
సంగారెడ్డి: అవమానం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చైతన్యపురి కాలనీలో చోటచేసుకుంది. ఎస్‌ఐ శివకుమార్ కథనం ప్రకారం.. చైతన్య పురి కాలనీకి చెందిన కొర్ర జగన్(21) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలనీకి చెందిన రషీద్ తన స్నేహితులతో కలిసి కొర్ర జగన్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం అంటగట్టి బెదిరించాడు. దీంతో అవమానానికి గురైన జగన్, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివకుమార్ తెలిపారు.
కొర్ర జగన్‌ను హత్య చేశారు..
తమ కుమారుడిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని జగన్ తండ్రి రాములు ఆరోపించారు. గ్రామస్తులతో కలసి మృతుడి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం గది వద్ద ఆందోళనకు దిగారు. ఎస్‌ఐ వారిని సముదాయించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com