
ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం : కేరళలో గతవారం నవజాత శిశువును రోడ్డుపక్కన వదిలివేసిందనే ఫిర్యాదుపై యువతిని విచారించిన పోలీసులకు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలక్కాడ్ జిల్లాలోని స్ధానిక సీపీఎం కార్యాలయంలో తనపై లైంగిక దాడి జరిగిందని బాధిత యువతి పేరొ్కన్నారు.
గత ఏడాది జూన్‌లో కాలేజ్ మేగజైన్ పనులకు సంబంధించి సీపీఎం కార్యాలయానికి తాను వెళ్లగా సీపీఎం విద్యార్థి విభాగం నేత లైంగిక దాడికి పాల్పడినట్టు ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. కాగా బాధిత యువతికి వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఆ యువకుడు పరిచయమని, అయితే ఆమె ఆరోపిస్తున్నట్టు లైంగిక దాడి సీపీఎం కార్యాలయంలో జరగలేదని ప్రాధమిక దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు చెబుతున్నారు.
సీపీఎం ప్రాంతీయ కార్యాలయానికి సమీపంలో నిందితుడు గ్యారేజ్ నడుపుతున్నాడని, పార్టీ కార్యాలయంలో ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేదని వారు చెప్పారు. మరోవైపు బాధిత యువతి బిడ్డకు జన్మనిచ్చేవరకూ ఆమె గర్భం గురించి తమకు తెలియదని యువతి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా నిందితుడిపై లైంగిక దాడి కేసును నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment