
బెంగళూరు: భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఇటీవల రిటైరైన పేసర్ ఆశిష్ నెహ్రాకు బౌలింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏప్రిల్‌లో మొదలయ్యే ఐపీఎల్ 11వ సీజన్‌లో వీళ్లిద్దరు జట్టు మెంటార్లుగానూ వ్యవహరిస్తారని ఆర్‌సీబీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉన్న వెటోరీ జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగుతారు. గ్యారీకి ఐపీఎల్ కోచింగ్ కొత్తకాదు. 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్‌గా పనిచేశారు.
కొత్త నియామకాలపై చీఫ్ కోచ్ వెటోరీ మాట్లాడుతూ ‘గ్యారీ, నెహ్రాలతో పనిచేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. వాళ్లిద్దరు అపార అనుభవజ్ఞులు. జట్టును సరైన దిశలో నడిపించగల సమర్థులు’ అని అన్నారు. భారత వన్డే జట్టుకు విజయవంతమైన కోచ్ (2011 ప్రపంచకప్ విజేత)గా నిష్క్రమించిన కిర్‌స్టెన్‌కు టి20 కోచింగ్‌లో పేలవమైన రికార్డు ఉంది. భారత్, దక్షిణాఫ్రికాలకు కోచ్‌గా వ్యవహరించినప్పటికీ మెరుగైన ఫలితాలతో మెప్పించలేకపోయారు.
Comments
Please login to add a commentAdd a comment