indigo flight
-
Delhi: రెండో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ
న్యూఢిల్లీ: దేశ రాజధాని రీజియన్‌లో మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అయ్యింది. నోయిడాలో రూపొందుతున్న విమానాశ్రయంలో.. సోమవారం తొలిసారిగా విమాన ల్యాండింగ్, టేకాఫ్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. దీంతో.. వచ్చే ఏడాది నుంచి ఈ ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది. ఇండిగోకు విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిబ్బందితో మాత్రమే నోయిడా ఎయిర్‌పోర్టుకు బయలు దేరింది. అవసరమైన భద్రతా తనిఖీల తర్వాత రన్‌వేపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇప్పటికే ఢిల్లీ రీజియన్‌లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఉండగా.. ఇప్పుడు నోయిడా ఎయిర్పోర్ట్ రెండవ ప్రధాన విమానాశ్రయంగా మారనుంది, నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని జెవార్‌లో ఉంది. అధునాతన హంగులు, సదుపాయాలతో రెడీ అవుతున్న ఈ ఎయిర్‌పోర్టు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో కార్యకలాపాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. #WATCH | Uttar Pradesh: Noida International Airport Limited (NIAL) conducts the first flight validation test for Noida International Airport ahead of the airport’s commercial opening in April 2025. pic.twitter.com/C3axT4mZeH— ANI (@ANI) December 9, 2024 -
విమానాలకు బాంబు బెదిరింపు
శంషాబాద్ రూరల్: శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. ఆదివారం పలు విమానాలకు బెదిరింపు ఫోన్ కాల్ రావటంతో ఓ విమానాన్ని అత్యవసరంగా దించేశారు. గోవా నుండి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో దింపారు.ఇందులో 180 మంది ప్రయాణికులు ఉన్నా రు. మరో గంటకు బెంగళూరు–హైదరాబాద్ ఇండిగో విమానానికి, మళ్లీ గంట తర్వాత హైదరాబాద్–పుణే ఇండిగో విమానానికి బెదిరింపు కాల్స్ వచ్చాయి. వీటితో పాటు ఎయిర్ఇండియా విమానానికి ఇదే తరహా కాల్ వచి్చనట్లు విమానాశ్రయం వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. -
ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు.. వారంలో రెండో ఘటన
ముంబై: దేశంలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపుతున్నాయి. ప్రముఖ నగరాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, జైళ్లు, ప్రముఖులు నివాసాలు,. విమానాశ్రయాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. తాజాగా విమానంలో కూడా బాంబు బెదిరింపులు అందాయి.ఇండిగో విమానానికి శనివారం ఉదయం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నై నుంచి 172 మంది ప్రయాణికులతో ముంబై వెళుతున్న 6E 5314 ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు రావడంతో.. అప్రమత్తమైన అధికారులు ముంబైలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానంలో నుంచి ప్రయాణికులను ఖాళీ చేయించారు. ప్రోటోకాల్ ప్రకారం విమానాన్ని ఐసోలేషన్ బే కు తరలించి విమానాన్ని తనిఖీ చేస్తున్నారు. ‘ప్రయాణికులందరిని సురక్షితంగా విమానం నుంచి ఖాళీ చేయించాం. ప్రస్తుతం విమానం తనిఖీలో ఉంది. అన్ని భద్రతా తనిఖీలు పూర్తయిన తర్వాత, విమానం టెర్మినల్ ప్రాంతంలో తిరిగి ఉంచుతాం’ అని ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.కాగా వారం రోజుల వ్యవధిలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడం ఇదే రెండోసారి. మే 28న ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలుదేరాల్సి ఉండగా.. టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో బాత్రూమ్లో ఓ టిష్యూ పేపర్‌పై ‘బాంబు’ అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేసి.. ఎయిర్‌పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన బాంబు స్వ్కాడ్ సిబ్బంది.. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. నకిలీ బెదిరింపులని గుర్తించారు. -
విమానంలో స్టాండింగ్
ముంబై: బస్సు, రైల్లో ప్రయాణికులు నిలబడి ప్రయాణించడం చూస్తుంటాం. కానీ విచిత్రంలో విమానంలో ఓ వ్యక్తి నిలబడి వెళ్లేందుకు సిద్దపడ్డాడు. ఈ ఘటన ముంబై నుంచి వారణాసి వెళ్లే ఫ్లైట్‌లో మంగళవారం జరిగింది. ముంబైలోని ఛత్రపతి శివాజీ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో ప్లైట్ టేకాఫ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నపుడు ఓ ప్రయాణికుడు నిలబడి ఉండటం చూసిన సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే అతడిని దింపేశారు. ఆ ప్రయాణికుడు ఇండిగో ఉద్యోగి. సిబ్బంది ఎయిర్‌లైన్ టికెట్లను తగ్గించడంలో భాగంగా కలిగించే ప్రయోజనం స్టాఫ్ లీజర్ ట్రావెల్లో భాగంగా ప్రయాణిస్తున్నాడు. (సిబ్బందికి ఇలా ప్రయాణించే అవకాశం ఉంటుంది) టేకాఫ్‌కు ముందు తనిఖీ చేయగా.. ఇండిగో ఫ్లైట్‌లో రావాల్సిన ఓ ప్రయాణికుడు రాలేదనే సమాచారం వచ్చింది. ఆ సీటును స్టాండ్‌బైగా ఇండిగో ఉద్యోగికిచ్చారు. తీరా ఫ్లైట్‌లోకి వెళ్లాక చూస్తే ప్రయాణికుడు ఉన్నాడు. దీంతో ఉద్యోగి నిలబడ్డాడు. అది సిబ్బంది గుర్తించి, నిలిపివేయడంతో టేకాఫ్ ఆలస్యమైంది. అది బోర్డింగ్ ప్రాసెస్ తప్పిదంగా గుర్తించారు. -
తొలిసారి కుటుంబాన్ని ఫ్లైట్ ఎక్కించిన పైలట్.. తల్లి కంటతడి
విమానంలో ప్రయాణించడం ప్రతి ఒక్కరి కల. కొంతమందికి ఇది తేలికైన విషయమే కావచ్చు. కానీ ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనుకునే వారి సంఖ్య అనేకం. వీరిలో చాలామందికి ఈ ఆశ నిరాశగానే మిగిలిపోయిన సందర్బాలూ ఉన్నాయి. తాజాగా ఓ పైలట్ తన కుటుంబాన్ని మొదటిసారి విమానం ఎక్కించాడు. దీంతో ఆనందంతో తల్లి కంటతడి పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రదీప్ కృష్ణన్ అనే వ్యక్తి ఇండిగో విమానంలో పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన కుటుంబాన్ని తొలిసారి విమానం ఎక్కించాడు. తన తల్లి, బామ్మ, తాతను చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న విమానం ఎక్కించి సర్ప్రైజ్ చేశాడు. ‘మావాళ్లు మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నారు. ఇది నాకేంతో సంతోషంగా ఉంది. చిన్నప్పుడు తాత తన స్కూటర్‌పై నన్ను తిప్పేవాడు. ఇప్పుడు నా డ్రైవింగ్‌లో తాతను విమానంలో తీసుకెళ్తున్నా’ అంటూ టేకాఫ్‌కు ముందు విమానంలోని ప్రయాణికులకు ప్రత్యేక అనౌన్స్మెంట్ ద్వారా తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. ఈ క్రమంలో పైలట్ తల్లి భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంది. అనంతరం విమానంలో ప్రయాణికులందరూ చప్పట్లు కొట్టి ఆ కుంటుబానికి వెల్కమ్ చెప్పారు. View this post on Instagram A post shared by Pradeep Krishnan (@capt_pradeepkrishnan) -
సంతకాన్ని జంతర్‌మంతర్ చేసినచో...
శూన్యంలో నుంచి కూడా కళను సృష్టించే నైపుణ్యం ఆర్టిస్ట్‌ల సొంతం. తాజా విషయానికి వస్తే... ఇండిగో ఫ్లైట్ అటెండెంట్ తెల్లకాగితంపై చేసిన సంతకాన్ని క్షణాల్లో అందమైన చిత్రంగా మార్చాడు రాబిన్ బార్. సంతకం నుంచి అప్పటికప్పుడు ప్రేయసీప్రియులను సృష్టించిన రాబిన్ బార్ ఇలాంటి అలాంటి ఆర్టిస్ట్ కాదు...రికార్డ్ హోల్డర్ స్పీడ్ పెయింటర్. జస్ట్...కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ వీడియో క్లిప్ 21 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. రాబిన్ బార్‌పై నెటిజనుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. -
విమానంలో సాంకేతిక లోపం.. గంటకుపైగా ఫ్లైట్‌లోనే సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొన్నం ప్రభాకర్, టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కకుపోయారు. మధ్యాహ్నం 2.30కు ముంబై వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సమయానికి బయల్దేరలేకపోయింది. దీంతో గంట నుంచి రేవంత్, భట్టి, టీ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి విమానంలోనే ఉండిపోయారు. కాగా సీఎం రేవంత్, భట్టి, పొన్నం, దీపాదాస్ మున్షితోపాటు ఏఐసీసీ కార్యదర్శులు నేడు ముంబైలో జరిగే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ముగింపు సభకు హాజరుకావాల్సి ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ముంబైకు మధ్యాహ్నం 2.30 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నారు. తీరా వీరు వెళ్లాల్సిన ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య రావడంతో గంటన్నర ఆలస్యం అయ్యింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలంతా విమానంలో పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇక కాసేపటి క్రితమే సాంకేతిక సమస్యను పునరుద్దరించడంతో ముంబై బయల్దేరినట్లు తెలుస్తోంది. చదవండి: ఇక రాజకీయం చూపిస్తా: సీఎం రేవంత్ -
మీ ఆశీస్సులే మమ్మల్ని బతికించాయి: స్టార్ హీరో పోస్ట్ వైరల్!
ఇటీవల విమాన ప్రమాదాల గురించే ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కూడా ఇలాంటి అనుభవాన్ని పంచుకుంది. ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా విమానం ల్యాండింగ్ సమస్య రావడంతో భయాందోళనకు గురైనట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా ద్వారా తెలిపింది. ఆ సమయంలో రష్మికతో పాటు మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా ఆమెతో పాటే ఉన్నారు. తాజాగా అలాంటి అనుభవమే మరో స్టార్ హీరోకు ఎదురైంది. తొలిసారి మృత్యువు నుంచి ఆ దేవుడే మమ్మల్ని కాపాడారంటూ కన్నడ నటుడు ధృవ సర్జా పోస్ట్ చేశారు. నా జీవితంలో మొదటిసారి ఎదురైన చేదు సంఘటనను ఇన్‌స్టా ద్వారా షేర్ చేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఫ్లైట్ ల్యాండింగ్‌కు ఇబ్బందులు రావడంతో మేమంతా తీవ్ర భయాందోళనకు గురయ్యామని ఆయన పేర్కొన్నారు. ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ప్రస్తుతం అంతా క్షేమంగా ఉన్నామని వెల్లడించారు. ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఢిల్లీ నుంచి ఓ పాట చిత్రీకరణ కోసం శ్రీనగర్‌కు ధృవ సర్జా బృందం బయలుదేరింది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అందరూ ఒక్కసారిగా తీవ్ర భయందోళనకు గురయ్యారు. కానీ పైలెట్ చాకచక్యంగా వ్యవహరించిన సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో చిత్రబృంద సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదీ మాకు నిజంగా పునర్జన్మ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాత ఇండిగో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లే మార్గంలో తీవ్ర అల్లకల్లోల వాతావరణ పరిస్థితి ఏర్పడింది. సిబ్బంది అన్ని ప్రోటోకాల్‌లను అనుసరించడంతో శ్రీనగర్‌లో సురక్షితంగా ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాం అంటూ పోస్ట్ చేసింది. కాగా..కన్నడ స్టార్ హీరో ధృవ సర్జా, వైభవి శాండిల్య జంటగా మార్టిన్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి అర్జున్ సర్జా కథ అందించగా.. ఏపీ అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఓ పాట షూట్ చేసేందుకు శ్రీనగర్ వెళ్లారు. ఈ చిత్రంలో అన్వేషి జైన్, సుకృత వాగ్లే, అచ్యుత్ కుమార్, నికితిన్ ధీర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. View this post on Instagram A post shared by Dhruva Sarja (@dhruva_sarjaa) -
విజయవాడ: రన్ వే పైకి వచ్చి మళ్లీ గాల్లోకి లేచిన విమానం
-
అయ్యయ్యో ప్యాసింజర్లు : పాస్‌పోర్ట్ లేకుండానే ఢాకాకి
వాతావారణ పరిస్థితులు విమాన ప్రయాణాలకు చాలా కీలకం. దట్టమైన పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు ఆటంకం కలిగిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ప్రయాణీకులు కూడా ఇబ్బందులు పడతారు. తాజాగా ఇండిగో విమానం అనుకోని పరిస్థితుల్లో ఇరుక్కొంది. దీంతో ముంబై నుంచి గువాహటి వెళ్లాల్సిన ప్రయాణీకులు అనూహ్యంగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ల్యాండ్ అయ్యారు. ఇండిగో ఎయిల్‌లైన్స్‌కు చెందిన 6ఈ 5319 విమానం ముంబై నుంచి గువాహటి బయల్దేరింది. కానీ అక్కడి వాతావరణం, పొగమంచు కారణంగా గువాహటి విమానాశ్రయంలో ల్యాండింగ్ కష్టంగా మారింది. దీంతో విమానాన్ని ఢాకాకు దారిమళ్లిచి ఢాకాలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. అయితే ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని ఇండిగో ప్రకటించింది. STORY | Guwahati-bound IndiGo flight from Mumbai diverted to Dhaka due to bad weather READ: https://t.co/nQPVWCfi2s VIDEO: (Source: Third Party) pic.twitter.com/NFuVYIxKPb — Press Trust of India (@PTI_News) January 13, 2024 అయితే ఈవిషయంపై ముంబై యూత్ కాంగ్రెస్ చీఫ్ సూరజ్ సింగ్ ఠాకూర్ సోషల్ మీడియా ద్వారా స్పందించారు. విమానంలో ఉన్న తామంతా పాస్‌పోర్ట్ లేకుండానే దేశ సరిహద్దులు దాటాం అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్న గువాహాటిని మంచుదుప్పటి కప్పేయడంతో ఢాకాలో ల్యాండ్ అయ్యామని తెలిపారు. 178 మంది ప్రయాణికులతో 9 గంటలుగా ఇబ్బందులు పడుతున్నాం. గౌహతి తిరిగి వెళ్లడానికి మరొక సిబ్బంది కోసం నాలుగు గంటలకు పైగా వేచి ఉన్నాం, దయచేసి వేగంగా స్పందించండి మరో ప్రయాణికుడు ట్విటర్ ద్వారా వేడుకున్నారు. I took @IndiGo6E flight 6E 5319 from Mumbai to Guwahati. But due to dense fog, the flight couldn't land in Guwahati. Instead, it landed in Dhaka. Now all the passengers are in Bangladesh without their passports, we are inside the plane.✈️ — Suraj Singh Thakur (@SurajThakurINC) January 13, 2024 దీంతో దీనిపై అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ ఇండిగో స్పందించింది. ప్రతికూల వాతావరణం కారణంగా విమానాన్ని మళ్లించామని, ప్రయాణీకులకు వీలైనంత మేర సాయం చేస్తున్నాం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్రాడార్ 24 ప్రకారం, ఇండిగో విమానం శుక్రవారం రాత్రి 8.20 గంటలకు ముంబై నుండి బయలుదేరి రాత్రి 11.10 గంటలకు గౌహతిలో దిగాల్సి ఉంది. -
గాల్లోనే ఊపిరి పోశారు!
న్యూఢిల్లీ: అది శనివారం ఉదయం వేళ. రాంచీ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానం. బయల్దేరి అప్పటికి 20 నిమిషాలైంది. ఇంకో గంట ప్రయాణం ఉంది. ప్రయాణికుల్లో పుట్టుకతోనే తీవ్ర హృద్రోగ సమస్యతో బాధ పడుతున్న ఒక ఆర్నెల్ల చిన్నారి. తల్లిదండ్రులు తనను చికిత్స కోసం ఢిల్లీ ఎయిమ్స్ తీసుకెళ్తున్నారు. ఉన్నట్టుండి ఊపిరాడక పాప అల్లాడింది. దాంతో తల్లి పెద్దపెట్టున రోదించింది. సాయం కోసం అర్థించింది. విషయం అర్థమై ప్రయాణికుల్లో ఉన్న ఇద్దరు డాక్టర్లు హుటాహుటిన రంగంలో దిగారు. తనకు తక్షణం సాయం అందించారు. విమానంలో పెద్దలకు ఉద్దేశించి అందుబాటులో ఉండే ఆక్సిజన్ కిట్ నుంచే పాపకు శ్వాస అందించారు. ఎయిర్ హోస్టెస్ వద్ద అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ కిట్ నుంచే మందులను వాడారు. అలా ఏకంగా గంట పాటు తన ప్రాణం నిలబెట్టారు. అంతసేపూ ప్రయాణికులతో పాటు సిబ్బంది కూడా ఊపిరి బిగబట్టి దీన్నంతా ఉత్కంఠతో చూస్తూ గడిపారు. విమానం ఢిల్లీలో దిగుతూనే అక్కడ అప్పటికే అందుబాటులో ఉన్న ఎమర్జెన్సీ వైద్య బృందం చిన్నారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించింది. దాంతో ప్రయాణికులతో పాటు అందరూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఆ 15 నిమిషాలు... ఇలా చిన్నారి ప్రాణాలను నిలబెట్టిన వైద్యుల్లో ఒకరు ఐఏఎస్ అధికారి కావడం విశేషం! ఆయన పేరు డాక్టర్ నితిన్ కులకరి్ణ. జార్ఖండ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. మరొకరు డాక్టర్ మొజమ్మిల్ ఫిరోజ్. రాంచీలోని సదర్ ఆస్పత్రిలో పని చేస్తున్నారు. చిన్నారి పుట్టుకతోనే పేటెంట్ డక్టస్ అర్టరియోసిస్ అనే హృద్రోగంతో బాధ పడుతోందని వారు చెప్పారు. ‘మేం వెంటనే రంగంలో దిగి పాపకు ఆక్సిజన్ అందివ్వడంతో పాటు థియోఫైలిన్ ఇంజక్షన్ ఇచ్చాం. అలాగే తల్లిదండ్రులు తమ వెంట తెచి్చన డెక్సోనా ఇంజక్షన్ కూడా బాగా పని చేసింది. హార్ట్ బీట్ ను స్టెతస్కోప్ తో చెక్ చేస్తూ వచ్చాం. తొలి 15 నుంచి 20 నిమిషాలు చాలా భారంగా గడిచింది. పెద్ధగా ఏమీ పాలుపోలేదు. కాసేపటికి పాప స్థితి క్రమ క్రమంగా మెరుగైంది‘ అని వారు తమ అనుభవాన్ని వివరించారు. సహా ప్రయాణికుల్లో పలువురు వారి అమూల్య సేవను మెచ్చుకుంటూ ఎక్స్‌లో మేసేజ్‌లు చేశారు. -
ఇండిగో విమానంలో మహిళకు గుండెపోటు.. సీపీఆర్ చేయడంతో..
యశవంతపుర: ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళకు ప్రాణాపాయం తప్పింది. బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయం నుంచి ఇండిగో విమానంలో ఓ మహిళ శుక్రవారం ఢిల్లీ బయల్దేరింది. ఈ క్రమంలో మార్గమధ్యలో ఆమెకు గుండెపోటు వచ్చింది. దీంతో, ఆమెకు సీపీఆర్ చేయడంతో ప్రమాదం నుంచి బయటపడింది. వివరాల ప్రకారం.. ఇండిగో విమానం 6E 869 ఢిల్లీ విమానంలో రోసమ్మ(60) మహిళ ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ఆమెకు గుండెపోటు రావడంతో విలవిలాడిపోయారు. కాగా, అదే విమానంలో ప్రయాణిస్తున్న బెంగళూరుకు చెందిన వైద్యుడు డాక్టర్ నిరంతర గణేశ్ ఆమెకు సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెట్టారు. ఢిల్లీలో విమానం ల్యాండింగ్ అయిన అనంతరం విమానాశ్రయ అధికారులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రమాదం నుంచి బయట పడినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇది కూడా చదవండి: ఇక రాత్రిళ్లు బాదుడే.. విద్యుత్ వినియోగదారులకు కేంద్రం షాక్ -
కేంద్ర మంత్రి ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
గువాహటి: కేంద్రమంత్రి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఈ ఘటన అస్సాంలోని గువాహటిలో చోటు చేసుకొంది. ఆదివారం ఉదయం దిబ్రూఘఢ్ వెళ్లాల్సిన ఇండిగో విమాన ఇంజన్లో సాంకేతిక సమస్య ఏర్పడింది. దీంతో విమానాన్ని గువాహటిలోని లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. లాగే కేంద్ర పెట్రోలియం, సహజవాయుశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలితోపాటు ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ప్రశాంత్ ఫుకాన్, తెరష్ గోవాలా ఉన్నారు ప్రమాద సమయంలో విమానంలో 150కి పైగా ప్రయాణికులు ఉండగా వారంతా సురక్షింగా ఉన్నట్లు సమాచారం. కాగా విమాన ఘటనపై ఐ కేంద్ర మంత్రి స్పందించారు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి విమానంలో బల్దేరానని తెలిపారు. విమానం టేకాఫ్ అయ్యాక 15 నుంచి 20 నిమిషాల తర్వాత దిబ్రూగఢ్‌లో దిగాల్సి ఉందన్నారు. కానీ సాంకేతిక సమస్య తలెత్తడంతో తిరిగి గువాహాటిలో అత్యవసరంగా ల్యాండ్ అయిందని, తాము సురక్షితంగా ఉన్నామని తెలిపారు. చదవండి:Odisha Train Accident: వామ్మో రైలా..! రైల్వే ఆడిట్ రిపోర్ట్‌లో ఏముంది? A Dibrugarh-bound IndiGo flight was diverted to Guwahati’s Lokpriya Gopinath Bordoloi International after the pilot of the plane announced snag in engine of the aircraft. Over 150 passengers were travelling on the flight, including Union Minister of State for Petroleum and… pic.twitter.com/umZb0sm75V — ANI (@ANI) June 4, 2023 -
గాల్లో విమానంలో అనూహ్య ఘటన
బెంగళూరు: మద్యం మత్తులో విమానం అత్యవసర ద్వారం తెరిచేందుకు యత్నించిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ నుంచి బెంగళూరు వస్తున్న ఇండిగో విమానంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. యూపీలోని కాన్పూర్‌కు చెందిన ప్రతీక్(30) ఇండిగోకు చెందిన 6ఈ308 ఢిల్లీ–బెంగళూరు విమానం 18ఎఫ్ సీట్లో కూర్చున్నాడు. విమానం బయలుదేరిన కొద్దిసేపటికి మత్తులో ఉన్న ప్రతీక్ తోటి ప్రయాణికుల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాడు. అంతటితో ఆగక అత్యవసర ద్వారం తెరిచేందుకు రాగా సిబ్బంది అతడిని వారించారు. వినిపించుకోకపోవడంతో అతడ్ని బలవంతంగా కూర్చోబెట్టారు. విమానం బెంగళూరుకు చేరుకున్నాక పైలట్ అతడిని సీఐఎస్ఎఫ్ సిబ్బందికి అప్పగించారని ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. ప్రతీక్‌పై ఐపీసీ సెక్షన్లు 290, 336లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ చట్టంలోని 11(ఏ) కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, హైదరాబాద్: ఇండిగో విమానం ఒకటి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. బెంగళూరు నుంచి వారణాసి మధ్య 6E897 నెంబరు ఇండిగో విమానం మంగళవారం ఉదయం 5గం.10ని. టేకాఫ్ అయ్యింది. అయితే.. సాంకేతిక సమస్యల తలెత్తడంతో శంషాబాద్ విమానాశ్రయంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండ్ చేశారు. ఉదయం 6గం. 16ని. హైదరాబాద్ శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం హఠాత్తుగా ల్యాండ్ అయ్యింది. సాంకేతిక సమస్యలు ఏర్పడటం వల్ల ప్రయాణికుల కోసం మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. -
విమానంలో ప్రయాణికుడి రచ్చ.. ఫ్లోర్‌పైనే వాంతులు, మూత్ర విసర్జన
న్యూఢిల్లీ: విమానంలో ప్రయాణికులు అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విమానంలో కొందరు ప్రయాణికుల పిచ్చి చేష్టలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తోటి ప్రయాణికులపై మూత్ర విసర్జన చేసిన పలు సంఘటనలు మరవక ముందే తాజాగా మరొకటి వెలుగు చూసింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి గాల్లోని విమానంలో హంగామా సృష్టించాడు. గువాహతి నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు వాంతులు చేసుకున్నాడు. అంతేగాక టాయిలెట్ బయటే మల వి'ర్జన చేశాడు. తాగిన మైకంలో సదరు వ్యక్తి రెస్ట్రూమ్ నుంచి బయటకు వచ్చి ఫ్లోర్‌మీదే మూత్ర విసర్జన చేశాడు. ప్రయాణికుడు వ్యవహరించిన తీరుతో సీట్ల మధ్య నడిచే దారంతా అపరిశుభ్రంగా మారింది. తాగుబోతు ప్రవర్తనతో తోటి ప్రయాణికులందరూ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటన మార్చి 26న ఇండిగో విమానం 6E 762లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతరం విమానంలోని మహిళా సిబ్బంది వెంటనే స్పందించి అక్కడంతా శుభ్రం చేయాల్సి వచ్చింది. ప్రయాణికుడు చేసిన రచ్చను మహిళ క్లీన్ చేస్తున్న దృశ్యాలను తోటి ప్రయాణికుడు భాస్కర్ దేవ్ కొన్వర్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఫ్లోర్ క్లీన్ చేసిన మహిశా సిబ్బందిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. ‘ఏ పరిస్థితినైనా మహిళలు చక్కగా నిర్వహించగలరు. సెల్యూట్ గాళ్ పవర్’ అంటూ కొనియాడుతున్నారు. మరోవైపు విమానంలో అనుచితంగా ప్రవర్తించిన అతడిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. Indigo 6E 762 : Guwahati to Delhi.Intoxicated passenger vomited on the aisle and defecated all around the toilet.Leading lady Shewta cleaned up all the mess and all the girls managed the situation exceptionally well.Salute girl power🙏#Indigo #girlpower #DGCA pic.twitter.com/iNelQs48Tc — Bhaskar Dev Konwar @BD (@bdkonwar) March 26, 2023 -
ఇండిగో విమానంలో మెడికల్ ఎమర్జెన్సీ.. అయినా దక్కని ప్రాణం
ఢిల్లీ నుంచి దోహా వెళుతున్న ఇండిగో విమానం ఏ320-271ఎన్లో గాల్లో ఉండగానే.. అందులోని ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. దీంతో విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా పాకిస్థాన్‌లోని కరాచీకి మళ్లీంచాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు. కరాచీ ఎయిర్‌పోర్టు కూడా ఇండిగో విమానం టేకాఫ్‌కు అనుమతించింది. అయితే అప్పటికే సదరు ప్రయాణికుడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని నైజీరియాకి చెందిన 60 ఏళ్ల అబ్ధుల్లాగా అధికారులు గుర్తించారు. కరాచీలోని సివిల్ ఏవియేషన్ అధికారులు మాట్లాడుతూ..ప్రయాణికుడు విమానంలో అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ కోసం పైలెట్ మమ్మల్ని అభ్యర్థించాడు. అత్యవసరంగా ల్యాండింగ్ చేసినా.. ఆ ప్రయాణికుడు చనిపోవడంతో మేము చాలా చింతిస్తున్నాం’ అని అన్నారు. కరాచీలోని అధికారులు అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసి, మరణ ధృవీకరణ పత్రాన్ని కూడా జారీ చేశారు. అప్పటి వరకు ఇండిగో విమానం కరాచీలోనే దాదాపు ఐదు గంటల వరకు నిలిపేశారు. ఇదిలా ఉండగా, ఇండిగో ఎయిర్‌లైన్స్ ఓ తాజా ప్రకటనలో.. సంబంధిత అధికారుల సమన్వయంతో విమానంలోని ఇతర ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. అలాగే ఇండిగో విమానం మృతి చెందిన ప్రయాణికుడితో తిరిగి ఢిల్లీకి చేరుకున్నట్లు తెలిపింది. (చదవండి: టైర్ పేలడం యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు..) -
ప్రయాణికుడి హల్చల్.. విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్..
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు, విమాన ప్రయాణాల సమయంలో కొందరి అతి చేష్టాల గురించి వింటూనే ఉన్నాము. కొందరు ప్రయాణికులు ఓవర్ యాక్షన్‌తో ఇతర ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నాగపూర్ నుంచి ముంబై వెళ్తున్న 6E-5274 ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు(ప్రణవ్ రౌత్) హంగామా చేశాడు. ఇండిగో విమానం ప్రయాణంలో(గాలిలో) ఉన్న సమయంలో ప్లైట్‌లో ఉన్న ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిని చూసిన విమాన సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ప్రయాణికుడిని అడ్డుకున్నారు. కాగా, సదరు ప్రయాణికుడి ఓవరాక్షన్ కారణంగా విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అనంతరం, సిబ్బంది ఈ విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక, విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత.. ప్రణవ్ రౌత్‌ను సీఐఎస్ఎఫ్ బలగాలకు అప్పగించారు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలో అతిగా ప్రవర్తించినందుకు ప్రణవ్ రౌత్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ హ్యాండిల్ తొలగించినట్లు విమాన సిబ్బంది గుర్తించారు. Mumbai Airport police filed a case against a passenger who tried to open the emergency exit door of IndiGo flight which landed from Nagpur to Mumbai. After landing, the senior cabin crew noticed that cover of the handle of emergency door has been removed. pic.twitter.com/gyvIlxRYoK — JetArena (@ArenaJet) January 29, 2023 -
వినియోగంలోకి విస్తరించిన అప్రాన్
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం)లో సుమారు రూ.32 కోట్లతో నూతనంగా నిర్మించిన అప్రాన్‌ను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీన ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఎం.లక్ష్మీకాంతరెడ్డి ప్రారంభించారు. ఈ అప్రాన్‌లోకి తొలిసారిగా పార్కింగ్ చేసిన హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి ఎయిర్పోర్ట్ అగ్నిమాపక శాఖ వాటర్ క్యానన్ సెల్యూట్ పలికింది. విస్తరించిన కొత్త అప్రాన్‌లో ఆరు ఎయిర్‌బస్ ఎ321 విమానాలను పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. అంతే కాకుండా కొత్తగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నుంచి ఆరు ఏరో బ్రిడ్జిల ద్వారా నూతన అప్రాన్‌ను అనుసంధానించనున్నారు. దీనివల్ల ప్రయాణికులు ఏరో బ్రిడ్జిల ద్వారా నేరుగా విమానాల్లోకి రాకపోకలు సాగించవచ్చు. భవిష్యత్ అవసరాల నిమిత్తం విస్తరించిన భారీ అప్రాన్‌ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావడం విమానాశ్రయ చరిత్రలో మరో మైలురాయి అని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ టెర్మినల్ నుంచి బస్ సర్వీస్‌లు... అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ నుంచి విజయవాడ మీదుగా ఈ నెల 30వ తేదీ నుంచి గుంటూరు వరకు ఆర్టీసీ బస్ సర్వీస్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు శనివారం ఆర్టీసీ అధికారులు ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు స్వస్థలాలకు వెళ్లేందుకు గాను ఈ సర్వీస్‌ను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి సోమ, బుధ, శనివారాల్లో సాయంత్రం వేళ ఈ బస్ సర్వీస్ నడపనున్నట్లు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం ఈ సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. -
Shamshabad Airport: విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం..
హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండింగ్ సమయంలో గందరగోళం నెలకొంది. విశాఖ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం రన్‌వేపై ల్యాండ్ అవుతూనే టేకాఫ్ తీసుకుంది. పైలట్ తీరుతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ల్యాండ్ కావాల్సిన విమానం మళ్లీ టేకాఫ్ కావడం చూసి షాక్ అయ్యారు. అయితే ఐదు నిమిషాల తర్వాత విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేశాడు పైలట్. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. రన్‌వేపై వెలుతురు సరిగా లేకపోవడంతోనే పైలట్ ఇలా చేసినట్లు తెలుస్తోంది. చదవండి: ఎమ్మెల్సీ కవితతో సినీ నటుడు శరత్ కుమార్ భేటీ -
దురదృష్టవశాత్తు ఆ ఫ్లైట్‌లో టికెట్ బుక్ చేసుకున్నా..!
విమానంలో అందించే ఆహారం విషయంలో ఓ ప్రయాణికుడు ఎయిర్‌హోస్టెస్‌తో గొడవ పడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇస్తాంబుల్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానంలో ఈ సంఘటన జరిగింది. అందులోని గుర్ప్రీత్ సింగ్ హాన్స్ అనే మరో ప్రయాణికుడు ఈ సంఘటనను వీడియో తీసి డిసెంబర్ 19న ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా దురదృష్టవశాత్తు ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకున్నానంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘దూర ప్రాంతాలకు వెళ్లే అంతర్జాతీయ విమానాల్లో అనువైన ఆహారం అందించాలి. కానీ అలా జరగటం లేదు. ఇచ్చిన ఆహారం తిని కొందరు సర్దుకోగలరు కానీ అందరు అలా ఉండలేరు. ఆహారం విషయంలో ఓ ప్రయాణికుడు ఎలా ప్రవర్తిస్తున్నాడు, సిబ్బంది ఎలా ప్రవర్తిస్తున్నారు అనేది ప్రత్యక్షంగా చూశాను. ’ అని రాసుకొచ్చారు గుర్ప్రీత్ సింగ్ హాన్స్. Unfortunately, I mean it Unfortunately I book a flight with @IndiGo6E from #Istanbulairport to @DelhiAirport people are right staff are right but @IndiGo6E can't. Every international LONG DISTANCE(we can manage from Dubai to India ) flight has a food choices video in front — Er. Gurpreet Singh Hans☬ (@Iamgurpreethans) December 18, 2022 వీడియో ప్రకారం.. ఎయిర్‌హోస్టెస్‌తో ఓ ప్రయాణికుడు వాదిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ‘నీ వల్ల విమానంలో గందరగోళం నెలకొంది. నీ బోర్డింగ్‌లో ఉన్న ఆహారమే అందిస్తున్నాం. ప్లీజ్ అర్థం చేసుకోండి.’ అని ఎయిర్‌హోస్టెస్ సూచించారు. ఈ క్రమంలోనే వాగ్వాదం జరిగింది. మరో సిబ్బంది కలుగ జేసుకుని సర్దిజెప్పే ప్రయత్నం చేశారు. సిబ్బంది పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఈ క్రమంలో ఆమె సర్వెంట్, ఒక ఉద్యోగిని, నేను మీ సర్వెంట్‌ని కాదు అని పేర్కొన్నారు ఆ ప్రయాణికుడు. ఎయిర్‌హోస్టెస్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లగా వివాదం సద్దుమణిగింది. అయితే, ఈ సంఘటనపై ఎయిర్‌లైన్స్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. Even staff checked our boarding pass before giving us food which is not right for long distances #internetflight @IndiGo6E @AAI_Official @DelhiAirport @GovtOfIndia_ one thing you must need to realise is that "we choose you, you can't" pic.twitter.com/2uLIqhG5vw — Er. Gurpreet Singh Hans☬ (@Iamgurpreethans) December 19, 2022 ఇదీ చదవండి: ఇదేందయ్యా రాహుల్.. కాంగ్రెస్ కార్యకర్తకు చేదు అనుభవం! -
గోవాలో ఇండిగో విమానానికి తప్పిన ముప్పు.. హైదరాబాద్ నుంచి 180మందితో..
సాక్షి, హైదరాబాద్: గోవాలో ఇండిగో విమానానికి తృటిలో పెనుప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి గోవా ఇండిగో ఫ్లైట్ వెళ్లింది. అక్కడ ల్యాండింగ్ సమయంలో రన్‌వే పైకి మరో విమానం దూసుకొచ్చింది. దీంతో ఇండిగో విమానం ల్యాండ్ అయిన 15 సెకన్లలోనే మళ్లీ టేకాఫ్ అయింది. గాల్లోనే 20 నిమిషాలపాటు చక్కర్లు కొట్టింది. చివరకు ఏటీసీ నుంచి క్లియరెన్స్ రావడంతో సేఫ్‌గా ల్యాండ్ అయింది. చదవండి: (జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై కేసు నమోదు) -
విమానంలో ప్రయాణికుడికి అస్వస్థత.. ప్రాథమిక చికిత్స చేసిన గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ-హైదరాబాద్ ఇండిగో విమానంలో అస్వస్థతకు గురైన ఓ వ్యక్తికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రాథమిక చికిత్స చేశారు. వారణాసి వెళ్లిన గవర్నర్ తిరిగి హైదరాబాద్‌కు విమానంలో ప్రయాణిస్తుండగా, ఓ వ్యక్తికి ఛాతీ నొప్పి రావడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన విమాన సిబ్బంది ఫ్లైట్‌లో ఎవరైనా డాక్టర్లు ఉన్నారా అని అనౌన్స్మెంట్ చేశారు. విషయం తెలుసుకున్న తమిళిసై వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించి ఉపశమనం కలిగించారు. కోలుకున్న ప్రయాణికుడు సరైన సమయంలో స్పందించిన గవర్నర్, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు. అదే విధంగా ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు తమిళిసైకి అభినందనలు తెలిపారు. అయితే విమానంలో ప్రాథమిక చికిత్సకు సంబంధించి కిట్ తప్పనిసరిగా ఉండాలన్నారు. అలాగే విమాన సిబ్బందికి సీపీఆర్‌పై కనీస అవగాహన ఉండేలా శిక్షణ ఇస్తే బాగుంటుందన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు ఈ చికిత్స క్రమాన్ని కొన్ని ఫోటోలు తీసి తన ట్విట్టర్ లో షేర్ చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కాగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ వైద్య విద్యలో ఉన్నత విద్యావంతురాలు. ఎంబీబీఎస్, ఎండీ డీజీఓ లాంటి వైద్య విద కోర్సులు చేసిన విషయం విదితమే. -
కేరళ సీఎం పినరయి విజయన్‌కు కోర్టు షాక్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు షాక్ ఇచ్చింది స్థానిక కోర్టు. ఎల్డీఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్‌తో పాటు సీఎం వ్యక్తిగత సిబ్బంది ఇద్దరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను బుధవారం ఆదేశించింది తిరువనంతపురం కోర్టు. ఇండిగో విమానంలో కాంగ్రెస్ నేతలతో జరిగిన తోపులాటకు సంబంధించి.. జయరాజన్‌పై ఎలాంటి చర్యలు అవసరం లేదని, తీసుకోబోమని అసెంబ్లీ సాక్షిగా సీఎం పినరయి విజయన్ ప్రకటించారు. ఈ ప్రకటన ఇచ్చిన మరుసటి రోజే .. ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి ఝలక్ ఇచ్చింది కోర్టు. ఈ వ్యవహారానికి సంబంధించి బెయిల్ మీద బయటకు వచ్చిన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఇద్దరు.. జయరాజన్‌పై ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బుధవారం విచారణ సందర్భంగా తిరువనంతపురం జ్యూడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు జయరాజన్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందేనని వలియాథుర పోలీసులను ఆదేశించింది. జయరాజన్‌తో పాటు సీఎం వ్యక్తిగత సిబ్బంది అనిల్ కుమార్, సునీష్లను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలని, బాధితులు పేర్కొంటున్నట్లు కుట్రపూరిత నేరం.. హత్యాయత్నం కింద నేరారోపణలు నమోదు చేయాలని పోలీసులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. జూన్ 13వ తేదీన.. ఇండిగో విమానంలో సీఎం పినరయి విజయన్ సమక్షంలోనే నిరసన చేపట్టారు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఆ సమయంలో జయరాజన్, సీఎం సిబ్బంది తమ కార్యకర్తలపై దాడి చేశారన్నది కాంగ్రెస్ వాదన. నిరసనల వ్యవహారానికి సంబంధించి హత్యాయత్నం నేరం కింద ఇద్దరు కార్యకర్తలతో పాటు సూత్రధారిగా అనుమానిస్తూ మాజీ ఎమ్మెల్యే శబరినాథన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. సరైన ఆధారాలు లేవంటూ వాళ్లకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. In a major security lapse, Youth Congress workers protest against Kerala Chief Minister Pinarayi Vijayan on the flight from Kannur to Trivandrum. Meanwhile, the Kerala CM has arrived in Trivandrum. More details awaited. @IndiaAheadNews pic.twitter.com/2oKyz20rsr — Korah Abraham (@thekorahabraham) June 13, 2022 ఇదిలా ఉంటే కోర్టు ఆదేశాలపై ఈపీ జయరాజన్ స్పందించారు. కోర్టులన్నాక ఇలాంటి ఆదేశాలు ఇస్తాయని, వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు జయరాజన్‌తో పాటు ఇద్దరు కాంగ్రెస్ కార్యకర్తలపై నిషేధం విధించింది ఇండిగో. ఈ బ్యాన్పై స్పందించిన జయరాజన్.. జీవితంలో తానుగానీ, తన కుటుంబంగానీ ఇండిగో ఫ్లైట్ ఎక్కబోమంటూ శపథం చేశారు. అంతేకాదు ఈ మధ్యే రైలులో ప్రయాణించి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వదిలారు కూడా. అయితే జయరాజన్‌పై నిషేధం ప్రకటించిన కొన్నాళ్లకే.. ఇండిగోకు చెందిన ఓ బస్సును ఫిట్నెస్ లేదంటూ అధికారులు సీజ్ చేయడం విశేషం. -
ఇండిగో విమానంలో ‘బాంబు’ కలకలం
పాట్నా: ఓ ప్యాసింజర్ చేసిన పని.. ప్రయాణికులతో పాటు పోలీసులను, విమాన సిబ్బందిని హడలగొట్టింది. ఇండిగో విమానంలో బాంబు కలకలం చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన ఇండిగో విమానం(6e 2126)లో ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పాడు. దీంతో విమానాన్ని పాట్నా జయ్ ప్రకాశ్ నారాయణ్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా తనిఖీలు చేశారు. బుధవారం రాత్రి పాట్నా నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రయాణికుడు తన బ్యాగులో బాంబు ఉందని చెప్పడంతో అంతా ఉలిక్కి పడ్డారు. ప్రయాణికులందరినీ విమానం నుంచి కిందకు దించారు విమాన సిబ్బంది. ఆపై పోలీసులు బాంబు-డాగ్ స్క్వాడ్ సాయంతో అతని బ్యాగ్‌ను చెక్ చేశారు. అలాగే ప్రోటోకాల్ ప్రకారం విమానం మొత్తం తనిఖీలు చేపట్టి.. ఏం లేదని నిర్ధారించారు. బాంబు బెదిరింపునకు పాల్పడ్డ ప్రయాణికుడు తన కుటుంబంతో ప్రయాణిస్తున్నాడని, అతన్ని అదుపులోకి తీసుకున్నామని, అతని మానసిక స్థితిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పాట్నా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు. తనిఖీల అనంతరం విమానాన్ని ప్రయాణానికి అనుమతించారు. Bihar | Visuals from Patna airport where the Bomb squad & Police personnel are conducting inspection after a man in a Delhi-bound flight reportedly claimed that he had a bomb in his bag. His bag was checked further & no bomb was found pic.twitter.com/BkNxpjZ2QC — ANI (@ANI) July 21, 2022 -
కరాచీలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
వరుస ఘటనల కలకలం: ఇండిగో విమానం క్యాబిన్లో పొగలు
న్యూఢిల్లీ: అసలే వర్షాకాలం. దీనికి తోడు పలు సంస్థల విమానాల్లో వెలుగులోకి వస్తున్న సాంకేతిక లోపాలు విమాన ప్రయాణీకుల్లో గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే స్పైస్‌జెట్ విమానంలో వరుస ఘటనలు, విస్తారా విమానంలో ఇంజన్ ఫెయిల్ లాంటి అంశాలు ఆందోళన రేపాయి. ఇపుడిక ఈ జాబితాలో ఇండిగో చేరింది. ఇండోర్‌లో విమానాశ్రయంలో దిగిన తర్వాత ఇండిగో విమానంలో పొగలు వ్యాపించడం కలకలం రేపింది రాయ్‌పూర్-ఇండోర్ ఇండిగో విమానం మంగళవారం ల్యాండ్ అయిన తర్వాత క్యాబిన్లో పొగలు వచ్చినట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) బుధవారం తెలిపింది. అయితే ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ, ఈ ఘటనపై విచారణ చేపట్టామని డీజీసీఏ వెల్లడించింది. గత మూడు వారాల్లో అసాధారణ సంఘటనలు నమోదవుతున్నాయి. గో-అరౌండ్, మిస్డ్ అప్రోచ్‌లు, డైవర్షన్, మెడికల్ ఎమర్జెన్సీలు, ఎమర్జెనీ ల్యాండింగ్, క్యాబిన్లో పొగలు, వాతావరణం, టెక్నికల్, బర్డ్ హిట్లు ఉన్నాయి. కాగా గత 18 రోజుల్లో ఎనిమిది సాంకేతిక లోపాల ఘటనల నేపథ్యంలో డీజీసీఏ బుధవారం స్పైస్‌జెట్‌కి షో-కాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. -
ఇండిగో ఘటనపై స్పందించిన సీఈవో
CEO of IndiGo Ronojoy Dutta has expressed regret: దివ్యాంగ చిన్నారి విమానం ఎక్కేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బంది నిరాకరించడంతో ఆ సంస్థ సీఈవో రోనోజోయ్ దత్తా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన పై విచారణ వ్యక్తం చేయడమే కాకుండా ఆ చిన్నారి కోసం ఎలక్ట్రిక్ వీల్ చైర్‌ని కొనుగోలు చేయాలనుకున్నట్లు తెలిపారు. శారీరక వికలాంగుల సంరక్షణ కోసం తమ జీవితాలను అంకితం చేసే తల్లిదండ్రులే మన సమాజానికి నిజమైన హీరోలు అని అన్నారు. ఆయన బాధిత కుటుంబానికి తన సానుభూతిని తెలియజేశారు. ఆ ఘటన గురించి దత్తా మాట్లాడుతూ..."మా కస్టమర్లకు మర్యాదపూర్వకంగా, దయతో కూడిన సేవను అందించడమే మాకు ముఖ్యం. ఐతే భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా విమానాశ్రయ సిబ్బంది విమానం ముందుకు సాగుతుందా లేదా అనే దానిపై క్లిష్టమైన పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయం తీసుకోవల్సి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఒక సంస్థగా సాధ్యమైనంత వరకు సరైన నిర్ణయం తీసుకుందనే నేను భావిస్తున్నాను". అని అన్నారు. అంతేకాదు ఈ ఘటనపై పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పైగా ఆయన తానే స్వయంగా దర్యాప్తు చేపడతానని చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఆ ఘటన తాలుకా వీడియో సోషల్ మాధ్యమాల్లో తెగ హల్ చల్ చేస్తోంది. Here is the video of the incident that happened at Ranchi airport where @IndiGo6E airlines denies boarding to a special need child along with his child. Seems lack of empathy from Indigo staff, not the first time though. Indigo to issue a statement shortly. @JM_Scindia https://t.co/5ixUDZ009a pic.twitter.com/SyTNgAQIT6 — Dibyendu Mondal (@dibyendumondal) May 8, 2022 (చదవండి: ఇండిగో సిబ్బంది తీరుపై జ్యోతిరాదిత్య సింథియా ఆగ్రహం.. స్వయంగా దర్యాప్తు చేస్తానని ట్వీట్) -
సాంకేతిక సమస్యతో గాలిలో చక్కర్లు కొట్టిన విమానం
సాక్షి, బెంగళూరు/రేణిగుంట: రాజమండ్రి నుంచి తిరుపతికి వచ్చిన ఇండిగో విమానం సాంకేతిక కారణాల దృష్ట్యా ఇక్కడ ల్యాండింగ్ చేయకుండా గాల్లోనే చక్కర్లు కొట్టించి.. చివరకు అత్యవసరంగా బెంగళూరుకు మళ్లించారు. అందులోని ప్రయాణికులు సుమారు 4 గంటలపాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఆ విమానంలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుతోపాటు మొత్తం 70 మంది ప్రయాణికులున్నారు. వివరాల్లోకి వెళితే... రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి తిరుపతికి 70మంది ప్రయాణికులతో మంగళవారం ఉదయం 9.20 గంటలకు ఇండిగో విమానం బయల్దేరింది. 10.30 గంటలకు ఇక్కడ ల్యాండ్ అయి.. 11.15 గంటలకు తిరిగి రాజమండ్రి వెళ్లాల్సి ఉంది. కాసేపట్లో రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుందనుకుంటున్న సమయంలో పైలట్ చాలాసేపు విమానాన్ని రేణిగుంట చుట్టుపక్కల గాల్లోనే తిప్పారు. ల్యాండింగ్‌కు సాంకేతిక సమస్య తలెత్తినట్లు గుర్తించిన పైలట్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. ప్రయాణికులకు మాత్రం మబ్బుల వల్ల ల్యాండింగ్‌కు ఇబ్బందిగా మారిందని, దీనికితోడు ఫ్యూయెల్ కూడా అయిపోతోందని, విమానాన్ని బెంగళూరుకు అత్యవసరంగా మళ్లిస్తున్నట్లు చెప్పారు. బెంగళూరు విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయ్యాక దాని డోర్లు తెరుచుకోకపోవడంతో ప్రయాణికులంతా నాలుగు గంటలపాటు విమానంలోనే నిరీక్షించారు. తిరుపతిలో దిగాల్సిన ప్రయాణికులను మధ్యాహ్నం ఒంటిగంటకు బెంగళూరు విమానాశ్రయంలో వదిలేయడంతో అక్కడ నుంచి వారంతా అవస్థలు పడి రోడ్డు మార్గాన తిరుపతికి బయల్దేరారు. సాంకేతిక సమస్యను నిపుణులు పరిష్కరించడంతో అక్కడే వేచి ఉన్న కొంతమంది ప్రయాణికులతో మధ్యాహ్నం 2.10 గంటలకు ఈ విమానం రేణిగుంటకు చేరుకుంది. కాగా, ఈ విమానం తిరుపతిలో ప్రయాణికులను ఎక్కించుకుని రాజమండ్రి చేరుకుని అక్కడ నుంచి రేణిగుంట మీదుగా మధురైకు సాయంత్రం 4.30గంటలకు వెళ్లాల్సి ఉంది. అనూహ్య పరిణామంతో మధురైకు విమాన సర్వీసును ఇండిగో యాజమాన్యం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇండిగోపై కేసు వేస్తా: రోజా ఎమ్మెల్యే ఆర్కే రోజా మీడియాతో ఫోన్లో మాట్లాడుతూ.. సాంకేతిక లోపం కారణంగా విమానాన్ని బెంగళూరు ఎయిర్ పోర్టుకు తీసుకువచ్చామని విమాన సిబ్బంది చెప్పారన్నారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించిన అనంతరం విమానాన్ని తిరుపతికి పంపుతామని తెలిపారన్నారు. టికెట్‌కు అదనంగా రూ.5 వేలు అడిగారని, ఇండిగో యాజమాన్యంపై కేసు వేస్తానని రోజా అన్నారు. -
విమానమెక్కిన పాము
-
గన్నవరంలో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, కృష్ణా జిల్లా: ఇండిగో విమానంలో ఓ మహిళ అస్వస్థతకు గురవడంతో గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర లాండింగ్ చేశారు. బెంగుళూరు నుండి బాగ్ డోగ్ర వెళ్లే విమానంలో మహిళా ప్రయాణికురాలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో గన్నవరం విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానాశ్రయం నుండి అంబులెన్స్ సాయంతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చదవండి: కరోనా కట్టడి చర్యలపై దుష్ఫ్రచారం.. ఏపీ సర్కార్ సీరియస్ రూ.కోట్ల ఆస్తులు ఉన్నా.. అనాథే..! -
ఇండిగో విమానంలో విదేశీయుడి హల్చల్
హైదరాబాద్ : గోవా నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ జర్మనీ దేశస్థుడు హల్చల్ చేశాడు. విమానం బాత్రూమ్లో బట్టలు లేకుండా తిరుగుతున్న ఆ వ్యక్తిని సీఐఎస్ఎఫ్ పోలీసులు గుర్తించారు. దీంతో పైలట్ విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసర ల్యాండింగ్ చేశాడు. ఆ వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడనే అనుమానంతో.. వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆ వ్యక్తి ఉస్మానియా ఆస్పత్రిలో పోలీసుల కళ్లుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. -
అకస్మాత్తుగా టేకాఫ్ రద్దు, విమానంలో కేంద్రమంత్రి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర రవాణా శాఖమంత్రి నితిన్‌గడ్కరీ ప్రయాణించే ఇండిగో విమానాన్ని అకస్మాత్తుగా నిలిపి వేయాల్సి వచ్చింది. నాగపూర్ నుంచి ఢిల్లీ వెళుతున్న ఇండిగో విమానంలో తీవ్రమైన సాంకేతికలోపం తలెత్తడంతో టేకాఫ్‌ను నిలిపివేశారు. ఇండిగో ఫ్లైట్ 6 ఇ 636లో లోపాన్ని గుర్తించిన పైలట్ టేకాఫ్‌ను నిలిపివేయాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇండిగో కూడా ధృవీరించింది. కేంద్రమంత్రి గడ్కరీ సహా, 143 మంది ప్రయాణీకులు ఇందులో ఉన్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని ఢిల్లీలోని సంబంధిత మంత్రిత్వ శాఖ కార్యాలయానికి సమాచారం అందించామని వెల్లడించింది. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నారనీ నాగపూర్ విమానాశ్రయం సీనియర్ డైరెక్టర్ విజయ్ మూలేకర్ తెలిపారు. -
గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానం గాలిలో అదే పనిగా చక్కర్లు కొడుతూ.. ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు బయలుదేరిన ఇండిగో విమానంలో ఒక్కసారిగా సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్ అయి.. గాలిలోకి ఎగిరిన తర్వాత విమానంలో సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్లు.. విమానాన్ని కాసేపు ఆకాశంలోనే చక్కర్లు కొట్టించారు. దీంతో ప్రయాణికులు ఏం జరగబోతుందోనన్న ఉత్కంఠ కాసేపు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే, ఆకాశంలో చక్కర్లు కొట్టిన విమానం ఎట్టకేలకు తిరిగి శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అవ్వడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన ఆమిర్
ఓ టాప్ హీరో సాధరణ ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తే.. అబ్బో ఊహించడానికే కాస్తా అతిగా అనిపిస్తుంది కదా. కానీ దీన్ని నిజం చేసి చూపారు బాలీవుడ్ మిస్టర్ పర్ఫేక్షనిస్ట్ ఆమిర్ ఖాన్. సాధరణ ప్రయాణికుడి మాదిరిగా ఎకానమీ క్లాస్‌లో పర్యటించారు ఆమిర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇండిగోకు చెందిన విమానంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ఉన్నట్టుండి ఎకానమీ క్లాస్‌లో దర్శనమిచ్చారు. ఓ సాధారణ ప్రయాణికుడిలా విండో సీటులో కూర్చుని.. తోటి ప్రయాణికులతో నవ్వుతూ మాట్లాడారు. దీన్ని కాస్తా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో.. అది కాస్తా తెగ వైరలవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆమిర్ సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. ‘ఆమిర్ భాయ్.. నువ్వు రియల్ హీరో’ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాతో ఘోర పరాజయాన్ని చవి చూసిన ఆమిర్.. త్వరలోనే ‘లాల్ సింగ్ చద్దా’ అనే చిత్రంలో నటించబోతున్నారు. -
విమానంలో నిరసన..పార్టీ అధ్యక్షుడి అరెస్ట్
సాక్షి, మధురై: విమానంలో నిరసన చేపట్టారని ఒక పార్టీ అధ్యక్షుడిని అరెస్ట్ చేసిన ఘటన శనివారం తమిళనాడులోని మధురై విమానాశ్రయంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. చెన్నై నుంచి మధురై వెళ్తున్న ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్బీ) అధినేత కేఏ మురుగన్ నిరసనకు దిగారు. మధురై విమానాశ్రయ పేరును యు. ముత్తురామలింగ థేవార్గా మార్చాలని, మురుగన్‌తోపాటు ఏఐఎఫ్బీ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. విమానం మధురై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగానే, నినాదాలకు దిగిన మురుగన్, ఏఐఎఫ్బీ కార్యకర్తలను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ముత్తురామలింగది థేవార్ సామాజికవర్గం. మాజీ పార్లమెంట్ సభ్యుడు ముత్తురామలింగ 1963లో మరణించారు. ఆయనను థేవార్ కులస్థుల ఆరాధ్య నాయకుడిగా చెప్తుంటారు. మధురై విమానాశ్రయ పేరును ముత్తురామలింగ థేవార్గా మార్చాలని మురుగన్, తమిళనాడు ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు కలసి విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. కొద్దిసేపటి తర్వాత మురుగన్‌తో సహా సదరు పార్టీ కార్యకర్తలను పోలీసులు విడిచిపెట్టారు. -
ఇండిగోకు బాంబు బెదిరింపు
ముంబై : ముంబై నుంచి ఢిల్లీ మీదుగా లఖ్‌నవూ వెళ్లాల్సిన ఓ ఇండిగో విమానంలో బాంబు పెట్టారనే సమాచారం కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణాన్ని వాయిదా వేసి విమానాన్ని పూర్తిగా తనిఖీలు చేశారు. అనంతరం విమానంలో ఎటువంటి బాంబ్ లేదని నిర్ధారించిన తరువాత ప్రయాణాన్ని ప్రారంభించారు. ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇండిగో విమానం శనివారం ఉదయం 6.05 గంటలకు ముంబయి ఎయిర్‌పోర్టు నుంచి లఖ్‌నవూ బయల్దేరాల్సి ఉంది. అయితే టేకాఫ్ అవడానికి ముందు ఢిల్లీ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ మహిళ విమానాశ్రయం టర్మినల్ 1 వద్ద ఉన్న ఇండిగో చెకిన్ కౌంటర్ దగ్గరకు వెళ్లి.. ఇండిగో 6ఈ 3612(ముంబయి-లఖ్‌నవూ మార్గం) విమానంలో బాంబు ఉన్నట్లు చెప్పారు. అనుమానితులుగా భావిస్తున్న కొందరి ఫొటోలను సాక్ష్యాలుగా చూపించారు. సదరు వ్యక్తులు బాంబు పెట్టి ఉంటారని మహిళ అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాక బాంబు బెదిరింపుల అసెస్మెంట్ కమిటీ(బీటీఏసీ) కూడా ప్రమాదం జరగొచ్చని అనుమానాలు వ్యక్తం చేయడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ప్రయాణికులను దింపేసి విమానాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి తనిఖీలు చేశారు. అయితే విమానంలో ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో విమానానికి ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టం చేశారు. రెండు గంటల ఆలస్యం తరువాత ఉదయం 8. 40 గంటలకు ప్రారంభయ్యింది. అనంతరం సీఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బంది విచారణ నిమిత్తం సదరు మహిళను పోలీస్ స్టేషన్‌కు తీసుకేళ్లారు. అయితే ఈ ఘటనపై ఇండిగో ఇంతవరకూ స్పందించలేదు. అంతేకాక ఘటన సమయంలో విమానంలో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారన్న దాని గురించి కూడా సమాచారం లేదు. -
చెన్నైలో విమానం అత్యవసర ల్యాండింగ్
చెన్నై: రాజమండ్రి నుంచి ఆదివారం చెన్నై బయలుదేరిన ఇండిగో 6ఈ7123 విమానం ఇంజిన్ విఫలమవడంతో చెన్నై విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో విమానంలో 47 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం గాలిలో ఎగురుతుండగానే ఒక ఇంజిన్‌లో ఆయిల్ లీకై అది పనిచేయకుండా పోయిందనీ, దీంతో విమానాన్ని చెన్నైలో అత్యవసరంగా దించాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు. ప్రయాణికులంతా క్షేమమేనన్నారు. ఆయిల్ లీక్ అయినా పైలట్ నేరుగా విమానాన్ని దించకుండా కొద్దిసేపు గాలిలో చక్కర్లు కొట్టారని అధికారి ఆరోపించారు. -
శంషాబాద్: ఇండిగో విమానంలో విషాదం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టు (రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమనాశ్రయం)లో ఒక విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈ ఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. నాలుగు నెలల చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో బెంగుళూరు-పట్నా ఇండిగో విమానాన్ని ఎమర్జెన్సీగా ల్యాండ్ చేశారు. అత్యవసర చికిత్సనిమిత్తం చిన్నారిని అపోలో ఆస్పత్రికి తరలించారు. కాగా, అక్కడ చికిత్స పొందుతూ శిశువు మృతి చెందింది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
శంషాబాద్: ఇండిగో విమానంలో సాంకేతిక లోపం
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తిరుపతికి ఈ విమానం వెళ్లాల్సి ఉంది. ఉదయం 6.25 గంటలకు టేకాఫ్ తీసుకున్న విమానం.. గాలిలోకి ఎగిరిన 15 నిమిషాలకే సాంకేతిక లోపంతో తిరిగి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చింది. సాంకేతిక లోపాన్ని గుర్తించిన పైలట్ అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేశాడు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విమానంలో 65 మంది ప్రయాణికులు ఉన్నారు. 11 గంటలు కావొస్తున్నా.. ఇప్పటివరకు విమానాశ్రయంలో నిలిచిపోయిన ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో గమ్యానికి ఎలా చేరుకోవాల తెలియక ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. -
ఇండిగోను వణికించిన బాంబు వార్త
సాక్షి, జైపూర్: ఇండిగో విమానానికి బాంబు బెదింరిపు కాల్ రావడం కలకలం రేపింది. జైపూర్ నుంచి ముంబైకి బయలుదేరిన ఇందిగో విమానంలో బాంబ్ ఉన్నట్టుగా గుర్తు తెలియని వ్యక్తి ద్వారా ఇండిగో కేంద్రానికి సమాచారం అందింది. అయితే భద్రతా అధికారుల పూర్తి తనిఖీ అనంతరం ఇది ఆకతాయి చర్యగా తేలడంతో ఊరట చెందారు. ఇండిగో ట్రాఫిక్ 6ఇ218 మంగళవారం ఉదయం సుమారు 5.30 నిమిషాల సమయంలో ఈ బెదిరింపు కాల్ వచ్చింది. సరిగ్గా ఆ సమయానికి విమానం మార్గం మధ్యలో ఉండటంతో ఒక్కసారిగా అధికారుల్లో ఆందోళన మొదలైంది. తక్షణమే బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీకి (బీటీసీ) కి నివేదించారు. భద్రతా అధికారులు ధృవీకరణ అంనతరం కార్యకలాపాలు సాధారణంగా తిరిగి కొనసాగిస్తున్నట్టు ఇండిగో ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఇండిగోకు బెదిరింపు కాల్: షాకింగ్ ట్విస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల బాంబు ఉందంటూ ఎయిర్‌లైన్స్‌ను హడలెత్తించిన ఘటనలో షాకింగ్ విషయం వెలుగుచూసింది. పనితీరు బాగా లేదని సీనియర్ ఉద్యోగులు వార్నింగ్ ఇవ్వడంతో ఎయిర్‌లైన్స్‌కు కాల్ చేసి బుద్ధి చెప్పాలనుకున్నాడట. ఈ విషయాలను నిందితుడే స్వయంగా వెల్లడించాడు.ఆ వివరాలిలా.. పుణేకు చెందిన కార్తీక్ మాధవ్ భట్(23) హాస్పిటాలిటీలో డిప్లొమా కోర్స్ పూర్తి చేశాడు. అనంతరం ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో కస్టమర్ సర్వీస్ ఆఫీసర్‌గా ఉద్యోగంలో చేరాడు. అయితే వర్క్ బాగా చేయడం లేదని, చాలా మెరుగు పడాలని సీనియర్లు కార్తీక్‌కు ఇటీవల వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు బుద్ధిచెప్పాలని భావించినట్లు నిందితుడు తెలిపాడు. మే 2న ముంబైకి వెళ్లే ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ కాల్ చేసి కలకలం రేపాడు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది దాదాపు రెండు గంటలపాటు ప్రయాణికుల లగేజీతో పాటు ఎయిర్‌లైన్స్ మొత్తం తనిఖీలు చేసి ఫేక్ కాల్ అని తేల్చారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు కార్తీక్‌ను తాజాగా అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. తన పనితీరు బాగున్నా సీనియర్ ఉద్యోగులు వంకలు పెట్టారన్న కారణంగా.. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ఫోన్‌చేసి బాంబు అని బెదిరించినట్లు నిందితుడు అంగీకరించాడు. -
మరోసారి ఇండిగోకు తప్పిన ప్రమాదం
-
మరోసారి ఇండిగోకు తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్ : ఇండిగో విమానానికి మరోసారి ప్రమాదం పెను ప్రమాదం తప్పింది. శంషాబాద్ నుంచి టేకాఫ్ తీసుకున్న కొద్ది నిమిషాలకే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 15 నిమిషాలపాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. అయితే సమస్యను పసిగట్టిన ఫైలెట్ ఎమర్జెన్సీ ల్యాండిగ్‌కు అనుమతి తీసుకొని శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ల్యాండిగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 165 మంది ప్రయాణికులు ఉన్నారు. గత కొంతకాలంగా ఇండిగో ఫ్లైట్లు సాంకేతిక సమస్యలతో సతమతమౌతున్నాయి. సరిగ్గా రెండు రోజల క్రితమే శంషాబాద్ ఎయిర్‌పోర్టులోనే ఇదే కంపెనీకి చెందిన విమానం టైర్లు సైతం పేలిపోయాయి. అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పింది. వారిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా కూడా ఉన్నారు. ఈ సంఘటన మరిచిపోక ముందే ఇండిగోకే చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వీటిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు భయంతో వణికిపోతున్నారు. ప్రాణానికి భరోసా లేదంటూ వాపోతున్నారు. -
శంషాబాద్‌లో విమాన రాకపోకలు బంద్
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో గురువారం విమాన రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం రాత్రి తిరుపతి నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానం ల్యాండింగ్ సమయంలో టైర్ పేలి మంటలు వ్యాపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రమాదానికి గురైన విమానం రన్‌వే పైన నిలిచిపోవడంతో విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు పలు విమానాలను వేరే విమానాశ్రయాలకు దారి మళ్లించడంతో పాటు కొన్నింటిని రద్దు చేశారు. త్వరంలో రన్‌వేను క్లియర్ చేసి సర్వీసులు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. గన్నవరంలో ప్రయాణికుల ఆందోళన విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. గన్నవరం నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని అధికారులు క్యాన్సిల్ చేశారు. దీంతో ప్రయాణికులు విమానాశ్రయంలోనే పడిగాపులు కాస్తున్నారు. ప్రయాణికుల తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు ఉదయం 8 గంటలకు 70 మంది ప్రమాణికులతో బయలుదేరాల్సిన విమానాన్ని రద్దు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఈ విషయాన్ని తెల్లవారుజాము సదరు ప్రయాణికులకు మేసేజ్ పంపించారు. అయితే అకస్మాత్తుగా మెసేజ్‌లు పంపడమేంటని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాన్ని క్యాన్సిల్ చేసినా, మరో ప్రత్యామ్నాయం చూపలేదంటూ అధికారుల తీరుపై అసహనం వ్యకం చేస్తూ ఆందోళన చేశారు. -
విమానం పేలిపోతుందేమో అనుకున్నా: ఎమ్మెల్యే రోజా
సాక్షి, శంషాబాద్: ఇండిగో ఫ్లైట్.. తిరుపతి నుంచి బుధవారం రాత్రి 8.50 గంటలకు బయల్దేరింది.. రాత్రి 10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయింది... ఇంతలో ఒక్కసారిగా టైర్ పేలిపోయింది.. మంటలు వ్యాపించాయి.. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది! వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పారు. ప్రయాణికుల్లో ఎమ్మెల్యే రోజాతోపాటు 70 మంది ప్రయాణికులున్నారు. ప్రమాదం సమయంలో విమానాన్ని సుమారు గంటపాటు రన్‌వేపైనే ఉంచారు. గేట్లు కూడా తెరవలేదు. దీంతో విమానంలోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఎయిర్‌లైన్స్ సిబ్బందితో గొడవకు దిగారు. విమానం పేలిపోతుందేమో అనుకున్నా: ఎమ్మెల్యే ఆర్కే రోజా సాక్షి, తిరుపతి: ‘శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ కాగానే ఒక్కసారిగా పెద్ద శబ్దం వినిపించింది. ఆ వెంటనే పెద్ద ఎత్తున మంటలు కనిపించాయి. తర్వాత పెద్ద కుదుపుతో రన్‌వే పై ఆగిపోయింది. ఏమైందో అర్థం కాలేదు. విమానం పేలిపోతుందేమో అనుకున్నా. నేను, ఇతర ప్రయాణికులు వణికిపోయాం. అరగంట పాటు విమానం డోర్లు తీయలేదు. అగ్నిమాపక సిబ్బంది విమానాన్ని చుట్టుముట్టి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశార’ని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా వెల్లడించారు. బుధవారం రాత్రి పది గంటలకు తిరుపతి ఎయిర్ పోర్టు నుంచి ఇండిగో విమానంలో ఆమె హైదరాబాద్ బయలుదేరారు. ల్యాండ్ అయ్యే సమయంలో విమానం టైర్లు పేలిపోయినట్లు తెలిసిందని రోజా సాక్షికి వివరించారు. మంటలు చూసి ప్రయాణికులందరూ ఒక్క ఉదుటన కిందకు దిగాలని ప్రయత్నం చేసినా, ఎయిర్‌హోస్టెస్ నిరాకరించడంతో సాధ్యం కాలేదన్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు ఉండడంతో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పిందని వెల్లడించారు. -
నేటి నుంచి ఇండిగో విమాన సర్వీసులు
రేణిగుంట: ఇండిగో విమాన సర్వీసు సంస్థ తిరుపతి విమానాశ్రయం నుంచి తమ సర్వీసులను ఆదివారం ప్రారంభించనుంది. రోజూ మూడు సర్వీసులు హైదరాబాద్‌కు, రెండు సర్వీసులు బెంగళూరుకు నడపనున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు ఉదయం 9 గంటలకు ఈ సర్వీసులను ప్రారంభిస్తారు. ఇండిగో సంస్థ ప్రెసిడెంట్ ఆదిత్యఘోష్, ఎంపీలు వెలగపల్లి వరప్రసాదరావు, శివప్రసాద్ హాజరుకానున్నారు. ఇప్పటి వరకు రేణిగుంట విమానాశ్రయం నుంచి కేవలం హైదరాబాద్, విజయవాడలకు మాత్రమే విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఎయిరిండియా, ఇండియన్ ఎయిర్‌లైన్స్, స్పైస్‌జెట్, ట్రూజెట్ కంపెనీలు మాత్రమే తమ సర్వీసులు కొనసాగిస్తున్నాయి. -
విమానంలో వ్యాపారవేత్తకు చేదు అనుభవం
సాక్షి, న్యూఢిల్లీ : ఓ వ్యాపారవేత్తకు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. భారత కరెన్సీ చెల్లక పోవడం వివాదాస్పదంగా మారింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఇండియన్ బిజినెస్ మ్యాన్ ప్రమోద్ కుమార్ జైన్ ఇటీవల బెంగళూరు నుంచి దుబాయికి ఇండిగో విమానంలో ప్రయాణించారు. అయితే తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఏదో వస్తువు కొనుగోలు చేయడం లేదా అవసరాల నిమిత్తం మన కరెన్సీని చెల్లించాలని చూడగా కరెన్సీ చెల్లదంటూ సిబ్బంది వాటిని తిరస్కరించారు. దేశానికి చెందిన కరెన్సీ చెల్లదని భారత్ నుంచి వెళ్తున్న విమానంలో చెప్పడంతో వ్యాపారవేత్త ప్రమోద్ కుమార్ కంగుతిన్నారు. దేశం నుంచి నడుస్తున్న విమానంలో భారత కరెన్సీ చెల్లదని చెప్పడం దేశద్రోహ చర్యగా పరిగణిస్తారు. దీనిపై తాను ఢిల్లీ పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. భారతీయుల గౌరవ చట్టం 1971 ప్రకారం స్వదేశంలోనే కరెన్సీ చెల్లదని, స్వీకరించకపోవడం ఉల్లంఘన కిందకి వస్తుందన్నారు. తాను ఫిర్యాదు చేసిన కేసుపై డిసెంబర్ 15న విచారణ జరగనున్నట్లు ప్రమోద్ కుమార్ జైన్ వివరించారు. స్వదేశం నుంచి తిరుగుతున్న విమానాల్లోనే మన కరెన్సీ చెల్లదంటూ, ఆ డబ్బును వెనక్కి ఇవ్వడం చాలా దారుణమని అభిప్రాయపడ్డారు. -
పక్షి ఢీ.. తప్పిన పెను ప్రమాదం!
సాక్షి, చెన్నై : ఇండిగో విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. దోహాకు వెళ్లేందుకు చెన్నై ఎయిర్ పోర్ట్‌లో టేకాఫ్ అయిన విమానాన్ని కొంత సమయానికే ఓ పక్షి ఢీకొట్టింది. ఏదో సమస్య తలెత్తిందని గమనించిన పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని మళ్లీ చెన్నై విమానాశ్రయానికి తీసుకెళ్లి ల్యాండ్ చేయాల్సి వచ్చింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత (2:15 గంటలకు) ఇండిగో విమానం చెన్నైకి చేరినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు తెలిపారు. ఆ విమానంలోని 134 మంది ప్రయాణికులు ఏం జరుగుతుందో అర్థంకాక కాసేపు భయాందోళనకు గురయ్యారు. గురువారం వేకువ జామున 4:30 గంటలకు మరో విమానాన్ని ఇండిగో ఎయిర్ లైన్స్ సిద్ధం చేసింది. ప్రయాణికులు, ఏడుగురు విమాన సిబ్బంది ఆ విమానంలో దోహాకు బయలుదేరినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే పక్షి ఢీకొనడంతో ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని వేరే విమానంలో ప్రయాణించే ఏర్పాట్లు చేశామన్నారు. -
విమానంలో ల్యాప్‌టాప్ నుంచి మంటలు
ముంబై: తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న విమానంలోని ఓ ల్యాప్‌టాప్ నుంచి మంటలొచ్చాయి. వెంటనే అగ్నిమాపక పరికరంతో మంటలను అదుపు చేసినట్లు ఇండిగో ఎయిర్‌లైన్స్ సోమవారం పేర్కొంది. ఈ ఘటన శనివారం జరిగింది. ‘తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న 6ఈ445 విమానం క్యాబిన్లో పొగ వాసన వచ్చింది. సీట్ హ్యాట్–ర్యాక్ నుంచి మంటలు వస్తున్నట్లు సిబ్బంది గుర్తించారు. హ్యాండ్‌బ్యాగ్‌లో కాలుతున్న ల్యాప్‌టాప్‌ను అగ్నిమాపక పరికరంతో అదుపులోకి తీసుకొచ్చారు. నీళ్లతో నింపిన కంటైనర్‌లో ల్యాప్‌టాప్‌ను ఉంచారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఘటన జరిగిన సమయంలో 186 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నట్లు చెప్పారు. -
ఇండిగో విమానంలో మంటలు
సాక్షి, న్యూఢిల్లీ : గగనవీధిలో ప్రయాణిస్తున్న విమానంలో పర్సనల్ ఎలక్ట్రిక్ డివైజ్ పేలిన ఘటన మరోసారి చోటుచేసుకుంది. తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ఇండిగో విమానంలో ల్యాప్‌టాప్ నుంచి మంటల చెలరేగాయి. శనివారం(నవంబర్ 11)న ఈ ప్రమాదం జరిగింది. 6ఈ-445(వీటీ-ఐజీవీ) విమానంలో బ్లాక్ బ్యాగ్ నుంచి కాలుతున్న వాసన వచ్చినట్టు ప్యాసెంజర్లు రిపోర్టు చేశారు. వెంటనే అలర్ట్ అయిన విమానశ్రయ సిబ్బంది స్ప్రేతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అంతేకాక ప్రయాణికుల సీట్లను వేరే ప్రాంతాలకు మార్చారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యేంత వరకు ల్యాప్‌టాప్‌ను వాటర్ కంటైనర్‌లో ఉంచారు. ఈ విషయాన్ని ఇండిగో అధికార ప్రతినిధి కూడా ధృవీకరించారు. ''2017 నవంబర్ 11న తిరువనంతపురం నుంచి బెంగళూరు వెళ్తున్న 6ఈ-445 ఇండిగో విమానంలో పొగ వాసన వచ్చింది. 24ఆర్‌హెచ్ సీటు హ్యాట్-ర్యాక్ నుంచి మంటలు రావడం విమాన సిబ్బంది గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే పైలెట్-ఇన్-కమాండ్‌కు చేరవేశారు. ముందస్తు జాగ్రత్తలు మేరకు వెనువెంటనే ప్రయాణికులనే వేరే సీట్లలోకి సర్దుబాటు చేసి, హ్యాండ్‌బ్యాగ్‌లో కాలుతున్న ల్యాప్‌టాప్‌ను అగ్నిమాపక పరికరంతో అదుపులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత నీళ్లతో నింపిన కంటైనర్‌లో ల్యాప్‌టాప్‌ను ఉంచారు. బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఈ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రయాణికులందర్ని సురక్షితంగా గమ్యస్థానానికి చేరవేశాక, డీజీసీఏకు స్వచ్ఛందంగా ఈ విషయాన్ని వెల్లడించాం'' అని ఇండిగో అధికార ప్రతినిధి తెలిపారు. తమకు సహకరించిన ప్రయాణికులందరికీ ఇండిగో కృతజ్ఞతలు తెలిపింది. ప్రయాణికుల భద్రతకు తాము ఎంతో ప్రాముఖ్యత ఇస్తామని, ఈ విషయంలో తాము రాజీపడమని పేర్కొంది. గత నెలలో కూడా ఢిల్లీ-ఇండోర్ వెళ్తున్న ఓ విమానంలో మొబైల్ ఫోన్ పేలి విమానంలో మంటలు వచ్చాయి. -
పక్షి ఢీ.. విమానంలో 150మంది..
రాయ్‌పూర్: కోల్‌కతాకు చెందిన ఓ ఇండిగో విమానం అత్యవసరంగా దిగింది. బయలుదేరిన కాసేపటికే విమానం తిరిగి ఎమర్జెన్సీల్యాండ్ అవడంతో ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. పక్షి ఢీకొట్టిన కారణంగా విమానాన్ని దింపివేసినట్లు అధికారులు చెప్పారు. ఆ సమయంలో విమానంలో 150మంది ఉన్నారు. ఇండిగో అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఉదయం 9.50గంటల ప్రాంతంలో రాయ్‌పూర్ నుంచి కోల్‌కతాకు ఇండిగో విమానం బయలుదేరింది. అయితే, మధ్యలో దానికి పక్షి ఢీకొట్టడంతో వెంటనే స్వామీ వివేకానంద ఎయిర్పోర్ట్ అధికారులు చెప్పారు. ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించారు. పక్షి బలంగా ఢీకొట్టడంతోనే విమానం దింపివేయాల్సి వచ్చిందని, ఆ తర్వాత విమాన ఇంజిన్‌కు తనిఖీలు నిర్వహించామని చెప్పారు. ప్రయాణీకులను వేరే విమానాల ద్వారా వారి ప్రాంతాలకు తరలించారు. -
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీ ఎయిర్‌పోర్టులో కలకలం రేగింది. ఇక్కడి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడిని భద్రతా సిబ్బంది తనిఖీలు చేపట్టగా ఓ అనుమానిత వస్తువును గుర్తించారు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. అనుమానిత వస్తువులతో విమానం ఎక్కేందుకు యత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ప్రయాణికులు జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానంగా కనిపిస్తే తమకు చెప్పాలని సూచించారు. ఎయిర్‌పోర్టు అధికారులు మాట్లాడుతూ.. ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఓ ప్రయాణికుడు ఇండిగో విమానంలో ప్రయాణించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే భద్రతా సిబ్బంది అనుమానంగా కనిపిస్తున్న ఓ ప్రయాణికుడిని తనఖీ చేయగా అతడి వద్ద ఓ ప్రమాద వస్తువు లభ్యమైనట్లు చెప్పారు. చూసేందుకు ట్యాబ్, పెద్ద స్మార్ట్ ఫోన్ తరహాలో కనిపిస్తున్న ఆ వస్తువు పేలుడు సంబంధిత పదార్థంగా భావించినట్లు చెప్పారు. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నో ఫ్లై రూల్స్: మహిళపై తొలి కేసు
సాక్షి, ముంబై: విమానయాన రంగంలో తాజాగా అమల్లోకి వచ్చిన నో ఫ్లై నియమాల ప్రకారం ఓ మహిళపై తొలి కేసు నమోదయింది. ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళా ప్రయాణికురాలు అనుచితంగా ప్రవర్తించారన్న ఆరోపణలతో ఆమెపై దర్యాప్తు మొదలైంది. జైపూర్-ముంబై ఇండిగో ప్రయాణించిన ఆర్ థాకూర్ అనే మహిళ విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించారంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్ బృందం విమానాశ్రయంలోని సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. మరోవైపు విమాన సిబ్బందే తనతో క్రూరంగా ప్రవర్తించారని థాకూర్ ఆరోపించారు. ఈ మేరకు కౌంటర్ ఫిర్యాదును కూడా నమోదు చేశారు. ఈ వివాదాన్ని ధ్రువీకరించిన ఇండిగో ఎయిర్ లైన సదరు ప్రయాణికురాలిపై తీసుకునే చర్యలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా గత వారం డీసీజీఏ ఆవిష్కరించిన నిబంధనల ప్రకారం, ప్రయాణికులు ఎవరైనా విమానంలో దురుసుగా ప్రవర్తిస్తే మూడు నెలల నుంచి జీవితకాలం నిషేధం విధించే అవకాశం ఉంది. ముఖ్యంగా మాటలు, భౌతిక దాడి లేదా లైంగిక దాడి, హత్యాయత్నం అనే మూడు విభాగాలుగా విభజించారు. నిషేధం వ్యవధి ప్రవర్తన తీవ్రతపై ఆధారపడి ఉంటుందని డీజీసీఏ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి, విశాఖ : విశాఖపట్నం విమానాశ్రయంలో బుధవారం ఉదయం ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. విశాఖ నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఈ విమానం టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే తిరిగి ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాల్సి వచ్చింది. కాగా ఫ్లయిట్ టేకాఫ్ సమయంలో ఓ పక్షి విమానం రెక్కల్లో ఇరుక్కుపోయింది. ఈ విషయాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమై వెంటనే విమానాన్ని తిరిగి విశాఖ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా దించివేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విమానంలో బయటకు చెప్పలేని విధంగా..
న్యూఢిల్లీ: తన వయసును కూడా మరిచిపోయి ఓ 56 ఏళ్ల వ్యక్తి అసభ్యతకు దిగాడు. ఇండిగో విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ)లో శనివారం చోటు చేసుకుంది. పోలీసులకు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరే ఇండిగో విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి ఆమెను తాకేందుకు ప్రయత్నించడంతోపాటు బయటకు చెప్పలేని విధంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె వెంటనే ఎయిర్హోస్టేస్ను పిలిచి తన సీటును మార్పించుకుంది. విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన వెంటనే సిబ్బందికి ఫిర్యాదుచేయగా అతడిని అరెస్టు చేశారు. ఆ వ్యక్తిని రోహిణీ ప్రాంత నివాసి అయిన రమేశ్ చంద్గా గుర్తించారు. -
ఇండిగో విమానం పక్షిని ఢీ కొట్టడంతో..
రాయ్‌పుర్ : రాయ్‌పుర్ నుంచి ఆదివారం కోల్‌కతా వేళ్లాల్సిన ఇండిగో విమానానికి తృటిలో భారీ ప్రమాదం తప్పింది. విమానం గాల్లోకి ఎగిరే సమయంలో పక్షిని ఢీకొట్టడంతో రాయ్‌పుర్ ఎయిర్‌పోర్టులోనే అత్యవసరంగా ల్యాండ్ అయింది. ప్రయాణికులు అందరూ క్షేమంగా దిగినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విమానంలో ప్రయాణికుడిని.. కట్టిపారేశారు!
విమానంలో ప్రయాణిస్తుండగా.. మీ పక్కన ఉన్న ప్రయాణికుడు ఉన్నట్టుండి రెచ్చిపోతే ఏం చేస్తారు? ఒకటి రెండు సార్లు చెప్పి చూస్తారు. అప్పటికీ వినకపోతే విమాన సిబ్బందికి చెబుతారు. అయినా ఫలితం లేకపోతే, ఇక అతగాడిని కుర్చీకి కట్టేయడం తప్ప మరో మార్గం ఏమీ ఉండదు. దుబాయ్ నుంచి ఢిల్లీ వచ్చే ఇండిగో విమానంలో సరిగ్గా ఇలాగే జరిగింది. దుబాయ్ నుంచి బయల్దేరిన ఈ విమానంలో ఓ ప్రయాణికుడు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం మొదలుపెట్టాడు. విమానంలోని సెక్యూరిటీ నిబంధనలను పాటించకపోవడంతో పాటు హింసాత్మకంగా మారాడు. అంతేకాదు, విమాన సిబ్బందిని కూడా బెదిరించాడు. దాంతో ఏం చేయాలని సిబ్బంది చీఫ్ పైలట్‌ను అడిగారు. అతడిని కట్టేయమని ఆయన చెప్పడంతో సిబ్బంది అలాగే చేశారు. అతడిని సీటుకు కట్టేశారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన తర్వాత.. సీఐఎస్ఎఫ్ సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని, తర్వాత ఢిల్లీ పోలీసులకు అప్పగించారు. అతడు మద్యం మత్తులో అలా చేసి ఉంటాడని భావించిన పోలీసులు.. అతగాడికి ఆల్కహాల్ టెస్టులు చేయిస్తున్నారు. విమానాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఇది మొదటిసారి ఏమీ కాదు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో కూడా ఇలాగే జరిగింది. ముంబై నుంచి భోపాల్ వెళ్లే జెట్ ఎయిర్వేస్ విమానాన్ని ఓ పెళ్లి బృందం వాళ్లు దాదాపు హైజాక్ చేసినంత పని చేశారు. సాంకేతిక లోపం వల్ల ఉన్న సీట్ల కంటే ఎక్కువ టికెట్లు బుక్ అయిపోయాయి. అదే నెలలో ఓ ప్రయాణికుడు మద్యం తాగి విమానంలో అల్లరి చేశాడు. సెప్టెంబర్‌లో ఆశారాం బాపు అనుచరులు జెట్ ఎయిర్వేస్ విమానంలో గోలగోల చేశారు. కూర్చోమని చెప్పినా వినకుండా లేచి నిలబడి నినాదాలు చేస్తూనే ఉన్నారు. -
విమానంలో పేలిన ఫోన్
సమన్లు జారీ చేసిన డీజీసీఏ న్యూఢిల్లీ: శామ్సంగ్కు చెందిన నోట్ 2 ఫోన్ శుక్రవారం ఇండిగో విమానంలో పేలి పొగలు వచ్చాయి. సింగపూర్ నుంచి చెన్నైకి వచ్చిన విమానం ఉదయం 7.45 గంటలకు ల్యాండ్ అవుతుండగా ఘటన జరిగింది. సిబ్బంది వెంటనే అగ్నిమాపక పరికరంతో మంటలను ఆర్పేయడంతో విమానంలో ఉన్న 175 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. 6ఈ-054 విమానంలో 23సీ సీటు దగ్గర ఉన్న అల్మారా నుంచి పొగలు వస్తున్నట్లు గుర్తించిన సిబ్బంది పరిస్థితిని గురించి ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్)కు సమాచారమిచ్చారు. అనంతరం అల్మారా తెరిచి చూడగా ఒక ప్రయాణికుడి బ్యాగ్‌లో ఉన్న నోట్ 2 ఫోన్ నుంచి పొగలు వస్తుండడంతో దానిపై అగ్నిమాపక పరికరాన్ని ప్రయోగించి అనంతరం వాష్ రూంలో నీళ్లు ఉన్న ఒక పాత్రలో ఉంచారు. ముందు జాగ్రత్త చర్యగా 23సీ దగ్గర్లో ఉన్న ప్రయాణికులను ఇతర సీట్లకు మార్చారు. అనంతరం ఏ అవాంతరాలూ లేకుండా, ప్రమాదం జరగకుండా విమానం భద్రంగా కిందకు దిగింది. ఘటనపై విచారణను ఎదుర్కొనేందుకు సోమవారం తమముందు హాజరు కావాలంటూ పౌర విమానయాన డెరైక్టరేట్ జనరల్ (డీజీసీఏ) శామ్సంగ్కు సమన్లు జారీ చేసింది. ప్రయాణికులు శామ్సంగ్ నోట్ సీరీస్ ఫోన్లను విమానాల్లో వాడ కుండా చూడాలని విమానయాన సంస్థలను డీజీసీఏ కోరింది. ఘటనపై విచారిస్తామని శామ్సంగ్ తెలిపింది. భారత్‌లో విమానాల్లో శామ్సంగ్ ఫోన్‌కు నిప్పుంటుకోవడం ఇదే ప్రథమం. -
ఢిల్లీ - విశాఖకు సాయంత్రం విమాన సర్వీసు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి సాయంత్రం వేళల్లో విమాన సౌకర్యం విషయంలో విశాఖ వాసుల కల నెరవేరబోతోంది. అక్టోబర్ 28 నుంచి సాయంత్రం వేళల్లో ఢిల్లీ- విశాఖకు విమాన సర్వీసులను ప్రారంభిస్తామని ఇండిగో సంస్థ గురువారం ప్రకటించింది. ఢిల్లీ నుంచి ఇండిగో విమానం( ఫైలట్ నంబర్ జిఇ-337) సాయంత్రం 7.50 కు బయలుదేరి విశాఖపట్నం కు 10.10 కు చేరుకుంటుంది. -
విమానాన్ని అత్యవసరంగా దించినా..
విమానంలో వెళ్తున్న ఓ చిన్నారి ఆరోగ్యం ఉన్నట్టుండి విషమించింది. దాంతో విమానాన్ని అత్యవసరంగా మధ్యలోనే దించేశారు. అయినా కూడా ఆ చిన్నారి ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు. కోల్‌కతా నుంచి బెంగళూరుకు వెళ్తున్న 6ఇ 202 ఇండిగో విమానాన్ని మధ్యలో రాయ్‌పూర్‌లోనే అత్యవసరంగా దించారు. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఓ చిన్నారి గుండెజబ్బుతో బాధపడుతోంది. ఆమెను చికిత్స కోసం బెంగళూరు తీసుకెళ్తున్నారు. దారిలోనే ఆమె ఆరోగ్యం విషమించింది. దాంతోవెంటనే చికిత్స అందించేందుకు వీలుగా విమానాన్ని దారి మళ్లించి రాయ్‌పూర్‌లో దించారు. ఇందుకోసం ముందుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో మాట్లాడి ఏర్పాట్లు కూడా చేశారు. ఇన్ని ప్రయత్నాలు చేసినా.. చిన్నారి ప్రాణాలు మాత్రం నిలబడలేదు. దాంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
ప్రయాణికుల కొట్లాట.. విమానం దారి మళ్లింపు
విమానంలో వేరే దేశం వెళ్తున్నామంటే కాస్త మర్యాదగా ప్రవర్తించాలి. కానీ, కోజికోడ్ నుంచి దుబాయ్ వెళ్లాల్సిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆ విషయం మరచి కొట్లాటకు దిగడంతో విమానాన్ని అత్యవసరంగా ముంబైలో దించేయాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ఇండిగో విమానయాన సంస్థ అధికార ప్రతినిధి కూడా నిర్ధారించారు. కోజికోడ్ విమానాశ్రయంలో ఈ విమానం 3 గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం 12.30కి దిగింది. తన పక్కన కూర్చున్న వ్యక్తికి మానసిక స్థిరత్వం లేనట్లుందని, అతడితో చాలా సమస్య అయిందని ఓ ప్రయాణికుడు ఆరోపించారు. విమానం టేకాఫ్ తీసుకున్న గంట తర్వాత గొడవ మొదలైంది. కేబిన్ క్రూతో అతడు వాదులాట పెట్టుకున్నాడని, తోటి ప్రయాణికులు అతడిని అదుపుచేశారని నిఖిల్ అనే ప్రయాణికుడు చెప్పారు. చివరకు గొడవ పెట్టుకున్న వ్యక్తిని, అతడి సోదరుడిని ముంబైలో విమానం నుంచి దించేశారు. అయితే.. వాళ్లు విమానంలో ఇస్లామిక్ స్టేట్ అనుకూల నినాదాలు చేశారని, అందువల్ల ముంబైలో ఆ ఇద్దరినీ సీఐఎస్ఎస్ సిబ్బందికి అప్పగించారని కూడా సమాచారం వచ్చింది. ప్రస్తుతానికి దాని గురించి ఏమీ చెప్పలేమని, దర్యాప్తు పూర్తయిన తర్వాతే వివరాలు వెల్లడిస్తామని డీసీపీ వీరేంద్ర మిశ్రా చెప్పారు. విమానంలో ఆహారం తీసుకొచ్చే బండి మీదకు దూకి దానిమీద కూర్చున్నాడని, సిబ్బంది వెంటనే కెప్టెన్‌కు చెప్పగా.. తర్వాత అంతా కలిసి అతడిని దించారని ప్రయాణికులు అన్నారు. తర్వాత ఉన్నట్టుండి అతడు పక్క ప్రయాణికుడిని తిట్టడం మొదలుపెట్టాడు. దీంతో కెప్టెన్ ఏటీసీకి, గ్రౌండ్ సెక్యూరిటీ సిబ్బందికి చెప్పి, ఉదయం 9.40 సమయంలో ముంబైలో విమానాన్ని దించేశారు. అక్కడ సోదరులిద్దరినీ విమానం నుంచి దింపి.. అదుపులోకి తీసుకున్నారు. -
విమానంలో ఐసీస్ అనుకూల నినాదాలు
ముంబై: దుబాయ్ నుంచి కొచ్చి వెళుతున్న ఇండిగో విమానంలో గురువారం ప్రయాణికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో విమానాన్ని దారి మళ్లించి ముంబైలో దించారు. ప్రయాణికుల్లో కొందరు ఐసీస్‌కు అనుకూలంగా నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో విమానంలో మొత్తం 89 మంది ప్రయాణికులు ఉన్నారు. నినాదాలు చేసిన ప్రయాణికులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీంతో రెండు గంటలు ఆలస్యంగా విమానం కొచ్చి బయలుదేరింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
విమానంలో లైంగిక వేధింపులు.. నేత అరెస్ట్
గాంధీనగర్: మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో బీజేపీ నేత అరెస్టయ్యారు. తల్లిదండ్రులతో కలిసి వచ్చి బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో బీజేపీ నేత అశోక్ మక్వానాను సర్ధార్ నగర్ పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ లైన్స్ వారి నుంచి కొన్ని డాక్యుమెంట్లను సేకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మూడు రోజుల కిందట బాలికతో అసభ్యంగా ప్రవర్తించారని, ఆ వివరాలను పోలీసులు వెల్లడించారు. వేసవి సెలవులు కావడంతో ఓ బాలిక(13) గోవాలోని తన అంకుల్ ఇంటికి వెళ్లింది. మే 28న ఇండిగో విమానంలో ఇంటికి తిరుగు ప్రయాణమైంది. మక్వానా ఆ బాలిక పక్క సీట్లో కూర్చుని ట్రావెల్ చేశారు. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడి, అసభ్యంగా ప్రవర్తించారు. ఇంటికి చేరుకున్న బాలిక, విమాన ప్రయాణంలో తన పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని పేరేంట్స్ దృష్టికి తీసుకెళ్లింది. వ్యాపారవేత్త అయిన బాలిక తండ్రి తమకు ఫిర్యాదు ఇచ్చాడని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారి బీడీ పాటిల్ తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, అశోక్ మక్వానాను అరెస్ట్ చేశామని చెప్పారు. -
ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా): శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 40 మంది ప్రయాణికులు బుధవారం ఆందోళనకు దిగారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ, ముంబై, లక్నో, చెన్నై, అహ్మదాబాద్ వెళ్లవలసిన విమానాలలో ఉన్న సీట్లకు మించి ఇండిగో సిబ్బంది టిక్కెట్ల అమ్మకాలు జరగడంతో ప్రయాణికులను ఎయిర్ పోర్టు సిబ్బంది లోపలికి అనుమతించడం లేదు. తెల్లవారుజాము నుంచి ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే నిరీక్షిస్తున్నారు. తొందరగా పంపించమని ప్రయాణికులు అడిగితే అధికంగా డబ్బులు అడుగుతున్నారని ప్రయాణికులు ఆందోళనకు దిగారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
10 విమానాలకు బాంబు బెదిరింపులు!
న్యూఢిల్లీ: ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్స్ రావడంతో ఎయిర్ పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ-శ్రీనగర్ విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఆ విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. దీంతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం ఏర్పడింది. బాంబులు పేలుతాయేమోనని ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ప్రయాణికులు ఆందోళనకు గురవుతున్నారు. చెన్నై లోని కస్టమర్ కేర్ కు 10 ఇండిగో విమానాలకు సంబంధించి బెదిరింపు కాల్స్ వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఇండిగో 6ఈ 853 అనే విమనానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు ఆ విమనాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. బాంబ్ స్క్వాడ్ అక్కడికి చేరుకుని బాంబులు, ఏవైనా పేలుడు పదార్థాల కోసం ఇండిగో విమానంలో తనిఖీలు చేస్తున్నారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో బాంబు పేలుళ్లు జరిగిన నేపథ్యంలో భారత్ లో విమానాలకు బాంబు బెదిరింపులు రావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
విమానంలో అసభ్య ప్రవర్తన, అరెస్ట్
కోయంబత్తూరు: విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన ముగ్గురు ప్రయాణికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోయంబత్తూరు- చెన్నై ఇండిగో విమానంలో ఫుల్లుగా మద్యం సేవించి ఉన్న ఈ ముగ్గురు ప్రయాణికులు ఎయిర్ హోస్టెస్, ఇతర మహిళల పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించారు. విచక్షణ మర్చిపోయి ప్రవర్తించడంతో పాటు, ఎయిర్ హోస్టెస్ ను సెల్ ఫోన్ లో ఫోటో తీయడానికి ప్రయత్నించారు. దీన్ని అడ్డుకున్న మిగతా సిబ్బందితో గొడవకు దిగారు. దీంతో విమాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ముగ్గురిపైనా కేసు నమోదయ్యాయి. వారిని గురువారం కోర్టులో హాజరు పరచగా, 14 రోజులు రిమాండ్ విధించింది. కాగా నిందితుల్లో ఒకరు హిందూ మహాసభ నేత కాగా మరో ఇద్దరు న్యాయవాదులు కావటం శోచనీయం. ఈ ఘటన గత రాత్రి చెన్నై ఇండిగో విమానంలో జరిగింది. సెంథిల్ కుమార్, రాజా... విమానం ఎక్కిన దగ్గర నుంచి పెరున్దురైకి చెందినవారు కాగా, స్వామినాథన్ ట్రిచ్చివాసి. -
'పొట్టి దుస్తులు వేసుకున్నదని నో ఎంట్రీ'
న్యూఢిల్లీ: ఓ మహిళా ప్రయాణికురాలికి ఇండిగో విమానంలో చేదు అనుభవం ఎదురైంది. సరైన దుస్తులు వేసుకోలేదంటూ ఆమెను సిబ్బంది విమానాన్ని ఎక్కనివ్వలేదు. ఫ్రాక్ ధరించిన ఆమె ఖతార్ ఎయిర్వేస్కు చెందిన విమానంలో దోహా నుంచి ముంబై వచ్చింది. అక్కడి నుంచి ఢిల్లీకి కనెక్టడ్ విమానం ఎక్కాల్సి ఉంది. అయితే ముంబైలో ఆమెను విమానం ఎక్కనివ్వకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారు. ఈ ఘటన గురించి సహచర ప్రయాణికురాలైన పురబి దాస్ తన ఫేస్బుక్ పేజీలో వివరించారు. ఇండిగో పురుష సిబ్బంది ఆ యువతిని ఈ విధంగా వేధించడం తనను ఆందోళనకు గురిచేసిందని తెలిపారు. 'మోకాళ్ల వరకు ఉన్న ఫ్రాక్ను ధరించినప్పటికీ ఆమెను విమానంలో ఎక్కనివ్వలేదు. ఆమె దుస్తులు వారికి అభ్యంతరకరంగా కనిపించాయి. కానీ ఆ సంస్థ ఎయిర్‌హోస్టెస్ మాత్రం అదే తరహా ఫ్రాక్‌లు ధరిస్తారు' అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు. ఈ ఘటనతో ఆమె ఎక్కాల్సిన విమానం మిస్సయింది. అనంతరం వేరే వస్త్రాలు ధరించిన తర్వాత ఆమె మరో విమానంలో వెళ్లేందుకు అనుమతించారని తెలిసింది. నిజానికి ఆ ప్రయాణికురాలు ఇండిగో సంస్థకు చెందిన ఉద్యోగి సోదరి. అయితే తమ డ్రెస్ కోడ్ నిబంధనల్లో భాగంగానే ఆమెను అడ్డుకోవాల్సి వచ్చిందని ఇండిగో సంస్థ తెలిపింది. ఈ విషయమై పురబి దాస్ ఇండిగో కస్టమర్ కేర్‌ను సంప్రదించగా.. ఫ్రాక్ వేసుకొని విమానంలో ప్రయాణించడం అనుమతించరని వారు పేర్కొన్నారు. -
ప్రయాణికురాలికి అనారోగ్యం : విమానం దింపివేత
ఇండోర్ : ముంబై నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానంలోని ఓ ప్రయాణికురాలు తీవ్ర అనారోగ్యం పాలైంది. దాంతో విమానాన్ని అత్యవసరంగా ఇండోర్‌లోని దేవి అహల్యాబాయి హోల్కర్ ఎయిర్‌పోర్ట్‌లో దించివేశారు. అనంతరం ఆమెను ఓ ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. ఉత్తరప్రదేశ్‌కి చెందిన సరోజ్ సింగ్ (54) సోమవారం ఇండిగో విమానంలో ముంబై నుంచి లక్నో బయలుదేరింది. ఆ క్రమంలో ఆమె శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బందిగా మారింది. ఆ విషయాన్ని విమాన సిబ్బందికి తెలిపింద. దాంతో వారు ఇండోర్ విమానాశ్రయ అధికారులను సంప్రదించారు. విమానం అత్యవసరంగా దిగేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో స్థానిక విమానాశ్రయంలో విమానాన్ని దింపారు. అనంతరం సరోజ్ సింగ్‌ను ఆసుపత్రికి తరలించారు. అనంతరం విమానం లక్నో బయలుదేరి వెళ్లింది. ఈ ఘటన సోమవారం చోటు చేసుకుంది. -
విశాఖ నుంచి గోవాకు విమాన సర్వీసు
గోపాలపట్నం (విశాఖ): విశాఖపట్నం నుంచి గోవాకు విమానయాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఇక్కడి నుంచి గోవా అంతర్జాతీయ విమానాశ్రయానికి విమాన సర్వీసును నడపాలని ఇండిగో విమాన సంస్ధ నిర్ణయించింది. సెప్టెంబరు 15 నుంచి ఈ సర్వీసులు అందించడానికి నిర్ణయించినట్లు ఆ విమాన సంస్ధ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఇండిగో విమానం విశాఖ నుంచి బెంగుళూరు, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, హైదరాబాదు, ముంబై, కోల్‌కతాకు సర్వీసులు అందిస్తున్న సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ విమానానికి తప్పిన ప్రమాదం
ముంబై విమానాశ్రయంలో హైదరాబాద్ విమానానికి భారీ ప్రమాదం తప్పిందని ప్రయాణికుడొకరు 'సాక్షి'కి తెలిపారు. 6E 254 నంబరు గల ఇండిగో విమానంకు ప్రమాదం తప్పింది. రన్‌వేపై టేకాఫ్ అవుతుండగా మరో విమానం దూసుకొచ్చింది. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే విమానాన్ని పక్కకు తప్పించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో ఇండిగో విమానంలో 95 మంది ప్రయాణికులున్నారు. నావిగేషన్‌లో సమస్యలు తలెత్తడం వల్లే రెండు విమానాలు ఎదురెదురుగా వచ్చాయని గుర్తించారు. మరొక విమానం ద్వారా ప్రయాణికుల తరలింపునకు ఏర్పాట్లు చేశారు.