రాజ్‌కోట్ కోచ్‌గా కిర్‌స్టెన్? | Gary Kirsten set for IPL return, in talks with Rajkot | Sakshi
Sakshi News home page

రాజ్‌కోట్ కోచ్‌గా కిర్‌స్టెన్?

Published Tue, Dec 29 2015 2:53 AM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM

రాజ్‌కోట్ కోచ్‌గా కిర్‌స్టెన్?

రాజ్‌కోట్ కోచ్‌గా కిర్‌స్టెన్?

ముంబై: గత సీజన్ వరకు ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించిన గ్యారీ కిర్‌స్టెన్ వచ్చే సీజన్ ఐపీఎల్‌లో రాజ్‌కోట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. ఇంటెక్స్ సంస్థకు చెందిన రాజ్‌కోట్ ఫ్రాంఛైజీ ఈ దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమచారం. ఈ జట్టులో ఉన్న స్టార్ క్రికెటర్లు సురేశ్ రైనా, రవీంద్ర జడేజాలతో గతంలో భారత జట్టు కోచ్‌గా కిర్‌స్టెన్ కలిసి పని చేశారు.

డ్రాఫ్ట్‌లో తీసుకున్న ఆటగాళ్లకు ఆ జట్టు యాజమాన్యం ఇప్పటికే కిర్‌స్టెన్ గురించి చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ జట్టు ఈ సీజన్‌లో కొత్త కోచ్‌ను తీసుకోవడం కోసం కిర్‌స్టెన్‌ను తొలగించింది.
 
పుణే జట్టుతో ఫ్లెమింగ్
చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ధోనిల అనుబంధం వచ్చే ఐపీఎల్ సీజన్‌లోనూ కొనసాగనుంది. ధోని కెప్టెన్‌గా వ్యవహరించబోతున్న కొత్త ఫ్రాంచేజీ పుణే... ఫ్లెమింగ్‌ను తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement