sampath
-
మృగాళ్ల వేటలో శివంగులు
కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసు ఇద్దరు మహిళా సీబీఐ అధికారులప్రవేశంతో వేగం అందుకుంది. ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు ‘పాలిగ్రాఫ్’ టెస్ట్ చేసేందుకు తాజాగా అనుమతి తీసుకున్నారు. హెచ్‌జి కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ చేయిస్తారనే వార్తలు అందుతున్నాయి. సంపత్ మీనా, సీమా పహుజా... ఈ ఆఫీసర్ల వైపే సుప్రీంకోర్టు కూడా చూస్తోంది. నేడు (గురువారం) ఇప్పటివరకూ ఛేదించిన విషయాలను సమర్పించమంది. సంపత్ మీనా, సీమా పహుజాల పరిచయం.అత్యంత పాశవిక ఘటనగా నమోదవడంతో పాటు, అత్యంత మిస్టరీగా మారిగా కోల్‌కతా జూనియర్ డాక్టర్ కేసును ఆగస్టు 13న కోల్కత్తా హైకోర్టు సీబీఐకి అప్పజెప్పింది. వెంటనే సీబీఐ ఈ కేసు ప్రాధాన్యం, స్వభావం దృష్టా ‘లేడీ సింగం’గా బిరుదు పొందిన సీబీఐ అడిషనల్ డైరెక్టర్ సంపత్ మీనాకు విచారణ బాధ్యత అప్పగించింది. ఆమెకు ప్రధాన సహాయకురాలిగా మరో సమర్థురాలైన సీబీఐ ఆఫీసర్ సీమా పహూజాను నియమించింది. మొత్తం 30 మంది సీబీఐ బృందంతో సంపత్ మీనా, సీమా పహుజా దుర్మార్గులను వేటాడుతున్నారు.ఇద్దరు అధికారులు ఏం చేశారు?జూనియర్ డాక్టర్ పై జరిగిన అత్యాచారం/హత్యను ఛేదించడానికి రంగంలో దిగిన సంపత్ మీనా, సీమా పహూజా తొలుత ప్రధాన నిందితుడైన సంజయ్ ఘోష్ వ్యవహారశైలిని పరిశీలించారు. అతడిని విచారిస్తున్న సమయంలో ప్రతిసారీ వాంగ్మూలాన్ని మార్చడం గమనించారు. ఏ రోజైతే రాత్రి ఘటన జరగబోతున్నదో ఆ ఉదయం సంజయ్ ఘోష్ ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో అంటే ఐసీయూ ఎక్స్‌రే యూనిట్... ఇవన్నీ తిరిగినట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. అతను అక్కడ ఎందుకు తిరిగాడనేది ఆరా తీస్తున్నారు. ఆ సమయంలో బాధితురాలు ఎదురుపడి ఏదైనా వాదన చేసిందా తెలుసుకుంటున్నారు. లేదంటే రాత్రి జరగబోయే ఘటనను కుట్ర పన్నేందుకు వేరే ఎవరినైనా కలిశాడా అన్నది తేలుస్తున్నారు. ఇప్పటికే అతని మానసిక స్థితిని వారు అంచనా వేశారు. పాలిగ్రాఫ్ టెస్ట్ (ఒక విధమైన లై డిటెక్టర్ టెస్ట్) అలాగే బాధితురాలి అటాప్సీ రి΄ోర్టుతో పాటు ‘సైకాలజీ అటాప్సీ’ని కూడా అంచనా కడుతున్నారు. అంటే ఘటనకు ముందు బాధితురాలు ఎవరితో ఏం మాట్లాడింది, ఏదైనా వేదన/నిరసన వ్యక్తం చేసిందా, డైరీలో ఏమన్నా రాసుకుందా... వీటన్నింటి ఆధారంగా ఆమె సైకాలజీ అటాప్సీని నిర్థారిస్తారు. అలాగే కేసులో ముందు నుంచీ అనుమానాస్పదంగా ఉన్న మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ పైన కూడా పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించనున్నట్టు వార్తలు అందుతున్నాయి. పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా చేసిన నిర్థారణలు సాక్ష్యాధారాలుగా కోర్టులో చెల్లక΄ోయినా కేసును ముందుకు తీసుకెళ్లడంలో సాయపడతాయి.సంపత్ మీనా1994 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సంపత్ మీనాది రాజస్థాన్‌లోని సవాయిమధోపూర్. జార్ఘండ్‌లో ఆమె వివిధ జిల్లాలకు ఎస్.పి.గా పని చేసింది. బి.పి.ఆర్ అండ్ డి (బ్యూరో ఆఫ్ ΄ోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్)లో పని చేసే సమయంలో ‘ఆపరేషన్ ముస్కాన్’ కింద ఆమె చైల్డ్ ట్రాఫికింగ్‌ను సమర్థంగా నిరోధించడంతో అందరి దృష్టిలో పడ్డారు. జార్ఖండ్‌లో 700 మంది పిల్లలను ఆమె వారి కుటుంబాలతో కలపగలిగారు. ఇక జార్ఖండ్‌లోని నక్సలైట్ప్రాంతాల్లో ఆమె సమర్థంగా నిర్వహించిన విధులు ఆమె సాహసాన్ని తెలియచేశాయి. దాంతో 2017లో ఆమె సీఐఐకి డెప్యూట్ అయ్యారు. అనతి కాలంలోనే అడిషనల్ డైరెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఎక్కడ ఏ పదవిలో ఉన్నా మహిళా చైతన్యం కోసం మహిళల హక్కుల కోసం ఆమె ఎక్కువ శ్రద్ధ పెడతారనే గుర్తింపు ఉంది. అందుకే ఉన్నొవ్, హత్రాస్ ఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం ఆమెకే కేసులను అప్పగించింది. సీమా పహుజా1993లో ఢిల్లీ ΄ోలీస్లో సబ్ ఇ¯Œ స్పెక్టర్‌గా రిక్రూట్ అయిన సీమా పహుజా సీబీఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్లో చాలా సంవత్సరాలు పనిచేశారు. ఆమె ఇన్వెస్టిగేషనల్ స్కిల్స్ చూసి 2013లో డీఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. మానవ అక్రమ రవాణా, మైనర్ బాలికలపై నేరాలకు సంబంధించిన అనేక కేసులను శోధించడంలో ఆమె దిట్ట. సిమ్లాలోని కొట్‌ఖైలో గుడియాపై అత్యాచారం, హత్య కేసును ఛేదించినందుకు సీమా పహుజా వార్తల్లో నిలిచారు. కుటుంబ బాధ్యతల కారణంగా రిటైర్మెంట్ తీసుకోవాలనుకుని ఆమె సీబీఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. అయితే అందుకు అధికారులు ఒప్పుకోలేదు. హత్రాస్ కేసులో సంపత్ మీనాతో పని చేసిన సీమా ఇప్పుడు కోల్‌కతా కేసులో కూడా ఆమెతో పని చేయనున్నారు. ఒక కేసు ఒప్పుకుంటే నేరస్తులను కటకటాల వెనక్కు తోసే వరకు నిద్ర΄ోదని సీమాకు పేరుంది. అందుకే ఆమెను ΄ోలీస్ మెడల్ కూడా వరించింది. కాబట్టి కోల్‌కతా కేసులో నేరగాళ్లను పట్టుకునే కర్తవ్యాన్ని ఈ మహిళా అధికారులిద్దరూ సమర్థంగా నిర్వర్తించి సమాజానికి సరైన సందేశాన్ని పంపిస్తారని ఆశిద్దాం. -
జనహృదయ విజేత
సమైక్య రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేసిన ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన పేద ప్రజల్లో దైవంలా కొలువై నిలిచారు. అధికారాన్ని స్వప్రయోజనాలకు ఉపయోగించుకునే రాజకీయ నాయకులున్న రోజుల్లో... వైఎస్సార్ పేద ప్రజల బాగుకోసం దాన్ని ఉపయోగించారు. ‘ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. 108 అంబులెన్స్ సర్వీసులు ప్రారంభించారు.ఆ విధంగా ప్రభుత్వ వైద్యాన్ని పేదలకు దగ్గర చేశారు. పాదయాత్రలో రైతుల కష్టాలు చూసి చలించిపోయిన ఆయన దేశానికి వెన్నెముక వ్యవసాయమేనని బలంగా విశ్వసించి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ‘జలయజ్ఞం’ ఆరంభించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు అండగా నిలిచారు. ఆయన కాలంలోనే ఎన్నో విద్యుత్ సబ్ స్టేషన్ల నిర్మాణాలు జరిగాయి. రైతులకు ఉచిత విద్యుత్ అందించారు. ఏక కాలంలో లక్ష రూపాయల రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలిచారు.దళిత, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి ఫీజు రీయింబర్స్‌మెంటు పథకాన్ని తీసుకువచ్చి ఇంజనీరింగ్, వైద్య విద్యలను అందించి అనేక మందిని ఇంజనీర్లుగా, వైద్యులుగా తీర్చిదిద్దారు. ప్రతి నిరుపేదకూ ‘ఇందిరమ్మ ఇల్లు’ పేరిట రాష్ట్రంలో లక్షల ఇళ్లను కట్టించి పేదవారి సొంతింటి కలను నిజం చేశారు. నిరుపేద ముస్లిం యువతకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడం ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం. పండుటాకుల వంటి వృద్ధులకు పింఛన్‌ను క్రమం తప్పకుండా ఇచ్చి వారి ఆకలి తీర్చారు.ప్రజలకు మరింత దగ్గరయ్యేందుకు తాను రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ వార్త విని ఎందరో అభిమానుల గుండెలూ ఆగిపోయాయి. ఆయన భౌతికంగా లేకపోయినా సకల జనుల హృదయాల్లో ‘రాజన్న’గా ఆయన నిలిచే ఉన్నారు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా -
రిజర్వేషన్ల పితామహుడు..
భారత దేశంలో దళితులు, బీసీల వంటి సామాజికంగా వెనుకబడిన వర్గాలవారి ఉన్నతికి ప్రభుత్వ పరంగా ఇప్పుడు కొనసాగిస్తున్న అనేక సదుపాయాలు, హక్కులను 19వ శతాబ్దంలోనే తన కొల్హాపూర్ సంస్థాన ప్రజలకు అందించినవాడు సాహు మహరాజ్. 1894 ఏప్రిల్ 2న సింహాసనం అధిష్టించిన సాహు, వెనుకబడిన కులాల వారందరికీ పాఠశాలలు, వసతి గృహాలు ప్రారంభించి విద్యాబోధనను ఒక ఉద్యమంగా నడిపాడు.1902 జులై 26, భారతదేశ చరిత్రలో ఒక చరిత్రాత్మక దినం. ఆ రోజు ఛత్రపతి సాహు మహారాజ్ ప్రభుత్వం, ప్రభుత్వోద్యోగాలన్నింటిలో వెనుకబడిన వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సంచలనాత్మక ఉత్తర్వులను జారీ చేసింది. గ్రామ పరిపాలన రంగంలో వంశపారం పర్యంగా వచ్చే ముఖ్యులైన పటేల్ (పాటిల్), పట్వారీ (కులకర్ణి) వ్యవస్థని 1918లో రద్దు చేశారు.1919 సెప్టెంబర్ 6న అంటరానితనం పాటించడం నేరమని ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. 1920 మే 3వ తేదిన వెట్టిచాకిరీ వ్యవస్థను రద్దు చేస్తూ చట్టం చేశారు. అంబేడ్కర్ అస్పృశ్యుల హక్కుల సాధన కోసం స్థాపించిన ‘మూక్ నాయక్’ పత్రికకు ఆర్థిక సాయం చేశారు. 1920లో అంబేడ్కర్ ఇంగ్లాండ్ వెళ్లి చదువుకునేందుకు ఆర్థిక సహాయం చేశాడు. బాలికల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించాడు. 1919 జూన్‌లో బాల్య వివాహాల రద్దు చట్టం వచ్చింది.1919 జులై 12న కులాంతర, వర్ణాంతర వివాహాలను చట్టబద్ధం చేస్తూ చట్టం తెచ్చాడు. విడాకులు మంజూరు చేయడంలో స్త్రీల నిర్ణయానికే ప్రాధాన్యతనిస్తూ 1919 ఆగస్టు 2న విడాకుల చట్టం చేశాడు. 1920 జనవరి 17న జోగిని, దేవదాసీ వ్యస్థను రద్దు చేశాడు. ప్రభుత్వం దేవదాసీల పునరావాసానికి చర్యలు తీసుకున్నాడు. 1918లో తన రాజ్యంలో వడ్డీ వ్యాపారాన్ని పూర్తిగా నిషేధిస్తూ సహకార సంఘాలను ఏర్పాటు చేశాడు. మహారాజుగా అనేక సంస్కరణలు తీసుకొచ్చిన రిజర్వేషన్ల పితామహుడు సాహు మహరాజ్ 1922 మే 6న మరణించాడు. – సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా (నేడు సాహు మహరాజ్ జయంతి) -
తల్లిని పెళ్లి చేసుకున్నాడు.. కూతురుపై కన్నేశాడు
హన్మకొండ: మైనర్‌పై అత్యాచారానికి యత్నించిన ఘటనలో ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్ శుక్రవారం అరెస్టయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. భూపాలపల్లి జిల్లా సైబర్ క్రైంలో బండారి సంపత్ సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు. వర్ధన్నపేట ఎస్సైగా పనిచేస్తున్న సమయంలో ఓ వివాహితతో ఏర్పడిన పరిచయం లైంగిక బంధానికి దారితీసింది. దీంతో సదరు మహిళ తన భర్తను వదిలిపెట్టి కొంతకాలంగా సంపత్తో సహజీవనం సాగించి.. తర్వాత వివాహం చేసుకున్నారు. ఆమెకు అప్పటికే పదేళ్ల వయసు కూతురు ఉంది. ప్రస్తుతం ఆ బాలిక ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే ఆ బాలికకు తండ్రిగా వ్యవహరించాలి్సన సీఐ కీచకుడిగా మారాడు. ఇటీవల అత్యాచారానికి యత్నించడంతో బాలిక తల్లి కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి విచారణ చేపట్టారు. లైంగిక దాడికి యత్నించినట్లు నిర్ధారణకు వచ్చి సీఐ సంపత్‌పై పోక్సో కేసు నమోదు చేశారు. రెండేళ్లక్రితం సంపత్‌పై ఫిర్యాదు.. ఎస్సై బండారి సంపత్ మాయమాటలు చెప్పి తన భార్యను తీసుకెళ్లాడని రెండేళ్ల క్రితం అప్పటి పోలీస్ కమిషనర్ తరుణ్జోషిని కలిసి ఆమె భర్త ఫిర్యాదు చేశాడు. అçప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సంపత్‌ను ఏఆర్‌కు అటాచ్ చేశారు. -
షణ్ముక్ సోదరుడి మరిన్ని ఆగడాలు.. బాధితులు చాలామందే
యూట్యూబర్, బిగ్‌బాస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ అలియాస్ షన్ను.. ఈ మధ్య గంజాయి కేసులో దొరికిపోయాడు. ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాడు. అయితే ఓ అమ్మాయి.. షణ్ముక్ సోదరుడు సంపత్‌పై ఫిర్యాదు చేయగా పోలీసులు అతడిని పట్టుకునేందుకు ఇంటికి వెళ్లారు. అక్కడ అనుకోని విధంగా గంజాయితో షణ్ముక్ పట్టుబడ్డాడు. అయితే ఈ కేసులో అనుహ్యంగా మరికొన్ని నిజాలు బయటకొస్తున్నాయి. చాలామంది అమ్మాయిలు షన్ను సోదరుడి వల్ల మోసపోయినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) యూట్యూబర్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన షణ్ముక్ జస్వంత్‌కి సంపత్ అని అన్న ఉన్నాడు. అయితే ఇతడు ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన నమ్మించి మోసం చేయడంతో ఆమె నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత బెయిల్ కూడా ఇచ్చారు. అయితే ఈ కేసు వల్ల సంపత్ వల్ల మోసపోయిన బాధితులు మరికొందరు బయటకు వస్తున్నారు. సంపత్.. తన ఎంబీఏ క్లాస్మేట్ అయిన ఓ యువతి దగ్గర 2016లో థిక్ షేక్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెడదామని చెప్పి రూ.20 లక్షలు తీసుకున్నాడట. నెలకు రూ.7 వేలు లాభం మాత్రమే చూపించాడట. దీంతో మొత్తం డబ్బులు ఇచ్చేయమని అమ్మాయి అడగ్గా.. సంపత్ ఈమెని బ్లాక్ చేశాడట. ఓ అమ్మాయితో నిశ్చితార్థం చేసుకుని.. పెళ్లికి ఆరు రోజులు ఉందనగా ఓ లేడీ డాక్టర్‌తో పెళ్లికి రెడీ అయ్యాడట. ముంబయిలో మరో యువతిని ఇప్పటికే సంపత్ పెళ్లి చేసుకున్నాడట. ఇలా సంపత్ బారిన పడి చాలామంది అమ్మాయిలు మోసపోయినట్లు, వీళ్లందరూ ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) -
షణ్ముఖ్ సోదరుడి వ్యవహారంలో సంచలన విషయాలు
-
గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్..
-
Shanmukh Jaswanth: గంజాయితో పట్టుబడ్డ బిగ్‌బాస్ ఫేం షణ్ముఖ్
బిగ్‌బాస్ ఫేం, ప్రముఖ యూట్యూబర్ షణ్ముఖ్ గంజాయితో పట్టుపడ్డాడు. ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్‌ని అదుపులోకి తీసుకునేందుకు తన ఫ్లాట్‌కి వెళ్లిన పోలీసులకు.. అక్కడ షణ్ముఖ్ గంజాయి సేవిస్తూ కనిపించాడు. దీంతో సంపత్ వినయ్‌తో పాటు షణ్ముఖ్‌ని నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో మోసం షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఓ యువతితో పదేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. మూడేళ్ల క్రితం ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను దూరం పెట్టేశాడు. 20 రోజుల క్రితం వేరే యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ప్రియురాలు.. పోలీసులను ఆశ్రయించింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఫిర్యాదు చేసింది. అన్న కోసం వెళ్తే.. అడ్డంగా దొరికిపోయిన తమ్ముడు యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సంపత్‌ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ నివాసానికి వెళ్లారు. పోలీసులతో పాటు యువతి కూడా అక్కడికి వెళ్లింది. ఇంట్లోకి వెళ్లి చూడగా..షణ్ముఖ్ ఒక్కడే కనిపించాడు. అతని వద్ద గంజాయి లభించడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నాడు. ఈ సమయంలో సదరు యువతితో షణ్ముఖ్ దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. -
పెళ్లికి పిలుస్తలేరు.. చావుకు చెప్తలేరు!
మానకొండూర్ రూరల్: ఊరిలో ఆ కులానివి దాదాపు 50 గడపలు. శుభకార్యమైనా.. అశుభ కార్యమైనా అందరూ కలసికట్టుగా హాజరవుతారు. అయితే పంచాయితీ పెద్దలు చెప్పినట్లు వినలేదని, వారి తీర్పును తిరస్కరించారని కులం నుంచి ఓ కుటుంబాన్ని బహిష్కరించారు. ఏడాదికాలంగా గ్రామంలో పెళ్లయినా, చావైనా వీరిని పిలవడంలేదు. బాధిత కుటుంబం కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన మాదాసు సంపత్ కుటుంబానికి ఊరిలో వారసత్వంగా వచ్చిన 1.03 ఎకరాల వ్యవసాయ భూమి అతని తండ్రి కొమురయ్య పేరున ఉంది. 2014లో సంపత్ తండ్రి కొమురయ్య మరణించాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన అడప శ్రీనివాస్ ఆ భూమి విషయంలో సంపత్తో గొడవకు దిగాడు. స్థానిక కోర్టుకు వెళ్లడంతో తీర్పు సంపత్‌కు అనుకూలంగా వచ్చింది. దీంతో తమ భూమిని సాగు చేసేందుకు అతను వెళ్లాడు. అయితే.. అడప శ్రీనివాస్, సంపత్‌ను అడ్డుకుని.. దాడి చేశాడు. గొడవ పెద్దది కావడంతో ఇరువురూ పోలీసుస్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విషయమై ఇద్దరూ ఏడాది క్రితం గ్రామంలోని పంచాయితీ పెద్దలను ఆశ్రయించారు. వారు ఇరువర్గాలు రూ.50 వేలు డిపాజిట్ పెట్టాలని సూచించారు. సంపత్ తనవద్ద అంతమొత్తం లేవని, రూ.5 వేలు మాత్రమే ఇచ్చాడు. దీంతో తాము చెప్పినట్లు వినలేదని పంచాయితీ పెద్దలు సంపత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటినుంచి వారి కుటుంబాన్ని కులం నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గ్రామంలోని తమ కులస్తులు ఏడాదికాలంగా తమను ఎలాంటి కార్యాలకు పిలవకపోవడంతో మనోవేదనకు గురవుతున్నట్లు సంపత్ కుటుంబం వెల్లడించింది. కుల బహిష్కరణ చేసిన 11 మంది పంచాయితీ పెద్దలపై చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఆయన ఇటీవల సీపీ కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశాడు. -
హెచ్‌సీఏలో ఎన్నికల సందడి
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక అవకతవకలు, అవినీతి, కోర్టు వివాదాలు, పరస్పర ఆరోపణలు, సస్పెన్షన్లు, పర్యవేక్షకుల పరిపాలన తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రిటర్నింగ్ అధికారిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వీఎస్ సంపత్ ఆధ్వర్యంలో నేడు ఉప్పల్ స్టేడియంలో ఎన్నికలు జరుగుతాయి. వాస్తవానికి మొహమ్మద్ అజహరుద్దీన్ అధ్యక్షుడిగా 2019లో ఎన్నికైన హెచ్‌సీఏ కార్యవర్గం పదవీ కాలం గత ఏడాది సెపె్టంబర్ 26నే ముగిసింది. ఆ వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా... వేర్వేరు వివాదాలతో అవి వాయిదా పడ్డాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎన్నికలు జరిగే వరకు రోజూవారీ కార్యకలాపాల కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ (రిటైర్డ్) ఎల్.నాగేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య పర్యవేక్షణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే హైదరాబాద్‌లో మూడు వరల్డ్‌కప్ మ్యాచ్‌లు కూడా జరిగాయి. చివరకు అక్టోబర్ 20న ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి ముందు హెచ్‌సీఏను ప్రక్షాళన చేసే క్రమంలో 57 క్లబ్‌లపై నాగేశ్వరరావు నిషేధం విధించారు. దాంతో ఈ క్లబ్‌లకు ఎన్నికల్లో ఓటు హక్కు లేకుండా పోయింది. నాలుగు ప్యానెల్లుగా... అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్... ఇలా ఆరు పదవుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. లోధా కమిటీ సిఫారసులు, కొత్త నియమావళి కారణంగా గతంలో కీలక పదవులు నిర్వహించిన సీనియర్లందరూ ఈసారి పోటీలో లేకపోగా, తాము మద్దతునిస్తూ సన్నిహితులను బరిలోకి దించారు. దాంతో ఈసారి ఎక్కువగా కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. నాలుగు వేర్వేరు గ్రూప్‌లుగా విడిపోయి అభ్యర్థులంతా పోటీ చేస్తున్నారు. అయితే ఫలితం విషయంలో గ్రూప్‌లతో సంబంధం లేదు. ఒక్కో పదవి కోసం అత్యధిక ఓట్లు సాధించిన వారు ప్యానెల్‌తో సంబంధం లేకుండా ఎన్నికవుతారు. పోలింగ్ కోసం మొత్తం 173 ఓట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 101 రెగ్యులర్ క్రికెట్ క్లబ్‌లు కాగా 48 ఇన్స్టిట్యూషన్ క్లబ్‌లు ఉన్నాయి. 9 జిల్లా క్లబ్‌లతో పాటు 15 మందికి అంతర్జాతీయ ఆటగాళ్ల హోదాలో ఓటు హక్కు ఉంది. గెలిస్తే తాము హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని చక్కదిద్దుతామని, వివాదాలు లేకుండా నడిపిస్తామని అభ్యర్థులంతా హామీ ఇస్తున్నారు. శుక్రవారం సాయంత్రమే ఓట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు. -
మనస్తాపంతో.. నాన్నమ్మకు ఫోన్‌చేసి.. చివరికి..
మెదక్: మనస్తాపం చెందిన ఒక యువకుడు చెరువులోదూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లిలో చోటుచేసుకుంది. సంగాయిపల్లి గ్రామానికి చెందిన సంపత్(20) అంబాజిపేట పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఇంటి నుంచి బైక్‌పై బయటకు వెళ్లాడు. కొంతసేపటికి తాను చెరువులో దూకి చనిపోతున్నానని నాన్నమ్మ దుర్గమ్మకు ఫోన్‌చేసి చెప్పాడు. వెంటనే ఆమె యువకుడి మేనమామలకు చెప్పడంతో వారు అక్కడకు చేరుకుని వెతకగా చెరువులో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నశంకరంపేట ఎస్ఐ నారాయణ తెలిపారు. నాలుగు రోజులుగా సంపత్ మనస్తాపంతో బాధపడుతున్నాడని చెప్పారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
ఈ వాలంటీర్ వ్యవస్థకు శతకోటి వందనాలు
-
Kannada TV Actor Sampath J Ram: సినీ ఇండస్ట్రీలో విషాదం.. యువ నటుడు ఆత్మహత్య!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కన్నడ బుల్లితెర నటుడు సంపత్ జె. రామ్(35) సూసైడ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని సహా నటుడు రాజేశ్ ధృవ తన ఫేస్బుక్లో వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న కన్నడ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. సంపత్ శనివారం రాత్రి బెంగళూరు నెలమంగళలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా.. సంపత్ ఇటీవల తగినన్నీ అవకాశాలు లేకపోవడంతో డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన స్వగ్రామమైన కర్ణాటకలోని చిక్ మంగళూరు జిల్లా నరసింహరాజపురలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సంపత్ 'అగ్నిసాక్షి' సీరియల్‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. అతని మృతిపై మరో నటుడు రాజేశ్ ధృవ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చారు. 'నువ్వు ఇంకా చాలా సినిమాలు చేయాలి.. చాలా పోరాటం మిగిలి ఉంది. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఇంకా సమయం ఉంది. దయచేసి తిరిగి రండి.' భావోద్వేగానికి గురయ్యారు. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు స్వేరోస్ సభ్యుడి స్ట్రాంగ్ వార్నింగ్
సాక్షి, నల్గొండ: మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు ప్రజలకు సేవ చేస్తానంటూ తన పదవికి రాజీనామా చేసి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగస్టు 8న బీఎస్పీలో చేరారు. అనంతరం ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దళిత బంధు కోసం రూ.1000 కోట్లు ఖర్చు పెడుతున్నామని అంటున్నారు.. ఆ డబ్బులు ఎవరివని ప్రవీణ్ కుమార్ సీఎం కేసీఆర్‌ని ప్రశ్నించారు. మరోవైపు టీఆర్ఎస్ ఎమెల్యే గ్యాదరి కిషోర్, మరికొందరు అధికారం పార్టీ నేతలు సోమవారం .. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలపై మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే ఊరుకోమని కౌంటర్ ఇచ్చారు. దీంతో తమ నాయకుడు ప్రవీణ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని స్వేరోస్ సభ్యులు తీవ్ర స్థాయిలో ప్రతి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే స్వేరోస్ సభ్యుడు సంపత్ అనే వ్యక్తి పేరుతో ఓ ఆడియో కాల్ వైరల్‌గా మారింది. ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌కు ఫోన్ చేసిన సంపత్..‘నీది ప్రవీణ్ కుమార్‌ను విమర్శించే స్థాయా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరోసారి ప్రవీణ్ కుమార్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చాడు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికాడు. ఏడేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు దళిత బంధు గుర్తుకువచ్చిందా మీకు అని ప్రశ్నించాడు. -
అణగారిన వర్గాల దీపస్తంభం
అట్టడుగు వర్గాల్లో విజ్ఞానాన్ని నింపడానికి సర్వస్వం త్యాగం చేసిన మహోన్నతమైన వ్యక్తి సావిత్రీబాయి ఫూలే. ఆనాటి సమాజపు కట్టు బాట్లను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభిం చారు. సావిత్రీబాయి మహారాష్ట్ర సతారా జిల్లాలోని నయాగావ్ గ్రామంలో 1831 జనవరి 3న జన్మిం చారు. వాళ్ల కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. ఆమె తన తొమ్మిదో ఏట పన్నెండేళ్ల జ్యోతి రావు ఫూలేను 1840లో వివాహ మాడారు. నిరక్షరాస్యురాలైన ఆమెకు భర్త జ్యోతిబా మొదటి గురువు. ఉపాధ్యాయ శిక్షణ పొంది 1848లో భర్తతో కలిసి బాలికల కోసం పుణేలో మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఇది నడపటం అగ్రవర్ణాలకు నచ్చకపోయినా, పట్టు వీడక ఫూలే దంపతులు సాగించిన విద్యా ఉద్య మానికి తక్కువ కాలంలోనే గుర్తింపు, సహ కారం లభించాయి. దంపతుల జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. మానవ హక్కుల గురించి మహిళలను చైతన్య పరచడానికి 1852లో మహిళా సేవామండల్ స్థాపిం చారు సావిత్రీబాయి. కుల, పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా ఈ సంఘం పనిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రీబాయి. 1873లో భర్త మహాత్మా ఫూలేతో కలిసి ‘సత్య శోధక్ సమాజ్’ స్థాపించి, బాల్య వివాహాలు, మూఢనమ్మకాలు, సతీసహగమనానికి వ్యతిరేకంగా; వితంతు పునర్వి వాహాలకు అనుకూలంగా ఉద్యమం నడిపారు. ఈ సంఘపు మహిళా విభాగానికి ఆమె నేతృత్వం వహించారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభ వించే ఎంతోమంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోశారు. అలా పురుడు పోసుకుని తనవద్దే వదిలేసి పోయిన ఓ బ్రాహ్మణ వితంతువు బిడ్డను అక్కున చేర్చుకుని, యశ్వంత్గా నామకరణం చేసి, పెంచి పెద్ద చేశారు. వితంతువు లకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్య పర్చి, వారికి శిరో ముండనం చేయ బోమంటూ సమ్మె చేయించారు. అంటరాని తనానికి వ్యతిరేకంగా పోరా డారు. దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి మరువలేనిది. కరువు వాతపడిన కుటుంబాల్లోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించారు. సావిత్రీబాయి ఫూలే సంఘ సంస్కర్తగానే కాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. (నేడు సావిత్రీబాయి ఫూలే జయంతి) సంపత్ గడ్డం, కామారెడ్డి జిల్లా మొబైల్ : 78933 03516 -
వెలుగులోకి వస్తున్న సంపత్ వ్యవహారాలు
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్‌లోని మియాపూర్ ఠాణా పరిధిలోని గోకుల్ ప్లాట్స్‌లో మకాం వేసి... సుదీర్ఘకాలం తర్వాత హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కి... ఇటీవల తీహార్ జైలు నుంచి చంఢీగడ్ చేరిన ఘరానా గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇతడికి కస్టడీలోకి తీసుకున్న చంఢీగడ్ పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న నెహ్రా బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌నూ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఉత్తరాదిలోని పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారి, సైబరాబాద్‌లో తలదాచుకున్న నెహ్రా ఇక్కడ ఉన్నప్పుడూ యథేచ్చగా అక్కడ దందాలు సాగించినట్లు వెలుగులోకి వచ్చింది. చంఢీగడ్‌లో ఉన్న తన ఐదుగురు ప్రధాన అనుచరుల ద్వారా అనేక నేరాలు చేయించాడని అక్కడి పోలీసులు గుర్తించారు. తన స్మార్ట్ ఫోన్ నుంచి వాట్సాప్ ద్వారా వీరికి ఆదేశాలు జారీ చేస్తూ పోలీసు నిఘాకు చిక్కికుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తేల్చారు. సంపత్ ప్రధానంగా చంఢీగడ్‌లోని మొహాలీతో పాటు పంచకుల ప్రాంతాల్లోనే తన దందాలు కొనసాగించాడు. అక్కడ వివిధ ప్రాంతాలకు చెందిన రామ్‌దీప్ సింగ్, శుభ్‌నవ్‌దీప్ సింగ్, జస్పీత్ సింగ్, గుర్వీందర్ సింగ్‌లను తన ప్రధాన అనుచరులుగా ఏర్పాటు చేసుకున్న అతను ఆయా ప్రాంతాల్లో వ్యవహారాలన్నీ వీరి ద్వారానే చేయించేవాడు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన దినేష్ కుమార్ ఆర్మీలో పని చేసేవాడు. ఇతడినీ తన అనుచరుడిగా మార్చుకున్న సంపత్ ప్రత్యేకమైన పనుల కోసం మాత్రమే అతడిని రంగంలోకి దింపేవాడు. మాదాపూర్‌లో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులతో కలిసి సాధారణ జీవితం గడిపిన సంపత్ నిత్యం సెల్ఫోన్లో చాటింగ్స్, కాల్స్‌తో బిజీగా ఉండే వాడు. వీటి ద్వారానే అనుచరులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసేవాడు. మొహాలీ, పంచకుల ప్రాంతాల్లో బెదిరింపులు, దోపిడీలు, బంది పోటు దొంగతనాలతో పాటు కిడ్నాప్స్ సైతం చేయించాడు. ఇందుకుగాను తన నలుగురు అనుచరులకూ ఆయుధాలు కారు సమకూర్చాడు. మొహాలీకి చెందిన వరీంద్రకుమార్ అనే యువకుడిని కిడ్నాప్ చేయించి భారీగా వసూలు చేశాడు. సొహాన ప్రాంతంలో ఓ కారుతో పాటు భారీ నగదు దోచుకున్నారు. ఇతడి అనుచరులను చంఢీగడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆర్మీ ఉద్యోగి దినేష్ సింగ్ సెలవు పెట్టివచ్చి సంపత్ చెప్పిన పనులు చేసేవాడు. ఘరానా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడిగా పని చేసిన సంపత్ అతడి ఆదేశాల మేరకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. -
డబుల్ హ్యాండ్ షూటర్.. సల్మాన్‌ఖాన్‌కూ వార్నింగ్
సాక్షి, సిటీబ్యూరో: కేవలం 26 ఏళ్ల వయస్సుకే హర్యానా, రాజస్థాన్, పంజాబ్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా మారి, రెండేళ్ల క్రితం సైబరాబాద్‌లో చిక్కిన ఘరానా గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రాను తాజాగా చండీఘడ్ చేరాడు. తీహార్ జైల్లో ఉన్న అతడిని అక్కడ నమోదైన హత్యాయత్నం కేసులో పీటీ వారెంట్‌పై తీసుకెళ్లారు. 2017 జూన్ 7న మియాపూర్‌లో అరెస్టైనప్పటి నుంచి సంపత్ నెహ్రాను ఏదో ఒక నగర, జిల్లా పోలీసులు ‘తీసుకువెళ్తూ’ తమ కేసుల్లో అరెస్టు చేస్తూనే ఉన్నారు. గతంలో బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్కే వార్నింగ్ ఇచ్చిన సంపత్ పేరు ఉత్తరాదిలో మారుమోగింది. రాజస్థాన్‌లోని కలోడి ప్రాంతానికి చెందిన సంపత్ తండ్రి రామ్ చందర్ చండీఘడ్‌కు వలస వెళ్లి అక్కడ పోలీసు విభాగంలో ఎస్ఐగా పని చేస్తూ అక్కడే స్థిరపడ్డారు. సంపత్ పంజాబ్ యూనివర్శిటీ పరిధిలోని డీఏవీ కాలేజీలో బీఏ చదివాడు. ఆ దశలోనే వర్శిటీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన అతను గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌కు అనుచరుడిగా పని చేశాడు. అతడిని పోలీసులు అరెస్టు చేయడంతో తానే ఓ గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. యువత, విద్యార్థులతో భారీ నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్న సంపత్ తన సామ్రాజ్యాన్ని హర్యానాతో పాటు పంజాబ్, రాజస్థాన్‌లకూ విస్తరించాడు. వరుస నేరాలు చేస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఈ మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసిరాడు. పది సంచలనాత్మక హత్యలు, మూడు హత్యాయత్నాలతో పాటు బెదిరింపులు, దోపిడీల కేసుల్లో వాంటెడ్‌గా ఉన్నాడు. ప్రతి నేరంలోనూ తుపాకీ వినియోగించిన సంపత్ డబుల్ హ్యాండ్ షూటర్. అతను రెండు చేతులతోనూ ఏక కాలంలో తుపాకీ పేల్చగలడు. హర్యానాలోని పంచకుల ప్రాంతంలో పోలీసుల అదుపులోకి తీసుకున్న తన అనుచరుడు దీపక్ అలియాస్ టింకును విడిపించే ప్రయత్నంలో సంపత్ పోలీసుల పైనే తుపాకీ ఎక్కుపెట్టాడు. ఎస్కార్ట్ అధికారుల కళ్లల్లో కారం చల్లడంతో పాటు కాల్పులు జరిపి తన అనుచరుడిని తప్పించాడు. రాజస్థాన్‌లోని రాజ్‌ఘర్ కోర్టు ఆవరణలో అజయ్ అనే ప్రత్యర్థిపై కాల్పులు జరిపిన సంపత్ అతడిని హత్య చేశాడు. మూడు రాష్ట్రాల్లోనూ అతడి కోసం గాలిస్తున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. దీంతో చండీఘర్‌కు పారిపోయిన సంపత్ అక్కడి ఖోర్బా ప్రాంతంలో తలదాచుకున్నాడు. ఆపై సైబరాబాద్‌కు వచ్చిన సంపత్ మియాపూర్ పరిధిలోని గోకుల్‌ప్లాట్స్‌లో ఓ అద్దె ఇంట్లో మకాం పెట్టాడు. ఇతడి కదలికలను గుర్తించిన హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) అధికారులు 2017 జూన్ 7న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల సాయంతో అతడిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైల్లోనే ఉన్న సంపత్‌ను 2016లో చండీఘడ్‌లో నమోదైన సందీప్‌సింగ్ అనే వ్యక్తిపై హత్యాయత్నం కేసులో అక్కడి పోలీసులు పీటీ వారెంట్‌పై గత వారం తీసుకువెళ్లారు. ఉత్తరాదిలోని నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న సంపత్ నెహ్రా బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌నూ విడిచిపెట్టలేదు. ఆయన నుంచి డబ్బు వసూలు చేయడానికి పథకం వేసి వార్నింగ్ ఇచ్చాడు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో రాజస్థాన్ కోర్టుకు వచ్చినప్పుడు చంపేస్తానంటూ బెదిరించాడు. ప్రధానంగా సోషల్‌మీడియా వేదికగానే ఇతడి దందాలు నడిచాయి. జోధ్‌పూర్ కోర్టు ప్రాంగణంలోనే హతమారుస్తానంటూ 2016లో సల్మాన్‌కు వార్నింగ్ ఇచ్చాడు. సంపత్‌కు రాజస్థాన్‌లోని రాజ్‌ఘర్ కోర్టు ఆవరణలో అజయ్ అనే ప్రత్యర్థిని హత్య చేసిన చరిత్ర ఉండటంతో ఈ వార్నింగ్ తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. దీనిని పరిగణలోకి తీసుకున్న జోధ్‌పూర్ పోలీసులు సల్మాన్ హాజరైనప్పుడల్లా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసే వారు. -
డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు ఊరట
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎ.సంపత్ కుమార్ల బహిష్కరణ వ్యవహారంలో కోర్టు ధిక్కార కేసు ఎదుర్కొంటున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇద్దరు ఎస్పీలు రంగనాథ్, రెమా రాజేశ్వరిలకు హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి, సంపత్‌లు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సింగిల్ జడ్జి ముందు జరుగుతున్న కేసులో తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ రద్దు కావడంతో సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో విచారణను ధర్మాసనం మూసివేసిందని, అయినప్పటికీ సింగిల్ జడ్జి కోర్టు ధిక్కార వ్యాజ్యంలో ముందుకెళుతున్నారని, ఇందులో జోక్యం చేసుకోవాలని కోరుతూ డీజీపీ, ఇద్దరు ఎస్పీలు వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్.శరత్ వాదనలు వినిపిస్తూ.. అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారణ జరిపిన ఇదే ధర్మాసనం, సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార వ్యాజ్యంలో తదుపరి చర్యలన్నీ నిలిపేసిందని వివరించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లకు భద్రతను పునరుద్ధరించాలన్న ఆదేశాలను అమలు చేయలేదన్న కారణంతో అటు డీజీపీ, ఇటు ఇద్దరు ఎస్పీలను కోర్టు ధిక్కార కేసులో ప్రతివాదులుగా చేరుస్తూ సింగిల్ జడ్జి ఉత్తర్వులిచ్చారని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత కోర్టు ధిక్కారం కింద వీరికి నోటీసులు కూడా జారీ చేశారని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. సింగిల్ జడ్జి ముందున్న కోర్టు ధిక్కార కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ కేసులో మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఒక్కరే స్టే పొందాల్సి ఉంది. -
వాటీజ్ దిస్ నాన్సెన్స్?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లను శాసనసభ నుంచి బహిష్కరించడం ద్వారా రేగిన మంటలు హైకోర్టులో ఇంకా చల్లారలేదు. తమ బహిష్కరణకు సంబంధించి వారు దాఖలు చేసిన కోర్టు ధిక్కార వ్యాజ్యం విచారణ సందర్భంగా శుక్రవారం హైకోర్టులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. న్యాయమూర్తిని ఉద్దేశించి ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’అంటూ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు న్యాయశాఖ, అసెంబ్లీ కార్యదర్శులను ఇబ్బందుల్లోకి నెట్టాయి. ఏఏజీ ఎదురుదాడి, అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారిని ఈ నెల 15న తమ ముందు హాజరుపరచాలని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. రూ.10వేల పూచీకత్తు సమర్పించి బెయిల్ పొందవచ్చునని ఇరువురు కార్యదర్శులకు స్పష్టంచేస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బి.శివవంకరరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టుకు సహకరించాల్సిన అదనపు ఏజీ ఎదురుదాడికి దిగారని, న్యాయవ్యవస్థను అవమానపరిచేలా మాట్లాడారని.. అయినా కూడా, ఈ కోర్టు తనను తాను నియంత్రించుకుంటూ తప్పని పరిస్థితుల్లో ఇరువురు కార్యదర్శులకు బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయాల్సి వస్తోందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒకసారి కోర్టు ధిక్కరణ కింద ఫారం–1 నోటీసులు అందుకున్న తర్వాత, ఇరువురు కార్యదర్శులు కోర్టు ముందు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టంచేశారు. మినహాయింపు ఎలా కోరతారు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లను సభ నుంచి బహిష్కరిస్తూ చేసిన తీర్మానాన్ని, వారి అసెంబ్లీ స్థానాలను ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ తదనుగుణంగా జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ జస్టిస్ శివశంకరరావు గతేడాది తీర్పు వెలువరించారు. అయితే, ఈ తీర్పును అమలు చేయకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, న్యాయశాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులపై కోమటిరెడ్డి, సంపత్‌లు కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చింది. అసెంబ్లీ కార్యదర్శి తరఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదనలు వినిపిస్తారని, అందువల్ల విచారణను వాయిదా వేయాలని ఓ న్యాయవాది కోరారు. ఇందుకు న్యాయమూర్తి జస్టిస్ శివశంకరరావు నిరాకరించారు. కోర్టు ధిక్కరణ కింద ఫారం–1 నోటీసులు అందుకున్న ఇరువురు కార్యదర్శులు.. కోర్టు ముందు హాజరవుతారని తెలిపారని, మళ్లీ ఇప్పుడు హాజరు నుంచి మినహాయింపు ఎలా కోరతారని ప్రశ్నిస్తూ విచారణను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. నేను చెప్పేది వినండి... తిరిగి ఈ కేసు మధ్యాహ్నం విచారణకు వచ్చినప్పుడు న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు తరఫున హాజరైన అదనపు ఏజీ జె.రామచంద్రరావు విచారణను వాయిదా వేయాలని కోరబోగా, న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘గతంలో కూడా మీరు ఇలాగే వాయిదా కోరారు. కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటున్న వారు కోర్టు ముందు హాజరవుతారని చెప్పారు. మరి కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటున్న వారు నిబంధనల ప్రకారం కోర్టు ముందు హాజరు కావాల్సిన అవసరం ఉందా? లేదా? చెప్పండి’అని అడిగారు. దీంతో ఏఏజీ తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. ‘వాటీజ్ దిస్ నాన్సెన్స్’అంటూ న్యాయమూర్తిని ఉద్దేశించి అనుచితంగా వ్యాఖ్యానించారు. ‘ఈ కేసును ఇంత అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏముంది? విచారించేందుకు ఏం ఆధారాలున్నాయి? నేను చెప్పేది వినండి’అంటూ తీవ్రస్వరంతో మాట్లాడారు. ఏఏజీ తీరుతో న్యాయవాదులందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గుడ్‌సెన్స్‌తో అడుగుతున్నా.. ఏఏజీ అంత తీవ్రంగా మాట్లాడినప్పటికీ.. న్యాయమూర్తి ఏ మాత్రం చలించకుండా, ‘నాన్సెన్స్‌తో కాదు.. గుడ్‌సెన్స్‌తో అడుగుతున్నా. మీరు ఏం చెప్పాలనుకున్నారో చెప్పండి’అని ఏఏజీని అడిగారు. కోర్టు ధిక్కార పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన తర్వాత, ధిక్కరణ ఎదుర్కొంటున్న వారు కోర్టు ముందు హాజరు కావాల్సిన అవసరం ఉందా? లేదా? అని ప్రశ్నించారు. ఈ ధిక్కార వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించలేదని రామచంద్రరావు చెప్పగా.. విచారణకు స్వీకరించినట్టు న్యాయమూర్తి స్పష్టంచేశారు. ఇరువురు కార్యదర్శులు కోర్టు ముందు హాజరవుతారని గత విచారణ సందర్భంగా ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. మీకు కావాల్సిన విధంగా... ఈ దశలో ఏఏజీ మరోసారి తీవ్రస్థాయిలో ఊగిపోతూ.. కోర్టు ధిక్కార పిటిషన్‌ను మూసివేయాలని ధర్మాసనం ఆదేశాలు ఉండగా, ఎలా విచారణ జరుపుతారని ప్రశ్నించారు. ఈ కేసులో ఏదో చేయాలని ముందే నిర్ణయించుకుని (ప్రీ మైండెడ్) ఉంటే ఆ మేర ఉత్తర్వులు జారీ చేయవచ్చునని, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సీనియర్ న్యాయవాది వాయిదా కోరితే ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ రద్దయిన నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ అవసరం లేదని, దానిని మూసేయాలని ధర్మాసనం తన ఉత్తర్వుల్లో చెప్పిందని ఏఏజీ చెప్పగా.. అలా జారీ చేయడానికి వీల్లేదని న్యాయమూర్తి స్పష్టంచేశారు. అయితే, అలా ఇవ్వొచ్చంటూ ఏఏజీ విసురుగా కోర్టు నుంచి బయటకు వెళ్లిపోతుండగా, న్యాయమూర్తి ఆయన్ను ఆగాలని చెప్పి ఉత్తర్వులు జారీ చేయడం ప్రారంభించారు. కోర్టులో ఏఏజీ వ్యవహారశైలిని మొత్తం తన ఉత్తర్వుల్లో పొందుపరిచారు. గతంలో వాయిదాలు తీసుకున్న విషయాన్ని కూడా అందులో ప్రస్తావించారు. కోర్టుకు సహకరిస్తూ, న్యాయస్థానం ప్రతిష్టను కాపాడాల్సిన ఏఏజీ.. కోర్టుపై ఎదురుదాడికి దిగారని తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఇరువురు కార్యదర్శులకు బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌లను ఎమ్మెల్యేలుగా గుర్తించాలంటూ హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునివ్వగా.. ఈ తీర్పును రెండు నెలలపాటు సస్పెండ్ చేస్తూ డివిజన్ బెంచ్ మంగళవారం ఉత్తర్వులు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్ చేయడంతో.. దీనిపై డివిజన్ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ తీర్పుపై డివిజన్ బెంచ్ రెండు నెలలపాటు స్టే విధించింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ గతంలో తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును అమలు చేయకపోవడంపై ఇటీవల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అంతేగాక కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సహ ప్రతివాదిగా చేర్చి, ఫాం 1 నోటీసులిచ్చి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఎందుకివ్వరాదో కూడా తెలియజేయాలని నోటీసుల్లో స్పీకర్‌కు స్పష్టం చేసింది. బహిష్కరణ నోటిఫికేషన్ ఉపసంహరణకు స్పీకర్ అనుమతివ్వకపోవడం ఎలా చూసినా కోర్టు తీర్పును అమలు చేయకపోవడమేనని, ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు పట్ల స్పీకర్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించారని హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు డివిజన్ బెంచ్ తాజా స్టే ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటిదాకా జరిగింది ఇదీ... కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లను బహిష్కరిస్తూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ తీర్మానాన్ని, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న జస్టిస్ శివశంకరరావు తీర్పు ఇచ్చారు. దీనిపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదు. వారికి బదులు 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. వారికి ఆ అర్హత లేదంటూ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. అయినా అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్ వారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇద్దరు కార్యదర్శులూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. వారికి ఫాం 1 నోటీసులిస్తానని స్పష్టం చేశారు. దాంతో కార్యదర్శులు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు 61 రోజుల ఆలస్యంతో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ధర్మాసనం వారికి అనుకూలంగా ఉత్తర్వులివ్వకుండా విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు మంగళవారం మధ్యాహ్నం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు నోటీసులిస్తూ 83 పేజీలతో ఉత్తర్వులు, ఇరువురు కార్యదర్శులకు వ్యక్తిగత హాజరుకు ఫాం 1 నోటీసులిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. -
కోమటిరెడ్డి,సంపత్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు
-
కంప్యూటర్ ఇంజినీర్ కత్తెర పట్టాడు
కంప్యూటర్ కీ బోర్డుపై ఆడించాల్సిన చేతులు.. సెలూన్లో కత్తెర పట్టి హెయిర్ డ్రెస్సింగ్ చేస్తున్నాయి.. కులవృత్తికి మించింది లేదు గువ్వల చెన్నా.. అనే నానుడిని నిజం చేస్తున్నాడీ కంప్యూటర్ ఇంజినీర్.. కులవృత్తిలో రాణిస్తున్నాడు.తానెంచుకున్న వృత్తికి చదువును జోడించి తన ప్రత్యేకతనుచాటుకుంటున్నాడు.అంతేకాకుండా ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన పోటీల్లో బంగారు పతకాన్ని సాధించాడు చారమ్స్ హెయిర్ బ్యూటీ సెలూన్ నిర్వాహకుడు సంపత్ కుమార్. రాంగోపాల్‌పేట్ : సికింద్రాబాద్ కార్ఖానాలోని కాకాగూడకు చెందిన నారాయణ, సత్య దంపతుల కుమారుడు సంపత్‌కుమార్. తండ్రి సికింద్రాబాద్ వైఎంసీఏ కాంప్లెక్స్‌లో చారŠమ్స్ హెయిర్ డ్రెస్సింగ్ పేరుతో రెండు దశాబ్దాలుగా బ్యూటీ సెలూన్ నిర్వహిస్తున్నారు. పలువురు సినీ ప్రముఖుల వద్ద వ్యక్తిగత హెయిర్ డ్రెస్సర్‌గా కూడా పనిచేస్తున్నారు. కుమారుడు సంపత్‌కుమార్ 2011లో బీటెక్ కంప్యూటర్స్ పూర్తి చేశాడు. కొద్దినెలల పాటు ఉద్యోగంలో చేరి నెలకు రూ.25 వేల నుంచి రూ.30వేల జీతం పొందేవాడు. కానీ ఆ ఉద్యోగం నచ్చక తండ్రి వద్దే హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేస్తున్నాడు. అందరిలో ఒకడిగా ఉండకూడదని భావించి భిన్నంగా కనిపించాలని ఈ నిర్ణయానికి వచ్చాడతను. డిప్లొమాలు..ప్రముఖుల వద్ద శిక్షణ సంపత్‌కుమార్ హెయిర్ డ్రెస్సర్ వృత్తిలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని అంతర్జాతీయ పోకడలు, ఫ్యాషన్, తదితర అంశాల్లొ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో డిప్లొమాలు చేశాడు. ముంబైలోని ఉదయ్ టెక్కీస్ ఇనిస్టిట్యూట్‌తో పాటు అంతర్జాతీయ నిపుణుల వద్ద పలు డిప్లొమా కోర్సులు పూర్తి చేశాడు. అంతర్జాతీయంగా వస్తున్న ఫ్యాషన్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, హెయిర్, స్కిన్‌లకు సంబంధించి ఎన్నో కొత్త విషయాలను ఆకళింపు చేసుకుని ముందుకెళ్తున్నాడు. నగరంలోనే ఈ రంగంలో ఇన్ని డిప్లొమాలు చేసి ఎంతో నైపుణ్యం సంపాదించుకున్న వారిలో సంపత్‌కుమార్ లాంటి వారు లేరంటే అతిశయోక్తి కాదు. జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం ఈ నెల 4, 5 తేదీల్లో ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఆలిండియా హెయిర్ అండ్ బ్యూటీ అసోసియేషన్ పోటీలను నిర్వహించింది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది ప్రముఖ హెయిర్ బ్యూటిషియన్లు, మేకప్ ఆర్టిస్ట్‌లు పాల్గొన్నారు. ఇందులో సంపత్‌కుమార్ హెయిర్‌కట్, మేకప్‌లో బంగారు పతకం సాధించాడు. గతంలో సూరత్‌లో జరిగిన పోటీల్లోనూ సంపత్ వెండి పతకం సాధించాడు. త్వరలో అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీల్లో బహుమతి సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇనిస్టిట్యూట్ పెడతా.. ఎంతోమంది తమ కులవృత్తిని వదిలి ఇతర వృత్తుల్లోకి వెళుతున్నారు. రోజురోజుకూ ఫ్యాషన్ ఈ రంగం విస్తృతమవుతోంది. ఈ వృత్తిలో ఉండేవారు నైపుణ్యాలకు మెరుగులు పెట్టుకునేందుకు ఒక ఇనిస్టిట్యూట్‌తో శిక్షణ అందించాలనుకుంటున్నాను.– సంపత్ కుమార్ -
స్కెచ్ ఫ్రమ్ సిటీ
సాక్షి, సిటీబ్యూరో: మియాపూర్ ఠాణా పరిధిలోని గోకుల్ ఫ్లాట్స్‌లో హర్యానా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఈ నెల తొలి వారంలో చిక్కిన మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సంపత్ నెహ్రా వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో అనేక మందిని బెదిరించి డబ్బు దండుకున్న నెహ్రా.. బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్‌నూ విడిచిపెట్టని విషయం విదితమే. అక్కడి పోలీసుల నిఘా తప్పించుకోవడానికి నగరంలో తలదాచుకున్న నెహ్రా... ఇక్కడి నుంచే తన దందాలు యథేచ్ఛగా కొనసాగించాడు. చండీగఢ్‌లోని తన ఐదుగురు ప్రధాన అనుచరుల ద్వారా అనేక నేరాలు చేయించాడు. వాట్సప్ ద్వారా వీరికి ఆదేశాలు జారీ చేస్తూ ‘పనుల’కు పురమాయించాడు. ఈ ఐదుగురినీ అక్కడి మొహాలీ పోలీసులు గత వారం పట్టుకున్నారు. వీరిలో ఆర్మీలో నాయక్ హోదాలో పని చేస్తున్న వ్యక్తి కూడా ఉండటం గమనార్హం. అవసరమైతే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను హత్య చేయాలంటూ ఇతడికి టాస్క్ అప్పగించినట్లు తెలిసింది. ఆ రెండు ప్రాంతాల్లోనే... సంపత్ ప్రధానంగా చండీగఢ్‌లోని మొహాలీ, పంచకుల ప్రాంతాల్లోనే తన దందాలు కొనసాగించాడు. అక్కడి వివిధ ప్రాంతాలకు చెందిన రామ్‌దీప్ సింగ్, శుభ్‌నవ్‌దీప్ సింగ్, జస్పీత్ సింగ్, గుర్వీందర్ సింగ్‌లను తన ప్రధాన అనుచరులుగ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రాంతాల్లో వ్యవహారాలన్నీ వీరి ద్వారానే చేయించేవాడు. రాజస్థాన్‌లోని చురు జిల్లాకు చెందిన దినేష్‌కుమార్ ఆర్మీలోని సిగ్నల్ కారŠప్స్ విభాగంలో నాయక్‌గా పని చేస్తున్నాడు. ఇతడినీ తన అనుచరుడిగా మార్చుకున్న సంపత్.. ప్రత్యేక టాస్క్‌ల కోసం మాత్రమే రంగంలోకి దింపేవాడు. సిటీలో ఇద్దరు ఎంబీఏ విద్యార్థులతో కలిసి లోప్రొఫైల్ జీవితం గడిపిన సంపత్.. నిత్యం చాటింగ్స్, కాల్స్‌తో బిజీగా ఉండేవాడు. వీటి ద్వారానే అనుచరులకు అవసరమైన ఆదేశాలు జారీ చేసేవాడు. మొహాలీ, పంచకుల ప్రాంతాల్లో బెదిరింపులు, దోపిడీలు, బందిపోటు దొంగతనాలతో పాటు కిడ్నాప్స్ సైతం చేయించాడు. దీనికోసం నలుగురు అనుచరులకూ రెండు .315 రివాల్వర్లు, .32 పిస్టల్, తూటాలతో పాటు కత్తులు, కారు సమకూర్చాడు. మొహాలీకి చెందిన వరీంద్రకుమార్ అనే యువకుడిని కిడ్నాప్ చేయించి భారీగా వసూలు చేశాడు. సొహాన ప్రాంతంలో ఓ కారుతో పాటు భారీ నగదు దోచుకున్నారు. సిటీలో సంపత్‌ను పట్టుకున్న తర్వాత మొహాలీ పోలీసులు రామ్‌దీప్ సింగ్, శుభ్‌నవ్‌దీప్ సింగ్, జస్పీత్ సింగ్, గుర్వీందర్ సింగ్‌లతో పాటు దినేష్ కుమార్‌నూ అరెస్టు చేశారు. సెలవుపై వచ్చి ‘డ్యూటీ’... నాయక్ దినేష్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జైపూర్‌లో విధులు నిర్వర్తిస్తున్నాడు. తన గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్న ఇతడిని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సంపత్ వాడేవాడు. ఇతడి నుంచి వర్తమానం అందిన ప్రతిసారీ సెలవు పెట్టుకుని వచ్చే దినేష్ తనకు అప్పగించిన ‘పని’ పూర్తి చేసుకుని తిరిగి వెళ్లేవాడు. అయితే ప్రస్తుతం తాను పూర్తి అజ్ఞాతంలో ఉండటంతో దినేష్‌ను రావాల్సిందిగా సంపత్ సూచించాడు. దీంతో ఏప్రిల్‌లో నెల రోజుల సెలవుపై ఇతగాడు మొహాలీ చేరుకొని మిగిలిన నలుగురు గ్యాంగ్ మెంబర్స్‌తో కలిసి ఉంటున్నాడు. సెలవు పూర్తయినప్పటికీ తిరిగి వెళ్లకుండా అక్కడే ఉండిపోయాడంటే సంపత్ పెద్ద టాస్క్‌నే ఇతడికి అప్పగించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘరానా గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ అనుచరుడిగా పని చేసిన సంపత్ అతడి ఆదేశాల మేరకు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేశాడు. ఆయన నుంచి అందినకాడికి దండుకోవాలనే ఉద్దేశంతో సోషల్‌మీడియా ద్వారా తీవ్రస్థాయిలో బెదిరింపులకు దిగాడు. కృష్ణ జింకల్ని వేటాడిన కేసు విచారణకు హాజరైనప్పుడు జోధ్‌పూర్ కోర్టు ప్రాంగణంలోనే హతమారుస్తానంటూ సల్మాన్‌కు గతేడాది వార్నింగ్ ఇచ్చాడు. దీన్ని పరిగణలోకి తీసుకున్న జోధ్‌పూర్ పోలీసులు సల్మాన్ హాజరైనప్పుడల్లా కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసేవారు. అవసరమైతే సల్మాన్ ‘పని’ చేయాల్సిందిగా సంపత్ నుంచి దినేష్‌కు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయని మొహాలీ పోలీసులు చెప్తున్నారు. తొమ్మిదేళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న దినేష్ ఏఏ నేరాలు చేశాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. -
కోమటిరెడ్డి, సంపత్ కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణా
-
అధ్యయనం తర్వాతే నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వం రద్దుకు సంబంధించిన విషయంలో తన పరిధిలో ఏం చేయగలనో చూస్తున్నానని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఈ అంశంలో ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చారు. సోమవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం స్పీకర్‌ను ఆయన చాంబర్లో కలిసి.. కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా సస్పెండ్ చేశారని, ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదని, స్పీకర్‌గా ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తూ.. వినతిపత్రం అందజేసింది. దాదాపు అరగంటకుపైగా జరిగిన ఈ భేటీలో స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వాదనలు విన్నారు. ఈ అంశంలో ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యాయం చేస్తారనే నమ్మకముంది: జానా కాంగ్రెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదో ఘటనను సాకుగా చూపి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరించడం, మిగతా సభ్యులందరినీ సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని జానారెడ్డి స్పీకర్‌తో పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం చేస్తారనే నమ్మకంతో వచ్చామని, బహిష్కరించిన సభ్యులకు న్యాయం చేసి సభ ప్రతిష్టను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో గతంలో వచ్చిన తీర్పులను కూడా స్పీకర్‌కు వివరించారు. ఇక శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ కూడా తన వాదన వినిపించారు. ఎలాంటి తప్పూ చేయకున్నా, తమ స్థానాల్లోనే ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీలను కూడా సస్పెండ్ చేశారని... పంచాయతీరాజ్ చట్టంపై కనీస చర్చ జరగకుండా ఆమోదింపజేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క కూడా స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ను కలసిన వారిలో సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లతో పాటు సీఎల్పీ ఉపనేతలు టి.జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, పద్మావతి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎంపీ ఎంఏ ఖాన్, మాజీ మంత్రులు దానం నాగేందర్, మర్రి శశిధర్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, రవీంద్రనాయక్ తదితరులు ఉన్నారు. దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం..: జానా స్పీకర్ మధుసూదనాచారితో సమావేశమైన తర్వాత కాంగ్రెస్ నేతలు విలేకరులతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి సభకు హుందాతనం తీసుకురావాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని జానారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వమైనా స్పందించి ప్రతిష్టను కాపాడుకోవాలని సూచించారు. మధ్యవర్తిగా స్పీకర్ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. లేదంటే ఈ విషయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు. తనకున్న పరిధులు, సందర్భాన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న రీతిలో స్పీకర్ హామీ ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. స్పీకర్ నిర్ణయం కోసం వారం రోజులు వేచి చూస్తామన్నారు. అప్పటికీ నిర్ణయం వెలువడకుంటే తెలంగాణలో శాసనసభను, సమాజాన్ని ఏ విధంగా అవమానపరుస్తున్నారనే విషయాన్ని రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేస్తామని.. జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు.