తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం వర్కల బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిన ఘటనలో 13 మంది పర్యాటకులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం(మార్చ్ 9) సాయంత్రం 5 గంటలకు జరిగింది. సముద్రంలో పడిపోయి గాయపడిన వారిలో ఇద్దరు చిన్నపిల్లలున్నారు. సందర్శకులు సముద్రంలో బ్రిడ్జిపై నిలుచున్నపుడు ఒక్కసారిగా భారీ అలలు రావడంతో బ్రిడ్జి హ్యాండ్ రెయిల్ విరిగిపోయింది. దీంతో అది పట్టుకుని నిల్చున్నవారంతా సముద్రంలో పడిపోయారు.
అయితే సందర్శకులంతా లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో వారిని వెంటనే రక్షించి తీరానికి తీసుకురాగలిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 14 ఏళ్ల చిన్నారి తప్ప మిగిలిన వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. సాధారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి మూసి ఉంటుందని అయితే శనివారం సాయంత్రం భారీ అలలు వస్తున్నప్పటికీ సందర్శకులను దానిపైకి అనుమతించడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
STORY | Floating bridge accident at Varkala beach; 11 injured: Police
— Press Trust of India (@PTI_News) March 9, 2024
READ: https://t.co/DVzkSIMP3v
VIDEO: pic.twitter.com/wjRfXkMUHx
ఇదీ చదవండి.. ఫోక్రాన్ యుద్ధ విన్యాసాల్లో రోబో డాగ్ ప్రత్యేకత
Comments
Please login to add a commentAdd a comment