
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో Air India విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. వాతావరణం అనుకూలించని కారణంగా విమానం శంషాబాద్‌లో ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది.
వివరాల ప్రకారం.. చెన్నై-పూణే ఎయిర్ ఇండియా విమానం శనివారం ఉదయం శంషాబాద్‌లో అత్యవసరంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. దట్టమైన పొగమంచు కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతో విమానం దాదాపు మూడు గంటల పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం, పైలట్ విమానాన్ని శంషాబాద్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేసినట్టు సమాచారం. ఇక, ఎయిర్ ఇండియా విమానంలో 180 మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది.
An Air India exp flight from Chennai to Pune has diverted to Hyd. Nearly 3 hrs in the air. pic.twitter.com/ywnbnMtG50
— Mahesh (@Hanumanbhakt000) December 21, 2024