విమానంలో ప్రయాణించడం ప్రతి ఒక్కరి కల. కొంతమందికి ఇది తేలికైన విషయమే కావచ్చు. కానీ ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలనుకునే వారి సంఖ్య అనేకం. వీరిలో చాలామందికి ఈ ఆశ నిరాశగానే మిగిలిపోయిన సందర్బాలూ ఉన్నాయి. తాజాగా ఓ పైలట్ తన కుటుంబాన్ని మొదటిసారి విమానం ఎక్కించాడు. దీంతో ఆనందంతో తల్లి కంటతడి పెట్టుకుంది. దీనికి సంబంధించిన వీడయో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రదీప్ కృష్ణన్ అనే వ్యక్తి ఇండిగో విమానంలో పైలట్‌గా పనిచేస్తున్నాడు. ఇటీవల తన కుటుంబాన్ని తొలిసారి విమానం ఎక్కించాడు. తన తల్లి, బామ్మ, తాతను చెన్నై నుంచి కోయంబత్తూరు వెళ్తున్న విమానం ఎక్కించి సర్‌ప్రైజ్ చేశాడు. ‘మావాళ్లు మొదటిసారి విమానంలో ప్రయాణిస్తున్నారు. ఇది నాకేంతో సంతోషంగా ఉంది.
చిన్నప్పుడు తాత తన స్కూటర్‌పై నన్ను తిప్పేవాడు. ఇప్పుడు నా డ్రైవింగ్‌లో తాతను విమానంలో తీసుకెళ్తున్నా’ అంటూ టేకాఫ్‌కు ముందు విమానంలోని ప్రయాణికులకు ప్రత్యేక అనౌన్స్‌మెంట్ ద్వారా తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. ఈ క్రమంలో పైలట్ తల్లి భావోద్వేగంతో కంటతడి పెట్టుకుంది. అనంతరం విమానంలో ప్రయాణికులందరూ చప్పట్లు కొట్టి ఆ కుంటుబానికి వెల్‌కమ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment