సాక్షి, హైదరాబాద్ : దేశంలో పలు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మాఫియా డాన్ సంపత్ నెహ్రా పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో గత కొంత కాలంగా పోలీసుల కన్నుగప్పి తలదాచుకుంటన్నాడు. ఈ నేపథ్యంలో పక్క సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్‌ఓటీ, హరియాణా స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా జరిపిన దాడుల్లో పట్టుబడ్డాడు.
సంపత్ హరియాణాలో మాఫియా డాన్‌గా ఎదిగాడు. లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడ్డాడు. అయితే ఎప్పుడు ఎవరికీ కనిపించకుండా తన సామ్రాజ్యాన్ని పక్క రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరించాడు. ఎదిరించిన వారిని ఆధారాలు లేకుండా అంతమొందించడం సంపత్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు దాడులు జరపడంతో ఇరువై రోజుల క్రితం భాగ్యనగరానికి పారిపోయి వచ్చాడు. ఎవరికీ తెలియకుండా మియాపూర్‌లో తన కార్యకలాపాలు జరుపుతున్నాడు.
ఈనేపథ్యంలో సంపత్ గురించి పక్కా సమాచారం అందుకున్న హరియాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి తుపాకులను స్వాథీనం చేసుకున్నారు. మూడు రాష్ట్రాల్లో దాదాపు పది హత్య కేసులు, మూడు హత్యాచార కేసులు, పదుల సంఖ్యలో దోపిడీలు, బెదిరింపుల కేసులు నమోదైనట్లు హరియాణ పోలీసులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment