illeagal affair
-
డీఎస్పీకి కానిస్టేబుల్‌గా డిమోషన్.. ఏం జరిగిందంటే!
లక్నో: ఓ మహిళా కానిస్టేబుల్‌తో అనైతిక సంబంధం పెట్టుకోవటం ఓ పోలీసు అధికారికి మాయని మచ్చగా మిగిలింది. అదీకాక, డీఎస్పీ స్థాయి నుంచి ఒక్కసారిగా కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన మూడేళ్ల తర్వాత పోలీసులు ఆయనపై తాజాగా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. కృపా శంకర్ కన్నౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి కష్టపడి ఎదిగారు. ఆయన 2021లో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో తరచూ కుటుంబ సమస్యల పేరుతో సెలవు పెట్టేవారు. అయితే ఆయన ఇంటికి వెళ్లే బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పూర్‌లోని హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వ్యక్తిగత, అధికారిక ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో తన భర్త ఇంటికి రాకపోవటం, ఫోన్లు సైతం కలువకపోవడంతో ఆందోళనపడిన ఆయన భార్య జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్ టీంలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా కాన్పూర్‌లోని ఓ హోటల్లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆయన మహిళా కానిస్టేబుల్‌తో ఏకాంతంగా ఉన్న సమయంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణకు ఆదేశించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఆధారాలు సేకరించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సిఫార్సు చేశారు. దీంతో డీఎస్పీగా ఉన్న ఆయన్ను గోరఖ్‌పూర్‌లోని 26వ ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా డిమోషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
హత్య చేసి.. ఆపై తగులబెట్టి..
సంగారెడ్డి: మహిళను దారుణంగా హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటన హత్నూర మండలం మధుర గ్రామ శివారులోని దత్తాచల క్షేత్రం సమీపంలో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై సుభాష్ కథనం ప్రకారం.. రత్నూరు మండలం గోవిందరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్డే సునీత (45)కు హత్నూర మండలం మధుర గ్రామానికి చెందిన మాదిగ దత్తయ్యతో రెండు నెలల కిందట పరిచయం ఏర్పడింది. వీరు రెండు, మూడు సార్లు మధుర శివారు దత్తాచల క్షేత్రం గుట్టల్లో కలుసుకున్నారు. కలిసిన ప్రతీ సారీ దత్తయ్య రూ.500, రూ.1,000 సునీతకు ఇచ్చేవాడు. డబ్బులు ఎక్కువ కావాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన దత్తయ్య గత నెల 31వ తేదీన మద్యం మత్తులో సునీత తలపై బండ రాయితో కొట్టి హత్య చేశాడు. అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టాడు. సునీత కోసం కుటుంబ సభ్యులు తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఈనెల 2వ తేదీన హత్నూర పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీత కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. వివాహేతర సంబంధంతో డబ్బు ఎక్కువ అడగడం వల్లే హత్య చేశాడని పోలీసులు పేర్కొన్నారు. -
సొంత బావతో అక్రమ సంబంధం! భర్తను దారుణంగా..
నిజామాబాద్: మల్లారం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యలో అసలు సూత్రధారి భార్యే అని ఏసీపీ కిరణ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 5న అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసులో విచారణ చేపట్టిన పోలీసులు మృతుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఇంద్రపురం కాలనీకి చెందిన గురుధాకర్ సయాజీ(35)గా గుర్తించినట్లు తెలిపారు. విచారణలో సయాజీ భార్య అశ్విని సొంత బావ అయిన రామ్ జింజోర్‌తో అక్రమ సంబంధం ఉంది. సయాజీ మద్యానికి బానిస కావడంతో భార్యను తరచూ వేధించేవాడు. ఈ నెల 3న సయాజీ భార్యను కొట్టి ఇంటి నుంచి పంపించాడు. దీంతో భర్తను చంపాలని నిర్ణయించుకున్న భార్య.. బావ రామ్ జింజోర్‌కు ఫోన్ చేసి చెప్పింది. ఈ నెల 5న నిందితుడు సయాజీని మల్లారం అటవీ ప్రాంతంలో హత్య చేశాడు. సాంకేతిక సహాయంతో నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితుడి బైక్, రెండు సెల్ఫోన్లు, చాకును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో సీఐ వెంకటనారాయణ, ఎస్సై మహేశ్ ఉన్నారు. ఇవి చదవండి: ఆన్లైన్లో ఫింగర్‌ప్రింట్ స్కానర్ బుక్.. తెరిచిచూస్తే షాక్! -
భర్త మరొకరితో వివాహం! భార్య తీవ్ర నిర్ణయం..
నిజామాబాద్: తనకు తెలియకుండా మరో వివాహం చేసుకన్న భర్తపై చర్యలు తీసుకోవాలని ఓ బాధితురాలు ఆందోళన చేపట్టింది. ఆర్మూర్ మండలంలోని ఫత్తేపూర్‌కు గంగాధర్‌తో బాల్కొండకు చెందిన కావ్యతో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా ఇద్దరి మధ్య గొడవల కారణంగా కావ్య బాల్కొండలో తల్లివద్ద ఉంటోంది. గొడవకు సంబంధించిన కేసు కోర్టులో ఉంది. 15 రోజుల క్రితం గంగాధర్ మరో వివాహం చేసుకున్నాడు. దీంతో కావ్య ఫత్తేపూర్‌లో తన ఇంటి ఎదుట ఆందోళన చేపట్టింది. తనను మోసం చేసిన భర్త గంగాధర్‌పై పోలీసులు చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరారు. ఇవి చదవండి: సొంత బావతో అక్రమ సంబంధం! భర్తను దారుణంగా.. -
వివాహేతర సంబంధమే కారణం! చివరికి..
తూర్పుగోదావరి: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జొన్నకూటి గౌతంనాయుడును వీసీ ఆచార్య కె.పద్మరాజు సస్పెండ్ చేశారు. యూనివర్సిటీలోనే పనిచేస్తున్న ఒక మహిళను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై అతనిని అరెస్టు చేసి, రిమాండ్‌కి పంపించారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో రెగ్యులర్ ఉద్యోగి అయిన అతనిని బుధవారం సస్పెండ్ చేశారు. సైన్స్ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న గౌతంనాయుడు ఏడాది క్రితం వరకు ఎగ్జామ్స్ విభాగంలో పనిచేసేవాడు. యూనివర్సిటీలో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేసే స్వీపర్స్ ఉదయాన్నే 8 గంటలకు వచ్చి, గదులను తుడుస్తుంటారు. ఆ విధంగా విధులు నిర్వర్తిస్తున్న ఒక వివాహిత అయిన స్వీపర్‌పై కన్నేసిన గౌతంనాయుడు ఒకరోజు ఉదయం 8 గంటలకే చేరుకున్నాడు. ఆమె లోనికి వచ్చి గదిని తుడుస్తున్న సమయంలో వెనుక నుంచి వచ్చి తలుపులు వేసి, అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తాను రెగ్యులర్ ఉద్యోగినని, అరచినా, ఎవరికైనా చెప్పినా నీ ఉద్యోగమే పోతుందని బెదిరించాడు. ఆ బెదిరింపులకు తలొంచిన ఆమెతో ఏడాది కాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 5న ఆరోగ్యం బాగోలేదని ఆమె విధులకు రాలేదు. దీంతో లాలాచెరువులో ఉండే ఆమె ఇంటికే నేరుగా వెళ్లి, తన ఆరోగ్యం బాగోలేదని వారిస్తున్నా వినకుండా మరోసారి ఆమైపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. జరిగిన సంఘటనలపై ఆమె తన భర్త సహకారంతో నవంబర్ 27న రాజానగరం పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. రాజానగరం పోలీసులు ఈ కేసును రాజమహేంద్రవరం దిశ పోలీసు స్టేషన్‌కు బదలాయించారు. పరారీలో ఉన్న నిందితుడిని ఈనెల 17న తాడేపల్లిగూడెంలో అరెస్టు చేసి, రిమాండ్‌కి పంపించారు. దీంతో అతనిని సస్పెండ్ చేశారు. కాగా ఈ విషయమై వీసీ ఆచార్య కె. పద్మరాజును వివరణ కోరగా సస్పెండ్ చేసిన మాట వాస్తవమేనన్నారు. ఇవి చదవండి: కీచక టీచర్.. విశాఖ స్పెషల్ పోక్సో కోర్టు సంచలన తీర్పు -
వివాహేతర సంబంధమే కారణమా..?
మహబూబ్‌నగర్: జడ్చర్ల మండలంలోని ఆలూరు గ్రామానికి చెందిన మల్లేష్ గురువారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద హత్యకు గురయ్యాడు. ఈ కేసును పోలీసులు చేధించినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే హత్య చోటు చేసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది. ఓ మహిళతో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య కేసు దాదాపుగా కొలిక్కి వచ్చిందని, త్వరలోనే నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు తరలిస్తామని సీఐ రమేశ్‌బాబు తెలిపారు. ఇవి చదవండి: కర్ణిసేన చీఫ్ హత్య కేసు : ఇద్దరు షూటర్లు అరెస్ట్ -
వివాహేతర సంబంధంతో.. ప్రియురాలి మోజులో.. భార్యను కిరాతకంగా..
సాక్షి, హైదరాబాద్/వికారాబాద్: ప్రియురాలి మోజులో పడి భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఇందుకు సంబంధించిన వివరాలను ధారూరు సీఐ రామకృష్ణ, బంట్వారం ఎస్ఐ ఆనంద్ వెల్లడించారు. బంట్వారం మండలం వెంకటాపూర్‌కు చెందిన ప్రకాశ్.. గత నెల 25న తన భార్య జగ్గమ్మతో కలిసి బైక్‌పై వెళ్తుండగా ప్రమాదానికి గురయ్యామని, బైక్ అదుపుతప్పి గుంతలో పడగా జగ్గమ్మ తలకు గాయమై చనిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా.. మృతురాలి బంధువులు భర్తపై అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ప్రకాశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా నేరాన్ని ఒప్పుకొన్నాడు. తనకు మరో అమ్మాయితో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయంలో జగ్గమ్మ తనను నిత్యం వేధించేదని చెప్పాడు. ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలనే పథకం వేశాడు. ఉద్దేశపూర్వకంగా బైక్‌ను గుంతలో పడేసి జగ్గమ్మ తలపై బండరాయితో మోది హత్యచేశాడు. అనంతరం ప్రమాదంగా చిత్రీకరించి.. పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించామని సీఐ వెల్లడించారు. ఇవి చదవండి: హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ.. చివరికి.. -
నీ భర్తను చంపితే సింగరేణి ఉద్యోగం మనదే.. హాయిగా ఉండొచ్చు రమ
సాక్షి, కరీంనగర్: తన భర్తను అడ్డు తొలగిస్తే.. సింగరేణి ఉద్యోగం చేసుకుంటూ ఇద్దరం హాయిగా ఉండొచ్చని చెప్పి ప్రియుడితో భర్తను హత్య చేయించింది ఓ మహిళ. అంతేకాదు.. తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్లు చిత్రీకరించింది కూడా.. రంగంలోకి దిగిన పోలీసులు.. కూపీ లాగడంతో అసలు విషయం వెలుగుచూసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీసుస్టేషన్ పరిధిలోని మల్యాలపల్లి సబ్‌స్టేషన్ వద్ద రాజీవ్‌రహదారిపై జరిగిన ఈ ఘటన వివరాలను రామగుండం ఏసీపీ తులా శ్రీనివాస్‌రావు బుధవారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. గోదావరిఖని యైటింక్లయిన్‌కాలనీ సమీప పోతనకాలనీకి చెందిన సింగరేణి ఉద్యోగి లావుడ్య మధుకర్–రమ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. రమ తనకు తెలిసిన వారికి పెళ్లి సంబంధం కుదిర్చేక్రమంలో ధరావత్ గోవర్ధన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది గోవర్ధన్, రమ మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈక్రమంలో గోవర్ధన్ తరచూ రమ ఇంటికి వస్తూ పోతున్నాడు. కొన్నిసార్లు రెండుమూడ్రోజులు ఇక్కడే ఉండేవాడు. దీంతో మధుకర్‌కు తన భార్యపై అనుమానం వచ్చింది. పద్ధతి మార్చుకోవాలని ఆమెను హెచ్చరించాడు. తన వ్యవహారానికి అడ్డువస్తున్నాడనే ఆగ్రహంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి రమ కుట్ర పన్నింది. మధుకర్‌ను చంపితే సింగరేణి ఉద్యోగం కూడా వస్తుందని, ఇద్దరమూ హాయిగా ఉండొచ్చని చెప్పింది. ఇందుకు అంగీకరించిన గోవర్ధన్.. మరో ఇద్దరు మిత్రుల సాయం తీసుకుని మధుకర్ హత్యకు అక్టోబర్ 29న ప్లాన్ చేశాడు. అదేరోజు మధుకర్ మధ్యాహ్నం విధులు ముగించుకొని ఇంటికి చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న గోవర్ధన్ తన స్నేహితులు నాగరాజు, లక్ష్మణ్‌తో కలిసి గోదావరిఖని వచ్చారు. గోవర్ధన్ తన ప్రియురాలు రమకు ఫోన్‌చేశాడు. మధుకర్‌తో మాట్లాడాలని చెప్పాడు. ఈక్రమంలో పల్సర్ బైక్‌పై ఫైవింక్లయిన్ వద్ద గల ఓ వైన్‌షాపులోకి మధుకర్ వచ్చాడు. అక్కడ అందరూ కలుసుకొని మద్యం కొనుగోలు చేశారు. ఆ తర్వాత మల్యాలపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలోని చెట్లపొదల్లోకి వచ్చి మద్యం తాగుతూ ఉన్నారు. గోవర్ధన్ తన వెంట తెచ్చుకున్న ఇనుపరాడు పట్టుకుని, తన ఇద్దరు మిత్రులతో కలిసి మధుకర్‌పై దాడిచేశారు. తీవ్రగాయాలతో మధుకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. మృతదేహాన్ని రోడ్డు పక్క ఉన్న కాలువలో పడేశారు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు బైక్‌ను మృతదేహంపై పడేయాలని యత్నించినా.. అదుపుతప్పి పక్కకు పడింది. ఆ తర్వాత హత్య విషయాన్ని గోవర్ధన్ వాట్సాప్‌కాల్ ద్వారా రమకు తెలిపాడు. అక్కడినుంచి ముగ్గురు నిందితులు పారిపోయారు. రమ వ్యవహారశైలిపై మృతుడి తండ్రి నాన్యానాయక్ అనుమానం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. నిందితులు లావుడియా(నునసవత)రమ, ధరావత్ గోవర్ధన్(నాచారం, మల్హర్ మండలం), కోట లక్ష్మణస్వామి (కొత్తపల్లి, జయశంకర్ జిల్లా), కర్నే నాగరాజు (ఖాసీంపెల్లి, జయశంకర్ జిల్లా)ను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. హత్య జరిగిన 48 గంటల్లోనే రామగుండం సీఐ, ఎస్సైలు కేసును ఛేదించడంతో ఏసీపీ అభినందించారు. ఇవి చదవండి: చిన్నారిని కుదిపేసిన కాలం! -
వివాహేతర సంబంధంతో.. భర్తను హతమార్చిన భార్య, ప్రియుడు..
మహబూబ్‌నగర్: వాహేతర సంబంధానికి అడ్డుగా వస్తున్నాడని కట్టుకున్న భర్తనే ప్రియుడితో కలిసి హతమార్చి మృతదేహాన్ని దుప్పట్లో మూటకట్టి ముళ్లపొదల్లో పడేసిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. ఎస్ఐ హరిప్రసాద్‌రెడ్డి కథనం మేరకు.. దేవరకద్ర మండలం గూరకొండకు చెందిన గడుగు శ్రీనివాసులు (34)కు మక్తల్ మండలం దాసరిదొడ్డికి చెందిన మాధవి అలియాస్ హారతితో నాలుగు ఏళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి మూడేళ్ల కుమారుడు, ఏడాది కుమార్తె ఉన్నారు. మాధవికి గూరకొండకు చెందిన గడుగు యమన్న అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉంది. మాధవి పుట్టింటికి వెళ్లగా ఈ నెల 1న ఇంట్లో నుంచి ఆటోలో బయలుదేరిన శ్రీనివాసులు రాత్రి వరకు ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ రావడంతో 2వ తేదీన శ్రీనివాసులు సోదరుడు మరికల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. మూడురోజుల పాటు పోలీసులు గాలించినా ప్రయోజనం లేకపోయింది. చివరకు ఎవరిమీదైనా అనుమానం ఉందా అని కుటుంబ సభ్యులను ఆరా తీయగా అదే గ్రామానికి చెందిన యమన్న పేరు చెప్పారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా నిజాన్ని బయటపెట్టాడు. ఈ నెల 1న ఇంట్లో నుంచి బయటకు వచ్చిన శ్రీనివాసులును గమనిస్తున్న యమన్న మరికల్లో శ్రీనివాసులును కలిశాడు. భూత్పూర్లో ప్రధాని మోదీ సభకు వెళ్దామని శ్రీనివాసులు చెప్పగా వద్దు దాసరిదొడ్డిలోని నీ భార్య దగ్గరకు వెళ్దామని చెప్పి తీసుకెళ్లాడు. అక్కడికి కూడా వెళ్లకుండా రాష్ట్ర సరిహద్దులోని దేవసుగూర్ సమీపంలో కృష్ణానది వద్దకు తీసుకెళ్లి అక్కడే శ్రీనివాసులును హతమార్చి దుప్పట్లో మూటకట్టి ముళ్లపొదల్లో పారేశాడు. నిందితుడు చెప్పిన విధంగా శుక్రవారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉండటంతో పోస్టుమర్టం నిమిత్తం నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని.. మాధవి సహకారంతోనే శ్రీనివాసులును యమన్న హత్య చేశాడని ఎస్ఐ వివరించారు. కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వివాహేతర సంబంధం అంటగట్టడంతో.. యువకుడి ఆత్మహత్య..!
సంగారెడ్డి: అవమానం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చైతన్యపురి కాలనీలో చోటచేసుకుంది. ఎస్ఐ శివకుమార్ కథనం ప్రకారం.. చైతన్య పురి కాలనీకి చెందిన కొర్ర జగన్(21) చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలనీకి చెందిన రషీద్ తన స్నేహితులతో కలిసి కొర్ర జగన్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం అంటగట్టి బెదిరించాడు. దీంతో అవమానానికి గురైన జగన్, తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. కొర్ర జగన్‌ను హత్య చేశారు.. తమ కుమారుడిని హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని జగన్ తండ్రి రాములు ఆరోపించారు. గ్రామస్తులతో కలసి మృతుడి కుటుంబ సభ్యులు పోస్టుమార్టం గది వద్ద ఆందోళనకు దిగారు. ఎస్ఐ వారిని సముదాయించారు. అన్ని కోణాల్లో విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వివాహేతర సంబంధం..! నిందితులను పట్టించిన సెల్‌ఫోన్..!!
ఆదిలాబాద్: భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భర్త మరో ముగ్గురితో కలిసి ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. ఈ సంఘటన పటాన్చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 12న నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన అబ్దుల్ నదీమ్ తాహెర్(28) పటాన్చెరు మండలం లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన హత్యకు గురయ్యాడు. మృతుడి సెల్‌ఫోన్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అందులో మొఘల్పూర్కు చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఇంకా ఆమె భర్త షహజాద్‌కు ఈ వ్యవహారం రెండు నెలల క్రితమే తెలిసింది. అతడిని మందలించినా తీరులో మార్పు రాలేదు. ఇక హైదరాబాద్‌లోని టోలిచౌకిలో ఉన్న సోదరి ఇంటికి వస్తున్నాడని తెలుసుకుని హత్యకు పథక రచన చేశాడు. అందులో భాగంగా షహజాద్ తన బంధువు గౌస్ నుంచి కత్తులు, గొడ్డలి సేకరించాడు. స్నేహితులు షబ్బీర్ అహ్మద్, ఎజాజ్ అలీ సహాయం తీసుకున్నాడు. టోలీచౌకీకి నదీమ్ వచ్చాడని తెలుసుకున్న అతడు ఇదే విషయమై మాట్లాడుకుని పరిష్కరించుకుందామని అందరూ ఓ హోటల్లో కలిశారు. ఇక్కడ వద్దని సంగారెడ్డిలోని ఓ దాబాకు వెళ్దామని నమ్మించారు. నదీమ్, షహజాజ్ బైక్‌పై బయలుదేరారు. మార్గమధ్యలో లక్డారం గేటు సమీపాన వచ్చేసరికి నదీమ్ మూత్రవిసర్జనకు ఆగాడు. అక్కడ సీసీ కెమెరాలు లేవని ధ్రువీకరించుకుని అతడితో వారు గొడవ పడ్డారు. పథకం ప్రకారం గొడ్డలి, కత్తితో మెడపై దాడి చేయగా అతను అక్కడికక్కడే మరణించాడు. తర్వాత అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. అయితే మరో నిందితుడు గౌస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడని ప్రియుడితో కలిసి భర్త హత్య
అనంతగిరి: వివాహేతర సంబంధానికి అడ్డుగా మారాడనే కారణంతో ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చింది. ఈ సంఘటన వికారాబాద్ పీఎస్ పరిధిలో వెలుగు చూసింది. సీఐ శ్రీను తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లికి చెందిన నక్క రాములు(38) భార్య స్వప్న ఇదే గ్రామానికి చెందిన ఎం.పవన్‌కళ్యాణ్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని గుర్తించిన రాములు పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో అతని అడ్డు తొలగించుకోవాలని ప్రియుడితో కలిసి కుట్ర పన్నింది. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రాములు గొంతు నులిమి చంపేశారు. ఉదయాన్నే ఏమీ తెలియనట్లు స్వప్న రోదిస్తూ కూర్చుంది. మృతుడి మెడపై గాయాలను గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న ఇరు కుటుంబాల వారు గొడవ పెట్టుకుని.. పోస్టుమార్టం చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ తన సిబ్బందితో వెళ్లి పరిస్థితిని అదుపులోకి తెచ్చి, పోస్టుమార్టం పూర్తి చేయించారు. వికారాబాద్‌లో ఉండే మృతుడి చెల్లి ఎన్.యశోద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి విచారణలో అసలు వివరాలు బహిర్గతమయ్యాయి. -
కొండాపూర్‌లో దారుణం.. యువతిని బంధించి, అత్యాచారయత్నం
-
ఇంట్లో ప్రియుడితో పట్టుబడ్డ భార్య.. భర్త ఆగ్రహంతో..
చేవెళ్ల: తన భార్య వేరే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే కక్షతో భార్యను, సదరు యువకుడిని ఇంట్లో రెండ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని వారిపై పెట్రోల్‌పోసి నిప్పంటించాడు ఓ వ్యక్తి. దీంతో భార్య మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే మృతిచెందగా.. వివాహేతర సంబంధం పెట్టుకున్న యవకుడు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటన చేవెళ్లలో ఆదివారం ఉదయం జరిగింది. చేవెళ్ల గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి(30)కి దామరగిద్ద గ్రామానికి చెందిన రవితో పదేళ్ల క్రితం వివాహమైంది. రవి పెళ్లికి ముందే చేవెళ్లలో స్థిరపడ్డాడు. దీంతో వీరు చేవెళ్లలోనే ఉంటున్నారు. వీరికి పదేళ్లలోపున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో కొంతకాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. కాగా, భాగ్యలక్ష్మి వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని తెలుసుకున్న రవి ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో భాగ్యలక్ష్మితో వివాహేతర సంబంధం పెటుకున్న వ్యక్తి శనివారం రాత్రి ఆమె దగ్గరకు వచ్చాడని, ఆదివారం ఉదయం కూడా ఇంట్లోనే ఉన్నట్లు తెలుసుకున్న రవి కోపంతో పెట్రోల్ తీసుకుని ఆమె ఇంటికి వెళ్లాడు. ఇంట్లో ఓ గదిలో భాగ్యలక్ష్మి, ఆ యువకుడిని గుర్తించి బయట నుంచి గడియ పెట్టి అందులో పెట్రోల్ పోశాడు. ఇంట్లో ఉన్న ఇద్దరు కొడుకులను బయటకు తీసుకెళ్లి నిప్పంటించి వెళ్లిపోయాడు. ఇది గమనించిన పిల్లలు ఏడుస్తూ పక్క ఇంట్లో ఉండే పెద్దమ్మ లక్ష్మి దగ్గరకు వెళ్లి విషయం చెప్పారు. దీంతో వారు వచ్చి పరిశీలించారు. అప్పటికే ఇంట్లో నుంచి మంటలు రావటంతో చుట్టు పక్కల వారు సైతం వచ్చి మంటలను ఆర్పేదుకు ప్రయత్నించారు. వారున్న గదిని తెరవగా అందులో ఉన్న యువకుడు కాలిన గాయాలతో బయటకు పరుగులు తీశాడు. అతన్ని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించగా వారు అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే భాగ్యలక్ష్మి పూర్తిగా కాలిపోయి మృతిచెందింది. కనీసం గుర్తించేందుకు కూడా వీలు లేకుండా మారింది. ఇంటి మొత్తానికి మంటలు అంటుకుని ఎగిసి పడటంతో ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను ఆర్పివేసింది. ఆ ఇంటికి పైకప్పుగా ఉన్న బండలు సైతం కింద పడిపోయాయి. చేవెళ్ల సీఐ గురువయ్యగౌడ్, ఎస్ఐ రేణుకారెడ్డిలు సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. భార్యను సజీవదహనం చేసిన భర్త బీర్కూర్(బాన్సువాడ) : కట్టుకున్న భార్యను కిరోసిన్ పోసి నిప్పటించి సజీవదహనం చేసిన ఘటన బీర్కూ ర్ మండల కేంద్రంలో ఆదివారం రాత్రి సంభవించింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. బీర్కూర్ మండల కేంద్రంలోని ఇందిరా కాలనీకి చెందిన మెరిగె అశోక్‌కు మెరిగె లక్ష్మి(35)తో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాలుగా వారిమధ్య మనస్పర్థలు ఎక్కువయ్యాయి. భర్త అశోక్ రోజూ తాగివచ్చి భార్యను హింసించేవాడని చుట్టుపక్కల వారు వివరించారు. కాగా రోజు మాదిరిగానే ఆదివారం తాగి వచ్చిన భర్తతో లక్ష్మి గొడవ పడింది. అనంతరం అశోక్ తన ఇద్దరు పిల్లలను పక్కింట్లో పడుకోబెట్టాడు. అదే సమయంలో తల్లిదండ్రుల ఘర్షణను అడ్డుకోవడానికి ప్రయత్నించిన కుమారుడిని బయటకు పంపించి వేసి అశోక్ తన భార్య లక్ష్మిపై కిరోసిన్ పోసి నిప్పటించాడు. దీంతో సజీవదహనమైన లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చే రుకుని మృతదేహాన్ని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టామని ఎస్సై పూర్ణేశ్వర్ వివరించారు. -
అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేయించా!
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే తన భర్తను హత్య చేయించానని భార్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. కృష్ణగిరి జిల్లా నెలమంగళం సమీపం తోట్ట బేలూరు గ్రామానికి చెందిన మాదేష్ (35) నేత కార్మికుడు. అతని భార్య అంబిక (30). ఈ క్రమంలో అంబికకు అదే ప్రాంతానికి చెందిన రామమూర్తి (24)కి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న మాదేష్ భార్యను మందలించాడు. దీంతో భార్యభర్త మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం రాత్రి మాదేష్ ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి అంబిక ప్రియుడు రామమూర్తి, అతని స్నేహితుడు మురళిని అరెస్టు చేశారు. అంబికను కూడా శుక్రవారం అరెస్టు చేశారు. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే ప్రియుడితో హత్య చేయించానని ఒప్పుకుంది. -
వివాహేతర సంబంధం వద్దన్నందుకు అత్తమామలను..
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధం వద్దని సక్రమంగా కాపురం చేయమని అల్లుడిని మందలించిన దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. విరుదునగర్ జిల్లా నరికుడి వీర చోళన్ గ్రామం సమీపం కీళ చెంబూర్‌కు చెందిన పాండి రైతు. అతని కుమారుడు గణేషన్ (25) కూలీ. అతనికి వీరచోళన్ గ్రామానికి చెందిన సెంథిల్‌వేల్ కుమార్తె మునీశ్వరి (24)తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒకటిన్నర సంవత్సరం వయసున్న శక్తివేల్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ క్రమంలో గణేశన్‌కు అదే ప్రాంతానికి చెందిన తమిళరసి అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారం అతని భార్య మునీశ్వరికి తెలిసింది. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మునీశ్వరి తండ్రి సెంథిల్‌వేల్ (45), తల్లి వనిత (40). కీళ చెంబూరులో ఉన్న గణేషన్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో భార్యతో గొడవ పడుతున్న అల్లుడిని వివాహేతర సంబంధం వదులుకుని సక్రమంగా కాపురం చేయాలని మందలించారు. ఓ దశలో వారి మధ్య వాగ్వాదం నెలకొనడంతో ఆగ్రహించిన గణేశన్ అతని తండ్రి పాండి (48) కలిసి సెంథిల్‌వేల్‌ను, అతని భార్యపై కత్తులతో దాడి చేశారు. దాడిలో దంపతులు ఇద్దరు మృతి చెందారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న విరుదునగర్ ఎస్పీ రాజరాజన్ సంఘటన స్థలం వద్దకు చేరుకుని విచారణ చేసి సెంథిల్‌వేల్, వనిత మృతదేహాలను శవపరీక్ష కోసం తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న తండ్రి, కుమారుడి కోసం గాలిస్తున్నారు. -
వివాహేతర జంట ఆత్మహత్యాయత్నం
సాలూరు విజయనగరం : పట్టణంలోని బంగారమ్మకాలనీకి చెందిన మరిపి కృష్ణ (50), అతని సహజీవని సుజాత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికులతో పాటు కృష్ణ కుమారుడు శివ తెలియజేసిన వివరాల మేరకు... రెండేళ్ల కిందటి వరకు స్థానిక బెల్లం వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేసిన కృష్ణ తొలి భార్య మరణించడంతో సుజాతకు ఆశ్రయమిచ్చి సహజీవనం చేస్తున్నాడు. అప్పటికే కృష్ణకు ఇద్దరు కుమారులుండగా, పెద్ద కుమారుడు కొన్నాళ్ల కిందట మృతి చెందాడు. ఇదిలా ఉంటే కంటిచూపు కోల్పోయిన కృష్ణ ఇంటికే పరిమితం కావడంతో కృష్ణ, సుజాతల మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి కూడా ఇరువురి మధ్య గొడవ జరగడంతో, గురువారం వేకువజామున సుజాత ఇంటిలో ఉన్న చీమల మందు తాగింది. వెంటనే శివ గమనించి ఆమెను పట్టణ ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన వైద్యులు సుజాత ఏమి తాగిందో ఆ సీసాను తీసుకురావాలని కోరడంతో.. శివ హుటాహుటిన ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో ఇంటి దూలానికి వేలాడుతున్న కృష్ణను చూసి అవాక్కయ్యాడు. కొన ఊపిరితో ఉన్న తండ్రిని దించి ఆస్పత్రికి తీసుకొచ్చేలోగా ప్రాణాలొదిలాడు. సుజాత ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పట్టణ పోలీసులు కేసున మోదుచేసి విచారణ చేపడుతున్నారు. -
మహిళను చెట్టుకు కట్టేసి దారుణం
లక్నో : వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే నెపంతో ఓ మహిళను చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. గురువారం రతేన్పురి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామ పంచాయితీ ఆదేశాల మేరకు కొందరు ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో విషయం బయటకు పొక్కింది. పోలీసుల కథనం ప్రకారం... ముజఫర్‌నగర్‌కు సమీపంలోని టోడా గ్రామానికి చెందిన ఓ మహిళ తన భర్త సోదరుడి(అన్న) కుమారునితో శారీరక సంబంధం కొనసాగిస్తోందని స్థానికులు ఆరోపించారు. ఈ నెపంతో గ్రామ పంచాయతీ పెద్దలు ఆమెను చెట్టుకు కట్టేసి కొట్టాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఆమెను విచక్షణా రహితంగా స్పృహ కోల్పోయేలా చితకబాదారు. మహిళ భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎనిమిది మందిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ప్రస్తుతం బాధిత మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
రెండో పెళ్లి కోసం భార్య, కూతుర్ని చంపి..
లాతేహార్(జార్ఖండ్) : ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలనే దురాలోచనతో భార్య, కూతుర్ని కిరాతకంగా నరికి చంపాడో వ్యక్తి. అనంతరం పోలీసులు తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారనే భయంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని లాతేహార్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇస్రాఫిల్ అన్సారీ గత సంవత్సర కాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయమై అన్సారీ దంపతుల మధ్య తరుచుగా గొడవలు జరుగుతుండేవి. ఎలాగైనా ఈ నెలలో ప్రియురాలిని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. అన్సారీ రెండో పెళ్లికి సిద్ధపడ్డ విషయం అతని భార్య షమీనా బేగం, కూతురు ఆస్మా పర్వీన్‌లకు తెలియడంతో అందుకు అడ్డుచెప్పారు. బుధవారం రాత్రి ఈ విషయంపై భార్య భర్తల మధ్య వాగ్వివాదం చేటుచేసుకుంది. దీంతో అతని కోపం కట్టలు తెంచుకుంది. ఉన్మాదిగా మారిన అన్సారీ గొడ్డలితో భార్య, కూతుర్ని విచక్షణారహితంగా నరికి చంపాడు. కొద్ది సేపటి తర్వాత పక్కనే ఉన్న అడవిలోకి వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం ఈ విషయం గ్రామ ప్రజలకు తెలియడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. -
కోరిక తీర్చలేదని చంపేశాడు
దుగ్గొండి(నర్సంపేట): పేదరికాన్ని అలుసుగా తీసుకున్నాడు..స్నేహం చేసి వివాహితను లోబరుచుకున్నాడు.. చివరికి కోరిక తీర్చడానికి నిరాకరించిందని కోపంతో ప్రియుడే అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు.. తొగర్రాయి గ్రామానికి చెందిన నల్ల అనితను హత్య చేసిన నిందితుడు పోలీసులకు గురువారం లొంగిపోయాడు. ఈ మేరకు కేసు వివరాలను దుగ్గొండి సర్కిల్ సీఐ బోనాల కిషన్ వెల్లడించారు. తొగర్రాయి గ్రామానికి చెందిన కారు అశోక్‌కు ఇదే గ్రామానికి చెందిన నల్ల అనితతో మూడు సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో గత నెల 25న గ్రామానికి చెందిన కొక్కరకొండ కుమారస్వామి మొక్కజొన్న పంటలో పనులు చేయడానికి అనిత కూలికి వెళ్లింది. ఉదయం 11.30 గంటలకు అశోక్ చేను వద్దకు వెళ్లి అనిత పిలిచాడు. అదే చేనులో శారీరకంగా అనుభవించాడు. అనంతరం ఆమె తెచ్చిన భోజనం తిన్నాడు. కొంత సేపటికి మళ్లీ కోరిక తీర్చాలని బలవంత పెట్టాడు. అయితే అనిత నిరాకరించింది. కొమ్మాలలో లక్ష్మీనర్సింçహాస్వామి కల్యాణం జరుగుతోంది.. అక్కడికి తనను తీసుకెళ్లి తలంబ్రాలు పోస్తే కోరిక తీరుస్తానని చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాదులాట జరిగింది. అనితపై అత్యాచారం చేశాడు. తల వెంట్రుకలు పట్టుకుని నేలకేసి బాదాడు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది. చీకటి పడుతుండటంతో చేసేది లేక బాధితురాలి బావ కుమారుడు రాజుకు అనిత మూర్ఛపోయిందని ఫోన్ చేశాడు. రాజు మృతురాలి చిన్నకూతురును తీసుకుని చేను వద్దకు వచ్చాడు. అప్పటికే అశోక్ ఆటోను పిలిపించాడు. అనితను ఆటోలో ఎక్కించి పరారయ్యాడు. గత నెల 27 తెల్లవారుజామున అనిత మృతి చెందింది. అనంతరం అశోక్ గురువారం ఉదయం గిర్నిబావిలో ఆర్ఎంపీగా పనిచేస్తున్న నల్ల బాబురావు వద్దకు వెళ్లి జరిగిన విషయం చెప్పి పోలీసులకు సరెండర్ అయ్యాడు. దీంతో అశోక్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ బోనాల కిషన్ తెలిపారు. -
వివాహేతర సంబంధాలతో అనర్థాలు
విజయనగరం టౌన్ : వివాహేతర సంబంధాలతో సంసారంలో చిచ్చు పెట్టుకోవద్దని, జీవిత భాగస్వామితో నిజాయితీగా కాపురం సాగించాలని సైకాలిజిస్టు ఎన్వీఎస్ సూర్యనారాయణ పిలుపునిచ్చారు. స్థానిక మహిళా పోలీస్‌స్టేషన్‌లో హౌస్ ఆఫీసర్ డీఎస్పీ కె. కుమారస్వామి ఆధ్వర్యంలో శనివారం పలు జంటలకు ఫ్యామిలీ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ.. వివాహానంతరం ఏమైనా సమస్యలు వస్తే సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకొని ఒకరిపై ఒకరు సదాభిప్రాయాన్ని పెంపొందించుకొని సుఖమయ వైవాహిక జీవితాన్ని సాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త గంటా హైమావతి, మహిళా సైకాలిజిస్టు హిమబిందు, ఏఎస్సై కృష్ణ, హెచ్‌సీ బీవీ రమణయ్య, మూర్తి సిబ్బంది పాల్గొన్నారు.