cell phones
-
విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి కలకలం..
సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని సెంట్రల్ జైలులో అసలేం జరుగుతోంది. ఇటీవల జైలులో సెల్‌ఫోన్స్ దొరికిన ఘటనపై దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ జైలులో గంజాయి దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది.వివరాల ప్రకారం.. విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఖైదీలే ఇక్కడ గంజాయి సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జైలు సూపరింటెండెంట్ మార్పు జరిగింది. ఇక, ఏదీ జరిగినా హోం మంత్రి అనిత.. గత ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నారు. అయితే, విశాఖ సెంట్రల్ జైలులో నిఘా కొరవడినట్టు ప్రత్యక్షంగానే తెలుస్తోంది. దీని బట్టి కూటమి ప్రభుత్వ పాలనలో గంజాయి విచ్చలవిడిగా రవాణా జరుగుతున్నట్టు అర్థమవుతోంది. కట్టుదిట్టమైన జైలులో సైతం గంజాయి గుప్పుమనడంతో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా.. విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్లు దొరకడం సంచలనంగా మారింది. జైలు అధికారులు రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా నర్మదా బ్లాక్, పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు సెల్ ఫోన్స్ దొరికాయి. నాలుగు రోజుల క్రితం మూడు సెల్ ఫోన్లను అధికారులు గుర్తించారు. సిమ్ కార్డులేని మొబైల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యారక్ సమీపంలోని పూల కుండీ వద్ద భూమిలో నాలుగు అడుగల లోతున ఫోన్లను పాతిపెట్టారు. ఫోన్లను ప్యాక్ చేసి గుంతలో దాచిపెట్టారు. రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీ పెట్టారు. దీంతో, సెల్ ఫోన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో అధికారులు రంగంలోకి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
విశాఖ జైలులో కలకలం.. బ్యారక్ వద్ద సెల్ ఫోన్స్ పాతిపెట్టి..
సాక్షి, విశాఖపట్నం: విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్లు దొరకం తీవ్ర కలకలం రేపుతోంది. భూమిలో నాలుగు అడుగల లోతున సెల్ ఫోన్లను దాచిపెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు.వివరాల ప్రకారం.. విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్లు దొరకం సంచలనంగా మారింది. జైలు అధికారులు రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు సెల్ ఫోన్స్ దొరికాయి. బ్యారక్ సమీపంలోని పూల కుండీ వద్ద భూమిలో నాలుగు అడుగల లోతున ఫోన్లను పాతిపెట్టారు. ఫోన్లను ప్యాక్ చేసి గుంతలో దాచిపెట్టారు. రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీ పెట్టారు. ఆ కవర్లో రెండు సెల్ఫోన్లు, ఒక పవర్ బ్యాంక్, రెండు చార్జింగ్ వైర్లు, ఫోన్ బ్యాటరీ కనిపించాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.ఇక, దొరికిన సెల్ఫోన్లలో సిమ్ కార్డులు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అయితే, కవర్ దొరికిన పెన్నా బ్యారక్‌లో రౌడీ షీటర్ హేమంత్ కుమార్, ఇతర ఖైదీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు.. సెల్ఫోన్ల ఘటనపై విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. -
ఫ్రాన్స్ స్కూళ్లలో ఫోన్లు స్విచ్ఛాఫ్
పారిస్: సెల్‌ఫోన్.. ప్రపంచమంతటా కేవలం పెద్దలకే కాదు, పిల్లలకు సైతం వ్యసనంగా మారిన సమాచార సాధనం. ఫోన్ చేతిలో లేకుండా ఒక్క క్షణం కూడా గడవని పరిస్థితి. హెల్‌ఫోన్ మారిన సెల్‌ఫోన్ పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను దెబ్బతీస్తున్నట్లు పలు అధ్యయనాల్లో గుర్తించారు. అంతేకాదు ఆధునిక యుగంలో ఎన్నో నేరాలకు ఫోన్లు కారణమవుతున్నాయి. ఈ జాడ్యాన్ని వదిలించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం నడుం కట్టింది. వచ్చే ఏడాది నుంచి పిల్లలు పాఠశాలలో ఉన్నప్పుడు ఫోన్లు వాడకుండా పూర్తి నిషేధం విధించబోతోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా 50 వేల మందికిపైగా విద్యార్థులకు ఫోన్లు నిషేధిస్తూ ఉత్తర్వు తీసుకొచి్చంది. ఇది ఇప్పటికే అమల్లోకి వచి్చంది. ఫ్రెంచ్ మిడిల్ స్కూళ్లలో చదువుతున్న 11 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణంలో ఉన్నంతసేపు ఫోన్లు పూర్తిగా స్విచ్ఛాఫ్ చేయాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ‘డిజిటల్ విరామం’ అని నామకరణం చేసింది. ఫోన్ల తెరల ముందు విద్యార్థులు సాధ్యమైనంత తక్కువ సమయం గడిపేలా చేస్తే వారిలో కొత్త విషయాలు నేర్చుకొనే సామర్థ్యం పెరుగుతుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మానుయేల్ మాక్రాన్ చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని నర్సరీలు, ఎలిమెంటరీ స్కూళ్లలో మొబైల్ ఫోన్లతోపాటు ఇతర ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ పరికరాల వినియోగంపై 2018 నుంచే నిషేధం అమల్లో ఉంది. ఉన్నత పాఠశాలల్లో చదువుకొనే 15 నుంచి 18 ఏళ్ల పిల్లలు తరగతి గదిలో ఫోన్ వాడకుండా నిషేధించారు. అయితే, వారు ఫోన్లు తప్పనిసరిగా స్విచ్ఛాఫ్ చేయాలన్న నిబంధన లేదు. -
3 నగరాలు 4 దేశాలు
సెల్‌ఫోన్ చోరీకి గురైందంటే ఒకటీ రెండు రోజులు బాధపడతాం. కాస్త విలువైన ఫోన్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. దొరికితే దొరుకుతుంది లేదా కొద్దిరోజుల తర్వాత మర్చిపోతాం. కానీ ఈ సెల్ఫోన్ల చోరీ వెనుక పెద్ద వ్యవస్థీకృత దందా దాగి ఉందంటే మాత్రం విస్తుపోక తప్పదు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని వివిధ మెట్రో నగరాల్లో దొంగల ముఠాల ద్వారా చోరీ అవుతున్న సెల్ఫోన్లు సీ ఫుడ్ ముసుగులో ఏకంగా దేశం దాటేస్తు న్నాయి. ప్రధానంగా మూడు నగరాల మీదుగా నాలుగు దేశాలకు తరలిపోతున్నాయి. ఈ నెట్‌వర్క్‌లో స్థానికుల నుంచి విదేశీయుల వరకు ఉంటున్నారు.వాట్సాప్ గ్రూపుల ద్వారా చోరీ ఫోన్ల ఫొటోలు షేర్ చేసుకుని, క్రయవిక్రయాలు జరుపుతున్నారు. ఓడ రేవుల్లో కార్యకలాపాలు సాగించే వారితో పాటు ఆయా దేశాల సరిహద్దు గ్రామాలకు చెందిన ప్రజలు సైతం ఈ స్మగ్లింగ్‌లో కీలకంగా వ్యవహరిస్తున్నారనే అనుమానాలున్నాయి. ఈ మొత్తం దందా మూడు దశల్లో కొనసాగుతోంది. తొలుత దొంగల నుంచి స్థానిక వ్యాపారుల వద్దకు చేరుతున్న సెల్ఫోన్లు, అక్కడి నుంచి మెట్రో నగరాలకు చేరుకుని ఆ తర్వాత దేశ సరిహద్దులు దాటిపోతున్నాయి. – సాక్షి, హైదరాబాద్ఫస్ట్ స్టేజ్..⇒ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చిన్న చిన్న ఉద్యోగులు, చిరు వ్యాపారులు, ఆటోడ్రైవర్లు కలిసి ముఠాలుగా ఏర్పడుతున్నారు. బస్సుల్లో, బస్టాపులు, వైన్ షాపులు, బహి రంగ సభలు జరిగే చోట్ల, ఇతర రద్దీ ప్రాంతాల్లో సెల్ఫోన్లు దొంగిలిస్తున్నారు. ఈ చోరీ ఫోన్లను అబిడ్స్‌లోని జగదీశ్ మార్కెట్ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న సెల్‌ఫోన్ మార్కెట్లలోని కొందరు వ్యాపారులకు విక్రయి స్తున్నారు.ఈ ఫోన్లు అన్‌లాక్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు టెక్నీషియన్లు పని చేస్తుంటారు. వీళ్లు చోరీ ఫోన్లు అన్‌లాక్ చేయడంతో పాటు అవసరమైన వాటి ఐఎంఈఐ నంబర్లు ట్యాంపరింగ్ చేస్తారు. నగరంలో చోరీ ఫోన్లు ఖరీదు చేస్తున్న వ్యాపారులు ముంబై, చెన్నై, కోల్‌కతాల్లో ఉన్న ‘హోల్‌సేల్ వ్యాపారులకు’ కలిపి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. ఇక్కడ ఫోన్లు కొంటున్న వ్యాపారులు తమ వద్ద అందుబాటులో ఉన్న ఫోన్ల ఫొటోలను వాటిల్లో పోస్టు చేస్తున్నారు.థర్డ్ స్టేజ్..⇒ చోరీ సెల్ఫోన్లు సూడాన్, శ్రీలంకలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్‌లకు ఎక్కువగా వెళ్తు న్నాయి. విదేశీ వ్యాపారులు ఎంపిక చేసు కున్న సెల్ఫోన్లను ఇక్కడి వ్యాపారులు ప్రత్యేక పద్ధతిలో ప్యాక్ చేస్తున్నారు. ఐదేసి ఫోన్లు చొప్పున తొలుత ట్రాన్స్పరెంట్ బాక్సుల్లో పార్శిల్ చేస్తున్నారు. తర్వాత ఇలాంటి 20 నుంచి 25 బాక్సులను థర్మా కోల్ పెట్టెల్లో ప్యాక్ చేస్తున్నారు. సీ ఫుడ్‌గా చెబుతూ ఓడ రేవుల ద్వారా సూడాన్, శ్రీలంక దేశాలకు పంపిస్తున్నారు. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలకు మాత్రం థర్మాకోల్ పెట్టె ల్లోనే పార్శిల్ చేసి సరిహద్దు గ్రామాలకు చెందిన వారి ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారు.రెండు వైపులా ఉండే సరిహద్దు గ్రామాలకు చెందిన కమీషన్ ఏజెంట్లు ఈ వ్యవహారం పర్యవేక్షిస్తున్నారు. కోల్‌కతా నుంచి తమ వద్దకు వస్తున్న ఫోన్లను ఆవలి వైపు ఉన్న వారికి చేరవేస్తూ కమీషన్లు తీసుకుంటున్నారు. దీనికోసం సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేకంగా కొన్ని ముఠాలు పనిచేస్తున్నాయి. వీరికి ఒక్కో ఫోన్‌కు దాని మోడల్ ఆధారంగా రూ.100 నుంచి రూ.500 వరకు కమీషన్‌గా లభిస్తోంది. సీ ఫుడ్ పేరుతో వెళ్తున్న థర్మాకోల్ బాక్సుల్ని తనిఖీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చూపిస్తు న్నారా? లేక స్మగ్లర్లతో మిలాఖత్ అయ్యారా? తేలాల్సి ఉందని నగర పోలీసులు చెబుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ఏజెన్సీలతో కలిసి పని చేయాల్సి ఉంటుందని, ఇప్పటివరకు తాము పట్టుకున్న ముఠాల విచారణలో వెలుగులోకి వచ్చిన వివరాలను ఆయా ఏజెన్సీలకు పంపిస్తామని పేర్కొంటున్నారు.సెకండ్ స్టేజ్..⇒ వాట్సాప్ గ్రూపుల్లో ఉన్న ఇతర నగరాలకు చెందిన వ్యాపారులు తమకు నచ్చిన, అవసరమైన సెల్ఫోన్లను ఆ ఫొటోల ద్వారా ఎంపిక చేసుకుంటున్నారు. బేరసారాల తర్వాత ఇక్కడి వ్యాపారులు అక్కడి వారు కోరిన వాటిని పార్శిల్ చేసి తమ మనుషులకు ఇచ్చి పంపిస్తున్నారు. ఇలా ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా నగరాల్లోని వ్యాపారుల వద్దకు చోరీ సెల్ఫోన్లు చేరుతున్నాయి. సూడాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్‌లో ఉన్న వ్యాపారులు, ఈ నగరాల్లోని వ్యాపారులకు ఉమ్మడి వాట్సాప్ గ్రూపులు ఉంటున్నాయి. వాటిలో పోస్టు అవుతున్న ఫొటోల ఆధారంగా విదేశీ వ్యాపారులు ఫోన్లు సెలెక్ట్ చేసుకుంటున్నారు.వరుస అరెస్టులతో అదుపులోకి చోరీలు⇒ నగరంలో సెల్‌ఫోన్ చోరీలు పెరగడంతో పాటు కొన్ని సందర్భాల్లో ఫోన్ల కోసం దోపిడీలు, బందిపోటు దొంగతనాలతో పాటు హత్యలూ జరిగాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ప్రత్యేక అదేశాలు జారీ చేశారు. నగరంలో వ్యవస్థీకృతంగా సాగుతున్న సెల్‌ఫోన్ చోరీలకు చెక్ పెట్టాలని స్పష్టం చేశారు. దీంతో పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లిన దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు మూడు ముఠాలను పట్టుకున్నారు.మే ఆఖరి వారంలో 17 మందిని అరెస్టు చేసి 703 సెల్ఫోన్లు స్వా«ధీనం చేసుకున్నారు. గత నెల మొదటి వారంలో ముగ్గురిని పట్టుకుని 43 సెల్ఫోన్లు సీజ్ చేశారు. దీనికి కొనసాగింపుగా ఇటీవల 31 మందిని అరెస్టు చేసి 713 ఫోన్లు సీజ్ చేశారు. ఈ వరుస అరెస్టులతో నగరంలో సెల్‌ఫోన్ చోరీలు అదుపులోకి వచ్చాయి. దీంతోనీ వ్యవస్థీకృత ముఠాల వెనుక ఉన్న వారిని గుర్తించడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ దిశగా ముమ్మర దర్యాప్తు జరుపుతున్నట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. -
సెల్ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండోస్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడను తిరిగి కనిపెట్టి రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్స్‌కు చెందిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సాంకేతికతను వినియోగించి గత 369 రోజుల్లో తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30,049 మొబైల్ ఫోన్ల జాడను కనుగొన్నారు.ఈ మేరకు సీఐడీ ఇన్చార్జి అదనపు డీజీ మహేశ్‌భగవత్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ సాంకేతికను వినియోగిస్తున్నట్లు తెలిరు. గతేడాది ఏప్రిల్ 19న తెలంగాణ రాష్ట్రంలో సీఈఐఆర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి, మే 17న పూర్తిస్థాయిలో ప్రారంభించారు. రోజుకు సరాసరిన 76 మొబైల్ ఫోన్ల చొప్పున జాడ కనిపెట్టినట్లు మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4,869 మొబైల్ ఫోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,078 మొబైల్ ఫోన్లు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3,042 మొబైల్ ఫోన్లు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,919 మొబైల్ ఫోన్లు గుర్తించినట్టు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో 35,945 ఫోన్ల రికవరీతో కర్ణాటక తొలిస్థానంలో ఉందని తెలిపారు. -
స్మార్ట్ డివైసెస్ కంట్రోల్లో మనం చిక్కుకున్నామని.. తెలుసా!
ఇప్పుడన్నీ స్మార్ట్‌ఫోన్‌లోనే ఉన్నాయి.. ఇదివరకు ఫోన్.. కమ్యూనికేషన్ టూల్..! కానీ నేడు మనిషిని ఎంగేజ్ చేసే ఎంటర్టైన్మెంట్ వాల్.. అవసరమైనప్పుడు మాత్రమే కమ్యూనికేషన్.. ఎప్పుడూ ఎంటర్టైన్మెంటే!! మునుపు రోజువారీ ఒత్తిళ్ల నుంచి ఒక తెరపిగానే వినోదం ఉండేది..! ఇప్పుడు వినోదమే రోజువారీ ఒత్తిడిగా మారింది! ఇవన్నీ కూడా సోషల్ మీడియాలోని పలు ప్లాట్‌ఫామ్స్ మీద ప్లే అయిన జోక్సే.. స్మార్ట్‌ఫోన్‌కి మనం ఎంత అడిక్ట్ అయ్యామో చెబుతూ! వాటిని చూసి నవ్వుకుంటాం. కానీ అడిక్షన్ గురించి ఆలోచించం. ఎందుకంటే ఆ లిస్ట్‌లో మనం లేమని మన ధీమా! కానీ ఎవ్వరం ఈ అడిక్షన్కి అతీతులం కాదని ఒక్క క్షణం మనల్ని మనం తరచి చూసుకుంటే తెలిసిపోతుంది. ఈ కథనం చదవబోతున్న పాఠకులకు ఒక విజ్ఞప్తి.. ఒక్క అయిదు నిమిషాలు మీ స్మార్ట్‌ఫోన్‌ను మరచిపోండి.. నోటిఫికేషన్స్ టోన్ వినబడుతున్నా పట్టించుకోకుండా! వెల్కమ్ "బ్యాక్ టు దిస్ పేజ్.. " ఉండగలిగారా అయిదు నిమిషాలు.. స్మార్ట్‌ఫోన్‌ని పట్టించుకోకుండా! కాస్త కష్టమైంది కదా! ప్రపంచాన్నంతా ఇముడ్చుకుని మన అరచేతిలోకి వచ్చిన స్మార్ట్‌ఫోన్స్, ట్యాబ్స్, లాప్టాప్స్ ఎట్సెట్రా స్మార్ట్ డివైసెస్ మన జీవితాలను ఎంతలా కంట్రోల్ చేస్తున్నాయో కదా... జెన్ జెడ్‌కి తెలీదు కానీ మిలేనియల్స్‌కి గుర్తుండే ఉంటుంది.. ప్రైవేట్ టీవీ చానెల్స్ వచ్చిన కొత్తలో.. ఎవరైనా ఎవరింటికైనా వెళితే.. ‘రండి.. రండి..’ అంటూ పలకరించి ఆ అతిథికి గ్లాసుడు మంచినీళ్లిచ్చేంత తీరిక ఆ ఇంట్లో వాళ్లకు ఉండేది కాదు. అందరూ టీవీకి అతుక్కుపోయి కూర్చునేవారు. అంతేకాదు ప్రైవేట్ చానెళ్లలో ప్రసారమయ్యే సీరియళ్ల మోహంలో పడి.. ఇంట్లో ఇల్లాళ్లు తిండి కూడా పెట్టట్లేదు.. కమర్షియల్ బ్రేక్స్‌లోనే వంట అయినా.. తిండి అయినా అంటూ వాపోయిన కుటుంబ సభ్యులూ ఉన్నారు. ఇవీ పైన ఉదహరించిన తీరులో వారపత్రికల్లో కార్టూన్లుగా.. సినిమాల్లో హాస్య సన్నివేశాలుగా కనిపించిన దాఖలాలున్నాయి. దాన్ని మించిన వ్యసనమైంది ఈ స్మార్ట్ ఫోన్ అండ్ స్మార్ట్ డివైసెస్ వాడకం. నిరంతర వీక్షణ స్రవంతి.. ఇదివరకు లేవగానే చాలామంది భగవంతుడి ఫొటోనో.. లేకపోతే తమకిష్టమైన కుటుంబ సభ్యుల మొహమో.. లేదంటే తమ అరచేతులను తామే చూసుకునేవారు. ఇప్పుడు లేవగానే కళ్లు మూసుకునే పడక మీద ఫోన్ వెదుక్కునే పరిస్థితి. కళ్లు తెరవగానే కుడిచేయి దంతధావనం కోసం బ్రష్ పట్టుకోవడానికి సిద్ధమవదు. చూపుడు వేలు స్మార్ట్ ఫోన్ మీద స్క్రోల్ చేయడానికి సన్నద్ధమవుతుంది. ఇదివరకు న్యూస్ పేపర్ చదివితే కాని రోజు మొదలయ్యేది కాదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్లోని వాట్సాప్ స్టేటస్‌ల నుంచి స్నాప్ చాట్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబుల్లోని అప్డేట్స్ చూస్తేగానీ డే స్టార్ట్ అవట్లేదు. చూశాక అక్కడితో ఆగదు.. ఆ వీక్షణ స్రవంతి నిర్విరామంగా.. రాత్రి పడుకునే వేళదాకా సాగుతూనే ఉంటుంది. అర్ధరాత్రి దాటినా.. ఇంకా ఫోన్ స్క్రీన్ వెలుగుతూనే ఉంటుంది. తెల్లవారి పనో.. ఆఫీస్ టాస్కో హఠాత్తుగా గుర్తొచ్చి.. బలవంతంగా నిద్రకు ఉపక్రమించాల్సిందే తప్ప ఫోన్లో వీక్షణలు చాలు అనిపించి మాత్రం కాదు. ‘డిన్నర్ రెడీ.. ’ అని అమ్మ పిలిస్తే ఎవరూ పట్టించుకోరు. అందరూ తమ సెల్‌ఫోన్ వాట్సాప్ చాట్స్‌లో నిమగ్నమై ఉంటారు. వాళ్ల వాలకం చూసి ‘డిన్నర్ రెడీ.. డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తే తినొచ్చు’ అని వాట్సాప్‌లోని వాళ్ల ఫ్యామిలీ గ్రూప్‌లో మెసేజ్ పెట్టగానే అందరూ చూసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చేస్తారు. ఒక అబ్బాయి రోడ్ మీద ఫోన్లో యూట్యూబ్ చూసుకుంటూ వెళ్తుంటాడు. వెనుక నుంచి బైక్ మీద వచ్చిన ఇంకో కుర్రాడు అమాంతం అతని ఫోన్ తీసుకుని ఉడాయిస్తాడు. హాల్లో కుటుంబ సభ్యులంతా కూర్చుని ఉంటారు. కలసి కబుర్లు చెప్పుకోకుండా.. ఎవరికి వారే అందరూ వాళ్ల వాళ్ల ఫోన్స్‌లో నిమగ్నమై ఉంటారు. ఇంకొక ఇంట్లో.. భోజనాల వేళ.. అమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని.. అందరికీ ప్లేట్స్‌లో సెల్ ఫోన్స్ సర్వ్ చేస్తుంటుంది. ఇంకో చోట.. డైనింగ్ టేబుల్ దగ్గరకి వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అంతా.. టేబుల్ మీదున్న బౌల్లో ఫోన్స్ పెడితే గానీ వాళ్ల కంచాల్లో అమ్మ భోజనం వడ్డించదు. ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. స్పీకర్ మాట్లాడుతుంటాడు. మిగిలినవాళ్లంతా ఫోన్స్‌లో జోక్స్ షేర్ చేసుకుంటూనో.. ఇన్‌స్టాలో రీల్స్ చూస్తూనో.. మీమ్స్ సెండ్ చేసుకుంటూనో.. చాట్ చదువుకుంటూనో.. యూట్యూబ్ షార్ట్స్ ఎంజాయ్ చేస్తూనో ఉంటారు! బ్రెడ్ అండ్ బటర్.. ‘ఒక్క అయిదు నిమిషాలు ఇన్‌స్టాలో రీల్స్ చూసి.. సీరియస్‌గా చదువుకుంటాను ఇక’.. ‘అబ్బ వర్క్‌తో తల వేడెక్కింది కాసేపు యూట్యూబ్ చూసి.. రిఫ్రెష్ అయితే మళ్లీ వర్క్‌లో పడొచ్చు’.. ‘పావు గంట నుంచి వాట్సాప్ చెక్ చేసుకోలేదు. ఒక్కసారి చెక్ చేసుకుని ఇంటి పనిలో పడిపోతా’ .. ఇలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ అన్నీ ఊరించేవే! ఆ అయిదు నిమిషాలు.. రిఫ్రెష్మెంట్.. చెక్ చేసుకోవడానికి అంతే లేకుండా చేస్తాయి. చూస్తున్న కొద్దీ పుట్టుకొస్తుంటాయి అక్షయ పాత్ర మాదిరి. తలాతోకా లేని విషయాల నుంచి తలలు పగలకొట్టుకునే చర్చల దాకా యూజర్స్‌ని అందులో ఎంగేజ్ చేస్తాయి. వాటి తీరే అది. అవి బతుకున్నదే వాటి మీద. ఎలాగైనా.. ఎక్కడిదాకా వెళ్లయినా సరే యూజర్స్‌ని నిమగ్నం చేయాలి. అందుకే అస్ట్రాలజీ నుంచి అంతరిక్షం దాకా.. వంటింటి చిట్కాల నుంచి పాలెస్తినా, ఇజ్రాయేల్ దాకా, రైమ్స్ అండ్ రిడిల్స్ నుంచి రష్యా – ఉక్రెయిన్ యుద్ధం దాకా, కుల, మతాలు, కంట్రీ పాలిటిక్స్ నుంచి ఎన్ఆర్ఐ ఇంట్రెస్ట్‌ల దాకా.. కుట్లు, అల్లికలు, జడలు, మేకప్ నుంచి పారిస్ ఫ్యాషన్ దాకా.. లోకల్ స్ట్రీట్ సింగర్ నుంచి కొరియన్ పాప్ బాండ్స్ దాకా.. నెలల పిల్లల నుంచి సెంచరీకి దగ్గరగా ఉన్న వృద్ధుల దాకా.. డాన్స్, యాక్టింగ్, కామెడీ, సీరియస్, థియేటర్, సినిమా, ఫైన్ ఆర్ట్స్, స్పోర్ట్స్, మెన్, విమెన్, ఎల్జీబీటీక్యూ.. ఒక్కరేమిటీ.. ఒక్కటేమిటీ.. ఎన్నిటినో కలబెట్టడం.. ఎందరినో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మార్చి వీక్షకులను ఏమార్చడం.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కి బ్రెడ్ అండ్ బటర్..! 95% మంది తల్లిదండ్రులు తమ పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కి అడిక్ట్ అయ్యారని ఆందోళన చెందుతున్నారు. 80 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు గేమింగ్ వ్యసనంగా మారిందని వాపోతున్నారు. 70 శాతం పేరెంట్సేమో తమ పిల్లలు అడల్ట్ కంటెంట్‌ను చూస్తున్నారని భయపడుతున్నారు. – ‘బాటు టెక్’ తాజా సర్వే. ఆ నెట్‌వర్క్‌లో.. మంచినీళ్ల వసతి ఉన్నా లేకపోయినా కూల్‌డ్రింక్ ఫెసిలిటీ లేని పల్లెలు ఎలా లేవో.. ఇంట్లో సరకులున్నా లేకపోయినా స్మార్ట్‌ఫోన్ లేని ఇల్లు లేదిప్పుడు. అంత ఎసెన్షియల్ కమొడిటీ అయిపోయింది అది. కమ్యూనికేషన్ నుంచి వాలెట్, నేవిగేటర్, న్యూస్ జర్నల్ వంటి అత్యవసరాలే కాక వినోదాన్ని పంచే సాధనంగా కూడా మారిపోయే! అలాంటప్పుడు సోషల్ మీడియా నెట్‌వర్క్‌లో చిక్కకుండా ఎలా ఉంటాడు మనిషి?! దైనందిన జీవితం నుంచి జ్ఞాన సముపార్జన వరకు అన్నీ.. అన్నిటికీ ఇంటర్నెట్.. దానితో అనుసంధానమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్సే సోర్స్ అయిపోయే! డిజిటల్ విప్లవం ప్రపంచాన్ని గ్రామం నుంచి ఇంకా సూక్ష్మంగా మార్చి అరచేతిలోని స్మార్ట్‌ఫోన్‌లో కూర్చింది. దానికి మనిషిని నిలువెత్తు బానిసను చేసింది. ఒక రోబోలా మార్చింది. దాంతో మనిషి ప్రాక్టికాలిటీలో కన్నా డిజిటల్ వరల్డ్‌లోనే ఎక్కువ గడుపుతున్నాడు. ప్రపంచంతో ఉన్న స్పర్శను కోల్పోయి.. డివైసెస్తో పెనవేసుకుపోతున్నాడు. ఒకరకంగా అవి మనిషికి అవిభక్త కవలలయ్యాయి. అవసరం కాదు వ్యసనం.. హఠాత్తుగా ఇంటర్నెట్ ట్రాఫిక్.. డిజిటల్ ట్రాఫిక్ జామ్ అయి ప్రపంచమంతా స్తంభించిపోయి.. డిజిటల్ డివైసెస్ అన్నీ స్క్రాప్‌గా మారిపోతే.. మనిషి పరిస్థితి ఏంటీ? మానసిక వైకల్యం వచ్చేస్తుందేమో! చూపుడు వేలిని గాల్లో స్క్రోల్ చేస్తూ నడుస్తాడేమో! చుట్టూ ఉన్న పరిసరాల పరిజ్ఞానం అప్పుడు మొదలవుతుందేమో! అతిశయోక్తేం కాదు.. ఆ స్థితీ ఎంతో దూరంలో లేదు అంటున్నారు మానసిక నిపుణులు. అంతేకదా.. దేన్నయినా అవసరాన్ని మించి వాడితే దేనిమీదైనా అవసరం కన్నా ఎక్కువ ఆధారపడితే.. అది వ్యసనమే అవుతుంది. ఇప్పుడు మనం ఆ దశలోనే ఉన్నాం. చంటి పిల్లలు కూడా స్మార్ట్‌ఫోన్ ముందుంటేనే ముద్ద మింగుతున్నారు. ఏ కాలానికి తగ్గట్టు ఆ కాలానికి ఉండాలి. అయితే ఆ అప్డేట్ కాలాన్నే మరచిపోనివ్వవద్దు కదా! కానీ నేటి స్టేటస్ దీనికి భిన్నంగా ఉంది. డిజిటల్ డివైసెస్ ద్వారా డిజిటల్ వరల్డ్‌కి ఎంతలా కండిషన్డ్ అయ్యామంటే మనం చేసే ప్రతి చిన్న పనికీ అవతలి వాళ్ల లైకులు, షేర్లు, కామెంట్లతో ఆమోదం కోరుకోనేంతలా! ఇది మన పని మీద.. నైపుణ్యం మీద.. ఇందాక చెప్పుకున్నట్టు మానసిక ఆరోగ్యం మీదా ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఆందోళనకు కారణమవుతోంది. డిప్రెషన్‌కి దారితీస్తోంది. చుట్టూ ఉన్న ప్రపచంతో డిస్కనెక్ట్ చేస్తోంది. ఫాస్టింగ్.. అదే ఉపవాసం..! ఏదైనా వ్యసనంగా మారితే ఏం చేస్తాం.. డీఅడిక్షన్కి ట్రై చేస్తాం. తిండి కూడా వ్యసనమైతే కంట్రోల్ చేయడానికి మొదట డైట్ ప్లాన్ తీసుకుంటాం. అందులో ఫాస్టింగ్ని ఇన్క్లూడ్ చేస్తాం. అలాగే ఈ డిజిటల్ అడిక్షన్ని పోగొట్టుకోవడానికీ ఉపవాసం ఉంది. అదే డిజిటల్ ఫాస్టింగ్ లేదా డిజిటల్ డిటాక్స్. స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్, లాప్టాప్స్ను పక్కనపెట్టి.. సోషల్‌మీడియా యాప్స్ నుంచి వారంలో ఒకరోజో.. పక్షానికి ఒకరోజో.. లేదా నెలలోనో ఇలా వీలును బట్టి బ్రేక్ తీసుకోవడమన్నమాట. ఇప్పుడు అదే ట్రెండ్.. ఇప్పుడున్న ప్రపంచానికి ఏ మంచినైనా అలవాటు చేయాలంటే దాన్ని ముందు ట్రెండ్‌గా వైరల్ చేయాలి. డిజిటల్ స్లేవరీలో అదీ ఒక భాగమే. సరే విషయానికి వస్తే.. ఇప్పుడు డిజిటల్ డీఅడిక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే అవసరానికి తప్ప మిగిలిన సమయాల్లో.. సందర్భాల్లో డిజిటల్ డివైసెస్‌ని దూరంగా ఉంచడం.. రియల్ వరల్డ్‌తో అంటే చుట్టూ ఉన్న మనుషులు.. పరిసరాలతో మమేకం అవడం.. ఇంటర్నెట్ హెల్ప్ తీసుకోకుండా.. స్వయంగా శోధించడం.. టెక్నికల్ సపోర్ట్‌తో కాకుండా సొంతంగా ప్రయత్నించడం.. సరికొత్త జీవన శైలిగా మారింది. ఇప్పుడు ఇదే వెల్నెస్ ట్రెండ్ అయింది. దీన్ని ప్రాక్టీస్ చేస్తోంది సెకండ్ యూత్ అనుకునేరు.. కాదు.. యువతే! ఒక పూటో.. ఒక రోజో భోజనం మానేయడానికి ఈ రోజుల్లో అంత విల్ పవర్ అక్కర్లేదు. కానీ డిజిటల్ వరల్డ్ నుంచి డిస్కనెక్ట్ కావడానికి చాలా విల్ పవర్ అవసరం. అదంత ఈజీ కాదు. కాసేపు ఫోన్ కనిపించకపోతేనే ఊపిరి ఆగిపోతుందేమో అని గాభరాపడే ప్రాణాలు మనవి! అలాంటిది ఒక పూటో.. ఒక రోజో ఆ డివైసెస్‌కి దూరంగా.. ఇంటర్నెట్ నుంచి లాగౌట్ అవడమంటే నిజంగా సాహసమే! అందుకే మొదట్లో మాటి మాటికీ ఫోన్‌ని వెదుక్కోవాలనిపిస్తుంది. విసుగు, చిరాకు కలుగుతుంది. ఒంటరైపోయామనే భావన వెంటాడుతుంది. వీటన్నిటినీ అధిగమించి ఉపవాస దీక్షను విజయవంతం చేసుకోవడమంటే విల్ పవర్‌కి పరీక్ష పెట్టడమే! డిజిటల్ ఫాస్టింగ్ వల్ల ప్రయోజనాలు.. చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది. పనిలో నాణ్యతా పెరుగుతుంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఇచ్చే విస్తృతమైన సమాచారం ఎనలేని ఆనందాన్నే ఇస్తుండొచ్చు. కానీ అవసరం లేని అదనపు సమాచారమేదైనా మెదడుకు భారమే తప్ప పనికొచ్చే వ్యవహారంగా ఉండదు. పైగా లేనిపోని కన్ఫ్యూజన్లోకీ నెడుతుంది. అందుకే అప్పుడప్పుడూ డిజిటల్ ఫాస్టింగ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుంది. మెదడు విశ్రాంతి పొంది రీచార్జ్ అవుతాం. రాత్రివేళల్లో స్మార్ట్ ఫోన్, ట్యాబ్, లాప్టాప్ వంటివి చూడటం వల్ల వాటి స్క్రీన్ లైట్స్ కళ్ల మీద పడి.. మెదడు ఇంకా రాత్రి కాలేదేమో అనే భావనలో ఉండిపోయి నిద్రను దూరం చేస్తుంది. దాంతో సహజంగా ఉండే స్లీప్ – వేకప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. నిద్రలేమి చెంత చేరుతుంది. డిజిటల్ డివైసెస్ వ్యసనం వల్ల గనక నిద్రలేమి దరి చేరితే దానికి ఒకటే మార్గం.. ఇంటర్మిటెంట్ డిజిటల్ ఫాస్టింగ్. దీనివల్ల మంచి నిద్ర కంటికి చేరి.. ఉదయాలు ఫ్రెష్‌గా మొదలవుతాయి. ఆ రోజంతా ఆహ్లాదంగా గడుస్తుంది. డిజిటల్ వరల్డ్‌కు దూరంగా ఉంటే మెదడు చురుగ్గా ఉంటుంది. కొత్త కొత్త కాన్సెప్ట్స్‌ను ఆలోచించడానికి మెదడు మొగ్గు చూపుతుంది. సృజన వికసిస్తుంది. ఈ రోజుల్లో.. బంధాలు, అనుబంధాలు బలహీన పడటంలో డిజిటల్ డివైసెస్దే ప్రధాన పాత్ర అంటున్నారు ఫ్యామిలీ కౌన్సెలర్లు. మునుపటిలా బంధాలు బలపడి.. అనుబంధాలు వెల్లివిరిసి, స్నేహానురాగాలను ఆస్వాదించాలను కుంటే దానికి సింపుల్ వే.. డిజిటల్ డివైసెస్‌కి డైవోర్స్ ఇవ్వడమే అని చెబుతున్నారు. కుటుంబం, బంధుమిత్రులతో గడిపిన క్షణాలు.. సందర్భాలు.. ఏ డిజిటల్ మీడియం ఇవ్వలేని అసలైన వినోదాన్ని.. ఆనందాన్నిస్తాయి. ఎప్పటికీ మరచిపోలేని జ్ఞాపకాలుగా మలుస్తాయని చెబుతున్నారు మానసిక విశ్లేషకులు. మన దగ్గర 9 –17 ఏళ్లలోపు పిల్లల్లో 60 శాతం మంది రోజుకు మూడు గంటల కంటే ఎక్కువే సోషల్ మీడియా లేదా గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో గడుపుతున్నారని నిరుడు నవంబర్‌లో చేసిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఎలా స్టార్ట్ చేయాలి.. ముందు ఈ డిజిటల్ వరల్డ్ నుంచి ఎందుకు బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారో నిర్ధారించుకోవాలి. పని మీదే ఫోకస్ చేసి.. నైపుణ్యం పెంచుకోవడానికా? ఆందోళన తగ్గించుకోవడానికా? లేదంటే కళ్లముందున్న చిన్న చిన్న ఆనందాలను ఆస్వాదించడానికా? ఇలా దేనికోసం డిస్కనెక్ట్ కావాలనుకుంటున్నారో స్పష్టంగా తెలిస్తేనే ఫాస్టింగ్ ఈజీ అవుతుంది. అలాగే రోజంతా ఉండాలనుకుంటున్నారా? రోజులో కొన్ని గంటలు మాత్రమే చాలనుకుంటున్నారా? ముందు గంటల నుంచి మొదలుపెట్టి.. రోజులకు పెంచుదామనుకుంటున్నారా.. అనేదాన్ని డిజిటల్ డివైసెస్ యూసేజ్.. దానికి అలవాటుపడిన తీవ్రతను బట్టి నిర్ణయించుకోవాలి. థసౌకర్యాన్ని బట్టి ఫాస్టింగ్ టైమ్‌ని నిర్ధారించుకుని వారం.. వర్జ్యం.. మీనం.. మేషం లేక్కపెట్టకుండా తక్షణమే స్టార్ట్ చేయాలి. ఏరోజు.. ఏ పూట డిజిటల్ ఫాస్టింగ్ ఉండబోతున్నారో.. ఆ సమాచారాన్ని కుటుంబం, ఆప్తులు, సన్నిహితులు.. బాస్.. కొలీగ్స్ ఇలా మీ సర్కిల్లో ఉన్న వారందరికీ తెలియజేయాలి. మీ స్మార్ట్ ఫోన్, ఇతర డివైసెస్లోని నోటిఫికేషన్ ఆప్షన్ని టర్న్ ఆఫ్ చేయడం.. వీలైతే సోషల్ మీడియాను అన్‌ఫ్రెండ్ చేయాలి. ఇంకా కుదిరితే ఫోన్‌తోపాటు మిగతా డివైసెస్లోని సోషల్ యాప్స్ అన్నిటినీ తాత్కాలికంగా అన్ఇన్స్టాల్ చేయడం మంచిది. భోజనం చేసేటప్పుడు.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో ఉన్నప్పుడు.. రాత్రి పడుకునే ముందు.. పని వేళల్లో స్మార్ట్‌ఫోన్‌కి దూరంగా ఉండాలి. మాటి మాటికీ ఫోన్ చెక్ చేయాలనుకునే టెంప్టేషన్కి డిలిట్ ఫరెవర్ కొట్టేయాలి. అయినా టెంప్ట్ అవుతుంటే డిజిటల్ ఫాస్టింగ్ ఎందుకు చేస్తున్నామో పదే పదే గుర్తుతెచ్చుకోవాలి. సోషల్ మీడియా నుంచి డిస్కనెక్ట్ అవడం వల్ల దొరికిన విలువైన సమయాన్ని రీడింగ్.. ఎక్సర్సైజెస్.. లేదా చిరకాల అభిరుచుల కోసం వినియోగించుకోవాలి. చేయాలనుకుని చేయలేకపోయిన.. ఎంతోకాలంగా వాయిదా వేసుకుంటూ వస్తూన్న పనుల కోసమూ కేటాయించుకోవచ్చు. లేదా ఇతర ఆసక్తుల మీదా వెచ్చించొచ్చు. బిఫోర్ లాగౌట్.. కళ్లముందు మంచి నీటి ప్రవాహం ఉన్నా.. గుక్కెడు నీళ్లు మాత్రమే దాహాన్ని తీరుస్తాయి. వెల్లువ ఉంది కదాని దాన్ని పొట్టలో నింపేయలేం కదా! ఈ డిజిటల్ ఇన్ఫో కూడా అంతే! ఆ అజీర్తి నుంచి బయటపడేసే ఏకైక మెడిసన్ డిజిటల్ ఫాస్టింగ్. ఈ ఉపవాస దీక్షవల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. అన్నీ అనుకూల ప్రభావాలే! కాబట్టి.. మీ డిజిటల్ ఫాస్టింగ్ గోల్స్‌ని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కూడా పంచుకుని.. ఫాస్టింగ్ వైపు వాళ్లనూ ప్రోత్సహించాలి. ఇలా ఏర్పాటు చేసుకున్న సపోర్ట్సిస్టమ్ మీ ప్రయాణాన్ని మీరు ఆస్వాదించేలా చేస్తుంది. లక్ష్యానికీ త్వరగా చేరుస్తుంది. సెలబ్రిటీలు ఆమిర్ ఖాన్, ఫాతిమా సనా షేఖ్, అమిత్ సాద్, ఇషా గుప్తా వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు తరచుగా డిజిటల్ ఫాస్టింగ్ చేస్తుంటారు. బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు కూడా డిజిటల్ ఫాస్టింగ్‌లో ఉంటుందని వెబ్‌సైట్స్ సోర్సెస్ చెబుతున్నాయి. ఈ ఊళ్లో.. మాహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా.. వడ్గాంలో ప్రతిరోజు సాయంకాలం ఏడు గంటలకు ఒక సైరన్ మోగుతుంది. అలా మోగగానే ఆ గ్రామస్థులంతా తమ ఇళ్లళ్లో టీవీలు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటారు. తర్వాత గం.8.30 నిమిషాలకు మళ్లీ సైరన్ మోగుతుంది. అప్పుడు టీవీలు, ఫోన్లు స్విచాన్ చేసుకుంటారు. ఈ గంటన్నరపాటు వాళ్లంతా కుటుంబంతో.. ఇరుగుపొరుగుతో కబుర్లు చెప్పుకుంటూ.. పిల్లలను ఆడిస్తూ.. చదివిస్తూ కాలక్షేపం చేస్తారు. ఇది దాదాపు రెండేళ్ల నుంచి అమల్లో ఉంది. వడ్గాంను డిజిటల్ డీటాక్స్ విలేజ్‌గా అభివర్ణిస్తున్నారు. ఇక్కడ మూడు వేల వరకు జనాభా ఉంటుంది. అంతా రైతులు, సుగర్ ఫ్యాక్టరీ కార్మికులే! కరోనా సమయంలో ఆన్లైన్ పాఠాలు తప్పనిసరై స్మార్ట్‌ఫోన్స్ వాడటంతో.. ఆ ఊరి విద్యార్థులంతా ఫోన్లకు అడిక్ట్ అయ్యారట. ఇరవైనాలుగ్గంటలూ ఫోన్లతోనే ఆడుకుంటుండంతో ఇటు చదువులోనూ.. అటు ఆటల్లోనూ చురుకుదనం తగ్గి బద్ధకంగా తయారయ్యాట. పెద్దవాళ్లూ ఇందుకు భిన్నంగా కనిపించక వాళ్లూ టీవీలకు అతుక్కుపోయారు. ఇలాగైతే కష్టమని.. పిల్లలు బాగుపడాలంటే ముందు పెద్దవాళ్లను దారిలో పెట్టాలని భావించిన స్కూల్ టీచర్లు.. గ్రామ పంచాయతీ సభ్యులతో మాట్లాడి ఈ డిజిటల్ డిటాక్స్ నిర్ణయాన్ని తీసుకున్నారు. మొదట్లో సైరన్ మోగగానే ఇంటింటికీ వెళ్లి చెక్ చేసేవారట.. ఫోన్లు, టీవీలు కట్టేశారా లేదా అని. గంటన్నర డిజిటల్ డీటాక్స్ మంచి ఫలితాలనివ్వడంతో.. గ్రామస్థులే స్వచ్ఛందంగా సైరన్ మోగగానే డివైసెస్‌ని కట్టేయసాగారని ఆ గ్రామ సర్పంచ్ విజయ్ మొహితే బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇవి చదవండి: కిడ్నీ సమస్యలు ఈ కారణాలతో కూడా రావచ్చు.. జాగ్రత్త! -
శాసనసభలో సెల్ఫోన్లు వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: శాసనస సభ స్పీకర్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక నుంచి సభలో సభ్యులెవరూ సెల్ఫోన్లు, ట్యాబ్‌లు, ఇతర ఎల్రక్టానిక్ గ్యాడ్జెట్స్‌ను వినియోగించకూడదని రూలింగ్ ఇచ్చారు. వాటిని ఉపయోగించి వీడియోలు ప్రదర్శించకూడదని ఆదేశించారు. ‘కృష్ణా నది మీద నిర్మించిన ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబీకి అప్పగించే అంశం’మీద సభలో ఇటీవల జరిగిన చర్చ సందర్భంగా అధికార–ప్రధాన ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగిన విషయం తెలిసిందే. కేఆర్ఎంబీకి తాము ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత అప్పగించటం లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన సమయంలో, ఆ నిర్ణయానికి భిన్నమైన అభిప్రాయాన్ని వెల్లడించిన అప్పటి నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ప్రస్తుతం మాజీ) మురళీధర్‌రావు పేర్కొన్నట్టుగా ఉన్న వీడియోను ఫోన్ ద్వారా ప్రదర్శించారు. ఇది ప్రభుత్వాన్ని కొంత ఇ రుకున పెట్టింది. ఈ నేపథ్యంలో సభలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వినియోగంపై గురువారం స్పీకర్ నిర్ణ యం వెల్లడించటం విశేషం. స్పీక ర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా సభలో వాటిని వినియోగించవద్దని స్పష్టం చేశారు. మీడియా పాయింట్ వద్ద కూడా ఇక సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన మీదట బీఆర్ఎస్ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే. అనంతరం వారు మీడియాతో మాట్లాడేందుకు సభ ఆవరణలోని మీడియా పాయింట్ వద్దకు వస్తుండగా భద్రత సిబ్బంది అడ్డుకున్నారు. సభ జరుగుతున్న తరుణంలో మీడియా పాయింట్ వద్ద మీడియా సమావేశానికి అనుమతి లేదంటూ వారు పేర్కొనడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ బీఆర్ఎస్ సభ్యులు నేలమీద కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సభ ప్రారంభం అవుతూనే స్పీకర్ ప్రసాద్‌కుమార్ కీలక ప్రకటన చేశారు. సభ జరుగుతున్న తరుణంలో సభా ప్రాంగణంలో మీడియా పాయింట్ వద్ద విలేకరుల సమావేశానికి అనుమతి లేదని, టీ, లంచ్ విరామ సమయాల్లో, సభ వాయిదా పడ్డ తర్వాత యధావిధిగా మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడవచ్చని పేర్కొన్నారు. -
ఫోన్ల రికవరీలో దేశంలోనే ప్రథమం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో 33.71 శాతంతో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఎనిమిది నెలల్లో 15,024 మొబైల్ ఫోన్లను గుర్తించడంతోపాటు యజమానులకు అప్పగించినట్టు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) యాప్ ద్వారా మొబైల్ ఫోన్లను తిరిగి గుర్తిస్తున్నట్టు తెలిపారు. పోలీస్ కమిషనర్లు, ఎస్పీలందరి కృషితోనే ఇది సాధ్యమైందని మహేశ్ భగవత్ అభినందించారు. -
సెల్‌ఫోన్ వదిలితేనే స్టీరింగ్
సాక్షి, హైదరాబాద్: డ్రైవర్లు బస్సు నడిపే క్రమంలో మొబైల్ఫోన్లు వాడుతూ ప్రమాదాలబారిన పడుతున్న ఘటనలు ఇటీవలి కాలంలో చోటుచేసుకుంటుండటంతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. డ్రైవర్ల ఏకాగ్రత దెబ్బతినకుండా ఉండే చర్యల్లో భాగంగా వారు విధుల్లో ఉన్నప్పుడు సెల్ఫోన్ల వినియోగాన్ని నియంత్రించాలని నిర్ణయించింది. దీంతోపాటు డ్యూటీలో భాగంగా గమ్యం చేరిన తర్వాత.. తిరిగి మళ్లీ బయలుదేరేలోగా ఉన్న విశ్రాంతి సమయంలోనూ మొబైల్ ఫోన్లు వాడకుండా నిషేధించింది. ఈ చర్యలకు డ్రైవర్లు అలవాటుపడేలా వారికి అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత దీన్ని పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. నిబంధనలు ఇలా... హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సుల డ్రైవర్లు బస్టాండ్‌కు చేరుకోగానే అక్కడి టీఎస్ఆర్టీసీ కేంద్రంలోని ఏటీఎం కార్యాలయంలో మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తిరిగి బస్సు బయలుదేరే సమయంలో వాటిని తీసుకోవాలి. ఇతర దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సుల్లో ఉండే అటెండర్‌కు డ్రైవర్ తన మొబైల్ ఫోన్ అప్పగించాలి. ఏవైనా ఫోన్ కాల్స్ వస్తే అటెండరే మాట్లాడి డ్రైవర్‌కు సమాచారం చెప్పాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచో, లేదా ఇతరుల నుంచో వచ్చే ముఖ్యమైన కాల్స్ ఉంటే బస్సును పక్కన ఆపి మాట్లాడిన తర్వాతే బస్సును నడపాల్సి ఉంటుంది. ఇద్దరు డ్రైవర్లు ఉండే నాన్–ఏసీ దూరప్రాంత బస్సుల్లో అయితే రెండో డ్రైవర్‌కు ఫోన్ అప్పగించాల్సి ఉంటుంది. హైదరాబాద్ సిటీ బస్సు సర్వీసుల్లోనూ కఠిన నిబంధనల అమలు ప్రారంభించారు. డిపోనకు రాగానే అక్కడి కంట్రోలర్‌కు డ్రైవర్లు ఫోన్లను అప్పగించాలి. ఈలోగా ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తే విషయాన్ని తెలుసుకొని కంట్రోలర్లు ఆయా దారుల్లో ఉండే పాయింట్ల మీది కంట్రోలర్ల ద్వారా ఆ సమాచారాన్ని డ్రైవర్లకు చేరవేయాలి. అవగాహన కార్యక్రమాల తర్వాత ఈ నిబంధన పాటించని వారి నుంచి మొబైల్ ఫోన్లు స్వాదీనం చేసుకుని 2 నెలలపాటు బస్ డిపోల్లోనే ఉంచనున్నారు. అప్పటికీ తీరు మారకుంటే శాఖాపరమైన చర్యలు తీసుకోనున్నారు. ఆ డ్రైవర్లకు భారం తప్పించే ఏర్పాటు.. బస్సు టికెట్లను అడ్వాన్సుగా ఆన్లైన్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం (ఓపీఆర్ఎస్) ద్వారా బుక్ చేసుకున్నప్పుడు ప్రయాణికుడికి బస్సు డ్రైవర్ సెల్ నంబర్ అందిస్తున్నారు. బస్సును ట్రాక్ చేసే క్రమంలో ప్రయాణికుడు డ్రైవర్‌కు పలుమార్లు ఫోన్లు చేయడం ప్రమాదకరంగా మారింది. ఈ నేపథ్యంలో ఇటీవలే ఆర్టీసీ రూపొందించిన గమ్యం యాప్‌ను ప్రయాణికులు ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటే బస్సును సులభంగా ట్రాక్ చేసుకోవడంతోపాటు ఇతర సమస్త సమాచారం తెలుస్తుంది. ఈ దిశగా ప్రయాణికులకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతోపాటు టికెట్ బుక్ చేసుకుంటే.. డ్రైవర్ నంబర్‌కు బదు లు ప్రత్యేకంగా ఏర్పాటు చేసే సెంటర్ నంబర్ ఇవ్వనున్నారు. ప్రయాణికుడు ఫోన్ చేయగానే ఆ సెంటర్ సిబ్బంది సిస్టంలో గమ్యం యాప్ తెరిచి బస్సు వివరాలు తెలుసుకుని చేరవేస్తారు. -
సెల్ఫోన్ల రికవరీలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్ల రికవరీలో దేశవ్యాప్తంగా తెలంగాణ నంబర్‌వన్ స్థానంలో నిలిచినట్టు సీఐడీ అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి అక్టోబర్ 26 వరకు 10,018 మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) సాంకేతికతతో గుర్తించి, వాటిని తిరిగి యజమానులకు అందజేసినట్టు పేర్కొన్నారు. ఈ సీఈఐఆర్ టెక్నాలజీ వాడటంతో 39 శాతం మొబైల్ ఫోన్లు రికవరీ చేశామని, మరో 86,395 మొబైల్ ఫోన్లు సీఈఐఆర్ పోర్టల్‌లో బ్లాక్ చేశామని తెలిపారు. మొబైల్ ఫోన్ల రికవరీకి చర్యలు తీసుకుంటున్న సీఐడీ సైబర్ క్రైం ఎస్పీ డాక్టర్ లావణ్య, ఇతర అధికారులను డీజీపీ అంజనీకుమార్, అడిషనల్ డీజీ మహేశ్ భగవత్ అభినందించారు. -
పుంగనూరు అల్లర్లు: ఆ 2 వేల మంది ఎవరు?
సాక్షి, తిరుపతి: పుంగనూరు ఘటనాస్థలిలో శుక్రవారం ఉన్న రెండువేల మంది స్థానికేతరులు ఎవరు? వారు ఎందుకోసం వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అదేరోజు అంతమంది అక్కడికి రావలసిన అవసరం ఏమిటి? ఈ ప్రశ్నలు చిత్తూరు పోలీసుల మదిని తొలుస్తున్నాయి. ప్రాజెక్టుల పరిశీలన పేరుతో చంద్రబాబు ఈ నెల 4, 5వ తేదీల్లో చిత్తూరు, తిరుపతి జిలాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా అంగళ్లులో శుక్రవారం గొడవకు కారణమైన చంద్రబాబు.. కొద్ది గంటలైనా గడవకముందే చిత్తూరు జిల్లా పుంగనూరులో మారణహోమానికి కుట్రపన్నారు. ఆ మారణహోమంలో టీడీపీ శ్రేణులే కాకుండా అల్లరి మూకలు, గూండాలు కూడా పాలుపంచుకున్నారు. టీడీపీ శ్రేణులు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారు రెండువేల మందికిపైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ రోజు ఘటన స్థలంలో దాదాపు ఐదు వేల సిమ్ (సెల్ఫోన్లు)లు ఆన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో పోలీసులు, టీడీపీ శ్రేణులు, స్థానికులు కలిపి మూడువేల మంది వరకు ఉండొచ్చనే నిర్ణయానికి వచ్చారు. వీరుకాకుండా మిగతా రెండువేలమందికిపైగా స్థానికేతరులు అక్కడున్నట్లు వారి సెల్‌ఫోన్ సిగ్నల్స్‌ను బట్టి తెలుస్తోంది. స్థానికేతరులు ఇంత పెద్దసంఖ్యలో పుంగనూరు వద్దకు రావలసిన అవసరం ఏమిటనే కోణంలో విచారణ చేపట్టినట్లు విశ్వసనీయ సమాచారం. పుంగనూరుపై బాబు అక్కసు సీఎం జగన్ ఆదేశాలతో చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంలో మంత్రి పెద్దిరెడ్డి పల్లెబాట పేరుతో ఊరూరా.. వీధివీధి తిరుగుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది, సంక్షేమపథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. చంద్రబాబు కుప్పానికి చేస్తున్న ద్రోహం గురించి వివరిస్తున్నారు. వాస్తవాలను గ్రహించిన కుప్పం వాసుల్లో మార్పు మొదలైంది. మొన్నటి మున్సిపల్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం. ఈ పరిణామాలను గమనించిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పంలో ఓటమి తప్పదనే భయంతో సీఎం వైఎస్ జగన్‌ను, మంత్రి పెద్దిరెడ్డిని టార్గెట్ చేశారు. ఇందులో భాగంగా పుంగనూరులో పర్యటించి అలజడి సృష్టించాలని నిర్ణయించుకున్నారు. అయితే స్థానిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అందుకు గల ప్రధాన కారణం.. పడమటి ప్రాంతాల సాగు, తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఆవులపల్లి, నేతిగుంటపల్లి, ముదివేడు రిజర్వాయర్లను చంద్రబాబు అండ్ కో అడ్డుకున్నారు. కోర్టు నుంచి స్టే తీసుకురావటంపై స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వస్తే నిలదీయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం చంద్రబాబు అండ్ కోకూ తెలుసు. ఇదే అదనుగా చంద్రబాబు మారణహోమానికి పథకం వేసినట్లు తెలిసింది. రైతు వినతితో భగ్గుమన్న బాబు మూడు రిజర్వాయర్లపై వేసిన కేసును వెనక్కు తీసుకోమని ఉమాపతిరెడ్డి అనే రైతు అంగళ్లు వద్ద చంద్రబాబుకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇదే అవకాశంగా చేసుకున్న చంద్రబాబు ఉమాపతిరెడ్డిని నానా బూతులు మాట్లాడి, టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టారు. ‘తరమండిరా.. కొట్టండిరా నా కొడుకులను..’ అంటూ హుకుం జారీచేశారు. అధినేత ఆదేశాలతో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. అక్కడి నుంచే పుంగనూరు వద్ద వేచి ఉన్న టీడీపీ నేతలు, కిరాయి గూండాలకు సమాచారం ఇచ్చారు. అల్లరిమూకలు బాబు రాగానే రెచ్చిపోయాయి. ముందు రోజే మదనపల్లిలో తిష్ఠ విధ్వంసానికి ముందు రోజు రాత్రే అంతే గురువారం రాత్రి టీడీపీ గూండాలు మదనపల్లికి చేరుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ రాత్రి నుంచి 4వ తేదీ ఉదయం 9 గంటల వరకు మదనపల్లిలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన షెల్టర్లలో ఉన్నారు. రాత్రి, ఉదయం మద్యం సేవిస్తూ గడిపారు. ఉదయం 9 గంటలకు టీడీపీ నేతల నుంచి సమాచారం రావటంతో మదనపల్లి నుంచి పుంగనూరు వద్దకు వెళ్లారు. సాయంత్రం వరకు వేచి చూసి టీడీపీ నేతల ఆదేశాల మేరకు విధ్వంసానికి పూనుకున్నారు. టీడీపీ శ్రేణులు కాకుండా అద్దె గూండాలే రెండు వేల మందికి పైగా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరంతా కర్ణాటక, తమిళనాడుకు చెందిన వారా? ఏపీకి చెందిన వారా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు వేల మంది గురించి ఎక్కడా, ఎవ్వరికీ అనుమానం రాకుండా టీడీపీ శ్రేణులు సాయంత్రం వరకు జాగ్రత్తలు తీసుకుని విధ్వంసాన్ని అమలు చేశారు. అయితే పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించటంతో టీడీపీ లక్ష్యం నెరవేరలేదు. -
పోలీస్... శభా్‌ష్
కొత్తచెరువు: చోరీకి గురైన రూ.10 లక్షలు విలువ చేసే 69 సెల్ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. శుక్రవారం ఎస్పీ మాధవరెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు వాటిని అందజేయగా వారంతా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, సెల్‌ఫోన్ చోరీ కేసులకు సంబంధించి 231 సెల్ఫోన్లు రికవరీ చేసి వాటిని ఫిర్యాదుదారులకు అందించామన్నారు. సెల్ఫోన్లు పొగొట్టుకున్న బాధితులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 6305800426 నంబర్‌కు మైబెల్ వివరాలు వాట్సాప్ చేయాలని ఎస్పీ సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందే సమాచారం చేరవేస్తారన్నారు. కార్యక్రమంలో ‘దిశ’ డీఎస్పీ వరప్రసాద్, సీఐ మన్సూరుద్దీన్, క్యాట్ టీం ఆర్ఎస్ఐ వెంకటేశ్వర్రావు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఫోన్లో నెట్వర్క్ లేకున్నా.. ఎమర్జెన్సీ కాల్స్ ఎలా వెళ్తాయో తెలుసా?
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత జనరేషన్లో ఫోన్ గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. ఇక, ఫోనులో నెట్వర్క్ లేకపోయినప్పటికీ ఎమర్జెన్సీ కాల్ చేసే ఆప్షన్ కనిపించడాన్ని మనం చాలాసార్లు గమనించే ఉంటాం. ఎవరైనాసరే ఎటువంటి నెట్వర్క్ అవసరం లేకుండా ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేయవచ్చు. ఎమర్జెన్సీ కాల్లో పోలీసులకు, అంబులెన్స్ మొదలైనవాటికి ఫోను చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే, నెట్వర్క్ లేకుండా ఫోన్ ఎలా పనిచేస్తుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఎలా జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. మీ ఫోనులో నెట్వర్క్ లేదంటే దాని అర్థం ఆపరేటర్ నుంచి నెట్ వర్క్ అందడం లేదని అర్థం. ఇటువంటి స్థితిలో ఎమర్జెన్సీ కాల్ మరో పద్ధతిలో కనెక్ట్ అవుతుంది. మీ ఫోనుకు మీ ఆపరేటర్ నుంచి నెట్వర్క్ కనెక్ట్ కాకపోతే.. ఆటోమేటిక్‌గా అదే ఏరియాలో అందుబాటులో ఉన్న మరో మొబైల్ నెట్వర్క్ నుంచి కాల్ కనెక్ట్ అయ్యే ప్రయత్నం జరుగుతుంది. ఇటువంటి స్థితిలో ఎమర్జెన్సీ కాల్ ఏదైనా ఇతర నెట్వర్క్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఇటువంటి సమయంలో సాధారణ కాల్ కనెక్ట్ అవదు. కేవలం ఎమర్జెన్సీ కాల్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి. మీరు ఎప్పుడు ఎమర్జెన్సీ కాల్ చేసినా ఏ నెట్ వర్క్‌తో అయినా కనెక్ట్ అయ్యే అవకాశం కలుగుతుంది. కాగా, ఎమర్జెన్సీ కాల్స్ చేసే సమయంలో ప్రత్యేకమైన నెట్వర్క్ ఉండాలన్న నియమం ఏదీ లేదు. ఈ కారణంగానే ఎమర్జెన్సీ కాల్ ఎప్పుడైనా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. కాల్ ఎలా కనెక్ట్ అవుతుందంటే.. సాధారణంగా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ముందుగా ఆ ఫోను మాధ్యమం ద్వారా సమీపంలోని నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్ టవర్‌కు మెసేజ్ చేరుకుంటుంది. అప్పుడు ఫోనుకు కాల్ కనెక్ట్ అవుతుంది. ఈ ప్రక్రియ కొద్ది సెకెన్ల వ్యవధిలోనే జరుగుతుంది. ఫలితంగానే మీరు వెంటనే అవతలి వ్యక్తితో మాట్లాడగలుగుతారు. ఇది కూడా చదవండి: జియో, ఎయిర్టెల్ దెబ్బకు లక్షల యూజర్లను కోల్పోయిన వొడాఫోన్ ఐడియా -
దొంగలు బాబోయ్ దొంగలు! ఫీల్డింగ్, ఆడి, స్ట్రైకింగ్, షాను అంటూ కోడ్ భాష!
జేబు దొంగలు (పిక్ పాకెటర్స్) ఇప్పుడు ట్రెండ్ మార్చారు. ఒకప్పుడు పర్సులు కొట్టే పిక్ పాకెటర్లు ఇప్పుడు సెల్ఫోన్లు, ఇతర సొత్తును టార్గెట్‌గా చేసుకుని పక్కా ప్లానింగ్‌తో పని కానిచ్చేస్తున్నారు. ఆ..చిల్లర దొంగల్లే అనుకోకండి. అతి చిన్న నేరమైన పిక్ పాకెటింగ్పై ఆధారపడి హైదరాబాద్‌లో ఇప్పుడు అనేక వ్యవస్థీకృత ముఠాలు పని చేస్తున్నాయి. అయితే ఇవన్నీ పోలీసు రికార్డుల్లోకి ఎక్కవు. కానీ రాజధానిలో ఏటా జరుగుతున్న సాధారణ చోరీలు, దోపిడీలు, దొంగతనాల్లో చోరుల పాలవుతున్న సొత్తుకు సమానంగా జేబు దొంగలు గుల్ల చేస్తున్న మొత్తం ఉంటోందని అంచనా. అందుకే ఓ పక్క ఒంటరి నేరగాళ్లు పిక్ పాకెటింగ్‌లు చేస్తుండగా, మరోపక్క వ్యవస్థీకృత ముఠా నేరగాళ్లు ఈ చోరీలు చేయిస్తున్నారు. సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులకు గతంలో చిక్కిన థండర్ సింగ్ కుష్వా అనే పిక్ పాకెటర్ చందానగర్‌లో నివసిస్తున్న ఫ్లాట్ అద్దె నెలకు రూ.30 వేలుగా తేలడం..విస్మయం కలిగించే అంశం. కాగా మహా నగరంలో వ్యవస్థీకృతంగా జరుగుతున్న పిక్ పాకెటింగ్స్లో ఏటా బాధితులు నష్టపోతున్నది రూ.30 కోట్లకు పైగా ఉంటుందని అనధికారిక అంచనా. ఖాళీ పర్సులతో గిట్టుబాటు కాక..! హైదరాబాద్‌లో పిక్ పాకెటింగ్ గ్యాంగ్‌లు ఏళ్లుగా పని చేస్తున్నాయి. మధ్య, పశ్చిమ, తూర్పు మండలాల్లోని అనేక ప్రాంతాలు వీరికి అడ్డాలుగా ఉన్నాయి. ఈ ముఠాలు ఒకప్పుడు కేవలం పర్సుల్ని మాత్రమే టార్గెట్ చేసేవి. ప్రతి నెలా మొదటి, రెండు వారాల్లో జీతం డబ్బుతో ఇళ్లకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకునేవి. అయితే ప్లాస్టిక్ కరెన్సీగా పిలిచే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరిగిన తర్వాత పర్సుల్లో నగదు అంతగా లేకపోతుండటంతో వీరికి ‘గిట్టుబాటు’కావట్లేదు. పర్సుల్లో దొరికిన కార్డుల్ని తీసుకువెళ్లి షాపింగ్ చేయడం, ఏటీఎం సెంటర్లలో నగదు డ్రా చేయడం ఓ పట్టాన కుదిరే పనికాదు. అందుకే ఇటీవల కాలంలో పర్సుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డారు. చోరీ చేసిన ఫోన్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిషకేషన్ (ఐఎంఈఐ) నంబర్‌ను క్లోనింగ్ చేసి అమ్మడం ద్వారానో, రాష్ట్ర సరిహద్దుల్ని దాటించి విక్రయిస్తూనో, కొన్నాళ్ల పాటు వినియోగించకుండా ఉంచేసి తర్వాత సొమ్ము చేసుకోవడమో చేస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం దొంగలకు అనుబంధంగా మరికొన్ని గ్యాంగ్స్ పని చేస్తుంటాయి. ఈ కారణంగానే చోరీకి గురైన ఫోన్లు సాంకేతికంగానూ ట్రాక్ కావట్లేదు. ప్రత్యేక పారిభాషక పదాలు.. పక్కా ప్లానింగ్ పిక్ పాకెటింగ్ ముఠాలకు ప్రత్యేక పారిభాషిక పదాలు కూడా ఉన్నాయి. రద్దీగా ఉండే బస్సులు, ఆటోలు, మార్కెట్లను ఎంచుకునే ఈ గ్యాంగ్ సభ్యులు టార్గెట్‌ను అనుసరిస్తుంటారు. మొదట గ్యాంగ్‌లోని కొందరు సభ్యులు ఎంచుకున్న వ్యక్తి చుట్టూ చేరతారు. ఇలా చేరడాన్ని ఫీల్డింగ్ అని, వారిని ‘ఆడి’అని పిలుస్తారు. వీరు సదరు వ్యక్తి చుట్టూ చేరి హడావుడి చేయడంతో పాటు గందరగోళ వాతావరణం, ఒత్తిడి కలిగిస్తారు. అదే అదనుగా మరో ముఠా సభ్యుడు తమ ‘టార్గెట్’నుంచి సెల్‌ఫోన్, పర్సు లేదా సొత్తును చోరీ చేస్తాడు. ఇలా చేయడాన్ని స్ట్రైకింగ్ అని, అతడిని ‘షాను’అని పిలుస్తుంటారు. కావాల్సింది చేతి కందగానే ‘షాను’అక్కడ నుంచి ఉడాయించడమో, మరో వ్యక్తికి అందించి పంపేయడమో చేస్తాడు. బస్సుల్లో ఈ చోరీలు జరుగుతుంటే దాని వెనుకే వీరి ఆటో ఫాలో అవుతుంది. ఈ ముఠా సభ్యులు ‘శిక్షణ’కూడా పొందుతారు. ‘పని’కి ఉపక్రమించే ముందు అంతా ఓ చోట సమావేశమై చోరీ చేయాల్సిన విధానాన్ని చర్చిస్తారు. ఆ సమయంలో జరిగే పండుగలు, ఉత్సవాలు, ఊరేగింపులు, రద్దీ ప్రాంతాలు, వ్యాపార కేంద్రాలు తదితరాలను దృష్టిలో పెట్టుకుని వ్యూహ రచన చేస్తుంటారు. అంతా కలిసి ఒకేచోట కాకుండా జట్లుగా విడిపోయి ‘పని’చేస్తుంటారు. ఈ ముఠాలో ఎవరైనా పోలీసులకు చిక్కితే గ్యాంగ్ లీడర్ న్యాయవాదిని ఏర్పాటు చేయడం, బెయిల్‌కు అవసరమైన ఖర్చులు భరించడం వంటివి చేస్తుంటాడు. ఎక్కడా ఆధారాలు లేకుండా... ఈ నేరంలో ఎంత మొత్తం పోయినా దానికి బాధితుడి వాంగ్మూలం తప్ప ఎలాంటి ఆధారం ఉండదు. పిక్ పాకెటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సీసీ కెమెరాలు వంటివి ఉన్న ప్రాంతాల్లో చేతివాటం చూపరు. షాపింగ్ మాల్స్ సహా మరికొన్ని చోట్లకు వెళ్లరు. చోరీకి పాల్పడిన వెంటనే సొమ్మును క్షణాల్లో జట్టులోని ప్రధాన వ్యక్తికి అందిస్తారు. అతడు వెంటనే అక్కడ నుంచి జారుకుంటాడు. ఒకవేళ బాధితుడు తన జేబును ఖాళీ చేసిన వ్యక్తిని పట్టుకున్నా ఫలితం ఉండదు. ఆధారాలేమీ చిక్కవు. సొమ్ము అందుకునే వ్యక్తి ముఠాకు సూత్రధారిగా వ్యవహరిస్తాడు. ఏదైనా ముఠా చిక్కినప్పుడు వారి వాంగ్మూలం ఆధారంగా కొలిక్కిరావాల్సిందే తప్ప ప్రత్యేక దర్యాప్తు అంటూ ఉండదు. అప్పటివరకు కేసు పెండింగ్ జాబితాలో ఉండిపోవాల్సిందే. అందుకే పోలీసులు సైతం ఈ ఫిర్యాదుల్ని పెద్దగా పట్టించుకోరు. కేసుగా నమోదు చేయడానికి అంగీకరించరు. హద్దు ‘దాటితే’అంతే.. ఒంటరిగా నేరాలు చేసే వారు ఎక్కడ పడితే అక్కడ చేసినా.. వ్యవస్థీకృత గ్యాంగులు నడిపించే వారు మాత్రం కొన్ని ప్రాంతాలు, బస్సులు, రూట్లు ఎంపిక చేసుకుంటారు. నిత్యం ఆయా ప్రాంతాల్లోనే తమ పంజాలు విసురుతుంటారు. గతంలో టాస్్క ఫోర్స్ పోలీసులకు చిక్కిన మన్సూర్, జహీర్, మొయిన్‌లు కేవలం చాంద్రాయణగుట్ట, సైదాబాద్ మధ్యే బస్సుల్లో చోరీలు చేశారు. ఒక ముఠా నేరాలు చేసే ప్రాంతంలోకి మరో ముఠా వస్తే సహించరు. ఎంతకైనా తెగిస్తారు. మొఘల్‌నగర్‌కు చెందిన జహీర్.. అక్రమ్ నేతృత్వంలో నడిచే గ్యాంగ్‌లో పని చేసి ఆపై సొంత ముఠా ఏర్పాటు చేసుకున్నాడు. వీరు లక్డీకాపూల్, నాంపల్లి, మెహదీపట్నం వంటి ప్రాంతాల్లో పంజా విసిరేవారు. అవే ఏరియాల్లో ఖైసర్ గ్యాంగ్ సైతం చోరీలు చేస్తుండటంతో వీరి మధ్య వైరం ఏర్పడింది. దీంతో ఖైసర్‌ను హత్య చేయడానికి జహీర్ కుట్రపన్ని పోలీసులకు చిక్కాడు. జేబు దొంగల ముఠాల మధ్య తరచు ఇలాంటి గ్యాంగ్ వార్లు, హత్యలు సైతం నగరంలో వెలుగు చూస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాల్సిందే.. పిక్ పాకెటింగ్ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో చాలావరకు మల్లేపల్లి, మాన్గార్‌బస్తీ, పాతబస్తీలోని వట్టేపల్లి, హసన్‌నగర్, ఫలక్‌నుమా, డబీర్‌పుర, తలాబ్‌కట్ట, షాహీన్‌నగర్ తదితర ప్రాంతాలకు చెందిన వారే ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. వీరు పంజా విసిరే వాటిల్లో ఐఎస్ సదన్, ఇమ్లిబన్, అఫ్జల్‌గంజ్, ఉస్మానియా ఆసుపత్రి, అబిడ్స్, కోఠి, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, నిజాం కాలేజ్, ట్యాంక్‌బండ్, అమీర్‌పేట్, ఎస్సార్‌నగర్, దిల్సుఖ్నగర్, చిక్కడపల్లి, నాంపల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్‌లతో పాటు టూరిస్టుల్ని కొల్లగొట్టేందుకు అనువుగా ఉండే చారి్మనార్, లాడ్‌బజార్, గుల్జార్‌హౌస్ తదితర ప్రాంతాలు ఎక్కువగా ఉంటున్నాయి. వీరితో కొందరు అవినీతి పోలీసులు కుమ్మక్కవుతుండటం గమనార్హం. పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్‌ను నిర్వహిస్తూ కానిస్టేబుల్ ఒకరు నల్లగొండ పోలీసులకు చిక్కడం ఇందుకు నిదర్శనం. మరికొందరు పోలీసుల పైనా ఈ ‘మిలాఖత్’ఆరోపణలు ఉన్నాయి. -
చాట్‌బాట్ దూకుడు..సెల్ఫోన్ల రికవరీలో ‘అనంత’ పోలీసుల సత్తా
అనంతపురం శ్రీకంఠం సర్కిల్: ఫోన్ పోయిందా.. గోవిందా అనుకునే రోజులు పోయాయి. పోగొట్టుకున్న ఫోన్‌ను పోలీసులు వెతికి మరీ ఉచితంగా ఇంటికి చేరుస్తున్నారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఆధ్వర్యంలో ప్రారంభించిన ‘చాట్‌బాట్’ సేవలకు అనూహ్య స్పందన లభిస్తోంది. పోయిందనుకున్న సెల్‌ఫోన్ తిరిగి చేతికి అందడంతో బాధితులు ‘అనంత’ పోలీసులను అభినందిస్తున్నారు. 5,077 ఫోన్ల రికవరీ.. చాట్‌బాట్ సేవలు ప్రారంభించిన అనతి కాలంలోనే రూ.8.25 కోట్లు విలువ చేసే 5,077 మొబైల్ ఫోన్లను జిల్లా పోలీసులు రికవరీ చేశారు. మంగళవారం ఒక్కరోజే 700 మొబైల్ ఫోన్లను బాధితులకు ఎస్పీ ఫక్కీరప్ప అందజేశారు. మొబైల్ ఫోన్ల రికవరీలో అనంత పోలీసులు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచారు. భారీ స్థాయిలో ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ముట్టజెప్పడంలో కీలక పాత్ర పోషించిన జిల్లా పోలీస్ టెక్నికల్ విభాగాన్ని రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి సైతం అభినందించారు. ఎఫ్ఐఆర్ లేకుండానే... సెల్‌ఫోన్ పోతే బాధితులు పోలీసు స్టేషన్లకు వెళ్లకుండానే, ఎఫ్ఐఆర్తో కూడా సంబంధం లేకుండానే రికవరీ చేసి వారికి అందజేయాలనే సంకల్పంతో చాట్‌బాట్ సేవలను 2022 మార్చి 17న ఎస్పీ ప్రారంభించారు. వాట్సాప్ నంబర్ 9440796812 ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ఫోన్లు పోగొట్టుకున్న జిల్లా వాసులతో పాటు వివిధ ప్రాంతాల వారు ఈ నంబరుకు ఫిర్యాదు చేస్తున్నారు. పోలీసులు కూడా వేగంగా స్పందించి ఫోన్లు రికవరీ చేసి వారికి అందజేస్తున్నారు. సుదూర ప్రాంతాల వారు అనంతకు రాకుండానే ఫోన్లు పొందేలా ఉచిత డోర్ డెలివరీ సేవలను తాజాగా ప్రారంభించారు. ప్రొఫెషనల్ కొరియర్ సంస్థ సహకారంతో ఈ సేవలు అందిస్తున్నామని ఎస్పీ తెలిపారు. ఇప్పటిదాకా 15 రాష్ట్రాల బాధితులకు సుమారు 400 సెల్ఫోన్లు రికవరీ చేసి అందించామని వెల్లడించారు. అలాగే రాష్ట్రంలోని 18 జిల్లాల బాధితులు ఈ సేవలను వినియోగించుకున్నట్లు తెలిపారు. -
ఆలయాల్లోకి సెల్ఫోన్లు నిషేధం!.. మద్రాస్ హైకోర్టు సంచలన ఆదేశాలు
చెన్నై: మద్రాస్ హైకోర్టు చర్చనీయాంశమైన ఆదేశాలు ఇచ్చింది. ఆలయాల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఆలయాల యొక్క స్వచ్ఛత..పవిత్రతను పరిరక్షించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ తెలిపింది. అయితే.. హిందూ మత & ధర్మాదాయ శాఖ (హెచ్ఆర్ అండ్ సిఇ) డిపార్ట్మెంట్ పరిధిలోకి వచ్చే ఆలయాల్లోకి భక్తులెవరూ తమ ఫోన్లను తీసుకెళ్లకుండా చూసుకోవాలని ఆదేశించింది. ప్రజలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఫోన్లను గుడి దగ్గర్లో పెట్టుకునేలా స్టాండులు, డిపాజిట్ లాకర్లు, టోకెన్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఈ ఆదేశాలను అన్ని ఆలయాల్లో అమలు అయ్యేలా చూడాలని.. భక్తులెవరూ ఫోన్లు లోపలికి తీసుకెళ్లకుండా భద్రతా సిబ్బందిని నియమించుకోవాలని తెలిపింది. సుబ్రమణ్య స్వామి ఆలయంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. మొబైల్ ఫోన్లు ప్రజల దృష్టి మరల్చడంతోపాటు దేవతా చిత్రాలను క్లిక్ చేయడం ఆగమా నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. అంతేకాదు.. ఫొటోగ్రఫీ వల్ల దేవాలయాల భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని పేర్కొన్నారు. మరోవైపు.. తమ అనుమతి లేకుండా తమ చిత్రాలను క్లిక్ చేయడంపై మహిళల్లో భయాందోళనలు నెలకొంటాయని పిటిషనర్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఆలయాల్లోకి అభ్యంతరకర దుస్తుల్లో రాకూడదని, ఇందుకోసం మంచి డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేయించాలని పిటిషన్ కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. తాజాగా సెల్ఫోన్లను ఆలయాల్లోకి అనుమతించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాలను సందర్శించే భక్తులు దేశ వారసత్వం, సంస్కృతిని కాపాడే వస్త్రాలను ధరించాలని కూడా భక్తులను ఉద్దేశించి మద్రాస్ హైకోర్టు పేర్కొంది. -
గాడ్‌ఫాదర్ ఈవెంట్.. ఎస్పీకి ఫిర్యాదులు.. అసలు ఏం జరిగిందంటే?
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: నగరంలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో బుధవారం జరిగిన గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో జేబు దొంగలు రెచ్చిపోయారు. కేవలం గంట వ్యవధిలోనే 300 సెల్ఫోన్లను అపహరించారు. దీంతో ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చాట్‌బాట్ సేవలకు 24 గంటల వ్యవధిలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చదవండి: కట్టుకున్నవాడు ఖతం.. ప్రియుడు, కూతురితో కలిసి.. దాదాపు 270 మందికి పైగా తమ సెల్ఫోన్లు అపహరణకు గురైనట్లు చాట్‌బాట్‌కు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే అనంతపురం త్రీటౌన్ పోలీసు స్టేషన్‌కు 20, టూటౌన్ పోలీసు స్టేషన్‌కు 18 రాతపూర్వక ఫిర్యాదులు అందాయి. -
నాణ్యమైన సేవల కోసం.. పనివేళల్లో సెల్‌ఫోన్ కట్!
సాక్షి, అమరావతి: విద్యుత్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు అదేపనిగా సెల్ఫోన్లు ఉపయోగిస్తూ పని గంటలు వృథా చేస్తున్నారని ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్ధనరెడ్డికి పలువురు ఉన్నతాధికారులు, వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సీఎండీ.. కార్యాలయాల పని వేళల్లో సెల్ఫోన్లు వాడొద్దంటూ ఉద్యోగులకు మెమో జారీ చేశారు. ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీసీపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంతో పాటు జిల్లా స్థాయిలో ఆపరేషన్ సర్కిల్ కార్యాలయాల్లోనూ ఇవే నిబంధనలు అమలయ్యేలా ఉత్తర్వులు జారీ చేయాలని సూపరింటెండెంట్ ఇంజినీర్లను ఆదేశించారు. ఇటీవల ఏపీసీపీడీసీఎల్ సీఎండీ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడిన అంశాలను.. వాయిస్ రికార్డ్ చేసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. దీనిపై సీఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి చర్యలతో పాటు కార్యాలయాల పనివేళల్లో సెల్ఫోన్లను విపరీతంగా ఉపయోగించడం వల్ల సంస్థ పనితీరుకు, అంతర్గత భద్రతకు, గోప్యతకు భంగం వాటిల్లే ప్రమాదముందని సీఎండీ భావించారు. అక్టోబరు 1 నుంచి పనివేళల్లో సెల్‌ఫోన్ వాడకూడదనే నిబంధనను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ రోజు నుంచి ఉద్యోగులు కార్యాలయానికి రాగానే తమ ఫోన్లను సెక్యూరిటీ వద్ద డిపాజిట్ చేసి రసీదు తీసుకోవాలి. భోజన విరామ సమయంలో ఫోన్లు వాడుకునే అవకాశమిచ్చారు. అత్యవసరంగా మాట్లాడాల్సి వస్తే.. ఉన్నతాధికారి ఫోన్‌ను ఉపయోగించుకోవచ్చు. -
ఫోన్లు కట్టేయండి
సాక్షి, ముంబై: పనివేళల్లో మొబైల్ ఫోన్ల వినియోగంపై ప్రభుత్వం తమ ఉద్యోగులు, అధికారులకు ఆంక్షలు విధించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) కొన్ని మార్గదర్శకాలను జారీచేసింది. వీటిని ఉల్లంఘించిన అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరికి మొబైల్ ఫోన్ జీవితంలో ఒక భాగమైన సంగతి తెలిసిందే. పనులు పక్కన పెట్టి వీడియో గేమ్‌లు ఆడటం, చాటింగ్ చేయడం, బంధువులు, మిత్రులతో గంటల తరబడి మాట్లాడటం లాంటివి విపరీతంగా పెరిగిపోయాయి. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు కూడా అతీతం కాదు. మంత్రాలయతో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే అనేక మంది ఉద్యోగులు మొబైల్ ఫోన్ వినియోగిస్తూ పనిపై అంత దృష్టి పెట్టడం లేదని ప్రభుత్వానికి ఇప్పటికే అనేక ఫిర్యాదులు వెళ్లాయి. ఉద్యోగులు కూడా గంటల తరబడి ఫోన్లలో మాట్లాడుతున్నారు. కొందరు సీట్లలో కూర్చొని మాట్లాడలేక బయటకు వెళ్లి మరీ ఫోన్ కబుర్లలో మునిగి తేలుతున్నారు. మరికొందరు తమ మొబైల్ ఫోన్లలో వీడియో గేమ్‌లు ఆడుతూ కాలయాపన చేస్తున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఉన్నతాధికారులు మొదలుకొని కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరి ప్రవర్తన దాదాపు ఇలాగే ఉంది. దీంతో వివిధ ప్రాంతాల నుంచి పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి పనులు సకాలంలో పూర్తి కావడం లేదు. ఫలితంగా పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొందరి నిర్వాకం వల్ల క్రమశిక్షణతో పనిచేసే ఉద్యోగులకు కూడా చెడ్డ పేరు వస్తోంది. కొందరు ఉద్యోగుల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోంది. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై ఇప్పటికే అనేక రంగాల నుంచి సైతం విమర్శలు వస్తున్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రస్తుతం మార్గదర్శకాలను జారీ చేసింది. అయితే, దీనిపై అధికారులు, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు ఎలా స్పందిస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు డ్రెస్ కోడ్ అమలుచేద్దామని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే పురుష ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు ఎలాంటి దుస్తులు ధరించాలనే దానిపై అప్పట్లో మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. ఆ ప్రకారమే దుస్తులు ధరించి కార్యాలయానికి రావాలని సూచించింది. దీనిపై ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ మార్గదర్శకాలు అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు మొబైల్ ఫోన్ వినియోగంపై తాజాగా విధించిన ఆంక్షలపై ఉద్యోగుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఆసక్తిగా మారింది. ప్రభుత్వ మార్గదర్శకాలు ►విధి నిర్వహణలో ఉండగా సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్ వినియోగించరాదు. ►అత్యవసరమైతే తప్ప ఫోన్ వాడరాదు. ఒకవేళ బయట నుంచి కాల్ వస్తే తొందరగా మాట్లాడి ముగించాలి. ►అధికారిక కాల్స్ కోసం ల్యాండ్‌లైన్ వినియోగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. ►ఫోన్లో వివాదాస్పద సంభాషణలు చేయకూడదు. కుటుంబ కలహాల గురించి అసభ్యకరంగా, బిగ్గరగా మాట్లాడకూడదు. ►సంక్షిప్త సందేశాలకే (ఎస్ఎంఎస్) ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ►విధులు పూర్తయ్యేంత వరకు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టాలి. ►మంత్రుల చాంబర్లలో సమావేశాలు జరుగుతున్నప్పుడు అధికారులు, ఉద్యోగులు రహస్యంగా చాటింగ్ చేయడం, సందేశాలు పంపుకోవడం, వాట్సాప్ వాడటం వంటివి పూర్తిగా మానేయాలి. -
ఆడపిల్లలకు సెల్ఫోన్లెందుకు?
అలీగఢ్(యూపీ): ఉత్తరప్రదేశ్ మహిళా కమిషన్ సభ్యురాలు మీనా కుమారి యువతులను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఆడపిల్లలకు సెల్ఫోన్లు ఎందుకని ఆమె ప్రశ్నించారు. ఇంట్లోని ఆడపిల్లలు పరాయి యువకులతో కలిసి లేచిపోవద్దని అనుకుంటే సెల్ఫోన్ల నుంచి వారిని దూరంగా ఉంచాలని తల్లిదండ్రులకు సూచించారు. వయసొచ్చిన కుమార్తెలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని తల్లులకు హితబోధ చేశారు. ఆడపిల్లలకు సెల్ఫోన్లు ఇవ్వొద్దన్నారు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే జాగ్రత్త పడాలన్నారు. యువతులు ఫోన్లలో యువకులతో మాట్లాడుతున్నారని, తర్వాత ఇద్దరూ కలిసి లేచిపోతున్నారని మీనాకుమారి తప్పుపట్టారు. సమాజంలో నేరాలు పెరగడానికి ఇది కూడా ఒక కారణమన్నారు. ఆడపిల్లలను కాపాడుకోవడంలో తల్లిదే ప్రధాన పాత్ర అని చెప్పారు. తల్లుల నిర్లక్ష్యం వల్లే బిడ్డలు లేచిపోవడం వంటి జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. చదవండి: విషాదం: కుటుంబ కలహాలతో ఐదుగురు కుమార్తెలు సహా... -
పోలీసునంటాడు.. సెల్ఫోన్లతో ఉడాయిస్తాడు
యశవంతపుర : పోలీసునంటూ పరిచయం చేసుకొని ప్రజల వద్ద సెల్ఫోన్లు తీసుకొని ఉడాయిస్తున్న గాయత్రినగరకు చెందిన మహేశ్ నాయక్(42) అనే వ్యక్తిని సుబ్రహ్మణ్య నగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుడినుంచి 2.87 లక్షలు విలువైన సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వేదమూర్తి అనే వ్యక్తి ఈనెల 8న జీకే ప్రింటింగ్ పాయింట్ వద్ద కారు నిలిపాడు. అక్కడే ఉన్న నిందితుడు తాను పోలీసునంటూ పరిచయం చేసుకొని తన పై అధికారికి కారు అద్దెకు కావాలని రాజాజీనగర 17వ క్రాస్ వద్దకు తీసుకెళ్లాడు. అధికారితో మాట్లాడాలంటూ వేదమూర్తినుంచి సెల్‌ఫోన్ తీసుకొని ఉడాయించాడు. అదేవిధంగా 2019లో జేసీనగర పోలీసుస్టేషన్ పరిధిలో బైక్ చోరీ చేసి నంబర్ ప్లేట్ మార్చి సంచరిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. నిందితుడిపై రాజాజీనగర, జేసీ నగర పోలీసుస్టేషన్ పరిధిలో పలు చోరీ కేసులున్నాయి. -
100 మీటర్ల లోపు ఏ ఫోనూ వాడొద్దు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ బూత్‌లలో, పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఏ వ్యక్తి కూడా సెల్ ఫోన్లు, కార్డ్‌లెస్ ఫోన్లు, వైర్లెస్ సెట్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ) స్పష్టం చేసింది. కౌంటింగ్ కేంద్రాలు, చుట్టుపక్కల కూడా ఇలాంటి పరికరాలేవీ ఉపయోగించడానికి వీల్లేదని తెలిపింది. ఉల్లంఘించిన వారి నుంచి వాటిని జప్తు చేసి పోలింగ్ ముగిశాక, ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక మాత్రమే తిరిగి ఇస్తామని పేర్కొంది. ఈ ఆదేశాలు శాంతిభద్రతలు పర్యవేక్షించే అధికారి, పోలింగ్‌బూత్‌లు, కౌంటింగ్ సెంటర్ల వద్ద విధులు నిర్వహించే భద్రతా సిబ్బందికి వర్తించవని గురువారం విడుదల చేసిన ఉత్తర్వులో ఎస్ఈసీ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. పోలింగ్ స్టేషన్ నుంచి 200 మీటర్ల లోపు అభ్యర్థుల ఎన్నికల బూత్‌లు పెట్టరాదని, అభ్యర్థులు ఇలాంటి ఒక్కో బూత్‌లో ఒక టార్పాలిన్‌లో గొడుగు కింద ఒక బల్ల, రెండు కుర్చీలు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని, దీనికి టెంట్ వేయరాదని స్పష్టం చేశారు. ఒక్కో బూత్‌లో అభ్యర్థికి సంబంధించిన ఒక్క బ్యానర్‌ను మాత్రమే ప్రదర్శించాలని తెలిపారు. ఇలాంటి బూత్‌లలో ప్రజలు గుమికూడరాదని, ఓటేశాక ఎవరూ ఈ బూత్‌ల వద్దకు రావొద్దని పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, ఉల్లంఘనలపై ఏ అధికారి అయినా వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే సదరు అధికారిపై క్రమశిక్షణ చర్యలతో పాటు విధుల నిర్వహణలో వైఫల్యానికి చట్టప్రకారం చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఆగస్టు తొలివారంలో మున్సిపోల్స్ పురపాలనలో సమూల ప్రక్షాళన కోసం తెస్తున్న కొత్త మునిసిపల్ చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత ఆగస్టు మొదటి వారంలో మునిసిపల్ ఎన్నికలు నిర్వహించనున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. మునిసిపల్ బిల్లులకు తుదిరూపం ఇవ్వడానికి ఇప్పటికే న్యాయశాఖకు పంపించామని వెల్లడించారు. కొత్త మునిసిపల్ చట్టాల ఆమోదంకోసం ఈనెల 18, 19 తేదీల్లో రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని సీఎం నిర్ణయించారు. 18న బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టి వాటి ప్రతులను శాసన సభ్యులకు అందచేయనున్నారు. బిల్లులను చదివి అవగతం చేసుకోవడానికి సభ్యులకు అవసరమైన సమయం ఇచ్చేందుకు ఆ వెంటనే సభను మరుసటి రోజుకు వాయిదా వేయనున్నారు. 19న బిల్లులపై చర్చించి ఆమోదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను కేవలం మునిసిపల్ బిల్లులను ఆమోదించేందుకు మాత్రమే ప్రభుత్వం నిర్వహిస్తోంది. పశ్నోత్తరాలు తదితర అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ఈ సందర్భంగా ఉండవని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బైంసా మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు స్టే నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించవద్దని హైకోర్టు స్టే విధించింది. ప్రభుత్వం జారీ చేసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను సవాల్ చేసిన కేసులో గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. చట్ట నిబంధనల మేరకు వార్డుల విభజన చేయాలని, అప్పటివరకూ బైంసా మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించరాదని జస్టిస్ పి.నవీన్‌రావు ప్రభుత్వాన్ని ఆదేశించారు. తమ అభ్యంతరాలను పరిష్కరించకుండానే ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ జారీ చేసిందంటూ కపిల్ షిండే దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సీహెచ్ నరేశ్‌రెడ్డి వినిపిస్తూ బైంసా మున్సిపల్ మాజీ చైర్మన్ జబీర్ అహ్మద్‌కు అనుకూలంగా మున్సిపల్ కమిషనర్ చర్యలు ఉన్నాయన్నారు. వాదనల విన్న న్యాయమూర్తి బైంసా ఎన్నికలు నిర్వహించరాదన్న మధ్యంతర ఆదేశాల తోపాటు ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. -
మంగళగిరిలో ఎన్నికల తాయిలాలు
సాక్షి, తాడేపల్లి రూరల్: నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎన్నికల తాయిలాల పంపకం మొదలైపోయింది. ఇందులో భాగంగా శనివారం కొంతమందికి సెల్ఫోన్లు అందజేస్తుండగా ఆ పార్టీలో పనిచేస్తున్న మిగతా కార్యకర్తలు, వారేనా పనిచేసేది, మాకు ఎందుకు ఇవ్వరంటూ నిలదీయడంతో పంపిణీకి వచ్చిన నాయకులు ఒక్కసారిగా అవాక్కవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేనిపోని వ్యవహారం పెట్టుకున్నాంరా.. బాబూ అంటూ వారిలోవారు మధనపడుతూ అధిష్టానం నుంచి వచ్చిన తాయిలాలు పంచి మెల్లగా అక్కడినుంచి జారుకున్నారు. నియోజకవర్గం వ్యాప్తంగా 278 పోలింగ్ బూత్‌లు ఉండగా, అందులో ఇప్పటికే 200 బూత్‌లలో కూర్చునే కార్యకర్తలకు సెల్ఫోన్లు అందజేశారు. ఇచ్చిన సెల్ఫోన్లు పేరుగొప్ప ఊరుదిబ్బలా ఉన్నాయని ఆపార్టీ కార్యకర్తలు వ్యాఖ్యానిస్తున్నారు. సెల్ఫోన్ల పంపకం తెలుగుదేశం పార్టీలో కిందిస్థాయి కార్యకర్తలకు తెలియడంతో, మా అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు, మా అమ్మాయికి సెల్‌ఫోన్ అవసరం, మాక్కూడా ఒకటి ఇప్పించండంటూ మండల స్థాయి, పట్టణ స్థాయి నాయకులను అడగడంతో, ఏం చేయాలో అర్థంకాక నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. (చదవండి: మొదటిరోజే లోకేష్ అధికార దర్పం) -
సెల్ఫోన్లు కావు అణుబాంబులు
సాక్షి ప్రతినిధి, చెన్నై: విద్యార్థుల చేతుల్లోకి విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చిన సెల్ఫోన్లు అణుబాంబులంత ప్రమాదకరమైనవని మదురై హైకోర్టు న్యాయమూర్తులు ఎన్. కృపాకరన్, ఎస్ఎస్ సుందర్ వ్యాఖ్యానించారు. విచక్షణ మరిచిపోయి సెల్‌ఫోన్ వాడకం ఎంత ప్రమాదమనే సత్యాన్ని పొల్లాచ్చి ఘటన లోకానికి చాటిచెప్పిందని వారు అన్నారు. పొల్లాచ్చి ఘటన నేపథ్యంలో మదురైకి చెందిన విజయకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజనవాజ్యం (పిల్)ను విచారణకు స్వీకరించిన న్యాయమూర్తులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్ వినియోగంలోని మంచి చెడులను తెలుసుకోకుండా వినియోగిస్తే పొల్లాచ్చి వంటి సంఘటనల దారితీస్తాయని అన్నారు. ఇంటర్నెట్లోని ఫేస్బుక్, అశ్లీల ఇంటర్నెట్ సైట్లు, మద్యం సమాజాన్ని నాశనం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.. ఈ పోకడల వల్ల పిల్లల ఆరోగ్యం, ఉజ్వల భవిష్యత్తు దారుణంగా దెబ్బతినగలదని హితవుపలికారు. తల్లిదండ్రులు తమ సంతానం నడవడిక, నడత పట్ల ఎంతైనా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు. పొల్లాచ్చి నిందితులు యువతులతో చిత్రీకరించిన దృశ్యాలను ఇంటర్నెట్ నుంచి తొలగించాలని మదురై హైకోర్టు ఆదేశించింది. ఇలాంటి సంఘటనలను అరికట్టడం కేవలం న్యాయస్తానాల బాధ్యత మాత్రమే కాదు, అధికారులు సైతం జాగరూకులై ఉండాలని సూచించారు. ప్రస్తుతం భారత్‌కు ఇంటర్నెట్ వ్రతం ఆచరించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని నటుడు వివేక్ ట్వీట్ చేశారు. అన్నాడీఎంకే నేతలపై ఆరోపణలు: పొల్లాచ్చి దారుణంలో మంత్రి కుమారుని పాత్రతోపాటు అన్నాడీఎంకే అగ్రనేతల కుమారులు కూడా కొందరు ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో అధికార పార్టీకి చెందిన వీఐపీ నేతల కుమారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. యువతులతో నిందితులు చిత్రీకరించిన అశ్లీల వీడియో దృశ్యాలను అధికారపార్టీకి అనుకూలంగా పోలీసులు చెరిపివేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాక నలుగురు మృగాళ్లకు పోలీసుశాఖలో ఒక స్నేహితుడు ఉన్నట్లు అంటున్నారు. బాధిత యువతుల వీడియోలను బహిర్గతం చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ ఆక్షేపించారు. పొల్లాచ్చి దుర్ఘటనను సీబీఐ విచారణ చేపట్టడంలో తమకు నమ్మకం లేదు, న్యాయస్తానం పర్యవేక్షణలో సీబీఐ విచారణ సాగాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ డిమాండ్ చేశారు. పాల్లాచ్చి ఘటనకు నిరసనగా విద్యార్థులు శుక్రవారం మూడోరోజు కూడా తరగతులను బహిష్కరించి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ విద్యాసంస్థలు, కార్యాలయాలు, బస్స్టేషన్ల ముందు రాస్తారోకోలను నిర్వహించారు. బాధితులకు న్యాయం చేయాలి, నిందితులను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. డీఎంకే యువజన విభాగానికి చెందిన మహిళా నిర్వాహకురాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఈరోడ్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆత్మాహుతి యత్నం చేసింది. పుదుక్కోట్టైలో ముగ్గురు కాలేజీ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడంతో కలకలం రేగింది. వారిని విడిచిపెట్టాల్సిందిగా ఆందోళనకారులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ముగ్గురు విద్యార్థినులను వాహనంలో ఎక్కించి తీసుకెళుతుండగా అడ్డుకున్నారు. సుమారు అరంగంటపాటు పోలీసులు, విద్యార్థుల నడుమ చర్చలు జరగ్గా చివరకు వారిని విడిచిపెట్టారు. గూండా చట్టం కింద అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులను తమ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతించాలని కోరుతూ సీబీసీఐడీ పోలీసులు కోయంబత్తూరు చీఫ్ మేజిస్ట్రేటు కోర్టులో శుక్రవారం పిటిషన్ వేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ప్రజలు కూడా తెలియజేయవచ్చని సీబీసీఐడీ అధికారులు పిలుపునిచ్చారు. పొల్లాచ్చి ఘటనపై విద్యార్థుల ఆందోళనలకు అడ్డుకట్టవేసేందుకు ప్రయివేటు కాలేజీలకు అకస్మాత్తుగా సెలవులు ప్రకటించారు. అవసరమైతే నిరవధిక సెలవులు ఇవ్వాలనే ప్రయత్నాలు సాగుతున్నాయి. అంతేగాక హాస్టళ్లలోని విద్యార్థులను ఇళ్లకు పంపివేస్తున్నారు. సమయానికి పార్లమెంటు ఎన్నికలు కూడా సమీపించడంతో రాష్ట్రంలోని విద్యాసంస్థలకు 8 రోజులు ముందుగానే సెలవులు ఇచ్చేశారు. ఏప్రిల్ 12వ తేదీ తుది పనిదినంగా ప్రభుత్వం ప్రకటించింది. సేలంలో: పలు కళాశాలలకు చెందిన 500 మందికి పైగా విద్యార్థులు శుక్రవారం కలెక్టరేట్ ముట్టడించి ఆందోళన చేపట్టారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో విద్యార్థులందరూ రోడ్డుపై బైటాయించి పొల్లాచ్చి నేరస్తులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. అదేవిధంగా సేలం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. ఈ కేసును సీబీఐకి మారుస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే వెనక్కు తీసుకుని, నేరస్తులకు ఉరి శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మార్కిస్ట్ పార్టీ తరఫున సేలంలో శుక్రవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇందులో పెద్ద సంఖ్యలో సీపీఐ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పొలాచ్చి ఘటనలో గోప్యంగా ఉంచాల్సిన బాధిత యువతుల వివరాలను బయటపెట్టిన కోవై ఎస్పీ పాండ్యరాజన్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, బాధిత యువతి కుటుంబానికి రూ.25లక్షల నష్టపరిహారం చెల్లించాలని మదురై హైకోర్టు ఆదేశించింది. -
సెల్‌ఫోన్.. సాక్ష్యంగా!
రాజస్తాన్‌లోని మారుమూల గ్రామం అల్వార్‌లో పెహ్లూ ఖాన్ అనే 55 ఏళ్ల వృద్ధుడిని కొందరు దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు కొద్ది రోజుల్లోనే నిందితులను అరెస్టు చేశారు. ఈ రెండు ఘటనలు బయటి ప్రపంచానికి తెలిసిందీ.. బాధితులకు న్యాయం జరిగిందీ సెల్ఫోన్ల వల్లే. ఇది నిజం.. ఈ ఘటనలను సెల్ఫోన్లో చిత్రీకరించి దాన్ని సామాజిక మాధ్యమంలో పెట్టడంతోనే అందరికీ తెలిసింది. ఆ వీడియో ఆధారంగానే రాజస్తాన్ కేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు ఉదాహరణలు ఉన్నాయి. సెల్ఫోన్లు బాధితులకు సహాయం చేయడానికి, న్యాయపోరాటానికి కూడా ఉపయోగపడతాయని నిరూపితమవుతోంది. తమ ఎదురుగా ఏదైనా ప్రమాదం జరిగినా, అన్యాయం జరుగుతున్నా వెంటనే సెల్ఫోన్లో బంధించి సోషల్ మీడియాలో పెట్టడం ఇటీవల ఎక్కువగా జరుగుతోంది. వాటి ఆధారంగా పోలీసులు, ప్రభుత్వాధికారులు వెంటనే స్పందిస్తున్నారు. సీసీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేస్తున్నా అవి ముఖ్యమైన కూడళ్లు, ప్రదేశాల్లోనే ఉంటున్నాయి. పల్లె లు, శివారు ప్రాంతాల్లో అందుబాటులో ఉండవు. అలాంటి చోట్ల సెల్ఫోన్లే సీసీ కెమెరాలుగా పని చేస్తున్నాయి. గతంలో ఏవైనా గొడవలు, ప్రమాదాలు జరిగినా జనం అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. ఇప్పుడు అలా కాకుండా తమ దగ్గరున్న ఫోన్లతో ఆ ఘటనలను చిత్రీకరించి ప్రపంచానికి తెలుపుతున్నారు. దీనివల్ల చాలా మందికి న్యా యం జరుగుతోంది. పలువురు నిందితులు పట్టుబడుతున్నారు. కొన్ని రోజుల కింద మధ్యప్రదేశ్‌లో ఓ రైతు.. కలెక్టర్ కాళ్లమీద పడి బతిమాలుతున్న వీడియో వైరల్ అయింది. ఆ దృశ్యం ఎంపీ జ్యోతిరాదిత్య సింధియా దృష్టికి వచ్చింది. వెంటనే ఆ కలెక్టర్‌ను మందలించడమే కాకుండా 2 గంటల్లో రైతుకు న్యాయం చేశారు. సెల్‌ఫోన్ వల్ల పోలీసులు నిందితులను పట్టుకోగలుగుతున్నారు. ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేస్తున్నారు. కోర్టులు కూడా కొన్ని సార్లు వీటిని సాక్ష్యాలుగా పరిగణిస్తున్నాయి. ఈ వీడియోల వల్ల ఎక్కువగా సామాన్యులు, బడుగు వర్గాల వారికి న్యాయం జరుగుతోందని పోలీసులు చెబుతున్నారు. సెల్ఫోన్లు బాధితులకు న్యాయం చేస్తున్నా మరోవైపు మనుషుల్లో మానవత్వాన్ని చంపేస్తున్నాయని సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. కళ్ల ముందు ప్రమాదం లేదా నేరం జరుగుతుంటే దాన్ని నివారించడానికి ప్రయత్నం చేయకుండా ఫోన్లో చిత్రీకరించడానికి జనం ప్రాధాన్యం ఇస్తున్నారని, దీంతో ఒక్కోసారి బాధితులు ప్రాణాలు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి.. చికిత్స కోసం వచ్చిన ఒక దివ్యాంగుడికి వీల్ చైర్ ఇచ్చేందుకు వార్డుబోయ్ నిరాకరించాడు. లంచం ఇవ్వకపోవడమే దీనికి కారణం. దాంతో ఆ రోగి చిన్న పిల్లలు ఆడుకునే మూడు చక్రాల సైకిలు తెచ్చి ఆస్పత్రి చుట్టూ తిరిగాడు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. విషయం తెలిసిన ఆస్పత్రి ఉన్నతాధికారులు విచారణ జరిపి లంచం అడిగిన సిబ్బందిని సస్పెండ్ చేశారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఆ ఆస్పత్రికి కొత్తగా 30 వీల్చైర్లు ఇచ్చింది. స్థానిక స్వచ్ఛంద సంస్థ ఒకటి ఆ దివ్యాంగుడికి కొత్త వీల్‌చైర్ అందజేసింది. -
సెల్‌ఫోన్ అధికంగా వాడితే మీ చర్మం..
సాక్షి, ముంబై : సెల్‌ఫోన్ అధికంగా వాడటం వల్ల కళ్లు దెబ్బతింటాయి.. మానసినక రుగ్మతలకు దారితీస్తుంది.. ఇవి అందరికీ తెలిసిన విషయాలే! అయితే సెల్ఫోన్లను ఎక్కువసేపు వాడటం వల్ల దానినుంచి విడుదలయ్యే బ్లూలైట్ కారణంగా చర్మం దెబ్బతింటుందని చర్మవైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. తద్వారా త్వరగా వయసు మీదపడిన ఛాయలు వచ్చే అవకాశం ఉందంటున్నారు ముంబైకి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్టు డా. షెఫాలి ట్రాసీ నెరూర్కర్. ఎవరైతే గంటల తరబడి సెల్ఫోన్లు వాడుతుంటారో వారు పిగ్మెంటేషన్, ఇన్ఫ్లమేషన్, చర్మ బలహీనపడటం వంటి వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. సెల్ఫోన్లు మాత్రమే కాకుండా కంప్యూటర్ తెరలనుంచి విడుదలయ్యే బ్లూలైట్ కారణంగా మన చర్మానికి రక్షణగా నిలిచే కొల్లజన్ అనే ప్రోటీన్ ఉత్పత్తి తగ్గిపోతుందని తెలిపారు. బ్లూలైట్ కారణంగా చర్మంలోని కణాలు దెబ్బతిని త్వరగా వయసు మళ్లిన వారిలా కనపడేలా చేస్తాయన్నారు. చర్మంపై ముడతలు, నల్లటి వలయాలు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరి రాత్రుళ్లు ఎక్కువగా సెల్ఫోన్లు ఉపయోగించే వారి నిద్రకు అటంకాలు ఏర్పటం మూలాన మానసిక, శారీరక సమస్యలు ఉత్పన్నమవుతాయని వెల్లడించారు. చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే తగిన విశ్రాంతి అవసరమని పేర్కొన్నారు. అందంగా, ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు సెల్‌ఫోన్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని సలహా ఇస్తున్నారు. -
మా పెళ్లికి సెల్ఫోన్లు తేవొద్దు!
ముంబై : రణ్వీర్ సింగ్-దీపికా పదుకొణే త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. విరాట్ కోహ్లి-అనుష్క శర్మల మాదిరి ఈ జంట కూడా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతుంది. గతంలో నవంబర్ 10న వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటవుతారని ప్రచారం జోరుగా సాగితే, తాజాగా వివాహ ముహుర్తం నవంబర్ 20న పక్కా అంటూ వార్తలొస్తున్నాయి. ఇటలీలోని కోమో సరస్సు వీరి వివాహ వేడుకకు వేదికగా నిలవబోతుంది. ఈ డెస్టినేషన్ వెడ్డింగ్‌కు 30 మంది కంటే ఎక్కువ మంది అతిథులను ఆహ్వానించకూడదని దీపికా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. వివాహాన్ని ప్రైవేట్‌గా నిర్వహించాలని చూస్తోంది. రిపోర్టుల ప్రకారం కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఈ వేడుకలో భాగం కాబోతున్నారట. అంతేకాక వీరి వివాహ వేడుకకు సెల్ ఫోన్లు అనుమతించకూడదని కూడా ఈ జంట నిర్ణయించారట. వేడుక అనంతరం వీరిద్దరే వివాహ ఫోటోలను అందరికీ షేర్ చేయాలని ప్లాన్ చేశారట. మా పెళ్లికి సెల్ఫోన్లు తీసుకురావద్దంటూ అతిథులకు దీపికా-రణ్వీర్ చెబుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. వేడుకను చాలా ప్రైవసీగా ఉంచాలని కూడా వీరు అభిప్రాయపడుతున్నారని పేర్కొన్నాయి. ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ అని, కొంతమంది అతిథులను మాత్రమే పిలుస్తున్నారని, అన్ని కార్యక్రమాలు పూర్తవుతున్నాయంటూ సంబంధిత వర్గాలు తెలిపాయి. తమ పెళ్లి చాలా పర్ఫెక్ట్గా చేసుకోవాలని రణ్వీర్, దీపికాలు నిర్ణయించారట. -
డ్రైవరే దొంగ!
అద్దంకి (ప్రకాశం): చెడు వ్యసనాలకు బానిస కావడం.. తాను కొనుగోలు చేసిన లారీలకు కిస్తీలు చెల్లించలేకపోవడంతో ఆ డ్రైవర్ అక్రమ మార్గాన్ని ఎంచుకున్నాడు. తన లారీలో లోడైన సెల్ఫోన్లు విక్రయించి సొమ్ము చేసుకోవాలని చూసిన డ్రైవర్‌ను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. దర్శి డీఎస్సీ నాగేశ్వరరావు స్థానిక సీఐ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా వానియంబాడి తాలూకా మెట్టుపాలయమ్ గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కొడగంటి రంగనాథన్ లారీ డ్రైవర్‌గా జీవనం సాగిస్తుంటాడు. చిత్తూరు జిల్లా శ్రీ సిటీ నుంచి రూ.7,25,67,582 విలువైన రెడ్మీ నోట్ ఎంఐ ఫోన్ల లోడ్‌తో కలకత్తాలోని హుగ్లీకి బయల్దేరింది. లారీ ఈ నెల 18వ తేదీ రాత్రి 9 గంటలకు ఐదో నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న పంజాబీ దాబా వద్ద నిలిపాడు. మేదరమెట్ల వెళ్లి వచ్చే సరికి 6400 రెడ్మీ కంపెనీ సెల్ఫోన్లు ఉన్న లారీ అపహరణకు గురైందంటూ ఈ నెల 19న లారీ డ్రైవర్ మేదరమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ ఆదేశాల మేరకు దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు వివిధ బృందాలుగా ఏర్పడి లారీ కోసం గాలించారు. చివరకు లారీ అద్దంకి మండలం కొంగపాడు పొలాల్లోని సుబాబుల్ తోటల్లో గుర్తించారు. లారీని ఎవరూ అపహరించలేదని, అపహరిస్తే అక్కడ ఎందుకు వది వెళ్లారనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగింది. డ్రైవర్‌ను తమ దైనశైలిలో విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూశాయి. తన అప్పుల కోసం సెల్‌ఫోన్ లోడ్ లారీని మాయం చేసినట్లు డ్రైవరే నేరం అంగీకరించాడు. పోలీసులు ఆయన్ను కటకటాల వెనక్కి నెట్టారు. లోడ్ లారీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టుకు హాజరు పరిచినట్లు డీఎస్పీ చెప్పారు. కేసును ఛేదించిన సీఐ హైమారావు, మేదరమెట్ల ఎస్ఐ పాండురంగారావు, హెచ్‌సీ కోటేశ్వరరావు, అంజుల్లా బృందాన్ని డీఎస్పీ అభినందించారు. -
సెల్ టు హెల్
రాయవరం (మండపేట): అంగన్వాడీ కేంద్రాల్లో నిత్యం జరిగే కార్యకలాపాలను ఉన్నతాధికారులకు పంపించేందుకు ఇచ్చిన సెల్ఫోన్లు కార్యకర్తలకు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికే పలు కేంద్రాల్లోని కార్యకర్తల సెల్ఫోన్లు పేలిపోవడం, కాలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో అంగన్వాడీ కార్యకర్తలు భయాందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నాసిరకం సెల్ఫోన్లు సరఫరా చేయడం వలనే ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అంగన్వాడీ వర్కర్లు ఆయాల సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చార్జింగ్ పెడుతుండగా.. మండలంలోని మాచవరం గ్రామంలో 41వ కేంద్రం అంగన్వాడీ కేంద్రం కార్యకర్త సీహెచ్.సత్యవేణి శుక్రవారం తన ఇంట్లో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతుండగా కాలిపోయింది. ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో ప్రభుత్వం సరఫరా చేసిన సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా దాని నుంచి పొగలు వచ్చి కాలిపోయింది. సెల్‌ఫోన్ నుంచి పొగలు రావడం గమనించిన సత్యవేణి, అప్రమత్తమై ఇంట్లోకి వచ్చే విద్యుత్ సరఫరాను నిలుపుదల చేయడంతో ప్రమాదం తప్పిందంటున్నారు. అదే అంగన్వాడీ కేంద్రంలో కానీ, చేతిలో ఉండగా కానీ పేలితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. గతంలోనూ పలు ఘటనలు ప్రభుత్వం అంగన్వాడీ వర్కర్లకు ఏడాది క్రితం సెల్ఫోన్లు అందజేసింది. వీటి ద్వారా కుటుంబ నమోదు, రోజువారీ న్యూట్రిషన్ తీసుకునే వారి వివరాలను అప్లోడ్ చేయడం, గర్భిణులు, బాలింతలు, ఆరు నెలల నుంచి మూడేళ్ల లోపు చిన్నారులకు ఇవ్వాల్సిన టీహెచ్ఆర్(టేక్ హోమ్ రేషన్) నమోదు, గృహ సందర్శన తదితర వివరాలను నమోదు చేస్తున్నారు. ఈ వివరాలు ఎప్పుటికప్పుడు సెల్‌ఫోన్ సహాయంతో ఆన్లైన్ చేయాల్సి ఉంది. ఇంతటి సమాచారం ఆన్లైన్ చేయాల్సిన పరిస్థితుల్లో ఫోన్లు కాలిపోవడం, పేలిపోవడం వంటి ఘటనలు చోటు చేసుకోవడంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇటువంటి ఘటనలు రంగంపేట మండలంలో ఒకటి, రాజానగరం మండలంలో మూడు, రాజవొమ్మంగి మండలంలో ఒకటి చోటు చేసుకోగా, తాజాగా రాయవరం మండలం మాచవరంలో జరిగింది. ఒక కంపెనీకి చెందిన నాసిరకం సెల్ఫోన్లను అంగన్వాడీ కార్యకర్తలకు ఇవ్వడం వలనే ఇలా ఫోన్లు కాలిపోవడం, పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నట్లు అంగన్వాడీ వర్కర్లు ఆయాల సంఘం నేతలు పేర్కొంటున్నారు. నిత్యం సెల్‌ఫోన్ ద్వారా సమాచారం అందించాల్సిన పరిస్థితుల్లో ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటుంటే తాము ఎలా పని చేయాలని వారు ప్రశ్నిస్తున్నారు. -
చంద్రబాబుకు అంగన్వాడీల షాక్
సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అంగన్వాడీ మహిళలు షాక్ ఇచ్చారు. ఆయన అడిగిన ప్రశ్నకు అంగన్వాడీలు ఇచ్చిన సమాధానంతో ఒక్కసారిగా సీఎం కంగుతిన్నారు. వివరాల్లోకి వెళితే.. గురువారం విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన అంగన్వాడీల అవగాహన సదస్సులో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. గతంలో అంగన్వాడీలకు సెల్ఫోన్లు ఇస్తామని ప్రకటించిన చంద్రబాబు.. ఎంతమందికి సెల్ఫోన్లు అందాయో చేతులు ఎత్తాలని కోరారు. కానీ తమకు సెల్ఫోన్లు అందలేదంటూ అందరూ చేతులు ఎత్తడంతో ఆయన ఒక్కసారిగా బిక్కమొహం వేశారు. చంద్రబాబు ఆ తప్పును అధికారుల మీదకు నెట్టి తప్పించుకున్నారు. అధికారులు సెల్ఫోన్లు ఇవ్వకుండానే తనతో ఇచ్చినట్లు తప్పుడు సమాచారం ఇచ్చారని చెప్పారు. ఆగస్టు 15 కల్లా అంగన్వాడీలకు సెల్ ఫోన్లు అందిస్తామని హామీ ఇచ్చి తన అలవాటైన విద్యను ప్రదర్శించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేదని అంగన్వాడీలు వాపోయారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అన్నారు. -
చంద్రబాబుకు షాక్ ఇచ్చిన అంగన్వాడీ మహిళలు
-
చోరీ ఫోన్లకు ‘రెక్కలు’
సాక్షి, సిటీబ్యూరో: ఒకప్పుడు చోరీ చేసిన ఫోన్లను యధాతథంగా వినియోగించడం/విక్రయించడం జరిగేది.ఆ తర్వాత కొన్నాళ్లకు తస్కరించిన ఫోన్ల ఐఎంఈఐ నెంబర్లను ట్యాంపరింగ్/క్లోనింగ్ చేసి వాడటం మొదలెట్టారు.ఇప్పుడు చోరీ చేసిన వాటిలో అత్యంత ఖరీదైన సెల్ఫోన్లను గుట్టుగా విదేశాలకు తరలించేస్తున్నారు.నగరంలో అపహరణకు గురవుతున్న సెల్ఫోన్లలో ఖరీదైనవి అత్యధిక భాగం బ్యాంకాక్, చైనాలకు తరలిపోతున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశంలో ఉన్నవి సైతం ప్రధానంగా కర్ణాటకలోని గుల్బర్గా మార్కెట్‌కు వెళ్తున్నాయి. ఫలితంగా వీటిని రికవరీ చేయడం కష్టసాధ్యంగా మారుతోందని అధికారులు పేర్కొంటున్నారు. అనధికారిక సమాచారం ప్రకారం నగర వ్యాప్తంగా ఏటా దాదాపు లక్ష వరకు సెల్ఫోన్లు చోరీకి గురవుతున్నాయి. రాజధానిలో అనేక ముఠాలు సెల్‌ఫోన్ పిక్‌పాకెటింగ్, స్నాచింగ్‌ను వ్యవస్థీకృతంగా చేస్తున్నాయి. బస్సు ప్రయాణికులు, పాదచారులను లక్ష్యంగా చేసుకుని ఈ సెల్ఫోన్ల చోరీ చేస్తున్నారు. బాధితు ల్లో మధ్య తరగతి వారే ఎక్కువగా ఉంటున్నారు. పర్సుల నుంచి సెల్ఫోన్ల వరకు... నగరంలోని పిక్‌పాకెటింగ్ గ్యాంగ్‌లు ఒకప్పుడు కేవలం పర్సులను మాత్రమే టార్గెట్ చేసేవి. అయితే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరగడంతో వీరికి పర్సులతో ‘గిట్టుబాటు’ కావట్లేదు.ఈ నేపథ్యంలో ఇటీవల వీరు సెల్ఫోన్లపై దృష్టి సారించారు. పీడీ యాక్ట్ ప్రయోగం వరకు కరుడుగట్టిన రౌడీషీటర్లు ఫయాజ్, ఖైసర్, షేరూ, లతీఫ్ తదితరులు ముఠాలు కట్టి మరీ వ్యవస్థీకృతంగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ మరికొన్ని చోటా మోటా ముఠాలు ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఐదుగురు సభ్యుల ముఠాను ముషీరాబాద్ పోలీసులు శనివారం పట్టుకున్నారు. ఇలాంటి ముఠాలు పరిధులను సైతం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఒకరి ఏరియాల్లోకి మరొకరు ప్రవేశిస్తుండటంతో వీటి మధ్య అనేక సందర్భాల్లో గ్యాంగ్ వార్స్ జరిగి హత్యలకు దారి తీస్తున్నాయి. గతంలో ఐఎంఈఐ నంబర్ మార్చేసి... ప్రతి మొబైల్‌ఫోన్‌కు ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్‌గా పిలిచే ఐఎంఈఐ నెంబర్ ఉంటుంది. మనిషి వేలిముద్రల తరహాలోనే ప్రపంచంలోని ఏ రెండు సెల్ఫోన్లకూ ఒకే నెంబర్ ఉండదు. సదరు సెల్‌ఫోన్‌ను ఏ వ్యక్తి వినియోగిస్తున్నది తెలుసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జాతీయ భద్రత నేపథ్యంలో ఇది ఎంతో కీలకం. ఐఎంఈఐ నంబర్ ట్యాంపర్ చేసేందుకు ఉపకరించే గ్యాడ్జెట్ విపణిలో లభిస్తున్నాయి. చోరీ ఫోన్లకు దొంగల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేసే వ్యక్తులు ఈ గ్యాడ్జెట్స్‌ను వినియోగించి దానికి ఉన్న నెంబర్‌కు బదులు మరో ఐఎంఈఐ నెంబర్ కేటాయించేవారు. మరోపక్క పనికి రాని పాత ఫోన్లను రూ.వందల్లో కొనుగోలు చేస్తూ వాటి మదర్ బోర్డ్‌పై ఉన్న ఐఎంఈఐ నెంబర్ స్ట్రిప్‌ను ట్యాంపరింగ్ ద్వారా సేకరించి చోరీ వాటికి వేసే వారు. దీంతో సాంకేతికంగా చోరీ ఫోన్లను పట్టుకోవడం సాధ్యం కాదు. సరిహద్దులు దాటిస్తూ... తాజాగా చోరీ సెల్ఫోన్లను కొనుగోలు చేస్తున్న, చోరీ చేస్తున్న వారి పంథా పూర్తిగా మారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ముషీరాబాద్ పోలీసులు అరెస్టు చేసిన ఐదుగురిలో ఒకడైన నజీరుద్దీన్ ఆరునెలల్లో దాదాపు నాలుగు సార్లు బ్యాంకాక్ వెళ్ళి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కోణంపై ఆరా తీయగా, తనతో పాటు మరికొందరు ‘ఐ–ఫోన్లను’ సరిహద్దులు దాటించేస్తున్నట్లు వెల్లడించాడు. ఒక్కో విడతలో నాలుగైదు ఫోన్ల చొప్పున బ్యాంకాక్ తీసుకువెళ్లి అక్కడ మార్కెట్లో అమ్మేసి వస్తున్నట్లు అంగీకరించాడు. నగరంలో జగదీష్ మార్కెట్ తరహాలోనే ఆ దేశంలోనూ ఓ భారీ సెకండ్ హ్యాండ్ ఫోన్ల మార్కెట్ ఉందని, అయితే అక్కడ ఐ–ఫోన్లకు మాత్రమే గిరాకీ ఉన్నట్లు వెల్లడించాడు. గుల్బర్గాలోని సెకండ్ హ్యాండ్ మార్కెట్ దేశంలో చోరీ మాల్‌కు కేరాఫ్ అడ్రస్‌గా పోలీసులు గుర్తించారు. ఇలా తరలిపోతున్న వాటిని ట్రాక్ చేయడం సాధ్యం కావట్లేదని చెబుతున్నారు. రిటర్న్ రూపంలో చైనాకు... నగరంలోని అనేక ప్రాంతాలకు చెందిన చోరీ మాల్ వ్యాపారస్తులు సిండికేట్‌గా చైనా మార్గాన్ని ఎంచుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. గడిచిన కొన్నేళ్లుగా చైనా నుంచి వివిధ రకాలైన వస్తువులను దిగుమతి చేసుకోవడం సాధారణమైంది. ఇలా వచ్చిన మాల్లో కొంత అనేక కారణాల నేపథ్యంలో రిటర్న్ చేస్తుంటారు. వీటితో కలిపి చోరీ సెల్ఫోన్లను చైనాకు పంపేస్తున్నట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. పక్కా ప్రొఫెషనల్ చోరుల నుంచి ఖరీదు చేసిన ఖరీదైన హై–ఎండ్ ఫోన్లను మాత్రమే ఇలా పంపేస్తున్నట్లు భావిస్తున్నారు. రిటర్న్ మాల్లో గోప్యంగా దాచి పంపిస్తున్న నేపథ్యంలో కస్టమ్స్ అధికారులకూ చిక్కట్లేదని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చోరీకి గురైన హై–ఎండ్ సెల్ఫోన్లను రికవరీ చేయడం అసాధ్యంగా మారినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారాలపై దృష్టి పెట్టిన పోలీసులు బాధ్యుల కోసం లోతుగా ఆరా తీస్తున్నారు. జాగ్రత్తలే మేలు... సెల్ఫోన్లను కోల్పోయిన సందర్భంలో బాధితులను ఎక్కువగా ఆందోళనకు గురిచేసేది దాని ఖరీదు కంటే అందులో ఉన్న డేటానే. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ స్నేహితులు, సన్నిహితులు, బంధువులు... చివరకు తల్లిదండ్రులు, భార్య ఫోన్ నెంబర్లు, అత్యంత కీలకమైన డేటాను సెల్లోనే ఫీడ్ చేసుకుంటున్నారు. ఫలితంగా ఒక్కసారి ఫోన్ పోగొట్టుకుంటే... దాదాపుగా అందరితోనూ సంబంధాలు తెగిపోతున్నాయి. విలువైన సమాచారం కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ప్రతి సెల్‌ఫోన్‌కు 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిఫికేషన్ నెంబర్) ఉంటుంది. మెబైల్ ప్యాకింగ్ బాక్స్‌పైనా, అమ్మకం బిల్లుపైనా దీన్ని ముద్రిస్తారు. మీ సెల్ఫోన్లో (06) బటన్లు నొక్కితే ఈ నెంబరు డిస్ప్లే అవుతుంది. ఈ సంఖ్యను నోట్ చేసుకుని భద్రంగా ఉంచుకోవాలి. ఫోను పోయినప్పుడు దీన్నిబట్టి ఆచూకీ కనుక్కోవడానికి ప్రయత్నించవచ్చు. మీ సెల్‌ఫోన్‌ను సెక్యూరిటీ లాక్ పెట్టుకోవాలి. ప్రతి ఫోనులోనూ ఉన్న మెనూలో సెట్టింగ్స్, సెక్యూరిటీ సెట్టింగ్స్‌లో ఇది అందుబాటులో ఉంటుంది. దీనిని సెట్ చేసుకోవడం వల్ల మన ఫోను ఎవరికైనా దొరికినా, దొంగిలించినా... వినియోగించుకోవడం, అందులోని వ్యక్తిగత డేటాను చూడటం వారి వల్లకాదు. ప్రస్తుతం కొన్ని సర్వీస్ ప్రొవైడర్ కంపెనీలు, వెబ్‌సైట్స్ ఫోన్‌బుక్‌తో పాటు కొంత డేటా, ఫొటోలు బ్యాకప్/స్టోర్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తున్నాయి. వీటిని వినియోగిం చుకోవడం ద్వారా మీ ఫోన్లో సేవ్ చేసుకుంటున్న డేటా అంతా ఓచోట బ్యాకప్ అవుతుంది. దీని వల్ల ఫోన్ పోయినా... మీ డేటా సర్వర్‌లో సురక్షితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమకు సంబంధించిన ఫోన్ నెంబర్లను కేవలం సెల్లో ఫీడ్ చేసుకోవడంతో పాటు ఆ డేటా మొత్తం డేటా కార్డు సాయంతో కంప్యూటర్లో, సీడీల్లో భద్రపరుచు కోవడం లేదా కీలక నెంబర్లన్నీ రాసి పెట్టుకోవడం మంచిది. -
మానవ సంబంధాల రుచి
‘టెంకతో ఎంత సంభాషించినా తనివి తీరదు....’ శ్రీరమణ గారి ‘మానవ సంబంధాలు’ సంకలనంలోని వాక్యమిది. బరువైన పదబంధాలలోకెల్లా బరువైనది– మానవ సంబంధాలు. మనమే మేడ్ డిఫికల్ట్ చేసేసుకున్న పదబంధమేమోననిపిస్తుంది. అలాంటి మానవ సంబంధాల దండలో దారం రహస్యం విప్పారు శ్రీరమణ. అవి ఎలా అంటు కడతాయో కళ్లకు కట్టారు. ‘మామిడి–మానవ సంబంధాలు’ రచన చదివాక బాల్యంలో తగిలిన ఆ కాయ లేదా పండులోని పులుపు, తీపి, వగరు ఒక్కసారిగా నాలుక మీద నర్తిస్తాయి. వృద్ధాప్యం ‘పులి’లా దూసుకు వచ్చిన తరువాత ఇది మరింత నిజం. మామిడి కదా! ఈ ఒక్క రచనతోనే తనివి తీరలేదు. ‘మామిడిపళ్లు–మానవ సంబంధాలు’ పేరుతో ఇంకో మాగ ముగ్గిన రచననూ అందించారు. అందులో జయప్రకాశ్ నారాయణ్, గోయెంకాలతో ఎదురైన నూజివీడు రసం వంటి అనుభవాన్ని ఆవిష్కరించారు. ఈ రచనల నిండా వ్యంగ్యమే. చలోక్తులే. నానుడులు, న్యూనుడులు, సామెతలూను. అమాయకత్వం నుంచీ మేధో బరువెరుగని జీవనం నుంచీ వెల్లువెత్తిన హాస్యరసం ఎంతో హాయిగా అనిపిస్తుంది. ఏ వ్యవస్థ శ్రీరమణగారి కలం పోటు నుంచి తప్పించుకోలేదు. అలా అని ఎవరినీ నొప్పించరు. ‘గుత్తి వంకాయకూర– మానవ సంబంధాలు’ పేరుతో వచ్చిన మొదటి రచనే పాఠకులను నోరూరించేసి, మారువడ్డన కోసం ఎదురు చూసేటట్టు చేసింది. ముక్కు, బంగారం, మామిడి, సైకిలు, మైకు, రైలు, రింగ్టోన్లు, దీపావళి, పుస్తకాలు, సినిమా, కవిత్వం, చదువు, లిఫ్టు, ఓట్లు, సెల్ఫోన్లు, క్రికెట్టు, వాస్తు– ఇలా 91 అంశాలను తీసుకుని మానవ సంబంధాలని పేనుకొచ్చారు. ముక్కు ప్రయోజనాలేమిటని ఒక కుర్రాడిని అడిగితే, ‘అది లేకపోతే కళ్లజోడు పెట్టుకోలేం!’ అన్నాడట. ఈ మోతాదు చాలని పాఠకులని మరోచోటికి తీసుకువెళతారు రచయిత– అది గద్దముక్కువారిల్లు. వారింట అందరివీ గద్ద ముక్కులేనట. ‘లిఫ్టూ – మానవ సంబంధాలు’ అనేది మరో రచన. లిఫ్ట్ మానవ సంబంధాలను ఎలా మార్చేసిందో వివరిస్తారిందులో. కానీ ఆ ఉచ్ఛనీచ చలన పేటికలలో అనగా లిఫ్టులలో మనుషులు అలా అతుక్కుపోయి పైకీ కిందకీ ప్రయాణిస్తే కొత్త చిక్కులు రావా? డాక్టర్‌ను అదే అడిగాడు ఒకడు, ‘లిఫ్ట్‌లో ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉందా?’ అని. ఆ డాక్టర్ ‘అవకాశం అయితే ఉందికానీ, చాలా శ్రమతో కూడిన వ్యవహారం’ అని సెలవిచ్చాడట. ఇక పబ్లీకున జరిగే సెల్‌ఫోను వాడకం ఈ పాడు లోకాన ఏల పుట్టితిమి అనిపిస్తూ పరులను ఎంత వైరాగ్యం లోకి నెట్టివేస్తుందో చెబుతుంది– ‘సెల్‌ఫోనూ– మానవ సంబంధాలు’. కానీ అబద్ధాలాడ్డానికి సెల్‌తో ఉన్న సౌలభ్యమే వేరు. మానవ సంబంధాలకి బెడదగా మారగల వ్యవస్థల గురించీ ఉంది. ‘కవిత్వంతో మానవ సంబంధాలు విపరీతంగా దెబ్బ తింటాయి’అంటారు రచయిత. అయితే ఆ కళ ఉన్న కవులు వేరయా అని చెప్పడమే ఇక్కడ రచయిత కవి హృదయం. ఇది చూసి కవులు కక్షాకార్పణ్యాలు పెంచుకోనక్కరలేదు. ఎందుకంటే, నాస్తికులు ప్రపంచమంతటా ఉన్నా దేవుడికొచ్చిన ఫరవా ఏమైనా ఉందా? కవిత్వం కూడా అంతేనని మంగళవాక్యమే పలికారు. ‘ఇప్పుడు పళ్ల డాక్టర్ దగ్గ రికి వెళితే నిజానికి బంగారు పన్ను కట్టించుకోవడమే చౌక అనిపిస్తోంది’ (బంగారం–మా. సం.), ‘మోకాళ్లని చూసి వీడు ఈ మధ్యే సైకిల్ నేర్చాడని ఇట్టే పసిగట్టే వాళ్లు (సైకిలు–మా.సం.), ‘లిఫ్టు మనిషి అంతస్తుని క్షణంలో మారుస్తుంది’ (లిఫ్టూ–మా.సం.) వంటి న్యూనుడులు విరివిగానే కనిపిస్తాయి. శ్రీరమణ తెలుగునాట అపురూప రచయిత. ఆయన కలం నుంచి వచ్చిన అనేక అద్భుత రచనలలో ఇదొకటి. పేరడీ వంటి రసరమ్యమైన ప్రక్రియని కాపాడుతున్నవారాయన ఒక్కరే. ఆస్వాదించవద్దూ మరి! శ్రీరమణ మానవ సంబంధాలు, ప్రిజమ్, పే 312, ధర: రూ. 295. - గోపరాజు నారాయణరావు -
అమెజాన్ కే కుచ్చుటోపీ!
గచ్చిబౌలి: అమెజాన్ సంస్థలో ఉన్న లోపాలను అనుకూలంగా మార్చుకున్న ఓ ముఠా 800 సెల్ఫోన్లను కాజేసింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో శుక్రవారం పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ వివరాలు వెల్లడించారు. ‘బూట్ల’తో ప్రారంభమైన దందా... కర్నూలు, గుంటూరు జిల్లాలకు చెందిన దినేష్‌కుమార్, ప్రదీప్‌రెడ్డి అమీర్‌పేట్‌లో హాస్టల్లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. దినేష్ 2017 ఫిబ్రవరిలో అమెజాన్ నుంచి ఓ జత బూట్లను ఆర్డర్ ఇచ్చాడు. క్యాష్ ఆన్ డెలివరీ పద్దతిలో వీటిని బుక్ చేసుకోవడంతో రెండు రోజుల్లో డెలివరీ వచ్చింది. ప్యాక్ రిసీవ్ చేసుకున్న వీరు అమేజాన్ వెబ్సైట్లో ఉన్న ఆన్లైన్ కస్టమర్ కేర్ డివిజన్‌ను ఆశ్రయించారు. తమకు వచ్చిన పార్శిల్లో బూట్లు లేవని, ఖాళీగా ఉందని ఫిర్యాదు చేయడంతో సంస్థ మరో జత బూట్లను పంపింది. అప్పటి నుంచి అదే పంథా కొనసాగిస్తున్న వీరు అమేజాన్ సంస్థ కార్యకలాపాలు, వ్యాపార లావాదేవీలపై అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలో వివిధ చెందిన సెల్ఫోన్లు, రూ.5 వేల లోపు ఖరీదు చేసే వాటినే ఎంచుకుని టోకరా వేస్తున్నారు. బుక్ చెయ్యడం... బుకాయించడం... పథకం అమలులో భాగంగా వీరు ఓ కొత్త సిమ్‌కార్డును వినియోగించి కొత్తగా ఈ–మెయిల్ ఐడీ, బోగస్ చిరునామా క్రియేట్ చేశారు. వీటి ఆధారంగా అమేజాన్ నుంచి ఓ ఫోన్ బుక్ చేశారు. ఈ పార్శిల్ తీసుకున్న వీరు అమెజాన్ కస్టమర్ కేర్‌కు తమకు ఖాళీ బాక్సు మాత్రమే వచ్చిందని ఫిర్యాదు చేసి మరో ఫోన్ పొందారు. ఇలా వీరు ఏడాదిలో మొత్తం 800 సెల్ఫోన్లు క్యాష్ ఆన్ డెలివరీ కింద బుక్ చేసి డెలివరీ బాయ్స్‌కు నగదు చెల్లించి తీసుకుని అదే మొత్తంలో ఫోన్లను అదనంగా పొందారు. అమెజాన్ సంస్థ వద్ద సరైన క్రాస్ చెకింగ్ మెకానిజం లేకపోవడం, రూ.5 వేలు... అంతకు తక్కు వ విలువైన వస్తువుల డెలివరీపై ఆ సంస్థ సరైన దృష్టి పెట్టకపోవడం వీరికి కలిసి వచ్చింది. అదే సంఖ్యలోసిమ్కార్డులు, చిరునామాలు... ఈ నయా మోసానికి తెరలేపిన వీరు ప్రతి లావాదేవీకి ఒక్కోటి చొప్పున మొత్తం 800 ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు సమీకరించుకుంది. ప్రతి లావాదేవీ కోసం ప్రత్యేకంగా ఈ–మెయిల్, అమీర్‌పేట కేంద్రంగా ఓ బోగస్ చిరునామా సృష్టించారు. సిమ్‌కార్డుల కోసం సోషల్‌మీడియా గ్రూపుల్లో పరిచయమైన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన బి.భాను రమేష్, వొడాఫోన్ సంస్థ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్న ఏలూరు వాసి ఎన్.లోవా కృష్ణతో పాటు ప్రదీప్ సోదరుడు ప్రవీణ్‌రెడ్డిలతో ముఠా ఏర్పాటు చేశారు. వీరి నుంచి ఒక్కో ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డును రూ.50 నుంచి రూ.90 వరకు చెల్లించి కొనుగోలు చేశారు. ఓ దశలో సిమ్‌కార్డులు పొందడం ఇబ్బందిగా మారడంతో కోల్‌కతాకు చెందిన బిపిన్ నుంచి వాటిని ఖరీదు చేయడం గమనార్హం. అమ్మేసి జల్సాలు ఇందులో అత్యధిక ఫోన్లను ఈ ముఠా ఓఎల్ఎక్స్లో పెట్టి అమ్మేసింది. ఖరీదు చేసే వ్యక్తి ఎంతకు బేరమాడినా అంగీకరించి ఇచ్చేసింది. మరికొన్నింటికి అమీర్‌పేట పరిసరాల్లోని సెల్‌ఫోన్ దుకాణాల్లో తమకు అమెజాన్ కూపన్స్ కింద ఈ ఫోన్ వచ్చిందంటూ చెప్పి అమ్మేశారు. ఫోన్లు డెలివరీ తీసుకోవడం, వాటిని విక్రయించడంలో ప్రవీణ్ కీలక పాత్ర పోషించాడు.గత మార్చ్‌లో అమెజాన్ సంస్థకు అనుమానం వచ్చింది. దీనిపై సంస్థ ప్రతినిధి అర్జున్ అల్లాడి మార్చి 23న గచ్చిబౌలి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఈ కేసు సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ కావడంతో డీసీపీ జానకీ షర్మిల నేతృత్వంలో ఏసీపీ సీహెచ్‌వై శ్రీనివాస్‌కుమార్, ఇన్స్పెక్టర్ వి.శివకుమార్ దర్యాప్తు చేశారు. ఐదుగురు నిందితుల అరెస్టు... ఈ పార్శిల్స్ డెలివరీలు అమీర్‌పేట పరిసరా ల్లోనే జరగడంతో పాటు సాంకేతిక ఆధారాలతో నిందితుల ఆచూకీ గుర్తించి శుక్రవారం బిపిన్ మినహా ఐదుగురినీ పట్టుకున్నారు. వీరి నుంచి రూ.10.75 లక్షల నగదు, 556 సిమ్ కార్డులు, 42 సెల్ఫోన్లు, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఏలాంటి ధ్రువీకరణ పత్రాలు లేకుండా సిమ్ కార్డులను ఇచ్చిన సర్వీసు ప్రొవెడర్లకు నోటీసులు ఇవ్వనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. -
వందలాది ఫోన్లను తగలబెట్టేశారు!
ఢాకా: ఫోన్ల వినియోగం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. అవి లేకుండా రోజు గడిచే పరిస్థితి లేదు. అయితే రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఉంటున్న విద్యార్థులకు మాత్రం ఫోన్ వినియోగించడంపై నిషేధం ఉంటుందనే విషయం తెలిసిందే. ఇలాగే బంగ్లాదేశ్‌లోని ఢాకాలోగల హథాజారీ బర్హా మదర్సాలో రెసిడెంట్ విద్యార్థులుగా చదువుతున్నవారు కూడా ఫోన్ వాడొద్దనే నిబంధన ఉంది. అయితే కొందరు విద్యార్థులు దొంగచాటుగా ఫోన్లు వాడుతున్నారని, మ్యూజిక్ వింటున్నారని, వీడియోలు చూస్తున్నారని తెలుసుకున్నారు. దీనిపై స్పందించిన యాజమాన్యం వారి నుంచి వందలాది ఫోన్లను స్వాధీనం చేసుకుంది. వాటన్నింటిని ఒకచోట వేసి తగులబెట్టేసింది. -
మీ ఫోన్లో ’ఏఐ‘ ఉందా.?!
సాక్షి, న్యూఢిల్లీ : బైక్‌మీద ప్రయాణిస్తున్నా.. కార్లో డ్రైవింగ్ చేస్తున్నా.. సెల్‌ఫోన్ డ్రైవింగ్ ఇప్పుడు చాలా కామన్‌గా మారింది. అనేక ప్రమాదాలకు సెల్‌ఫోన్ డ్రైవింగ్ కూడా కారణమవుతోంది. సెల్‌ఫోన్ డ్రైవింగ్ ప్రమాదాలను నివారించేందుకు కెనడాలోని వాటర్లు వర్సిటీ పరిశోధకులు కొత్త సాప్ట్‌వేర్‌ని అభివృద్ధి పరిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌గా (ఏఐ)గా పిలిచే ఈ కొత్త కొత్త టెక్నాలజీని మొబైల్ లోని కెమెరాకు అనుసంధానం చేస్తారు. ఈ టెక్నాలజీ డ్రైవింగ్ చేసే సమయంలో మన చేతుల కదలికలను నిరంతరనం గురిస్తాయి. కదలికల్లో అనుమానం వస్తే.. వెంటనే మనల్ని అలెర్ట్ చేస్తుంది. ఈ టెక్నాలజీని అడ్వాన్స్డ్ సెల్ప్ డ్రైవింగ్ కార్లలో ఉపయోగించేందుకు అభివృద్ధి చేసినా.. సెలఫోన్ డ్రైవింగ్ ప్రమాదాలు భారీగా పెరుగుతుండడంతో.. అందరూ ఉపయోగించుకునేందుకు అనువుగా మార్చామని.. ప్రొఫెసర్ ఫాఖరి క్యారీ చెప్పారు. హృదయ ప్రతిస్పందనలు, చేతుల కదలికల్లో ఒత్తిడి, ఆందోళనలను కూడా గుర్తించేలా అభివృద్ధి చేశామని ఆయన చెప్పారు. డ్రైవింగ్ చేసే సమయంలో ఒత్తిడికి గురైనా.. ఇతరులతో సీరియస్‌గా మాట్లాడుతున్నా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తించి.. మిమ్మిల్ని అలెర్ట్ చేస్తుందని క్యారీ చెబుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించడం వల్ల 75 శాతం ప్రమాదాలను నివారించవచ్చని క్యారీ చెప్పారు. -
అంతర్ జిల్లా దొంగలు అరెస్టు
13 సెల్ఫోన్లు స్వాధీనం కర్నూలు: రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సెల్ఫోన్లను దొంగలించి తప్పించుకొని తిరుగుతున్న ఇద్దరు అంతర్జిల్లా దొంగలను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్‌కు చెందిన డమ్మి రవి, హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అసద్లను.. కర్నూలులోని బళ్లారి చౌరస్తా.. హైదరాబాద్ బస్టాప్ వద్ద సీసీఎస్ పోలీసులు అనుమానంపై అదుపులోకి తీసుకొని విచారించగా సెల్‌ఫోన్ చోరీలకు పాల్పడినట్లు బయటపడింది. గతేడాది నవంబరు నెలలో నందికొట్కూరులోని సెల్ దుకాణంలో 13 సెల్ఫోన్లు చోరీ చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని కోర్టులో హాజరు పరుచగా న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు. సీసీఎస్ సీఐ లక్ష్మయ్య, ఎస్ఐ నయాబ్ రసూల్, హెడ్ కానిస్టేబుల్ మస్తాన్ సాహెబ్, కానిస్టేబుళ్లు సుదర్శనం, కిషోర్, సమీర్, నాగరాజు, రవికుమార్, రఫిక్ తదితరులు పాల్గొన్నారు. -
600 సెల్ ఫోన్లు చోరీ
వెల్దుర్తి రూరల్ : హైవేలో ప్రయాణిస్తున్న వాహనంలోంచి 600 సెల్ఫోన్లు చోరీ అయిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. ఎస్ఐ తులసీనాగప్రసాద్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నుంచి నాగపూర్‌కు.. కొత్త వీడియోకాన్(కంపెనీ రేటు రూ. 803లు) సెల్ఫోన్లను తరలిస్తున్నారు. డ్రైవర్‌తో పాటు, క్లీనర్, ఎక్స్ట్రా డ్రైవర్ ఉన్నారు. వీరు వెల్దుర్తి మండలం చెరుకులపాడు క్రాస్ వద్ద లారీని పరిశీలించగా.. డోర్ సీల్ లేకపోవడం గమనించారు. డోర్ తెరిచి చూడగా అందులోని 15 బాక్సులు చోరీకి గురైనట్లు గుర్తించారు. దీంతో లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ప్రతినిధులకు విషయం తెలిపారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రతినిధులు వెల్దుర్తి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన సెల్ఫోన్ల విలువ రూ.5లక్షలు ఉంటుందని తెలిపారు. -
బీ–న్యూ లో సంక్రాంతి ఆఫర్లు
భీమవరం : నవ్యాంధ్రలోని అన్ని వర్గాల ప్రజలకు సెల్ఫోన్లను అందుబాటులోకి తెచ్చేందుకు బీ–న్యూ సంస్థ ..సంక్రాంతి సందర్భంగా వినూత్న ఆçఫర్లను అందిస్తోందని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.డి.బాలాజీ చౌదరి తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరువాత డిజిటల్ ఆర్థికæ లావాదేవీలు పెరిగాయన్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లను తక్కువ ధరకే బీ–న్యూ సంస్థ వినియోగదారులకు అందుబాటులోకి ఉంచిందన్నారు. సంక్రాంతి సందర్భంగా విభిన్న మోడళ్ల సెల ఫోన్లపై ఆఫర్లు అందిస్తున్నామన్నారు. రూ.699 డ్యూయల్ సిమ్ ఫోన్ కొనుగోలుపై లంచ్ బాక్స్, రూ.999 ఫోన్‌పై ట్రావెల్æ బ్యాగ్, రూ.1,399 ఫోన్‌తో పాటు టేబుల్‌ఫ్యాన్, రూ.4,499 4జీ స్మార్ట్‌ఫోన్‌కు జియో సిమ్, రూ. 9,999 స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఎల్æఈడీ టీవీ, రూ.16,999 జియోనీ ఫో¯న్పై ల్యాప్‌టాప్, రూ.19,999కే యాపిల్ 5 ఎస్, రూ.15,499కే లెనోవో కే-6 నోట్‌బుక్‌తో పాటు బ్లూటూత్ హెడ్ సెట్æ ఉచితంగా ఇస్తున్నామన్నారు. ఎంపిక చేసిన కొన్ని మోడళ్లపై బ్లూ టూ™త్, పవర్ బ్యాంక్, హెడ్ సెట్æ, మెమరీ కార్డులను ఉచితంగా పొందవచ్చన్నారు. వివిధ మోడళ్ల ఫోన్లకు బజాజ్ ఫైనాన్స్ ద్వారా నెలవారీ వాయిదా పద్ధతిలో చెల్లించే సదుపాయం ఉందన్నారు. అన్ని రకాల డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపు చేసే సదుపాయం ఉందన్నారు. -
అమ్మా.. రాక్షసులున్నారు జాగ్రత్తగా వెళ్లిరా!
♦ నశించిపోతున్న మానవతా విలువలు ♦ పెరుగుతున్న లైంగిక వేధింపులు ♦ ముక్కుపచ్చలారని బాలికలనూ వదలని కామాంధులు ♦ ప్రభావం చూపుతున్న సెల్ఫోన్లు, సినిమాలు ♦ 10 ఏళ్ల వయస్సులోనే నీలిచిత్రాలు చూస్తున్న బాలలు ఇంటి నుంచి బయటకు వెళ్లిన అమ్మాయి.. తిరిగి క్షేమంగా వచ్చే వరకూ తల్లిదండ్రులకు గుండె దడే. మనిషి తోలు కప్పుకున్న ఏ మాయదారి మృగం కళ్లు.. అభంశుభం తెలియని తమ బిడ్డపై పడతాయేమోనని!! యుక్తవయస్సు వచ్చిన పిల్లకు పెళ్లి చేసే దాకా కన్నవారికి నిత్యక్షోభే. ప్రేమ, దోమ అంటూ ఏ ఉన్నాది వెంట పడి వేధిస్తాడోనని!! నిండుగా చీర కప్పుకొని వెళ్తున్న వివాహిత ఏం చేసింది పాపం.. ఆమె చుట్టారా వందలాది కళ్లు కామంతో సూదుల్లా గుచ్చేస్తుంటే!! అర్ధరాత్రి మహిళ స్వేచ్ఛగా నడిచినప్పుడే మనకు నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అని జాతిపిత బాపూజీ అన్నారు. కానీ అర్ధరాత్రి మాట అటుంచితే.. పట్టపగలు కూడా మహిళ ధైర్యంగా తిరగలేని పరిస్థితి నేడు నెలకొంది. విజయనగరం ఫోర్ట్ : ♦ కొత్తవలస మండలంలో గత నెల 29న 10 ఏళ్ల బాలికపై కామాంధుడు లైంగికదాడికి యత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో చంపేందుకు సైతం సిద్ధమయ్యాడు. ♦ ఆగస్టు 16న డెంకాడ మండలంలో ఆరేళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఇలా ఏదో చోట నిత్యం బాలికలపైన, మహిళలపైన లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. సమాజంలో మానవత్వం మంట గలుస్తోందనడానికి ఇవి ఉదాహరణలు మాత్రమే. ఆడపిల్లలను గౌరవించాల్సింది పోయి.. వారిని కర్కశంగా చిదిమేస్తున్న రోజులు వచ్చాయి. వావీవరసలు మరచిపోతున్నారు. పసి పిల్లలన్న కనికరమూ చూపడం లేదు. సెల్ఫోన్ల్లోనూ, సినిమాల్లోనూ నీలిచిత్రాలను చూస్తూ రెచ్చిపోయి మానవమృగాళ్లా మారిపోతున్నారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ల వరకు అందరిదీ ఒకే ధోరణి. బయటకు వెళ్లిన ఆడపిల్ల తిరిగి ఇంటికి చేరే వరకూ తల్లితండ్రులు గుండెలు పట్టుకుని ఉండాల్సిన పరిస్థితి. నిరక్షరాస్యులే ఇలా చేస్తున్నారనుకుంటే పొరపాటు.. అక్షరాస్యులు సైతం వావీవరసలు మరిచిపోయి రాక్షసుల్లా వ్యవహరిస్తున్నారు. సమాజం గురించి పూర్తిగా తెలియన ముక్కపచ్చలారని చిట్టితల్లులపై కూడా తెగబడుతున్నారు. విద్యార్థులపై సెల్ఫోన్లు, సినిమాల ప్రభావం నేడు తినడానికి తిండి లేని ఇల్లు ఉందేమో గానీ.. ప్రతి ఇంటిలోనూ సెల్‌ఫోన్ ఉంది. అరచేతిలో నీలిచిత్రాలను చూడగలిగే టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో యువత పెడదోవన పడుతోంది. ముఖ్యంగా ప్రతి విద్యార్థి చేతిలోనూ నేడు ఇంటర్నెట్ సౌకర్యంతో సెల్‌ఫోన్ దర్శనమిస్తోంది. అందులో నీలి చిత్రాలు, అసభ్యకర సన్నివేశాలు కోకొల్లలు. గతంలో ఉద్యోగం వచ్చిన తర్వాతో.. వ్యాపారంలో స్థిరపడ్డాకో ఫోన్ ఇచ్చేవారు. కానీ నేడు 3వ తరగతి నుంచే ఇంట్లో పిల్లలకు సెల్‌ఫోన్ ఇస్తున్నారు. పిల్లలు ఫోన్ ఆపరేట్ చేస్తుంటే మురిసిపోతున్నారు. కానీ దాని వల్ల భవిష్యత్‌లో కలిగే అనర్థాల గురించి పట్టించుకోవడం లేదు. 10వ తరగతి వచ్చేసరికి సెల్‌ఫోన్ ఏ విధంగా ఆపరేట్ చేయాల్లో పూర్తిస్థాయిలో నేర్చుకుంటున్నారు. సెల్‌ఫోన్‌తోపాటు సినిమాల ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటోంది. సినీనటులు నటిస్తే దాన్నే నిజమని ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వస్త్రధారణ కరెక్టేనా? మారుతున్న కాలానికనుగుణంగా మనమూ మారాలి. అందులో తప్పు లేదు. కానీ.. ఆ మారడం అన్నది ఎలా అన్నదే ఇక్కడ ప్రశ్న. విదేశీ పోకడలు, వింత అలవాట్లు, పాశ్చాత్య వస్త్రధారణ మన సమాజంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోందనడంలో సందేహం లేదు. శరీరమంతా కనిపించేలా కొంతమంది మహిళలు, యువతులు ధరిస్తున్న వస్త్రాలు కూడా నేడు లైంగిక దాడులు పెరగడానికి ఒక కారణమన్నది కాదనలేని నిజం. నేడు ఫ్యాషన్ల పేరిట చిన్నపిల్లలకు సైతం అర్ధనగ్న వస్త్రాలను తల్లిదండ్రులు ఇస్తున్నారు. ఇటువంటి వాటికే ‘మృగాళ్లు’ ఆకర్షితులై దాడికి పాల్పడుతున్నారు. దారి తప్పిస్తున్న చెడు అలవాట్లు నేటి తల్లిదండ్రులు పిల్లలకు మితిమీరిన ‘స్వేచ్ఛ’ ఇచ్చేస్తున్నారు. ఆ స్వేచ్ఛనే పిల్లలు దుర్వినియోగం చేసుకుంటున్నారు. చెడు వ్యసనాలకు బానిసలవుతున్నారు. చెడుతిరుగుళ్లకు అలవాటు పడుతున్నారు. 15 ఏళ్ల నుంచే మద్యం సేవించడం చాలామంది యువకులు అలవర్చుకుంటున్నారు. మద్యానికి అలవాటు పడడం వల్ల ఏది మంచో.. ఏది చెడో అన్న విచక్షణను కోల్పోతున్నారు. తల్లిదండ్రుల శ్రద్ధ అవసరం.. అమ్మా.. జాగ్రత్తగా వెళ్లిరా అని ఆడపిల్లకు తల్లిదండ్రులు చెబుతున్నారు. కానీ.. మగవాడికి మాత్రం ఎటువంటి విషయాలూ చెప్పడం లేదు. ఆడపిల్లలను గౌరవించాలి.. వారి పట్ల మర్యాదగా నడుచుకోవాలి.. అసభ్యకరంగా ప్రవర్తించరాదన్న విషయాలను ఏ తల్లిదండ్రులైనా తమ కుమారుడికి చెబుతున్నారా? మగ పిల్లవారికి సైతం చిన్ననాటి నుంచే ఇలాంటి జాగ్రత్తలు చెబితే కాస్తయినా వారిలో మార్పు రావచ్చు. సెల్‌ఫోన్ సగం కారణం.. నేటి సమాజంలో పరిస్థితికి సెల్ఫోన్లే సగం కారణం. నేడు సెల్‌ఫోన్ నిత్య వాడకంగా మారింది. చాటింగ్‌లు, మేసేజ్‌లు విద్యార్థులపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి. పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాల్సి ఉంది. మంచి, చెడులు గురించి తల్లిదండ్రులు తెలియజేయాలి – కేసలి అప్పారావు, బాలల సంక్షేమ సమితి చైర్మన్. పిల్లల్లో వచ్చే మార్పులను గమనించాలి.. నైతిక విలువల గురించి పిల్లలకు శిక్షణ ఇప్పించాలి. ఏదో మంచి, ఏది చెడు అన్న విషయాలను తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుంచి తెలియజేయాలి. సెల్ఫోన్లు సా«ధ్యమైనంతవరకు ఇవ్వకూడదు. టీవీలు, సినిమాలు చూసిన తర్వాత పిల్లల్లో వచ్చే మార్పులను గమనించాలి. – గంటా హైమావతి, బాలల సంక్షేమ కమిటీ సభ్యురాలు -
మంత్రులు సెల్ఫోన్లు తేవద్దు
♦ బయటే డిపాజిట్ చేయాలి ♦ సీఎం కార్యాలయం ఆదేశాలు ♦ అమాత్యుల తీవ్ర అసంతృప్తి అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాలయం కొత్త నిబంధనలకు శ్రీకారం చుట్టింది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనే మంత్రులు తమ సెల్ఫోన్లను బయటే డిపాజిట్ చేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా మంత్రులు ఎక్కడికి వెళ్లినా తమ సెల్ఫోన్లను వెంట తీసుకెళుతుంటారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన తరువాత మంత్రులు తమ వెంట మంత్రివర్గ సమావేశాలకు ఫోన్లను తీసుకెళ్లటాన్ని అనుమతించటం లేదు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ఉన్నపుడు ఈ పద్ధతిని అనుసరించిన సీఎం కార్యాలయం తాజాగా వెలగపూడి తాత్కాలిక సచివాలయంలోనూ అదే పద్ధతిని అవలంబిస్తోంది. సెల్ఫోన్లను డిపాజిట్ చేయాలనటం పట్ల మంత్రుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సైలెంట్ మోడ్‌లో పెట్టుకునే వీలుందని, అంతగా అవసరమైతే స్విచ్ఛాఫ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉండగా బయటనే డిపాజిట్ చేయాలనడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నిస్తున్నారు. మంత్రివర్గ సభ్యులపై ముఖ్యమంత్రికే నమ్మకం లేకపోతే, బయటి వారు ఎలా నమ్ముతారని అంటున్నారు. ఇది తమను అవమానించటం గాక మరేంటని వారు సన్నిహితుల వద్ద వాపోతున్నారు. గతంలో విజయవాడ క్యాంపు కార్యాలయం వద్ద ఉప ముఖ్యమంత్రి ఇదే విషయమై తీవ్రస్థాయిలో ఆగ్రహిస్తూ మాపైనే నమ్మకం లేకపోతే ఇంకెందుకయ్యా ఈ పదవన్న సంగతి తెలిసిందే. -
ఆస్పత్రిలో సెల్ దొంగలు
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో దొంగలు హల్చల్ చేశారు. సోమవారం ఉదయం ఆస్పత్రి జనరల్ వార్డులోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు నిద్రిస్తున్న ఒక రోగికి చెందిన సెల్‌ఫోన్‌తోపాటు నగదును అపహరించుకుపోయారు. అయితే, వారి అనుమానాస్పద కదలికలను పసిగట్టిన అక్కడి వారు ఆ ఇద్దరినీ పట్టుకుని దేహశుద్ధి చేశారు. సొత్తును స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఆస్పత్రిలో అసాంఘిక శక్తుల సంచారంపై రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
విమాన బాత్రూమ్లో భారీగా ఐఫోన్లు, బంగారం...
హైదరాబాద్ : దుబాయి నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలోని బాత్రూంలో ఆగంతకుడు బ్యాగు వదిలి వెళ్లాడు. ఆ విషయాన్ని గమనించిన విమాన సిబ్బంది వెంటనే కస్టమ్స్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో కస్టమ్స్ అధికారులు బ్యాగు తెరచి చూడగా... అందులో 666 గ్రాముల బంగారం, 24 ఐఫోన్లు, 700 ఆర్ఎండీ గుట్కాప్యాకెట్లు, 8 ఐఫోన్ బ్యాటరీలు, 4 ఐప్యాడ్లు, 5 కిలోల సఫ్రాన్ ఇరానియం పౌడర్ ఉన్నట్లు గుర్తించారు. సదరు వస్తువులను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల విలువ సుమారు రూ. 50 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఎయిర్పోర్ట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఫోన్లు మర్చిపోయి వెళ్లిపోతున్నారు..
న్యూఢిల్లీ : ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారిలో చాలామంది తమ మొబైల్ ఫోన్లు మరిచిపోయి వెళ్లిపోతున్నారు. కొందరు తమ సామాను మరిచిపోయి వెళ్లిపోతుంటారని, ఆ సామాన్లలో మొబైల్ ఫోన్లు ఎక్కువగా ఉంటున్నాయని సీఐఎస్ఎఫ్ అధికారులు చెబుతున్నారు. స్క్రీనింగ్, చెకింగ్ పాయింట్లు, వెయిటింగ్ ఏరియా, టాయిలెట్లు ఇత్యాది ప్రదేశాలలో ప్రయాణీకులు తమ సామాగ్రిని మరచిపోయి వెళ్లిపోతుంటారని వారు చెప్పారు. తాము వాటిని విమానాశ్రయ అథారిటీ వద్ద జమ చేస్తామని అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల్లో తమకు 895మొబైల్ఫోన్లు లభించినట్లు వారు తెలిపారు. ఈ సంవత్సరం జనవరి నుంచి మే వరకు ప్రయాణీకులు వదిలి వెళ్లిన సామాగ్రి విలువ మొత్తం రెండు కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. వాటిలో దాదాపు 91 లక్షల రూపాలయ విలువైన సామాగ్రిని ప్రయాణీకులకు తిరిగి అప్పగించారు. మిగతా సామాగ్రి ఇంకా విమానాశ్రయం స్టోర్ రూములలో పడి ఉంది. ప్రయాణీకులు ఎక్కువగా మొబైల్ ఫోను మరిచిపోయి వెళ్తుంటారని, ఈ సంవత్సరం మే వరకు తమకు దొరికిన 895 మొబైల్ ఫోన్లలో 317 మొబైల్ ఫోన్లను మాత్రమే ప్రయాణీకులకు తిరిగి అప్పగించినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరం సీఐఎస్ఎఫ్ అధికారులకు 2148 మొబైల్ ఫోన్లు లభించాయి. వాటిలో 734 ఫోన్లను యజమానులకు తిరిగి అప్పగించారు. మిగతా 1414 ఫోన్లు ఎయిర్‌పోర్టు అథారిటీ వద్ద జమచేశారు. ప్రయాణీకులు వదిలే వెళ్లే సామాగ్రిలో మొబైల్ ఫోన్లతో పాటు లాప్టాప్ , కెమెరా, రిస్ట్ వాచ్ జ్యుయలరీ వంటి వస్తువులు ఉంటున్నాయి. పాస్‌పోర్టు, పాన్‌కార్డు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను కూడా ప్రయాణీకులు మరిచిపోయి వెళ్తుంటారు. సామాను మరిచి వెళ్లిన ప్రయాణీకులు తమ వద్దకు వచ్చి వాటి వివరాలు తెలిపి తీసుకెళ్తుంటారని, అయితే అలాంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. -
టీచర్లూ...స్కూళ్లో సెల్ఫోన్లు వాడొద్దు
ఆదేశాలు జారీ చేసిన విద్యాశాఖ టీనగర్: తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు ఉపయోగించరాదని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది. దీనికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ డెరైక్టర్ కన్నప్పన్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సర్క్యులర్ పంపారు. పాఠశాల వాతావరణం విద్యార్థులకు ఆహ్లాదకరంగా, గాలి, వెలుతురుతో కూడిన తరగతి గదులు, పరిశుభ్రమైన తాగునీరు, మరుగుదొడ్లు ఉండేలా టీచర్లు చూడాలని నివేదికలో పేర్కొన్నారు. పాఠశాలల్లో సౌకర్యాలను గురించి వివరిస్తూ టీచర్, పేరెంట్స్ ఆసోసియేషన్ సహకారంతో ప్రధానోపాధ్యాయులు ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల అడ్మిషన్లు చేపట్టాలని కోరారు. పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజునే విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయడంతో పాటు టైం టేబుల్ రూపొందించి క్లాసులు నిర్వహించాలని కోరారు. ఉపాధ్యాయులు ప్రతిరోజూ పాఠశాలలు తెరవడానికి అరగంట మునుపే చేరుకుని తరగతి గదులు, ప్రాంగణం శుభ్రంగా ఉన్నాయా లేదో పరిశీలించాలన్నారు. ఉపాధ్యాయులు తరగతి గదుల నుంచి బయటకు వెళ్లకూడదని, వెళ్లాల్సి వస్తే రిజిస్టర్లో సంతకం చేయాలని తెలిపారు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు ఉపయోగించరాదని, ఎవరైనా వాడితే ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
పర్సులొద్దు... సెల్ఫోన్లే ముద్దు!
రౌడీల నేతృత్వంలో రెచ్చిపోతున్న పిక్ పాకెటింగ్ గ్యాంగ్ రద్దీ బస్సుల్లో పంజా ఐదుగురిని అరెస్టు చేసిన వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ టీమ్ దొంగ ఫోన్లు కొంటున్న ఇద్దరు రిసీవర్లూ అరెస్టు సిటీబ్యూరో: ఒకప్పుడు నగరంలోని పిక్‌పాకెటింగ్ ముఠాలు పర్సుల్ని టార్గెట్ చేసేవి. అయితే, ప్లాస్టిక్ కరెన్సీగా పిలి చే క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం పెరగడంతో పర్సులతో ‘గిట్టుబాటు’ కాక.. ఈ ముఠాలు ఇటీవల పర్సుల్ని వదిలేసి సెల్ఫోన్లపై పడ్డాయి. ఈ తరహాలో వ్యవస్థీకృతంగా రెచ్చిపోతున్న గ్యాంగ్‌ను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఐదుగురు దొంగలతో పాటు వీరి నుంచి చోరీ ఫోన్లు ఖరీదు చేస్తున్న ఇద్దరు రిసీవర్లనూ కటకటాల్లోకి పంపారు. మరో ఇద్దరు ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. డీసీపీ బి.లింబారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఇద్దరు రౌడీషీటర్లు... ఆసిఫ్‌నగర్‌కు చెందిన రౌడీషీటర్ మహ్మద్ యూసుఫ్ అలియాస్ కుల్చాన్ యూసుఫ్ నేతృత్వంలో ఈ ముఠా పని చేస్తోంది. ఇతడిపై నగరంలోని అనేక ఠాణాల్లో కేసులున్నాయి. బంజారాహిల్స్‌కు చెందిన రౌడీషీటర్ సయ్యద్ నూర్ ముఠా ‘కార్యకలాపాలను’ పర్యవేక్షిస్తుంటాడు. రేతిబౌలి, మెహిదీపట్నం, హుమాయున్‌నగర్, పంజగుట్ట, బంజారాహిల్స్, అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, లక్డికాపూల్ వంటి రద్దీ రూట్లలో తిరిగే బస్సుల్నే వీరు టార్గెట్ చేస్తారు. టోలిచౌకీకి చెందిన మహ్మద్ జకీర్ అలీ, మాసబ్‌ట్యాంక్‌కు చెందిన మహ్మద్ షెహన్షా, బంజారాహిల్స్‌కు చెందిన సయ్యద్ అస్లం, పహాడీషరీఫ్‌కు చెందిన ఉస్మాన్, రాజేంద్రనగర్‌కు చెందిన షఫీ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. ఇద్దరు రౌడీషీటర్లూ ఎప్పుడూ నేరుగా రంగంలోకి దిగి నేరం చేయరు. వెనుక ఉండి ముఠా సభ్యుల ద్వారా వ్యవహారాలు నడుపుతారు. హడావుడి చేసేది ‘ఆడి’... కొట్టేసేది ‘షాను’... ఈ పిక్ పాకెటింగ్ ముఠాకు ప్రత్యేక పారిభాషిక పదాలు కూడా ఉన్నాయి. మొదట గ్యాంగ్‌లోని నలుగురు సభ్యులు రద్దీగా ఉన్న బస్సు ఎక్కుతారు. ఈ బస్సును ముఠాలో మరికొందరు ఆటో లేదా బైక్‌పై అనుసరిస్తారు. బస్సెక్కిన ముఠా సభ్యులు ఒక ప్రయాణికుడిని టార్గెట్ చేసి.. అతడి వద్దకు చేరతారు. వీరిలో ఇద్దరు ‘టార్గెట్’ చుట్టూ చేరి హడావుడి చేసి. ఉత్కంఠ వాతావరణం కలిగిస్తారు. ఇలా చేసే వారిని ‘ఆడి’గా పిలుస్తారు. బస్సులోనే ఉన్న మరో ముఠా సభ్యుడు తమ ‘టార్గెట్’ నుంచి సెల్‌ఫోన్‌ను చోరీ చేస్తాడు. ఇతడిని ‘షాను’ అని పిలుస్తారు. కావాల్సింది చేతి కందగానే ‘షాను’ అదే బస్సులో ఉన్న నాలుగో ముఠా సభ్యుడికి దాన్ని అందించేస్తాడు. అతడు వెంటనే బస్సు దిగిపోయి వెనుకే ఫాలో అవుతున్న తమ వాహనం ఎక్కేస్తాడు. సాధారణంగా షఫీ, షెహన్షా ‘ఆడి’ పాత్రను, ఉస్మాన్ ‘షాను’ పాత్రను పోషిస్తారు. మిగిలిన వారు బస్సులో ఉండి, వెనుక వస్తూ సహకరిస్తారు. జగదీష్ మార్కెట్లో అమ్మేసి పంపకాలు... ఇలా ఉదయం నుంచి రాత్రి వరకు బస్సుల్లో చోరీ చేసిన ఫోన్లను ముఠా సభ్యులు సయ్యద్ నూర్‌కు అప్పగిస్తారు. అతడు వాటిని చింతల్‌మెట్‌కు చెందిన షేక్ వాజిద్ ద్వారా జగదీష్ మార్కెట్లో సెల్ఫోన్ల వ్యాపారం చేస్తున్న సుల్తాన్ బిన్ మహ్మద్‌కు విక్రయిస్తాడు. అలా వచ్చిన మొత్తంలో ‘షాను’కు రూ.1500, ‘ఆడి’లకు రూ.700 చొప్పున, అస్లాంకు రూ.500 ఇచ్చే నూర్ తాను రూ.2 వేలు తీసుకుంటాడు. ఇవి వీరి రోజు కూలీ మొత్తాలన్న మాట. మిగిలిన మొత్తాన్ని తీసుకుని అర్ధరాత్రి వేళ చింతల్మెట్లో ఉన్న యూసుఫ్ హోటల్‌కు వెళ్లే నూర్ అతడికి అందించి వస్తాడు. ఇటీవల కాలంలో ఎస్సార్‌నగర్, పంజగుట్ట, నాంపల్లి ఠాణాల పరిధిలో 10 నేరాలు చేసిన ఈ ముఠాపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌కు సమాచారం అందింది. బయటపడినవే చాలా తక్కువే... దీంతో ఇన్స్పెక్టర్ ఎల్.రాజావెంకటరెడ్డి నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, వి.కిషోర్లతో పాటు పంజగుట్ట డీఐ, డీఎస్సైలు బి.లక్ష్మీనారాయణరెడ్డి, ఎం.శివకుమార్ తమ బృందాలతో వలపన్నారు. శుక్రవారం యూసుఫ్‌తో జకీర్, నూర్, షెహన్షా, అస్లం, వాజిద్, సుల్తాన్లను అరెస్టు చేశారు. వీరి నుంచి చోరీ సొత్తు అయిన 10 ఖరీదైన సెల్ఫోన్లతో పాటు బస్సును ఫాలో చేయడానికి వినియోగించే బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. బస్సులో చోరీ చేసిన తర్వాత దిగడం కుదరకపోతే... అందులోనే సెల్‌ఫోన్‌ను పడేస్తారని, ఆపై వీరే దాన్ని యజమానికి చూపించి తీసుకునేలా చేసి తప్పించుకుంటారని డీసీపీ లింబారెడ్డి తెలిపారు. ఈ ముఠాకు సంబంధించి పరారీలో ఉన్న ఉస్మాన్, షఫీ కోసం గాలిస్తున్నారు. వీరు చేసిన నేరాలు అనేకం ఉన్నా కేసులు నమోదైనవి తక్కువేనని, బాధితులు ఎవరైనా ఉంటే సంబంధిత ఠాణాల్లో ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. -
ఎగ్జామ్ సెంటర్లో సెల్ ఫోన్లు స్వాధీనం
బూదాన్‌పోచంపల్లి: నల్లగొండ జిల్లా బూదాన్ పోచంపల్లిలోని ఓ పరీక్షా కేంద్రం నుంచి మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ జాయింట్ కమిషనర్ వెంకట్రావు బుధవారం మండల కేంద్రంలోని పోచంపల్లి పీపుల్స్ స్కూల్‌ను తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్షా కేంద్రాలకు సెల్ఫోన్లు తీసుకురాకూడదు. కానీ ఇన్విజిలేటర్లు కొందరు సెల్ఫోన్లు తీసుకొచ్చి కార్యాలయంలోని బీరువాలో ఉంచగా ఎనిమిది ఫోన్లలను ఏజేసీ సీజ్ చేశారు. ఫోన్లను తీసుకొచ్చిన వారికి మెమోలు జారీ చేస్తామన్నారు. -
సెల్‌ఫోన్ చోరీలు చేస్తున్న ఇద్దరికి రిమాండ్
అడ్డగుట్ట: పరీక్షా సమయాల్లో విద్యార్థుల సెల్ఫోన్లు దొంగలించిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించిన ఘటన తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ తెలిపిన వివరాల ప్రకారం...లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన బెన్హర్(20) తండ్రి పేరు ఇమాన్యుల్ డిప్లొమా చదువుతున్నాడు. కే. విజయ్(19) ఐటీ చేస్తున్నాడు. వీరిద్దరు స్నేహితులు. అయితే, ఈ నెల 9వ తేదిన ఉదయం ఈస్ట్ మారేడుపల్లిలోని సేయింట్ జాన్స్ కాలేజీలో ఇంటర్ పరీక్షలు రాయడానికి వెళ్లిన విద్యార్థులు తమ సెల్ఫోన్లు వారి వారి వాహనాల్లో పెట్టుకొని వెళ్లారు. కాగా, విద్యార్థులు పరీక్షలు రాయడానికి వెళ్లిన అంనంతరం బెన్హర్, విజయ్ హోండా యాక్టివాపై సేయింట్ జాన్స్ కాలేజీ దగ్గరకు వచ్చారు. విద్యార్థుల వాహనాల్లో నుంచి సెల్ఫోన్లు దొంగలించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. తమ సెల్ఫోన్లు పోయాయని ఆలస్యంగా తెలుసుకున్న విద్యార్థులు వెంటనే స్థానిక తుకారాంగేట్ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కాలేజీ వద్దనున్న సీసీ ఫుటేజీ ఆధారంగా చోరీకి పాల్పడ్డ వారి వాహనం నంబర్లు గుర్తించి ఆ ఇద్దరు యువకుల్ని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. -
నకిలీ ఇన్విజిలేటర్ హల్చల్
హైదరాబాద్ : నకిలీ ఇన్విజిలేషన్ గుర్తింపు కార్డుతో ఓ అపరిచితుడు పరీక్ష కేంద్రంలోకి దర్జాగా వెళ్లాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఆర్ఐవో ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అతన్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి ఓ పెన్‌డ్రైవ్‌ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని కంప్యూటర్ ద్వారా చూడగా.. అందులో ఉన్న ఇంటర్ అన్ని సబ్జెక్టులకు సంబంధించిన సమాధానాలను చూసి ఆశ్చర్యపోయారు. ఓ ప్రైవేటు కళాశాలకు చెందిన వ్యక్తి సుమన్‌గా గుర్తించారు. తమ కళాశాలకు చెందిన విద్యార్థులకు చాటుగా సాయం చేద్దామని వచ్చినట్లు విచారణలో తెలిపినట్లు తెలిసింది. ఈ ఘటన శంషాబాద్‌లోని విజ్ఞాన్ కళాశాలలో శనివారం జరిగింది. కాగా సెల్ఫోన్లతో ఇన్విజిలేటర్లు విధులకు హాజరుకాకూడదని నిబంధనలున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు. శనివారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు ఐదుగురు ఇన్విజిలేటర్లు మొబైల్స్ వెంటబెట్టుకుని విధులకు హాజరయ్యారు. ఈ ఘటన ఇబ్రహీంపట్నంలోని సాయి గౌతమి కళాశాలలో చోటుచేసుకుంది. పరీక్ష కేంద్రాన్ని సందర్శించడానికి వెళ్లిన రంగారెడ్డి జిల్లా తూర్పు ఆర్ఐఓ హన్మంత్ రెడ్డికి వారు పట్టుబడ్డారు. వెంటనే వారి నుంచి సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని ఇన్విజిలేషన్ విధుల నుంచి తప్పించారు. సెల్ఫోన్లను ఇంటర్ విద్యామండలికి అప్పగిస్తామని ఆర్ఐవో చెప్పారు. -
సెల్‌ఫోన్ దొంగల ముఠా అరెస్ట్
బద్వేలు: రాజస్థాన్‌కు చెందిన సెల్‌ఫోన్ దొంగల ముఠాను వైఎస్సార్ జిల్లా బద్వేలు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ.4 లక్షల విలువ చేసే 167 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వీరు దొంగిలించిన సెల్ ఫోన్ ఈఎంఐ నెంబర్ ఆధారంగా మెదక్ జిల్లా నిజాంపేట గ్రామంలో ఉన్నట్టు గుర్తించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు కోర్టులో హజరుపరచనున్నారు. -
ఇద్దరు అరెస్ట్ : 80 సెల్ ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్ : పని చేస్తున్న షాప్‌లోనే చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు సేల్స్మేన్స్ను సౌత్ జోన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 80 సెల్ ఫోన్లుతోపాటు రూ. 20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెల్ ఫోన్ స్టోర్లుగా పోస్టాఫీసులు
భోపాల్: దేశంలో పోస్టాఫీస్‌ల రూపు రేఖలు మున్ముందు మారబోతున్నాయి. మొన్నటి వరకు ఉత్తర ప్రత్యుత్తరాల బట్వాడాలను, ఇటీవల నగదు బదిలీ, ఏటీఎం సెంటర్ల వంటి సర్వీసులను అందించిన పోస్టాఫీసులు ఇక్ సెల్ ఫోన్ స్టోర్లుగా కూడా కనిపించనున్నాయి. మధ్యప్రదేశ్‌లోని పోస్టాఫీసులు త్వరలో సెల్ ఫోన్ అమ్మకాల అంగడిలాగా దర్శనమివ్వబోతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే ఈ కొత్త తరహా విధానాన్ని ప్రారంభించినట్లు మధ్యప్రదేశ్ జీపీవో చీఫ్ పోస్ట్ మాస్టర్ మి హఖ్ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పోస్టాఫీసు కార్యాలయాల్లో సెల్ ఫోన్లు విక్రయిస్తామని వివరించారు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్, నోయిడాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ, పాంటెల్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. పెంటా భారత్ ఫోన్ పీఎఫ్ 301 అనే ఫోన్లను బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో రూ.1999కే లభిస్తుందని, 18 నెలల కాల పరిమితితో 1999 సెకన్ల ఉచిత టాక్ టైం కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ తరహా కార్యక్రమాన్ని నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేయగా అది విజయవంతం కావడంతో తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. -
మయన్మార్ దేశస్తులకు భారత్ పాస్‌పోర్టులు
సాక్షి, సిటీబ్యూరో: మయన్మార్‌కు చెందిన అక్రమ వలసదారులకు ఇండియన్ పాస్‌పోర్టులు ఇప్పించేందుకు సహకరించిన పాస్‌పోర్టు బ్రోకర్‌తో పాటు ఇద్దరు ఎస్బీ సిబ్బందిని సౌత్‌జోన్ టీమ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరి నుంచి ఒక ఒరిజినల్ పాస్‌పోర్టు, ఆధార్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సీసీఎస్ జాయింట్ పోలీసు కమిషనర్ టి.ప్రభాకర్‌రావు కథనం ప్రకారం...ముంబైకి చెందిన అసన్ జియా అన్సారీ ఉపాధి నిమిత్తం 2003లో హైదరాబాద్‌కు వలస వచ్చాడు. తొలినాళ్లలో ప్రైవేట్ ఉద్యోగం చేసిన అన్సారీ...ఆ తర్వాత డాటా ఎంట్రీ అపరేటింగ్‌ను ఉపాధిగా మార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో అతనికి అక్రమంగా నగరంలో నివాసముంటున్న మయన్మార్ శరణార్ధులకు ఆధార్ కార్డులు సమకూరుస్తున్న షాహీన్‌నగర్‌కు మహమ్మద్ జావేద్ (మయన్మార్ వాసి)తో పరిచయం ఏర్పడింది. దీంతో పాస్‌పోర్టు బ్రోకర్ అవతారమెత్తిన అతను ఎస్బీ కానిస్టేబుల్ బషీర్ అహ్మద్‌తో పరిచయం పెంచుకుని మయన్మార్ దేశస్తులకు ఇండియన్ పాస్‌పోర్టులు ఇప్పించేవాడు. బషీర్ అహ్మద్‌తో పాటు పాస్‌పోర్టు దరఖాస్తులను పాస్‌పోర్టు వెరిఫికేషన్ సెల్లో హోంగార్డుగా పనిచేస్తున్న సలీమ్‌కు కూడా భారీ మొత్తంలో లంచాలు ఇచ్చాడు. పాస్‌పోర్టులు పొందినవారు టూరిస్టు వీసాపై సౌదీ అరేబియా వెళ్లినట్టు తెలుస్తోంది. టాస్క్‌ఫోర్స్ అదనపు డిప్యూటీ పోలీసు కమిషనర్ ఎన్.కోఠి రెడ్డి ఆధ్వర్యంలో సౌత్‌జోన్ ఇన్స్పెక్టర్ ఠాకూర్ సుఖ్‌దేవ్ సింగ్, ఎస్ఐలు జి.మల్లేశ్, కె.వెంకటేశ్వర్లు, ఎస్కే జాకీర్ హుస్సేన్, డి.వెంకటేశ్వర్లు ఈ దాడులు నిర్వహించారు. -
మెస్సేజ్ వచ్చింది.. లారీ వదిలేయ్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రవాణా శాఖ మంత్రి కనుసన్నల్లో కొందరు తెలుగు తమ్ముళ్లు జోరుగా అధికలోడుతో గ్రానైట్ అక్రమ రవాణా సాగిస్తున్నారు. దీనికి ‘కేరాఫ్ టీఆర్ మినిస్టర్’ అని ఆర్టీఏ అధికారుల సెల్ఫోన్లకు మంత్రి అనుచరుల వాహనాల నంబర్ల మెసేజ్ రావటమే నిదర్శనం. ఆ మెసేజ్‌ను నెల్లూరు, ప్రకాశం జిల్లా ఉపరవాణా కమిషనర్ మొబైల్‌కు పంపినట్లు తెలిసింది. మెసేజ్‌తో అలర్ట్ అయిన డీటీసీ.. ఆలస్యం చేయకుండా కిందిస్థాయి అధికారుల సెల్ఫోన్లకు వాహనాల నంబర్ల మెసేజ్ ను పంపినట్లు తెలుస్తోంది. సాధారణంగా మామూళ్ల మత్తులో చూసీచూడకుండా వ్యవహరించే అధికారులు.. మంత్రి నుంచి మెసేజ్ వచ్చిందని ప్రచారం జరగటంతో మిన్నకుండిపోతున్నారు. ప్రకాశం, గుంటూరుతో పాటు ఇతర తెలంగాణ జిల్లాల నుంచి చెన్నై, కృష్ణపట్నం, కర్ణాటక రాష్ట్రాలకు గ్రానైట్ రవాణా అవుతోంది. ఈ ప్రాంతాల నుంచి నిత్యం 300 వాహనాలకుపైగా నెల్లూరు మీదుగా వెళ్తున్నాయి. అయితే వాటిలో పరిమితికి మించి అధికలోడుతో గ్రానైట్‌ను తరలిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి, బల్లికురవ, గురిజేపల్లి నుంచి గ్రానైట్‌ను తరలించే తమ వాహనాలపై కేసులు రాయకుండా ఉండేం దుకు కొందరు తమ్ముళ్లు రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావును ఆశ్రయించినట్లు తెలిసిం ది. ఈ నేపథ్యంలో కొన్ని నంబర్లను రవాణా అధికారులకు ఫోనులో మెసేజ్ పంపినట్లు తెలుస్తోంది. -
బీటెక్ విద్యార్థుల 43 సెల్ఫోన్లు చోరీ
కీసర: మండల కేంద్రంలోని అశ్విత ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థులకు చెందిన 43 సెల్ఫోన్లు శుక్రవారం చోరీ అయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని గీతాంజలి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులతో పాటు భోగారం గ్రామంలోని హోళీమేరీ ఇంజినీరింగ్ క ళాశాలకు చెందిన విద్యార్థులకు రెగ్యులర్ పరీక్షలు రాసేందుకు కీసరలోని అశ్విత ఇంజినీరింగ్ కళాశాలలో సెంటర్ పడింది. దీంతో శుక్రవారం రెండు కళాశాలలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాసేందుకు అశ్విత కాలేజీకి వచ్చారు. 43 మంది విద్యార్థులు తమ సెల్ఫోన్లను రెండు స్కూటీల డిక్కీలో పెట్టి పరీక్షలు రా సేందుకు వెళ్లారు. విద్యార్థులు తిరిగి వచ్చేసరికి 43 సెల్ఫోన్లు చోరీ అయ్యాయి. దీంతో వారు కీసర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
హైదరాబాద్ వద్ద మైక్రోమ్యాక్స్ ప్లాంట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సెల్ఫోన్ల విపణిలో ఉన్న మైక్రోమ్యాక్స్ హైదరాబాద్ సమీపంలో ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తోంది. శుక్రవారం (నేడు) తెలంగాణ పారిశ్రామిక విధానం ఆవిష్కరణ సందర్భంగా సీఎం కె.చంద్రశేఖరరావు సమక్షంలో మైక్రోమ్యాక్స్ తన ప్రణాళికను ప్రకటించనున్నట్టు సమాచారం. ఎంత పెట్టుబడి, ప్లాంటు తయారీ సామర్థ్యం వంటి విషయాలను ఈ సందర్భంగా కంపెనీ వెల్లడించనుంది. పది రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కంపెనీ అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. గార్టనర్ నివేదిక ప్రకారం 2015 జనవరి-మార్చి కాలంలో ప్రపంచవ్యాప్తంగా 46 కోట్ల ఫోన్లు అమ్ముడయ్యాయి. ఇందులో మైక్రోమ్యాక్స్ 81.58 లక్షల యూనిట్లతో 1.8 శాతం వాటా దక్కించుకుంది. తద్వారా ప్రపంచ టాప్-10 సెల్‌ఫోన్ తయారీ సంస్థల్లో ఒకటిగా నిలిచింది. 2014లో మొత్తం 3.3 కోట్ల యూనిట్లను విక్రయించింది. -
మన పోస్టు భలే స్పీడ్
దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి పోస్టల్ చరిత్రలో తొలిసారి లాభం రుచి చూసే అరుదైన అవకాశం ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి లోటు మాయమయ్యే అవకాశం అత్యధిక ఆదాయం పొందిన రెండో సర్కిల్ మహారాష్ట్రను నెట్టి తొలిస్థానం దిశగా అడుగులు 6 కోట్లను మించిన పొదుపు ఖాతాలు సాక్షి, హైదరాబాద్ పోస్టల్ శాఖ చరిత్రలో తొలిసారి ‘లాభా’న్ని ఆర్జించే అవకాశం కనిపిస్తోంది. అది కూడా తెలుగు రాష్ట్రాలకు సంయుక్తంగా ఉన్న ఏపీ సర్కిల్ పరిధిలోనే చోటుచేసుకునే అవకాశం కలిగింది. ప్రస్తుత ఊపు అదే వేగంతో సాగితే దేశంలో తొలిసారి తపాలాశాఖ లాభాన్ని కళ్లజూడనుంది. సెల్ఫోన్లు, ఈమెయిళ్లతో ‘ఉత్తరం’ కనుమరుగయ్యాక తపాలాశాఖ మనుగడే ప్రశ్నార్థకమయింది. ఈ తరుణంలో ఏపీ సర్కిల్(ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పరిధి) దాన్ని సవాల్‌గా తీసుకుని వినూత్న పద్ధతులను అవలంబిస్తూ మొత్తం తపాలా శాఖకే మార్గదర్శిగా మారింది. నాలుగేళ్ల కిందటిదాకా తపాలా శాఖ ఆదాయంలో ఏపీ సర్కిల్ వాటా 1.65 శాతంగా ఉండగా ఇపుడది ఏకంగా 11 శాతానికి చేరింది. ఇది దేశంలో రెండో స్థానం. తొలిస్థానం 14% వాటాతో ముంబైతో కలిసిన మహారాష్ట్రది. కాకపోతే అక్కడ ఆదాయంతో పాటు ఖర్చులూ ఎక్కువే. రెవెన్యూ లోటూ ఎక్కువే. ఏపీ సర్కిల్ విషయానికొస్తే 2013-14లో ఏకంగా రూ.144 కోట్ల లోటును పూడ్చుకుని, గతేడాదికి దాన్ని రూ.121 కోట్లకు పరిమితం చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి లాభాల్లోకి మళ్లనున్నట్లు తపాలాశాఖ అంచనా వేస్తోంది. ఏపీ సర్కిల్ అనూహ్య ఫలితాలు ఏకంగా ప్రధాని మోదీని సైతం ఆకట్టుకున్నాయి. ఏపీ సర్కిల్ అనుసరిస్తున్న విధానాలను ఇతర సర్కిళ్లకు మార్గదర్శనంగా మార్చటం కోసం భారత తపాలా పాలకమండలిలో మార్పులు చేయనున్నట్టు తెలుస్తోంది. భారీగా పెరిగిన సేవింగ్స్ ఖాతాలే కారణం! ఉత్తరాలకు కాలం చెల్లుతుండటంతో త పాలాశాఖ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. పొదుపు ఖాతాలను పెంచుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవటంతో పాటు కొరియర్ సంస్థలతో పోటీపడుతూ వినూత్న సేవలు ఆరంభించింది. ప్రత్యేకంగా లాజిస్టిక్ విభాగాన్ని ప్రారంభించి అనతికాలంలోనే దాన్ని బలోపేతం చేసింది. దాన్నుంచి భారీ ఆదాయాన్ని పొందుతోంది. చివరికి ఇల్లు ఖాళీ చేస్తే సామగ్రిని కొత్త ఇంటికి మార్చేందుకు కూడా తపాలా శాఖ వాహనాలు సిద్ధమయ్యాయి. దీంతోపాటు ఇటీవల సేవింగ్స్ ఖాతాలు బాగా పెరిగాయి. 2012-13లో 3.64 కోట్ల ఖాతాలుంటే 2013-14కు 4.45 కోట్లకు, 2014-15 కు 6.02 కోట్లకు చేరాయి. ఒక్కో వ్యక్తికి వివిధ రకాలైన నాలుగైదు ఖాతాలుండటంతో ఈ సంఖ్య భారీగా పెరిగింది. ప్రతి ఖాతాకూ రూ.199 చొప్పున కేంద్రం చెల్లిస్తోంది. దాంతో ఆదాయమూ పెరిగింది. దేశవ్యాప్తంగా ప్రైవేటు కొరియర్ సంస్థల సగటు వృద్ధి 12-15 శాతంగా ఉంటే గత ఆర్థిక సంవత్సరంలో ఏపీ తపాలా సర్కిల్లో వృద్ధి 27 శాతంగా నమోదైంది. అది ఈ ఆర్థిక సంవత్సరంలో 30 శాతానికి చేరుతుందని అంచనా. ప్రస్తుతం ఏపీ సర్కిల్ పరిధిలో రూ.22,737 కోట్ల డిపాజిట్లున్నాయి. స్పీడ్ పోస్ట్ ఇక ఇంటి నుంచే: స్పీడ్‌పోస్ట్ కోసం ఇక పోస్టాఫీసుకు వెళ్లనక్కరలేదు. నిర్ధారిత నంబర్‌కు ఓ ఎస్సెమ్మెస్ చేస్తే జీపీఎస్ ద్వారా అది స్థానిక పోస్టాఫీసుకు చేరుకుంటుంది. నిమిషాల వ్యవధిలో సిబ్బంది ఇంటికే వచ్చి పార్శిల్ తీసుకెళ్తారు. దేశంలో తొలిసారి పిక్పోస్ట్ పేరిట త్వరలో ఇది ఏపీ సర్కిల్లో మొదలు కానుంది. పోస్టల్ ఈ-షాప్ పేరుతో కోరిన వస్తువుల్ని ఇంటికే బట్వాడా చేసే విధానాన్నీ మొ దలు పెడుతున్నారు. ఆకాశవాణిలో ఆణిముత్యాల్లాంటి పాత ప్రసారా ల సీడీలు, టీటీడీ ప్రసాదం, లేపాక్షి ఉత్పత్తులు, తెలుగు యూనివర్సిటీ ప్రచురణలు, నిర్మల్ బొమ్మలు... ఇలా కొన్నింటిని తమ వెబ్సైట్ ద్వారా విక్రయించడానికీ ఏపీ సర్కిల్ ప్రయత్నిస్తోంది. అందరి సమష్టి కృషి పొదుపు ఖాతాలను భారీగా పెంచటంతో పాటు వినూత్న ఆలోచనలను అమలు చేయటంతో దేశంలోనే వేగంగా లాభాల బాట పట్టేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే భారత తపాలా చరిత్రలో తొలిసారి లాభాలు అందుకుంటాం. ఈ ఘనతకు చేరువవటానికి మా ప్రతి ఉద్యోగి శ్రమే కారణం. మరింత నాణ్యమైన సేవలను ప్రజల ముందుంచి తపాలా విజయవంతంగా మనగలదని నిరూపిస్తాం. - సుధాకర్, చీఫ్పోస్ట్మాస్టర్ జనరల్ -
ప్రయాణం.. అప్పటికప్పుడే!
చివరి నిమిషంలో ప్రయాణానికే హైదరాబాదీల మొగ్గు ⇒ 40% ట్రావెల్ బుకింగ్స్ ఆఖర్లో జరుగుతున్నవే ⇒ ఇందులో 54 శాతం వాటా మొబైల్స్ నుంచే ⇒ క్లియర్‌ట్రిప్ సక్సెస్‌కు కారణమిదే ⇒ క్లియర్‌ట్రిప్ సీఎంఓ సుబ్రహ్మణ్య శర్మ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘‘అనుకున్నదే తడవు’’ అనే నానుడిని భాగ్యనగరవాసులు పక్కా ఫాలో అవుతున్నారు. అందుకేనేమో ముందస్తు ట్రావెల్ బుకింగ్స్ కంటే చివరి నిమిషంలో చేస్తున్నవే ఎక్కువగా ఉన్నాయట. మొత్తం వ్యాపారంలో ఇలా జరుగుతున్నది ఏకంగా 40 శాతానికి చేరిందంటున్నారు క్లియర్‌ట్రిప్ చీఫ్ మార్కెటింగ్ అధికారి (సీఎంఓ) సుబ్రహ్మణ్య శర్మ. ఈ 40 శాతంలో కూడా 54 శాతం బుకింగ్స్ సెల్ఫోన్ల ద్వారా జరుగుతున్నవేనని తెలియజేశారు. ‘దక్షిణ భారతదేశం- ఆన్లైన్ ట్రావెల్ పరిశ్రమ’ అనే అంశంపై మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే... ⇒ దేశంలో ఆన్లైన్ ట్రావెల్ విభాగం ఏటా 32% వృద్ధిని కనబరుస్తోంది. 19.8ుతో దక్షిణ కొరియా రెండో స్థానంలో నిలవగా.. 18.2%తో బ్రెజిల్, 14.1%తో చైనా ఆ తర్వాతి స్థానాల్లో నిలుస్తున్నాయి. ⇒ ప్రస్తుతం దేశంలో 40 లక్షల మంది క్లియర్‌ట్రిప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. నెలకు 5 లక్షల మంది కొత్తగా చేరుతున్నారు కూడా. నెలకు 6.5 లక్షల మంది కస్టమర్లు క్లియర్‌ట్రిప్ సేవల్ని స్మార్ట్ఫోన్లు, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల ద్వారా వినియోగించుకుంటున్నారు. ఇందులో మొబైల్స్ ద్వారా జరుగుతున్న వినియోగం నెలకు 3 శాతం వృద్ధి రేటును కనబరుస్తోంది. ఏటా 30 లక్షల ట్రావెల్ బుకింగ్స్ జరుగుతుంటే.. ఇందులో 70% మంది రిపీటెడ్ కస్టమర్లే. ⇒ ఆన్లైన్ ట్రావెల్స్ బుకింగ్స్‌లో మొబైల్ ఫోన్లదే అగ్రస్థానం. డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు కొందరికే పరిమితం కనక సెల్‌పైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నారు. అందుకే 2006లో ప్రారంభమైన క్లియర్‌ట్రిప్ సంస్థ.. 2010లో మొబైల్ వెబ్‌సైట్‌ను, 2012లో ఐఓఎస్ యాప్‌ను, 2014లో ఆండ్రాయిడ్ యాప్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఆన్లైన్ ట్రావెల్ పరిశ్రమలో మేక్మైట్రిప్ మొదటి స్థానంలో ఉంటే.. మొబైల్ ఫోన్ల ద్వారా ట్రావెల్ బుకింగ్స్‌ను వినియోగించటంలో క్లియర్‌ట్రిప్ మొదటి స్థానంలో ఉంది. ⇒ గతేడాది మా టర్నోవర్ 8 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఇందులో 43-44 శాతం వాటా మొబైల్ ఫోన్ల ద్వారా వచ్చిందే. భవిష్యత్తులో మా పెట్టుబడుల్లో 60 శాతం వాటాను మొబైల్ ప్లాట్‌ఫాం, టెక్నాలజీ మీదే పెట్టాలని నిర్ణయించాం. ⇒ క్లియర్‌ట్రిప్ ఆన్లైన్ ట్రావెల్స్ విభాగంలో హైదరాబాద్ వాటా 6 శాతం. ఏటా దేశంలో మొబైల్ ఫోన్ల ద్వారా విమానయాన బుకింగ్స్ 150-160 శాతం వృద్ధి రేటును కనబరుస్తుంటే.. హైదరాబాద్‌లో మాత్రం ఏకంగా 192 శాతం వృద్ధి రేటుంది. హోటల్స్‌కు సంబంధించి హైదరాబాద్‌లో 903 శాతం వృద్ధి ఉంది. ⇒ విమాన టికెట్లకు సంబంధించి మొబైల్ ఫోన్ల ద్వారా 28 శాతం బుకింగ్స్ ఆఖరి నిమిషంలో అవుతుంటే.. డెస్క్‌టాప్‌ల ద్వారా 18 శాతం చేస్తున్నారు. రెండు రోజుల ముందైతే మొబైల్స్ ద్వారా 72 శాతం మంది చేస్తుంటే.. డెస్క్‌టాప్ ద్వారా 82 శాతం మంది చేస్తున్నారు. నెట్ న్యూట్రాలిటీకే మా మద్దతు మూడు నెలలక్రితం కొన్ని టెలికం కంపెనీలతో భాగస్వాములమై మా అప్లికేషన్‌ను ఉచితంగా ఇచ్చాం. అయితే తర్వాతి రోజే ‘‘క్రియర్ట్రిప్ను డౌన్లోడ్ చేసుకోవటం మానేస్తున్నాం. ఎందుకంటే నెట్‌న్యూట్రాలిటీకి మద్దతుగా మేం పోరాడుతున్నాం’’ అని కొందరు కస్టమర్లు ట్వీట్ చేశారు. దీంతో వెంటనే నెట్ న్యూట్రాలిటీకి మేమూ మద్దతు ప్రకటించాం. వారి భాగస్వామ్యం నుంచి వైదొలిగాం. కస్టమర్లు, వారి అభిరుచులు, గౌరవాలే మాకు ముఖ్యం. కొన్ని సంస్థల ప్రయోజనాల కోసం కస్టమర్లను కోల్పోలేం. -
ఇంద్రకీలాద్రిపై సెల్ఫోన్ల కోసం కౌంటర్
సాక్షి, విజయవాడ : సిమీ ఉగ్రవాదులు తమ దాడులకు దుర్గగుడిని లక్ష్యం చేసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుకున్న దేవస్థానం అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు తమ తెచ్చుకునే సెల్ఫోన్లను భద్రపరుచుకునేందుకు ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ కౌంటర్‌ను దేవస్థానం సిబ్బందే నిర్వహిస్తారా? లేక కాంట్రాక్టర్‌కు లీజుకు ఇస్తారా? అనేది తేలాల్సి ఉంది. పైరవికి సిద్ధమైన కాంట్రాక్టర్ ఇంద్రకీలాద్రిపై సెల్ఫోన్లు భద్రపరిచే కౌంటర్‌ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించాలంటూ దుర్గగుడిపై గతంలో వివిధ రకాల కాంట్రాక్టులు చేసిన ఒక కాంట్రాక్టర్ ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. ఒకొక్క భక్తుడి నుంచి సెల్ ఫోన్ భద్రపరిచేందుకు రూ.5 లేదా రూ.10 వసూలు చేస్తానని, దేవస్థానం నిర్ణయించిన అద్దె చెల్లిస్తానని ఆ కాంట్రాక్టర్ ప్రతిపాదించాడని సమాచారం. ప్రస్తుతం సిమీ ఉగ్రవాదుల దాడులు జరుగుతాయని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఈ కాంట్రాక్టర్ తన ఫైల్ పరిశీలించాలంటూ అధికారులపై వత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఆ కాంట్రాక్టర్‌కే అవకాశం ఇవ్వాలని ఈవో సీహెచ్.నర్సింగరావుపై ప్రభుత్వ పెద్దల నుంచి వత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ప్రజాప్రతినిధుల వత్తిడికి తలొగ్గి సెల్ఫోన్లు భద్రపరిచే కౌంటర్‌ను కాంట్రాక్టర్‌కు అప్పగిస్తారా? లేక భక్తులకు ఉపయుక్తంగా ఉండేలా దేవస్థానం సిబ్బందితోనే నిర్వహిస్తారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. లీజుకు ఇస్తే దేవస్థానానికి ఆదాయం వస్తుందంటూ ఈవోను తప్పదోవ పట్టించేందుకు లీజెస్ విభాగం సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. అసలు కౌంటర్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఇప్పుడు ఉందా? లేదా? అని కూడా ఈవో ఆలోచిస్తున్నట్లు ఇంద్రకీలాద్రిపై ప్రచారం జరుగుతోంది. -
'మొబైల్, సెల్ టవర్స్‌తో కేన్సర్ రాదు'
కాకినాడ: మొబైల్ ఫోన్ల వినియోగం, సెల్ టవర్స్ వల్ల కేన్సర్ కారణం కాదని... ఒట్టి అపోహ మాత్రమేనని అంకాలజిస్ట్ సర్జన్ డా.సుంకవల్లి చినబాబు అన్నారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో డా.సుంకవల్లి చినబాబు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... కేన్సర్ చికిత్స విధానంలో రొబెటిక్ సర్జరీ అనే అధునిక పద్దతి వచ్చిందన్నారు. రొబెటిక్ సర్జరీతో కేన్సర్ రోగికి పెద్దగా నొప్పి తెలియదని డా. సుంకపల్లి చినబాబు అన్నారు. -
పాఠశాలల్లో సెల్ వినియోగం నిషేధం
మోగితే ఉపాధ్యాయులపై చర్యలు ఆర్జేడీ ప్రసన్నకుమార్ హెచ్చరిక టెన్త్ ఉత్తీర్ణతపై ప్రత్యేక శ్రద్ధ యలమంచిలి : పాఠశాలల పనివేళల్లో ఉపాధ్యాయులు సెల్ఫోన్లు వాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని పాఠశాలల విద్య ఆర్జేడీ( కాకినాడ)ఎంఆర్ ప్రసన్నకుమార్ స్పష్టం చేశారు. విద్యార్థులకు రోల్‌మోడల్‌గా ఉండాల్సిన ఉపాధ్యాయులు కొన్ని పద్ధతులు తప్పనిసరిగా పాటించాల్సిందే అన్నారు. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా మొబైల్ ఫోన్లు వినియోగిస్తూ పట్టుబడితే సస్పెన్షన్ తప్పదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల వేళల్లో మొబైల్ ఫోన్ వినియోగించినందుకు ఒక ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి కార్యాలయానికి వచ్చిన ఆయన పాఠశాలల నిర్వహణపై డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డికి పలు సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తన పరిధిలో ఆరు జిల్లాల్లో 5,300 హైస్కూళ్ల నుంచి సుమారు 3.20లక్షల మంది టెన్త్ పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పదో తరగతిలో నూరు శాతం ఉత్తీర్ణతకు రోజువారి కార్యాచరణ ప్రణాళిక ప్రకారం విద్యార్థులకు తర్ఫీదునిస్తున్నట్టు చెప్పారు. వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని,సంప్రదాయ దుస్తులతో ఉపాధ్యాయులు పాఠశాలలకు రావాలని ఆదేశాలు పంపినట్టు తెలిపారు. ముఖ్యంగా ఉపాధ్యాయ ప్రణాళిక ప్రకారం బోధన చేపట్టాలన్నారు. పాఠశాలల ఆకస్మిక తనిఖీల్లో భాగంగా నోట్‌పుస్తకాలు, వర్క్‌బుక్‌లు తనిఖీ చేపడుతున్నట్టు చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థులు చేసిన హోమ్‌వర్క్‌ను, నోట్‌పుస్తకాలను దిద్దకపోతే క్రమశిక్షణ చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇప్పటికే ఈ విషయమై కొందరికి షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం అదనపు తరగతులు నిర్వహించకూడదు కదా..? అని అడిగినపుడు ‘చట్టం ప్రకారమే నడుచుకుంటున్నామని, అదనపు సమయాల్లో విద్యార్థులను చదివిస్తున్నట్టు తెలిపారు’. త్వరలో చేపట్టబోయే ఉపాధ్యాయుల రేషన్లైజేషన్ ప్రక్రియలో హైస్కూళ్లలో పనిచేస్తున్న అదనపు ఉపాధ్యాయులను యూపీ స్కూళ్లకు, యూపీ స్కూళ్లలో సెకండరీ గ్రేడ్ టీచర్లను ప్రాథమిక పాఠశాలలకు పంపుతామన్నారు. విద్యాప్రమాణాలు సన్నగిల్లకుండా డీఈవోలు, డిప్యూటీ డీఈవోలు పాఠశాలలను పర్యవేక్షించాలని సూచించారు. ఆయన వెంట యలమంచిలి ఉప విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి, వి.బాలప్రభుకుమార్, వనం నాగేశ్వరరావు, వెంకటేశ్వరరావు ఉన్నారు. -
ఆదాయమార్గాలపై ప్రభుత్వం కసరత్తు
నీటి తీరువా వసూళ్లు సెల్ఫోన్లపై వ్యాట్ పెంపు సర్వీసు చార్జీలు వాత సాక్షి, హైదరాబాద్: ఆదాయ వనరులను పెంచుకోవడానికి రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. రైతుల నుంచి నీటి తీరువా వసూలు చేయడం, పదివేల రూపాయలకుపైగా ఖరీదైన సెల్ఫోన్లపై వ్యాట్ పెంచటం, ప్రభుత్వం అందించే అన్ని రకాల సేవలపై సర్వీసు చార్జీల రూపంలో నిర్వహణ వ్యయాన్ని రాబట్టడంపై దృష్టి సారించింది. రైతులకు ప్రాజెక్టుల కింద భూములకు సాగునీరు ఇస్తున్నందున ఆ ప్రాజెక్టుల నిర్వహణ వ్యయాన్ని నీటి తీరువా రూపంలో రాబట్టాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నీటి తీరువా ఉన్నప్పటికీ రైతుల నుంచి వసూళ్లపై ప్రభుత్వాలు పెద్దగా దృష్టి సారించలేదు. గతంలో చంద్రబాబునాయుడు అధికారంలో ఉండగా నీటి తీరువా రూపంలో ఎకరానికి బస్తా ధాన్యం ఇవ్వాలని పేర్కొన్నారు. దీనిపై అప్పట్లోనే రైతులు రహదారులపైకి వచ్చి ఆందోళనలు చేశారు. ఇక నీటితీరువాను తప్పకుండా వసూలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పదివేల రూపాయలకుపైగా విలువైన సెల్ఫోన్లపై వ్యాట్‌ను 14.5 శాతానికి పెంచాలని వాణిజ్యపన్నుల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రస్తుతం సెల్ఫోన్లపై వ్యాట్ ఐదు శాతం మాత్రమే ఉంది. మరోపక్క గనులు, అటవీరంగాల ద్వారా పన్నేతర ఆదాయం పెంచుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సేవలకు సర్వీసు చార్జీలను వేయాలని భావిస్తోంది పన్నేతర ఆదాయం పెంచుకోవడానికి కేపీఎంజీ కన్సల్టెంట్.. ప్రభుత్వశాఖల కార్యకలాపాల వివరాలను కోరింది. కేపీఎంజీ ఏయే కార్యకలాపాల ద్వారా ఎంతెంత ఆదాయం పెంచుకోవచ్చో సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ప్రభుత్వం చేయాల్సింది ఆర్భాటపు వ్యయాన్ని తగ్గించుకోవాలని అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. -
సభ జరుగుతుంటే సెల్ఫోన్లతో కాలక్షేపం
కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల నిర్వాకం బెంగళూరు: శాసనసభలోకి సెల్ఫోన్లు తీసుకురాకూడదన్న నిబంధనను ఉల్లంఘించి ఇద్దరు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలు సభ జరుతుండగానే తమ సెల్ఫోన్లను చూసుకుంటూ మీడియా కంటబడ్డారు. వారిలో ఔరాద్ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కాంగ్రెస్ చీఫ్ సోనియా తనయ ప్రియాంక ఫొటోను జూమ్ (పెద్దదిగా చేయడం) చేసి చూడటం వివాదాస్పదమవగా మరో ఎమ్మెల్యే యు.బి. బణకార్ ఫోన్లో వీడియో గేమ్స్ ఆడటంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. -
డబ్బులిచ్చి మరీ సెల్ఫోన్లకు ఛార్జింగ్
విశాఖ : హుదూద్ తుఫాను విలయ తాండవానికి విశాఖ జిల్లాలో చాలా గ్రామాలు అంధకారంలోనే ఉన్నాయి. అరుకు, పాడేరు మార్గంలో పరిస్థితి భయానకంగా ఉంది. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. సహాయక చర్యల నిమిత్తం మంత్రులు, అధికారులు కూడా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్ సరఫరా లేక జనాలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. జనరేటర్ల దగ్గరకు వెళ్లి డబ్బులు ఇచ్చి మరీ సెల్ఫోన్లకు ఛార్జింగ్ పెట్టించుకుంటున్నారు. కాగా హుదూద్ తుఫాను ధాటికి సమాచార వ్యవస్థ ఛిన్నాభిన్నం అవటంతో గిరిజనులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తున్నారు. మన్యంలో పలుచోట్ల సెల్ టవర్లు దెబ్బతినటంతో అయిదు రోజులుగా సెల్ఫోన్లు పనిచేయటం లేదు. ఛార్జింగ్ పెట్టుకుందామంటే విద్యుత్ సరఫరా లేదు. తమవారి క్షేమ సమాచారాల కోసం ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ముంచంగిపుట్టులో పలువురు మోటార్ బైకుల ద్వారా సెల్ ఛార్జింగ్ చేసుకుంటున్నారు. -
విశాఖలో పనిచేయని సెల్ఫోన్లు
విశాఖపట్నం: హుదూద్ పెను తుఫాన్ నుంచి విశాఖ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. తుపాను తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. క్రమంగా ఈదురుగాలులు తగ్గి వాతావరణం సాధారణ స్థితికి వస్తోంది. తుఫానుతో అతలాకుతలమైన విశాఖలో సోమవారం ఉదయం సహాయక చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వ బలగాలతో పాటు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు విశాఖలో నష్టాన్ని అంచనా వేసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలు నగరంలో మకాం వేశాయి. మరోవైపు నగర ప్రజలు ఇళ్లనుంచి బయటకు వస్తున్నారు. తాగునీరు, నిత్యావసరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల కోసం జనాలు అవస్థలు పడుతున్నారు. ఇక అపార్ట్మెంట్లు, సెల్లార్లలో వర్షపునీరు నిలిచింది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు, చెట్లు, హోర్డింగ్‌లు కూలిపోయాయి. తుఫాను దాటికి సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. విద్యుత్ వ్యవస్థ కుప్పకూలటంతో నగరం అంధకారంలోనే ఉంది. దాంతో సెల్ఫోన్లు కూడా పనిచేయటం లేదు. -
ఆ ఖైదీలకు క్షమాభిక్ష, ములాఖత్‌లు కట్
హైదరాబాద్ : చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఖైదీలు సెల్ఫోన్లు వాడిన వ్యవహారంపై అధికారులు చర్యలు చేపట్టారు. సెల్ఫోన్లు వాడిన 12మంది ఖైదీలకు క్షమాభిక్షతో పాటు వారికి ములాఖత్‌లను కట్ చేశారు. అలాగే 12మంది ఖైదీలో ఆరుగురిని చంచల్‌గూడ జైలుకు, మరో ఆరుగురిని వరంగల్ జైలుకు తరలించారు. ఇక ఫోన్లో మాట్లాడుతూ ఓ టీవీ ఛానల్‌కు చిక్కిన వీరాస్వామిని అధికారులు వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు. చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ న్యాయవాదికి ఫోన్ చేసి... తనకు బెయిల్ ఇప్పించాలంటూ కోరిన విషయం సోమవారం ఓ టీవీ చానల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జైళ్లశాఖ ఉన్నతాధికారులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో గత అర్థరాత్రి జైలు సిబ్బంది సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఖైదీలతో పాటు జైలు సిబ్బందిపై అధికారులు చర్యలు చేపట్టారు. -
చర్లపల్లి జైల్లో మళ్లీ సెల్ ఫోన్లు, గంజాయి
హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ న్యాయవాదికి ఫోన్ చేసి... తనకు బెయిల్ ఇప్పించాలంటూ కోరిన విషయం సోమవారం ఓ టీవీ చానల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జైళ్లశాఖ ఉన్నతాధికారులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో గత అర్థరాత్రి జైలు సిబ్బంది సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఖైదీల వద్ద 6 సెల్ ఫోన్లతోపాటు 50 గ్రామలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఖైదీల వద్దకు సెల్ఫోన్లు, గంజాయి ఎలా వెళ్లిందని ఉన్నతాధికారులు జైలు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దీంతో జైలు సిబ్బంది నీళ్లునముతున్నారు. దాంతో ఆగ్రహించిన ఉన్నతాధికారులు జైలు సిబ్బందిపై చర్యలకు సమయత్తమవుతున్నారు. -
నాడు ఫ్యాక్షనిస్టు: నేడు దొంగలకు దొర
నేరస్తులకు బెయిల్, ష్యూరిటీ వంటివి ఇప్పించడం జైలులోని వారికి గంజాయి, సెల్ఫోన్ల సరఫరా ప్రతిఫలంగా చోరీలలో వాటా సుంకరి ప్రసాద్ నేరాంగికార పత్రంలో బయటపడ్డ నిజం సాక్షి, సిటీబ్యూరో: అతను గతంలో ఫ్యాక్షన్ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొన్నాడు..పలుసార్లు జైలుకెళ్లి వచ్చాడు.. కొంత కాలం తర్వాత తన పంథా మార్చుకున్నాడు. నేరం చేసి జైలుకెళ్లిన వారికి అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించమే థ్యేయంగా పెట్టుకున్నారు. వారు చేసిన ప్రతి చోరీలో వాటా తీసుకుంటాడు. ఇలా సుమారు వంద మందికి పైగా నేరగాళ్లకు ఇతను దొర (బాస్)లా వెలుగుతున్నాడు. వారం క్రితం సైబరాబాద్ క్రైమ్ పోలీసులకు పట్టుబడటంతో కుషాయిగూడ పోలీసులు ఇతడ్ని రిమాండ్‌కు తరలించారు. అయితే అతని నేర అంగీకార పత్రంలో మరిన్ని ఆసక్తిగల వివరాలు బయటపడ్డాయి. 18 ఏళ్లకే నేరబాట... ప్రకాశం జిల్లాకు చెందిన సుంకరి ప్రసాద్ (40) ఘట్కేసర్లో ఉంటున్నాడు. 7వ తరగతి వరకు చదువుకున్న ఇతగాడు 18 ఏళ్ల వయసు(1991)లో బాంబు పేలుడు ఘటనలో జైలుకెళ్లాడు. ఆ తర్వాత ఫ్యాక్షనిస్టుగా మారి హత్య, హత్యాయత్నాలతో పాటు ప్రకాశం, కర్నూల్, కడప, నల్లగొండ, మెదక్, విజయవాడ, హైదరాబాద్, సైబారాబాద్లలో 100కుపైగా బెదిరింపులు, దోపిడీలు, ఇళ్లలో చోరీలు చేశాడు. ఆయా కేసులలో జైలు కెళ్లినప్పుడు పాత నేరస్తులతో పరిచయం పెంచుకున్నాడు. ఇలా వందకుపైగా నేరగాళ్లతో పరిచయాలు పెంచుకున్నాడు. వారందరికీ ఇతనే బాస్‌గా మారిపోయాడు. అప్పటి నుంచి ఇతను ప్రత్యక్షంగా నేరాలు చేయడం మానేశాడు. తన వ ద్ద లిస్టులో ఉన్న వంద మంది నేరస్తులకు కావాల్సినప్పుడల్లా సహాయం చేస్తూ పోలీసుల దర్యాప్తులో తెరపైకి రాకుండా మొలుగుతున్నాడు. సుంకరి ప్రసాద్ కార్యకలాపాలపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు సమాచారం అందడంలో క్రైమ్ పోలీసులు అప్రమత్తమై వారం క్రితం అరెస్టు చేసి జైలుకు పంపారు. నేరస్తులకు ఇలా సహకారం... దొంగతనాలు, దోపిడీలు, తదితర నేరాలు చేసి జైలు పాలైన నేరస్తుడికి మద్దతుగా ఉంటూ బెయిల్ ఇప్పించడం, అందుకు ష్యూరిటీలను సమకూర్చడం, న్యాయవాదికి కావాల్సిన డబ్బులు అందించడం జైల్లో ఉన్న నేరస్తులకు సిమ్‌కార్డులు, సెల్ఫోన్లు, గంజాయి, మిలాఖత్లు ఇప్పించడం నేరస్తుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందించడం జైలు నుంచి విడుదలైన వారు ఎక్కడ చోరీ చేయాలో కూడా సూచించడం వచ్చిన వాటాలోంచే కొంత వీరి సహాయం కోసం ఖర్చు చేస్తాడు. -
ఎయిర్ హోస్టెస్‌ల సెల్ఫోన్లు మాయం
హైదరాబాద్: ఇద్దరు ఎయిర్ హోస్టెస్‌లకు చెందిన ఖరీదైన సెల్ఫోన్లు మాయమైన ఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... కొచ్చీకి చెందిన దీపికాదేష్ట, క్రిస్టిఎడుక్యులా జెట్ ఎయిర్వేస్లో ఎయిర్ హోస్టెస్‌లు. విధుల్లో భాగంగా ఆదివారం నగరానికి వచ్చిన వీరు రాత్రి సోమాజిగూడలోని పార్క్ హోటల్లో భోజనం చేసేందుకు వచ్చారు. భోజనం చేస్తున్న సమయంలో తమ ఖరీదైన ఐఫోన్, సామ్సంగ్ నోట్-4 సెల్ఫోన్లు పక్కనే పెట్టుకున్నారు. కొద్దిసేపటి తర్వాత చూడగా సెల్ఫోన్లు కనిపించలేదు. వెంటనే వారు పంజగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొత్త ప్రపంచం 11th August 2014
-
పఠనం వల్ల ప్రయోజనాలు ఎన్నో!
అధ్యయనం ఒకప్పుడు యువకుల చేతుల్లో సాహిత్య, సామాజిక రంగాలకు సంబంధించిన పుస్తకాలు విరివిగా కనిపించేవి. చదివిన పుస్తకాల గురించి విలువైన చర్చలు జరిగేవి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి మచ్చుకు కూడా కనిపించడం లేదు. పుస్తకం స్థానంలో సెల్‌ఫోన్ హస్తభూషణమైంది. ‘క్లాసు పుస్తకాలు చదవడానికి టైమ్ సరిపోవడం లేదు. ఇక సాహిత్య పుస్తకాలు కూడానా’ అనేది ఒక సాకు మాత్రమే. మనసుంటే మార్గం ఉంటుంది. చదవాలని కోరిక ఉండాలే గానీ సమయం తప్పకుండా దొరుకుతుంది. పుస్తకాలు చదవడం అనేది సాహిత్యపరిచయానికో, కాలక్షేపానికో కాదు...పఠన ప్రభావం వల్ల వ్యక్తుల మానసిక పరిధి విస్తరిస్తుందని రకరకాల పరిశోధనలు తెలియజేస్తున్నాయి. నిజానికి బాల్యంలోనే చదవడం మొదలుపెట్టాలి. వీలుకానప్పుడు టీనేజ్‌లో తప్పనిసరిగా పుస్తకపఠనాన్ని అలవాటు చేసుకోవాలి. బ్రిటన్‌లోని నేషనల్ లిటరసీ ట్రస్ట్(ఎన్‌ఎల్‌టి) తాజా అధ్యయనం మరోసారి పుస్తక పఠన విలువను ప్రపంచానికి చాటింది. పుస్తకాలు చదివే అలవాటు ఉన్న టీనేజర్లకు, లేని టీనేజర్లకు మధ్య వ్యత్యాసాలను అధ్యయనం చేశారు. పుస్తకాలు చదవని వారితే పోల్చితే, చదివే వారు లోకజ్ఞానంలోనే కాదు, రకరకాల సామర్థ్యాలలోనూ మెరుగైన ప్రతిభను కనబరుస్తున్నారని ఎన్‌ఎల్‌టి అధ్యయనం చెబుతుంది. పుస్తక పఠనం వల్ల ఉపయోగం ఏమిటి? టీనేజ్‌లో పుస్తకాలు చదివే అలవాటు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది...లక్ష్యాన్ని నిర్దారించుకునే స్పృహ ఏర్పడుతుంది. లక్ష్యాన్ని చేరుకొనే పట్టుదల వస్తుంది. సామాజిక సమస్యలపై అవగాహన, సామాజిక స్పృహ ఏర్పడతాయి. పఠనాన్ని ఆహ్లాదకరమైన అనుభవంగా భావించే వాళ్లు మిగిలిన వాళ్లతో పోల్చితే భిన్నంగా ఆలోచించగలరు. క్లిష్టమైన సమస్యలకు సులువైన పరిష్కారాను కనుక్కోగలరు. పదిమందిలో ఆకర్షించేలా మాట్లాడే నైపుణ్యం పెరుగుతుంది. స్వీయవిశ్లేషణ సామర్థ్యం పెరుగుతుంది. దీనివల్ల తప్పులను, లోపాలను వేరొకరు వేలెత్తి చూపడానికి ముందే వాటిని సరిదిద్దుకోవచ్చు. చర్చలలో వాదన నైపుణ్యం పెరుగుతుంది. అమ్మాయిలే ఫస్ట్... పాశ్చాత్యదేశాలలో అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలే ఎక్కువగా పుస్తకాలు చదువుతున్నారు. దీనివల్ల అబ్బాయి కంటే అమ్మాయిలలోనే సానుకూల దృక్పథం ఎక్కువగా కనిపిస్తుంది. -
ఫేస్బుక్ స్నేహం ప్రమాదకరం
హైస్కూల్ స్థాయి విద్యార్థి సైతం ఫేస్బుక్ వినియోగిస్తున్నాడంటే యూజర్లు ఏ సంఖ్యలో ఉన్నా రో అర్థమవుతుంది. చదువుకంటే ముందు దీనికి బాని సగా మారు తూ ఫేస్బుక్ అకౌంట్ లేకుంటే చిన్నతనంగా భావించే వారున్నారంటే అతిశయోక్తి కాదు. తీరిక దొరికినప్పుడల్లా కంప్యూటర్, సెల్ఫోన్లలో ఫేస్బుక్ చాటిం గ్లు చేస్తూ గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు యువతీ యువకులు. ఈ తరహ లోకంలో ఎందరో అపరిచిత వ్యక్తులు తారసపడుతున్నారు. వారితో చాటింగ్, పోస్టు లు, లైకులు చేస్తూ స్నేహం పెంచుకుంటున్నారు. ఇలాంటి పరిచయాలు కొందరి జీవి తాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. తీయటి పలుకుతో వచ్చే సందేశాలకు యువతీ యువకులు వారి మాయలోపడి అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నారు. దీనికితోడు బినా మీ అకౌంట్లతో ఫేస్బుక్ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు, సెలబ్రేటీలు, ప్రముఖల ఫొటోలను మార్ఫింగ్ చేసి అపలోడ్ చెయ్యడంతో కొందరికి తెలియని కష్టాలు వచ్చిపడుతున్నాయి. పైశాచిక ఆనందంతో అలా చేసేవారెవరో తెలి యకపోగా అమాయకులు అడ్డంగా బుక్ అవుతున్నారు. న్యూఢిల్లీ : మారిన సాంకేతిక విప్లవంలో వింత ప్రపంచం లాంటి ఇంటర్నెట్, ఫేస్బుక్ అకౌంట్లతో మునిగి తేలుతున్న వారికి వయస్సుతో పనిలేదనిపిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఫేస్బుక్ అకౌం ట్ కలి గి ఉండడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో విరివిగా విస్తరించిన సోషల్ నెట్‌వర్క్‌గా ఫేస్బుక్ ప్రాచుర్యం పొందింది. తమకు నచ్చిన అంశాన్ని స్నేహితులతో పంచుకోవడం, నచ్చిన చిత్రాలను, సందేశాలను పోస్ట్ చేయడం. ఆ తరువాత వాటికి ఎన్ని లైక్‌లు, షేర్ లు, కామెంట్లు వచ్చాయో చూసుకోవడం పరిపాటయింది. కళాశాలల, పాఠశాలల విద్యార్థులే కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఫేస్ బుక్‌తో నిత్యం బిజీ బిజీగా గడుపుతున్నారు. ఎక్కడ చూసినా, సందర్భమేదైనా ఫేస్బుక్ చర్చలే కనిపిస్తున్నాయి. సోషల్ నెట్వర్క్ ఎంత ఫేమస్ అంటే చాలామంది మొబైల్ఫోన్లనో ఫేస్బుక్ అకౌంట్లు ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటన క్షణాల్లో నేడు సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. ఏమూల ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరినీ ఫేస్బుక్ వైపు మళ్ళిస్తోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో యువత ఫేస్బుక్ ద్వారా చేసుకున్న చాటింగ్‌లు ఘర్షణలకు దారితీయడం, ఒకరి పార్టీని ఒకరు విమర్శించుకుంటూ తగవులు పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఇంటర్ విద్యార్థినితో ఓ ఆకతాయి చేసిన చాటింగ్ ఆ యువతి ఇల్లు విడిచి వచ్చేలా చేసింది. దీంతో కుటుంబ తగాదాలు చోటు చేసుకున్నాయి. తల్లిదండ్రులు దృష్టి సారించాలి సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్బుక్ ఉపయోగిస్తే ఆదో విజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించా లి. తమ పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్ఫోన్లతో ఏంచేస్తున్నా రు. వాటిని ఏవిధంగా వాడుతున్నారనే దానిపై దృష్టిసారించాలి. అడగ్గానే ఇంటర్ విద్యార్థికి కూడా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొని చేతి లో పెడుతున్నారు. ఫోన్లలో గేమ్లాడుతున్నామని చెప్పి ఎక్కువ సమ యం ఫేస్బుక్ చాటింగ్‌లు చేస్తుంటారు.. వాటిని గమనించాలి. పిల్లల స్నేహాలు, పరిచయాలు, ప్రవర్తనలపై ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే చెడు వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది. ఆఫర్లతో హోరెత్తిస్తున్న ఆపరేటర్లు వినియోగదారుల వాడకాన్ని దృష్టిలో పెటుకుని వివిధ కంపెనీలకు చెందిన సెల్‌ఫోన్ ఆపరేటర్లు ఇంటర్నెట్, ఫేస్‌బుక్‌ల అకౌంట్ల కోసం ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నారు. ఆఫర్లు కూడా ఎక్కువగా రాత్రి సమయంలో వినియోగించుకునే విధంగా ఉంటున్నాయి. కొన్ని నెట్వర్కలు ఒక్క రూపాయితో రాత్రి ఫేస్బుక్, రూ.12 లతో అర్ధరాత్రి దాటిన తరువాత అన్లిమిటెడ్ ఇంటర్నెట్ సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇవన్నీ యువతకోసమేనంటూ ప్రచారం చేస్తున్నాయి. బినామీపేర్లతో అకౌంట్లు ఎన్నో... కొందరు బినామీ పేర్లతో అకౌంట్లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మా యిల పేర్లు, ఫొటోలతో అకౌంట్లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్ లతో ఫ్రెండ్షిప్లు పెంచుకుని వారితో చాటింగ్ చేస్తారు. ఒకరికి ఒక రు తెలియక పోయినా రిక్వెస్ట్‌లతో వేలసంఖ్యలో ఫేస్బుక్ ఫ్రెండ్స్ పెరి గిపోతారు. ఈ క్రమంలోనే అశ్లీల చిత్రాలు అప్లోడ్ చెయ్యడం దగ్గర నుంచి వ్యక్తిగత కామెంట్లతో మెసేజ్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రేటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయ డం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందు తున్నా రు. ఒక ఫేస్బుక్ అకౌంట్‌కు ఫ్రెండ్స్‌గా ఉన్న వారందరికి ఈ మెసేజ్ లేదా చిత్రాలు అప్లోడ్ అవుతాయి. వీటన్నింటినీ బినామీ అకౌంట్ల నుంచి పంపుతున్నారు. వీటివల్ల వచ్చే సమస్యల్లో చిక్కు కుని అమా యకులు కేసుల్లో ఇరు క్కుని చట్టానికి చిక్కుతున్నారు. సైబర్ నేరాల గురించి తెలియని అమాయకులు ఫేస్బుక్లో ఫొటోలు పెట్టు కుంటే వాటిని డౌన్లోడ్ చేసి కామెంట్లతో అప్లోడ్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట చోటుచేసుకోవడం చూస్తున్నాం. ఈ సంఘట నలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితే గాని బినా మీల సంగతి బయటకు రావడంలేదు. పోలీస్‌ల దర్యాప్తుల్లో నేరాలకు పాల్పడ్డవారిని గుర్తించి ఫేస్బుక్ అకౌంట్ గురించి ఆరాతీస్తే అసలు ఫేస్బుక్ అంటే తెలియని అమాయకుల వివరాలు బయటపడుతున్నాయి. ఎక్కువగా నెట్ సెంటర్‌కు వెళ్లి చాటింగ్ చేసేవారు బినామీ అకౌంట్లు క్రియేట్ చేసి అమాయకులను ఇరికిస్తున్నారు. -
రంజాన్‌కు భారీ ఏర్పాట్లు
చార్మినార్/బహదూర్‌పురా/సాక్షి, సిటీబ్యూరో: ఈద్-ఉల్-ఫితర్‌ను ఘనంగా జరుపుకొనేందుకు ముస్లింలు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ప్రార్థనలను పురస్కరించుకుని ఈద్గాలను ము స్తాబు చేస్తున్నారు. పాతబస్తీలోని మీరాలం, మాదన్నపేట్, గోల్కొండ, సికింద్రాబాద్‌లోని ఈద్గాలతోపాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదులను ముస్తాబు చేశారు. ఆ యా ప్రాంతాల్లో సామూహిక ప్రార్థనలు చేయనున్నారు. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పాతబస్తీ మీరాలం ఈద్గాను అన్ని హంగులతో ప్రార్థనలకు అనుకూలంగా తీర్చిదిద్దారు. పండుగరోజు ఆంక్షలు.. సామూహిక ప్రార్థనల దృష్ట్యా మీరాలం ఈద్గా తదితర ప్రాంతాల్లో పండుగ రోజు ట్రాఫిక్ ఆం క్షలు విధించనున్నారు. మీరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను పురానాపూల్, బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ల మీదుగా దారి మళ్లించనున్నారు. మీరాలం ఈద్గా క్రాస్ రోడ్డు నుంచి ఈద్గా వైపు ఎటువంటి వాహనాలను అనుమతించరు. శివరాంపల్లి, ఎన్పీఏ నుంచి బహదూర్‌ఫురా వైపు వచ్చే వాహనాలను దానమ్మ హట్స్ టీ జంక్షన్ నుంచి అలియాబాద్ వైపు దారి మళ్లిస్తారు. బ్యాగులు, సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు వద్దు: డీసీపీ ఈద్గాలో సామూహిక ప్రార్థనలకు వచ్చే ముస్లిం లు తమ వెంట బ్యాగులు, సెల్ఫోన్లు, వాటర్ బాటిళ్లు తదితర వస్తువులు తీసుకు రాకూడదని దక్షిణ మండలం డీసీపీ ఎస్ఎస్ త్రిపాఠీ కోరారు. ఈద్గా వద్ద మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేసి తనిఖీలను నిర్వహించిన అనంతరమే సామూహిక ప్రార్థనలకు అనుమతిస్తామన్నారు. ఈద్గాల అభివృద్ధి: డిప్యూటీ సీఎం రాష్ట్రంలోని ఈద్గాలను అభివృద్ధి పరిచేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించిందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. ఈద్-ఉల్-ఫితర్‌ను పురస్కరించుకొని పాతబస్తీ మీరాలం ఈద్గాను ఆదివారం ఉదయం ఆయన జీహెచ్ఎంసీ, పోలీసు, ఇతర విభాగాల అధికారులతో కలిసి సందర్శించారు. అక్కడ జరుగుతోన్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ... తాడ్బన్ మీరాలం ఈద్గాలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. మీరాలం ఈద్గా ముఖద్వారం వద్ద శాశ్వత కమాన్, మీరాలం ఈద్గా లోపల శాశ్వత షెడ్‌ను త్వరలో నిర్మిస్తామన్నారు. ఆయన వెంట బహదూర్‌పురా ఎమ్మెల్యే మోజాం ఖాన్, నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ స్పెషల్ కమిషనర్ ప్రత్యూమ్నా, పోలీసు, జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్ అధికారులు, కార్పొరేటర్లు మహ్మద్ మోబీన్, ఎంఏ గఫార్, అజీజ్ బేగ్, టీఆర్ఎస్ బహదూర్‌పురా నియోజకవర్గ ఇన్చార్జి ఎస్ఏ ఖైసర్, మహ్మద్ అబ్దుల్ గఫార్ ఖాన్ తదితరులు ఉన్నారు. -
తీరుమారని సెంట్రల్ జైలు
►ఖైదీల వద్ద దొరుకుతున్న సెల్ఫోన్లు ►గంజాయి తెస్తున్న కోర్టు ఖైదీలు ►నియంత్రణ శూన్యం కోటగుమ్మం (రాజమండ్రి) : సంస్కరణలకు నిలయంగా ఆదర్శంగా ఉండాల్సిన సెంట్రల్ జైలు అంసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కొందరు ఇక్కడ నుంచే తమ దందాలు నడుపుతున్నారు. దాంతో సెల్ఫోన్ల వినియోగం ఎక్కువైంది. వారికి కొందరు అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 21వ తేదీన టవర్ వద్దగల 2ఏ బ్లాక్‌లో ఆల్తాఫ్ హుసేన్ బక్షీ అనే ఖైదీ వద్ద చైనా ఫోన్, రెండు ఛార్జర్లు, ఒక బ్యాటరీ దొరికాయి. రెండు రోజుల అనంతరం జరిగిన తనిఖీల్లో స్నేహా, గౌతమి బ్లాక్‌ల్లో సెల్ ఫోన్లు దొరికాయి. అరకేజీ గంజాయితో దొరికిన ఖైదీ చోరీ కేసులో శిక్ష అనుభవిస్తున్నపలివెల సత్తిబాబు అనే ఖైదీని ఒక కేసులో విచారణ కోసం ఈ నెల 26న ఆలమూరు కోర్టుకు తీసుకువెళ్లారు. తిరిగి జైల్లోకి తీసుకువచ్చేటప్పుడు జైలు గేటు వద్ద సిబ్బంది జరిపిన తనిఖీలలో సత్తిబాబు అండర్ వేర్లో పొట్లం కట్టిన అరకేజీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జైలులో గంజాయి సిగరెట్లకు విపరీతమైన గిరాకీ ఉంది. ఒక్కొక్క సిగరెట్టు రూ 50, బీడీ రూ 25 చొప్పున అమ్ముతున్నారు. దీంతో కోర్టు విచారణకు వెళ్లిన ఖైదీలు తిరిగి జైలుకు వచ్చే సమయంలో గంజాయిని తీసుకు వస్తున్నారు. ఇలాగే మద్యం బాటిళ్లు కూడా సెంట్రల్ జైలులో దొరకడం సాధారణంగా మారింది. -
వీక్షణం
శాన్ఫ్రాన్సిస్కో (అమెరికా)లోని ఓ దీవిలో అల్కట్రాజ్ అనే జైలు ఉంది. దీనిలో ఖైదీలు ఒక్కొక్కరికీ ఒక్కో ఏసీ గది, మంచి మంచం, మెత్తటి పరుపు, టీవీ ఉంటాయి. స్నానానికి వేణ్నీళ్లు ఇస్తారు. ఖరీదైన భోజనం పెడతారు. లైబ్రరీ, షటిల్ కోర్టు, చిన్న థియేటర్ కూడా ఉంటాయి. మంచి వాతావరణంలో ఉంచితే నేరస్థులు మంచిగా మారతారని ఈ ఏర్పాట్లు చేశారట! రాజ్పుట్లు యుద్ధానికి వెళ్లేటప్పుడు తమ గుర్రాల మూతులకు నకిలీ ఏనుగు తొండాలను తగిలించేవారట. అప్పుడవి పిల్ల ఏనుగుల్లా కనిపిస్తాయి కాబట్టి శత్రువుల ఏనుగులు తమపై దాడి చేయకుండా ఉంటాయని అలా చేసేవారట! కనిపెట్టిన 38 సంవత్సరాలకు గానీ రేడియో 50 మిలియన్ల మందికి చేరువ కాలేకపోయింది. ఫోన్ అయితే 20 ఏళ్లకు, టీవీ 13 ఏళ్లకు, ఫేస్బుక్ 3.6 ఏళ్లకు చేరవయ్యింది. అయితే గూగుల్ ప్లస్ మాత్రం కేవలం 88 రోజులకే యాభై మిలియన్ల మందికి చేరువైపోయింది! 1993లో ఓ వ్యక్తి మిసిసిపీ నదికి, తమ ఊరికి మధ్యన ఉన్న కట్టను పడగొట్టేశాడు. అది కూడా తన భార్య ఆఫీసు నుంచి త్వరగా వచ్చేస్తుందన్న స్వార్థంతో! దానివల్ల ఆ నదికి వరదలు వచ్చినప్పుడు పద్నాలుగు వేల ఎకరాలు నీట మునిగి పోయాయి. ఆగ్రహించిన న్యాయస్థానం అతగాడికి జీవిత ఖైదును విధించింది! సెల్ఫోన్లు వచ్చాక పబ్లిక్ ఫోన్లను వాడటం మానేశారంతా. ఫలితంగా ఫోన్ బూతులు వెలవెలబోతుండటంతో పలు దేశాలు వాటిని తొలగించేశాయి. అయితే ప్రతి విషయాన్నీ క్రియేటివ్‌గా ఆలోచించే జపాన్‌వారు మాత్రం... వాటిని ఇలా అక్వేరియమ్లుగా మార్చేస్తున్నారు. వాళ్ల ఈ ఐడియా అక్కడివారికే కాదు, అన్ని దేశాల వారికీ భలేగా నచ్చింది! -
ఆన్లైన్ మోసం
భారీ గిఫ్టుల పేరిట మెసేజ్‌లు నిలువునా మునిగిపోతున్న వినియోగదారులు పరువుపోతుందని బయటపడని వైనం యలమంచిలి: సెల్ఫోన్లలో భారీ గిఫ్టుల సందేశాలు వినియోగదారులను నిలువునా ముంచేస్తున్నాయి. కొన్ని ప్రైవేట్ కంపెనీల పేర్లతో సెల్‌ఫోన్లద్వారా మెసేజ్‌లు పంపిస్తూ వినియోగదారుల నుంచి ఎక్కువ మొత్తంలో నగదు కాజేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కొం దరు గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారం నడుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ కంపెనీలు, పేరొందిన సంస్థల నుంచి మీకు రూ. కోటి గిప్టుగా వచ్చిందంటూ సెల్‌ఫోన్‌కు మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఇటువంటి మోసాలపై పట్టణప్రాంతాల్లో వినియోగదారులకు అవగాహన ఉండడంతో పెద్దగా స్పందించడంలేదు. ఇప్పుడు మోసగాళ్ల దృష్టి గ్రామీణులపై పడింది. ఏదోలా సెల్‌ఫోన్ నంబర్లను సేకరిస్తున్న వీరు సంబంధిత వినియోగదారులకు మీకు రూ.కోటి గిప్టు వచ్చిందంటూ మెసేజ్ పంపిస్తున్నారు. దానికి స్పందిస్తున్న కొందరు ఫోన్లోనే మాట్లాడుతున్నారు. కంపెనీ గిఫ్టు పొందాలంటే ముం దుగా మీరు రూ. 20వేల నుంచి రూ.30వరకు తమ ఆన్లైన్ అకౌంట్లో జమచేయాలని నమ్మిస్తున్నారు. గిప్టు నగదును ట్యాక్స్ మినహాయించి చెక్ రూపంలో ఇస్తామని నమ్మబలుకుతున్నారు.ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లేడే వారితో ఇవన్నీ చెప్పిస్తున్నారు. నమ్మకం కలగడానికి ఆన్లైన్ అకౌంట్లో నగదును జమచేశాక ఆధార్ కార్డుతో రావాలని సూచిస్తున్నారు. ఇంత పెద్దమొత్తంలో గిప్టు ఏవిధంగా ఇస్తున్నారని ఎవరైనా గట్టిగా నిల దీస్తే ఫోన్ కట్ చేస్తున్నారు. ఆన్లైన్ అకౌం ట్లో సొమ్ము జమచేశాక మోసపోయామని తెలుసుకున్న కొందరు లబోదిబో మంటున్నారు. ఇది మోసమని తెలిసిన కొందరు మెసేజ్‌లను పట్టించుకోవడంలేదు. మరి కొందరు మాత్రం ఆయా మెసేజ్‌ల గురించి సంబంధిత వ్యక్తులతో ఫోన్లో మాట్లాడి అన్లైన్ అకౌంట్లలో సొమ్ము జమచేస్తూ మోసపోతున్నారు. -
వైకుంఠంలో ఇకపై సెల్ఫోన్లు నిషేధం
సాక్షి, తిరుమల: తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్లోకి సెల్ఫోన్లు తీసుకెళ్లటంపై ఇప్పటికే నిషేధం ఉంది. దీన్ని సక్రమంగా అమలు చేయాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని జేఈవో శ్రీనివాసరాజు శనివారం మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది వద్ద సెల్ఫోన్లు ఉండటం వల్ల దర్శన దందా అడ్డూ అదుపూ లేకుండా పోతోందని జేఈవో ఈ నిర్ణయం తీసుకున్నారు. సెల్ఫోన్లతోనే దర్శనాల దందా శ్రీవారి దర్శనానికి మొదటి, రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్లే ప్రధాన ప్రవేశ మార్గాలు. ఇక్కడ ఏఈవో స్థాయి నుంచి అటెండర్ స్థాయి వరకు, ఇతరత్రా భద్రతా సిబ్బంది వందల సంఖ్యలో పని చేస్తుంటారు. భద్రతా కారణాలతో శ్రీవారి ఆలయంతో పాటు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలో సెల్ఫోన్లను నిషేధించారు. అయితే ఈ ఉత్తర్వుల అమలు అంతంత మాత్రంగానే ఉంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు అన్ని విభాగాల సిబ్బంది దర్శనాల దందాకు వినియోగిస్తూ కాసులు దండుకుంటున్నారు. దీనిపై ఈవో, జేఈవోలకు ఫిర్యాదులు కూడా అందాయి. అక్రమ దందాల్లో పాత్రధారులైన అన్ని విభాగాల సిబ్బందిని ఏరివేసే కార్యక్రమానికి తెరతీసారు. రెండు రోజుల ముందు దర్శన దందా చేస్తూ పట్టుబడిన ఓ సూపరిండెంటెంట్తో పాటు మరో పోటు కార్మికుడిపై వేటు వేయాలని నిర్ణయించారు. వైర్లెస్ సెట్లతోనే విధులు నిర్వహించాలి వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లలో దర్శన దందాలకు సెల్ఫోన్లు కూడా ఓ కారణంగా ఉందని జేఈవో భావించారు. గతంలో ఉన్న నిషేధాజ్ఞలనే ఇకపై కచ్చితంగా అమలు చేయాలని శనివారం మరోసారి ఉత్తర్వులు ఇచ్చారు. ఇందులో డెప్యూటీ ఈవో, ఏఈవో అధికారుల మినహా మిగిలిన సిబ్బంది అందరూ టీటీడీ వైర్‌సెల్ సెట్ల ద్వారానే సమాచారాన్ని ఇవ్వాలని ఆదేశాలిచ్చారు. అలా కాదని అతిక్రమిస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. -
విదేశీ విమానాశ్రయాల్లో అమెరికా తనిఖీలు
సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తదితర పరికరాల సోదాపై ప్రత్యేక దృష్టి వాషింగ్టన్: విమానాశ్రయాల్లో తనిఖీని కూడా తప్పించుకోగలిగే సరికొత్త బాంబులను సిరియా, యెమెన్ దేశాల ఇస్లామ్ మిలిటెంట్లు తయారుచేస్తున్నారన్న ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలో అమెరికా మరింత అప్రమత్తమైంది. అమెరికాకు నేరుగా విమాన సదుపాయం ఉన్న వివిధ దేశాల్లోని విమానాశ్రయాల్లో భద్రతను పెంచేందుకు మరిన్ని చర్యలు తీసుకుంది. పవర్ ఆన్చేయని సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విమానాల్లో అనుమతించబోమని, సదరు ఎలెక్ట్రానిక్ పరికరాలు కలిగిఉంటే, విమానం ఎక్కే ముందుగా మరింత నిశితంగా తనిఖీలకు సిద్ధపడాలని అమెరికా స్పష్టంచేసింది. తమతో తీసుకెళ్లే ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేస్తున్నవేనని, అవి పేలుడు వస్తువులు కాదని రుజువు చేసుకునేందుకు వీలుగా, ప్రయాణికులు వాటిని ఆన్‌చేసి ఉంచవలసిందిగా విదేశాల విమానాశ్రయాల్లోని తనిఖీ అధికారులు కోరతారని అమెరికా రవాణా భద్రతా శాఖ పరిపాలనా విభాగం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. చార్జింగ్లేని ఎలక్ట్రానిక్ పరికరాలతో విమానంలో ప్రయాణానికి అనుమతించబోమని కూడా స్పష్టంచేసింది. -
మట్కా మళ్లీ హల్చల్!
జిల్లా వ్యాప్తంగా మట్కా మహమ్మారి ఊడలమర్రిలా విస్తరిస్తోంది. ఇన్నాళ ్లలాగా పొదల మాటున.. రహస్య స్థావరాల్లో.. కాలనీల శివార్లలో చీటీలు రాయడానికి స్వస్తి చెప్పేస్తున్నారు. వివిధ రకాల కంపెనీల పేర్లతో నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ హైటెక్ పద్ధతుల్లో మట్కా నడుపుతున్నారు. సెల్ఫోన్లు ఉపయోగిస్తూ ఇంటర్నెట్ కేంద్రాలను అడ్డాగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తున్నారు. తద్వారా పోలీసు శాఖకు సవాల్ విసురుతున్నారు. ఈ క్రమంలో కొత్తకొత్త బీటర్లు కూడా పెద్ద సంఖ్యలో పుట్టొకొచ్చారు. ఆశకొద్దీ.. రే పో, ఎల్లుండో, ఏదో ఓ రోజు.. భారీ మొత్తం తగలక పోతుందా.. రూ.లక్షలు అందక పోతాయా.. అనే భ్రమలో పేదలు తమ బతుకుల్ని బుగ్గి చేసుకుంటున్నారు. వారు మట్కా వ్యసనాన్ని మానుకునేలా కౌన్సెలింగ్ ఇప్పించడంపై ఉన్నతాధికారులు దృష్టి సారించడం లేదు. అనంతపురం క్రైం, న్యూస్‌లైన్ : సామాన్యులు తమ రక్త మాంసాల్ని కరగదీసుకుని సంపాదిస్తున్న అరకొర ఆదాయాన్ని మట్కా నిర్వాహకులు కొల్లగొడుతున్నారు. రూ.లక్షలు కళ్లజూడచ్చనే ఆశతో వేలాది పేదల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి ఛిద్రమవుతున్నాయి. ఈ క్రమంలో బతుకు భారమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ఈ వ్యసనం నుంచి మాత్రం బయటపడలేకపోతున్నారు. మరి ఈ హైటెక్ మట్కా గురించి పోలీసులకు తెలియదా.. అంటే తెలీదని అయితే చెప్పలేం. దీనిని నియంత్రించాల్సిన వారే.. ‘ఆ.. ఎక్కడ దొరుకుతారండీ వాళ్లు.. సెల్ఫోన్లలో రాస్తున్నార’ంటూ పరోక్షంగా వాస్తవాన్ని ఒప్పేసుకుంటున్నారు. అదే సమయంలో షరా‘మామూళ్ల’ మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. జిల్లాలోని హిందూపురం, కదిరి, గుంతకల్లు, తాడిపత్రి, అనంతపురం, ఉరవకొండ, గుత్తి, తదితర ప్రాంతాల్లో మట్కా జోరుగా సాగుతోంది. అనంతపురం నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన తాడిపత్రి బస్టాండ్, ఆర్టీసీ బస్టాండ్, పోలీస్ కాంప్లెక్స్ ఏరియా, విద్యుత్ నగర్ చౌరస్తా, పాతూరు నీలం థియేటర్ సమీపంలోని పలు ప్రాంతాల్లో సెల్ఫోన్ల ద్వారా మట్కా కార్యకలాపాలను బీటర్లు జోరుగా సాగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రోజువారీ కోట్లాది రూపాయలు ప్రజల కష్టార్జితాన్ని పలు మట్కా కంపెనీ నిర్వాహకులు బీటర్ల ద్వారా దోచుకున్నట్లు ఇప్పటికే నిఘా వర్గాల వద్ద స్పష్టమైన నివేదిక ఉన్నట్లు సమాచారం. నగరంలో వందల సంఖ్యలో బీటర్లు నగరంలో మట్కా నిర్వాహకులు వందల సంఖ్యలో బీటర్లను నియమించుకుంటున్నారు. ఆఖరుకు ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులను సైతం ఈ ఉచ్చులోకి లాగుతున్నారు. వ్యసనాలకు బానిసలైన వారు చాలా సులభంగా ఆకర్షితులవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా దాడుల్లో బీటర్లు పట్టుబడినప్పటికీ.. నిర్వాహకుల జాడ కనుక్కునే దిశగా పోలీసుల దర్యాప్తు సాగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ‘మేము మట్కా రాస్తేనే కదా... వారి చేతులు కూడా తడిసేదం’టూ బీటర్లే వ్యాఖ్యానిస్తున్నారు. పెద్దల్లా చెలామణి అవుతూ... ఒకప్పుడు పూట గడవడమే గగనమైన రోజుల్లో నగర వీధుల్లో చిన్నాచితకా బీటరుగా అవతారమెత్తిన అనేక మంది నేడు నగరంలో నిర్వాహకులుగా చెలామణి అవుతున్నారు. నగరంలో రూ.కోట్లకు పడగలెత్తిన ఆసాముల్లో కనీసం 10 మంది దాకా మట్కా నిర్వాహకులున్నట్లు నిఘా వర్గాలు పేర్కొంటుండడం విశేషం. ఇది కొందరు పోలీసు ఉన్నతాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలూ తీసుకోలేరన్న ఆరోపణలూ వినిపిస్తున్నాయి. కాగా నగరంలో పలు పోలీసు స్టేషన్ల పరిధిలో పాత బీటర్ల కనుసన్నల్లోనే మట్కా సాగుతున్నట్లు సమాచారం. అధికారులకు తెలిసినా.. ఎవరి వాటా వారికి అందుతుండడం వల్ల పట్టించుకోరన్న ఆరోపణలకు కొదువ లేదు. ఇప్పటికే పలు కాలనీల్లో పదుల సంఖ్యలో రహస్య కేంద్రాలు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా మట్కా నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై పోలీసు శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు అందాయని తెలుస్తోంది. ఇకపై దృష్టి సారిస్తాం ఇటీవలి కాలంలో మట్కా మళ్లీ విజృంభిస్తోందని వస్తున్న వార్తలు నిజమే. ఇన్నాళ్లూ ఎన్నికల బందోబస్తు కోసం ఎక్కువ మంది పోలీసులను వినియోగించాల్సి వచ్చింది. ఎన్నికలు ముగిశాక జిల్లాలో ఎక్కడా అల్లర్లు జరగకుండా పోలీసులను మోహరించాల్సి వచ్చింది. ఈ దృష్ట్యా మట్కా కార్యక లాపాలపై దృష్టి సారించలేకపోయాం. ఇప్పుడిప్పుడే రాజకీయంగా పరిస్థితి అదుపులోకి వచ్చినందున మట్కా నిర్వాహకులు, బీటర్లపై దృష్టి సారిస్తాం. - బి.నాగరాజ, డీఎస్పీ, అనంతపురం -
ప్రమాదమని తెలిసినా..!
సీతాఫల్మండి: తొందరగా గమ్యం చేరాలనే తపనతో ప్రాణాలను కూడా లెక్కచేయడంలేదు కొంతమంది ప్రయాణికులు. సెల్ ఫోన్ మాట్లాడుతూ..ఇయర్ ఫోన్లో పాటలు వింటూ ...రైలు పట్టాలను దాటడం వీరికి ఫ్యాషనైంది. ఆనక తమ నిర్లక్ష్యానికి మూల్యం చెల్లించుకోక తప్పడంలేదు. పట్టాలు దాటుతూ మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోవడం చూస్తునే ఉన్నాం. తరచుగా ఇలాంటి వి జరుగుతున్నా ప్రజల్లో మార్పు రావడంలేదు. దీనికి తోడు రైల్వే పోలీసుల నిర్లక్ష్యం. ఫుట్ బోర్డు బ్రిడ్జిలను ఉపయోగించుకోవాలనే విషయాన్ని ప్రయాణికులకు అవగాహన కలిగించలేకపోతున్నారు. దీంతో పట్టాలు దాటేవారి ప్రాణాలు గాలిలో క లిసి పోతున్నాయి. రైల్వే అధికారులు వివిధ రైల్వే స్టేషన్లలో ఫుట్‌బోర్డు బ్రిడ్జిలను నిర్మించినప్పటి కీ వాటి ఉపయోగం అంతంతా మాత్రంగానే ఉంది. తక్కువ సమయంలో పట్టాలు దాటి అవతలికి వెళ్లిపోవచ్చనే ఆతృతతో ప్రమాదాలను సైతం లెక్క చేయడంలేదు. దీనికి తోడు పట్టాలు దాటుతున్న సమయంలో సెల్ఫోన్లో మాట్లాడడం తో వెనుక నుంచి వచ్చే రైలును గమనించక పోవడం తో క్షణకాలంలో ప్రాణాలు కోల్పోతున్నాయి. ము ఖ్యంగా జామైఉస్మానియా, సీతాఫల్మండి, ఆర్ట్స్ కా లేజ్ రైల్వే స్టేషన్లలో నిత్యం జరుగుతున్న తంతు ఇది. ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి రైలు పట్టాల వెంబడి స్థానికులు నివాసం ఉంటుండటం కూడా ఈ ప్రమాదాలకు కార ణంగా మారుతున్నాయి. రైల్వే స్టేషన్ల సమీపంలో నివాసం ఉంటున్న వారు రైల్వే పట్టాలపై రాకుండా ఫెన్సింగ్ వేస్తే ప్రమాదాలు చాలా వరకు నివారించవచ్చని ప్రజలు అంటున్నారు. గతంలో ఈ రైల్వే స్టేషన్లలో పట్టాలు దాటుతున్న మృతి చెందిన వారు అనేకమంది ఉన్నారు. ఇప్పటికైనా రైల్వే పోలీసులు ఫుట్ బోర్డు బ్రిడ్జిలను ఉపయోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.