Gurmeet Choudhary
-
కామాఖ్య అమ్మవారి దర్శనంలో టీవీ రాముడు
టీవీ నటుడు గుర్మీత్ చౌదరి దుర్గాష్టమి రోజున అసోంలోని కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గుర్మీత్ సోషల్ మీడియాలో పలు ఫోటోలు షేర్ చేశారు. ఈ ఫోటోలలో గుర్మీత్ కండువా కప్పుకుని, నుదుటన తిలకం ధరించడాన్ని చూడవచ్చు. గుర్మీత్ అమ్మవారి భక్తిలో మునిగిపోయినట్లు కనిపించారు. ఫోటోలు షేర్ చేసిన గుర్మీత్ చౌదరి క్యాప్షన్‌లో..‘జై మా కామాఖ్య. అందరికీ అష్టమి శుభాకాంక్షలు’ అని రాశారు. గుర్మీత్.. కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆయన ఆలయం వెలుపల అభిమానులతో ఫొటోలు కూడా దిగారు. కాగా ఈ ఫోటోల్లో గుర్మీత్ ఒంటరిగా కనిపిస్తున్నారు. భార్య డెబినా బెనర్జీ, కుమార్తెలు లియానా, దివిషా అతని వెంట లేరు. గుర్మీత్ టీవీలో ప్రసారమైన రామాయణం సీరియల్లో రాముడి పాత్రలో కనిపించారు. ఈ షో ద్వారా గుర్మీత్‌కు మంచి పేరు వచ్చింది. అతనిని అభిమానించేవారి సంఖ్య కూడా పెరిగింది. ప్రస్తుతం గుర్మీత్ పలు సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఇది కూడా చూడండి: యూట్యూబ్‌లో మొదటి వీడియో ఏది? ఎంతమంది చూశారు? -
ఫ్యాన్స్ అత్యుత్సాహం, న్యూ ఇయర్ ఈవెంట్లో నటుడికి గాయం
సినిమాలు, సీరియల్స్‌లో కనిపించే తారలు కళ్లముందుకొస్తే ఎలా ఉటుంది? ఒక్క సెల్ఫీ ప్లీజ్.. అంటూ అభిమానులు ఎగబడుతారు. ఎలాగైనా ఫోటో దిగాలన్న ఆరాటంలో ఒకర్నొకరు తోసుకుంటూ మురీ ముందుకొస్తారు. ఈ క్రమంలో నటీనటులు ఇబ్బంది పడ్డ సందర్భాలెన్నో! తాజాగా బాలీవుడ్ బుల్లితెర జంట గుర్మీత్ చౌదరి- దెబీనా బెనర్జీ కొత్త సంవత్సర వేడుకలో పాల్గొన్నారు. అత్యుత్సాహం ప్రదర్శించిన ఫ్యాన్స్ ఫోటోల కోసం ఎగబడ్డారు. వారిని ఆపలేక అష్టకష్టాలు పడ్డాడు గుర్మీత్. ఈ క్రమంలో అతడి కాలికి గాయమైంది. దీంతో వారిద్దరూ ఆ ఈవెంట్ నుంచి వెంటనే వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భార్యను రక్షించేందుకు ప్రయత్నించిన గుర్మీత్ నిజంగానే మంచి భర్త అని పొగుడుతుంటే మరికొందరు మాత్రం 'అమ్మో, ఎంత పెద్ద దెబ్బలు తాకాయో, వెంటనే అంబులెన్స్‌లో తీసుకెళ్లండి', 'ఐదేళ్ల పిల్లాడు కూడా ఆ దెబ్బలను చూపించి షో చేయడు' అని సెటైర్లు వేస్తున్నారు. కాగా గుర్మీత్, దెబీనా రామాయణ్(2008) సీరియల్లో రాముడు, సీతగా నటించారు. అప్పుడు ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీయడంతో 2011లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఈ ఏడాది ఏప్రిల్, నవంబర్లలో ఇద్దరు కూతుర్లు జన్మించారు. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) చదవండి: ఆయనతో నటించాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన త్రిష నా స్థానంలో వేరొకరుంటే ఆత్మహత్య చేసుకునేవాళ్లు: నటి -
హీరో ఔదార్యం.. 1000 పడకల ఆస్పత్రి నిర్మాణం
గతేడాది కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్లో ఎంతమందికి సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. సాయం కోసం అడిగిన ప్రతి ఒక్కరిని ఏదో ఓక విధంగా ఆదుకున్నానే. అనేకమందిని తమ సొంతుళ్లకు చేర్చాడు. లాక్డౌన్లో మొదలైన తన సేవలను ఇంకా కొనసాగిస్తున్నాడు. తాజాగా సోనూసూద్ బాటలోనే మరో నటుడు కరోనా రోగులను చూసి చలించిపోయాడు. కోవిడ్ పేషెంట్లకు వైద్యం అందించే ఆసుపత్రులు తక్కువగా ఉన్నాయని ఆందోళన చెందాడు. దీంతో బెడ్స్, ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న కరోనా రోగుల కోసం హాస్పిటల్ నిర్మిస్తానని నటుడు గుర్మీత్ చౌదరి ప్రకటించాడు . పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్ళను త్వరలోనే ప్రారంభిస్తాతని ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ‘సామాన్య ప్రజలకు వైద్య సాయం అందించడం కోసం సకల సౌకర్యాలతో వెయ్యి పడకల ఆసుపత్రిని నిర్మిస్తాను. నా ఈ ఆశయం నెరవేరేందుకు నాకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను’. అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు. కాగా గతేడాది సెప్టెంబర్‌లో గుర్మీత్ చౌదరి, అతడి భార్య దెబీనా బెనర్జీ కరోనా బారిన పడ్డారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ప్లాస్మా దానం కూడా చేశారు. అదే సమయంలో తన అభిమానులు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలని సూచించారు. View this post on Instagram A post shared by Gurmeet Choudhary (@guruchoudhary) -
సామాన్యుల కోసం నడుం బిగించిన నటుడు
కరోనాతో అల్లాడిపోతున్న జనాలను చూసి తల్లడిల్లిపోయాడో నటుడు. కోవిడ్ పేషెంట్లకు సరైన వైద్యం అందించే హాస్పిటళ్లు చాలా తక్కువగా ఉన్నాయని భావించాడు. చాలామంది రోగులకు కనీసం బెడ్లు కూడా దొరకని స్థితి చూసి చలించిపోయాడు. ఈ నేపథ్యంలో తనే ఓ ఆసుపత్రిని నిర్మిస్తానని ప్రకటించాడు హిందీ నటుడు గుర్మీత్ చౌదరి. పాట్నా, లక్నోలో ఈ హాస్పిటళ్లను త్వరలోనే ప్రారంభిస్తానని ఆదివారం నాడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. సామాన్యులకు వైద్యసాయం అందించడం కోసం సకల సౌకర్యాలతో వెయ్యిపడకల ఆస్పత్రి నిర్మించి తీరుతానని వెల్లడించాడు. తను సంకల్పించిన ఈ ఆశయం నెరవేరేందుకు తనకు అండగా ఉంటారని ఆశిస్తున్నానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని తెలిపాడు. కాగా ఈ నటుడు కోవిడ్ పేషెంట్లకు సాయం అందించడంలో ముందు వరుసలో ఉన్నాడు. అవసరమైనవారికి ప్లాస్మాదానం అందేలా, ఆక్సిజన్ చేరేలా, పేషెంట్లకు బెడ్లు దొరికేలా చర్యలు తీసుకుంటున్నాడు. View this post on Instagram A post shared by Gurmeet Choudhary (@guruchoudhary) కాగా గుర్మీత్ చౌదరి, అతడి భార్య దెబీనా బెనర్జీ గతేడాది కరోనా బారిన పడ్డాడు. ఆ మహమ్మారి నుంచి కోలుకున్న తర్వాత ఇద్దరూ ప్లాస్మాదానం కూడా చేశారు. ఈ క్రమంలో అభిమానులను సైతం ప్లాస్మాదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చదవండి: Potti Veeraiah: పొట్టి వీరయ్య కన్నుమూత కరోనా సోకింది, క్వారంటైన్లో ఉన్నా: పూజా హెగ్డే -
‘బిగ్‌బాస్ హౌజ్‌కు మేం వెళ్లట్లేదు’
రియాల్టీ షో బిగ్‌బాస్ 12వ సీజన్‌కు బాలీవుడ్లో రంగం సిద్ధమైంది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీల నిర్వాహకులు పరిశీలిస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. బుల్లితెర నటుడు గుర్మీత్ చౌదరి, ఆయన భార్య దెబినా బెనర్జీ(నటి) ఇద్దరూ ఈ సీజన్లో సందడి చేయబోతున్నారంటూ కన్ఫర్మ్ చేస్తూ వార్తలు వైరల్ అయ్యాయి . ఈ నేపథ్యంలో గుర్మీత్ స్పందించాడు. ‘ఆ వార్తలో నిజం లేదు. ప్రస్తుతం పల్టాన్ చిత్రంలో నేను బిజీగా ఉన్నా. తర్వాతి ప్రాజెక్టు కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ దశలో నేను బిగ్‌బాస్‌లో ఎలా పాల్గొంటా? అని గుర్మీత్ పేర్కొన్నారు. గుర్మీత్ వైఫ్ దెబినా కూడా అది ఫేక్ న్యూస్ అని తేల్చేశారు. మరోవైపు స్వరగిణి ఫేమ్ నటి హెల్లీ షా కూడా తాను బిగ్‌బాస్‌లో పాల్గొనట్లేదని ప్రకటించారు. సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్లు రసవత్తరంగా సాగుతుండగా.. ఈసారి మరింత మసాలాను దట్టించాలని నిర్వాహకులు ఫ్లాన్ గీసుకుంటున్నారు. పల్టాన్... 1967లో సిక్కిం, నాథులా పాస్ ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు చైనా యత్నించగా.. భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఈ కాన్సెప్ట్‌తోనే జేపీ దత్తా డైరెక్షన్లో పల్టాన్ తెరకెక్కింది. జాకీష్రాఫ్, సోనూసూద్, అర్జున్ రాంపాల్, సిద్ధార్థ్ కపూర్, గుర్మిత్ చౌధురి, హర్షవర్ధన్ రాణె, మోనికా గిల్, ఇషా గుప్తా తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 7న చిత్రం పల్టాన్ విడుదల కానుంది. -
‘ఆ హీరోయిన్ మోసం చేసింది’
సాక్షి, సినిమా: సినిమా ఛాన్స్‌ల పేరిట మోసం చేస్తున్న కేసులో సెలబ్రిటీ జంటపై కేసు నమోదు అయ్యింది. బాలీవుడ్ కపుల్ గుర్మీత్ చౌదరి-డెబీనా బెనర్జీలు అవకాశాల పేరుతో మోసం చేశారని రాజస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఆ వ్యవహారంలో తమ ప్రమేయం లేదంటూ ఆ దంపతులు ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాల్లోకి వెళ్తే... బాలీవుడ్ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ డెబ్లీనా ఓ వ్యక్తికి ఆఫర్ ఇచ్చింది. ఇందుకుగానూ కొంత డబ్బు చెల్లించాలని అతన్ని కోరింది. దీంతో అతను రూ.11 లక్షలు వారికి సమర్పించుకున్నాడు. అయితే ఆ తర్వాత అవకాశాల గురించి ఆరా తీయగా వారి నుంచి స్పందన కరువైంది. దీంతో నొఖా పోలీస్ స్టేషన్(రాజస్థాన్) లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు డెబీనా, గుర్మీత్‌లకు నోటీసులు పంపించారు. గుర్మీత్ ప్రకటన... మీడియాలో వస్తున్న కథనాలపై గుర్మీత్-డెబీనాలు ఓ ప్రకటనను విడుదల చేశారు. తాము ఎలాంటి మోసానికి పాల్పడలేదని, అనవసరంగా ఈ వ్యవహారంలోకి తమను లాగుతున్నారని వారు పేర్కొన్నారు. మరోవైపు దెబీనా కూడా అతనెవరో తెలీదంటూ మీడియాకు వివరించింది. సదరు వ్యక్తిపై ముంబై పోలీసులకు గుర్మీత్ ఫిర్యాదు చేయడం గమనార్హం. పోలీసులు మాత్రం ఈ రెండు కేసులను దర్యాప్తు చేపట్టి నిజాలు తేలుస్తామని అంటున్నారు. అమ్మాయిలు-అబ్బాయిలు చిత్రం ద్వారా డెబీనా బెనర్జీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే, నటుడు గుర్మీత్ చౌదరిని వివాహం చేసుకుని ఆపై నటనకు ఆమె విరామం ఇచ్చారు. -
కాఫీ కప్.. టెన్షన్స్ నిల్
అక్టోబర్ 1.. ఇంటర్నేషనల్ కాఫీ డే ని బాలీవుడ్ స్టార్స్ చాలా సరదాగా ఎంజాయ్ చేశారు. చాలామంది.. కాఫీ డేని ఎలా ఎంజాయ్ చేశారో.. కాఫీ కప్‌తో ట్విటర్లో ఫొటో పెట్టి మరీ అభిమానులకు చూపించారు. బాలీవుడ్లో గ్రేట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్.., సోనమ్ కపూర్, గుర్మీత్ చౌదరి.. ఇలా అందరూ కాఫీతో తమకున్న అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.. ఒక్క కప్ కాఫీతో టెన్షన్స్ మాయం అని కరణ్ అంటే.. కాఫీతో ఆనందాలు రెట్టింపని.. సోనమ్ చెబుతోంది.. కాఫీతో నా ఆనందాలె రెట్టింపని గౌతమ్ రూడో చెబుతున్నారు. #InternationalCoffeeDay....i may have changed the spelling ...but the love for it remains.....season 6 anyone? 😉😉😉😉😉😉 pic.twitter.com/yulWovyd0K — Karan Johar (@karanjohar) October 1, 2017 Can’t expresso how much I love coffee! ☕️ Happy #InternationalCoffeeDay guys! pic.twitter.com/0K9uB4psFL — Sonam Kapoor (@sonamakapoor) October 1, 2017 I like big cups & I cannot lie! What's your favourite coffee? ☕️ #internationalcoffeeday #coffee #coffeetime #sunday pic.twitter.com/iuHWVg6teJ — Aahana Kumra (@AahanaKumra) October 1, 2017 Good morning every one happy #internationalcoffeeday 😬 pic.twitter.com/adCyoHaj9h — GURMEET CHOUDHARY (@gurruchoudhary) October 1, 2017 I just loveeeeee coffee 😀.. Happy #InternationalCoffeeDay friends 😇.. where's ur coffee mug 😉 pic.twitter.com/PpVftlpWcZ — Gautam Rode (@gautam_rode) October 1, 2017 -
స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే.. నగ్నంగా నటిస్తా
ముంబై: కథ డిమాండ్ చేస్తే అందాలు ఆరబోసేందుకు రెడీ అంటూ హీరోయిన్లు చెబుతుంటారు. అలాగే బాలీవుడ్ నటుడు గుర్మీత్ చౌదరి కూడా ఇదే మాట చెప్పాడు. స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే తాను నగ్నంగా నటిస్తానని అన్నాడు. 'నేను చేసే పాత్రలన్నింటిలో వందశాతం అత్యుత్తమంగా నటించాలని భావిస్తా. నేను అంకితభావం గల నటుడ్ని. ఓ పాత్ర కోసం నగ్నంగా నటించాలని కథ డిమాండ్ చేస్తే అలాగే చేస్తా. రాజ్‌కుమార్ హిరానీ పిలిచి నీకు తగిన పాత్ర ఉంది.. నగ్నంగా పరిగెత్తు అని చెబితే అలాగే చేస్తాను' అని గుర్మీత్ చెప్పాడు. అతను నటించిన వాజా తుమ్ హో సినిమాలో హాట్ సన్నివేశాలున్నాయి. అయితే ఈ సినిమాల్లో అసభ్యకర దృశ్యాలు లేవని, ప్రేమ సన్నివేశాలని గుర్మీత్ చెప్పాడు. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. -
ముఖేశ్‌భట్ నా మార్గదర్శి
నిర్మాత ముఖేశ్భట్ను తాను గాడ్‌ఫాదర్‌గా భావిస్తానని, ఆయన తన మార్గదర్శి అని చెబుతున్నాడు వర్ధమాన నటుడు గుర్మీత్ చౌదరి. విశేష్ ఫిల్మ్స్ సంస్థతో మూడు చిత్రాల కోసం ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలపై మాట్లాడాడు. బాలీవుడ్లో కెరీర్‌ను ఎలా నిర్మించుకోవాలనే విషయంలో ముఖేశ్‌భట్ తనకు మార్గదర్శిగా నిలుస్తున్నారని చెప్పాడు. ఆయన సూచనలు, సలహాలతోనే బుల్లితెర నుంచి వెండితెరపైకి అడుగుపెట్టానన్నాడు. ముఖేశ్‌తో మూడు చిత్రాల ఒప్పందం ఎలా కుదిరింది? అని అడిగిన ప్రశ్నకు గుర్మీత్ సమాధానమిస్తూ... ‘ముఖేశ్భట్ను అనేక సినిమా అవార్డుల ఫంక్షన్లో కలిసేవాడిని. ఆయన కూడా నన్ను గమనిస్తున్నాడనిపించేది. అనుకున్నట్లుగానే ఓ రోజు.. దక్షిణాఫ్రికాలో ఓ అవార్డుల కార్యక్రమం జరుగుతోంది. వెండితెర ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్‌కు, బుల్లితెర ఉత్తమ నటుడిగా నాకు అవార్డు వచ్చింది. ఆ రోజు ముఖేశ్జీ నా దగ్గరకు వచ్చి... ‘నీతో కలిసి పనిచేయాలనుంది..!’ అని చెప్పారు. నా నోట మాట రాలేదు. ఆ తర్వాత మరుసటి రోజే ఆయన ఆఫీస్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. ఆ తర్వాత జరిగింది మీకు తెలిసు..’ అని చెప్పారు. ముఖేశ్ తనను సొంత కొడుకులా చూస్తాడని, అందుకే తన సంస్థలోని చిత్రాలతోపాటు మిగతా సంస్థల చిత్రాలను అంగీకరించే ముందు కూడా గుర్తుంచుకోవలసిన విషయాల గురించి చెబుతారన్నారు. ఇక ఆయనతో తొలి చిత్రం ఈ నెలలోనే ప్రారంభం కాబోతోంది. ఈ సినిమా కోసం జిమ్‌కు వెళ్లడం, స్టంట్స్ ప్రాక్టీస్ చేయడం, నటనకు సంబంధించి మరిన్ని మెళకువలు నేర్చుకోవడం వంటివి చేస్తున్నాను. ‘అసలు నటనను కెరీర్‌గా ఎంచుకోవడమే విచిత్రంగా జరిగిపోయింది. అనుకోకుండా నాన్నతో కలిసి ఓసారి యశ్‌చోప్రాను కలిశాను. అప్పుడు ఆయన బుల్లితెరపై మొదట ప్రయత్నించమని సలహా ఇచ్చాడు. షారుఖ్‌ఖాన్ వంటి పెద్ద పెద్ద స్టార్లు కూడా ముందు బుల్లితెర మీదే అనుభవం సంపాదించుకున్నారని, ఆ దారిలోనే నడవాలని సూచించారు. దీంతో రామాయణ్‌లో రాముడి పాత్ర దక్కింది. ఆ తర్వాత ముఖేశ్‌భట్ కారణంగా సినిమాల్లో అడుగుపెట్టాన’ంటూ తన తెరంగేట్రం గురించి చెప్పాడు.