
శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఆదివారం పలు విమానాలకు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో ఓ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. గోవా నుండి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో దింపారు.
ఇందులో 180 మంది ప్రయాణికులు ఉన్నా రు. మరో గంటకు బెంగళూరు–హైదరాబాద్ ఇండిగో విమానానికి, మళ్లీ గంట తర్వాత హైదరాబాద్–పుణే ఇండిగో విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటితో పాటు ఎయిర్‌ఇండియా విమానానికి ఇదే తరహా కాల్ వచి్చనట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment