ganja case
-
విశాఖ నగరంలో గంజాయి కలకలం
విశాఖపట్నం, సాక్షి: శాంతిభద్రతలు క్షీణించడంపై చర్చ నడుస్తున్న వేళ.. నగరంలో మరోవైపు సంచలనం వెలుగు చూసింది. విశాఖలో గంజాయి కలకలం రేగింది. హోం మంత్రి అనిత నివాసానికి సమీపంలోనే ఉండడం గమనార్హం.లేడీస్ హాస్టల్ వెనుక ఉన్న కేజీహెచ్ కొండ ప్రాంతంలో గంజాయి ముఠా గుట్టు రట్టైంది.. ఏజెన్సీ నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ పండిస్తోంది ఓ ముఠా. తాము సేవించడమే కాకుండా.. మిగతాది నగరంలోని విద్యార్థులకు విక్రయిస్తోంది. ఈ గ్యాంగ్ గురించి పక్కా సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు.. దాడులు జరిపారు. ఐదుగురు ముఠా సభ్యుల గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. అందులో ఇద్దరు పారిపోగా.. ముగ్గురు మాత్రం దొరికారు. వీళ్లలో ఒక మైనర్ ఉండడం గమనార్హం. ఈ ప్రాంతం హోం మంత్రి అనిత నివాసానికి కేవలం 3 కి.మీ. లోపే ఉంది. నావికా దళం(నేవీ) ఆధీనంలో ఉండడం, పైగా హోం మంత్రి నివాస సమీపంలోనే గంజాయి సాగు జరగడం ఒక్కసారిగా విశాఖను ఉలిక్కి పడేలా చేసింది. ఈ ముఠా ఎవరెవరకి సప్లయ్ చేసిందనే దానిపై నిందితుల్ని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఆదిలాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత
-
గల్లీ గల్లీలో గంజాయి!
సాక్షి, హైదరాబాద్: సింబయోసిస్ కాలేజీలో 25 మంది.. గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో 15 మంది.. ఉస్మానియా ఆస్పత్రి జూనియర్ డాక్టర్లు ఆరుగురు.. జోగిపేట జేఎన్టీయూలోని విద్యార్థులు ముగ్గురు.. .. ఇదేదో మెడల్స్ గెల్చుకున్న వారి జాబితా కాదు.. గంజాయికి అలవాటు పడి గత నెలలో ‘యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (ఏఎన్‌బీ)’అధికారులకు పట్టుబడినవారి జాబితా. ఇంకా ఇలాంటి ఘటనలు మరెన్నో. ధర తక్కువ, లభ్యత ఎక్కువ అన్నట్టుగా గంజాయి విక్రయాలు సాగుతుండటంతో.. యువత, విద్యార్థులు దానికి బానిసలుగా మారుతున్నారు. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య డ్రగ్స్‌కు సంబంధించి రాష్ట్రంలో 938 కేసులు నమోదుకాగా.. 1,921 మంది అరెస్టయ్యారు. ఇందులో 816 కేసులు (86.99 శాతం), 1,649 మంది (85.84 శాతం) గంజాయి విక్రయాలు, వినియోగానికి సంబంధించినవే కావడం గమనార్హం. కేంద్రం ఆ«దీనంలో పనిచేసే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) కూడా గంజాయి అక్రమ రవాణాపై దృష్టి పెడుతున్నాయంటే.. పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.వివిధ రూపాల్లో వాడుతూ.. రాష్ట్రంలో గంజాయికి అలవాటుపడ్డ వారిలో చాలా మంది నేరుగా వాడుతుండగా.. కొందరు మాత్రం దీని అనుబంధ ఉత్పత్తులైన చరస్, హషీష్ ఆయిల్, బంగ్ తదితర రూపాలను వినియోగిస్తున్నారు. సాధారణంగా యువత హైసూ్కల్, జూనియర్ కాలేజీ స్థాయిలో తొలుత సిగరెట్‌కు అలవాటు పడుతున్నారు. తర్వాత సొంతంగానో, స్నేహితుల ద్వారానో గంజాయికి అలవాటు పడుతున్నారు. గంజాయి విక్రయదారులు.. వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్‌ల ద్వారా అమ్ముతుండటంతో సులభంగా దొరుకుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గంజాయి నియంత్రణపై మరింత ఫోకస్ చేయాలని సామాజికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.ఒడిశా నుంచి రాష్ట్రంలోకి.. గంజాయి ఎక్కువగా ఒడిశాలో సాగవుతోంది. అక్కడ నుంచి ఛత్తీస్‌గఢ్, ఖమ్మం జిల్లా మీదుగా రాష్ట్రంలోకి వస్తోంది. కొన్నిసార్లు ఆంధ్రా–ఒడిశా బోర్డర్ నుంచి ఏపీలోని కొన్ని ప్రాంతాలను దాటుకుని ఇక్కడికి తెస్తున్నారు. ప్రత్యేకంగా డిజైన్ చేసిన వాహనాలు, ఆరీ్టసీ/ప్రైవేట్ బస్సులతోపాటు రైళ్లల్లోనూ గంజాయి హైదరాబాద్‌కు చేరుతోంది. గాంజాతోపాటు పాట్, హష్, స్టఫ్, స్టాష్.. ఇలా పలు ప్రత్యేక పదాలతో దీని విక్రయాలు జరుగుతున్నాయి. కొకైన్, హెరాయిన్, ఎల్ఏస్డీ వంటి డ్రగ్స్ ఒక గ్రాముకు లేదా ఒక డోసుకు రూ.2 వేల నుంచి రూ.8 వేల వరకు కావాలి. అదే గంజాయి రూ.500 నుంచి రూ.1,000 వరకు వెచి్చస్తే 100 గ్రాములు దొరుకుతోంది. పైగా దీన్ని సిగరెట్ స్ట్రిప్లలో పెట్టుకుని బహిరంగంగా కాల్చే అవకాశం ఉండటంతో.. చాలా మంది గంజాయికి అలవాటు పడుతున్నారు. ఇక ధనికవర్గాలకు చెందినవారు హిమాచల్ ప్రదేశ్‌లోని కస్సోల్ ప్రాంతం నుంచి వచ్చే ఖరీదైన ప్రత్యేక గంజాయిని వినియోగిస్తున్నట్టు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. ఒడిశా నుంచి వచ్చే గంజాయిలోనూ శీలావతి, గ్రీన్ రకాలకు డిమాండ్, రేటు ఎక్కువగా ఉంటుందని అంటున్నాయి.ప్రాణాలు తీస్తున్న ‘గంజా’మత్తు!హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీకి చెందిన పి.రాజు గంజాయికి బానిసయ్యాడు. ఆ మత్తులోనే తన ఇంటి సమీపంలో నివసించే ఆరేళ్ల చిన్నారిని తన గదిలోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. చిన్నారి చనిపోవడంతో మృతదేహాన్ని ఇంట్లోనే వదిలి పరారయ్యాడు. రాజు కోసం పోలీసుల గాలింపు చేపట్టడంతో.. వరంగల్ జిల్లాలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మంలోని రోటరీనగర్‌కు చెందిన అమరబోయిన ఉదయ్‌కుమార్ తన అమ్మమ్మ రాంబా యమ్మ దగ్గర ఉంటున్నాడు. పదో తరగతి మొదటి శ్రేణిలో ఉత్తీర్ణుడైన ఉదయ్.. డిప్లొమా లో చేరాక గంజాయికి అలవాటుపడ్డాడు. గంజాయి కోసం డబ్బులు కావాలని అమ్మమ్మపై ఒత్తిడి చేశాడు. ఆమె ఇవ్వకపోవడంతో ఓ రోజు రాత్రి 11.30 గంటలకు హత్య చేశాడు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌కు చెందిన నవీన్ గంజాయి మత్తులో ఓ వ్యక్తిపై గొడలితో దాడి చేసి చంపేశాడు. బెయిల్ వచ్చాక గంజాయి మత్తులో గ్రామస్తులతో ఘర్షణకు దిగడంతో మళ్లీ జైలుకు వెళ్లాడు. గ్రామంలో మంచి పేరున్న వ్యవసాయ కుటుంబానికి చెందిన నవీవ్ గంజాయికి బానిసగా మారడంతో.. ఆ ప్రభావం కుటుంబానికి చెందినవారందరిపై పడింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లులో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. పక్కన మరో మిల్లులో హమాలీగా పనిచేస్తున్నా బీహార్ వలస కూలీ వినోద్ మాజ్హి గంజాయి మత్తులో.. ఆ దంపతుల ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, చంపేశాడు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని గోపాల్‌రావుపేటకు చెందిన సురేశ్ పద్దెనిమిదేళ్ల వయసులోనే గంజాయికి బానిసయ్యాడు. మితిమీరి గంజాయి తీసుకోవడంతో చనిపోయాడు.వెంటనే బానిసలవుతారు మద్యం తాగేవాళ్లు కనీసం ఓ ఏడాది నుంచి గరిష్టంగా పదేళ్లపాటు తాగుతూ ఉంటేనే.. దానికి బానిసలుగా మారుతారు. అదే గంజాయి విషయంలో కొన్నిరోజుల్లోనే బానిసలవుతారు. గంజాయి తీసుకున్న వ్యక్తులు మానసికంగా కృత్రిమ ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌కు గురవుతారు. కానీ దీని వినియోగం పెరిగిపోతే.. సైకోసిస్ సహా అనేక మానసిక రుగ్మతలు వస్తాయి. కొందరు హింసాత్మకంగా, విచక్షణ కోల్పోయి ప్రవర్తిస్తుంటారు. ఈ కారణంగానే అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. – ప్రతాప్ రాజన్, క్లినికల్ సైకాలజిస్ట్803 కిలోల గంజాయి పట్టివేతరూ.2.81 కోట్ల విలువ ఉంటుందన్న పోలీసులుశంషాబాద్ రూరల్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. ఒక డీసీఎం వ్యాన్‌లో తరలిస్తున్న 803 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్ఓటీ విభాగం, శంషాబాద్ పోలీసులు ఆదివారం రాత్రి స్వా«దీనం చేసుకున్నారు. దీని విలువ రూ.2.81 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఒడిశా నుంచి రాష్ట్రం మీదుగా మహారాష్ట్రకు ఈ గంజాయిని తరలిస్తున్నట్టుగా గుర్తించామని పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. పెద్ద గోల్కొండ శివారులో ఔటర్ రింగు రోడ్డుపై మాటువేసి పట్టుకున్నామని వెల్లడించారు. ఒడిశాకు చెందిన కమిషన్ ఏజెంట్ సోమనాథ్ ఖార, డీసీఎం డ్రైవర్లు హెచ్ఎస్ విఠల్‌రెడ్డి, సంజీవ్కుమార్తోపాటు సునీల్ ఖోస్లా, జగ సునను అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. గంజాయి తరలింపు సూత్రధారులైన ఏపీలోని అరకు వాసి రాము, మహారాష్ట్ర వాసి సురేశ్ మారుతి పాటిల్ పరారీలో ఉన్నట్టు వివరించారు. తరలింపు ప్లాన్ ఇదీ.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అరకువాసి రాము గంజాయి సరఫరాదారు.. అతడి వద్ద సోమనాథ ఖార పనిచేస్తున్నాడు. వారు ఇటీవల డీసీఎం యజమాని విఠల్‌రెడ్డితో ఒప్పందం చేసుకున్నారు. వైజాగ్ పరిసరాల్లో గూడ్స్ డెలివరీ కోసం వస్తే తమకు చెప్పాలన్నారు. విఠల్‌రెడ్డికి గత నెల 30న పటాన్చెరు నుంచి వైజాగ్ సరకు తరలించే ఆర్డర్ వచ్చింది. ఆ సరుకును డెలివరీ చేశాక.. ఈ నెల 1న వైజాగ్‌లోని సెజ్‌లో ఉన్న ఓ కంపెనీ నుంచి కెమికల్ సాల్వెంట్స్ తీసుకుని బయలుదేరారు. మధ్యలో గంజాయి బస్తాలను నింపారు. సోమనాథ్ ఖార ముందు ఓ కారులో వెళ్తుండగా.. వెనకాల డీసీఎం వచ్చింది. గంజాయిని హైదరాబాద్‌లోని పటాన్చెరు వరకు తీసుకొచ్చి అక్కడ సురేశ్పాటిల్కు అప్పగిస్తే.. అతను వేరే వాహనంలో గంజాయిని మహారాష్ట్రకు తీసుకెళ్లేలా ప్లాన్ వేసుకున్నారు. కానీ పోలీసులు పట్టుకున్నారు. -
రేపల్లెలో శృతిమించిన టీడీపీ దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ వారి దౌర్జన్యం శృతిమించింది. కూటమి అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులు, స్థానికసంస్థల ప్రజాప్రతినిధులపై దాడులకు దిగి భయభ్రాంతులకు గురిచేసిన టీడీపీ నేతలు ఇప్పుడు పోలీసుల మీద ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసులు పెడుతున్నారు. గంజాయి కేసుల్లో ఇరికిస్తున్నారు. అధికారపక్షం కావడంతో పోలీసులు వారు చెప్పినట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా రేపల్లెకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు రాజ్‌పాల్‌పై పోలీసులు గాంజా కేసు నమోదు చేశారు. ఇటీవల గంజాయితో పట్టుబడిన ముఠాలో రాజ్‌పాల్ లేకున్నా పోలీసులు కేసులో అతడి పేరు చేర్చారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. వాస్తవానికి రాజ్‌పాల్ ఓట్ల› లెక్కింపు అనంతరం టీడీపీ నేతల బెదిరింపులతో ఊరువదలి వెళ్లిపోయారు. అప్పటినుంచి ఇప్పటివరకు రేపల్లెకు రాలేదు. అయినా పోలీసులు అతడిపై గాంజా కేసు నమోదు చేశారు. తప్పుడు కేసులు మానుకోవాలి అధికారం శాశ్వతం కాదని, టీడీపీ నేతలు ఇప్పటికైనా తెలుసుకుని వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు పేర్కొన్నారు. రేపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేతల ఆగడాలు శృతిమించాయన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, పోలీసుల ద్వారా తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారని చెప్పారు. ఇప్పటికైనా మారకపోతే తాము రోడ్డెక్కి ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు. రేపల్లెకు చెందిన తమ పార్టీ కార్యకర్త రాజ్‌పాల్ యాదవ్‌పై పోలీసులతో అధికారపార్టీ నేతలు గంజాయి కేసు పెట్టించడం దారుణమన్నారు. పోలింగ్ నాడు టీడీపీ నాయకుడితో రాజ్‌పాల్ గొడవ పడ్డారని, ఆ కక్షతోనే ఇప్పుడు అతడిపై గంజాయి కేసు పెట్టించారని చెప్పారు. ఓట్ల లెక్కింపు తర్వాత టీడీపీ వారి దాడులు పెరగడంతో రాజ్‌పాల్, మరికొందరు ఊరు వదలి వెళ్లారని తెలిపారు. తరువాత ఇప్పటికీ రాజ్‌పాల్ రేపల్లె రాలేదని చెప్పారు. రాజ్‌పాల్ గంజాయి విక్రయిస్తుండగా పట్టుకోబోతే పరారయ్యాడని పోలీసులు కట్టుకథ అల్లి అతడిపై కేసు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ వారు దాడులు చేస్తారని ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్న రాజ్‌పాల్‌పై తప్పుడు కేసు పెట్టడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. పార్టీలు అధికారంలోకి రావడం, పోవడం సర్వసాధారణమన్నారు. ఇలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు అంతా గమనిస్తున్నారన్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు పద్ధతి మార్చుకోవాలని ఆయన సూచించారు. -
డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాల విక్రయాలపై పోలీసుల ఉక్కుపాదం
-
సెలబ్రిటీలుగా ఫేమస్ అయితే మారిపోతారా
-
షణ్ముక్.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా..?
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయిన తర్వాత రోజూ పలు కథనాలు వస్తూనే ఉన్నాయి. వాస్తవంగా షణ్ముక్ అన్నయ్య సంపత్‌పై ఓ యువతి ఫిర్యాదు చేసి పోలీసులతో పాటుగా వారి ఫ్లాట్‌కు వెళ్లింది. ఆ సమయంలో షన్ను గంజాయి సేవిస్తూ ఉన్నాడని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ సందర్భంలో తీసిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అక్కడ తన సోదరుడి ప్రియురాలిపై షన్ను ఫైర్ అయ్యాడు. నేనే డిప్రెషన్లో ఉన్నానంటూనే.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని వ్యాఖ్యలు చేశాడు. దీనిని బట్టి చూస్తే అతను ఏదో మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు తెలుస్తోంది. డిప్రెషన్లోనే షణ్ముక్ గంజాయి సేవిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాదక ద్రవ్యాలకు ఎలా అడిక్ట్ అవుతున్నారు..? మాదక ద్రవ్యాల సరఫరా మన చుట్టూ ఒక చెయిన్‌లా సాగుతుంది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఉండే కిళ్లీ దుకాణాలు, కాఫీ షాపుల ద్వారా కూడా వీటి సరఫరా సాగుతూనే ఉంటుంది. సెలబ్రిటీలను హైక్లాస్ పార్టీలకు పిలిచి ఉచితంగా మద్యం సరఫరా చేస్తామని చెబుతూ మొదలైన ఈ వ్యవహారం క్రమంగా వారిని డార్క్ వెబ్‌కు కనెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత డెలివెరీ బాయ్స్ ద్వారా నేరుగా వారి ఇంటికే సరఫరా చేసే వరకూ కథ చేరుతుంది. ఇదే విషయాన్ని గతంలో పోలీసు శాఖ వారు వివిధ సందర్భాల్లో చెప్పారు. ఎలాంటి వారు బానిసలుగా మారుతున్నారు..? ఆర్థిక సమస్యలు, ప్రేమ విఫలం, ఒత్తిడి, మోసాలు, విరక్తి.. ఇలా కారణం ఏదైనా కావొచ్చు.. తాత్కాలిక సమస్యల్ని ఎదుర్కోలేక చాలా మంది క్షణికావేశంలో నిండు నూరేళ్ల జీవితాన్ని మధ్యలోనే త్యజిస్తున్నారు. స్టార్ హోదా.. డబ్బు.. అభిమానులు.. గొప్ప పేరు ఉన్న సినీ నటులు కూడా ఆత్మహత్య చేసుకుని వార్తల్లో నిలుస్తున్నారు. నాటి సిల్క్‌స్మిత నుంచి బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ వరకూ ఇలా ఆత్మహత్యలకు పాల్పడిన తారలెందరో ఉన్నారు. తాజాగా పోలీసుల ముందు షణ్ముక్ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. గంజాయి లాంటివి తీసుకునేటప్పుడు స్కిజోపెర్నియాలాంటి తీవ్రమైన మానసిక సమస్యలు కనిపించడంతో పాటు వారి మూడ్‌లో మార్పులు, మానసిక ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. మత్తు పదార్థాలను ఇంజెక్షన్లు ద్వారా తీసుకోవడం వల్ల హెచ్ ఐ వి లాంటి వి వచ్చే ముప్పు కూడా ఉందని వైద్యులు చెబుతున్న మాట. డిప్రెషన్లో ఉన్నానని షణ్ముఖ్ ఎందుకు అన్నారు షణ్ముక్ ఇంటికి వెళ్లిన సమయంలో అతను ఇలాంటి మాటే అన్నాడు.. తను పూర్తిగా డిప్రెషన్లో ఉన్నట్లు చెప్పాడు. కొంత సమయం పాటు తన అన్నయ్య ప్రియురాలిపై ఫైర్ అయ్యాడు. వాస్తంగా షణ్ముక్ తన కెరియర్ను చాలా కష్టపడి బిల్డ్ చేసుకున్నాడు. ఒక సాధారణ యూట్యూబర్‌గా ప్రారంభమైన తన జీవితం.. బిగ్ బాస్ వరకు తీసుకోచ్చింది. ఆయన తీసిన షార్ట్ ఫిలింస్‌కు బాగా చదువుకున్న యువకులే ఎక్కువగా అడిక్ట్ అయ్యారు.. వాటిలో కంటెంట్ కూడా మధ్యతరగతి వర్గాలకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అంతలా యూత్‌ను ఆకర్షించిన షన్ను ఇప్పుడు డిప్రెషన్‌కు చేరుకునే స్థాయికి ఎందకు చేరుకున్నాడో తెలియదు. కానీ షన్ను వ్యక్తిగత జీవితంలో ప్రేమించిన అమ్మాయి దూరం కావడం వల్లే ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్లాడని కొందరు చెబుతున్న మాట. మరికొందరేమో బిగ్ బాస్ నుంచి వచ్చాక భారీగా ఆఫర్లు వస్తాయని అనుకుంటే కెరియర్ పరంగా మునపటి కంటే మరింత డౌన్ కావడమని చెబుతున్నారు. ఈ రెండు కారణాలతోనే షన్ను తీవ్ర నిరాశకు గురి కావడం జరిగిందని చెబుతున్నారు. డ్రగ్స్‌కు బానిసై పడి లేచిన కెరటాన్ని గుర్తు చేసుకోండి అమెరికా వెటరన్ స్విమ్మర్ ఆంటోనీ ఇర్విన్ ఎంతో మందికి స్పూర్తి.. 2004లో సిడ్నీ ఒలింపిక్స్‌లో 19 ఏళ్లకే బంగారు పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇంకేముంది విపరీతమైన క్రేజ్ తన సొంతమైంది. లగ్జరీ జీవితానికి అలవాటు పడ్డాడు. మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎప్పుడూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచేవాడు. ఇష్టరీతిన బైక్ రైడింగ్ చేస్తూ పట్టుబడటం, అధికారులు హెచ్చరించి వదిలిపెడితే.. మళ్లీ తనకు నచ్చినట్లుగా జీవితాన్ని లీడ్ చేశాడు. చివరకు వింత వ్యాధి(టోరెట్ సిండ్రోమ్)తో నిత్యం అవస్థపడేవాడు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఇర్విన్.. ఆత్మహత్యాయత్నం చేసినా ప్రాణాలతో బయటపడ్డాడు. భగవంతుడు తనకు పునర్జన్మ ప్రసాదించాడని మళ్లీ స్విమ్మర్‌గా అవతారమెత్తాడు. 2016 రియో ఓలింపిక్స్లో పాల్గొని రెండు స్వర్ణాలు కైవసం చేసుకుని లేటు వయసులో స్వర్ణం కొల్లగొట్టిన అమెరికన్ స్విమ్మర్‌గా రికార్డులకెక్కాడు. డ్రగ్స్‌కు ఫుల్స్టాప్ పెట్టి ప్రస్తుతం కూడా రేసులో ఉన్నాడు. మాదక ద్రవ్యాలు తీసుకునే వారిని నేరస్థుల్లా చూడటం మానేసి, వారిని డీఅడిక్ట్ చేసేందుకు సహకారం అందించాల్సిన అవసరముంది. దీనికి తల్లి తండ్రులు, డాక్టర్లు, సమాజం, మీడియా కూడా సహకారం అందించాలని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మానసిక ఒత్తిడి తట్టుకోలేని వారే ఎక్కువగా ఇలాంటి వాటికి అడిక్ట్ అవుతారని పలువురు వైద్యులు తెలిపారు. -
షణ్ముక్ సోదరుడి మరిన్ని ఆగడాలు.. బాధితులు చాలామందే
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ అలియాస్ షన్ను.. ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాడు. అయితే ఓ అమ్మాయి.. షణ్ముక్ సోదరుడు సంపత్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఇంటికి వెళ్లారు. అక్కడ అనుకోని విధంగా గంజాయితో షణ్ముక్ పట్టుబడ్డాడు. అయితే ఈ కేసులో అనుహ్యంగా మరికొన్ని నిజాలు బయటకొస్తున్నాయి. చాలామంది అమ్మాయిలు షన్ను సోదరుడి వల్ల మోసపోయినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) యూట్యూబర్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన షణ్ముక్ జస్వంత్‌కి సంపత్ అని అన్న ఉన్నాడు. అయితే ఇతడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన నమ్మించి మోసం చేయడంతో ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్ కూడా ఇచ్చారు. అయితే ఈ కేసు వల్ల సంపత్ వల్ల మోసపోయిన బాధితులు మరికొందరు బయటకు వస్తున్నారు. సంపత్.. తన ఎంబీఏ క్లాస్మేట్ అయిన ఓ యువతి దగ్గర 2016లో థిక్ షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెడదామని చెప్పి రూ.20 లక్షలు తీసుకున్నాడట. నెలకు రూ.7 వేలు లాభం మాత్రమే చూపించాడట. దీంతో మొత్తం డబ్బులు ఇచ్చేయమని అమ్మాయి అడగ్గా.. సంపత్ ఈమెని బ్లాక్ చేశాడట. ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి ఆరు రోజులు ఉందనగా ఓ లేడీ డాక్టర్‌తో పెళ్లికి రెడీ అయ్యాడట. ముంబయిలో మరో యువతిని ఇప్పటికే సంపత్ పెళ్లి చేసుకున్నాడట. ఇలా సంపత్ బారిన పడి చాలామంది అమ్మాయిలు మోసపోయినట్లు, వీళ్లందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
షణ్ముఖ్ గంజాయి కథ
-
గంజాయి అమ్ముతూ పట్టుబడ్డ టీడీపీ నేతలు
-
బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం.. విషయం బయటకు పొక్కకుండా
సాక్షి, ఆదిలాబాద్: బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి తాగుతూ విద్యార్థులు పట్టుబడటం స్థానికంగా కలకలం రేపింది. కళాశాలలోని బాయ్స్ హాస్టల్–1లో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకోగా, శనివారం బాసర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ట్రిపుల్ ఐటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాకు చెందిన ఓ విద్యార్థి, కరీంనగర్ జిల్లాకు చెందిన మరో విద్యార్థి తమ హాస్టల్ రూమ్‌లో శుక్రవారం గంజాయి తాగుతూ సిబ్బందికి పట్టుబడ్డారు. వీరిపై కేసు నమోదు చేసి, ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు ముధోల్ సీఐ వినోద్‌రెడ్డి తెలిపారు. ఈ విద్యార్థుల నుంచి 100 గ్రాములకుపైగా గంజాయి లభ్యమైనట్లు సమాచారం. ఎలా వచ్చింది? స్థానికంగా కళాశాలలో డీఎస్పీ, సీఐతోపాటు 200 మందికిపైగా సెక్యూరిటీ సిబ్బంది భద్రతను పర్యవేక్షిస్తుంటారు. ఇంత భద్రత నడుమ కళాశాలలోకి గంజాయి ఎలా వచ్చిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సెలవులపై ఇంటికి వెళ్లిన విద్యార్థులు తమతోపాటుగా గంజాయిని తెచ్చుకున్నారా? లేక స్థానికంగా పనిచేస్తున్న సిబ్బంది ఎవరైనా సరఫరా చేస్తున్నారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. విషయం బయటకు పొక్కకుండా హాస్టల్ గదిలో విద్యార్థులు గంజాయి తాగుతున్నట్లు పక్కా సమాచారం తెలుసుకున్న సిబ్బంది వారి రూమ్‌ను తనిఖీ చేశారు. గంజాయి తాగుతున్నట్లు నిర్ధారణ అయిన తర్వాత విషయం బయటకు రాకుండా జాగ్రత్త వహించారు. తనిఖీ చేస్తున్న సమయంలో స్థానికంగా సిబ్బందికి సెల్‌ఫోన్ కూడా అనుమతించకుండా గోప్యత వహించారు. కానీ చివరకు విషయం బయటపడడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: Hyderabad: మట్టి ప్రతిమలకే జై కొడుతున్న నగరవాసులు -
గంజాయి సరఫరా కేసులో అసిస్టెంట్ డైరెక్టర్ అరెస్ట్
గంజాయి సరఫరా కేసులో సినీ అసిస్టెంట్ డైరెక్టర్ హాథీరామ్ను రాచకోండ పోలీసులు అరెస్టు చేశారు. చాలా కాలం నుంచి సినిమా ఆర్టిస్టులకు హాథీరామ్ గంజాయి సరఫరా చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అతని దగ్గర నుంచి దాదాపు 190 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హాథీరామ్ కొంతకాలంగా కర్ణాటక రాష్ట్రం నుంచి హైదరాబాద్‌కు గంజాయిని సరఫరా చేస్తున్నట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. కురుక్షేత్రం, యుద్ధం శరణం గచ్చామి సినిమాలకు హాథీరామ్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి కారులో గంజాయిని హాథీరామ్ సరఫరా చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. దీనిపై తమకు కొద్ది రోజుల క్రితమే సమాచారం అందిందని. సోమవారం ఖచ్చితమైన సమాచారం అందడంతో దాడి చేశామన్నారు. ఈ కేసులో హథిరామ్తో పాటు మరో ఆరుగురిని అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు రాచకొండ పోలీసులు తెలిపారు. ఈ కేసులో హాథీరామ్ను ఏ2 నిందితుడిగా ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి గదిలో గంజాయి
సాక్షి, రాజాం : నగర పంచాయతీ పరిధి డోలపేటలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఉంటున్న గదిలో బుధవారం గంజాయి లభ్యమైంది. విద్యార్థుల ప్రవర్తనలో వస్తున్న మార్పులను స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో పట్టణ సీఐ జి.సోమశేఖర్ తన సిబ్బందితో దాడి చేశారు. విద్యార్థి తన బ్యాగ్‌లో దాచుకున్న కిలో 25 గ్రాముల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. డోలపేటలో నివాసం ఉంటున్న ఇంజినీరింగ్ విద్యార్థి మత్తుకు బానిసై డోలపేటలో ఉంటున్న మరో వ్యక్తి మండల శ్రీనుని ఆశ్రయించాడు. దీంతో వారిరువురు కిలో 25 గ్రాముల గంజాయిని తెచ్చుకుని వారు సేవించడంతోపాటు మరికొంత విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సమయంలో స్థానికులు అందించిన సమాచారం మేరకు వారి రూమ్‌ను సోదా చేశామని సీఐ తెలిపారు. గంజాయితోపాటు వారిరువురిని అదుపులోకి తీసుకుని తహశీల్దార్ ఎదుట ప్రవేశపెట్టామని చెప్పారు. తహశీల్దార్ ఆదేశాల మేరకు రిమాం డ్ పంపిస్తున్నట్లు తెలిపారు. అన్ని తరగతుల్లో మెరిట్ స్టూడెంట్‌గా ఉన్న విద్యార్థి ఇలా గంజా యి వ్యవహారంలో పట్టుబడడంతో తోటి విద్యార్థులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజాంకు పాకిన గంజాయి వ్యాపారం నిన్న మొన్నటి వరకు పీడించిన క్రికెట్ బెట్టింగ్‌లు, కబడ్డీ బెట్టింగ్‌లతోపాటు ప్రస్తుతం గంజాయి మత్తు కూడా యువతను ఆవరించింది. మత్తుకు అలవాటు పడిన విద్యార్థులు ఎలాగైనా గంజాయిని తెప్పించుకుని వాడుతున్నారు. గతంలో గంజాయి విక్రేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని వారిని మందలించారు. అయినప్పటికీ వారిలో ఎటువంటి మార్పు రాకపోగా విద్యార్థులపై వారి కన్నుపడింది.దీంతో విద్యార్థులే టార్గెట్‌గా చేసుకొని గంజాయి విక్రయాలు జరుపుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. దీనిపై పోలీసులు నిఘా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అంటున్నారు. నిఘా పెంచాం: సీఐ సోమశేఖర్ డోలపేటలోనే ఎక్కువగా గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు ఎప్పుటికప్పుడు సమాచారం అందుతుండడంతో నిఘా మరింత పెంచామని పట్టణ సీఐ సోమశేఖర్ తెలిపారు. మండల శ్రీను గతంలో కూడా పట్టుబడడంతో మందలించామని, అయినా ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదని, బుధవారం జరిపిన దాడిలో విద్యార్థితో కలసి మరోసారి పట్టుబడ్డాడని చెప్పారు. -
గంజాయి C/O బెజవాడ
-
ఉక్కుపాదం
నర్సీపట్నం: గంజాయి సాగు, రవాణాదారులపై సర్కారు ఉక్కుపాదం మోపుతోంది. మన్యంలో దీని నిర్మూలనకు 60 రోజుల యాక్షన్‌ప్లాన్‌తో ముందుకెళుతోంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా పీడీ చట్టం ప్రయోగించి గంజాయి వ్యాపారంతో సంపాదించిన ఆస్తులను శుక్రవారం అధికారులు జప్తు చేశారు. 1985లో ఈ చట్టం అమల్లోకి వచ్చినా ఇప్పటి వరకు ఆస్తులు జప్తు చేసిన సంఘటనలు రాష్ట్రంలో ఎక్కడా లేవు. తరచూ పట్టుబడుతున్న 50 మందిని గుర్తించారు. త్వరలో వీరిపైనా ఈ చట్టం ప్రయోగిస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో గంజాయి సాగవుతున్నదీ? ఇందుకు బాధ్యులెవరు? వెనుక ఎవరు ఉన్నారు..ఆర్థికంగా ఎవరు సపోర్టు ఇస్తున్నారు? ఇలా మూలాల్లోకి వెళ్లి అడ్డుకట్ట వేయాలని అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. నర్సీపట్నం ఏఎస్పీ ఐశ్వర్యరస్తోగి శుక్రవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మొదటి సారిగా నర్సీపట్నం సబ్ డివిజన్లో ఎన్డీపీఎస్ చట్టాన్ని ప్రయోగించి ఆస్తులను జప్తు చేశామన్నారు. ఇందుకు ఆస్తుల జప్తునకు కొత్తకోట సీఐ కోటేశ్వరరావు విశేష కృషి చేశారన్నారు. నాలుగు ఐదు గంజాయి కేసుల్లో అరెస్టు అయిన వ్యాపారుల ఆస్తుల వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే కొత్తకోట సర్కిల్ పరిధిలో రత్నంపేటకు చెందిన వూడి బాబ్జి , సీలేరుకు చెందిన గిసంగి ప్రేమ్బహుదూర్ల ఆస్తులను జప్తు చేశామన్నారు. వూడి బాబ్జి పదేళ్లుగా గంజాయి వ్యాపారం చేస్తూ పలు కేసుల్లో అరెస్టు అయ్యాడన్నారు. ప్రస్తుతం బాబ్జి సెంట్రల్ జైల్లో ఉన్నాడన్నారు. ఇతనికి సంబంధించి అనకాపల్లి కెఎన్ఆర్ పేటలో ఉన్న రెండు అంతస్తుల ఇల్లు, 34.28 గ్రాముల బంగారం అభరణాలు, రూ.40 వేలు నగదు, బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశామన్నారు. నేపాల్‌కు చెందిన గిసంగి ప్రేమ్ బహుదూర్ సీలేరులో స్థిర నివాసం ఏర్పర్చుకుని వ్యాపారం సాగిస్తున్నాడు. ఇతనిపై కూడా పలు కేసులు ఉన్నాయన్నారు. బహుదూర్‌కు చెందిన రావికమతం మండల కేంద్రంలో ఉన్న 50 సెంట్ల స్థలం, స్వీప్ట్డిజైర్ కారు జప్తు చేశామన్నారు. 50 సెంట్ల స్థ«లం విలువ సుమారు రూ.35 లక్షలు ఉంటుందన్నారు. గంజాయి స్మగ్లర్ల ఆస్తుల జప్తుకు మొదటి అడుగు వేశామన్నారు. భవిష్యత్తులో మరింత మంది గంజాయి స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేస్తామన్నారు. మనీలాండరింగ్, ఎన్డీపీఎస్ కింద నమోదైన కేసులను మినిస్ట్రీస్ ఆప్ ఫైనాన్స్ కాంపిటెంట్ అధారిటీ(చెన్నై)వారు ఆస్తులకు సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లను పరిశీలించి అక్రమ ఆస్తులుగా నిర్ధారణ అయితే జప్తు చేసి ప్రభుత్వానికి జమచేస్తారన్నారు. ఈ ప్రక్రియ శ్రమతో కూడినదైనప్పటికీ గంజాయి నిర్మూలనే లక్ష్యంగా వీరి ఇద్దరి ఆస్తులకు సంబంధించిన అన్ని ఆధారాలు సేకరించి మినిస్ట్రీస్ ఆఫ్ ఫైనాన్స్ కాంపిటెంట్ అధారిటీకి నివేదించామన్నారు. ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు అయిన వారికి ఏడాది, కొత్తగా అమల్లోకి వచ్చిన పిట్ ఎన్డీపీఎస్ చట్టం ద్వారా అరెస్టు అయితే రెండేళ్లు బెయిల్ రాదన్నారు. సబ్ డివిజన్ పరిధిలో 2016లో 160, 2017లో 97 గంజాయి కేసులు నమోదయ్యాయన్నారు. వీరిలోఐదుగురిపై పీడీ యాక్డు కింద కేసు నమోదుకు కసరత్తు చేస్తున్నామన్నారు. మన్యంలో సుమారు 10 వేల ఎకరాల్లో గంజాయి తోటలు ఉన్నాయన్నారు. గత నెల రోజుల్లో 600 ఎకరాల్లో పంటను «ధ్వంసం చేశామన్నారు. గంజాయి సమూల నిర్మూలనకు పోలీసు, ఎక్సైజ్ శాఖలు సమిష్టిగా కృషి చేస్తున్నాయన్నారు. రెండు మూడేళ్లలో గంజాయి నిర్మూలన జరుగుతుందని ఏఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
పోలీసులా.. మజాకా!
► 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు ► కోర్టు ప్రశ్నలతో పోలీసుల ఉక్కిరి బిక్కిరి ► సమగ్ర విచారణకు ఆదేశం సాక్షి, చెన్నై: పోలీసులు తలుచుకుంటే తప్పు చేయని వాడి మీద కూడా కేసుల మోతతో ఊచలు లెక్కించేలా చేస్తారన్న నానుడికి అద్దంపట్టే రీతిలో ఇటీవల ఓ వృద్ధుడి మీద కేసు నమోదైంది. 74 ఏళ్ల వృద్ధుడిపై గంజాయి కేసు పెట్టడం కోర్టును సైతం విస్మయంలో పడేసినట్టుంది. కోర్టు ప్రశ్నలతో చెన్నై పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. సమగ్ర విచారణకు ఆదేశిస్తూ, ఆ వృద్ధుడికి నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు అయింది. ఆర్కేనగర్ – మణలి రోడ్డులో ఉన్న ఎలిల్ నగర్‌కు చెందిన వేదక్కన్ నాడార్ (74)పై గత నెల పోలీసులు ఓ కేసు పెట్టారు. రెండు కేజీల వంద గ్రాములు గంజాయిని తన ఇంటి బీరువాలో దాచి ఉంచిన అభియోగంపై ఆర్కేనగర్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆగమేఘాలపై కోర్టుకు హాజరు పరిచి కటకటాల్లోకి నెట్టారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని చెన్నై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, నియంత్ర విభాగం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో ఇది తప్పుడు కేసు అన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. పిటిషన్: వేదక్కన్ నాడార్పిటిషన్లో...తాను నివసించే ఎలిల్ నగర్లో 250 ఎకరాల స్థలం ఉన్నట్టు, 50 సంవత్సరాలుగా 40 వేల కుటుంబాలు నివాసం ఉన్నట్టు వివరించారు. ఇక్కడి సంక్షేమ సంఘానికి తాను అధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ స్థలాన్ని కోర్టుకు వెళ్లి తాము సాధించుకున్నా, స్థానిక ఎమ్మెల్యే, ఆయన మద్దతు దారులు కబ్జా లక్ష్యంగా కుట్రలు చేస్తూ వచ్చారని ఆరోపించారు. వీరి బండారాన్ని మీడియా దృష్టికి తీసుకురావడంతో, ఎమ్మెల్యేకు పోలీసులు సహకారం అందించి, తనతో పాటు సంఘం నిర్వాహకులపై గంజాయి కేసు బనాయించారని పేర్కొన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని వేదక్కన్ నాడార్ దాఖలు చేసుకున్న పిటిషన్‌ను న్యాయమూర్తి అయ్యప్పన్ విచారించారు. అయితే, పోలీసులు బెయిల్‌ను వ్యతిరేకిస్తూ, మరింత సమయం కావాలని జాప్యం చేసే పనిలో పడ్డారు. ఈ కోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో వేదక్కన్ నాడార్ హైకోర్టును ఆశ్రయించారు. వెయ్యి కోట్ల స్థలాన్ని కబ్జా చేయడం లక్ష్యంగా గంజాయి కేసు పెట్టారని ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్ హైకోర్టు న్యాయమూర్తి రమేష్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు శనివారం వచ్చింది. కోర్టు ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి : పిటిషనర్ తరఫున న్యాయవాది ఆర్ రాజన్ హాజరై వాదన వినిపించారు. రూ.1000 కోట్ల విలువచేసే 250 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు సాగాయని, సాగుతున్నాయని, ఇందుకు అడ్డుగా ఉన్న వేదక్కన్ నాడార్‌ను గురిపెట్టి ఈ తప్పుడు కేసు బనాయించారని వాదించారు. పోలీసులు కాలయాపణ చేస్తూ రిట్ పిటిషన్ దాఖలు చేయడం లేదని బెంచ్ దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం న్యాయమూర్తి సంధించిన ప్రశ్నలకు పోలీసులు ఉక్కిరి బిక్కిరి కావాల్సిన పరిస్థితి. 74 వృద్ధుడి మీద ఈ కేసు నమోదు కావడం బట్టి చూస్తే, తప్పుడు కేసు బనాయించారా..? మరెదేని కారణాలు ఉన్నాయా, ఉంటే సమగ్ర విచారణకు సాగించాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ కేసును ప్రత్యేక అధికారి ద్వారా విచారించేందుకు తగ్గ చర్యలు చేపట్టాలని చెన్నై పోలీసు కమిషనర్‌కు ఆదేశాలు ఇచ్చారు. అలాగే, వేదక్కన్ నాడార్కు నిబంధనలతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.