ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు, విమాన ప్రయాణాల సమయంలో కొందరి అతి చేష్టాల గురించి వింటూనే ఉన్నాము. కొందరు ప్రయాణికులు ఓవర్ యాక్షన్‌తో ఇతర ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. నాగపూర్ నుంచి ముంబై వెళ్తున్న 6E-5274 ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు(ప్రణవ్ రౌత్) హంగామా చేశాడు. ఇండిగో విమానం ప్రయాణంలో(గాలిలో) ఉన్న సమయంలో ప్లైట్‌లో ఉన్న ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిని చూసిన విమాన సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ప్రయాణికుడిని అడ్డుకున్నారు. కాగా, సదరు ప్రయాణికుడి ఓవరాక్షన్ కారణంగా విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అనంతరం, సిబ్బంది ఈ విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకువెళ్లారు.
ఇక, విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత.. ప్రణవ్ రౌత్‌ను సీఐఎస్‌ఎఫ్ బలగాలకు అప్పగించారు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలో అతిగా ప్రవర్తించినందుకు ప్రణవ్ రౌత్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ హ్యాండిల్ తొలగించినట్లు విమాన సిబ్బంది గుర్తించారు.
Mumbai Airport police filed a case against a passenger who tried to open the emergency exit door of IndiGo flight which landed from Nagpur to Mumbai.
— JetArena (@ArenaJet) January 29, 2023
After landing, the senior cabin crew noticed that cover of the handle of emergency door has been removed. pic.twitter.com/gyvIlxRYoK
Comments
Please login to add a commentAdd a comment