సాక్షి, విశాఖ: విశాఖపట్నంలోని సెంట్రల్ జైలులో అసలేం జరుగుతోంది. ఇటీవల జైలులో సెల్‌ఫోన్స్ దొరికిన ఘటనపై దర్యాప్తు జరుగుతున్న క్రమంలోనే మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. సెంట్రల్ జైలులో గంజాయి దొరకడం తీవ్ర కలకలం సృష్టించింది.
వివరాల ప్రకారం.. విశాఖ సెంట్రల్ జైలులో గంజాయి దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఖైదీలే ఇక్కడ గంజాయి సాగు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక జైలు సూపరింటెండెంట్ మార్పు జరిగింది. ఇక, ఏదీ జరిగినా హోం మంత్రి అనిత.. గత ప్రభుత్వంపైకి నెట్టేస్తున్నారు. అయితే, విశాఖ సెంట్రల్ జైలులో నిఘా కొరవడినట్టు ప్రత్యక్షంగానే తెలుస్తోంది. దీని బట్టి కూటమి ప్రభుత్వ పాలనలో గంజాయి విచ్చలవిడిగా రవాణా జరుగుతున్నట్టు అర్థమవుతోంది. కట్టుదిట్టమైన జైలులో సైతం గంజాయి గుప్పుమనడంతో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉండగా.. విశాఖ సెంట్రల్ జైలులో సెల్ ఫోన్లు దొరకడం సంచలనంగా మారింది. జైలు అధికారులు రెగ్యులర్ తనిఖీల్లో భాగంగా నర్మదా బ్లాక్, పెన్నా బ్యారక్ సమీపంలో పోలీసులకు సెల్ ఫోన్స్ దొరికాయి. నాలుగు రోజుల క్రితం మూడు సెల్ ఫోన్లను అధికారులు గుర్తించారు. సిమ్ కార్డులేని మొబైల్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్యారక్ సమీపంలోని పూల కుండీ వద్ద భూమిలో నాలుగు అడుగల లోతున ఫోన్లను పాతిపెట్టారు. ఫోన్లను ప్యాక్ చేసి గుంతలో దాచిపెట్టారు. రెండు రాళ్లు కప్పి పైన పూల కుండీ పెట్టారు. దీంతో, సెల్ ఫోన్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో అధికారులు రంగంలోకి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment