సాక్షి, విశాఖపట్నం: విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్లు దొరకం తీవ్ర కలకలం రేపుతోంది. భూమిలో నాలుగు అడుగల లోతున సెల్ ఫోన్లను దాచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
వివరాల ప్రకారం.. విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్లు దొరకం సంచలనంగా మారింది. జైలు అధికారులు రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు సెల్ ఫోన్స్ దొరికాయి. బ్యారక్ సమీపంలోని పూల కుండీ వద్ద భూమిలో నాలుగు అడుగల లోతున ఫోన్లను పాతిపెట్టారు. ఫోన్లను ప్యాక్ చేసి గుంతలో దాచిపెట్టారు. రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీ పెట్టారు. ఆ కవర్‌లో రెండు సెల్‌ఫోన్లు, ఒక పవర్ బ్యాంక్, రెండు చార్జింగ్ వైర్లు, ఫోన్ బ్యాటరీ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
ఇక, దొరికిన సెల్‌ఫోన్లలో సిమ్ కార్డులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, కవర్ దొరికిన పెన్నా బ్యారక్‌లో రౌడీ షీటర్ హేమంత్ కుమార్, ఇతర ఖైదీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. సెల్‌ఫోన్ల ఘటనపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment