లక్నో: ఓ మహిళా కానిస్టేబుల్‌తో అనైతిక సంబంధం పెట్టుకోవటం ఓ పోలీసు అధికారికి మాయని మచ్చగా మిగిలింది. అదీకాక, డీఎస్పీ స్థాయి నుంచి ఒక్కసారిగా కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన మూడేళ్ల తర్వాత పోలీసులు ఆయనపై తాజాగా చర్యలు తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్లితే.. కృపా శంకర్ కన్నౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి కష్టపడి ఎదిగారు. ఆయన 2021లో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో తరచూ కుటుంబ సమస్యల పేరుతో సెలవు పెట్టేవారు. అయితే ఆయన ఇంటికి వెళ్లే బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పూర్‌లోని హోటల్‌కు వెళ్లారు.
ఈ క్రమంలో వ్యక్తిగత, అధికారిక ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో తన భర్త ఇంటికి రాకపోవటం, ఫోన్లు సైతం కలువకపోవడంతో ఆందోళనపడిన ఆయన భార్య జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్ టీంలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా కాన్పూర్‌లోని ఓ హోటల్‌లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆయన మహిళా కానిస్టేబుల్‌తో ఏకాంతంగా ఉన్న సమయంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులు విచారణకు ఆదేశించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఆధారాలు సేకరించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సిఫార్సు చేశారు. దీంతో డీఎస్పీగా ఉన్న ఆయన్ను గోరఖ్‌పూర్‌లోని 26వ ప్రావిన్షియల్ ఆర్మ్‌డ్ కానిస్టేబుల్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా డిమోషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment