'ధోనీ ఏ టీమ్‌లో ఉన్నా అదే ఫేవరెట్'
న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త ప్రాంఛైజీ రాజ్‌కోట్ కెప్టెన్‌గా భారత క్రికెటర్‌నే నియమించాలని టీమిండియా మాజీ కెప్టెన్ గవాస్కర్ సూచించాడు. స్థానిక ఆటగాళ్ల ప్రతిభ గురించి భారత ఆటగాడికే బాగా తెలుసునని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
'రాజ్‌కోట్ జట్టుకు భారతీయ క్రికెటర్ కెప్టెన్‌గా ఉండాలి. అతనికి స్థానిక ఆటగాళ్ల బలాలు, బలహీనతల గురించి తెలుసు. కోచ్‌గా భారతీయుడు అవసరమైతే.. కెప్టెన్‌గా బ్రెండన్ మెకల్లమ్‌ను నియమించుకోవచ్చు' అని సన్నీ అన్నాడు. వచ్చే రెండు సీజన్ల కోసం రాజ్‌కోట్‌తో పాటు పుణె జట్లను ఐపీఎల్‌లోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజా వేలంలో రాజ్‌కోట్.. సురేష్ రైనా, లోకల్ హీరో రవీంద్ర జడేజాతో పాటు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ బ్రెండన్ మెకల్లమ్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ ఫాల్కనర్‌ను దక్కించుకుంది.
పుణెకు టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఉండటంతో ఆ జట్టు ఫేవరెట్‌గా కనిపిస్తోందని సన్నీ అభిప్రాయపడ్డాడు. ధోనీ ఏ టీమ్‌లో ఉన్నా అది ఫేవరేట్ అని అన్నాడు. కొత్త జట్టుకు మహీ వంటి ఆటగాడు అవసరమని పేర్కొన్నాడు. భారత క్రీడల్లో ధోనీ అతిపెద్ద బ్రాండ్ అని కితాబిచ్చాడు. రాజ్‌కోట్‌తో పోలిస్తే పుణె కాస్త బలోపేతంగా కనిపిస్తోందని చెప్పాడు.