చర్లపల్లి జైల్లో మళ్లీ సెల్ ఫోన్లు, గంజాయి | Cell phones, ganja seized in Cherlapally jail | Sakshi
Sakshi News home page

చర్లపల్లి జైల్లో మళ్లీ సెల్ ఫోన్లు, గంజాయి

Published Tue, Sep 23 2014 9:17 AM | Last Updated on Sat, Sep 2 2017 1:51 PM

చర్లపల్లి జైల్లో మళ్లీ సెల్ ఫోన్లు, గంజాయి

చర్లపల్లి జైల్లో మళ్లీ సెల్ ఫోన్లు, గంజాయి

హైదరాబాద్: చర్లపల్లి సెంట్రల్ జైల్లో ఓ ఖైదీ న్యాయవాదికి ఫోన్ చేసి... తనకు బెయిల్ ఇప్పించాలంటూ కోరిన విషయం సోమవారం ఓ టీవీ చానల్లో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో జైళ్లశాఖ ఉన్నతాధికారులు చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో చర్లపల్లి జైల్లో గత అర్థరాత్రి జైలు సిబ్బంది సమక్షంలో పోలీసు ఉన్నతాధికారులు తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఖైదీల వద్ద 6 సెల్ ఫోన్లతోపాటు 50 గ్రామలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఖైదీల వద్దకు సెల్ఫోన్లు, గంజాయి ఎలా వెళ్లిందని ఉన్నతాధికారులు జైలు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. దీంతో జైలు సిబ్బంది నీళ్లునముతున్నారు. దాంతో ఆగ్రహించిన ఉన్నతాధికారులు జైలు సిబ్బందిపై చర్యలకు సమయత్తమవుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement