
తాడేపల్లిగూడెం అర్బన్: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గంజాయి అక్రమ రవాణా(Ganja smuggling) చేస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ విశ్వనాథ్(Vishwanath) సోమవారం తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. పట్టణంలోని రైల్వే గూడ్స్ షెడ్డు రోడ్డులో మోటారు సైకిల్ పార్కింగ్ వద్ద కొందరు వ్యక్తులు గంజాయిని తీసుకువెళ్తున్నారని సమాచారం రావడంతో ఆ ప్రాంతానికి వెళ్లి.. ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
వారి వద్ద నుంచి రూ.1.30 లక్షల విలువైన 13.288 కిలోల గంజాయిని స్వాదీనం(Ganja possession) చేసుకున్నట్టు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నల్లి శ్రీనివాస్, కరాటం బాలకృష్ణ, కంకిపాటి నాగరాజు, గుండుగోలు మురళి, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన ముసునూరి దుర్గాప్రసాద్‌లను అరెస్టు చేసినట్టు వెల్లడించారు. గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పట్టణ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు డీఎస్పీ విశ్వనాథ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment