సోనుసూద్‌కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం ! | Sonu Sood Honoured With Special Aircraft By SpiceJet | Sakshi
Sakshi News home page

సోనుసూద్‌కు స్పైస్ జెట్ అరుదైన గౌరవం !

Published Sat, Mar 20 2021 1:41 PM | Last Updated on Sat, Mar 20 2021 4:31 PM

Sonu Sood Honoured With Special Aircraft By SpiceJet - Sakshi

న్యూఢిల్లీ : నటుడు సోనూసూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అనేకమంది సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. తమవంతు సహాయాన్ని అందించారు. వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూసూద్ కృషి మరువలేనిది. ఆయన చూపిన చొరవ మూలంగా ఎందరో తమవారిని చేరుకున్నారు. లాక్‌డౌన్‌ మూలంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక మంది సోనూ సూద్ సాయంతో ఊరట పొందారు. సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ను కొనియాడింది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు కొనియాడారు. 

ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూసూద్ బొమ్మను వేశారు.  ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూసూద్ అనే క్యాప్షన్ వేశారు.  ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి. లాక్‌డౌన్‌ సమయంలో సోనూసూద్, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా పూనుకుని 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు. రష్యా, ఉజెబికిస్థాన్, మనిల, ఇంకొన్ని దేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు. స్పైస్ జెట్ సంస్థ తనకు ఇచ్చిన ఈ గౌరవం పట్ల నటుడు చాలా సంతోషంగా ఉన్నారు. తనతో కలిసి లాక్‌డౌన్‌ సమయంలో స్పైస్ జెట్ చేసిన సేవలను గుర్తుచేసుకున్న సూనూసూద్ ఇక మీదట కూడ ఇలాగే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేయడానికి కృషి చేస్తానని అన్నారు.

 

చదవండి: 
శివరాత్రి ట్వీట్‌: సోనూసూద్‌పై మండిపాటు

‘హిట్‌’ సీక్వెల్:‌ హీరో ఎవరో తెలుసా..?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement