Spice jet flight
-
పైలట్లకు భారీ షాకిచ్చిన స్పైస్ జెట్.. 3 నెలల పాటు
కరోనా మహమ్మారి దెబ్బకి డీలా పడ్డ రంగాల్లో ప్రధానంగా ఏవియేషన్ రంగం కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఏడాదిన్నర పాటు వైరస్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడం విమానయాన సంస్థలకు తీరని నష్టాలు తీసుకొచ్చాయి. కోవిడ్ తగ్గుముఖం పట్టాక ఊపిరి పీల్చుకోవచ్చని భావించిన సంస్థలకు.. ఆపై ఇంధన ధరలు పెరగడం వంటి పరిణామాలతో ఆర్థికంగా మరిన్ని కష్టాలు చవిచూడాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఖర్చులను తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ వరుసలో ముందు స్పైస్ జెట్ సంస్థ నిలిచింది. అకస్మాత్తుగా తన కంపెనీలోని 80 మంది పైలట్లను 3 నెలల సెలవుపై పంపించింది. ఈ సమయానికి వారికి సాలరీ కూడా ఇవ్వరంటూ ఒక ప్రకటనలో తెలియజేసింది. దీనిపై ఓ పైలెట్ స్పందిస్తూ.. స్పైస్‌జెట్ ఆర్థిక సంక్షోభం గురించి మాకు తెలుసు, కానీ సంస్థ 3 నెలల పాటు పైలట్లని ఇంటికి పంపాలని తీసుకున్న ఆకస్మిక నిర్ణయం మాలో చాలా మందిని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే మూడు నెలల తర్వాత కూడా కంపెనీ ఆర్థిక పరిస్థితిపై స్పష్టత వస్తుందని అనుకోవడంలేదు. ఇది ప్రస్తుతం తాత్కాలిక చర్య అని కంపెనీ చెబుతున్నప్పటికీ, తిరిగి పైలట్లను విధుల్లోకి తీసుకోవడం కష్టమేనన్నాడు. చదవండి: AirAsia: బంపర్ ఆఫర్, ఏకంగా 50 లక్షల టికెట్లు ఫ్రీ -
క్యాబిన్లో పొగలు: స్పైస్‌జెట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
సాక్షి,ఢిల్లీ: ప్రైవేటురంగ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు చెందిన విమానంలో పొగలు అలుముకోవడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. అయితే సిబ్బంది వెంటనే అప్రమత్త మయ్యారు. తక్షణమే విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. #WATCH | A SpiceJet aircraft operating from Delhi to Jabalpur returned safely to the Delhi airport today morning after the crew noticed smoke in the cabin while passing 5000ft; passengers safely disembarked: SpiceJet Spokesperson pic.twitter.com/R1LwAVO4Mk — ANI (@ANI) July 2, 2022 ఢిల్లీ నుంచి జబల్పూర్కు వెళుతున్న విమానంలో శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. విమానం గాల్లోకి ఎగిరి, సుమారు 5వేల అడుగుల ఎత్తుకు చేరిన తరువాత క్యాబిన్లో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీన్ని గమనించిన పైలట్లు, సిబ్బంది వెంటనే విమానాన్ని తిరిగి ఢిల్లీ విమానాశ్రయానికి మళ్లించారు. దీంతో ప్రమాదం తప్పింది. ప్రయాణీ కులందరూ సురక్షితంగా ఉన్నారని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై డీజీసీఏ దర్యాప్తు ప్రారంభించింది. SpiceJet: On July 2 @flyspicejet Q400 aircraft was operating SG-2962 (Delhi-Jabalpur). While passing 5000ft, the crew noticed smoke in the cabin. The pilots decided to return back to Delhi. Aircraft landed safely & passengers were safely disembarked. pic.twitter.com/N6cu7kFj0e — Poulomi Saha (@PoulomiMSaha) July 2, 2022 -
విమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ బంపర్ ఆఫర్..!
ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్ జెట్ తాజాగా ప్రయాణికులకు మంచి అదిరిపోయే ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. స్పైస్ జెట్ "వావ్ వింటర్ సేల్" పేరుతో ఒక ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద డిసెంబర్ 27 నుంచి 31 మధ్య కాలంలో రూ.1,122 ప్రారంభ ధరతో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. "వావ్ వింటర్ సేల్' ఆఫర్ కింద చెన్నై-బెంగళూరు, బెంగళూరు-చెన్నై, చెన్నై-హైదరాబాద్, జమ్మూ-శ్రీనగర్ మధ్య ప్రయాణం చేసే ప్రయాణికులకు మాత్రమే రూ.1,122 (అన్నీ కలుపుకొని) ధరకు వన్ వే ఛార్జీలను అందిస్తున్నట్లు స్పైస్ జెట్ తన పోర్టల్ ప్రకటనలో తెలిపింది. ఈ ఆఫర్ కింద విమాన టికెట్లను బుక్ చేసే ప్రయాణీకులు తమ ప్రయాణ ప్రణాళికలో ఏమైనా మార్పు వస్తే ప్రయాణ తేదీకి 2 రోజుల ముందు వరకు వారి విమాన తేదీని కూడా మార్చుకోవచ్చు. అలాగే, టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు జనవరి 15 - ఏప్రిల్ 15 మధ్య కాలంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ టికెట్లను స్పైస్ జెట్ వెబ్ సైట్, ఆన్ లైన్ ట్రావెల్ పోర్టల్స్, స్పైస్ జెట్ మొబైల్ యాప్, ట్రావెల్ ఏజెంట్ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. (చదవండి: భారత్‌కు రానున్న అమెరికన్ దిగ్గజ కంపెనీ..!) -
అంతెత్తున విమానం.. అందర్నీ ఆగం చేసిన బిత్తిరోడు
న్యూఢిల్లీ: సాధారణంగా మనం కారు, స్కూటర్, బస్సు లాంటి వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మార్గమధ్యంలో ఆపి కాసేపు రిలాక్స్ అయ్యి తిరిగి ప్రయాణాన్ని కోనసాగించే వెసులుబాటు ఉంటుంది. కానీ విమాన ప్రయాణం అంటే... ఎక్కామా, గమ్య స్థానంలో దిగామా అన్నట్టు ఉండాలి. ఢిల్లీకి చెందిన ఓ ప్రయాణికుడు మాత్రం ఇందుకు భిన్నంగా ప్రవర్తించాడు. ఏమైందో తెలీదుగానీ అంతెత్తు నుంచి వెళ్తున్న విమానం నుంచి దూకాలని ప్రయత్నించాడు. ఫ్లైట్‌లో ఉన్నవారు ఎంత వారించినా వినకుండా డోర్ తెరిచేందుకు యత్నించాడు. వివరాల్లోకి వెళితే.. "మార్చి 27 న, స్పైస్ జెట్ ఫ్లైట్ ఎస్జీ-2003 ఢిల్లీ నుంచి వారణాసికి వెళుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న గౌరవ్ అనే వ్యక్తి అకస్మాత్తుగా ఎమెర్జెన్సీ డోర్‌ను తెరవాలని ప్రయత్నించాడు. విమాన సిబ్బంది ఎంత చెప్తున్న వినకుండా వారితో కూడా దురుసుగా ప్రవర్తించాడు. చివరకు తోటి ప్రయాణికుల సహాయంతో సిబ్బంది ఆ ప్రయాణీకుడిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం స్పైస్ జెట్ సిబ్బంది వెంటనే పైలెట్ కు సమాచారం అందించారు. దీంతో సదరు పైలెట్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్ చేయాలని భావించాడు. వెంటనే ఏటీసీ (ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్) అనుమతితో వారణాసిలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అక్కడ ఆ ప్రయాణీకుడిని సీఐఎస్ఎఫ్, స్పైస్ జెట్ సిబ్బంది సహాయంతో స్థానిక పోలీసులకు అప్పగించామని స్పైస్ జెట్ అధికారి తెలిపారు. ( చదవండి: టీఎంసీ ఎంపీ అసహనం.. వీడియో షేర్ చేసిన బీజేపీ ) -
సోనుసూద్‌కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం !
-
సోనుసూద్‌కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం !
న్యూఢిల్లీ : నటుడు సోనూసూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అనేకమంది సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. తమవంతు సహాయాన్ని అందించారు. వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూసూద్ కృషి మరువలేనిది. ఆయన చూపిన చొరవ మూలంగా ఎందరో తమవారిని చేరుకున్నారు. లాక్డౌన్ మూలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక మంది సోనూ సూద్ సాయంతో ఊరట పొందారు. సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ను కొనియాడింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు కొనియాడారు. ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ బొమ్మను వేశారు. ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్ అనే క్యాప్షన్ వేశారు. ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి. లాక్డౌన్ సమయంలో సోనూసూద్, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా పూనుకుని 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు. రష్యా, ఉజెబికిస్థాన్, మనిల, ఇంకొన్ని దేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు. స్పైస్ జెట్ సంస్థ తనకు ఇచ్చిన ఈ గౌరవం పట్ల నటుడు చాలా సంతోషంగా ఉన్నారు. తనతో కలిసి లాక్డౌన్ సమయంలో స్పైస్ జెట్ చేసిన సేవలను గుర్తుచేసుకున్న సూనూసూద్ ఇక మీదట కూడ ఇలాగే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేయడానికి కృషి చేస్తానని అన్నారు. చదవండి: శివరాత్రి ట్వీట్: సోనూసూద్‌పై మండిపాటు ‘హిట్’ సీక్వెల్: హీరో ఎవరో తెలుసా..? -
విమానంలో విషాదం; కన్నతల్లికి కడుపుకోత
ముంబై : విమానంలో ప్రయాణిస్తున్న నెలలు నిండని ఓ చిన్నారి దురదృష్టవశాత్తు మార్గమధ్యలోనే మరణించింది. బిడ్డ పడుకుందని భావించిన ఆ తల్లి కూతురు శాశ్వత నిద్రలోకి వెళ్లిందని గమనించలేకపోయింది. ఈ హృదయ విదారకర ఘటన శుక్రవారం మహరాష్టలో చోటుచేసుకుంది. నాలుగు నెలల చిన్నారి రియా.. తల్లి ప్రీతి జిందల్, అమ్మమ్మ తాతయ్యలతో కలిసి జైపూర్ నుంచి ముంబై వస్తున్న స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణిస్తుంది. వీరు సూరత్‌లో విమానం ఎక్కగా.. ముంబైలో విమానం దిగే సరికి చిన్నారి నుంచి ఎలాంటి అలికిడి, స్పందన లేకపోవడంతో కంగారుపడిన కుటుంబ సభ్యులు ముంబై విమానాశ్రయంలో దిగగానే విమాన సిబ్బందికి తెలియజేసి వైద్య సహాయాన్ని కోరారు. వెంటనే స్పందించిన ఎయిర్‌పోర్టు సిబ్బంది హుటాహుటిన చిన్నారిని స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే శిశువును పరీక్షించిన వైద్యులు అప్పటికే చిన్నారి మరణించిందని ధ్రువీకరించడంలో ఆ తల్లి ఆర్తనాదాలు మిన్నంటాయి. విమానం ఎక్కే సమయంలో కూతురు బాగానే ఉందని, అంతకముందే పాపకు పాలు తాగించానని, తరువాత పడుకోవడంతో నిద్రలోకి వెళ్లిందనుకున్నానని తల్లి కన్నీరు మున్నీరవడం అక్కడున్న వారిని కలిచివేసింది. ఇక శిశువు మృతికి కారణాలు వెల్లడి కాలేదు. శిశువు మృతదేహానికి పోస్టుమార్టం చేసినా కారణాలు తెలియకపోవడంతో శరీరం నుంచి నమూనాలను సేకరించి ఆసుపత్రికి పంపించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై తాము దర్యాప్తు చేస్తామని సంబంధిత విమాన అధికారులు తెలిపారు. -
స్పైస్‌జెట్ విమానానికి తప్పిన ప్రమాదం
జైపూర్ : రాజస్థాన్‌లో స్పైస్‌జెట్ విమానానికి భారీ ప్రమాదం తప్పింది. 189 మంది ప్రయాణికులతో వెళుతున్న దుబాయ్-జైపూర్ స్పైస్ జెట్ 58 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ అప్రమత్తతతో ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. బయలుదేరిన కొద్దిసేపటికే లోపాన్ని గుర్తించిన పైలట్ విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. టేక్ ఆఫ్ తీసుకున్నకొద్ది సేపటికే విమానానికి చెందిన ఒక టైర్ పేలిపోవడంతో ఎమర్జెన్సీగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అయితే విమాన సిబ్బందితోపాటు ప్రయాణీకులందరూ క్షేమంగానే ఉన్నారని అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం జైపూర్ విమానాశ్రయంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు నిపుణుల బృందం పరిశీలిస్తోంది. Rajasthan: Emergency landing of SpiceJet Dubai-Jaipur SG 58 flight with 189 passengers took place at Jaipur airport at 9:03 am today after one of the tires of the aircraft burst. Passengers safely evacuated. pic.twitter.com/H7WE9Yxroy — ANI (@ANI) June 12, 2019 -
షిర్డీలో తృటిలో తప్పిన విమాన ప్రమాదం
సాక్షి, ముంబై: స్పైస్‌జెట్ విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. షిర్డీ విమానాశ్రయం వద్ద ల్యాండింగ్ సందర్భంగా రన్‌వే పై స్కిడ్ అయింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. ఢిల్లీనుంచి షిర్డీకి వస్తున్న సమయంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. స్పైస్ జెట్ విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వే మీదనుంచి జారిపోయింది. దాదాపు 30నుంచి 20 మీటర్ల దూరం దూసుకుపోయింది. దీంతో యాత్రికుల తాకిడి అధికంగా వుండే విమానాశ్రయంలో కార్యకలాపాలు కొద్దిసేపు నిలిచిపోయాయి. ఈ ప్రమాదం ఉదంతాన్ని స్పైస్ జెట్ ప్రతినిధి నిర్ధారించారు. దీనిపై మరిన్ని వివరాలు అందాల్సి వుంది. -
విమానానికి సాంకేతిక సమస్య
మాజీ మంత్రి బొత్స సహా 200 మంది ప్రయాణికులు 2 గంటలు విమానంలోనే.. గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం ఓ విమానానికి సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రెండు గంటల పాటు విమానం అప్రాన్‌పై నిలిచిపోయింది. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు స్పైస్ జెట్ విమానం ఉదయం 8.50కి వచ్చి తిరిగి 9.20కి బయలుదేరేందుకు సిద్ధమైంది. ఇంతలో హఠాత్తుగా ఇంజన్లో సమస్య ఎదురవడంతో సాంకేతిక నిపుణులు హుటాహుటిన స్పందించి చర్యలు చేపట్టారు. 11.20కి సాంకేతిక సమస్య పరిష్కరిం చడంతో విమానం హైదరాబాద్‌కు కదిలింది. ఇందులో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అగ్ర నేత బొత్స సత్యనారాయణతో పాటు 200 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇంజన్లో లోపం వల్ల అసౌకర్యం ఎదుర్కొన్నామని, ఎలాంటి ఇబ్బందీ లేదని బొత్స తెలిపారు. -
స్పైస్‌జెట్ విమానానికి తప్పిన ముప్పు
-
స్పైస్‌జెట్ విమానానికి తప్పిన ముప్పు
–హైదరాబాద్ నుంచి రేణిగుంటకు వచ్చిన విమానం –72 వుంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సురక్షితం రేణిగుంటః హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న స్పైస్ జెట్ విమానం ల్యాడింగ్ సమయంలో అదుపు తప్పి రన్‌వేను దాటిపోయింది. శనివారం రాత్రి 8 గంటలకు చేరుకోవాల్సిన విమానం వాతావరణంలో ప్రతికూల పరిస్థితుల దృష్యా ల్యాండింగ్‌లో విమానం అత్యంత వేగంగా ల్యాడింగ్ కావటంతో నిర్ధేశిత రన్‌వేను దాటి అర కిలోమీటర్ పైగా వెళ్లిపోయింది. వర్షం కురవటంతో విమాన చక్రాలు బురదలో కూరుకుపోయాయి. ఎలాంటి ప్రమాదం జరగకపోవటంతో 72 మంది ప్రయాణికులు, 15 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ విమానంలో మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం. నిర్ధేశిత రన్‌వే నుంచి విమానం దూసుకుపోవటంతో ప్రయాణికులు కొన్ని క్షణాలు పాటు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని భయాందోళనకు గురయ్యారు. వారిని ఎయిర్పోర్ట్ అధికారులు ల్యాండింగ్ ప్రదేశం నుంచి ప్రత్యేక బస్సులు ద్వారా బయటకు తీసుకొచ్చారు. ఎయిర్పోర్ట్ అధికారులు గోప్యతను ప్రదర్శించారు. విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ల్యాండింగ్ తర్వాత తవు కుటుంబీకులతో విషయాన్ని పంచుకోవటం ద్వారా పలు న్యూస్ చానల్స్‌లో కథనాలు వెలువడటంతో ప్రమాద విషయం బయటకు పొక్కింది. పైలట్ నిర్లక్ష్యమా, విమానంలో సాంకేతిక లోపమా, వాతావరణ ప్రతికూల పరిస్థితా అన్న విషయం విచారణలో తేలాల్సి ఉంది. విమానం కూరుకుపోవటంతో దానిని బయటకు తీసేందుకు విమానాశ్రయ సిబ్బంది చర్యలు చేపడుతున్నారు.