న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి అమెరికాలోని షికాగో బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఏఐ-127 విమానానికి ముప్పు ఉందని మంగళవారం(అక్టోబర్ 15) బెదిరింపు మెయిల్ అందింది.
దీంతో అప్రమత్తమైన ఎయిర్ ఇండియా సిబ్బంది ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని కెనడాలోని ఇకాల్యూట్ ఎయిర్‌పోర్టుకు మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్(ట్విటర్)లో తెలిపింది.
ఇకాల్యూట్ ఎయిర్‌పోర్టులో ప్రోాటోకాల్ ప్రకారం విమానంలోని ప్రయాణికులను,సిబ్బందిని తనిఖీ చేసిన తర్వాత విమానం తిరిగి బయలుదేరేందుకు అనుమతిస్తారని ఎయిర్ ఇండియా వెల్లడించింది. ఇటీవలి కాలంలో తమ విమానాలకు తరచుగా బాంబు బెదిరింపులు వస్తున్నాయని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment