tiruvanantapuram
-
Adithya S nair: యువతి ప్రాణం తీసిన ట్రోలర్స్
ట్రోలింగ్ సర్వసాధారణమైన ఈరోజుల్లో.. సున్నిత మనస్కులు ఆ ధాటికి నిలవలేకపోతున్నారు. ఓ గీతాంజలి, ఓ రమ్య.. ఇప్పుడు ఆదిత్య ట్రోలర్స్ ధాటికి బలయ్యారు. తన వ్యక్తిగత జీవితంపై కామెంట్లు చేస్తుండడం భరించలేక నిండా ఇరవై ఏళ్లు కూడా నిండని ఆదిత్య బలవన్మరణానికి పాల్పడింది.కేరళ తిరువనంతపురం కున్నుపుజా ఏరియాకు చెందిన ఆదిత్య ఎస్ నాయర్(18) Adithya S nair ఇన్స్టాగ్రామ్ వీడియోలతో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఇన్స్టాలోనే పరిచయమైన బినోయ్‌తో ప్రేమలో పడింది. ఈ ఇద్దరూ యూట్యూబ్, ఇన్‌స్టా వీడియోలతో ఫాలోయింగ్ పెంచుకుంటూ వచ్చారు. అయితే రెండు నెలల కిందట ఈ జోడీ విడిపోయినట్లు ప్రకటించింది. అప్పటి నుంచి బినోయ్‌ను సపోర్ట్ చేస్తూ.. ఆదిత్యను ట్రోల్ చేస్తూ కామెంట్లు పెడుతూ వచ్చారు. అవి ఒక స్టేజ్ ధాటి మీమ్స్ వేసే దాకా వెళ్లింది. దీంతో భరించలేకపోయిన ఆమె జూన్ 10న ఉరేసుకుని తన ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చగా.. వారం పాటు చికిత్స పొంది కన్నుమూసింది. దీంతో అప్పటిదాకా ట్రోల్ చేసిన మీమర్లే.. సింపథీ పోస్టులు వేస్తూ వస్తున్నారు. ‘‘వాళ్లిద్దరి రిలేషన్షిప్ గురించి తెలిసి మందలించాం. చదువు మీద ఫోకస్ పెట్టాలని ఆదిత్యకు సూచించాం. అందుకే ఆమె అతన్ని దూరం పెడుతూ వచ్చింది. కానీ, ఆ కుర్రాడు మాత్రం ఇలా మానసికంగా వేధించి నా కూతురిని చంపాడు అని ఆదిత్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదిత్య నాయర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. బినోయ్‌ను పూజాప్పుర పోలీసులు అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. -
బస్తీ మే సవాల్.. శశి థరూర్ వర్సెస్ కేంద్ర మంత్రి
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ కేరళలోని తిరువనంతపురం పార్లమెంట్ స్థానంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఎన్నికల ముందు డిబేట్ విషయంలో అక్కడ పోటీలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు బహిరంగ సవాల్‌ను విసురుకున్నారు. కేంద్ర మంత్రి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ తనతో చర్చకు రావాలని కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్‌కు ఛాలెంజ్ చేశారు. దీంతో ఆయన సవాల్‌ను స్వీకరించారు శశి థరూర్. ‘తిరువనంతపురం అభివృద్ధి, పలు ఆలోచనల గురించి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌తో చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఆయనకు ఈ నియోజకవర్గంలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇదే విషయాన్ని నేను మొదటి నుంచి చెబుతున్నా. రాజకీయాలపై చర్చిద్దాం’అని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ స్పందిస్తూ.. ‘ రాజీవ్ చంద్రశేఖర్ డిబేట్ సవాల్‌ను నేను స్వాగతిస్తున్నా. అయితే ఇప్పటివరకు చర్చకు రాకుండా ఎవరు తప్పించుకు తిరుగుతున్నారో తిరువనంతపురం సెగ్మెంట్ ప్రజలకు తెలుసు. తిరువనంతపురం రాజకీయాలు, అభివృద్ధిపై చర్చిద్దాం’అని తెలిపారు. ‘ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతి, మతతత్వం,పదేళ్ల బీజేపీ పాలనలో రాజకీయాల్లో పెంచిన ద్వేషం. అదే విధంగా గత 15 ఏళ్లుగా కళ్లముందు కనిపిస్తున్న తిరువనంతపురం అభివృద్ధిపై చర్చిద్దాం’ అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. కేరళలో కీలకస్థానమైన తిరువనంతపురంలో యూడీఎఫ్ కూటమి అభ్యర్థిగా శశి థరూర్ పోటీ చేస్తున్నవిషయం తెలిసిందే. అయితే ఆయన ఓటర్లుకు డబ్బులు పంచుతున్నారని బీజేపీ ఆరోపణలు చేసింది. వాటిని శశి థరూర్ టీం తీవ్రంగా ఖండించింది. ఆయన అటువంటి పనులు ఎప్పుడు చేయలేదని స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి అయిన రాజీవ్ చంద్రశేఖర్‌పై యూడీఎఫ్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఆయన తన నామినేషన్ పత్రాల్లో నకిలీ అఫిడవిడ్ దాఖల చేశారని ఆరోపణులు చేశారు. ఇక్కడ వీరితో పాటు సీపీఐ పార్టీ తరఫున దిగ్గజ నేత పన్నియం రవీంద్రన్ పోటీ చేస్తున్నారు. కేరళలో మొత్తం 20 స్థానాల్లో ఒకే దశలో ఏప్రిల్ 26 పోలింగ్ జరగ్గా.. జూన్ 4 ఫలితాలు విడుదల కానున్నాయి. -
తిరువనంతపురం ఫైట్.. కేంద్ర ఐటీ మంత్రిపై ‘ఈసీ’కి ఫిర్యాదు
తిరువనంతపురం: కేరళలోని కీలక సీటు తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆస్తులు దాచారని ఎన్నికల కమిషన్(ఈసీ)కి వామపక్ష ఎల్డీఎఫ్ కూటమి ఫిర్యాదు చేసింది. నామినేషనన్ సందర్భంగా రాజీవ్ చంద్రశేఖర్ దాఖలు చేసిన ఆస్తుల అఫిడవిట్లో గత ఏడాది ఆదాయాన్ని ఆయన చాలా తక్కువగా చూపించారని ఫిర్యాదులో ఎల్డీఎఫ్ నేతలు పేర్కొన్నారు. జూపిటర్ క్యాపిటల్ అనే కంపెనీలో ఆయనకు ఉన్న సింహభాగం వాటాల నుంచి వచ్చే ఆదాయాన్ని వెల్లడించలేదని ఆరోపించారు. ఇంతకముందు ఇదే విషయమై రాజీవ్ చంద్రశేఖర్‌పై కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి కూడా ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజీవ్‌చంద్రశేఖర్ తిరువనంతపురం నుంచి ప్రధానంగా యూడీఎఫ్ అభ్యర్థి శశిథరూర్‌తో పోటీపడుతున్నారు. ఇదీ చదవండి.. ప్రచార హోరు..తృణమూల్‌పై ప్రధాని మోదీ ఫైర్ -
తెగిన తేలియాడే వంతెన.. సముద్రంలో పడిపోయిన టూరిస్టులు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురం వర్కల బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిన ఘటనలో 13 మంది పర్యాటకులు గాయపడ్డారు. ఈ ఘటన శనివారం(మార్చ్ 9) సాయంత్రం 5 గంటలకు జరిగింది. సముద్రంలో పడిపోయి గాయపడిన వారిలో ఇద్దరు చిన్నపిల్లలున్నారు. సందర్శకులు సముద్రంలో బ్రిడ్జిపై నిలుచున్నపుడు ఒక్కసారిగా భారీ అలలు రావడంతో బ్రిడ్జి హ్యాండ్ రెయిల్ విరిగిపోయింది. దీంతో అది పట్టుకుని నిల్చున్నవారంతా సముద్రంలో పడిపోయారు. అయితే సందర్శకులంతా లైఫ్ జాకెట్లు వేసుకోవడంతో వారిని వెంటనే రక్షించి తీరానికి తీసుకురాగలిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడ్డ వారంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వీరిలో 14 ఏళ్ల చిన్నారి తప్ప మిగిలిన వారి పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. సాధారణంగా వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఫ్లోటింగ్ బ్రిడ్జి మూసి ఉంటుందని అయితే శనివారం సాయంత్రం భారీ అలలు వస్తున్నప్పటికీ సందర్శకులను దానిపైకి అనుమతించడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. STORY | Floating bridge accident at Varkala beach; 11 injured: Police READ: https://t.co/DVzkSIMP3v VIDEO: pic.twitter.com/wjRfXkMUHx — Press Trust of India (@PTI_News) March 9, 2024 ఇదీ చదవండి.. ఫోక్రాన్ యుద్ధ విన్యాసాల్లో రోబో డాగ్ ప్రత్యేకత -
ఆస్ట్రేలియాతో రెండో టీ20.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్!?
ఆస్ట్రేలియాతో తొలి టీ20లో గెలిచి మంచి ఊపుమీద ఉన్న టీమిండియా.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్దమైంది. నవంబర్ 26న తిరువనంతపురం వేదికగా జరగనున్న రెండో టీ20లో ఆస్ట్రేలియా-భారత్ జట్లు తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి తమ అధిక్యాన్ని పెంచుకోవాలని భారత్ భావిస్తుంటే.. మరోవైపు ఆసీస్ మాత్రం ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను సమయం చేయాలని వ్యూహాలు రచిస్తోంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే ఛాన్స్ ఉంది. మ్యాచ్ జరగనున్న తిరువనంతపురంలో గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి. మ్యాచ్ జరిగే ఆదివారం కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. అక్యూవెదర్ రిపోర్ట్ ప్రకారం.. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం రావడానికి 55 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉంది. ఉరుములు, మెరుపులు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. తుది జట్లు(అంచనా) భారత్: రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దుబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ ఆస్ట్రేలియా: స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, ఆడమ్ జంపా చదవండి: IND vs AUS: ఆసీస్‌తో రెండో టీ20.. తిలక్ వర్మకు నో ఛాన్స్! జట్టులోకి డేంజరస్ ఆటగాడు -
టేకాఫ్ సమయంలో ప్రమాదం.. విమానం వెనుకభాగం ధ్వంసం!
తిరువనంతపురం: కేరళ కాలికట్(కోజికోడ్) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియా దమ్మం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరవనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అధికారులు విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకిటించారు. ఈ ఫ్లైట్‌లో మొత్తం 182 మంది ప్రయాణికులున్నారు. కాలికట్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో విమానం వెనుకభాగం నేలకు తాకి దెబ్బతిన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు వీలుగా ఇంధనాన్ని మొత్తం అరేబియా సముద్రంలో డంప్ చేశాడు పైలట్. అనంతరం తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారికి వర్గాలు తెలిపాయి. వారిని దమ్మం తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాయి. చదవండి: ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంది: ప్రధాని మోదీ -
'అనుష్కతో వీడియో కాల్లో ఉన్నా.. డిస్టర్బ్ చేయకండి'
సౌతాఫ్రికాతో జరిగిన తొలి టి20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. లక్ష్య చేధనలో రోహిత్, కోహ్లిలు విఫలమైనప్పటికీ.. కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌లు అర్థశతకాలతో మెరిసి జట్టుకు విజయాన్ని అందించారు. అంతకముందు టీమిండియా పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చహర్‌లు తొలి మూడు ఓవర్లలోనే ఐదు వికెట్లు పడగొట్టి సౌతాఫ్రికాను శాసించారు. వీరికి తోడు హర్షల్ పటేల్, అక్షర్ పటేల్‌లు చెలరేగడంతో ప్రొటిస్ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఇదిలా ఉంటే మ్యాచ్ విజయం అనంతరం రాత్రి తిరువనంతపురం నుంచి ఎయిర్పోర్ట్ వరకు టీమిండియా బృందం బస్సులో బయలుదేరింది. అయితే హోటల్ బయట అప్పటికే అభిమానులు భారీగా గూమిగూడారు. భారత్ క్రికెటర్లు బస్సు ఎక్కగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఇక కోహ్లిని చూడగానే అభిమానుల్లో మరింత జోష్ వచ్చింది. '' కోహ్లి.. కోహ్లి'' అంటూ గట్టి గట్టిగా అరిచారు. అయితే ఆ సమయంలో కోహ్లి.. తన భార్య అనుష్క శర్మతో ఫోన్లో వీడియో కాల్లో ఉన్నాడు. అభిమానుల పిలుపుకు స్పందించిన కోహ్లి వెంటనే బస్సు అద్దంలో నుంచి.. ''అనుష్కతో వీడియో కాల్లో ఉన్నా.. డిస్టర్బ్ చేయకండి'' అంటూ ఫోన్ చూపిస్తూ నవ్వాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య రెండో టి20 అక్టోబర్ 2న(ఆదివారం) జరగనుంది. @imVkohli In Video Call With @AnushkaSharma While Returning From Match And Shows It To Fans 😂🤣💖#Virushka #INDvSA pic.twitter.com/YRVLNwZCiq — virat_kohli_18_club (@KohliSensation) September 29, 2022 చదవండి: నా జీవితంలో ఆరోజును మర్చిపోలేను: కోహ్లి ఉద్వేగం.. వీడియో వైరల్ -
పద్మనాభస్వామి ఆలయంలో సందడి చేసిన దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్
టీమిండియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు దక్షిణాఫ్రికా జట్టు భారత్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ప్రోటీస్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. బుధవారం తిరువనంతపురం వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఇక ఇది ఇలా ఉండగా.. దక్షిణాఫ్రికా స్టార్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సోమవారం సందర్శించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహరాజ్ తన సోషల్ మీడియా ఖాతాలో షోర్ చేశాడు. అదే విధంగా తన అభిమానులకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపాడు. కాగా నవరాత్రి ఉత్సవాలు దేశవ్యాప్తంగా సోమవారం ప్రారంభమయ్యాయి. కాగా 32 ఏళ్ల కేశవ్ మహరాజ్ భారత మూలాలు కలిగి ఉన్నాడు. అతడి పూర్వీకులు ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌కు చెందినవారు. కాగా అతడి కుటంబం తన చిన్నతనంలోనే సౌతాఫ్రికాలో స్థిరపడింది. కాగా 2016లో ప్రోటీస్ జట్టు తరపున మహరాజ్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతడు ప్రస్తుతం దక్షిణాఫ్రికా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దక్షిణాఫ్రికా జట్టు: టీ20 జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, పెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రేజ్ షంసీ. వన్డే జట్టు: తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, రీలీ రోసోవ్, తబ్రేజ్ షంసీ, జోర్న్ ఫార్చూన్, పెహ్లుక్వాయో, మార్కో జాన్సేన్, ట్రిస్టన్ స్టబ్స్. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్ప్రీత్ బుమ్రా. IND vs SA: South African spinner Keshav Maharaj visits Sri Padmanabha Mandir in Trivandrum, dons traditional attire -Check Out Read more:https://t.co/aM0V43W0ON#INDvsSA #KeshavMaharaj — InsideSport (@InsideSportIND) September 27, 2022 చదవండి: T20 WC 2022: దినేశ్ కార్తిక్ లాగే అతడికి కూడా అండగా ఉండాలి.. అప్పుడే: శ్రీశాంత్ -
బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టనున్న శాంసన్ ఫ్యాన్స్.. ఎప్పుడంటే?
టీ20 ప్రపంచకప్‌కు-2022కు ఎంపిక చేసిన భారత జట్టులో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు చోటుదక్కకపోవడంపై తన అభిమానులు ఇప్పటికీ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ మెగా ఈవెంట్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ శాంసన్‌కు మాత్రం భారత జట్టులో పెద్దగా చోటుదక్కడం లేదు. 2022లో సంజూ ఇప్పటి వరకు ఆరు వన్డేలు, ఆరు టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. ఆరు టీ20లు ఆడిన శాంసన్ 179 పరుగులు సాధించాడు. ఇటీవల వెస్టిండీస్ పర్యటనలో సంజూ శాంసన్ రాణించాడు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌కు శాంసన్‌ను తీసుకుంటారని అంతా భావించారు. అయితే కనీసం టీ20 ప్రపంచకప్‌కు స్టాండ్‌బైగా కూడా సంజూను ఎంపికచేయకపోవడంపై అభిమానులు మండిపడున్నారు. ఈ క్రమంలో బీసీసీఐకి వ్యతిరేకంగా నిరసన చేపట్టాలని అతడి ఫ్యాన్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తిరువనంతపురంలో సెప్టెంబర్ 28న భారత్- దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న తొలి టీ20ను వేదికగా చేసుకున్నట్లు సమాచారం. ఐఏఎన్ఎస్ న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం.. తిరువనంతపురం వేదికగా జరగనున్న టీమిండియా- సాతాఫ్రికా తొలి టీ20 మ్యాచ్‌లో స్థానికులు సంజూ శాంసన్ ఫొటోలు ఉన్న టీషర్ట్స్ వేసుకొని వచ్చి నిరసన తెలపనున్నట్లు పేర్కొంది. చదవండి: నువ్వేమి చేశావు నేరం.. శాంసన్‌ను ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేయకపోవడంపై ఫ్యాన్స్ ఫైర్ -
నేడు తిరువనంతపురం లో దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం
-
గుడ్ న్యూస్.. మంకీపాక్స్ నుంచి కోలుకున్న తొలి బాధితుడు
తిరువనంతపురం: భారత్‌లో మంకీపాక్స్ బారినపడ్డ తొలి బాధితుడు పూర్తిగా కోలుకున్నాడు. కేరళకు చెందిన ఇతడు తిరువనంతపురంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందాడు. తాజాగా 72 గంటల వ్యవధిలో రెండుసార్లు నిర్వహించిన వైద్య పరీక్షల్లో అతనికి మంకీపాక్స్ నెగెటివ్ వచ్చినట్లు కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. శనివారమే అతడ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం బాధితుడు మానసికంగా, శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని మంత్రి తెలిపారు. అతని శరీరంపై వచ్చిన దద్దుర్లు కూడా పూర్తిగా నయమైనట్లు చెప్పారు. అంతేకాదు బాధితుని కుటుంబసభ్యుల్లో ఎవరికీ మంకీపాక్స్ సోకలేదని, అందరికీ నెగెటివ్ వచ్చినట్లు వివరించారు. అలాగే మంకీపాక్స్ బారినపడి చికిత్స పొందుతున్న మరో ఇద్దరు బాధితుల పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉందని వెల్లడించారు. కేరళ కొల్లం జిల్లాకు చెందిన మంకీపాక్స్ తొలిబాధితుడికి జులై 14న పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. అతను విదేశాల నుంచి వచ్చాడు. ఆ తర్వాత కేరళలోనే మరో రెండు కేసులు వెలుగుచూశాయి. వారు కూడా విదేశాలకు వెళ్లి వచ్చినవారే. మంకీపాక్స్ జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య ఇప్పటికే తెలిపింది.ఈ మహమ్మారిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. ఇది స్మాల్‌పాక్స్ తరహా వ్యాధి అని ప్రాణాంతకం కాదని పేర్కొంది. చదవండి: హిందువులను విభజించాలని చూస్తున్నారు.. మరాఠీ గర్వాన్ని అవమానించారు -
జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమంటే..!
తిరువనంతపురం: పరీక్షల్లో ఎవరికైనా ప్రశ్నపత్రం ఇచ్చి జవాబులు రాయమంటారు. కానీ కేరళ యూనివర్సిటీ పరీక్షలో మాత్రం విద్యార్థికి ఏకంగా జవాబు పత్రమే ఇచ్చి పరీక్ష రాయమన్నారు. ఇంకేముంది.. ఆ విద్యార్థి ఎంచక్కా పరీక్ష రాసేసి వెళ్లిపోయాడు. ఈ విషయం కాస్త ఆలస్యంగా గుర్తించిన వర్సిటీ పరీక్ష రద్దు చేసింది. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ నాలుగో సెమిస్టర్ చదువుతున్న ఓ విద్యార్థి కరోనా వల్ల ‘సిగ్నల్ అండ్ సిస్టమ్స్’పరీక్షకు హాజరుకాలేకపోయాడు. అతని కోసం ఈ ఫిబ్రవరిలో పరీక్ష నిర్వహించారు. ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఆఫీస్ పొరపాటున ప్రశ్నపత్రానికి బదులు జవాబు పత్రం ముద్రించి పంపింది. ఇన్విజిలేటర్ కూడా దాన్నే విద్యార్థికి ఇచ్చాడు. పేపర్ దిద్దిన ప్రొఫెసర్ జరిగిన పొరపాటును గుర్తించి పైఅధికారులకు తెలిపాడు. దాంతో ఆ ఎగ్జామ్‌ను రద్దు చేసిన మే మూడో తేదీన మరోసారి పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించింది. పొరపాటుపై వర్సిటీ విచారణకు ఆదేశించింది. -
Kerala: ఆమె రాకతో మహిళా కలెక్టర్ల సంఖ్య 10కి చేరింది.. అరుదైన ఘనత
మహిళ చదువు దేశానికి వెలుగు ఎలా అవుతుందో చూడాలనుకుంటే ఓసారి కేరళవైపు దృష్టి సారించాల్సిందే. భూతల స్వర్గంగా పేరున్న కేరళ రాష్ట్రంలో 14 జిల్లాలు ఉన్నాయి. వీటిలో 10 జిల్లాల కలెక్టర్లు మహిళలే కావడం గమనార్హం. రాజకీయాలు, రక్షణ, అనేక ఇతర కీలకరంగాలలో పురుషులతో పోలిస్తే మహిళా ప్రాతినిధ్యం తక్కువ ఉన్న ఈ దేశంలో ఇది అరుదైన ఘనతగా అంతా పేర్కొంటున్నారు. ప్రజాసేవ చేయడానికి పరిపాలనలో భాగంగా ఉన్నతాధికారులలో మెజారిటీ సంఖ్య ఇప్పటివరకు పురుషులదే. కానీ, కేరళలో మాత్రం ఆ సంఖ్య మహిళలదయ్యింది. డాక్టర్ రేణు రాజ్ అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టబోతుండటంతో కేరళలో ఇప్పుడీ మహిళా కలెక్టర్ల సంఖ్య పదికి చేరింది. మూడింట రెండొంతులు రాష్ట్ర పరిపాలనలో దాదాపు మూడింట రెండొంతుల మంది మహిళలే నాయకత్వం వహిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఉండగా, ఇప్పుడు కేరళలో పరిపాలనా సేవల్లో మహిళా కలెక్టర్లు 71.4 శాతం ఉన్నారు. కేరళలోని ఇతర జిల్లా మహిళా కలెక్టర్లలో హరిత.వి.కుమార్ (త్రిసూర్), దివ్య ఎస్ అయ్యర్ (పథనం తిట్ట), అఫ్సానా పర్వీన్ (కొల్లం), షీబా జార్జ్ (ఇడుక్కి), డాక్టర్ పికె జయశ్రీ (కొట్టాయం), భండారి స్వాగత్ రణవీర్ చంద్ (కాసర్ గోడ్), నవజోత్ ఖోసా (తిరువనంతపురం), మృణ్మయీ జోషి (పాలక్కాడ్), డాక్టర్ ఎ.గీత (వాయనాడ్)లు ఉన్నారు. వీరిలో రేణురాజ్, దివ్య.ఎస్.అయ్యర్, హరిత వి.కుమార్, పి.కె.జయశ్రీ, షీబా జార్జ్, గీత కేరళ వాసులే. 35 ఏళ్ల డాక్టర్ రేణురాజ్ మార్చి 2న అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వృత్తిరీత్యా రేణు వైద్యురాలు. 2015లో యుపిఎస్సి పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే రెండవ ర్యాంక్ సాధించారు. జిల్లా కలెక్టర్‌గా ఆమెకు ఇదే తొలి పోస్టింగ్. భిన్నరంగాలలోనూ ప్రతిభ గృహిణిగా కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కలెక్టర్‌గా విధులను చేపట్టిన ఈ కలెక్టరమ్మల్లో వివధ రంగాల్లో ప్రతిభను కనబరుస్తున్న వారున్నారు. వారిలో పథానంతిట్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ దివ్యా ఎస్ అయ్యర్ ఒకరు. డాక్టర్, ఎడిటర్, రైటర్, యాక్టర్, సింగర్‌గా కూడా దివ్య పేరొందారు. మలయాళీ వెండితెర మీద క్రిస్మస్ ప్రధాన అంశం గల సినిమాలోనూ నటించారు. గతంలో మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్‌లో డాక్టర్‌గా విధులను నిర్వర్తించారు. ఆ తర్వాతి జాబితాలో త్రిసూర్ జిల్లా కలెక్టర్ హరిత వి.కుమార్ చేరుతారు. 2012లో కేరళలో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌లో టాపర్‌గా నిలిచారీమె. ఎలక్ట్రానిక్స్ విభాగం లో ఇంజినీరింగ్ డిగ్రీ చేసిన హరిత ‘విజయం అనేది ఒక వస్తువు కాదు, ఒక రోజు కష్టంలో రాదు’ అంటారు. మలయాలీ సినిమాలంటే ఇష్టపడే హరిత మోహినీయాట్టం, భరతనాట్యం, కర్ణాటక సంగతంలోనూ ప్రావీణ్యురాలు. పాలక్కాడ్ జిల్లా కలెక్టర్ మృణ్మయి జోషి కలెక్టర్ అవడానికి ముందు ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్. పుణేవాసి. ముంబయ్ హై కోర్టు మాజీ జడ్జి షాలినీ ఫన్సల్కర్ జోషి కూతురు. తల్లి లాగే న్యాయవాద చదువును పూర్తి చేశారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ నుంచి పబ్లిక్ పాలిసీలో మాస్టర్స్ చేశారు. తిరువనంతపురం జిల్లా కలెక్టర్ నవ్‌జోత్ ఖోసా అమృతసర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి బీడీఎస్ చేశారు. యూనివర్శిటీ టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ‘ఐఎఎస్ ముందు నా తండ్రి కల. అదే నా లక్ష్యం అయ్యింది’ అంటారీమె. రాష్ట్ర పరిపాలన విభాగంలో ఉన్నతాధికారులుగానే కాదు 2020 కేరళ స్థానిక ఎన్నికల్లో మహిళలు 50 శాతానికి పైగా సీట్లను కైవసం చేసుకుని విజయం సాధించారు. పితృస్వామ్య సమాజంలో ఇది అంత తక్కువ విషయమేమీ కాదు. దేశ మహిళలందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చదవండి: Mystery- Lansa Flight 508: 10 వేల అడుగుల పైనుంచి ఆమె కూర్చున్న కుర్చీ కిందపడింది.. చుట్టూ విషసర్పాలు.. అయినా -
కింగ్ కోబ్రా బుసలు.. రోషిణి ధైర్యానికి నెటిజన్లు ఫిదా
Kerala Lady Forest Officer: సాధారణంగా మనం పామును చూడగానే భయంతో వణికిపోతాం. మనకు దూరంగా పాము వెళ్తున్నా ఆగిపోతాం. అలాంటిది ఓ మహిళ ఎంతో చాకచక్యంగా ఓ పామును పట్టుకొని శభాష్ అనిపించుకుంది. ఆమె ధైర్యం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. తిరువనంతపురం జిల్లాలోని ఉన్న కట్టక్కడ గ్రామంలోని ఓ ఇంటి వద్ద స్థానికులు పామును గుర్తించారు. దీంతో వారు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. ఈ క్రమంలో అటవీ శాఖ ఉద్యోగి రోషిణి తన బృందంతో అక్కడికి చేరుకుంది. పామును కింగ్ కోబ్రాగా గుర్తించి ఎంతో చాకచక్యంగా ఆమె ఆ పామును పట్టుకున్నారు. అనంతరం పామును సమీప అటవీ ప్రాంతంలో వదిలేశారు. ఈ సందర్భంగా రోషిణి ధైర్యాన్ని గ్రామస్తులు ప్రశంసించారు. ఇదిలా ఉండగా రోషిణి పామును పట్టిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుధా రామేన్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. రోషిణి తిరువనంతపురంలోకి పారుతిపల్లి రేంజ్ ఆఫీసులో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లో ఉద్యోగం చేస్తోందన్నారు. ఆమె పాములను పట్టడంతో శిక్షణ పొందారని వెల్లడించారు. ఈ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోను చూసిన నెటిజన్లు ఆమె ధైర్యానికి ఫిదా అయిపోయి.. ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. A brave Forest staff Roshini rescues a snake from the human habitations at Kattakada. She is trained in handling snakes. Women force in Forest depts across the country is growing up in good numbers. VC @jishasurya pic.twitter.com/TlH9oI2KrH — Sudha Ramen 🇮🇳 (@SudhaRamenIFS) February 3, 2022 -
మహిళపై అత్యాచారం.. న్యూడ్ వీడియోలతో పైశాచికత్వం
తిరువనంతపురం: కేరళలో దారుణం చోటుచేసుకుంది. అధికార పార్టీ స్థానిక నేత.. మహిళా కార్యకర్తపై లైంగికదాడికి పాల్పడ్డాడు. గత మేనెలలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తిరువల్ల పరిధిలోని స్థానిక నేత.. సజిమోన్ తన కార్యాలయంలో బాధిత మహిళకు కూల్‌డ్రింక్‌లో మత్తు పానీయాన్ని కలిపి తాగించారు. ఆ తర్వాత.. ఆమెను కారులో బలవంతంగా ఎక్కించి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో ఆమెను వివస్త్రను, వీడియోలు తీశారు. ఈ దారుణంలో 12 మంది నిందితుల పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు.. బాధిత మహిళా న్యూడ్ వీడియోలు తీసి వేధించడమే కాకుండా డబ్బులివ్వాలని డిమాండ్ చేశారు. దీనికి మహిళా ఒప్పుకోకపోవడంతో ఆమె న్యూడ్ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ క్రమంలో.. బాధిత మహిళా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సజిమోన్, నాసర్ అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. మరో 10 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, నిందితులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో పోలీసులు దర్యాప్తులో అలసత్వం ప్రదర్శిస్తున్నారని విపక్షాలు తీవ్ర విమర్షలు చేస్తున్నాయి. -
పెళ్లికి నిరాకరణ.. యువకుడిపై వివాహిత యాసిడ్ దాడి
Kerala Married Woman Pours Acid On Man For Rejecting To Marriage Her: వివాహం చేసుకోవడానికి నిరాకరించిన వ్యక్తిపై యాసిడ్‌తో దాడి చేసింది ఓ వివాహిత. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. తిరువనంతపురానికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తికి షీబా అనే మహిళతో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. అప్పటికే షీబాకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భర్తతో విడిపోయిన షీబా పిల్లలతో కలిసి వేరుగా ఉంటుంది. షీబా వివాహిత అని తెలియని అరుణ్ ఆమెతో ప్రేమాయణం నడిపాడు. ఈ క్రమంలో ఓ రోజు షీబాకు వివాహం అయి.. ఇద్దరు పిల్లలు ఉన్న విషయం అరుణ్‌కు తెలిసింది. దాంతో అతడు తమ బంధానికి ముగింపు పలకాలని భావించాడు. కానీ షీబా అందుకు అంగీకరించలేదు. తనను వివాహం చేసుకోవాల్సిందేనని పట్టుబట్టింది. తమ బంధం గురించి నలుగురికి చెప్తానని బెదిరించి.. అరుణ్ కుమార్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయసాగింది. (చదవండి: మాజీ మిస్ కేరళ, రన్నరప్ మృతి: ఆడి కారులో వెంటాడి మరీ) ఈ క్రమంలో నవంబర్ 16న అరుణ్ కుమార్ తన అన్న, మరో స్నేహితుడితో కలిసి... తిరువనంతపురంలో ఉన్న చర్చికి వెళ్లాడు. షీబా అడిగిన మొత్తాన్ని ఆమెకు ఇచ్చాడు. ఆ సమయంలో ఇరువురి మధ్య వివాహం గురించి మరో సారి చర్చకు వచ్చింది. ఈ క్రమంలో అరుణ్ కుమార్.. షీబాను వివాహం చేసుకోలేనని తేల్చి చెప్పాడు. అరుణ్‌కుమార్‌పై ఆగ్రహంతో ఉన్న షీబా.. చర్చి వద్దకు వచ్చేటప్పుడే తనతో పాటు యాసిడ్ తీసుకుని వచ్చింది. (చదవండి: నకిలీ ఫేస్బుక్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఓకే చేయగానే..) అరుణ్ కుమార్ పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్ అతడిపై పోసి.. అక్కడ నుంచి పరారయ్యింది. ప్రస్తుతం అరుణ్ కుమార్‌కు తిరువనంతపురం మెడికల్ కాలేజీ హాస్పటిల్‌లో చికిత్స జరగుతుంది. యాసిడ్ దాడిలో అరుణ్ కుమార్ కంటి చూపు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. షీబాను అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో షీబాకు కూడా గాయాలయినట్లు పోలీసులు వెల్లడించారు. చదవండి: ప్రియురాలి యాసిడ్ దాడి, ప్రియుడి మృతి -
జాతీయ జెండా ఉల్టా పల్టా.. కేరళ బీజేపీ చీఫ్‌పై కేసు నమోదు
తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో జాతీయ జెండాను తలకిందులుగా ఎగురవేశారు. ప్రస్తుతం ఈ సంఘటన రాజకీయంగా కలకలంగా మారింది. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్నిపురస్కరించుకుని కేరళ బీజేపీ చీఫ్ కె. సురేంద్రన్ తమ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అయితే, సరైన అవగాహన లేకుండా తలకిందులుగా ఉన్న జెండాను అలాగే ఎగురవేశారు. కాసేపటికి దీన్ని గమనించిన అక్కడి నేతలు తిరిగి జెండాను సరిచేసి ఎగురవేశారు. అప్పటికే పలువురు స్థానికులు దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ క్లిప్పింగ్‌లు కాస్త వైరల్ కావడంతో పోలీసులు సదరు బీజేపీ నాయకుడిపై కేసు నమోదు చేశారు. అదే విధంగా, మొదటిసారి కేరళలో సీపీఐ (యం) పార్టీ ఆఫీస్‌లో నాయకులు జాతీయ జెండాను ఎగురవేసి వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ జెండాకు సమానంగా.. తమ పార్టీ జెండాను ఎగురవేశారు. జెండా కోడ్ ప్రకారం.. జాతీయ జెండాకు సమానంగా వేరే ఏ పతాకాలు ఉండకూడదు. దీన్ని సీపీఐ (యం) ఉల్లంఘించిందని, దేశ త్రివర్ణపతాకాన్ని అవమానించారని కాంగ్రెస్‌నేత కె.ఎస్. సబరినాథన్ విమర్శించారు. దీనిపై స్థానిక బీజేపీ నాయకులు కూడా స్పందించారు. వెంటనే సీపీఐ (యం) నాయకులపై జెండాకోడ్ ఉల్లంఘన కింద కేసులను నమోదు చేయాలని పోలీసులను కోరారు. బాధ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. pic.twitter.com/FJUCHAScY9 — ☭ Raihaan Ali ☭ (@Raihaan09816906) August 15, 2021 -
వైరల్: పాపం.. మూగజీవి.. మీరు మనుషులా.. రాక్షసులా..
తిరువనంతపురం: శునకాన్ని విశ్వాసానికి మారుపేరుగా భావిస్తారు. అవి, తన యజమాని పట్ల ఎనలేని ప్రేమను చూపిస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకే, చాలా మంది డాక్టర్లు కుక్కను పెంచుకోవడం వలన మానసిక సమస్యలు, ఒత్తిడి దూరమవుతాయని చెప్తుంటారు. అయితే, ఇలాంటి మూగ జీవిపట్ల కొంత మంది యువకులు ప్రవర్తించిన తీరు షాకింగ్‌కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. కేరళలోని ఆదిమలాతురా అనే గ్రామానికి చెందిన క్రిస్తురాజ్ అనే వ్యక్తి లాబ్రాడార్ జాతికి చెందిన ఒక శునకాన్ని పెంచుకుంటున్నాడు. దాన్ని ‘బ్రూనో’ అని ప్రేమగా పిలుచుకునేవాడు. ప్రస్తుతం దానికి 9 ఏళ్లు. వారి ఇల్లు బీచ్‌కి దగ్గరగా ఉంటుంది. బ్రూనోను క్రిస్తురాజ్ కుటుంబ సభ్యులు ప్రతిరోజు బీచ్‌కి వాకింగ్‌కి తీసుకెళ్తుంటారు. అది ఇంటి చుట్టుపక్కలే తిరుగుతూ ఉండేది. ఒకవేళ, కుక్క ఎప్పుడైనా, బయటకు వెళ్తె.. క్రిస్తు గట్టిగా పిలవగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేది. ఈ క్రమంలో ఒకరోజు.. బ్రూనో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. క్రిస్తురాజ్ బ్రూనోను ఎంత పిలిచిన రాలేదు. చాలా సేపు గడిచిపోయింది. దీంతో, క్రిస్తురాజ్ తనశునకాన్ని వెతుక్కుంటూ బీచ్ దగ్గరకు వెళ్లాడు. అయితే, అక్కడ సంఘటన చూసి షాక్‌కు గురయ్యాడు. అక్కడ ముగ్గురు యువకులు, బ్రూనోను, ఒక కొక్కెనికి వేలాడదీశారు. అంతటితో ఆగకుండా, ఒకరి తర్వాత మరొకరు ఆ కుక్కను అతి క్రూరంగా కొడుతున్నారు. పాపం.. అది ఆ దెబ్బలకు తాళలేక విలవిల్లాడుతూ.. ప్రాణాలను విడిచింది. అది చూడగానే, వణికి పోయిన యజమాని ఏంచేయాలో తెలియక, ఆ సంఘటనను వీడియో తీశాడు. ఇంటికి చేరుకున్న తర్వాత తన సోదరితో జరిగిన దారుణాన్ని చెప్పాడు. వెంటనే వారు, ఆ ముగ్గురు దుర్మార్గులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీసులు ఆ నిందితులను అదుపులోనికి తీసుకుని, జంతులపై క్రూరత్వ నిరోధక చట్టం కింద పలు కేసులను నమోదు చేశారు. అయితే, ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘ ఆ దుర్మార్గులను చంపేయాలి..’, ‘మూగజీవి పట్ల అంత క్రూరంగా ఎలా ప్రవర్తించారు..’, ‘బ్రూనోకు న్యాయం జరగాలి..’ ‘ఘోరం.. మీరు మనుషులా.. రాక్షసులా..అంటూ కామెంట్లు పెడుతున్నారు. చదవండి: అందుకే నా పిల్లలతో కలిసి అశ్లీల వీడియోలు చూస్తా.. -
33 ఏళ్ల తరువాత నాన్నను కలిసింది
పాలక్కడ్ లేదా పాల్ఘాట్ అనే ఉళ్లో ఉంటున్న అజితకు తన తండ్రి అక్కడికి 350 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరువనంతపురం జైలులో ఉన్నాడన్న సంగతి తెలియనే తెలియదు. ఆమె తండ్రి శివాజీని అజితకు ఆరు నెలల వయసు ఉన్నప్పుడు పోలీసులు పట్టుకెళ్లారు. దానికి కారణం రాజకీయ పార్టీ కార్యకర్త అయిన శివాజీ ఏదో హత్య చేశాడని అభియోగం. రాజకీయ కక్షలలో భాగంగా శివాజీ తన 32వ ఏట జైలుకు వెళ్లాడు. దాంతో అతని భార్యకు మతిస్థిమితం తప్పి మరణించింది. వద్దన్నా తమ ఇంటి ఆడపిల్లను చేసుకుని, పార్టీ అని తిరిగి ఈ కష్టాలన్నీ తెచ్చాడని అల్లుడి మీద కోపం పెట్టుకున్న అత్తామామలు అజితను పెంచి పెద్ద చేసే క్రమంలో ఆమె తండ్రి ప్రస్తావనను పొరపాటున చేయడానికి కూడా ఇష్టపడలేదు. దాంతో అజిత తన తండ్రి మరణించాడని అనుకుంది. అజిత పెద్దదయ్యింది. పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. ఇప్పుడు ఆమె వయసు 33 సంవత్సరాలు. అయితే లాక్డౌన్ సమయంలో టీవీ చూస్తున్న అజితకు గత సంవత్సరం ఖైదీల ఇంటర్వ్యూలో తన తండ్రి గురించిన ప్రస్తావన వచ్చింది. తండ్రి పేరు, హత్య కేసు వివరాలు పోలికతో ఉండటంతో అజితకు జైలులో ఉన్నది తన తండ్రే అని తెలిసింది. ఇక ఆ కూతురి మనసు ఆగలేదు. 2006లో శిక్ష పూర్తి అయినా శివాజీ యావజ్జీవ శిక్ష 2006లోనే పూర్తయ్యింది. అయితే శిక్షాకాలంలో అతను నాలుగుసార్లు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. దాంతో జైలులో ఉండిపోవాల్సి వచ్చింది. జైలులో ఉన్న తండ్రిని విడిపించుకోవడానికి అజిత తెలిసినవాళ్లందరి దగ్గరకూ పరిగెత్తింది. చివరకు కరోనా ఆమెకు సాయపడింది. కరోనా వ్యాప్తిని నిరోధించడానికి జైలులో ఉన్న ఖైదీలకు పెరోల్ ఇవ్వడంలో భాగంగా శివాజీకి కూడా 3 నెలల పెరోల్ ఇచ్చారు. వెంటనే అజిత వెళ్లి తండ్రిని తెచ్చుకుంది. 65 ఏళ్ల వయసు ఉన్న శివాజీ కూతురిని చూడటం ఒక ఉద్వేగం అయితే బయటికొచ్చి ఉండటం మరో ఉద్వేగం. ‘ఆయన చాలా ఆందోళన చెందాడు. కాని నా ఇంటికి వచ్చాక మెల్లగా సర్దుబాటు చెందాడు’ అని అజిత సంతోషంగా చెప్పింది. రక్త సంబంధం గొప్పతనం ఇలా ఉంటుంది. ఎన్నాళ్లయినా ఎన్నేళ్లయినా అది తన రక్తాన్ని ఆనవాలు పడుతుంది. సినిమా కథల కంటే నాటకీయమైన కథలను మనకు ఇస్తూ ఉంటుంది. -
Kerala: 20న విజయన్ ప్రమాణస్వీకారం
తిరువనంతపురం: కేరళలో రెండోసారి విజయం సాధించి అధికారంలోకి వచ్చిన సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వ కేబినెట్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయబోతోంది. మొత్తం 21 మందితో కూడిన కేబినెట్ ఉంటుందని సీపీఎం యాక్టింగ్ రాష్ట్ర కార్యదర్శి విజయ రాఘవన్ చెప్పారు. కోవిడ్నేపథ్యంలో ఆర్భాటాలు లేకుండా కార్యక్రమం పూర్తవుతుందని ఆయన సోమవారం పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమ ప్రభుత్వానికి ఓటేసినందున మంత్రి వర్గంలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం ఉంటుందని తెలిపారు. ఎల్డీఎఫ్ కేబినెట్లో సీపీఎం నుంచి 12 మంది, సీపీఐ నుంచి నలుగురు, కేరళ కాంగ్రెస్ (ఎం), జనతాదళ్ (ఎస్), ఎన్సీపీ తరఫున ఒక్కొక్కరు ఉంటారని తెలిపారు. (చదవండి: మోదీజీ కనిపించరేం.. ఎక్కడున్నారు?: రాహుల్) -
కేరళ: మరోసారి లెఫ్ట్ ప్రభుత్వం.. ధర్మదాం నుంచి పినరయి విజయం
లైవ్ అప్డేట్స్: ► "కేరళ అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించినందుకు పినరయి విజయన్, ఎల్డీఎఫ్ కు నా అభినందనలు. మేము ఇద్దరం కలిసి విస్తృతమైన విషయాలపై పనిచేస్తాము. కోవిడ్ -19 మహమ్మారిని భారతదేశం నుంచి తరిమికొట్టే విషయంలో కలిసి పనిచేయనున్నాం" అని పీఎం మోడీ ట్వీట్ చేశారు. ► కేరళ ఎన్నికల్లో ధర్మదాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సీపీఎం నాయకుడు పినరయి విజయన్ కాంగ్రెస్ సీ రఘునాథన్ పై 50,123 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ► "కేరళ ప్రజలు మరోసారి మా ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. అయితే కోవిడ్ -19 వల్ల పెద్దగా సంబరాలు జరుపుకునే సమయం ఇది కాదు. ప్రతి ఒక్కరూ కోవిడ్ -19కి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి" అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు ► శశి థరూర్ పినరయి విజయన్ ను అభినందించారు "గత 44 సంవత్సరాలలో మొదటిసారి తిరిగి ఎన్నికైనందుకు @CMOKerala @vijayanPinarayiకి నా అభినందనలు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని గౌరవించడం వారి కర్తవ్యం. #కోవిడ్ & మతతత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఆయనకు మన మద్దతు ఉండాలి "అని ఎల్డిఎఫ్ చారిత్రాత్మక విజయంపై శశి థరూర్ ట్వీట్ చేశారు. మెట్రోమాన్ ఈ శ్రీధరణ్‌కు షాక్...! ► మెట్రోమాన్ ఈ శ్రీధరణ్‌కు షాక్ తగిలింది. పాలక్కడ్ నుంచి పోటి చేస్తోన్న శ్రీ ధరణ్ సిట్టింగ్ ఎమ్మెల్యే షఫి పరంబిల్ (కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు. 1000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్ అభ్యర్థి గెలుచుకుంది. పాలక్కడ్ నియోజకవర్గంపై కాంగ్రెస్ మరోసారి తన సత్తాచాటింది. కాగా మరోసారి ఎల్డీఫ్ కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. ► కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ మట్టన్నూర్ నియోజకవర్గం నుంచి 61,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కేరళ ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక మెజారిటీ గెలిచిన చరిత్ర ఇదేనని చెబుతున్నారు. ► కేరళలో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అధికార ఎల్డీఎఫ్ ఆధిక్యంలో దూసుకు పోతుంది. 44 స్థానాల్లో గెలుపొంది, 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎల్డీఎఫ్ 10 స్థానాలను కైవసం చేసుకుని, 35 లీడ్‌లో ఉంది. ► ఎల్డీఎఫ్ 70 , యూడీఫ్ 37 స్థానాలలో కొనసాగుతున్నాయి. అదేవిధంగా ఎల్డీఎఫ్ 26, యూడీఫ్ 6 స్థానాలను కైవసం చేసుకున్నాయి. ► త్రిశూర్‌లో బిజేపీ అభ్యర్థి సురేష్ గోపి ముందంజలో ఉన్నారు. ► రెండోసారి విజయం దిశగా దూసుకుపోతున్న లెఫ్ట్ ప్రభుత్వం.. ► పినరయి విజయన్‌దే ఈవిజయం అంటున్న విశ్లేషకులు.. ► ధర్మదాంలో సీఎం పినరయి విజయన్ ఆధిక్యం ► పుత్తుపల్లిలో ఊమెన్ చాందీ చాంది ఆధిక్యం ► కేరళలో పాలక్కడ్‌లో మెట్రోమాన్ శ్రీధరన్ ముందంజ.. ► కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ ధర్మదంలో పోటీ చేసిన పినరయి విజయన్(CPM) పుట్టుపల్లిలో పోటీ చేసిన ఊమెన్ చాందీ(కాంగ్రెస్) కళహాకూట్టంలో పోటీ చేసిన శోభా సురేంద్రన్(బీజేపీ) ► కేరళలో ఆధిక్యం దిశలో దూసుకుపోతున్న అధికార ఎల్డీఎఫ్.. ఎల్డీఎఫ్ 78 , యూడీఎఫ్ 48 ► కేరళలో తొలి రౌండ్లో ఎల్డీఎఫ్ ఆధిక్యం.. ఎల్డీఎఫ్ 68, యూడీఎఫ్ 47 ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 33, యూడీఎఫ్ 18 చోట్ల ఆధిక్యం ► కేరళలో ఎల్డీఎఫ్ ముందంజ ఎల్డీఎఫ్ 14, యూడీఎఫ్ 9 చోట్ల ఆధిక్యం ► కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎవరు అధికారంలోకి రానున్నారో నేటి ఫలితాలు తేల్చనున్నాయి. ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్‌లో భాగంగా కేరళలో 633 కౌంటింగ్ హాళ్లు ఏర్పాటు చేశారు. కేరళలో 140 శాసనసభ స్థానాలు ఉండగా.. ఏప్రిల్ 6న జరిగిన ఎన్నికల్లో వివిధ పార్టీల నుంచి 957 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కేరళలో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) మళ్లీ అధికారంలోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మాస్కు ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం గుంపులుగా చేరడానికి వీల్లేదన్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుందని, రాత్రి పొద్దుపోయే దాకా కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ప్రక్రియను పర్యవేక్షించడానికి 1,100 మంది పరిశీలకులను నియమించామని పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రాల్లోకి అడుగు పెట్టాలంటే కరోనా నెగటివ్ రిపోర్టు లేదా డబుల్ డోస్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ సమర్పించాలని తేల్చిచెప్పారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎవరైనా కరోనా ప్రోటోకాల్స్‌ను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది. -
అందుకే అదానీకి ఇచ్చాం : కేంద్రమంత్రి వివరణ
తిరువనంతపురం: తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించే నిర్ణయానికి సంబంధించిన వాస్తవాలకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆరోపించారు. విమానాశ్రయ ప్రైవేటీకరణపై కేరళ సీఎం పినరయి విజయన్ వ్యతిరేకత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు. అంతర్జాతీయ బిడ్డింగ్ ప్రక్రియలో కేరళ ప్రభుత్వం అర్హత సాధించలేదంటూ వరుస ట్వీట్లలో ఈ నిర్ణయంపై వివరణ ఇచ్చారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) రీతిలో 50 ఏళ్లుగా లీజుకు ఇవ్వడానికి కేంద్రం పారదర్శకంగా నిర్ణయ తీసుకుందని (2019లో) వివరించారు. అదానీ ప్రయాణీకుడికి 168 రూపాయల చొప్పున కోట్ చేయగా, కేరళ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్ (కెఎస్ఐడీసీ) 135 రూపాయల చొప్పున, మూడవ క్వాలిఫైయింగ్ బిడ్డర్ 63 రూపాయలు కోట్ చేశారన్నారు. 10 శాతం తేడా ఉండి ఉంటే ఈ బిడ్డింగ్ కేరళకే దక్కి ఉండేదని 19.64 శాతం ఉన్న నేపథ్యంలో అదానీని ఎంపిక చేసినట్టు పేర్కొన్నారు. (ప్రైవేటికరణకు ఒప్పుకోం : కేరళ సీఎం) కాగా ప్రధానమంత్రి మోదీ తనకు ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని విజయన్ ఆరోపించారు. స్పెషల్ పర్సస్ వెహికిల్(ఎస్పీవీ)కి ఇవ్వాలని కేరళ పలుసార్లు తాను విజ్ఙప్తి చేసినట్టు విజయన్ గుర్తు చేశారు. 2003లో విమానయానశాఖ ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా కేబినెట్ నిర్ణయం ఉందంటూ ప్రధానికి రాసిన ఒక లేఖలో ఆరోపించిన సంగతి తెలిసిందే. అటు కేంద్ర నిర్ణయాన్ని కేరళ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తుండగా, కాంగ్రెస్ నేత తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ స్వాగతించడం గమనార్హం. It was stipulated that if the Kerala State Industrial Development Corporation (KSIDC) bid comes within the 10% range of the winning bid, they would be awarded the work. There was a difference of 19.64% between them & the next bidder when bids were open. — Hardeep Singh Puri (@HardeepSPuri) August 20, 2020 Winning bid quoted ₹168 per passenger, KSIDC quoted ₹135 per passenger & third qualifying bidder was at ₹63 per passenger. Thus, despite special provision of RoFR being given to GoK, they could not qualify in international bidding process carried out in a transparent manner. — Hardeep Singh Puri (@HardeepSPuri) August 20, 2020 -
శబరిమలలో పూజలు, భక్తులకు నో ఎంట్రీ
తిరువనంతపురం: నెలవారీ పూజా కార్యక్రమాల్లో భాగంగా శబరిమల ఆలయాన్ని సోమవారం తెరిచారు. ఈ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు జరుగుతాయి. అయ్యప్ప భక్తులకు నిరాశే ఎదురయ్యింది. కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు కొనసాగుతాయని, భక్తులు అనుమతి లేదని దేవాలయ అధికారులు తెలిపారు. నెలవారీ పూజ కార్యక్రమాలు ఆగస్టు 21 సాయంత్రం పూర్తైన తర్వాత ఆలయాన్ని మూసి వేస్తామని తెలిపారు. మలయాళ నూతన సంవత్సరం సందర్భంగా సబరిమల మినహా దక్షిణ కేరళలోని సుమారు వెయ్యి దేవస్థానాలను ఆగస్టు 27 వరకు తెరిచి ఉంచాలని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయింది. శబరిమల ఆలయాన్ని తెరిస్తే పొరుగు రాష్ట్రాల వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుంది. దీంతో కరోనా వైరస్‌ను నియంత్రించడం సాధ్యం కాదని బోర్డు అభిప్రాయపడింది. ఆగస్టు29 నుంచి సెప్టెంబర్2 వరకు ఓనం పూజల కోసం ఆలయం మళ్లీ తెరుచుకుంటుందని టీడీబీ తెలిపింది. ఇటీవల సబరిమల వార్షిక పండుగ తీర్థయాత్ర నవంబర్ 16 నుంచి ప్రారంభమవుతుందని బోర్డు అధ్యక్షుడు ఎన్ వాసు పేర్కొన్న విషయం తెలిసిందే. -
‘కరోనా సామాజిక వ్యాప్తి మొదలైంది’
తిరువనంతపురం: భారత దేశంలో తొలి కరోనా కేసు కేరళలో నమోదయ్యింది. అయితే ఆ తరువాత అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అన్ని ఆరోగ్య సదుపాయాలు కల్పించడంతో కేసుల సంఖ్య చాలా వరకు తగ్గింది. ఆ విషయంలో దేశం మొత్తం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై ప్రశంసల జల్లులు కురిపించాయి. అయితే ఇప్పుడు పినరయి విజయన్, ఇండియాలో కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పదిలక్షలకు చేరువులో ఉంది, 25,000 మంది వరకు కరోనాతో మరణించారు. అయినా కూడా భారత ప్రభుత్వం దేశంలో సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని ప్రకటించలేదు. అయితే భారత్‌లో కరోనా మహమ్మారి సామూహిక వ్యాప్తి ప్రారంభమైందని తొలిసారిగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్లడించడం సంచలనంగా మారింది. పినరయి విజయన్, తిరువనంతపురానికి సమీపంలోని పుల్లువిలా, పూన్ తురా గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వైరస్ సూపర్ స్పైడర్లు తయారయ్యారని, వారి ద్వారా వైరస్ శరవేగంగా వ్యాపిస్తుందన్నారు. పుల్లువిలాలో 97 శాంపిల్స్ పరిశీలించగా, 51 మందికి, పూన్ తురాలో 50 శాంపిల్స్ పరీక్షించగా, 26 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు. దీంతో తిరువనంతపురంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. చదవండి: కేరళను ‘సూపర్ స్ప్రెడర్’ గా మారుస్తారా? శుక్రవారం కేరళలో 791 కొత్త కేసులు నమోదు అయ్యాయి. వారిలో 532 మందికి సామూహిక వ్యాప్తి ద్వారా వైరస్ వచ్చినట్లు తెలుస్తోంది. 42 మందికి వైరస్ ఎక్కడి నుంచి వైరస్ సోకిందో అధికారులకు కూడా అంతుచిక్కడం లేదు. ఈ విషయాన్ని వెల్లడించిన పినరయి విజయన్, తిరువనంతపురంలో కరోనా కట్టడిలో భాగంగా జూలై నెల 6 నుంచి లాక్ డౌన్‌ను అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. సామూహిక వ్యాప్తి కనిపించిన ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు. చదవండి: కరోనా: 20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ! -
మాకు కరోనా ఉంటే మీకు వస్తుంది
తిరువనంతపురం : కరోనా వైరస్ మాటేమో గాని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బందికి మాత్రం ప్రాణ సంకటంగా మారింది. తమ వాళ్లను వదిలి మరీ కరోనా సేవలకు అంకితమైన వైద్య సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడం తరచుగా చూస్తున్నాం. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో ఉన్న కంటైన్మెంట్ జోన్లో విధులు నిర్వహించడానికి వెళ్లిన వైద్య సిబ్భందికి శుక్రవారం చేదు అనుభవం ఎదురైంది. కంటైన్మెంట్ జోన్లో ఉన్న ప్రజలు చేసిన పనికి వారంతా క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లాల్సి వచ్చింది. (కరోనా భారత్: ఒకే రోజు రెండు రికార్డులు) వివరాలు.. తిరువనంతపురంలో కంటైన్మెంట్ జోన్లో 25 ఏళ్ల ఒక డాక్టర్ తన సిబ్బందితో కలసి కరోనా విధులు నిర్వహిస్తున్నారు. నలుగురు సిబ్బందితో కూడిన ఆమె బృందం పీహెచ్సీ సెంటర్ నుంచి కారులో బయలుదేరారు. కారు కస్లర్ ఏర్పాటు చేసిన ప్రాంతంలోకి చేరుకోగానే కారులోని వైద్య సిబ్బంది తమతో పాటు తెచ్చుకున్న పీపీఈ కిట్లు ధరించి పరికరాలతో దిగేందుకు సిద్దమయ్యారు. ఇంతలో కారును 50 మంది ఒక్కసారిగా చుట్టుముట్టి ఆందోళన చేయడం ప్రారంభించారు. ఏం జరుగుతుంది అని తెలసుకునేలోపే ఇంకా పెద్ద ఎత్తున జనం గూమిగూడి అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ గట్టిగా అరుస్తూ కారు అద్దాలను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఇంతలో కారు డ్రైవర్ ముందుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కారు అద్దాలను దించడంతో ఒక వ్యక్తి తన తలను లోపల పెట్టి గట్టిగా దగ్గుతూ .. ఒకవేళ మాకు కరోనా ఉంటే కచ్చితంగా మీకు కూడ వస్తుంది అంటూ గట్టిగా అరిచాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన సిబ్బంది ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు చేరుకున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ముందుజాగ్రత్త చర్యగా డాక్టర్‌తో పాటు మిగిలిన నలుగురిని కరోనా పరీక్షల కోసం క్వారంటైన్ సెంటర్లో ఉంచారు. (కరోనా : 3 రోజుల్లోనే.. లక్ష కేసులు) ఈ సంఘటనపై 25 ఏళ్ల యువ డాక్టర్ మీడియాతో పంచుకున్నారు. 'నా ఎంబీబీఎస్ సంవత్సరం కింద పూర్తయింది. ఇంటర్న్‌షిప్‌లో భాగంగా విధులు నిర్వహిస్తున్న నాకు కరోనా విధులు అప్పగించారు. నాతో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఒక టెక్నీషియన్‌ను జతచేసి టీంగా రూపొందించి తిరువనంతపురంలోని క్లసర్కు కేటాయించారు. రోజువారిలానే విధులు నిర్వహించడానికి శుక్రవారం కూడా కారులో బయలుదేరాము. పీపీఈ కిట్లు ధరించేలోపే మా కారును 50 మంది చుట్టుముట్టి ఇక్కడినుంచి వెళ్లిపోవాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కారు డ్రైవర్‌ను ఎట్టి పరిస్థితుల్లో కారు విండోను ఓపున్ చేయొద్దని చెప్పా. కాని అనుకోని పరిస్థితుల్లో కారు విండో ఓపెన్ చేయడంతో ఒక వ్యక్తి తన తలను లోపలికి పెట్టి గట్టిగా దగ్గుతూ.. మాకు కరోనా ఉంటే మీకు కూడా వస్తుంది అంటూ తెలిపాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాం. కారులో నాతో పాటు వచ్చిన ఒక నర్సు కంటతడి పెట్టింది. అక్కడినుంచి ఎలాగోలా బయటపడ్డాం. ఇప్పుడు మేమంతా క్వారంటైన్లో ఉన్నాం. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వస్తే మళ్లీ విధులకు హాజరవుతాం. చూద్దాం ఏం జరుగుతుందో ' అంటూ డాక్టర్ కన్నీటి పర్యంతమయ్యారు. మరోవైపు ఈ ఘటనపై కేరళ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. విధుల్లో ఉన్న వైద్య సిబ్బందిని ఇలా అవమానపరచడం దారుణమని పేర్కొంది. కేరళ ఆరోగ్య శాఖ మంత్రి కెకె. శైలతో పాటు జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా సంఘటనపై ఆరా తీశారు. వైద్య సిబ్బందిపై ఇలా ప్రవర్తించడం దారుణమని, కరోనా నేథ్యంలో అంకితభావంతో సేవలందిస్తున్న వైద్యులపై ఇలాంటివి జరగకూడదని కెకె. శైలజ పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఇప్పటికే పోలీసులకు సూచించామని ఆమె తెలిపారు. గత రెండు నెలలుగా ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్లో ఉండడంతో అక్కడి ప్రజలు స్వేచ్చగా తిరిగే అవకాశం లేకుండా పోయింది. కేవలం నిత్యవసరాల సరుకులు మినహా మరెక్కడికి వెళ్లకుండా ఆంక్షలు విదించడంతో వారంతా ఇలా తమ అసహనం వ్యక్తం చేశారని మంత్రి శైలజ మరో ప్రకటనలో పేర్కొన్నారు.