నల్లగొండ జిల్లా బూదాన్ పోచంపల్లిలోని ఓ పరీక్షా కేంద్రం నుంచి మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
బూదాన్‌పోచంపల్లి: నల్లగొండ జిల్లా బూదాన్ పోచంపల్లిలోని ఓ పరీక్షా కేంద్రం నుంచి మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసిస్టెంట్ జాయింట్ కమిషనర్ వెంకట్రావు బుధవారం మండల కేంద్రంలోని పోచంపల్లి పీపుల్స్ స్కూల్‌ను తనిఖీ చేశారు. నిబంధనల ప్రకారం పదో తరగతి పరీక్షా కేంద్రాలకు సెల్‌ఫోన్లు తీసుకురాకూడదు. కానీ ఇన్విజిలేటర్లు కొందరు సెల్‌ఫోన్లు తీసుకొచ్చి కార్యాలయంలోని బీరువాలో ఉంచగా ఎనిమిది ఫోన్లలను ఏజేసీ సీజ్ చేశారు. ఫోన్లను తీసుకొచ్చిన వారికి మెమోలు జారీ చేస్తామన్నారు.