19న రాష్ట్రపతి రాక | Pranab Mukerjee comes to tiruchi on 19-07-2014 | Sakshi
Sakshi News home page

19న రాష్ట్రపతి రాక

Published Thu, Jul 10 2014 12:58 AM | Last Updated on Fri, Aug 24 2018 2:01 PM

19న రాష్ట్రపతి రాక - Sakshi

19న రాష్ట్రపతి రాక

ప్యారిస్: రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 19వ తేదీ తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానం ద్వారా తంజావురు వైమానిక దళ విమానాశ్రయానికి వస్తున్నారు. అక్కడి నుంచి కారులో తంజావూరులో ఉన్న పున్నైనల్లూర్ మారియ మ్మ ఆలయానికి వెళ్లి మధ్యాహ్నం 1 గంటకు ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. అనంతరం కారులో మళ్లీ తంజావూరు వైమానిక దళ విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా తిరువారూర్‌కు బయలుదేరి వెళతారు. అక్కడ జరగనున్న రాష్ట్ర సెంట్రల్ యూనివర్సిటీ కొత్త భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం ఆయన తిరుచ్చికి వచ్చి ఎన్‌ఐటీ గోల్డన్ జూబ్లీ ఉత్సవాల ముగింపోత్సవంలో పాల్గొని ప్రసంగిస్తారు. రాష్ట్రపతి ప్రణభ్ ముఖర్జీ రాకను పురస్కరించుకుని ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement