeepsea) (చదవండి: ఇమ్రాన్ ఖాన్ ఇలా కోర్టుకి వెళ్లగానే..అలా ఇంట్లోకి పోలీసులు ఎంట్రీ..) -
వేటకు వేళాయె..రా!
సాక్షి, అమలాపురం/ఉప్పలగుప్తం: విస్తారమైన సముద్ర తీరం.. అపారమైన మత్స్యసంపద.. వేటలో సిద్ధహస్తులైన మత్స్యకారులకు కోనసీమ సముద్ర తీరం మత్స్య సంపదకు అక్షయపాత్రే. అందుకే స్థానిక మత్స్యకారులతోపాటు వేటలో నిష్ణాతులైన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతానికి చెందిన అనేకమంది మత్స్యకారులు కుటుంబాలతో ఇక్కడకు వలస వచ్చి వేటను సాగిస్తుంటారు. ఏటా ఎనిమిది నెలల పాటు ఇక్కడి తీరంలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటుచేసుకుని జీవనం సాగిస్తున్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సముద్ర తీరాన్ని ఆనుకుని పలు మత్స్యకార గ్రామాలున్నాయి. కాట్రేనికోన మండలం పల్లం, చిర్రయానాం, ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్ప, అల్లవరం మండలం నక్కా రామేశ్వరం, మలికిపురం మండలం తూర్పుపాలెం వద్ద సముద్రతీరం గట్టు మీద పదుల సంఖ్యలో గుడిసెలతో చిన్నచిన్న గ్రామాలు కనిపిస్తుంటాయి. అంతమాత్రాన ఇవి రెవెన్యూ రికార్డుల్లో నమోదైన గ్రామాలు కాదు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి పరిసర ప్రాంతాల నుంచి వేట కోసం ఇక్కడకు వలస వచ్చిన మత్స్యకారుల ఆవాసాలు. ఒక విధంగా ఇవి ‘వలస’ గ్రామాల కింద లెక్క. పూరి గుడిసెలు, రేకుల షెడ్లలో నివాసం. వినాయక చవితి తరువాత మత్స్యకారులు నక్కపల్లి నుంచి నేరుగా బోట్ల మీద తాము నివాసముండే ప్రాంతాలకు కుటుంబాలతో సహా వస్తారు. అప్పటి నుంచి మేలో సముద్ర వేట నిషేధం విధించే వరకు ఎనిమిది నెలలపాటు ఇక్కడే నివాసముంటారు. ఆదివారం నుంచి శుక్రవారం వరకు సముద్ర వేటకు వెళ్లడం.. శనివారం వేటకు సెలవు పెట్టి స్థానికంగా మార్కెట్ పనులు చూసుకోవడం వీరి దినచర్య. గడిచిన 25 ఏళ్లుగా మత్స్యకారులు ఇక్కడకు వలస వస్తుండడం గమనార్హం. కోనసీమకు ఎందుకు వలస అంటే.. గోదావరి నదీపాయలతోపాటు ప్రధాన మురుగునీటి కాలువలు మొగల ద్వారా సముద్రంలో కలుస్తాయి. సముద్ర ఉప్పునీటిలో మొగల ద్వారా చప్పనీరు వివిధ మార్గాల ద్వారా పెద్దఎత్తున చేరడంవల్ల ఈ తీరంలో మత్స్యసంపద అధికంగా దొరుకుతుంది. నక్కపల్లి తీరం కన్నా కోనసీమ తీరంలోనే మత్స్య సంపద అధికంగా దొరుకుతుందని వీరు చెబుతుంటారు. పండుగప్ప, చందువా, కొయ్యింగ, బొమ్మిడి చుక్క, గులిగింత, మడ పీత, చుక్కపీత, టైగర్ రొయ్యలు, జెల్లలు, ఇసుక దొందులు, టేకు చేపలతోపాటు అత్యంత ఖరీదైన ‘కచ్చిడి చేప’లు కూడా దొరుకుతాయి. కచ్చిడి చేప ఖరీదు రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు ఉంటోంది. స్థానిక మత్స్యకారుల ఎదురు పెట్టుబడి వలస మత్స్యకారులకు స్థానిక మత్స్యకార వ్యాపారులు ఎదురు పెట్టుబడి పెడతారు. సీజన్‌లోని ఎనిమిది నెలలకు గాను బోటుకు వచ్చి రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు చెల్లిస్తారు. వలస మత్స్యకారులు వేటాడి తెచ్చిన మత్స్య సంపద ద్వారా వచ్చిన ఆదాయంలో పదిశాతం ఈ వ్యాపారులు తిరిగి తీసుకుంటారు. తెల్లవారుజాము నుంచే వేట.. నిజానికి.. ఈ మత్స్యకారులు తెల్లవారుజామునే బృందాలుగా బోటు మీద వేటకు బయల్దేరుతారు. మధ్యాహ్నం ఒంటి గంట, రెండు మధ్య వేట నుంచి తిరిగి వస్తారు. మత్స్య సంపదకు తీరాన్ని ఆనుకునే వేలం నిర్వహిస్తారు. గులిగింత, ఎర్ర గులిగింత, కచిడి, కూనాలు, పండుగప్ప, చందువాలు ఇటు చెన్నై, అటు కోల్‌కతా, హైదరాబాద్ మార్కెట్లకు ఎగుమతి అవుతుంటాయి. మిగిలిపోయిన చేపలను మత్స్యకార మహిళలు ఎండబెట్టి ఎండుచేపలుగా తయారుచేస్తారు. వేటకు వెళ్లే బోటుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విలువ చేసే మత్స్య సంపద వస్తోంది. ఏటా క్రమం తప్పకుండా.. మా ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీల కాలుష్యంవల్ల కొన్నేళ్లుగా వేట గిట్టుబాటు కావడంలేదు. ఇక్కడ మాకు వేటకు వెళ్లడానికి పడవలు గట్టుపై పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మత్స్య సంపద మా ప్రాంతంలో కన్నా ఇక్కడ ఎక్కువ. – దోని చిన్నా, వేంపాడు గ్రామం, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మత్స్య సంపద ఎక్కువ ఈ జిల్లాలో గోదావరి పాయలు ఎక్కువ. చప్పనీరు, ఉప్పునీరు కలిసే చోట మత్స్య సంపద ఎక్కువగా ఉంటుంది. మా ప్రాంతం కన్నా ఇక్కడ రెట్టింపు ఆదాయం వస్తోంది. 8 నెలలు ఇక్కడే ఉంటాం. – సోడిపల్లి అప్పలరాజు, రాజయ్యపేట, నక్కపల్లి మండలం, అనకాపల్లి జిల్లా మేం పెట్టుబడి పెడతాం నాకు సొంతంగా రెండు బోట్లు ఉన్నాయి. అనకాపల్లి జిల్లా నుండి వేట నిమిత్తం ఈ ప్రాంతానికి వస్తున్న మత్స్యకారులకు మేం పెట్టుబడి పెడతాం. వేటలో వచ్చే ఆదాయంలో 10% మాకు ఇవ్వాలి. వారికి ఎటువంటి కష్టం వచ్చినా అండగా ఉంటాం. – బొమ్మిడి రాంబాబు, వ్యాపారి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా -
కరీబియన్ దీవి కారుచౌక
ఫొటోలో కనిపిస్తున్నది కరీబియన్ సముద్రంలోని దీవి. దక్షిణ అమెరికా దేశం నికరగ్వా తీరానికి ఆవల పన్నెండు మైళ్ల దూరంలో ఉందిది. చుట్టూ నీలి కడలి, నడి మధ్యన పచ్చదనంతో అలరారే ఈ ప్రైవేటు దీవి పేరు ‘ఇగ్వానా దీవి’. ఐదెకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ దీవిలో అధునాతన సౌకర్యాలు చాలానే ఉన్నాయి. ఇరవై ఎనిమిది అడుగుల ఎత్తున ఉన్న అబ్జర్వేటరీ టవర్‌తో కూడిన ఒక మూడు పడకగదుల ఇల్లు, దీవి పడమటి వైపున చక్కని ఈతకొలను, వైఫై, మొబైల్, టీవీ తదితర సౌకర్యాలు, చుట్టూ ఎటుచూసినా పచ్చని అరటి, కొబ్బరిచెట్లతో ఉన్న ఈ దీవి ప్రస్తుతం అమ్మకానికి సిద్ధంగా ఉంది. దీని ధర 3.76 లక్షల పౌండ్లు మాత్రమే! లండన్ నగరంలోని ఒక సామాన్యమైన ఫ్లాట్ ధర కంటే ఇది చాలా చౌక. దీనిని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి మరి! -
సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు.. ఆహా అనిపించేలా నగరం!
ఇప్పటి వరకు మనకు జలాంతర్గాముల గురించి తెలుసు. ఇకపై జలాంతర నగరాలు కూడా సముద్ర గర్భంలో వెలిసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రెజిల్‌లోని రియో డి జనీరో తీరానికి ఆవల సముద్ర గర్భంలో తొలి జలాంతర నగరం నిర్మాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ఖ్యాతి పొందిన బెల్జియన్ డిజైనర్, ఆర్కిటెక్ట్ విన్సెంట్ కాలెబాట్ ఈ జలాంతర నగరానికి రూపకల్పన చేశారు. ఇరవైవేల మందికి నివాసం కల్పించేలా వెయ్యి టవర్లతో ‘ఆక్వారియా’ పేరిట ఈ జలాంతర నగరాన్ని నిర్మించనున్నారు. సముద్రంలో వెయ్యి మీటర్ల లోతు వరకు విస్తరించేలా ఈ జలాంతర నగర నిర్మాణాన్ని తలపెట్టారు. సముద్ర జలాల్లో కలిసిపోయి, కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోలియం వ్యర్థాలను నిర్మూలించే లక్ష్యంతో ఈ నిర్మాణాన్ని తలపెట్టారు. త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి, అంటార్కిటికా వద్ద పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, సముద్రపు నాచు వంటి పదార్థాలతో ఈ నగరాన్ని నిర్మించనున్నట్లు చెబుతున్నారు. -
సముద్రంలో ఛేజింగ్ సీన్
-
వైరల్ వీడియో: పూల్ క్లీనర్‌కు సహాయం చేస్తున్న చిన్న సముద్రపు ఒట్టర్
-
Viral Video: సముద్రంలో చేపను ఒడిసి పట్టుకున్న గ్రద్ద..
-
విషాదం నింపిన పుట్టిన రోజు వేడుక
సాక్షి, హైదరాబాద్: స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు ఉత్సాహంగా జరుపుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. చెన్నై ప్రాంతంలోని ఐఐటీలో ఉన్నత చదువు చదువుకునేందుకు వెళ్లి పుట్టిన రోజు నాడే తనువు చాలించడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బౌద్ధనగర్‌కు చెందిన గంజి ఉమాపతి, భాగ్యలక్ష్మి దంపమతులకు కుమారుడు నితిన్ (21), ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు నితిన్ దార్వాడిలోని ఐఐటీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 23న శుక్రవారం నితిన్ పుట్టిన రోజు కావడంతో మహాబలిపురంలో సముద్ర స్నానానికి స్నేహితులతో కలిసి వెళ్లారు. సముద్రస్నానం చేస్తుండగా నితిన్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు సముద్రం లోపలికి వెళ్లగా బలమైన అలలు రావడంతో సముద్రం లోపలికి కొట్టుకుని పోయారు. ఇద్దరు స్నేహితులు ఎలాగో బయటపడగా నితిన్ మాత్రం శవమై బయటకు వచ్చాడు. స్థానిక పోలీసులు వచ్చి మృతదేహాన్ని శంగర్‌పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం ఉదయం బౌద్ధనగర్‌కు తీసుకుని వచ్చారు. కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు.. చెట్టంత కొడుకు త్వరలోనే ప్రయోజకుడై వస్తాడని ఎదురు చూస్తుండగా శవమై ఇంటికి రావడంతో వారి బాధ వర్ణనాతీతం. మధ్యాహ్నం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బీజేపీ సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు రవిప్రసాద్‌గౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు నరేందర్, దేవదాసు, భాస్కర్, నవీన్, శ్రీకాంత్‌లు మృతుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చదవండి: ఆత్మహత్య చేసుకోవడం ఎలా? నటిస్తూ.. పాఠశాల విద్యార్థి మృతి -
రోబో రక్షిస్తుంది
డాబాగార్డెన్స్(విశాఖ దక్షిణ): సముద్రంలో ప్రమాదవశాత్తూ మునిగిపోతున్న వారిని క్షణాల్లో రక్షించేందుకు రోబో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే తొలిసారిగా వైజాగ్ సేఫ్ సంస్థ ‘లైఫ్ బాయ్’ పేరుతో ఈ రోబోను రూపొందించింది. దీనిని ఇటీవల నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి, కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ ప్రారంభించారు. ఈ రోబో పూర్తిగా బోటు తరహాలోనే పనిచేస్తుంది. ఒకేసారి ముగ్గురిని కాపాడనుంది. సెకనుకు 7 మీటర్ల వేగంతో 600 మీటర్ల వరకు పనిచేస్తుంది. ఈ రోబో ధర రూ.5.50 లక్షలు కాగా, వీటిని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో ఉంచేందుకు ఐదు యంత్రాలను ప్రభుత్వ అనుమతితో కొనుగోలు చేయనున్నారు. అలలపై దూసుకుపోతున్న రోబో -
షాకింగ్ ఘటన.. నాన్నను కాపాడేందుకు వెళ్లి..
తొండంగి(కాకినాడ జిల్లా): సముద్రంలో గల్లంతైన తన తండ్రిని కాపాడేందుకు వెళ్లిన ఆ యువకుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. మండలంలోని పెరుమాళ్లపురం పంచాయతీ కొత్తచోడిపల్లిపేట సముద్రతీరంలో గురువారం వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పెరుమాళ్లపురం పాత చోడిపల్లిపేటకు చెందిన యదాల వరహాలు (30), చింతకాయలపేటకు చెందిన పిట్ల శ్రీను (28) వినాయక నిమజ్జనంలో భాగంగా సముద్రంలో స్నానానికి దిగారు. స్నానం చేస్తూ మొత్తం పది మంది గల్లంతవ్వగా స్థానిక మత్స్యకారులు శ్రీలం కొండబాబు, యాదాల సుబ్రహ్మణ్యం, కడారి రామారావు, కడారి రాంబాబు, పేకేటి యతిమాని, కడారి రమణలతో పాటు మరో ఇద్దరిని కాపాడారు. వరహాలు, శ్రీను గల్లంతయ్యారు. చదవండి: తల్లీ కుమారుడి దారుణ హత్య: వివాహేతర సంబంధమా..?, ఆస్తి గొడవలా..? ముమ్మరంగా గాలింపు గల్లంతైన వారిలో తన తండ్రి సుబ్రహ్మణ్యం కూడా ఉండడంతో కాపాడేందుకు వెళ్లిన వరహాలు గల్లంతయ్యాడు. కాసేపటికి ఇతని మృతదేహం లభ్యంకాగా గల్లంతైన శ్రీను ఆచూకీ కోసం మత్స్యకారులు, అతని బంధువులు గాలిస్తున్నారు. యాదాల వరహాలు తండ్రి సుబ్రహ్మణ్యం కొత్తచోడిపల్లిపేటలో కిరణా షాపు నిర్వహించకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ముగ్గురు కుమారులుండగా పెద్ద కుమారుడు వరహాలుకు వివాహం కాగా భార్య, రెండున్నరేళ్ల కుమార్తె, 15 రోజుల వయసు గల బాబు ఉన్నారు. చింతకాయలపేటకు చెందిన పిట్ల సుబ్బారావు, సుబ్బలక్ష్మి కుమారుడు పిట్ల శ్రీను, మృతుడు వరహాలు హేచరీలో వర్కర్లుగా పని చేస్తున్నారు. శ్రీనుకు రెండేళ్ల క్రితం అక్క కూతురు ప్రశాంతితో వివాహమైంది. ప్రస్తుతం ప్రశాంతి ఏడు నెలల నిండు గర్భిణి. సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతుకావడంతో రెండు కుటుంబాల్లోనూ తీవ్ర విషాదం నెలకొంది. సంఘటన స్థలాన్ని తుని రూరల్ ఎస్సై సన్యాసిరావు, ఎస్సై రవికుమార్ పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ చల్లని సముద్ర గర్భంలో... అగ్నిపర్వతమే బద్దలైతే?
సముద్ర గర్భంలో ఓ అతి పెద్ద అగ్నిపర్వతం బద్దలైతే? అది పెను వాతావరణ మార్పులకు దారి తీస్తే? ఫలితంగా మానవాళి చాలావరకు తుడిచిపెట్టుకుపోతే? ఏదో హాలీవుడ్ సినిమా సన్నివేశంలా అన్పిస్తోందా? కానీ ఇలాంటి ప్రమాదమొకటి కచ్చితంగా పొంచి ఉందట. అదీ ఈ శతాబ్దాంతంలోపు! ఇలాంటి ఉత్పాతాల వల్లే గతంలో మహా మహా నాగరికతలే తుడిచిపెట్టుకుపోయాయట. ఇప్పుడు అలాంటి ప్రమాదం జరిగితే దాని ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొనే ప్రయత్నాలేవీ జరగడం లేదంటూ వోల్కెనాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ శతాబ్దాంతం లోపు సముద్ర గర్భంలో కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో అగ్నిపర్వత పేలుడు సంభవించవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే ప్రపంచ జనాభాలో సగానికి పైగా నశించిపోవచ్చని అంచనా వేస్తున్నారు. గత జనవరి 14న దక్షిణ పసిఫిక్ మహాసముద్ర అంతర్భాగంలో హంగా టోంగా హంగా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు జపాన్, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా తీర ప్రాంతాలను భారీ సునామీ ముంచెత్తింది. ఇది ఆయా ప్రాంతాల్లో అపార ఆర్థిక నష్టం కలిగించింది. అంతకు 10 నుంచి ఏకంగా 100 రెట్ల తీవ్రతతో అలాంటి ప్రమాదమే మరికొన్నేళ్లలోనే మనపైకి విరుచుకుపడవచ్చని డెన్మార్క్‌లోని కోపెన్హెగన్లో ఉన్న నీల్స్ బోర్ ఇన్స్టిట్యూట్ బృందం హెచ్చరిస్తోంది. గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లోని మంచు నిల్వలపై వారు చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందట. ‘మాగ్నిట్యూడ్ 7’ తీవ్రతతో విరుచుకుపడే ఆ ఉత్పాతాన్ని తప్పించుకోవడం మన చేతుల్లో లేదని బర్మింగ్హం యూనివర్సిటీలో వోల్కెనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ జిస్టు మైకేల్ కసిడీ అంటుండటం ఆందోళన కలిగించే విషయం. హంగా టోంగా హంగా అగ్నిపర్వత పేలుడును పలు అంతరిక్ష ఉపగ్రహాలు స్పష్టంగా చిత్రించాయి. ‘‘దాని తాలూకు బూడిద వాతావరణంలో వేలాది అడుగుల ఎత్తుకు ఎగజిమ్మింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి కూడా ఇది స్పష్టంగా కన్పించింది’’ అని నాసా పేర్కొంది. ‘‘ఆస్టిరాయిడ్లు ఢీకొనడం వంటి అంతరిక్ష ప్రమాదాల బారినుంచి భూమిని తప్పించే కార్యక్రమాలపై నాసా వంటి అంతరిక్ష సంస్థలు వందలాది కోట్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. కానీ తోకచుక్కలు, ఆస్టిరాయిడ్లు ఢీకొనే ముప్పుతో పోలిస్తే భారీ అగ్నిపర్వత పేలుడు ప్రమాదానికే వందలాది రెట్లు ఎక్కువగా ఆస్కారముందన్నది చేదు నిజం. అయినా ఇలాంటి వినాశనం తాలూకు ప్రభావం నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు అంతర్జాతీయంగా ఎలాంటి కార్యక్రమమూ లేకపోవడం విచారకరం’’ అంటూ కసిడీ వాపోయారు. అప్పట్లో అపార నష్టం ‘7 మాగ్నిట్యూడ్’తో చివరిసారిగా 1815లో ఇండొనేసియాలోని తంబోరాలో ఓ అగ్నిపర్వతం బద్దలైంది. దాని దెబ్బకు లక్ష మందికి పైగా మరణించారు. పేలుడు ఫలితంగా అప్పట్లో వాతావరణంలోకి ఎగసిన బూడిద పరిమాణం ఎంత భారీగా ఉందంటే 1815ను ఇప్పటికీ వేసవి లేని ఏడాదిగా చెప్పుకుంటారు. దాని దెబ్బకు భూమి సగటు ఉష్ణోగ్రత ఒక డిగ్రీ తగ్గింది. ఆ ఫలితంగా సంభవించిన వాతావరణ మార్పుల దెబ్బకు ఆ ఏడాది చైనా, యూరప్, ఉత్తర అమెరికాల్లో ఒకవైపు భారీగా పంట నష్టం జరిగింది. మరోవైపు భారత్, రష్యా తదితర ఆసియా దేశాలను భారీ వరదలు ముంచెత్తాయి. 1815తో పోలిస్తే నేటి ప్రపంచం జనాభాతో కిటకిటలాడిపోతోందని గుర్తుంచుకోవాలని కసిడీ అంటున్నారు. ‘‘ఇప్పుడు గనక అలాంటి ఉత్పాతం జరిగితే లెక్కలేనంత మంది చనిపోవడమే గాక అంతర్జాతీయ వర్తక మార్గాలన్నీ చాలాకాలం పాటు మూతబడవచ్చు. దాంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొస్తాయి. కొన్నిచోట్ల కరువు కాటకాలు, మరికొన్నిచోట్ల వరదల వంటివి తలెత్తుతాయి’’ అని హెచ్చరించారు. ‘‘సముద్ర గర్భంలో ఎన్ని వందలు, వేల అగ్నిపర్వతాలు నిద్రాణంగా ఉన్నదీ మనకు తెలియదు. ధ్రువాల్లో మంచు విపరీతంగా కరుగుతోంది. సముద్ర మట్టాలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. తద్వారా ఉత్పన్నమయ్యే ఒత్తిడికి సముద్ర గర్భంలో ఏదో ఓ నిద్రాణ అగ్నిపర్వతం అతి త్వరలో ఒళ్లు విరుచుకోవచ్చు. కనీవినీ ఎరగని రీతిలో బద్దలు కావచ్చు. అది జనవరి 14 నాటి పేలుడును తలదన్నేలా ఉంటుంది’’ అని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు ఇప్పటినుంచే సన్నద్ధమైతే మంచిదని సూచిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సముద్రంలో చదరంగం.. 60 అడుగుల లోతుకు డైవ్ చేసి
కొరుక్కుపేట: చెన్నైలో 44వ చెస్ ఒలంపియాడ్ జరుగుతున్న నేపథ్యంలో ఆరుగురు స్థానిక ఆటగాళ్లు వినూత్నంగా ఇలా సముద్రం లోపల చెస్ ఆడారు. అరవింద్ తరుణ్ శ్రీ అనే టెంపుల్ అడ్వెంచర్స్ డైవింగ్ సెంటర్ల వ్యవస్థాపకుని నేతృత్వంలో ఆదివారం ఈ ఘనత సాధించారు. స్థానిక నీలంకరై తీరం నుంచి పడవలో సముద్ర తీరం నుంచి ఐదు కిలోమీటర్లు లోపలికి వెళ్లారు. అక్కడి నుంచి 60 అడుగుల లోతుకు డైవ్ చేశారు. పావు గంటకు ఓ గేమ్ చొప్పున రెండు గంటల పాటు చెస్ ఆడారు. ఇందుకోసం ప్రత్యేకమైన చెస్ బోర్డులు, పావులు రూపొందించారు. ఇందులో పాల్గొన్న ఆటగాళ్లంతా శిక్షణ పొందిన స్కూబా డైవర్లు కావడం విశేషం. 20 నిమిషాలకోసారి నీళ్లలో నుంచి పైకి వచ్చిపోయారట. -
బంతి సాయంతో సముద్రంలో 18 గంటల పోరాటం
అథెన్స్: నడి సముద్రంలో పడిపోతే బయటకు రావటమన్నది దాదాపుగా అసాధ్యం. కానీ, సముద్రంలో పడిపోయిన ఓ వ్యక్తికి చిన్నారులు పడేసిన చిన్న బంతి వరంలా మారింది. బొమ్మ బంతి సాయంతో 18 గంటలు పోరాటం చేశాడు. ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డాడు. ఈ సంఘటన గ్రీస్‌లోని కస్సాండ్రాలో జరిగింది. యూరప్‌లోని ఉత్తర మెసిడోనియాకు చెందిన ఇవాన్ అనే వ్యక్తి, అతడి సహచరుడు.. మైటీ బీచ్‌లో సేదతీరుతుండగా బలమైన అలలు వారిని సముద్రంలోకి లాక్కెళ్లినట్లు ఫాక్స్ 5 న్యూయార్క్ పేర్కొంది. కస్సాండ్రా మైటీ బీచ్ నుంచి 130 కిలోమీటర్ల దూరం వెళ్లిపోయిన ఇవాన్.. ఓ చిన్న బంతి సాయంతో బయటపడినట్లు ఫాక్స్ 5 న్యూయార్క్ తెలిపింది. ఆ బంతిని ఇద్దరు బాలురు 10 రోజుల క్రితం సముద్రంలో పడేసుకున్నట్లు పేర్కొంది. 30 ఏళ్ల ఇవాన్ అలల్లో కొట్టుకుపోయిన క్రమంలో అతడి సహచరులు గ్రీక్ కోస్ట్‌గార్డ్స్‌కు సమాచారం అందించారు. దీంతో వారు హెలికాప్టర్ సాయంతో సుమారు 18 గంటల తర్వాత కాపాడారు. ఆ తర్వాత గ్రీక్ మీడియాతో మాట్లాడారు ఇవాన్. తన వైపు వచ్చిన ఓ చిన్న బంతి సాయంతో ఊపిరి తీసుకుంటూ బలమైన అలలను తట్టుకుంటూ బయటపడే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. మరోవైపు.. ఇవాన్ స్నేహితుడు మార్టిన్ జోవనోవ్స్కీ ఆచూకీ ఇంకా లభించలేదని ఫాక్స్ 5 న్యూయార్క్ తెలిపింది. ఇవాన్ బయటపడిన క్రమంలో ఓ మహిళ బంతి కోసం వచ్చారని, తన కుమారులు బీచ్‌లో పడేసుకున్నారని పేర్కొన్నట్లు తెలిపింది. ఈ సంఘటన అనంతరం స్థానిక ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న ఇవాన్.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: నడిరోడ్డులో వ్యక్తిపై బాలుడి కాల్పులు.. లైవ్ వీడియో -
సముద్రంలో గల్లంతయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు సురక్షితం
సాక్షి, మచిలీపట్నం: చేపల వేటకు వెళ్లి కనిపించకుండా పోయిన కృష్ణా జిల్లా మత్స్యకారులు ఆచూకీ దొరికింది. అందరూ క్షేమంగా ఉన్నట్లు ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం ఇచ్చారు. వారంతా డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలోని కొత్తపాలెం తీరానికి సురక్షితంగా చేరుకున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల ఒకటో తేదీన మచిలీపట్నం మండలం క్యాంబెల్ పేటకు చెందిన పలువురు మత్స్యకారులు నాలుగు బోట్లలో సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. వారంతా తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది తీర ప్రాంతంలో ఉండగా ఓ బోటు ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తి, కదలక మొరాయించింది. బోటులో సాధారణ కీప్యాడ్ ఫోను మాత్రమే ఉంది. ఆ ఫోను చార్జింగ్ అయిపోవడంతో బోటులోని మత్స్యకారులకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. అప్పటి నుంచి మత్స్యకారుల ఆచూకీ లభ్యంకాక పోవటంతో ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టారు. రెండు హెలికాప్టర్లతో ప్రత్యేక బృందాలు కాకినాడ సముద్ర పరిసర ప్రాంతాల్లో మంగళవారం నుంచి రేయంబవళ్లు గాలించాయి. మచిలీపట్నం నుంచి ప్రత్యేకంగా బోట్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. చదవండి: (చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం) -
సెల్‌ఫోన్ స్విచ్చాఫ్.. చేపల వేటకు వెళ్లిన వాళ్లు ఏమయ్యారు?
సాక్షి, కృష్ణా: పొట్టకూటి కోసం చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు. ఈ విషాద ఘటన మచిలీపట్నం మండలంలో చోటు చేసుకోంది. వివరాల ప్రకారం.. నాలుగు రోజుల క్రితం చేపల వేట కోసం నలుగురు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లారు. అనుకోకుండా వాళ్లు ప్రయాణిస్తున్న బోటు ఇంజన్ పాడైనట్లు తమ కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. అయితే గత రెండు రోజుల నుంచి వారి సెల్ ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. దీంతో తమ వారు ప్రాణాలతో ఉన్నారో...లేరో తెలియక గల్లంతైన మత్స్యకారుల కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఆ నలుగురు క్యాంబెల్పేటకి చెందిన వారుగా అధికారులు తెలిపారు. గల్లంతైన మత్యకారుల వివరాలు..విశ్వనాథపల్లి చినమస్తాన్(55), రామాని, నాంచార్లు(55), చెక్క నరసింహారావు (50), మోకా వెంకటేశ్వరరావు (35). మరో బోటులో క్యాంబెల్ పేట మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ వారి ఆచూకీ లభించలేదు. చదవండి: రికార్డు స్థాయిలో శ్రీవారి హుండీ ఆదాయం.. చరిత్రలో ఇది రెండోసారి -
వెస్టిండీస్‌తో తొలి టీ20.. తీవ్ర అస్వస్థతకు గురైన బంగ్లా ఆటగాళ్లు..!
వెస్టిండీస్‌తో తొలి టీ20కు ముందు బంగ్లాదేశ్ ఆటగాళ్లు అస్వస్థతకు గురయ్యారు. సెయింట్ లూసియా నుంచి డొమినికాకు ఐదు గంటలు పాటు సముద్ర మార్గం గుండా ప్రయాణం చేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఎందుకంటే బంగ్లా ఆటగాళ్లలో చాలా మంది ఇప్పటి వరకు సముద్ర ప్రయాణం చేయలేదు. దీంతో ఫెర్రీ(వ్యాపార నౌక) బయలుదేరగానే చాల మంది ఆటగాళ్లు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. వీరిలో ముఖ్యంగా షోరీఫుల్ ఇస్లాం, నఫీస్ ఇక్బాల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు "ఫెర్రీ సముద్రం మధ్యలోకి చేరుకోగానే అలలు మొదలయ్యాయి. ఇది పెద్ద ఫెర్రీ కాదు కాబట్టి, అలలు కారణంగా ఆరు నుంచి ఏడు అడుగుల ఎత్తులో ఫెర్రీ విపరీతంగా ఊగింది. ఫలితంగా, క్రికెటర్లు ఒకరి తర్వాత ఒకరు వాంతులు చేసుకోవడం మొదలు పెట్టారని" బంగ్లాదేశ్ వార్తాపత్రిక ప్రోథోమ్ అలో పేర్కొంది. "నేను చాలా దేశాలు తిరిగాను. కానీ సముద్ర మార్గం గుండా ప్రయాణించడం ఇదే తొలి సారి. మాలో ఎవరికీ ఇటువంటి ప్రయాణాలు అలవాటు లేదు. ఆ సమయంలో మేము ఆట గురించి మర్చిపోయాం.ఎలాగైనా ప్రాణాలతో బయటపడాలి అనుకున్నాము. ఇది నా జీవితంలో అత్యంత చెత్త పర్యటన" అని బంగ్లాదేశ్ క్రికెటర్ ఒకరు పేర్కొన్నారు. ఇక ఇరు జట్లు మధ్య తొలి టీ20 డొమినికా వేదికగా శనివారం జరగనుంది. ఇప్పటికే టెస్టు సిరీస్‌లో ఓటమి చెందిన బంగ్లాదేశ్.. టీ20 సిరీస్‌నైనా కైవసం చేసుకోవాలని భావిస్తోంది. చదవండి: Rishabh Pant Century: పంత్ సెంచరీ... సాధారణంగా ద్రవిడ్ ఇలా రియాక్ట్ అవ్వడు! వైరల్ వీడియో! -
పర్ర భూములను చెరబడుతున్న ఆక్వా చెరువులు
సాక్షి, అమలాపురం(కోనసీమ జిల్లా): వేలాది ఎకరాల పంట భూముల నుంచి ముంపు నీరు, ఇతర డ్రెయిన్ల నీరు దిగడానికి సముద్రపు మొగలు ఎంతో అవసరం. సరిగ్గా ఇక్కడే సహజసిద్ధంగా ఏర్పడిన పర్ర భూములను కొంతమంది స్వార్థపరులు కబ్జా చేసి, అక్రమంగా ఆక్వా చెరువులు ఏర్పాటు చేయడంతో మొగలు పూడుకుపోతున్నాయి. ఫలితంగా ఏటా వేలాది ఎకరాల్లో పంటలు ముంపు బారిన పడి, కోనసీమ రైతులు భారీగా నష్టపోతున్నారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్), మద్రాస్ కన్జర్వెన్స్ యాక్టులను తోసిరాజని మరీ పర్ర భూముల్లో ఆక్వా చెరువులు తవ్వేస్తున్నా.. వేలాది ఎకరాల వరి ఆయకట్టు ముంపునకు కారణమవుతున్నా పట్టించుకునే వారే లేకుండా పోయారు. కొల్లేరు ఆపరేషన్ తరహాలో అక్రమ చెరువులను ధ్వంసం చేసి, రెగ్యులేటర్లు నిర్మిస్తేనే ఇక్కడ ముంపు సమస్యకు మోక్షం కలుగుతుందని ఇరిగేషన్ నిపుణులు, రైతులు చెబుతున్నారు. పులికాట్, కొల్లేరు తరహాలోనే కోనసీమలోని కాట్రేనికోన మండలం వృద్ధ గౌతమి నదీపాయ నుంచి అల్లవరం మండలం వైనతేయ నదీపాయ వరకూ సుమారు 6 వేల ఎకరాల్లో పర్ర భూములున్నాయి. మధ్య డెల్టాలో 1.72 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. రామేశ్వరం, కూనవరం మొగల ద్వారా సుమారు 65 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇందులో 45 వేల ఎకరాలు వరి ఆయకట్టు ఉంది. మిగిలింది ఆక్వా చెరువులుగా మారిపోయింది. మొత్తం 45 వేల ఎకరాల ఆయకట్టు ముంపు నీరు ఈ మొగల ద్వారానే దిగాల్సి ఉంది. అయితే మొగలు పూడుకుపోవడం, వీటిని తెరచినా ముంపునీరు దిగకపోవడంతో రైతులు ఏటా రూ.60 కోట్ల మేర పంటలు నష్టపోతున్నారని అంచనా. పర్ర భూముల కబ్జా మొగల ద్వారా నేరుగా సముద్రంలోకి నీరు దిగే అవకాశం తక్కువ. భారీ వర్షాల సమయంలో ముంపునీరు రామేశ్వరం, కూనవరం డ్రెయిన్ల నుంచి పర్ర భూముల్లోకి వెళ్లేది. కూనవరం డ్రెయిన్ నీరు చిర్రయానం పర్ర భూమి ద్వారా వెళ్లి పల్లం, నీళ్లరేవు, ఏటిమొగ వద్ద సముద్రంలోకి వెళ్లేది. దీనివల్ల భారీ వర్షాల సమయంలో చేలు ముంపు బారిన పడినా రెండు మూడు రోజుల్లోనే నీరు తీసేది. కొన్నేళ్లుగా పర్ర భూముల్లో పెద్ద ఎత్తున ఆక్వా చెరువులు ఏర్పాటయ్యాయి. రామేశ్వరం పర్ర భూముల్లో 480 ఎకరాలు, ఎస్.యానాం, చిర్రయానాం పర్ర భూముల్లో సుమారు 1,650 ఎకరాల విస్తీర్ణంలో అక్రమ ఆక్వా సాగు జరుగుతున్నట్టు అంచనా. సుమారు 2,130 ఎకరాల భూమి కబ్జాల బారిన పడటంతో డ్రెయిన్ల ద్వారా వస్తున్న ముంపునీరు పర్ర భూముల్లోకి వెళ్లే సామర్థ్యం పడిపోయింది. ఆక్వా చెరువుల వల్ల ముంపునీరు పర్రభూముల ద్వారా కాకుండా మొగల ద్వారానే సముద్రంలో కలవాల్సి వస్తోంది. ఇసుక మేటలు వేయడంతో మొగల వెడల్పు కుదించుకుపోతోంది. కూనవరం స్ట్రెయిట్ కట్ ద్వారా 25 క్యూమిక్స్ (క్యూబిక్ మీటర్ పర్ సెకన్) నీరు సముద్రంలోకి దిగాల్సి ఉండగా, మొగ తెరచిన తరువాత కూడా 10 క్యూమిక్స్ కూడా దిగడం లేదు. కొల్లేరు తరహాలోనే.. పూర్వపు పశ్చిమ, కృష్ణా జిల్లాల సరిహద్దులో ఉన్న కొల్లేరు సరస్సులో కబ్జాలు చేసి, ఏర్పాటు చేసిన ఆక్వా చెరువులను నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ధ్వంసం చేశారు. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అక్కడ రూ.412 కోట్లతో మూడుచోట్ల రెగ్యులేటర్లు నియమిస్తున్నారు. ఇదేవిధంగా పర్ర భూముల్లోని ఆక్రమణలను సైతం తొలగించాలని ఇక్కడి రైతులు కోరుతున్నారు. మొగల పరిస్థితిపై గతంలో కూనా ఓషనోగ్రఫీ, ఉస్మానియా ఓషనోగ్రఫీ విభాగాలు సర్వేలు చేశాయి. డ్రెయిన్ నుంచి మొగ దాటుకుని సముద్రంలోకి 200 మీటర్ల మేర లాంగ్ రివిట్మెంట్లు నిర్మించాలని సూచించాయి. వీటికి ఆటోమెటిక్ రెగ్యులేటర్లు నిర్మించాలని సిఫారసు చేశాయి. డ్రెయిన్‌లో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు తెరచుకునేలా.. సముద్రం పోటు సమయంలో మూసుకుపోయేలా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రకారం రెగ్యులేటర్లు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. అనధికార చెరువులపై చర్యలు పర్ర భూముల్లో అనధికారికంగా ఆక్వా చెరువులు సాగు చేస్తున్న విషయం మా దృష్టికి వచ్చింది. అలాగే పంచనదిని ఆనుకుని కూడా చెరువులున్నాయి. వీటిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. – ఆర్.నాగార్జున,డీఈఈ, డ్రెయిన్ అమలాపురం మొగల స్వరూపమిదీ.. కూనవరం ప్రధాన మురుగు కాలువ ద్వారా ఉప్పలగుప్తం, కాట్రేనికోన, ముమ్మిడివరం, అమలాపురం మండలాల్లోని సుమారు 35 వేల ఎకరాల్లోని ముంపునీరు దిగాల్సి ఉంది. రంగరాజు, ఓల్డ్ సమనస, అయినాపురం, గొరగనమూడి మీడియం డ్రెయిన్ల నీరు కూడా దీని ద్వారానే వస్తోంది. 1996 తుపాను సమయంలో దీనికి గండి పడింది. తరువాత ఏప్రిల్ నుంచి జూలై వరకూ పూడుకుపోయి, మిగిలిన సమయంలో అప్పుడప్పుడు కొద్దిమేర తెరచుకుంటోంది. అల్లవరం మండలం రామేశ్వరం మొగ ద్వారా వాసాలతిప్ప, పంచనది డ్రెయిన్ల నుంచి వస్తున్న ముంపునీరు దిగుతోంది. అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల్లోని ముంపునీరు దీని ద్వారా దిగాల్సి ఉంది. ముంపునీరు రామేశ్వరం మొగ వద్దకు వచ్చి ఇక్కడున్న పర్ర భూమిలోకి చేరుతోంది. అక్కడి నుంచి కిలోమీటరు ప్రవహించి సముద్రంలో కలుస్తోంది. (క్లిక్: పంట కాలువను కబ్జా చేసిన అయ్యన్న) -
నిజంగా ఏలియన్ల గుట్టు సముద్రాల్లో ఉందా? రెండింటి మధ్య లింకేంటి?
భూమి ఉపరితలంపై 70 శాతం ఆవరించి ఉన్నవి సముద్రాలే. పైకి సింపుల్‌గా కనిపిస్తున్నా.. తీవ్ర ఒత్తిడి ఉండే పరిస్థితులు, అసలు సూర్యరశ్మి సోకని నిండు చీకట్లో బతికే జీవులు.. వంటి విచిత్రాలెన్నో. అంతేకాదు సముద్రాల్లో పరిశోధనలతో గ్రహాంతర జీవం (ఏలియన్ల) గుట్టునూ తేల్చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద సముద్రాలేమిటి, ఏలియన్ల గుట్టు ఏమిటి అన్న సందేహాలు వస్తున్నాయి కదా.. ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందామా.. మనకు తెలిసింది కొంచెమే! మానవ నాగరికత ఇంతగా అభివృద్ధి చెందినా.. అత్యాధునిక టెక్నాలజీలు వచ్చినా.. ఇప్పటివరకు సముద్రాల్లో జీవం, అడుగున పరిస్థితుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. భూమ్మీద ఉన్న మొత్తం సముద్ర భాగంలో 80 శాతం మేర ఏముందో, ఎలా ఉందో, అక్కడి పరిస్థితులు ఏమిటో అన్నది ఇప్పటివరకు తెలియకపోవడం గమనార్హం. మన సముద్రాల అడుగున భూమి కంటే.. చంద్రుడి ఉపరితలం, అంగారకుడి నేల గురించి మనకు ఎక్కువ తెలుసని శాస్త్రవేత్తలు కూడా చెప్తుంటారు. ఏలియన్లకు లింకేంటి? అసలు గ్రహాంతర జీవం గురించిన ఆనవాళ్లు సముద్రాల్లో ఉండవచ్చని ఎప్పటి నుంచో వాదనలున్నాయి. ఎందుకంటే భూమిపై 70 శాతానికిపైగా సముద్రాలు, మరో 10 శాతం మేర అంటార్కిటికా, ఆర్కిటిక్ వంటి మంచుతో మునిగి ఉన్న ప్రాంతాలే ఉన్నాయి. ఏలియన్లు గానీ, గ్రహాంతర జీవ పదార్థాలుగానీ భూమ్మీదికి వస్తే.. సముద్రాల్లో పడే అవకాశాలే ఎక్కువని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు భూమ్మీద జీవానికి మూలం గ్రహశకలాలు, తోక చుక్కల నుంచి వచ్చిన సేంద్రియ పదార్థాలే కారణమనే ప్రతిపాదనలు ఉన్నాయి. ఇటీవల ‘ర్యుగు’ అనే గ్రహ శకలం (ఆస్టరాయిడ్) నుంచి తెచ్చిన మట్టిలో సేంద్రియ పదార్థాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు కూడా.. అవే పదార్థాలు సౌర కుటుంబంలోని ఇతర గ్రహాలు, వాటి ఉపగ్రహాలకూ చేరే అవకాశాలూ ఎక్కువే. అంటే.. వాటిలోనూ ఎక్కడో జీవం అభివృద్ధి చెంది ఉండొచ్చని అంచనా. ఇక సౌర కుటుంబంలో గ్రహాల చుట్టూ తిరుగుతున్న పలు ఉపగ్రహాల (ఆ గ్రహాలకు చందమామలు)లో ఉండే వాతావరణాన్ని పోలిన పరిస్థితులు.. భూమ్మీద సముద్రాల అడుగున ఉన్నాయని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. అత్యంత చల్లగా, తీవ్ర ఒత్తిడి (ప్రెషర్)తో కూడిన ఈ పరిస్థితుల్లో కూడా కొన్ని రకాల జీవరాశులు మనుగడ సాగించగలుగుతున్నాయని తేల్చారు. ఈ లెక్కన సదరు ఉపగ్రహాల్లో కూడా జీవం మనగలదని.. మన సముద్రాల అడుగున పరిస్థితులపై పూర్తిస్థాయి పరిశోధన చేస్తే.. గ్రహాంతర జీవుల గుట్టు కనుగొనడం సులువని నాసా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. హడల్ జోన్.. గురుడి ఉపగ్రహం ‘యురోపా’లా.. గురుగ్రహం చుట్టూ తిరిగే ఉపగ్రహాల్లో ఒకటైన యురోపాపై.. దట్టమైన మంచుతో కప్పబడిన సముద్రాలు ఉన్నాయి. అక్కడి పరిస్థితులు అచ్చంగా.. మన భూమ్మీది సముద్రాల అడుగున ‘హడల్ జోన్’ను పోలి ఉన్నట్టు నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక్కడ జీవంపై పరిశోధనలు చేస్తే.. యురోపాపై జీవం ఉండే అవకాశాలు, ఉంటే ఎలా ఉండొచ్చన్న వివరాలు తెలుస్తాయని వారు చెప్తున్నారు. సముద్రాల్లో ఆరు కిలోమీటర్ల కన్నా ఎక్కువ లోతున ఉండే ప్రాంతాన్ని ‘హడల్ జోన్’గా పిలుస్తారు. సూర్యరశ్మి ఏమాత్రం సోకని చిమ్మ చీకటి, అతి శీతల పరిస్థితులు, తీవ్రమైన ఒత్తిడి ఉండే హడల్ జోన్లో జీవం మనుగడ కష్టం. ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లోనూ కొన్ని రకాల జీవులు బతుకుతున్నాయి. ప్రయోగాలు మొదలెట్టిన నాసా.. సముద్రాల అట్టడుగున ఉండే క్లిష్టమైన పరిస్థితులపై నాసా ఇప్పటికే ప్రయోగాలు మొదలుపెట్టింది. ఈ పరిస్థితులపై పరిశోధన చేసి.. ఇతర గ్రహాలు, ఉపగ్రహాలపై సముద్రాలు, అక్కడి పరిస్థితులు ఎలా ఉండొచ్చనే అంచనాలను రూపొందిస్తోంది. ఈ అంచనాలకు అనుగుణంగా అన్నిరకాల పరిస్థితులను తట్టుకునే పరికరాలను రూపొందించి.. భవిష్యత్తులో ఆయా గ్రహాలు, ఉపగ్రహాలపై పరిశోధనలు చేయనుంది. చంద్రుడిపైకి నాసా ‘వైపర్’ మంచు, దాని అడుగున నీటిలో (సబ్ సీ) ప్రయాణిస్తూ, పరిశోధన చేయగల రోవర్ ‘వైపర్’ను నాసా వచ్చే ఏడాది చంద్రుడిపైకి పంపనుంది. చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద మంచు, నీటి జాడ గుట్టును ‘వైపర్’ తేల్చనుంది. దీని పనితీరును భూమిపై సముద్రాల్లో పరిశీలిస్తున్నారు. ఆ నీటి అడుగున చిత్రాలెన్నో.. ► సౌర కాంతి సముద్రాల్లో 200 మీటర్ల లోతు వరకు చొచ్చుకుపోగలదు. తర్వాత ఒక కిలోమీటర్ వరకు స్వల్పంగా ఉంటుంది. అంటే మసక చీకటిలా ఉంటుంది. అంతకన్నా లోతున అంతా చిమ్మ చీకటే ఉంటుంది. ► గత ఏడాది అమెరికా తీరానికి సమీపంలో అట్లాంటిక్ సముద్రంలో అత్యంత అరుదైన భారీ ‘ఫాంటమ్ జెల్లీఫిష్’ను గుర్తించారు. రెండు కిలోమీటర్ల నుంచి ఐదు కిలోమీటర్ల లోతులో అవి జీవిస్తుంటాయని తేల్చారు. ►నాలుగైదు కిలోమీటర్ల లోతులో సముద్రపు నేలపై ‘హైడ్రో థర్మల్ వెంట్స్ (వేడి నీరు, పొగను వెలువరించే బిలాలు)’ను శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటి నుంచి వెలువడే వేడి, సేంద్రియ రసాయనాల ఆధారంగా.. అంత లోతులో కూడా కొన్నిరకాల జీవులు బతుకుతున్నట్టు తేల్చారు. ► మంచుతో కప్పిఉన్న ఉపగ్రహాల్లోనూ ఇలాంటి ‘హైడ్రో థర్మల్ వెంట్స్’ ఉంటే.. జీవానికి అవకాశాలు ఎక్కువేనని అంచనా వేస్తున్నారు. -
ఏపీలో అరుదైన పగడపు దిబ్బలు.. ఎక్కడ ఉన్నాయంటే?
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తీరంలో ఎక్కడా లేని విభిన్న పగడపు దిబ్బలకు చిరునామాగా విశాఖపట్నం జిల్లా పూడిమడక మారింది. కోస్తా తీరంలో పగడపు దిబ్బలు అస్సలుండవు అనే మాట తప్పని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా(జెడ్ఎస్ఐ) పరిశోధనలు నిరూపించాయి. ఒకే ప్రాంతంలో విభిన్న రకాల కోరల్స్(పగడపు దిబ్బలు) ఉన్నట్లు గుర్తించిన శాస్త్రవేత్తలు.. వీటిని మరోచోటికి తరలించి అభివృద్ధి చేసేందుకు కూడా అనువుగా ఉన్నాయని స్పష్టం చేశారు. చదవండి: ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా రాష్ట్రంలో జెడ్ఎస్ఐ.. విశాఖ జిల్లా పూడిమడక నుంచి విజయనగరం జిల్లా చింతపల్లి తీరం వరకు సర్వే నిర్వహించగా.. ఈ ప్రాంతమంతా విభిన్న జాతుల వైవిధ్య సముదాయంగా ఉందని స్పష్టమయ్యింది. భారతీయ పగడాల వర్గీకరణపై నిరంతర పరిశోధన చేస్తున్న జెడ్ఎస్ఐ మొట్టమొదటిసారిగా ఆంధ్రా తీరంలో 2020 నుంచి ప్రతి ఏటా జనవరి 17 నుంచి 26వ తేదీ వరకు మూడేళ్ల పాటు సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అనేక అంశాలు వెల్లడయ్యాయి. విభిన్న రకాల పగడపు దిబ్బలు.. పూడిమడక, భీమిలి, రుషికొండ, యారాడ, కైలాసగిరి, సాగర్‌నగర్, ఆర్కేబీచ్, మంగమూరిపేట, తెన్నేటిపార్కు, చింతపల్లి బీచ్‌లలో ఒక్కో ప్రాంతంలో నాలుగు భిన్నమైన ప్రదేశాల్ని సర్వే పాయింట్లుగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో 30 మీటర్ల లోతులో సాగరగర్భంలో అన్వేషణ సాగించారు. స్థానిక స్కూబాడైవింగ్ సంస్థ లివిన్ అడ్వెంచర్స్ సహకారంతో నలుగురు శాస్త్రవేత్తల బృందం చేపట్టిన సర్వేలో పూడిమడక కేంద్రంగా విభిన్న పగడపు దిబ్బలున్నట్లు గుర్తించారు. స్కెలరాక్టినియా కోరల్స్, పవోనాఎస్పీ, లిథోపిలాన్ ఎస్పీ, మోంటీపోరా ఎస్పీ, పోరిటెస్ ఎస్పీ, హెక్సాకోరిలియా, ఆక్టోకోరలియా, డిస్కోసోమా, లోబాక్టిస్ వంటి అరుదైన పగడపు దిబ్బలున్నట్లు కనుగొన్నారు. సాగర గర్భంలో కనుగొన్న పగడపుదిబ్బలు మరోచోట పెంచుకునేందుకు వీలుగా.. ఒక చోట పెరిగే పగడపు దిబ్బల్ని కొంత భాగం తీసి.. మరోచోట పెంచే రకాలు అరుదుగా ఉంటాయి. ఇలాంటి అరుదైన కోరల్స్ పూడిమడకలో ఉన్నట్లు గుర్తించారు. అంతేకాకుండా.. ఈ తరహా కోరల్స్.. మేరీటైమ్ మెడిసిన్ తయారీకీ ఉపయోగపడతాయని గుర్తించారు. ప్రతి ఏటా 9 రోజుల పాటు ఆయా బీచ్‌లలో సబ్–టైడల్, ఇంటర్–టైడల్ ప్రాంతాల్లో సర్వే నిర్వహించి.. విభిన్న జీవరాశులకు సంబంధించిన నమూనాలు సేకరించారు. 1,597 మొలస్కా జాతులు, 182 సినిడారియన్, 161 స్పాంజ్, 133 రకాల చేపలు, 106 క్రస్టేసియన్లు, 12 అసిడియన్లు, 3 ఫ్లాట్ వార్మ్‌లతో పాటు.. అన్నెలిడ్ జీవజాతుల నమూనాల్ని సేకరించారు. మత్స్యసంపదకు ఉపయుక్తం.. సముద్ర గర్భంలో పర్యావరణ పరిరక్షణ వ్యవస్థలుగా పగడపు దిబ్బల్ని పిలుస్తారు. పగడాల ద్వారా స్రవించే కాల్షియం కార్బోనేట్ నిర్మాణాల వల్ల ఇవి ఏర్పడతాయి. ఇవి కొన్ని పోషకాలను కలిగి ఉంటాయి. పగడపు దిబ్బలు సముద్రగర్భంలో అత్యంత వైవిధ్యమైన పర్యావరణ వ్యవస్థలను ఏర్పరుస్తాయి. ఇవి ఉంటే.. సముద్ర జీవరాశులు ఎక్కువగా పెరిగేందుకు ఉపయోగపడతాయి. విభిన్న జీవరాశుల సమాహారం... పూడిమడక తీరం విభిన్న జీవరాశులతో కళకళలాడుతోందని జెడ్ఎస్ఐ సర్వేలో వెల్లడైంది. విదేశీ తీరాల్లో కనిపించే సూక్ష్మ జాతి సముద్ర జీవ రాశులు కూడా పూడిమడకలో ఉన్నట్లుగా గుర్తించారు. పీత జాతికి చెందిన అరుదైన తెనస్, స్పాంజ్, స్టార్ఫిష్, ఇండో పసిఫిక్ సముద్రంలో ఉండే స్టోమోప్నిస్టెస్ సముద్రపు ఆర్చిన్లు, సీ బటర్‌ఫ్లైస్‌గా పిలిచే హెనియోకస్ చేపలు, ఒంటెరొయ్యలు.. ఇలా భిన్నమైన జీవజాలంతో పూడిమడక తీరం అద్భుతంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు నివేదికలో పొందుపరిచారు. మరోసారి సర్వే.. పూడిమడక తీరం.. విభిన్న సముద్ర జీవజాతుల సమాహారంగా ఉంది. ఇక్కడ ఉన్న పగడపు దిబ్బలు చాలా అరుదైన రకాలు. ఈ తరహా సముద్ర గర్భ వాతావరణం ఇక్కడ ఉండటం నిజంగా ఆశ్చర్యకరం. మొత్తం డాక్యుమెంటేషన్ నిర్వహించాం. ఇక్కడి కోరల్స్.. సముద్ర పర్యాటకానికి, వైద్యరంగంలో ఔషదాల తయారీకి, మెరైన్ రిలేటెడ్ రీసెర్చ్‌కు ఎంతగానో ఉపయోగపడతాయి. వచ్చే ఏడాది మరోసారి లోతైన అధ్యయనం చేయాలని భావిస్తున్నాం. – డాక్టర్ జేఎస్ యోగేష్ కుమార్, జెడ్ఎస్ఐ సీనియర్ సైంటిస్ట్ చింతపల్లి వరకు అరుదైన జీవజాలం జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన పరిశోధనలకు రాష్ట్రం తరఫున పూర్తి సహకారం అందించాం. పూడిమడక నుంచి చింతపల్లి వరకు ప్రతి ప్రాంతం విభిన్న రకాల జీవజాతులతో అద్భుతంగా కనిపించాయి. 30 మీటర్ల లోతు వరకు పగడపు దిబ్బల్లో ఉన్న జంతుజాలం ఫొటోల్ని జెడ్ఎస్ఐకి అందించాం. రీఫ్‌లు, కోరల్స్ ద్వారా.. మత్స్యసంపద చాలా ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అయితే కాలుష్యం బారిన పడకుండా వీటిని సంరక్షించుకోవాలి. – బలరాం, లివిన్ అడ్వెంచర్స్ స్కూబా ఇన్స్ట్రక్టర్ -
విహారంలో విషాదం.. అంత వరకు ఉన్న ఆనందం ఒక్కసారిగా ఆవిరైంది!
రణస్థలం(శ్రీకాకుళం): విహారం విషాదంగా మారింది. సరదాగా సముద్ర స్నానానికి వెళితే ప్రాణాలమీదకు వచ్చింది. మండలంలోని ఎన్‌జీఆర్‌పురం పంచాయతీలో గల పోతయ్యపేటలో సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు గల్లంతయ్యారు. జేఆర్ పురం పోలీసులు, స్థానిక మత్స్యకారులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని కొవ్వాడ పంచాయతీలో గల రామచంద్రపురం గ్రామానికి చెందిన గాదం పాపాయమ్మ, గాదం కృష్ణ ఇంటికి వారి అల్లుడు తిరుపతి గణేష్ తన భార్య ఈశ్వరమ్మతో కలిసి ఇద్దరు పిల్లలతో రెండు వారాల కిందట వచ్చారు. ఈయన స్వగ్రామం విశాఖలోని భీమిలి. భార్యా పిల్లలను కొవ్వాడలోనే వదిలేసి గణేష్ మరుసటి రోజు వైజాగ్ వెళ్లిపోయారు. మళ్లీ శనివారం ఉదయం ఆయన తన మేనకోడలు దీవెనతో కలిసి రామచంద్రపురం వచ్చారు. సాయంత్రం ఏడుగురు కుటుంబ సభ్యులు పోతయ్యపేటలోని సముద్ర తీరానికి సరదాగా వెళ్లారు. అంతా కాసేపు ఉల్లాసంగా గడిపారు. ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో తిరుపతి గణేష్(32), తిరుపతి మానస (9), మేనకోడలు వానమామల దీవెన (18)లు ఒక్కసారిగా గల్లంతయ్యారు. దీంతో ఒడ్డున ఉన్న వారంతా గగ్గోలు పెట్టారు. స్థానిక మత్స్యకారులకు సమాచారం ఇవ్వగా.. వారు పడవలపై సముద్రంలోకి వెళ్లారు. వలలు వేసి గల్లంతైన వారి కోసం వెతికినా లాభం లేకపోయింది. గల్లంతైన వారిలో భీమిలి మండలంలోని కాపులుప్పాడ సమీపంలోని నగరప్పాలెం గ్రామం. ఆయన మేనకోడలు దీవెనది విశాఖపట్నం జిల్లా చోడవరం మండలంలో గల వడ్డాది గ్రామం. జేఆర్ పురం ఎస్ఐ జి.రాజేష్ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. చదవండి: Jagananna Thodu: చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్.. ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. -
దురదృష్టకరమైన ఘటన...పక్షిని రక్షించడమే శాపమైంది: వీడియో వైరల్
రోడ్డుప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీసులు ఎంతగా ప్రయత్నిస్తున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉంటున్నాయి. నిర్లక్షపూరితమైన డ్రైవింగ్, పక్కవారికి ఏమైన అవుతుందనే భయం లేని స్పీడ్ డ్రైవింగ్ తదితరాలే ఈ ప్రమాదాలకు కారణం. కనీసం ముందున్న కారు ఎందుకు ఆగిందో అని కూడా లేకుండా తమదారి తమదే అన్నట్లుగా ఢీ కొట్టి వెళ్లిపోతున్నారు. కొంతమంది యాక్సిడెంట్ చేసి కేసు నుంచి తప్పించుకునేందుకు ఆగకుండా వెళ్లిపోతున్నారు. అచ్చం అలానే ఇక్కడొక ఒక ప్రబుద్ధుడు వేగంగా ట్యాక్సీ నడుపుతూ.. రోడ్డు పై ఆగి ఉన్న ఇద్దరు వ్యక్తులను ఢీ కొట్టి వెళ్లిపోయాడు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలపిన కథనం ప్రకారం...ముంబై నేపీన్సీ రోడ్లో వాసం ఉంటున్న వ్యాపారవేత్త అమర్ మనీష్ జరీవాలా తన డ్రైవర్ శ్యామ్ సుందర్ కామత్‌తో కలసి ముంబై బీచ్ హైవైపై మలాడ్ వైపుగా వెళ్తున్నారు. ఐతే ఇంతలో ఒక పక్షి వారి కారుని ఢీకొట్టింది. దీంతో ఆ వ్యాపారవేత్త, అతని డ్రైవర్ గాయపడిన పక్షిని రక్షించేందుకు కారులోంచి దిగారు. ఇంతలో వేగంగా వస్తున్న ఒక ట్యాక్సీ వారిని ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో ఆ వ్యాపరవేత్త అక్కడికక్కడే చనిపోయాడు, డ్రైవర్ కామత్ మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనకు పాల్పడిన ట్యాక్సీ డ్రైవర్ కుమార్ జైశ్వర్గా గుర్తించి అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఐతే ఈ ఘటన హైవే పై ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. What a tragedy. This is Mumbai’s Bandra Worli Sea Link pic.twitter.com/VSTQz27vqY — Singh Varun (@singhvarun) June 10, 2022 (చదవండి: కసాయి కొడుకు...కన్న తల్లిదండ్రులనే కడతేర్చి... సోదరికి కాల్ చేసి మరీ...) -
ధగధగల బంగారు నిధి.. సముద్ర గర్భంలో.. లక్ష కోట్ల విలువ!
కార్టజినా: 300 ఏళ్లుగా సముద్ర గర్భాన దాగున్న శాన్‌జోస్ అనే యుద్ధనౌకలోని అపార సంపదతో జాడ ఎట్టకేలకు దొరికింది. కార్టజినా తీరానికి సమీపంలో దీన్ని కనుగొన్నట్లు కొలంబియా నేవీ ప్రకటించింది. సంబంధిత ఫుటేజీని విడుదల చేసింది. కొలంబియా స్వాతంత్య్ర పోరాటానికి ముందు బ్రిటన్, స్పెయిన్ మధ్య 1708లో జరిగిన యుద్ధంలో శాన్‌జోస్ మునిగిపోయింది. స్పెయిన్ రాజు ఫిలిప్–5కు చెందిన ఈ నౌకలో ఘటన సమయంలో 600 మంది ఉన్నారని భావిస్తున్నారు. సముద్ర గర్భంలో 3,100 అడుగుల లోతులో ఉన్న శిథిల నౌక వద్దకు రిమోట్‌తో పనిచేసే యంత్రాన్ని పంపి ఫొటోలను సేకరించారు. చెల్లా చెదురుగా పడి ఉన్న బంగారు నాణేలు, వజ్రాలు, అమూల్యమైన ఖనిజాలు, పింగాణీ కప్పులు, మృణ్మయపాత్రలు అందులో కనిపిస్తున్నాయి. ఈ సంపద విలువ లక్ష కోట్లకు పైమాటేనని అంచనా. దీనిపై తమకే హక్కులున్నాయంటూ కొలంబియా అంటుండగా స్పెయిన్, ఒక అమెరికా కంపెనీతోపాటు, బొలీవియా ఆదివాసులు కూడా పోటీకి వస్తున్నారు. ఈ నౌక ఇతివృత్తంగా కొలంబియా రచయిత గాబ్రియేల్ గార్సియా మార్కెజ్ రాసిన ‘లవ్ ఇన్ ది టైమ్ ఆఫ్ కలరా’ నవల నోబెల్ బహుమతి కూడా గెలుచుకుంది! -
అమెరికాలో వేములవాడ యువకుడి మృతి
వేములవాడ: అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నత చదువులకు వెళ్లిన వేములవాడ యువకుడు కంటె యశ్వంత్(25) విహార యాత్రకు వెళ్లి సముద్రంలో అలల తాకిడికి మరణించారు. ఈ మేరకు తల్లిదండ్రులకు సమాచారం అందింది. యశ్వంత్ మిత్రులు, కుటుంబసభ్యుల సమాచారం మేరకు.. వేములవాడ సుభాష్‌నగర్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కంటె మల్లయ్య కుమారుడు యశ్వంత్ ఎమ్మెస్ చదివేందుకు 8 నెలల క్రితం ఫ్లోరిడా వెళ్లారు. వారాంతం కావడంతో ఈనెల 29న యశ్వంత్, అతడి స్నేహితులు శుభోదయ్, మైసూరా, చరణ్, శ్రీకర్, శార్వరితో కలిసి ఐర్లాండ్‌లోని దీవులకు వెళ్లారు. అక్కడే ప్రైవేట్ బోటు తీసుకుని పిటా దీవుల వద్దకు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం 5.35 గంటలకు బోట్ స్టార్ట్ చేయగా.. ఇంజిన్ ఆన్ కాలేదు. అలల తాకిడికి బోటు 3 మీటర్ల లోతు ప్రాంతం నుంచి 25 మీటర్ల లోతు ప్రాంతానికి చేరుకుంది. ఇది గమనించని యశ్వంత్ నీటిలోకి దిగారు. అలలు ఎక్కువగా ఉండటంతో ఎంత ఈతకొట్టిన బోటును చేరుకోలేకపోయారు. యశ్వంత్‌ను కాపాడేందుకు మిత్రులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. లైఫ్ జాకెట్స్ ధరించి నీటిలోకి దిగి దాదాపు 3 గంటలపాటు గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు ఈ విషయాన్ని యశ్వంత్ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. మిత్రుడిని కోల్పోయిన దుఃఖంలో వీరంతా సమీపంలోని వసతి గదులకు చేరుకున్నారు. పోలీసులు గాలింపు చేపట్టగా.. సోమవారం రాత్రి మృతదేహం లభ్యం అయినట్లు తెలిసింది. ఉన్నత చదువులకు వెళ్లిన యశ్వంత్ మృతితో సుభాష్‌నగర్‌లో విషాదఛాయలు అలముకున్నాయి. -
‘సీ’దదీరుతూ....అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్
సముద్రంపై నౌకలో పార్టీలు, పెళ్లిళ్లు మాత్రమే మనకు ఇప్పటివరకు తెలుసు. సముద్రంలోతుల్లోనూ పార్టీ చేసుకునే అద్భుత అవకాశాన్ని తీసుకొచ్చిందో డచ్ కంపెనీ. సముద్రం లోపల సబ్‌మెరైన్‌లో పార్టీ... ఊహించడానికే థ్రిల్లింగ్‌గా ఉంది కదా! సాధారణంగా జలాంతర్గాములను నేవీకోసమో, లేదంటే సముద్రపు లోతుల్లోని రహస్యాలను కనుగొనేందుకో ఉపయోగిస్తారు. కానీ వ్యక్తిగత, వాణిజ్య జలాంతర్గాముల తయారీలో దిగ్గజ సంస్థ అయిన నెదర్లాండ్స్‌కు చెందిన యూ–బోట్‌వర్క్స్ ఈ అండర్ వాటర్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫామ్ (యూడబ్ల్యూఈపీ)ను తయారు చేసింది. మినీ క్రూయిజ్ షిప్ తరహాలో రూపొందించిన ఈ సబ్‌మెరైన్ 200 మీటర్ల లోతువరకు డైవ్ చేయగలదు. 120మంది ప్రయాణించగలిగే సబ్‌మెరైన్‌లో 64 సీట్ల సామర్థ్యమున్న రెస్టారెంట్, జిమ్, కాసినో, వెడ్డింగ్ హాల్ కూడా ఉన్నాయి. సముద్రంలోపలి అద్భుతాలను వీక్షించేందుకు వీలుగా దీనికి 14 విశాలమైన కిటికీలను ఏర్పాటు చేశారు. వాటి బయట సముద్రం స్పష్టంగా కనిపించేందుకు ప్రకాశవంతమైన దీపాలను అమర్చారు. ఇది సముద్రతీరంలో ఉన్నప్పుడు, ఉపరితలంపై ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులు తీరపు అందాలను ఆస్వాదించేలా యూడబ్ల్యూఈపీపై సన్‌డెక్‌ను, దాని చుట్టూ రెయిలింగ్‌ను కూడా ఏర్పాటు చేశారు. బ్యాటరీతో నడిచే ఈ సబ్‌మెరైన్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే 24గంటలపాటు ప్రయాణించొచ్చు. యూడబ్ల్యూఈపీ ఓ సంచలనమని, నీటి అడుగున వేడుకలకు ఇది దారి చూపుతుందని యూ–బోట్‌వర్క్స్ వ్యవస్థాపక సీఈవో బెర్ట్ హౌట్మాన్ తెలిపారు. ఇంకెందుకాలస్యం.. నెదర్లాండ్స్‌కు వెళదాం అనుకుంటున్నారా! ఆగండాగండి.. ఏదైనా టూరిజం కంపెనీ కొనుగోలు చేసి టూర్స్ ఆఫర్ చేసేవరకూ మనం ఎదురుచూడాల్సిందే. (చదవండి: రష్యా బలగాల దుర్మార్గం! కాల్పులు జరిపి సజీవంగా పాతిపెట్టి.) -
సరదాగా ‘వెర్రి పని’.. పదేళ్ల జైలు శిక్ష
సాటి మనషుల మీదే కాదు.. మూగ జీవాల పట్లా వేధింపులు, హింసకు పాల్పడితే చట్టం ఊరుకోదు. అలా ఓ చిన్నప్రాణితో, అదీ తన పెంపుడు జంతువుతో వెర్రి వేషాలు వేసిన వ్యక్తికి.. కఠిన కారాగార శిక్ష స్వాగతం చెప్పింది. ఇంటర్నెట్లో(యూట్యూబ్‌లో) ఈ మధ్య ఒక వీడియో వైరల్ అయ్యింది. సముద్రం ఒడ్డున రెండు పిల్లులను ఆహారం ఎరవేసి కొద్దిసేపు ఆడించాడు ఓ వ్యక్తి. అలా ఆడిస్తూ.. అదంతా వీడియో తీశాడు. చివరకు.. ఓ పిల్లిని సముద్రంలోకి లాగి పెట్టి తన్నాడు. వెకిలి చేష్టలకు తోడు నవ్వులు నవ్వాడు. రెండో పిల్లితో అలానే వ్యవహరించబోయాడు. గ్రీస్‌లోని ఎవియా ఐల్యాండ్ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. దీంతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. అది తన పెంపుడు పిల్లే అని, అక్కడ నీళ్లు లేవని, ఆ పిల్లి సురక్షితంగానే ఉంది కదా! ఆ వ్యక్తి వాదించడం మొదలుపెట్టాడు. తనకు జంతువులంటే విపరీతమైన పనే అని చెప్తున్నాడు. కానీ, అతని నేరం మాత్రం రుజువైంది. దీంతో అక్కడి చట్టాల ప్రకారం.. అతనికి పేదళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇక పౌర హక్కుల పరిరక్షణ మంత్రి టకిస్ థియోడోరికాకోస్ నిందితుడి అరెస్ట్‌ను ధృవీకరించారు. మూగ జీవాల పట్ల ఇలాంటి హింసను సహించే ప్రసక్తే లేదని అంటున్నారాయన. గ్రీస్ చట్టాల ప్రకారం.. ఎవరైనా మూగ జీవాలను హింసించినా, దాడులకు పాల్పడినా పదేళ్లు జైలు శిక్షతో పాటు ఐదు నుంచి పదిహేను వేల డాలర్ల దాకా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఈ ప్రమాదం నుంచి ఆ పిల్లి సురక్షితంగా బయటపడిందని, స్థానికంగా ఉన్న యానిమల్ సొసైటీ దాని సంరక్షణ చూసుకోవడంతో పాటు సదరు నిందితుడిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. -
శత్రువులకు సింహస్వప్నం.. సైలెంట్ కిల్లర్ 'వాగ్షీర్'.. ప్రత్యేకతలివే..
సాక్షి, విశాఖపట్నం: సముద్రం లోతుల్లో ప్రయాణిస్తూ శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడే జలాంతర్గామి. దాని పేరు ఐఎన్ఎస్ వాగ్షీర్. నిశ్శబ్దం ఇంత భయంకరంగా ఉంటుందా.. అని శత్రువు సైతం ఆశ్చర్యపోయేలా చేసే సైలెంట్ కిల్లర్. ప్రాజెక్టు–75లో భాగంగా తయారైన చిట్టచివరి సబ్‌మెరైన్ వాగ్షీర్ ఈ నెల 20న జలప్రవేశం చేయనుంది. మన దేశ సముద్ర సరిహద్దుని శత్రు దుర్బేధ్యంగా నిలిపేందుకు ముంబైలోని మజ్గావ్ డాక్‌యార్డులో పీ–75 స్కార్పెన్ ప్రాజెక్ట్ కింద నిర్మితమైన అల్ట్రామోడ్రన్ సబ్‌మెరైన్ (ఆరో జలాంతర్గామి)గా.. చిట్టచివరిదిగా ‘వాగ్షీర్’ రూపొందింది. ప్రాజెక్ట్–75లో భాగంగా ఇప్పటికే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖందేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేలా భారత నౌకాదళంలో ప్రవేశించగా.. ఐఎన్ఎస్ వగీర్ సీట్రయల్స్ పూర్తి చేసుకుంది. కాగా, వాగ్షీర్ జలాంతర్గామి కల్వరి తరగతికి చెందిన చిట్టచివరిది కావడం విశేషం. ఇది భారత నౌకాదళంలోకి ప్రవేశించిన తర్వాత.. తూర్పు నౌకాదళానికి కేటాయించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. సముద్రంలో మందుపాతర పేల్చగలదు ఇప్పటివరకూ ఉన్న సబ్మెరైన్లలో వాగ్‌షీర్‌ని అత్యంత భయంకరంగా, శక్తిమంతంగా తయారు చేశారు. శత్రువులను ఎదుర్కోవడానికి విభిన్న రకాల మారణాయుధాలను సబ్‌మెరైన్‌లో అమర్చారు. ఇందులో 533 మి.మీ. వైశాల్యం గల 6 టార్పెడో ట్యూబ్‌లు ఉన్నాయి. ఏదైనా భారీ ఆపరేషన్ సమయంలో ఈ సైలెంట్ కిల్లర్ 18 టార్పెడోలు లేదా ఎస్ఎం39 యాంటీ–షిప్ క్షిపణులను మోసుకెళ్లగల సత్తా దీని సొంతం. శత్రు జలాంతర్గాములను, యుద్ధనౌకలను ధ్వంసం చేసేందుకు సముద్రంలో మందుపాతరలను పేల్చగల సామర్థ్యం కూడా దీనికున్న ప్రత్యేకత. ఏకకాలంలో దాదాపు 30 మందుపాతరలను పేల్చగలదు. సైలెంట్ కిల్లర్ వాగ్‌షీర్‌ని సైలెంట్ కిల్లర్‌గా పిలుస్తున్నారు. ఎందుకంటే.. ఇందులోని అధునాతన వ్యవస్థ శబ్దం లేకుండా సముద్రంలో దూసుకుపోతుంది. స్టెల్త్ టెక్నాలజీ కారణంగా శత్రు నౌకలు లేదా సబ్మెరైన్లు రాడార్ సాయంతో కూడా వాగ్షీర్ ఎక్కడుందో కనుక్కోలేరు. ఈ జలాంతర్గామిలో రెండు అధునాతన పెరిస్కోప్‌లను అమర్చారు. ఆధునిక నావిగేషన్, ట్రాకింగ్ సిస్టమ్‌లతో కూడిన ఈ సబ్‌మెరైన్ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా తన పని తాను చేసుకుపోగలదు. -
వేట విరామానికి వేళాయె..
మచిలీపట్నం: సముద్రంలో చేపల వేటకు కొద్దిరోజులపాటు బ్రేక్ పడనుంది. సాగర గర్భంలో చేపలు పునరుత్పత్తి సమృద్ధిగా జరిగే సీజన్ ఇదే కావడంతో ఈ ఏడాదీ వేట నిషేధం అమలుచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈనెల 15 నుంచి జూన్ 14 వరకు 61రోజుల పాటు వేట నిషేధ కాలంగా మత్స్యశాఖ అధికారులు ప్రకటించారు. ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తీర ప్రాంత గ్రామాల్లో ఇప్పటికే విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం మొదలుకుని తిరుపతి జిల్లా వరకు 974 కిలోమీటర్ల మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. తీరం వెంబడి ఉన్న గ్రామాల్లో 1.60 లక్షల మంది మత్స్యకారులకు చేపల వేట వృత్తి కాగా, వీరి ద్వారా 6 లక్షల మంది జీవనోపాధికి సముద్రం భరోసాగా నిలుస్తుంది. ఈ ప్రాంతంలో గుర్తింపు పొందిన 30,107 మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు ద్వారా సముద్రంపై చేపల వేట సాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. నిషేధ కాలంలో జీవనభృతి.. వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేలా రాష్ట్ర ప్రభుత్వం జీవన భృతి కల్పిస్తోంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం రూ.4 వేలు మాత్రమే ఇచ్చేవారు. అది కూడా సకాలంలో ఇవ్వకపోగా, ఇచ్చిన డబ్బులు కూడా మత్స్యకారుల చేతికి వెళ్లకుండానే దళారులు మింగేసేవారు. కానీ, సీఎం వైఎస్ జగన్ జీవనభృతిని రూ.10 వేలుకు పెంచటమే కాక, డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమచేస్తూ పారదర్శకత చాటుకున్నారు. రాష్ట్రంలో గతేడాది అర్హత గల వారు 97,619 మంది ఉండగా.. ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున రూ.97.61 కోట్లును మత్స్యకారులకు భరోసాగా అందజేశారు. అర్హుల జాబితా తయారీ వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు జీవన భృతి అందించేందుకు అర్హులైన వారి జాబితాను సిద్ధంచేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. వేట నిషేధ భృతి పొందాలంటే తప్పనిసరిగా బోటు రిజిస్ట్రేషన్ చేసుకుని.. మత్స్యకార సంఘంలో సభ్యుడై ఉండాలి. 18 నుంచి 60 ఏళ్లు మధ్య వయసు ఉండాలి. సోనా బోట్లకు 8 మంది, మోటార్ బోట్లకు ఆరుగురు, ఇంజిన్ తెప్పలకు ముగ్గురు మాత్రమే అర్హులు. ఇక జాబితాలో పేరులేని మత్స్యకారులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకంతో వలంటీర్ ద్వారా మత్స్యశాఖ సిబ్బందిని సంప్రదించాలి. సంప్రదాయ పడవలకు అవకాశం సంప్రదాయక పడవలు కలిగిన మత్స్యకారులు సముద్రం తీరానికి 8 కిలోమీటర్లలోపు, అనుమతించిన సైజు వలలతో చేపలు పట్టుకోవచ్చు. ఇందుకోసమని మత్స్యకారులు తగిన ఆధారాలతో అధికారులు నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. నిషేధం పక్కాగా అమలయ్యేలా తీర ప్రాంత పోలీసులు (మెరైన్), తీర ప్రాంత గస్తీ సిబ్బంది (కోస్ట్‌గార్డ్) చర్యలు తీసుకుంటున్నారు. నిషేధం పక్కాగా అమలు ఈ నెల 15 నుంచి సముద్రంపై మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేట నిషేధం పక్కాగా అమలుచేసేలా దృష్టిసారించాం. నిషేధాజ్ఞలు ఉల్లంఘించే బోటు యజమానులపై చర్యలు తీసుకుంటాం. నిషేధ కాలపు భృతికి అర్హులైన వారందరికీ మంజూరు చేసేలా శ్రద్ధ తీసుకుంటున్నాం. – లాల్ మహమ్మద్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్, కృష్ణా జిల్లా -
సముద్రంలో చేపల వేటపై 2 నెలల నిషేధం
భోగాపురం: సాగరంలో జలసంపదను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రతి సంవత్సరం లాగానే చేపలు గుడ్లు పెట్టే సమయం ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు ప్రభుత్వం వేట నిషేధాజ్ఞలు జారీచేసింది. ఈ సమయంలో ఉపాధి కోల్పోనున్న మత్స్యకారులకు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు అందిస్తోంది. మత్స్య భరోసా పథకం ద్వారా అదుకుంటుంది. గత ప్రభ్వుత్వం వేట నిషేధ సమయంలో మత్స్యకారులను పట్టించుకోకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి సంవత్సరం మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో మత్స్యభరోసా పథకం ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 వేలు సాయాన్ని అందిస్తుండడంతో గంగపుత్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 15,138 మంది మత్స్యకారులు విజయనగరం జిల్లాలోని తీరప్రాంత మండలాలు పూసపాటిరేగ, భోగాపురంలో 14 సముద్రతీర మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో 15,138 మంది మత్స్యకారులు ఉన్నారు. వారిలో 10 వేల నుంచి 12 వేల మంది మత్స్యకారులు నిరంతరం సముద్రంలో వేట కొనసాగిస్తుంటారు. రెండు మండలాల్లో 706 మోటార్ బోట్లు, 424 సంప్రదాయ బోట్లకు రిజిస్ట్రేషన్ అయింది. మత్స్యశాఖ అధికారులు మోటార్ బోట్లు, సంప్రదాయ పడవల్లో వేట కొనసాగిస్తున్న 2,335 మంది మత్స్యకారులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేయించారు. పారదర్శకంగా అమలు మత్స్యకారులకు మంజూరైన సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నాం. మత్స్య సంపదను వృద్ధి చేసేందుకే ప్రభుత్వం నిషేధాజ్ఞలు విధించింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులు నిబంధనలు ఉల్లంఘించి వేట కొనసాగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. - నిర్మలాకుమారి, మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్, విజయనగరం మత్స్యకారులకు భరోసా వేట నిషేధ సమయంలో మత్స్యకారులను అదుకునేందుకు మత్స్యకార భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.10వేలు సాయం అందజేస్తోంది. జిల్లాలో 2,335 మందికి మత్స్యకార భరోసా అందనుంది. వేట నిషేధ సమయంలో మత్స్యకారులకు పనులు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. - వాసుపల్లి రేయుడు, సర్పంచ్ ముక్కాం గ్రామం -
విశాఖ బీచ్ : బుడి బుడి అడుగుల బుల్లి తాబేళ్లు (ఫొటోలు)
-
Olive Ridley Turtle: వెళ్తాం..పెరిగి పెద్దయి.. మళ్లొస్తాం!
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): వెళ్తాం.. పెరిగి పెద్దయి.. గుడ్లు పెట్టేందుకు మళ్లీ ఇక్కడకు వస్తాం అంటూ బుల్లి తాబేళ్లు బుడి బుడి అడుగులు వేసుకుంటూ.. సముద్రంలోకి వెళ్లిపోయాయి. అంతరించే ప్రమాదమున్న ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను జిల్లా అటవీ శాఖ పరిరక్షించి సముద్రంలోకి విడిచిపెట్టింది. సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్లను చూసి పిల్లలు, ప్రకృతి ప్రేమికులు, యువతీయువకులు పరవశించిపోయారు. ఆర్.కె.బీచ్ వేదికగా ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారులతో కలిసి కలెక్టర్ మల్లికార్జున బుల్లి తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టి.. వాటి తల్లుల వద్దకు చేర్చారు. బుడిబుడి అడుగులతో సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్లు ఏటా జనవరి నుంచి మార్చి వరకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు తీరానికి చేరుకుని గుడ్లు పెడతాయి. అది కూడా రాత్రి 2 గంటల నుంచి వేకువ 5.30 గంటల్లోపు మాత్రమే. ఈ సమయంలోనే ఇసుక తిన్నెల్లో బొరియలు చేసి గుడ్లను పెట్టి సముద్రంలోకి జారుకుంటాయి. ఆ గుడ్లను సేకరించిన అటవీ శాఖ అధికారులు బీచ్‌రోడ్డులోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో 45 రోజుల పాటు సంరక్షించారు. సేకరించిన గుడ్లు పొదిగి పిల్లలుగా మారాయి. చదవండి: అంత యాక్షన్ వద్దు.. పులి కూడా బ్రష్ చేస్తుంది! తాబేలు పిల్లను పట్టుకుని ఆనందిస్తున్న కలెక్టర్ మల్లికార్జున అలా గుడ్ల నుంచి బయటకు వచ్చిన 982 బుల్లి తాబేళ్లను సూర్యోదయం సమయంలో కలెక్టర్ సముద్రంలోకి విడిచిపెట్టారు. ఆ సమయంలో తల్లులు తీరానికి చేరువలో ఉంటాయి. అందుకే పిల్లలను సూర్యోదయ సమయంలో సముద్రంలోకి విడిచిపెట్టడం ద్వారా అవి తల్లుల వద్దకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని అటవీ శాఖ అధికారి అనంత్‌శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ సముద్ర జలాలను శుద్ధి చేసే ఈ రకం తాబేళ్లు అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సముద్రంలోకి విడిచిపెట్టేందుకు బుట్టల్లో సిద్ధంగా ఉన్న తాబేలు పిల్లలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Bheemili Beach: విశాఖ భీమిలీ బీచ్‌లో అరుదైన దృశ్యం..
భీమునిపట్నం(విశాఖపట్నం): భీమిలి తీరంలో సముద్రం శుక్రవారం వెనక్కి తగ్గింది. అలల ఉధృతితో ప్రతి రోజూ సముద్రం ముందుకు వస్తుంది. చాలా అరుదుగా వెనక్కి వెళ్తుంది. అయితే శుక్రవారం సముద్రం వెనక్కి వెళ్లడంతో రాళ్లు బయటపడ్డాయి. అలల ఉధృతి లేకపోవడం, హోలీ కావడంతో సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. ఇక్కడ స్నానాలు చేశారు. కాగా.. ఇక్కడి తీరం చాలా ప్రమాదకరంగా ఉంటుంది. స్నానాలకు దిగే వారిలో చాలా మంది ప్రమాదాలకు గురవుతుంటారు. నీటి అడుగున ఉండే రాళ్లకు తగలడం వల్ల తీవ్రగాయాలపాలవడం, లేదా చనిపోవడం జరుగుతుంది. ఇక్కడ బయటపడ్డ రాళ్లను చూస్తే తీరం ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. చదవండి: అమ్మాయిలను రప్పించి.. లాడ్జీ రూంలో గుట్టుగా వ్యభిచారం.. -
హరివిల్లు.. చేప బ్యూటీఫుల్లు
చేపల్లో ఇప్పటికే మనకు చాలా రకాలు తెలుసు. వండుకొని తినే కొర్రమీను, పులస, జెల్ల, పాపెరల లాంటి చేపలతో పాటు అక్వేరియంలో పెంచుకునే రకరకాల రంగుల చేపలను చూసే ఉంటాం. శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే ఎన్నో రకాల చేపలను కనుగొన్నారు. తాజాగా ఇంకో రకం చేపను కూడా గుర్తించారు. అచ్చం హరివిల్లు రంగులో ఉండే ఈ కొత్తరకం చేపను మాల్దీవుల్లోని సముద్రంలో కనుగొన్నారు. వ్రాస్సె జాతికి చెందిన ఈ సముద్ర చేపకు సిర్రిలాబ్రస్ ఫినిఫెన్మా అని మాల్దీవుల జాతీయ పువ్వు పేరును కలిపి పెట్టారు. ముఖానికి గులాబీ రంగు ముసుగు వేసుకుందా అన్నట్టుండే ఈ చేపను సముద్రంలో 40 నుంచి 70 మీటర్ల లోతులో ట్విలైట్ జోన్లో గుర్తించారు. ఇంతకుముందు 30 ఏళ్ల కిందటే ఈ చేపను చూశామని, అయితే అప్పుడు ఇంకోరకం చేప అనుకున్నామని సైంటిస్టులు తెలిపారు. తాజా పరిశీలనలో అసలు విషయం తెలిసిందన్నారు. పెరుగుతూ.. రంగు మారుతూ.. చాలా రకాల చేపలు యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకేలా అనిపిస్తాయి. పెద్ద వయసుకు వచ్చాక వాటి పూర్తి రూపును సంతరించుకుంటాయి. అలాగే వ్రాస్సె జాతికి చెందిన చేపలు కూడా వయసు పెరుగుతున్నాకొద్దీ రంగు మారుతుంటాయి. ఆ ప్రకారమే పెద్ద వయసుకు వచ్చాక ఈ రెయిన్బో చేపలు.. మెజెంటా, నారింజ, గులాబీ, ముదురు ఉదా, ఎరుపు రంగులతో అద్భుతంగా కనిపిస్తుంటాయి. ట్విలైట్ జోన్ అంటే? సముద్రంలో సూర్యకాంతి కొద్దికొద్దిగా చొచ్చుకెళ్లే ప్రాంతం ట్విలైట్ జోన్. సముద్ర ఉపరితలానికి 35 నుంచి 70 మీటర్ల మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో కిరణజన్యసంయోగ క్రియ జరిగేంత స్థాయిలో సూర్యరశ్మి ఉండదు. కాబట్టి ఇక్కడ మొక్కలు పెరగవు. ఈ జోన్లో ఉండే జంతువులు అధిక పీడనం, చల్లని ఉష్ణోగ్రతలు, చీకటి వాతావరణానికి అలవాటు పడి జీవిస్తుంటాయి. ఈ నీటిలో ఉండే జంతువులు స్పష్టంగా చూసేందుకు కళ్లు పెద్దగా ఉంటాయి. అలాగే పెద్ద దంతాలు, దవడలు కూడా ఉంటాయి. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
చేప దాడి.. మత్స్యకారుడి మృతి!
పరవాడ (పెందుర్తి): వినడానికి కొంత ఆశ్చర్యంగానూ, మరికొంత వింతగానూ ఉన్నప్పటికీ.. సముద్రం సాక్షిగా ఇది నిజం. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన ఓ మత్స్యకారుడు.. భారీ చేప చేసిన దాడిలో మృత్యువాత పడ్డాడనే వార్త బుధవారం సర్వత్రా చర్చనీయాంశమయ్యింది.. పోలీసులు, బంధువులు అందించిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం శివారు జాలారీపేట గ్రామానికి చెందిన నొల్లి జోగన్న (45).. కంబాల చినదేముడు, కంబాల కొర్లయ్య, కంబాల మహేష్, ఓలిశెట్టి అప్పలరాజు, ఓలిశెట్టి ముత్తురాజుతో కలిసి ఆదివారం రాత్రి సముద్రంలోకి చేపల వేటకు వెళ్లాడు. కొమ్ము కోనాం చేప దాడిలో మృతి చెందిన మత్స్యకారుడు జోగన్న బుధవారం తెల్లవారుజామున తీరానికి చేరే క్రమంలో జోగన్న భారీ చేపకు గేలం వేశాడు. జోగన్న వేసిన గేలానికి 100 కిలోల బరువు కలిగిన కొమ్ము కోనాం అనే భారీ చేప చిక్కింది. గేలానికి చిక్కిన కొమ్ము కోనాం చేపను బోటులోకి లాగే ప్రయత్నంలో భాగంగా నీటిలో దిగిన జోగన్నపై భారీ చేప దాడి చేసి తన కొమ్ముతో కడుపులో పొడిచింది. ఈ దాడిలో జోగన్న తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటన తీరానికి 90 కిలోమీటర్ల దూరంలో జరగడం వల్ల గాయపడిన జోగన్నకు సకాలంలో వైద్య సేవలు అందించడం సాధ్యపడలేదని, తీరానికి చేరడానికి తమకు 8 గంటల సమయం పట్టిందని తోటి మిత్రులు వాపోయారు. మృతుడికి భార్య లక్ష్మి, నరేష్, అరవింద్ అనే ఇద్దరు కుమారులున్నారు. పోషించే యజమాని మృత్యువాత పడడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కాగా, ఓ భారీ చేప దాడి చేసిన ఘటనలో మత్స్యకారుడు మృతి చెందడం ముత్యాలమ్మపాలెం తీరంలో ఇదే ప్రథమమని మత్స్యకారులు చెబుతున్నారు. జోగన్న మృతి కేసును విశాఖ మెరైన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పరవాడ ఎస్ఐ పి.రమేష్ తెలిపారు. -
మళ్లీ ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి పరీక్ష
సియోల్: అంతర్జాతీయంగా వస్తున్న వ్యతిరేకతల్ని బేఖాతర్ చేస్తూ ఉత్తర కొరియా మరోసారి బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. తూర్పు సముద్రంలో సోమవారం ఈ పరీక్షలు నిర్వహించినట్టుగా దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ జనరల్ వన్ ఇన్ చౌల్ వెల్లడించారు. ఆ క్షిపణి 700 కి.మీ. దూరంలో లక్ష్యాలను ఛేదించగలదని చెప్పారు. ప్రస్తుతం అమెరికా, ఉత్తర కొరియా మధ్య అణుచర్చలపై సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అణ్వాయుధ కార్యక్రమాన్ని విస్తరిస్తామని ఇప్పటికే తెగేసి చెప్పారు. వారం వ్యవధిలోనే రెండోసారి క్షిపణి పరీక్షలు నిర్వహించి దక్షిణ కొరియాకు సవాల్ విసిరారు. తూర్పు సముద్రంలో ఈ పరీక్షలు నిర్వహించడంతో జపాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ దేశ నౌకలు, విమానాలు ఏమైనా ధ్వంసమయ్యాయా అన్న దిశగా విచారణ జరుపుతోంది. -
ఐఏసీ విక్రాంత్ మూడోదఫా జలపరీక్షలు ఆరంభం
న్యూఢిల్లీ: దేశీయంగా నిర్మించిన యుద్ధవిమాన వాహక నౌక (ఐఏసీ) విక్రాంత్ మరో దఫా జల పరీక్షలు ఆదివారం ఆరంభమయ్యాయి. రూ.23వేల కోట్ల ఖర్చుతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ నౌకను వచ్చే ఆగస్టులో దీన్ని నేవీకి అందిస్తారు. అందుకే ఈ లోపు వివిధ దఫాలుగా వివిధ పరిస్థితుల్లో దీన్ని పరీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా గత ఆగస్టులో, అక్టోబర్‌లో సముద్రంలో ట్రయిల్స్ నిర్వహించారు. చదవండి: మీసాలపై తగ్గేదేలే... తీయననంటే తీయను తాజాగా మరోమారు సీ ట్రయిల్స్ ఆరంభిస్తున్నామని, స్వేచ్ఛాజలాల్లో(హై సీస్) పలు రకాల నౌకా విన్యాసాలు నిర్వహిస్తామని నేవీ ప్రతినిధి వివేక్ మధ్వాల్ చెప్పారు. నౌకకున్న సెన్సార్ సూట్లను కూడా పరీక్షిస్తామన్నారు. డీఆర్డీఓకి చెందిన ఎన్ఎస్టీఎల్ సైంటిస్టులు తాజా పరీక్షలను పర్యవేక్షిస్తారు. ఈ నౌక నుంచి ఎంఐజీ జెట్లు, కమోవ్ హెలిక్యాప్టర్లును ప్రయోగించవచ్చు. దీని గరిష్ట వేగం 28 నాట్స్. #WATCH | Indigenous Aircraft Carrier INS Vikrant heads out for the next set of sea trials. pic.twitter.com/S1Yt8crcqu — ANI (@ANI) January 9, 2022 కొచ్చిన్ షిప్‌యార్డ్ దీన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం భారత్ వద్ద ఐఎన్ఎస్ విక్రమాదిత్య అనే యుద్ధ నౌక ఉంది. విక్రాంత్ నిర్మాణంతో సొంతంగా తయారు చేసుకున్న యుద్ధనౌకలున్న దేశాల జాబితాలోకి భారత్ చేరింది. కరోనా కారణంగా విక్రాంత్ పరీక్షల్లో జాప్యం జరిగింది. వీలైనంత త్వరగా ట్రయిల్స్ పూర్తిచేసి, సకాలంలో నౌకను నావికా దళంలో చేర్చేందుకు పలు సంస్థలకు చెందిన పలువురు నిపుణులు సంయుక్తంగా శ్రమిస్తున్నారని వివేక్ తెలిపారు. -
అమ్మకానికి ఒంటరి మేడ.. ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే..
ఎక్కడో దూరంగా కొండకోనల్లో ఉన్న గ్రామంలో ఉంటున్నారా? అయినా కూడా ఏకాంతంగా ఉన్నట్టు అనిపించడం లేదా! అయితే ఈ సముద్రం మధ్యలోని బిల్డింగ్ మీకోసమే. పేరు స్పిట్బాంక్ ఫోర్ట్. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. పోర్టులు, ఓడల రక్షణ కోసం ఇంగ్లండ్‌లో 1870ల్లో కట్టిన కొన్ని పోర్టుల్లో ఇదీ ఒకటి. ఇందులో 9 బెడ్రూమ్లు, బాత్రూమ్లు, ఓ సినిమా రూమ్, ఓ గేమ్ రూమ్, ఓ వైన్ సెల్లార్ ఉన్నాయి. బిల్డింగ్ పైన ఒక వేడి టబ్, మంట కాచుకునే గదులున్నాయి. అద్భుతమైన సముద్రం వ్యూ కనబడుతుంది. దీని వ్యాసం 50 మీటర్లు. లండన్ నుంచి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర దాదాపు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్లు. చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు!