![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/14/Sampath.jpg.webp?itok=v6nfTL6f)
సంపత్(ఫైల్)
మెదక్: మనస్తాపం చెందిన ఒక యువకుడు చెరువులోదూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండలం సంగాయిపల్లిలో చోటుచేసుకుంది. సంగాయిపల్లి గ్రామానికి చెందిన సంపత్(20) అంబాజిపేట పెద్ద చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం ఇంటి నుంచి బైక్‌పై బయటకు వెళ్లాడు.
కొంతసేపటికి తాను చెరువులో దూకి చనిపోతున్నానని నాన్నమ్మ దుర్గమ్మకు ఫోన్‌చేసి చెప్పాడు. వెంటనే ఆమె యువకుడి మేనమామలకు చెప్పడంతో వారు అక్కడకు చేరుకుని వెతకగా చెరువులో యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. దుర్గమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నశంకరంపేట ఎస్‌ఐ నారాయణ తెలిపారు. నాలుగు రోజులుగా సంపత్ మనస్తాపంతో బాధపడుతున్నాడని చెప్పారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment