యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ అలియాస్ షన్ను.. ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాడు. అయితే ఓ అమ్మాయి.. షణ్ముక్ సోదరుడు సంపత్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఇంటికి వెళ్లారు. అక్కడ అనుకోని విధంగా గంజాయితో షణ్ముక్ పట్టుబడ్డాడు. అయితే ఈ కేసులో అనుహ్యంగా మరికొన్ని నిజాలు బయటకొస్తున్నాయి. చాలామంది అమ్మాయిలు షన్ను సోదరుడి వల్ల మోసపోయినట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
యూట్యూబర్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన షణ్ముక్ జస్వంత్‌కి సంపత్ అని అన్న ఉన్నాడు. అయితే ఇతడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన నమ్మించి మోసం చేయడంతో ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్ కూడా ఇచ్చారు. అయితే ఈ కేసు వల్ల సంపత్ వల్ల మోసపోయిన బాధితులు మరికొందరు బయటకు వస్తున్నారు.
సంపత్.. తన ఎంబీఏ క్లాస్‌మేట్ అయిన ఓ యువతి దగ్గర 2016లో థిక్ షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెడదామని చెప్పి రూ.20 లక్షలు తీసుకున్నాడట. నెలకు రూ.7 వేలు లాభం మాత్రమే చూపించాడట. దీంతో మొత్తం డబ్బులు ఇచ్చేయమని అమ్మాయి అడగ్గా.. సంపత్ ఈమెని బ్లాక్ చేశాడట. ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి ఆరు రోజులు ఉందనగా ఓ లేడీ డాక్టర్‌తో పెళ్లికి రెడీ అయ్యాడట. ముంబయిలో మరో యువతిని ఇప్పటికే సంపత్ పెళ్లి చేసుకున్నాడట. ఇలా సంపత్ బారిన పడి చాలామంది అమ్మాయిలు మోసపోయినట్లు, వీళ్లందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు.
(ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment