సామాన్యుల కోసం నడుం బిగించిన నటుడు | TV Actor Gurmeet Choudhary Opening COVID Hospital In Lucknow | Sakshi
Sakshi News home page

కరోనా పేషెంట్ల కోసం వెయ్యి పడకల ఆస్పత్రి: నటుడు

Published Mon, Apr 26 2021 11:56 AM | Last Updated on Mon, Apr 26 2021 6:23 PM

TV Actor Gurmeet Choudhary Opening COVID Hospital In Lucknow - Sakshi

కరోనాతో అల్లాడిపోతున్న జనాలను చూసి తల్లడిల్లిపోయాడో నటుడు. కోవిడ్‌ పేషెంట్లకు సరైన వైద్యం అందించే హాస్పిటళ్లు చాలా తక్కువగా ఉన్నాయని భావించాడు. చాలామంది రోగులకు కనీసం బెడ్లు కూడా దొరకని స్థితి చూసి చలించిపోయాడు. ఈ నేపథ్యంలో తనే ఓ ఆసుపత్రిని నిర్మిస్తానని ప్రకటించాడు హిందీ నటుడు గుర్మీత్‌ చౌదరి. పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్లను త్వరలోనే ప్రారంభిస్తానని ఆదివారం నాడు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించాడు.

సామాన్యులకు వైద్యసాయం అందించడం కోసం సకల సౌకర్యాలతో వెయ్యిపడకల ఆస్పత్రి నిర్మించి తీరుతానని వెల్లడించాడు. తను సంకల్పించిన ఈ ఆశయం నెరవేరేందుకు తనకు అండగా ఉంటారని ఆశిస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు. కాగా ఈ నటుడు కోవిడ్‌ పేషెంట్లకు సాయం అందించడంలో ముందు వరుసలో ఉన్నాడు. అవసరమైనవారికి ప్లాస్మాదానం అందేలా, ఆక్సిజన్‌ చేరేలా, పేషెంట్లకు బెడ్లు దొరికేలా చర్యలు తీసుకుంటున్నాడు.

కాగా గుర్మీత్‌ చౌదరి, అతడి భార్య దెబీనా బెనర్జీ గతేడాది కరోనా బారిన పడ్డాడు. ఆ మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఇద్దరూ ప్లాస్మాదానం కూడా చేశారు. ఈ క్రమంలో అభిమానులను సైతం ప్లాస్మాదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

చదవండి: Potti Veeraiah: పొట్టి వీర‌య్య క‌న్నుమూత‌

క‌రోనా సోకింది, క్వారంటైన్‌లో ఉన్నా: ‌పూజా హెగ్డే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement