మాదేష్, అంబిక
తిరువొత్తియూరు: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే తన భర్తను హత్య చేయించానని భార్య పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. కృష్ణగిరి జిల్లా నెలమంగళం సమీపం తోట్ట బేలూరు గ్రామానికి చెందిన మాదేష్ (35) నేత కార్మికుడు. అతని భార్య అంబిక (30). ఈ క్రమంలో అంబికకు అదే ప్రాంతానికి చెందిన రామమూర్తి (24)కి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ సంగతి తెలుసుకున్న మాదేష్ భార్యను మందలించాడు.
దీంతో భార్యభర్త మధ్య తరచూ గొడవలు జరిగేవి. బుధవారం రాత్రి మాదేష్ ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టి అంబిక ప్రియుడు రామమూర్తి, అతని స్నేహితుడు మురళిని అరెస్టు చేశారు. అంబికను కూడా శుక్రవారం అరెస్టు చేశారు. ఆమె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నందుకే ప్రియుడితో హత్య చేయించానని ఒప్పుకుంది.
Comments
Please login to add a commentAdd a comment