నెహ్రా, యువరాజ్‌ల ఎదురుచూపులు
ముంబై: ఐపీఎల్‌లో ఆటగాళ్లు గాయపడితే వారికి ఆర్థిక నష్టం జరగకూడదనే సదుద్దేశంతో బీసీసీఐ తమ కాంట్రాక్టు ప్లేయర్లకు బీమా సదుపాయాన్ని కల్పించింది. కానీ చిత్రంగా ఆరేళ్ల కిందటి ఇన్సూరెన్స్ సొమ్ము కూడా ఇంతవరకు ఆటగాడికి అందకపోవడం విడ్డూరంగా ఉంది. లెఫ్టార్మ్ సీమర్ ఆశిష్ నెహ్రా వేలి గాయంతో 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌తో పాటు ఐపీఎల్‌కు దూరమయ్యాడు
. అతనికి ఇప్పటికీ 40 శాతం సొమ్మే చేతికందగా... ఇంకా 60 శాతందాకా బీమా డబ్బు అందనే లేదు. నెహ్రా తొడ కండరాల గాయంతో గత సీజన్ మొత్తం ఆడలేదు. దీనికి సంబంధించిన ఇన్సూరెన్స్ సొమ్ము కూడా బకాయి పడింది. చీలమండ గాయంతో యువరాజ్ గత సీజన్‌లో రెండు వారాలు ఆడలేకపోయాడు. ఇతనికి కూడా బీమా సొమ్ము అందలేదు.