న్యూఢిల్లీ: సాధారణంగా మనం కారు, స్కూటర్, బస్సు లాంటి వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో ఆపి కాసేపు రిలాక్స్ అయ్యి తిరిగి ప్రయాణాన్ని కోనసాగించే వెసులుబాటు ఉంటుంది. కానీ విమాన ప్రయాణం అంటే... ఎక్కామా, గమ్య స్థానంలో దిగామా అన్నట్టు ఉండాలి. ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఏమైందో తెలీదుగానీ అంతెత్తు నుంచి వెళ్తున్న విమానం నుంచి దూకాలని ప్రయత్నించాడు. ఫ్లైట్‌లో ఉన్నవారు ఎంత వారించినా వినకుండా డోర్ తెరిచేందుకు యత్నించాడు.
వివరాల్లోకి వెళితే.. "మార్చి 27 న, స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్జీ-2003 ఢిల్లీ నుంచి వారణాసికి వెళుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న గౌరవ్ అనే వ్యక్తి అకస్మాత్తుగా ఎమెర్జెన్సీ డోర్‌ను తెరవాలని ప్రయత్నించాడు. విమాన సిబ్బంది ఎంత చెప్తున్న వినకుండా వారితో కూడా దురుసుగా ప్రవర్తించాడు. చివరకు తోటి ప్రయాణికుల సహాయంతో సిబ్బంది ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకొచ్చారు.
అనంతరం స్పైస్ జెట్ సిబ్బంది వెంటనే పైలెట్ కు సమాచారం అందించారు. దీంతో సదరు పైలెట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాలని భావించాడు. వెంటనే ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) అనుమతితో వారణాసిలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అక్కడ ఆ ప్రయాణీకుడిని సీఐఎస్ఎఫ్, స్పైస్ జెట్ సిబ్బంది సహాయంతో స్థానిక పోలీసులకు అప్పగించామని స్పైస్ జెట్ అధికారి తెలిపారు.
( చదవండి: టీఎంసీ ఎంపీ అసహనం.. వీడియో షేర్ చేసిన బీజేపీ )
Comments
Please login to add a commentAdd a comment