తిరువనంతపురం: కేరళ కాలికట్(కోజికోడ్) అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియా దమ్మం వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం తిరవనంతపురంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. అధికారులు విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకిటించారు. ఈ ఫ్లైట్‍లో మొత్తం 182 మంది ప్రయాణికులున్నారు.
కాలికట్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో విమానం వెనుకభాగం నేలకు తాకి దెబ్బతిన్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. దీంతో ఫ్లైట్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసేందుకు వీలుగా ఇంధనాన్ని మొత్తం అరేబియా సముద్రంలో డంప్ చేశాడు పైలట్. అనంతరం తిరువనంతపురం విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశాడు.
అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని తెలుస్తోంది. ప్రయాణికులంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారికి వర్గాలు తెలిపాయి. వారిని దమ్మం తీసుకెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పాయి.
చదవండి: ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంది: ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment