Kirsten
-
కిర్‌స్టెన్... ఇక ఆర్సీబీ కోచ్
బెంగళూరు: భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ ఇప్పుడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు. ఇటీవల రిటైరైన పేసర్ ఆశిష్ నెహ్రాకు బౌలింగ్ కోచ్ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏప్రిల్‌లో మొదలయ్యే ఐపీఎల్ 11వ సీజన్లో వీళ్లిద్దరు జట్టు మెంటార్లుగానూ వ్యవహరిస్తారని ఆర్సీబీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉన్న వెటోరీ జట్టు ప్రధాన కోచ్‌గా కొనసాగుతారు. గ్యారీకి ఐపీఎల్ కోచింగ్ కొత్తకాదు. 2015లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ కోచ్‌గా పనిచేశారు. కొత్త నియామకాలపై చీఫ్ కోచ్ వెటోరీ మాట్లాడుతూ ‘గ్యారీ, నెహ్రాలతో పనిచేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. వాళ్లిద్దరు అపార అనుభవజ్ఞులు. జట్టును సరైన దిశలో నడిపించగల సమర్థులు’ అని అన్నారు. భారత వన్డే జట్టుకు విజయవంతమైన కోచ్ (2011 ప్రపంచకప్ విజేత)గా నిష్క్రమించిన కిర్‌స్టెన్‌కు టి20 కోచింగ్‌లో పేలవమైన రికార్డు ఉంది. భారత్, దక్షిణాఫ్రికాలకు కోచ్‌గా వ్యవహరించినప్పటికీ మెరుగైన ఫలితాలతో మెప్పించలేకపోయారు. -
రాజ్‌కోట్ కోచ్‌గా కిర్‌స్టెన్?
ముంబై: గత సీజన్ వరకు ఐపీఎల్లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన గ్యారీ కిర్‌స్టెన్ వచ్చే సీజన్ ఐపీఎల్లో రాజ్‌కోట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇంటెక్స్ సంస్థకు చెందిన రాజ్‌కోట్ ఫ్రాంఛైజీ ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమచారం. ఈ జట్టులో ఉన్న స్టార్ క్రికెటర్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలతో గతంలో భారత జట్టు కోచ్‌గా కిర్‌స్టెన్ కలిసి పని చేశారు. డ్రాఫ్ట్‌లో తీసుకున్న ఆటగాళ్లకు ఆ జట్టు యాజమాన్యం ఇప్పటికే కిర్‌స్టెన్ గురించి చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ జట్టు ఈ సీజన్లో కొత్త కోచ్‌ను తీసుకోవడం కోసం కిర్‌స్టెన్‌ను తొలగించింది. పుణే జట్టుతో ఫ్లెమింగ్ చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ధోనిల అనుబంధం వచ్చే ఐపీఎల్ సీజన్లోనూ కొనసాగనుంది. ధోని కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న కొత్త ఫ్రాంచేజీ పుణే... ఫ్లెమింగ్‌ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. -
ప్రపంచ కప్‌లు ఎలా గెలవాలో భారత్‌కు తెలుసు
న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో టీమిండియా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోయినా మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ జట్టుకు మద్దతుగా నిలిచాడు. ప్రపంచ కప్‌లు ఎలా గెలవాలో భారత్ నేర్చుకుందని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ కిర్‌స్టెన్ అన్నాడు. ధోనీసేకు టైటిల్ నిలబెట్టుకునే అవకాశముందని అభిప్రాయపడ్డాడు. ప్రపంచ కప్‌లో క్వార్టర్స్, సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు కీలకమని కిర్‌స్టెన్ అన్నాడు. భారత్ నాకౌట్ దశకు చేరుతుందని, ఆ తర్వాత ఎలా గెలవాలో భారత్‌కు తెలుసని చెప్పాడు. 2011 ప్రపంచ కప్‌లో భారత్ గెలవడంలో కిర్‌స్టెన్ పాత్ర కూడా కీలకమైనది. అప్పట్లో టీమిండియా కోచ్‌గా ఉన్న కిర్‌స్టెన్.. కెప్టెన్ ధోనీతో కలసి జట్టును విజయవంతంగా నడిపించాడు. -
'టీమిండియాను తేలిగ్గా తీసిపారేయలేం'
ముంబై: టీమిండియా ప్రదర్శన పట్ల విమర్శలు వస్తుండగా, మాజీ కోచ్ గ్యారీ కిర్‌స్టెన్ మాత్రం మద్దతుగా నిలిచాడు. ప్రపంచ కప్‌లో ధోనీసేనను తేలిగ్గా తీసిపారేయలేమని, టైటిల్ నిలబెట్టుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నాడు. అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరైన ధోనీ ఉండటం భారత్‌కు సానుకూలమని, ధోనీ పాత్రను తక్కువగా అంచనా వేయరాదని కిర్‌స్టెన్ చెప్పాడు. భారత బ్యాటింగ్ లైనప్ బలోపేతంగా ఉందని చెప్పాడు. ఆస్ట్రేలియాలో టీమిండియా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిందని అన్నాడు. కిర్‌స్టెన్ కోచ్‌గా ఉన్న సమయంలో ధోనీ సేన 2011 ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది.