Emergency exit
-
అమెరికా విమానంలో వ్యక్తి అలజడి..
వాషింగ్టన్: అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడు తీవ్ర అలజడి సృష్టించాడు. విమానం గాల్లో ఎగురుతుండగానే అత్యవసర ద్వారం తెరిచేందుకు ప్రయతి్నంచాడు. తోటి ప్రయాణికులు భయాందోళనతో గట్టిగా అరుస్తున్నా పట్టించుకోలేదు. దాంతో వారంతా అతడిని బంధించి, బలంతంగా సీట్లో కూర్చోబెట్టి, మళ్లీ లేవకుండా టేపుతో కట్టేశారు. అమెరికాలో న్యూమెక్సిలో రాష్ట్రంలోని అల్బుక్విర్కీ సిటీ నుంచి షికాగోకు బయలుదేరిన 1219 విమానంలో(బోయింగ్ 737) ఇటీవలే ఈ ఘటన చోటుచేసుకుంది. అల్బుక్విర్కీ ఎయిర్‌పోర్టు నుంచి విమానం బయలుదేరిన 30 నిమిషాలకు సదరు ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచేందుకు ప్రయత్నించాడు. తోటి ప్రయాణికులంతా అప్రమత్తమై అతడిని అడ్డుకున్నారు. పరిస్థితి గందరగోళంగా మారడంతో పైలట్లు విమానాన్ని వెనక్కి మళ్లించి, అల్బుక్విర్కీ ఎయిర్‌పోర్టులో దించారు. గందరగోళానికి కారణమైన ప్రయాణికుడిని కిందికి దించి, పోలీసులకు అప్పగించారు. అతడు ఎందుకలా చేశాడన్నదానిపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. -
ప్రయాణికుడి హల్చల్.. విమానం గాలిలో ఉండగా ఎమర్జెన్సీ డోర్ ఓపెన్..
ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు, విమాన ప్రయాణాల సమయంలో కొందరి అతి చేష్టాల గురించి వింటూనే ఉన్నాము. కొందరు ప్రయాణికులు ఓవర్ యాక్షన్‌తో ఇతర ప్రయాణికుల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, ఎమర్జెన్సీ డోర్‌ను ఓపెన్ చేయడం వంటి పనులు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. నాగపూర్ నుంచి ముంబై వెళ్తున్న 6E-5274 ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడు(ప్రణవ్ రౌత్) హంగామా చేశాడు. ఇండిగో విమానం ప్రయాణంలో(గాలిలో) ఉన్న సమయంలో ప్లైట్‌లో ఉన్న ఎమర్జెన్సీ డోర్ తెరిచే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో అతడిని చూసిన విమాన సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి ప్రయాణికుడిని అడ్డుకున్నారు. కాగా, సదరు ప్రయాణికుడి ఓవరాక్షన్ కారణంగా విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. అనంతరం, సిబ్బంది ఈ విషయాన్ని పైలట్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇక, విమానం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత.. ప్రణవ్ రౌత్‌ను సీఐఎస్ఎఫ్ బలగాలకు అప్పగించారు. అనంతరం, అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విమానంలో అతిగా ప్రవర్తించినందుకు ప్రణవ్ రౌత్‌పై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ హ్యాండిల్ తొలగించినట్లు విమాన సిబ్బంది గుర్తించారు. Mumbai Airport police filed a case against a passenger who tried to open the emergency exit door of IndiGo flight which landed from Nagpur to Mumbai. After landing, the senior cabin crew noticed that cover of the handle of emergency door has been removed. pic.twitter.com/gyvIlxRYoK — JetArena (@ArenaJet) January 29, 2023 -
ప్రయాణికుడు చేసిన తప్పిదం..విమానం టేకాఫ్‌కు ముందే..
గత కొద్దిరోజులుగా విమానంలో ప్రయాణికుల వరుస అనుచిత ప్రవర్తనల ఘటనలు గురించి వింటునే ఉన్నాం. అదే తరహాలో ఒక ప్రయాణికుడు ఒక పొరపాటు చేశాడు. ఏకంగా విమానం బయలుదేరే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట డోర్‌ని ఓపెన్ చేశాడు. ఐతే ఆ తప్పిదాన్ని ఎయిర్‌లైన్స్ సకాలంలో గుర్తించింది కాబట్టి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు తలెత్త లేదు. ఈ ఘటన గతేడాది డిసెంబర్ 10న ఇండిగో ఎయిర్‌లైన్స్‌లో చోటుచేసుకుంది. ఈ సంఘటన గురించి డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డిజీసీఏ) అధికారికంగా వెల్లడించింది. అంతేగాదు ఈ ఘటనపై సత్వరమే విచారణకు ఆదేశించడంతో ఫ్లైట్ రెగ్యులేటర్ స్పష్టమైన నివేదిక ఇచ్చినట్లు కూడా పేర్కొంది.ఆ విమానం చెన్నై నుంచి త్రివేండ్రమ్ వెళ్లున్నప్పుడూ ఈ ఘటన జరిగినట్లు డీజీసీఏ పేర్కొంది. ప్రయాణికులను దించేసిన అనంతరం ఆ విమానం తిరుచిరాపల్లికి బయలుదేరినట్లు కూడ తెలిపింది. అయితే ఈ ఘటన గురించి సదరు ఎయిర్ లైన్స్ డీజీసీఏకి వివరణ ఇస్తూ.. "ఆ రోజు ఇండిగో విమానంలో ఒక ప్రయాణికుడు పొరపాటున ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోరును తెరిచాడు.ఐతే తాము విమానం టేకాఫ్‌కు ముందే ఆ విషయాన్ని గమనించాం. తాము వెంటనే డోర్‌ని మళ్లీ ఇన్స్టాల్ చేసి, విమానంలో గాలి ఒత్తిడి ఎంత మేర ఉందో తనఖీ చేశాం. అంతేగాదు సేఫ్టీ ప్రోటోకాల్స్ విషయంలో రాజీపడకుండా తనిఖీలు నిర్వహించాం. అందువల్లే ఎలాంటి అవాంఛీనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు." అని ఎయిర్‌లైన్స్ స్పష్టంగా వివరణ ఇచ్చిందని డీజీసీఏ అధికారులు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించారు. (చదవండి: పట్టపగలే దారుణం..వృద్ధుడిని బైక్‌తో ఈడ్చుకెళ్లి..) -
విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపై నడిచాడు
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి.. ఎందుకు ఆ పని చేశాడో తెలియదు. కానీ, ఆ నేరానికి అతన్ని కటకటాల వెనక్కి నెట్టారు. ఏకంగా విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచి.. విమానం రెక్కపై నడిచాడు. అమెరికాలోని చికాగో విమానాశ్రయంలోకి ఈ ఘటన జరిగింది. రన్‌వే మీద దిగుతున్న విమానం ఎమర్జెన్సీ ద్వారాన్ని తెరిచి రెక్కమీదకు వెళ్లాడు ఆ వ్యక్తి. అతన్ని శాన్ డియాగోకు చెందిన రాండీ ఫ్రాంక్ (57)గా గుర్తించారు.‘‘విమానం రన్‌వేపై దిగి గేటు వద్దకు వస్తుండగా అతను హఠాత్తుగా ఎమర్జెన్సీ డోర్ తెరిచి రెక్కమీదకు వెళ్లాడు. కిందకు జారి ఎయిర్‌ఫీల్డ్ మీదకు దిగాడు’’ అని చికాగో పోలీసులు తెలిపారు. సర్కస్ ఫీట్‌తో రిస్క్ చేఏసిన ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కారణం ఏంటన్నది మాత్రం చెప్పట్లేదు అతను. ఇదిలా ఉంటే.. 2020లో ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ఓ విమానం ల్యాండ్ అయ్యే టైంలో ఓ మహిళ ప్యాసింజర్.. ఉక్కపోస్తోందంటూ ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచి రెక్కల మీదకు వెళ్లి గాలిని పీల్చుకుంది. అయితే ఆమె మద్యం, డ్రగ్స్ మత్తులో అలా చేసిందనుకున్న పోలీసులు పరీక్షలు నిర్వహించగా.. అలాంటిదేం లేదని తేలింది. @fly2ohare guy jumps out of my plane before we get to the gate. @united UA2478 pic.twitter.com/xgxRszkBfH — MaryEllen Eagelston (@MEEagelston) May 5, 2022 -
అంతెత్తున విమానం.. అందర్నీ ఆగం చేసిన బిత్తిరోడు
న్యూఢిల్లీ: సాధారణంగా మనం కారు, స్కూటర్, బస్సు లాంటి వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో ఆపి కాసేపు రిలాక్స్ అయ్యి తిరిగి ప్రయాణాన్ని కోనసాగించే వెసులుబాటు ఉంటుంది. కానీ విమాన ప్రయాణం అంటే... ఎక్కామా, గమ్య స్థానంలో దిగామా అన్నట్టు ఉండాలి. ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఏమైందో తెలీదుగానీ అంతెత్తు నుంచి వెళ్తున్న విమానం నుంచి దూకాలని ప్రయత్నించాడు. ఫ్లైట్‌లో ఉన్నవారు ఎంత వారించినా వినకుండా డోర్ తెరిచేందుకు యత్నించాడు. వివరాల్లోకి వెళితే.. "మార్చి 27 న, స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్జీ-2003 ఢిల్లీ నుంచి వారణాసికి వెళుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న గౌరవ్ అనే వ్యక్తి అకస్మాత్తుగా ఎమెర్జెన్సీ డోర్‌ను తెరవాలని ప్రయత్నించాడు. విమాన సిబ్బంది ఎంత చెప్తున్న వినకుండా వారితో కూడా దురుసుగా ప్రవర్తించాడు. చివరకు తోటి ప్రయాణికుల సహాయంతో సిబ్బంది ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం స్పైస్ జెట్ సిబ్బంది వెంటనే పైలెట్ కు సమాచారం అందించారు. దీంతో సదరు పైలెట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాలని భావించాడు. వెంటనే ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) అనుమతితో వారణాసిలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అక్కడ ఆ ప్రయాణీకుడిని సీఐఎస్ఎఫ్, స్పైస్ జెట్ సిబ్బంది సహాయంతో స్థానిక పోలీసులకు అప్పగించామని స్పైస్ జెట్ అధికారి తెలిపారు. ( చదవండి: టీఎంసీ ఎంపీ అసహనం.. వీడియో షేర్ చేసిన బీజేపీ ) -
వేడిగా ఉందని.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచింది
కీవ్: సాధారణంగా అప్పుడప్పుడు జనాలు చేసే తలతిక్క పనులు చూస్తే.. చిరాకొస్తుంది. ఏమని తిట్టాలో కూడా అర్థం కాదు. తమ తింగరి వేషాలతో చుట్టూ ఉన్నవారితో పాటు అధికారులను కూడా ఇబ్బంది పెడుతుంటారు. తాజాగా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొన్న వారి జాబితాలోకి చేరారు ఉక్రెయిన్ విమానాశ్రయ అధికారులు. ఓ ప్రయాణికురాలు విమానంలో చాలా వేడిగా ఉందని చెప్పి.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ తెరిచి విమానం రెక్క మీద నడుస్తూ.. భయాందోళనలు సృష్టించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. కీవ్‌లోని బోరిస్పిల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. టర్కీ నుంచి వచ్చిన బోయింగ్ 737-86ఎన్ విమానంలో సదరు మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి వచ్చింది. ఈ క్రమంలో బోరిస్పిల్ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయ్యింది. (చదవండి: ‘సీటు బెల్టు తీసి.. కిందకు దూకేశా’) ప్రయాణికులు ఒక్కొక్కరే దిగుతున్నారు. ఇంతలో ఆ మహిళ తన పిల్లలను లోపలే వదిలి.. వెళ్లి ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ని తెరిచి నడుచుకుంటూ బయటకు వెళ్లింది. సదరు మహిళ చర్యకు ఆమె పిల్లలతో పాటు ప్రయాణికులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ‘చాలా వేడిగా ఉంది’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడయాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. దీనిపై విమానాశ్రయ అధికారులు స్పందించారు. సదరు మహిళను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చమన్నారు. అంతేకాక ఆమె ఎందుకు ఇలా చేసిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆ సమయంలో ఆమె మత్తులో కూడా లేదు. విమానంలో తనకు చాలా వేడిగా ఉందని అందుకే ఇలా చేశానని తెలిపింది అన్నారు అధికారులు. ఈ వీడియో చూసిన నెటిజనులు ఆమెపై మండిపడుతున్నారు. View this post on Instagram ✈️А що, так можна було?😄 ✧ Відмічайте нас на фото та в сторіс, а також використовуйте наш хештег ☛ #boryspilchany 🙌🏼 ⠀ Найкращі фото міста Бориспіль ми опублікуємо ✧ A post shared by ПРО БОРИСПІЛЬ • НОВИНИ • ПОДІЇ (@boryspilchany) on Aug 31, 2020 at 11:23am PDT -
చల్లగాలి కోసం ఎంతపని చేసిందంటే..
బీజింగ్ : విమానంలో ప్రయాణించేవారు అప్పుడప్పుడు వింత చేష్టలకు పాల్పడుతూ తోటి ప్రయాణీకులను ఇబ్బంది పెడుతూ ఉంటారు. కొందరు తెలియకుండా తప్పు చేస్తే.. మరి కొందరు తెలిసి మరీ కావాలని చేస్తుంటారు. గతంలో ఓ మహిళ టాయిలెట్ డోర్ అనుకొని ఎమెర్సెన్సీ డోర్ ఓపెన్ చేసి విమానం నిలిపివేసేలా చేశారు. అయితే ఆమె పొరపాటును ఎమెర్సెన్సీ డోర్ ఓపెన్ చేసిందే కానీ.. కావాలని మాత్రం కాదు. కానీ తాజాగా ఓ చైనా మహిళ మాత్రం కావాలని విమానంలోని ఎమెర్సెన్సీ డోర్ ఓపెన్ చేసి తోటి ప్రయాణీకులను ఇబ్బందులకు గురి చేశారు. విమానంలోకి గాలి రావడంలేదని, శ్వాసించడం కష్టంగా ఉందని ఏకంగా ఎమర్సెన్సీ తలుపులనే తెరిచారు. తోటి ప్రయాణీకులు వద్దని వారించినా వినకుండా అత్యవసర తలుపులను తెరచి విమానం గంట ఆలస్యంగా బయలుదేరేలా చేశారు. ఈ ఘటన చైనాలోని జియావో ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకుంది. ఈ నెల 23న వుహాన్ నుంచి లాన్జౌ వెళ్లేందుకు విమానం ఎక్కిన ఓ మహిళ వెళ్లి తన సీటులో కూర్చున్నారు. కొద్ది సేపటి తర్వాత తనకు ఉక్కపోతగా ఉందని, శ్వాస తీసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. వెంటనే తనకు చల్లగాలి కావాలనుకున్నారు. దానికోసం అత్యవసర తలుపులు తెరవాలని నిర్ణయించుకున్నారు. తోటి ప్రయాణీకులు తెరవొద్దని హెచ్చరించినా వినకుండా డోర్ ఓపెన్ చేశారు. వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది.. సమాచారాన్ని పోలీసులకు అందించారు. దీంతో పోలీసులు మహిళను అదుపులోకి తీసుకుని ఆమె ప్రయాణాన్ని రద్దు చేశారు. ఆమె చేసిన తతంగానికి విమానం గంట ఆలస్యంగా బయలుదేరింది. -
ఉక్కపోతగా ఉందని... విమాన ‘ద్వారం’ తెరిచాడు
బొమ్మనహళ్లి (కర్ణాటక): విమానంలో గాలి రావడం లేదని ఓ ప్రయాణికుడు అత్యవసర కిటికీ తలుపు తీశాడు. దీన్ని సకాలంలో సిబ్బంది గుర్తించి విమానం టేకాఫ్‌కు ముందే కిటికీ మూసివేయించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం జరిగింది. లక్నోకు వెళ్లేందుకు గాను సునీల్‌కుమార్ అనే వ్యక్తి శుక్రవారం ఉదయం 8 గంటలకు కెంపెగౌడ విమానాశ్రయానికి వచ్చాడు. గోఎయిర్ విమానంలో ఎక్కి..తనకు కేటాయించిన విండో పక్కన సీటులో కూర్చున్నాడు. ఉక్కపోతగా ఉండటంతో అత్యవసర కిటికీ ద్వారానికి ఏర్పాటు చేసిన గ్లాస్ డోర్‌ను పక్కకు జరిపాడు. దీన్ని విమాన సిబ్బంది గుర్తించి అతడిని హెచ్చరించి వెంటనే డోర్ మూసి వేయించారు. సునీల్‌ను విమానంలో నుంచి కిందికి దించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. సునీల్‌కుమార్ మాట్లాడుతూ..తాను మొదటిసారిగా విమానం ఎక్కానని, గాలి తగలకపోవడంతోనే విండో డోర్ తెరిచానని..ఇందులో మరో ఉద్దేశమేమీ లేదని విమానాశ్రయ అధికారులకు చెప్పాడు. అనంతరం అతడిని మరో విమానంలో లక్నోకు పంపించారు. ఈ ఘటనపై గో ఎయిర్ సంస్థ ప్రయాణికులకు క్షమాపణ చెప్పింది. ఘటనపై ఎలాంటి కేసు నమోదు చెయ్యలేదు. ఘటన జరిగిన సమయంలో విమానంలో 200 మంది ప్రయాణికులు ఉన్నారు. -
వోల్వో బస్సుల్లో అత్యవసర ద్వారం
సాక్షి, హైదరాబాద్: ప్రమాదాల సమయంలో వినియోగించుకునేందుకు వోల్వో బస్సుల్లో అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈమేరకు అత్యవసర ద్వారాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని వోల్వో కంపెనీకి లేఖ రాసింది. ప్రమాదం జరిగినప్పుడు బయటపడడానికి అద్దాలు పగలగొట్టడం మినహా వోల్వో బస్సుల్లో మరో మార్గం లేదు. అయితే అద్దాలు పగలగొట్టడం అంత సులభమైన విషయం కాదు. సాధారణ బస్సుల్లో మాదిరిగా వోల్వోలో కూడా అత్యవసర ద్వారం ఉంటే ప్రయాణికులు సురక్షితంగా తప్పించుకునేందుకు అవకాశం ఉంటుందని ఇటీవల ఆర్టీసీ నిర్వహించిన సదస్సులో అభిప్రాయం వ్యక్తమైంది. వోల్వో బస్సు ప్రధాన ద్వారాన్ని తెరిచే స్విచ్ డ్రైవర్ వద్ద మాత్రమే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు కూడా ద్వారాన్ని తెరవడానికి అవకాశం కల్పించేలా మార్పులు చేసేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. వోల్వో బస్సులు నడుపుతున్న డైవర్లకు శిక్షణ ఇచ్చేందుకు వోల్వో కంపెనీ నిపుణులు రానున్నారని, వచ్చే వారం నుంచి బ్యాచ్‌ల వారీగా శిక్షణ మొదలవుతుందని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి.