Nehra
-
హర్యానా మాఫియా డాన్ అరెస్ట్
-
మాఫియా డాన్ సంపత్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : దేశంలో పలు రాష్ట్రాలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన మాఫియా డాన్ సంపత్ నెహ్రా పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్‌లోని మియాపూర్‌లో గత కొంత కాలంగా పోలీసుల కన్నుగప్పి తలదాచుకుంటన్నాడు. ఈ నేపథ్యంలో పక్క సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ, హరియాణా స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉమ్మడిగా జరిపిన దాడుల్లో పట్టుబడ్డాడు. సంపత్ హరియాణాలో మాఫియా డాన్‌గా ఎదిగాడు. లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడ్డాడు. అయితే ఎప్పుడు ఎవరికీ కనిపించకుండా తన సామ్రాజ్యాన్ని పక్క రాష్ట్రాలైన పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలకు విస్తరించాడు. ఎదిరించిన వారిని ఆధారాలు లేకుండా అంతమొందించడం సంపత్‌కు వెన్నతో పెట్టిన విద్య. అయితే పక్కా ప్రణాళిక ప్రకారం పోలీసులు దాడులు జరపడంతో ఇరువై రోజుల క్రితం భాగ్యనగరానికి పారిపోయి వచ్చాడు. ఎవరికీ తెలియకుండా మియాపూర్‌లో తన కార్యకలాపాలు జరుపుతున్నాడు. ఈనేపథ్యంలో సంపత్ గురించి పక్కా సమాచారం అందుకున్న హరియాణ పోలీసులు, హైదరాబాద్ పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి తుపాకులను స్వాథీనం చేసుకున్నారు. మూడు రాష్ట్రాల్లో దాదాపు పది హత్య కేసులు, మూడు హత్యాచార కేసులు, పదుల సంఖ్యలో దోపిడీలు, బెదిరింపుల కేసులు నమోదైనట్లు హరియాణ పోలీసులు వెల్లడించారు. -
కిర్‌స్టెన్... ఇక ఆర్సీబీ కోచ్
బెంగళూరు: భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఇటీవల రిటైరైన పేసర్ ఆశిష్ నెహ్రాకు బౌలింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏప్రిల్‌లో మొదలయ్యే ఐపీఎల్ 11వ సీజన్లో వీళ్లిద్దరు జట్టు మెంటార్లుగానూ వ్యవహరిస్తారని ఆర్సీబీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉన్న వెటోరీ జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగుతారు. గ్యారీకి ఐపీఎల్ కోచింగ్ కొత్తకాదు. 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్‌గా పనిచేశారు. కొత్త నియామకాలపై చీఫ్ కోచ్ వెటోరీ మాట్లాడుతూ ‘గ్యారీ, నెహ్రాలతో పనిచేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. వాళ్లిద్దరు అపార అనుభవజ్ఞులు. జట్టును సరైన దిశలో నడిపించగల సమర్థులు’ అని అన్నారు. భారత వన్డే జట్టుకు విజయవంతమైన కోచ్ (2011 ప్రపంచకప్ విజేత)గా నిష్క్రమించిన కిర్‌స్టెన్‌కు టి20 కోచింగ్‌లో పేలవమైన రికార్డు ఉంది. భారత్, దక్షిణాఫ్రికాలకు కోచ్‌గా వ్యవహరించినప్పటికీ మెరుగైన ఫలితాలతో మెప్పించలేకపోయారు. -
కేప్‌టౌన్‌లో బుమ్రాను ఆడించాలి: నెహ్రా
న్యూఢిల్లీ: భారత్, దక్షిణాఫ్రికా మధ్య కేప్‌టౌన్‌లో జరిగే తొలి టెస్టులో యువ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను ఆడించాలని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అన్నారు. ‘టీమ్ మేనేజ్మెంట్ మదిలో ఏముందో నాకైతే తెలీదు... కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ వికెట్ బుమ్రాకు సరిగ్గా నప్పుతుంది. రంజీల్లో గుజరాత్ తరఫున అద్భుతమైన యార్కర్లతో చెలరేగాడు. అతని బౌలింగ్ శైలి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ఇబ్బందికరంగా ఉంటుంది. పైగా సుదీర్ఘమైన స్పెల్స్ వేయగలడు. ఇవన్నీ సఫారీ గడ్డపై అతనికి కలిసొస్తాయి’ అని నెహ్రా విశ్లేషించారు. ఈ జనవరిలో కేప్‌టౌన్ వాతావరణం ఎండవేడిమితో ఉంటుందని, సీమర్లకు ఇది కాస్త ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే షమీ, ఇషాంత్‌ల తర్వాతే మూడో సీమర్ ఎవరనే చర్చ ఉంటుందని చెప్పారు. ఇషాంత్ తన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను అదేపనిగా అసహనానికి గురి చేస్తాడని, దీనివల్ల మరో ఎండ్‌లో బౌలర్‌కు దొరికిపోతారన్నారు. -
అడిగి రాలేదు అడిగి పోలేదు
న్యూఢిల్లీ: చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తన ఎంపికపై చేసిన వ్యాఖ్యలను ఆశిష్ నెహ్రా తప్పుబట్టాడు. కివీస్‌తో సిరీస్ వరకే తన పేరును పరిశీలిస్తామని ఆ తర్వాత చర్చించమని ఎమ్మెస్కే... నెహ్రాతో చెప్పినట్లు వార్తలొచ్చాయి. అందువల్లే మీరు తప్పుకున్నారా అని మీడియా ప్రశ్నించగా ఢిల్లీ మాజీ సీమర్ ఘాటుగా బదులిచ్చాడు. ‘అప్పుడు ఆటలోకి సెలక్టర్ల అనుమతితో రాలేదు... ఇప్పుడు ఆట నుంచి సెలక్టర్ల అనుమతితో నిష్క్రమించడం లేదు’ అని చురక అంటించాడు. 18 ఏళ్ల కెరీర్‌కు నెహ్రా బుధవారం కివీస్‌తో జరిగిన మ్యాచ్‌తో గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. టి20 జట్టు ఎంపిక చేసిన సమయంలో ఎమ్మెస్కే ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ ‘ఢిల్లీ మ్యాచ్‌లో నెహ్రాను ఆడిస్తామనే హామీ ఇవ్వలేదు. ఈ విషయాన్ని అతనికి చెప్పాం. తుది జట్టులో ఆడటంపై టీమ్ మేనేజ్మెంట్దే నిర్ణయాధికారం’ అని స్పష్టం చేశారు. దీనిపై నెహ్రా చిటపటలాడాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్‌తో తాను ఆడేదీ లేనిది చర్చించలేదని చెప్పాడు. ఆయనెందుకు ఇలా చెప్పారో తనకు తెలీదన్నాడు. ‘నా రిటైర్మెంట్పై తొలుత నేను మాట్లాడింది కోహ్లితోనే. కోచ్ రవిశాస్త్రికీ ఈ విషయం చెప్పాను. వీళ్లిద్దరు మినహా ఇంకెవరితోనూ ముచ్చటించలేదు’ అని 38 ఏళ్ల నెహ్రా అన్నాడు. అదృష్టవశాత్తూ సొంతగడ్డ (ఢిల్లీ)పై చివరి మ్యాచ్ ఆడే అవకాశం లభించిందన్నాడు. వ్యాఖ్యానమా... శిక్షణా? ముందస్తు ప్రణాళికతోనే రిటైరైనప్పటికీ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌పై నెహ్రా ఇంకా నిర్ణయించుకోలేదు. బౌలింగ్ కోచ్‌గా వస్తాడా లేక క్రికెట్ వ్యాఖ్యాతగా మారతాడా అనే విషయంపై చెప్పలేకపోయాడు. ‘తర్వాత ఏంటో నాకైతే తెలియదు. నేనింకా దీనిపై తీరిగ్గా కూర్చుని ఆలోచించలేదు. తదుపరి కోచింగా... వ్యాఖ్యానమా అనేది ఇప్పుడే చెప్పలేను. ఫేర్వెల్ గేమ్‌లో నా చివరి ఓవర్‌ను పూర్తి చేయల్సిందిగా కోహ్లి బంతిని అప్పగించడం మరవలేను. ఆఖరి ఓవర్ నా భావోద్వేగాల్ని తడిమింది. అప్పుడు నేను 1997లో హరియాణాపై వేసిన తొలి ఓవర్ గుర్తొచ్చింది’ అని అన్నాడు. బ్యాట్స్‌మెన్ ఫ్రెండ్లీ గేమ్‌లో కొత్త బంతులతో బౌలర్లకు ఎప్పుడు సవాళ్లేనన్నాడు. ‘ఒకప్పుడు 200 పరుగులే గొప్ప తర్వాత 250... ఆ తర్వాత 300 ఇప్పుడు 350కి చేరింది. దీనికి విరుగుడు ఒకే కొత్తబంతిని ఇవ్వాలి. సర్కిల్‌కు ఆవల ఐదుగురు ఫీల్డర్లను వినియోగించాలి. దీంతో 350 కాస్త 320కి... క్రమంగా 280కి తగ్గుతుంది’ అని అన్నాడు. -
బీమా చేసినా ధీమాగా డబ్బులు రాలేదు
నెహ్రా, యువరాజ్‌ల ఎదురుచూపులు ముంబై: ఐపీఎల్లో ఆటగాళ్లు గాయపడితే వారికి ఆర్థిక నష్టం జరగకూడదనే సదుద్దేశంతో బీసీసీఐ తమ కాంట్రాక్టు ప్లేయర్లకు బీమా సదుపాయాన్ని కల్పించింది. కానీ చిత్రంగా ఆరేళ్ల కిందటి ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఇంతవరకు ఆటగాడికి అందకపోవడం విడ్డూరంగా ఉంది. లెఫ్టార్మ్ సీమర్ ఆశిష్ నెహ్రా వేలి గాయంతో 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు . అతనికి ఇప్పటికీ 40 శాతం సొమ్మే చేతికందగా... ఇంకా 60 శాతందాకా బీమా డబ్బు అందనే లేదు. నెహ్రా తొడ కండరాల గాయంతో గత సీజన్ మొత్తం ఆడలేదు. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా బకాయి పడింది. చీలమండ గాయంతో యువరాజ్ గత సీజన్లో రెండు వారాలు ఆడలేకపోయాడు. ఇతనికి కూడా బీమా సొమ్ము అందలేదు. -
ఆఖరి ఓవర్లో గెలిపించిన ’బుమ్రా’
-
భళా... బుమ్రా
ఆఖరి ఓవర్లో గెలిపించిన పేసర్ ఇంగ్లండ్‌పై రెండో టి20లో భారత్ గెలుపు రాణించిన రాహుల్, నెహ్రా సిరీస్‌లో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు అద్భుత పోరాటాన్ని ప్రదర్శించింది. రాహుల్ మినహా బ్యాట్స్‌మెన్ విఫలమైన చోట.. బౌలర్లు మాత్రం స్ఫూర్తిదాయక ప్రదర్శనతో జట్టుకు కీలక విజయాన్ని అందించారు. ప్రారంభంలో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన నెహ్రా ఇంగ్లండ్ పతనానికి బాట వేయగా... ఆఖరి ఓవర్లో బుమ్రా రెండు వికెట్లు తీసి సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. నాగ్‌పూర్: చివరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి కావాల్సిన పరుగులు 8... క్రీజులో ఉన్నది స్టార్ బ్యాట్స్‌మన్ జో రూట్‌తో పాటు బౌండరీలతో జోరు మీదున్న బట్లర్. భారత అభిమాని ఆశలు అడుగంటిన ఈ పరిస్థితిలో మీడియం పేసర్ జస్ప్రీత్ బుమ్రా అద్భుతమే చేశాడు. నాలుగు బంతుల వ్యవధిలో వీరిద్దరిని పెవిలియన్‌కు పంపించడంతోపాటు కేవలం రెండు పరుగులే ఇవ్వడంతో భారత జట్టు 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా (3/28) కూడా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను భారత్ 1–1తో సమం చేసింది. మూడో టి20 ఫిబ్రవరి 1న బెంగళూరులో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 144 పరుగులు చేసింది. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (47 బంతుల్లో 71; 6 ఫోర్లు; 2 సిక్సర్లు) సూపర్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. మనీష్ పాండే (26 బంతుల్లో 30; 1 సిక్స్), కోహ్లి (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 139 పరుగులు చేసి ఓడిపోయింది. రాహుల్ ఒక్కడే: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మరోసారి శుభారంభం దక్కలేదు. తొలి మూడు ఓవర్లలో ఐదు పరుగులే రాగా... నాలుగో ఓవర్లో కోహ్లి వరుసగా సిక్స్, ఫోర్‌తో 15 పరుగులు రాబట్టి టచ్‌లోకి వచ్చాడు. అయితే మరుసటి ఓవర్లో జోర్డాన్ వేసిన స్లో బంతిని లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడి క్యాచ్ అవుటయ్యాడు. కొద్దిసేపటికే రైనా (7), యువరాజ్ (4) కూడా అవుట్ కావడంతో భారత్ 69 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మనీష్ పాండేతో కలిసి ఓపెనర్ రాహుల్ తన జోరును కొనసాగిస్తూ రన్‌రేట్ పెంచే ప్రయత్నం చేశాడు. అయితే చివరి ఐదు ఓవర్లలో ఇంగ్లండ్ బౌలర్లు 36 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసి భారత్‌ను కట్టడి చేశారు. నెహ్రా ఝలక్: స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు నాలుగో ఓవర్లోనే పేసర్ ఆశిష్ నెహ్రా గట్టి ఝలక్ ఇచ్చాడు. అంతకుముందు ఓవర్లో ఓపెనర్లు బిల్లింగ్స్ (12), రాయ్ (10) చెరో సిక్స్ బాదినా నెహ్రా వీరిద్దరిని వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చాడు. ఈ దశలో రూట్, మోర్గాన్ (17; 1 ఫోర్) పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. మిశ్రా వేసిన ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో రూట్ వరుసగా రెండు ఫోర్లు బాదాడు. అయితే తన తర్వాతి ఓవర్ తొలి బంతికే మోర్గాన్ వికెట్ తీసి ఇంగ్లండ్‌కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత స్టోక్స్ రెచ్చిపోయి రైనా ఓవర్లో వరుసగా 4, 6.. చాహల్ బౌలింగ్‌లో మరో సిక్స్‌తో బ్యాట్‌ను ఝళిపించాడు. నెహ్రా 17వ ఓవర్లో స్టోక్స్‌ను ఎల్బీగా అవుట్ చేయగా... 18వ ఓవర్లో బుమ్రా కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి ఇంగ్లండ్‌ను ఒత్తిడిలోకి నెట్టడంతో పాటు చివరి ఓవర్లో మాయే చేసి అనూహ్య ఫలితాన్ని అందించాడు. -
నెహ్రా మోకాలి ఆపరేషన్ సక్సెస్
లండన్: ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ గాయపడ్డ భారత పేసర్ ఆశిష్ నెహ్రా కుడి మోకాలికి శస్త్ర చికిత్స ముగిసింది. వైద్య నిపుణుల సలహా మేరకు లండన్‌లోని ప్రముఖ వైద్యులు విలియమ్సన్ దగ్గర నెహ్రా మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ మేరకు నెహ్రా శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నెహ్రా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. -
అస్త్రాలన్నీ సరిగానే..!
గతంలో ఏ టి20 ప్రపంచకప్ కోసం కూడా భారత్ ఇంతగా సన్నద్ధం కాలేదు. ఈసారి స్వదేశంలో టోర్నీ జరుగుతుండటం వల్ల కావచ్చు... నెల రోజుల ముందు నుంచే ఈ ఫార్మాట్లోకి మారిపోయారు. ఆస్ట్రేలియాను వారి గడ్డపై చిత్తు చేసి, ఆ తర్వాత స్వదేశంలో లంకను ఓడించి... తాజాగా ఆసియాకప్‌లో టైటిల్‌తో ప్రపంచకప్‌కు ముందు కావలసినంత మ్యాచ్ ప్రాక్టీస్ సంపాదించారు. జట్టులో ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉండటం, ఒకరు విఫలమైతే మరొకరు బాధ్యతగా ఉండటం వల్ల ధోనిసేన అప్రతిహత విజయాలు సాధించింది. జట్టులో అస్త్రాలన్నీ సరిగానే ఉన్నాయని ఆసియాకప్‌తో అర్థమైంది. ఇక వీటిని ప్రపంచకప్‌లో వినియోగించడమే తరువాయి. సాక్షి క్రీడావిభాగం ఆసియాకప్ టి20లో ఏ జట్టు కూడా భారత్‌కు కనీసం పోటీ ఇవ్వలేకపోయింది. ఎన్నో అంచనాలతో వచ్చిన పాకిస్తాన్ జట్టు మన ముందు పూర్తిగా తేలిపోయింది. అలాగే పూర్తిస్థాయి జట్టుతో దిగిన డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ శ్రీలంక కూడా ధోనిసేన ముందు నిలబడలేకపోయింది. బంగ్లాదేశ్ జట్టు మిగిలిన ప్రత్యర్థులందరినీ ఓడించినా భారత్‌పై మాత్రం రెండు మ్యాచ్‌ల్లోనూ పెద్దగా ప్రభా వం చూపలేదు. దీనికి కారణం భారత జట్టు అన్ని విభాగాల్లోనూ బలంగా ఉండ టం, తన బలానికి తగ్గ సాధికారికత ప్రదర్శించడం. ఆసియాకప్‌లో భారత ప్రదర్శన చూసిన తర్వాత ప్రపంచంలోని మిగిలిన జట్లు కూడా టి20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌కు బలంగా సన్నద్ధమవ్వాల్సిందే. టాప్ ఆర్డర్ సూపర్ టోర్నీ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో బ్యాటింగ్‌కు కఠినమైన వికెట్‌పై సంచలన ఇన్నింగ్స్‌తో రోహిత్ తాను ఫామ్‌లోనే ఉన్నానని చూపించాడు. శిఖర్ ధావన్ పూర్తి సత్తా బయటకు రాకపోయినా... ఫైనల్లో సమయోచిత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక విరాట్ కోహ్లి ఆస్ట్రేలియా పర్యటన నుంచి అదే ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్ అత్యద్భుతం. ఎలాంటి క్లిష్టమైన పిచ్ అయినా, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా ఇన్నింగ్స్‌ను నిర్మించుకుంటూ వంద స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు చేయడం సామాన్యమైన విషయం కాదు. కోహ్లి, రోహిత్ ఇద్దరూ ఆడితే భారత్ ఎలాంటి ప్రత్యర్థిపైనైనా గెలవడం ఖాయం. మొత్తం మీద టాప్ ఆర్డర్ పటిష్టంగా ఉండటం మంచి పరిణామం. యువీ కుదురుకున్నాడు నాలుగో స్థానంలో రైనా ఆడతాడని ఈ టోర్నీకి ముందే నిర్ణయించారు. అతను కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా, అవసరమైన సమయంలో మ్యాచ్‌ను ఒంటిచేత్తో మార్చగలడని ఆస్ట్రేలియాలో చూపించాడు. ఐపీఎల్ అనుభవం దృష్ట్యా ప్రస్తుత లైనప్‌లో అత్యంత ముఖ్యమైన టి20 క్రికెటర్ రైనా. ఇక యువరాజ్ సింగ్ కూడా తనకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లికి అండగా నిలబడటం, శ్రీలంకపై మెరుపు ఇన్నింగ్స్ ఆడటం వల్ల తను పూర్తిగా కుదురుకున్నట్లే. ఇక ధోని ఆఖరి ఓవర్లలో సిక్సర్లు బాదగల సత్తా తనలో ఇంకా ఉందని నిరూపించుకుని, పాత ధోనిలా మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. ఆల్‌రౌండర్ల బలం ఈ నెల రోజుల కాలంలో భారత క్రికెట్‌కు బాగా జరిగిన మేలు హార్దిక్ పాండ్యా. పేస్ బౌలర్‌గా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేస్తున్నాడు. నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లోనూ భారీ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. హార్దిక్ పాండ్యా వల్ల పేస్ బౌలింగ్ వికెట్ మీద కూడా ఇద్దరే సీమర్లతో భారత్ నెట్టుకురాగలిగింది. మూడో పేసర్‌గా, ఆల్‌రౌండర్‌గా పాండ్యా ఈ ప్రపంచకప్‌లో కీలకం కానున్నాడు. ఇక జడేజాకు బ్యాటింగ్ విషయంలో పెద్దగా అవకాశాలు రాకపోయినా బంతితో ఆకట్టుకున్నాడు. అలాగే మైదానంలో మెరుపు ఫీల్డింగ్‌తో అదరగొడుతున్నాడు. అశ్విన్ భారత్‌కు ప్రధాన బౌలర్. ఇన్నింగ్స్‌లో ఏ దశలో అయినా బౌలింగ్ చేయగల నైపుణ్యం, మ్యాచ్‌లు గెలిపించగల సామర్థ్యం ఉన్న అశ్విన్ బంగ్లాదేశ్‌లోనూ ఆకట్టుకున్నాడు. ఇక తన దాకా బ్యాటింగ్ అవకాశం వస్తే తన వంతుగా కచ్చితంగా జట్టుకు పరుగులు సాయం చేయగల నైపుణ్యం అశ్విన్‌నూ ఆల్‌రౌం డర్‌ను చేసింది. మొత్తానికి ఈ త్రయం ప్రపంచకప్‌లో రాణిస్తే భారత్‌కు ఎదురుండదు. బుమ్రా, నెహ్రా జోడీ అదుర్స్ భారత్‌కు ఇద్దరు ప్రధాన పేసర్లుగా నెహ్రా, బుమ్రా ప్రపంచకప్ ఆడతారని రెండు నెలల క్రితం ఎవరూ ఊహించి కూడా ఉండరు. అనుకోకుండా ఈ ఇద్దరికీ ఆస్ట్రేలియా పర్యటనకు జట్టులో స్థానం దక్కింది. అక్కడ లభించిన అవకాశాలను ఈ ఇద్దరూ పూర్తిగా వినియోగించుకున్నారు. పవర్‌ప్లేలో ఆరు ఓవర్లు ఈ ఇద్దరూ పూర్తి చేస్తారు. నెహ్రా తన అనుభవాన్ని ఉపయోగించి స్వింగ్‌తో ఆరంభంలో అదరగొడుతున్నాడు. లేటు వయసులోనూ తనలో సత్తా తగ్గలేదని నిరూపించాడు. ఇక బుమ్రా అయితే భారత జట్టుకు లభించిన వరం అ నుకోవాలి. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నప్పుడు మలింగ నుంచి యార్కర్లు నేర్చుకున్న బుమ్రా... ఇప్పుడు అదే తన ప్రధాన ఆయుధంగా వాడుతున్నాడు. ఆరంభ ఓవర్లతో పోలిస్తే స్లాగ్ ఓవర్లలో తను బాగా ఉపయోగపడతాడు. పరిస్థితిని బట్టి ధోని తనని వాడుతున్నాడు. రిజర్వ్‌లూ ఫామ్‌లోనే... ఇక ఆసియాకప్ ద్వారా భారత్‌కు మరో అంశంలోనూ స్పష్టత వచ్చింది. ఒకవేళ తుది జట్టులో ఎవరైనా గాయపడితే ఆ స్థానంలో ఆడటానికి అందుబాటులో ఉన్న రిజర్వ్ ఆటగాళ్లు అందరూ ఫామ్‌లో ఉండటం శుభసూచకం. టాపార్డర్, మిడిలార్డర్... ఇలా ఏ స్థానంలో అయినా ఆడగల రహానే బ్యాట్స్‌మెన్ అందరికీ బ్యాకప్‌గా ఉన్నాడు. నిజానికి రహానే అద్భుతమైన ఆటగాడు. అయినా తుది జట్టులో చోటు లేదంటే భారత బ్యాటింగ్ ఆర్డర్ ఎంత పటిష్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. జడేజాకు బ్యాకప్‌గా పవన్ నేగి, అశ్విన్‌కు బ్యాకప్‌గా హర్భజన్, పేసర్లిద్దరికీ బ్యాకప్‌గా భువనేశ్వర్ ఉన్నారు. వీళ్లు ముగ్గురు కూడా యూఏఈపై చక్కగా బౌలింగ్ చేశారు. కాబట్టి రిజర్వ్‌ల ఫామ్ విషయంలో ఎలాంటి అనుమానాలూ లేవు. అయితే ప్రపంచకప్ జట్టులో భువనేశ్వర్ లేడు. షమీ గాయం నుంచి కోలుకోకపోతేనే భువనేశ్వర్ వస్తాడు. ఏదేమైనా అన్ని విభాగాల్లోనూ భారత జట్టు ప్రస్తుతం అత్యంత పటిష్టంగా ఉంది. ఎలాంటి పిచ్‌లపై అయినా విజయాలు సాధించగలమని ఈ రెండు నెలల్లో చూపించారు.