Deputy Superintendent of police
-
త్వరలోనే DSPగా బాధ్యతలు చేపడతా: నిఖత్ జరీన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి భారత బాక్సర్ నిఖత్ జరీన్ ధన్యవాదాలు తెలిపింది. తన ప్రతిభను గుర్తించి డిప్యూటీ సూపరింటెండెట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పోస్ట్ ఇవ్వడం పట్ల కృతజ్ఞతాభావం చాటుకుంది. క్రీడాకారులను ప్రభుత్వం ఇలా ప్రోత్సహిస్తే తనలాగే మరికొంత మంది కూడా ముందుకు వస్తారని పేర్కొంది.కాగా తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్‌గా ఎదిగింది. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అయితే, ఇటీవల ప్యారిస్ ఒలింపిక్స్-2024లో భాగంగా తొలిసారి విశ్వక్రీడల బరిలో దిగిన నిఖత్‌కు నిరాశే ఎదురైంది. మహిళల 50 కేజీల విభాగంలో పోటీపడిన ఆమె.. ప్రాథమిక దశలోనే వెనుదిరిగింది. చైనాకు చెందిన వూ యు చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది.సీఎం సానుకూలంగా స్పందించారుఅయితే, ప్రపంచ వేదికలపై సత్తా చాటిన నిఖత్ జరీన్‌ను తెలంగాణ ప్రభుత్వం అభినందించడంతో పాటు డీఎస్పీగా పోస్టు ఇచ్చింది. ఈ విషయంపై స్పందించిన నిఖత్ సాక్షి టీవీతో మాట్లాడుతూ.. హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు.. తెలంగాణ రాష్ట్రంలో బాక్సింగ్ అకాడమీ లేకపోవడం బాధాకరమని పేర్కొంది. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానన్న నిఖత్.. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది.సిరాజ్‌కు కూడా‘‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని సహాయ సహకారాలు అందిస్తోంది. త్వరలోనే డీఎస్పీ ట్రైనింగ్ తీసుకుంటాను. డీజీపీ జితేందర్ గారు ట్రైనింగ్ సమాచారం ఇస్తామని చెప్పారు’’ అని నిఖత్ తెలిపింది. ఇక ప్యారిస్‌లో ఓడిపోవడం బాధ కలిగించిందన్న నిఖత్ జరీన్ వచ్చే ఒలింపిక్స్‌లో కచ్చితంగా మెడల్ సాధిస్తానని ధీమా వ్యక్తం చేసింది. కాగా నిఖత్‌తో పాటు టీ20 ప్రపంచకప్-2024 సాధించిన భారత క్రికెట్ జట్టులో సభ్యుడైన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు సైతం ప్రభుత్వం డీఎస్పీ పోస్ట్ ఇచ్చింది. చదవండి: ఆమె నిజాయితీని అమ్ముకుంది.. మండిపడ్డ బబిత.. వినేశ్ స్పందన ఇదే -
డీఎస్పీగా క్రికెటర్ సిరాజ్ బాధ్యతల స్వీకారం
సాక్షి, హైదరాబాద్: భారత క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు స్వీకరించారు. టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత క్రికెట్ బృందంలో సభ్యునిగా టీమ్ విజయంలో కీలకపాత్ర పోషించిన సిరాజ్‌కు గ్రూప్–1 ఆఫీసర్ పోస్టును ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించిన విషయం విదితమే. ముఖ్యమంత్రి ఇచి్చన హామీ మేరకు ఆయనను పోలీసు శాఖలో డీఎస్పీగా నియమించారు.శుక్రవారం ఆయన డీజీపీ జితేందర్‌కు రిపోర్ట్ చేసి, డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. సిరాజ్ బాధ్యతల స్వీకార కార్యక్రమంలో రాజ్యసభసభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, తెలంగాణ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ చైర్మన్ ఫహీముద్దీన్ ఖురేషీ పాల్గొన్నారు. తనను డీఎస్పీగా నియమించినందుకు ఈ సందర్భంగా సిరాజ్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీజీ మహేశ్‌భగవత్, ఐజీ ఎం.రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్పీకి కానిస్టేబుల్‌గా డిమోషన్.. ఏం జరిగిందంటే!
లక్నో: ఓ మహిళా కానిస్టేబుల్‌తో అనైతిక సంబంధం పెట్టుకోవటం ఓ పోలీసు అధికారికి మాయని మచ్చగా మిగిలింది. అదీకాక, డీఎస్పీ స్థాయి నుంచి ఒక్కసారిగా కానిస్టేబుల్ స్థాయికి డిమోషన్ అయ్యారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ మహిళా కానిస్టేబుల్‌తో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన మూడేళ్ల తర్వాత పోలీసులు ఆయనపై తాజాగా చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. కృపా శంకర్ కన్నౌజియా కానిస్టేబుల్ స్థాయి నుంచి డీఎస్పీ స్థాయికి కష్టపడి ఎదిగారు. ఆయన 2021లో ఉన్నావ్‌లోని బిఘాపూర్‌లో సర్కిర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో తరచూ కుటుంబ సమస్యల పేరుతో సెలవు పెట్టేవారు. అయితే ఆయన ఇంటికి వెళ్లే బదులు ఓ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి కాన్పూర్‌లోని హోటల్‌కు వెళ్లారు. ఈ క్రమంలో వ్యక్తిగత, అధికారిక ఫోన్లను స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో తన భర్త ఇంటికి రాకపోవటం, ఫోన్లు సైతం కలువకపోవడంతో ఆందోళనపడిన ఆయన భార్య జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్పెషల్ టీంలు ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఫోన్ లొకేషన్ ఆధారంగా కాన్పూర్‌లోని ఓ హోటల్లో ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆయన మహిళా కానిస్టేబుల్‌తో ఏకాంతంగా ఉన్న సమయంలో పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణకు ఆదేశించారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీ సాయంతో ఆధారాలు సేకరించారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు సిఫార్సు చేశారు. దీంతో డీఎస్పీగా ఉన్న ఆయన్ను గోరఖ్‌పూర్‌లోని 26వ ప్రావిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబుల్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా డిమోషన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
చంద్రగిరి DSPపై వేటు
-
ఇవాళ ఇక్కడికి.. రేపు ఎక్కడికో
సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌లు మొదలు డీఎస్పీల వరకు ఇటీవల పోలీస్‌శాఖలో పెద్ద ఎత్తున బదిలీ లు జరిగాయి. అయితే సివిల్ డీఎస్పీల పోస్టింగ్‌లు మారుస్తూ జరిగిన వరుస బదిలీలు మాత్రం చర్చనీయాంశమయ్యాయి. ఈ నెల 12న ఏకంగా 110 మంది సివిల్ డీఎస్పీలు, 14వ తేదీన మరో 95మంది, 15న మరో 26 మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేశారు. ఆ తర్వాత ఈనెల 17న వెల్లడైన ఉత్తర్వుల్లోనూ మరో 61 మంది సివిల్ డీఎస్పీలను బదిలీ చేశారు. ప్రతిశాఖలోనూ బదిలీల ప్రక్రియ అత్యంత సహజమే అయినా, ఒకసారి ఇచ్చిన పోస్టింగ్ మారుస్తూ...లేదంటే అప్పటికే ట్రాన్స్ఫర్ చేసిన వారిని తిరిగి అక్కడే కొనసాగి స్తున్నట్టు పేర్కొంటూ వరుస ఉత్తర్వులు వెలువడుతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ‘పట్టు’నిలుపుకుని.. ‘అనుకూల’పోస్టింగ్‌లు కొందరు అధికారులు బదిలీ అయినా తమ ‘పట్టు’నిలుపుకొని తిరిగి అదే స్థానాల్లో కొనసాగుతున్నారు. మరికొందరు బదిలీ అయిన స్థానంలో చేరకముందే రోజుల వ్యవధిలోనే ‘అనుకూల’పోస్టింగ్‌లు తెచ్చుకుంటున్నారన్న ప్రచా రం జరుగుతోంది. ఒకే సారి పెద్ద సంఖ్యలో బదిలీ జరిగినప్పుడు కొద్దిమేర పోస్టింగ్‌ల్లో మార్పులు సహజమే కానీ గత మూడు రోజుల్లో విడుదల చేసిన పోస్టింగ్ ఉత్తర్వులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయని పోలీసు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎప్పుడు ఎక్కడికో అనే ఆందోళనలో కొందరు ఒక రోజు వచ్చిన ఆర్డర్ కాపీలో ఉన్న పోస్టింగ్‌లు ఆ తర్వాతి బదిలీ ఉత్తర్వులు వచ్చే సరికి మారిపోతుండడం కొంతమందిని మాత్రం కలవరానికి గురి చేస్తోంది. ఎప్పుడు ఎక్కడికి బదిలీ అవుతామో..అక్కడి నుంచి మళ్లీ ఎక్కడికి మారుస్తున్నారో అన్న గందరగోళం నెలకొందని కొందరు అధికారులు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో సన్నిహితంగా మెలిగిన వారికే మళ్లీ కీలకస్థానాల్లో పోస్టింగ్‌లు దక్కుతున్నాయన్న చర్చ జరుగుతోంది. ‘పోలీసులపై రాజకీయ పెత్తనం ఉండబోదు’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవల ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్‌లో చెప్పినా, వాస్తవ పరిస్థితి మాత్రం అలా లేదని కొందరు వాపోతున్నారు. -
15మంది సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 15మంది సీఐలకు పదోన్నతిపై డీఎస్పీలుగా పోస్టింగులు ఇచ్చారు. వీరి పదోన్నతులను ప్రభుత్వం ఆగస్టులో ఖరారు చేసింది. కాగా వారికి తాజాగా పోస్టింగులు ఇస్తూ డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి: ఎస్.వహీద్ బాషా( సీఐడీ), ఎం.హనుమంతరావు(సీఐడీ), టీవీ రాధా స్వామి (ఎస్బీ, గుంటూరు), డి.శ్రీహరిరావు (ఏసీబీ), జి.రాజేంద్ర ప్రసాద్ (ఇంటెలిజెన్స్), బి.పార్థసారథి ( సీఎస్బీ, విజయవాడ), కె.రసూల్ సాహెబ్ (సీఐడీ), ఎం.కిశోర్ బాబు ( విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), డీఎన్వీ ప్రసాద్ (ఇంటెలిజెన్స్), జి.రత్న రాజు ( పోలవరం), పి.రవిబాబు (ఇంటెలిజెన్స్), షేక్ అబ్దుల్ కరీమ్ (పీసీఎస్ అండ్ ఎస్), ఎస్. తాతారావు (విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), కోంపల్లి వెంకటేశ్వరరావు(విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్), సీహెచ్.ఎస్.ఆర్.కోటేశ్వరరావు(ఏసీబీ). -
సీఐ రఘువీర్‌రెడ్డిపై చర్యలు తీసుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్: ఎన్నికల విధుల్లో భాగంగా ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరిపై లాఠీతో దాడిచేసిన ఆదిబట్ల సీఐ రఘువీర్‌రెడ్డిపై చర్యలు తీసుకొవాలని కోరుతూ అతడి తోటి ఏఆర్ కానిస్టేబుళ్లు గురువారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డిసెంబర్ 30న జరిగిన మహేశ్వరం నియోజకవర్గంలోని పోలింగ్‌లో భాగంగా నాదర్గుల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరాములకు గన్‌మెన్‌గా ఉన్న యాదగిరిపై దాడి చేయడంతో పాటు అవమానపర్చిన ఆదిబట్ల సీఐ రఘువీర్‌రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీ, మానవ హక్కుల సంఘం, చీఫ్ ఎన్నికల అధికారులకు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్స్ ఫిర్యాదు చేశారు. రాష్ట్ర పోలీసుల పరువు, ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా విధి నిర్వహణలో ఉన్న యాదగిరిపై అకారణంగా దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. -
ఇక్కడ నీకేం పని.. కానిస్టేబుల్‌పై సీఐ లాఠీఛార్జ్
హైదరాబాద్: ఆదిభట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాదర్గుల్లోని పోలింగ్ కేంద్రం ఓ సీఐ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌పై లాఠీ ఝులిపించారు.మహేశ్వరం బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్ నాదర్గుల్లోని జిల్లా పరిషత్తు పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లారు. ఆ సమయంలో ఆయన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఏఆర్ కానిస్టేబుల్ యాదగిరి పోలింగ్ కేంద్రం బయట ఎదురుచూస్తున్నారు. పెట్రోలింగ్ వాహనంలో ఆదిభట్ల ఇన్స్పెక్టర్ రఘువీర్ రెడ్డి అక్కడకు వచ్చారు. ఇన్స్పెక్టర్ను చూసిన కానిస్టేబుల్ సెల్యూట్ చేసేందుకు ప్రయత్నించారు.. అంతలోనే సీఐ 'ఇక్కడ నీకేం పని' అని ప్రశ్నిస్తూ కానిస్టేబుల్‌ను లాఠీతో కొట్టారు. దాంతో కానిస్టేబుల్ అక్కడి నుంచి పరుగులు తీశారు. -
హోం మంత్రి పతకానికి ధనుంజయుడు ఎంపిక
పశ్చిమ గోదావరి: కేంద్ర హోం శాఖ ఏటా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సమయంలో ఇచ్చే కేంద్ర హోం మంత్రి పతకానికి జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం.ధనుంజయుడు ఎంపికయ్యారు. 2023 సంవత్సరానికి అత్యుత్తమ నేరపరిశోధన చేసిన రాష్ట్రానికి చెందిన ఐదురుగు పోలీసు అధికారులు ఈ పతకానికి ఎంపిక కాగా వారిలో ఒకరు ధనుంజయుడు. నేర పరిశోధనల్లో ఉన్నత ప్రమాణాల్ని ప్రోత్సహించడం కోసం 2018 నుంచి పోలీసు అధికారులకు కేంద్ర హోం శాఖ ఈ పతకాలు అందిస్తోంది. 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలులో దిశ డీఎస్పీగా ధనుంజయుడు పని చేస్తున్న సమయంలో రెండు కీలకమైన కేసులను చేధించడంలో విశేష కృషిచేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఈ పతకం అందిస్తున్నారు. ఎస్సై నుంచి డీఎస్పీ వరకూ బాపట్ల జిల్లా చీరాల మండలం చీపురుపాలెం ధనుంజయుడి స్వగ్రామం. చీరాలలో బీఎస్సీ డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1991లో ఎస్సైగా డీటీసీలో శిక్షణ పొందారు. గుంటూరు జోన్ నుంచి ఎంపికై న ఈయన నెల్లూరు జిల్లాలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి తాలూకా సీతారామపురం పోలీస్‌స్టేషన్‌కు ఎస్సైగా నియమితులయ్యారు. ఆ తరువాత ఉదయగిరి, కావలి టూటౌన్, సంగం, ఆత్మకూరు పోలీస్స్టేషన్లలో ఎస్సై పనిచేశారు. నాయుడుపేట పోలీస్‌స్టేషన్‌పై దాడి జరగడంతో ఆ సమయంలో ధనుంజయుడిని అక్కడికి పంపారు. ఆ తరువాతి కాలంలో నెల్లూరు త్రీ టౌన్‌కు బదిలీ అయ్యారు. సీఐగా పదోన్నతి చెంది విజయవాడలో సీఐడీ విభాగంలో ఆరు సంవత్సరాలు పనిచేశారు. అనంతరం మూడేళ్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో పనిచేశారు. 2014లో డీఎస్పీగా పదోన్నతి పొంది కృష్ణా జిల్లా ఇంటిలిజెన్స్ డీఎస్పీగా ఐదేళ్లు పనిచేశారు. అలాగే విశాఖ ట్రాఫిక్ ఏసీపీగా 10 నెలలు పనిచేశారు. సాంకేతిక ఆధారాలతో కేసుల నిరూపణలో ప్రతిభ 2020లో ప్రకాశం జిల్లా ఒంగోలు దిశ డీఎస్పీగా రెండేళ్లపాటు పనిచేశారు. ఈ సమయంలోనే రెండు కీలకమైన కేసులు చేధించడంలో కీలకంగా పనిచేశారు. గిద్దలూరు మండలం అంబవరంలో ఏడేళ్ల చిన్నారిపై ఒక వ్యక్తి అత్యాచారం చేసి హత్యచేశాడు. ఈ కేసును ధనుంజయుడు చాలెంజింగ్ తీసుకున్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేసి నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో నిందితుడికి గత జనవరిలో కోర్టు ఉరిశిక్ష విధించింది. అలాగే కందుకూరులో 15 ఏళ్ల బాలికను నిర్భంధించి వ్యభిచారం కూపంలోకి నెట్టారు. వారం రోజుల పాటు బాలికపై 25 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసును కూడా చాలెంజింగ్‌గా తీసుకుని సెల్‌ఫోన్, ఫోన్‌పే ఆధారంగా నిందితులను గుర్తించారు. 25 మంది ఆ వారం రోజుల పాటు వినియోగించిన కండోమ్‌లు డీఎస్పీ స్వాధీనం చేసుకుని డీఎన్ఏ పరీక్షలకు పంపారు. మేజిస్ట్రేట్ సమక్షంలో బాలికతో ఐడెంటిఫికేషన్ పెరేడ్ ఏర్పాటు చేశారు. దీంతో 25 మందిని బాలిక గుర్తించింది. అన్ని ఆధారాలతో ఈ కేసును నిరూపించారు. ఈ కేసును చేధించడంలో సాంకేతిక ప్రమాణాలు పాటించారు. ఈ రెండు కేసులు చేధించడంలో డీఎస్పీ విజయం సాధించారు. దీంతో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ప్రకాశం జిల్లా ఎస్పీ.. డీజీపీ ద్వారా వీటి వివరాలను కేంద్రానికి పంపారు. నేర పరిశోధనలో అత్యుత్తమ సేవలను గుర్తించిన కేంద్రం ధనుంజయుడిని కేంద్ర హోం మంత్రి పతకానికి ఎంపిక చేసింది. ప్రకాశం జిల్లా నుంచి ఆయన తాడేపల్లి సిట్‌కు డీఎస్పీగా బదిలీ అయ్యారు. అక్కడ కూడా అత్యంత ప్రతిభ కనబర్చి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో రూ.250 కోట్ల దుర్వినియోగాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం ఈ కేసు ఇంకా దర్యాప్తులో ఉంది. ఇటీవల బదిలీల్లో భాగంగా మే నెలలో జంగారెడ్డిగూడెం డీఎస్పీగా బదిలీపై వచ్చారు. -
నల్గొండలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీకొట్టిన డీఎస్పీ వాహనం.. వైరలైన దృశ్యాలు
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లాలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దేవరకొండ డీఎస్పీ వాహనం ఓ బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగాక తీరిగ్గా డీఎస్పీ నాగేశ్వరరావు వాహనం నుంచి దిగారు. బాధితుడిని డిక్కీలో కుక్కి ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. అయితే బాధితుడి విషయంలో మానవత్వం లేకుండా ప్రవర్తించారంటూ డీఎస్పీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అంటూ పలువురు మండిపడుతున్నారు. కనీస మానవత్వ విలువలు కూడా పాటించరా అని సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు. చదవండి: రామ.. రామ! స్వయంగా శఠగోపంతో ఆశీర్వచనం తీసుకున్న భద్రాద్రి ఈవో -
విషాదం: ఆ పోలీసు అధికారి ఇకలేరు
చండీగఢ్: కరోనా మహమ్మారితో విలవిల్లాడుతూ..చనిపోయాక ఎక్స్‌గ్రేషియా కన్నా..బతికేందుకు అవకాశం ఇవ్వాలని, నిధులు సమకూర్చాలంటూ వేడుకున్న డీఎస్పీ లెవెల్ అధికారి ఇక లేరు. పంజాబ్‌కు చెందిన డిప్యూటీ జైలు సూపరిడెంట్ హర్జిందర్ సింగ్ తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాజీవ్ కుంద్రా ఈ విషయాన్ని ధృవీకరించారు. మరోవైపు సకాలంలో చికిత్సకు తగిన నిధులు, వైద్యం అందిం ఉండి ఉంటే బతికే వాడని హర్జిందర్ సోదరుడు హర్దీప్ సింగ్ వాపోయారు. కరోనా వైరస్ కారణంగా డీఎస్పీ హర్జిందర్ సింగ్ ఆరోగ్యం గత నెలలో తీవ్రంగా దెబ్బతింది. కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఊపిరితిత్తులు చెడిపోవడంతో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని వైద్యులు ప్రకటించారు. దీనికి 70 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో తనకు సాయం చేయాల్సిందిగా హర్జిందర్ సింగ్ పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కోరారు. అలాగే హర్జిందర్ సింగ్ కుటుంబ సభ్యులు మే 20న లూధియానా పోలీసు కమిషనర్ రాకేశ్ అగర్వాల్‌ను కలిసి లంగ్స్ మార్పిడికి సాయం చేయాల్సిందిగా కోరారు. అయితే బాధితుడు ఒకవేళ చనిపోతే 50 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా కుటుంబానికి మాత్రమే అందిస్తామంటూ ఉన్నతాధికారులు మూడు వారాలపాటు హర్జిందర్ సోదరుడిని తిప్పించుకున్నారు. దీంతో చనిపోయాక ఇచ్చే నష్టపరిహారం తనకొద్దని, బతికేందుకు తనకొక అవకాశం ఇవ్వమంటూ ఐసీయూ బెడ్‌మీదనుంచే ప్రభుత్వాన్ని వేడుకున్నహర్జిందర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ప్రభుత్వం తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో డీఎస్పీ వైద్యానికి సాయంచేసేందుకు ముఖ్యమంత్రి అంగీకరించారని స్వయంగా డీజీపీ దిన్కర్ గుప్తా ట్వీట్ చేశారు. లూథియానాలోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా ట్రీట్మెంట్ అందించబోతున్నట్లు, ట్రాన్స్ఫ్లాంట్ కోసం హైదరాబాద్ గానీ, చెన్నై గానీ తరలిస్తామని సిటీ కమిషనర్ రాకేష్ అగర్వాల్ ప్రకటించారు. కానీ ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. చదవండి: వైరల్ : బతికేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి DRDO: 2-డీజీ డ్రగ్, కీలక నిర్ణయం -
'చిన్నబాబుకు నమ్మకస్తుడిగా కోట్లకు పడగలు'
సాక్షి, గుంటూరు: ఆకాశ రామన్న ఉత్తరంతో తీగ లాగితే డొంక కదిలింది. టీడీపీ హయాంలో అర్బన్ జిల్లా నార్త్ జోన్ డీఎస్పీగా విధులు నిర్వహించి అవినీతి, అక్రమాలు, అరాచకాలకు పాల్పడిన డీఎస్పీ గోగినేని రామాంజనేయులును హత్య కేసును తప్పుదోవ పట్టించిన కారణంగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళ హత్యను మిస్సింగ్ కేసుగా నమోదు చేసి మధ్యవర్తి ద్వారా నిందితుడు నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకున్నాడని శాఖాపరమైన విచారణలో తేలడంతో డీఎస్పీని సస్సెండ్ చేశారు. ఈ అంశం పోలీస్ శాఖలో తీవ్ర చర్చనీయాంశమైంది. జరిగిందిలా... మంగళగిరి మండలం యర్రబాలెం గ్రామానికి చెందిన చిమటా కోటేశ్వరరావు రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓ మహిళతో ఏర్పడిన పరిచయంతో ఇద్దరూ కలసి సహ జీవనం కొనసాగించారు. కొన్నాళ్ల తర్వాత ఆమెను వదిలించుకోవాలని కోటేశ్వరరావు నిర్ణయించుకున్నాడు. మహిళను హత మార్చేందుకు ముందుగా మంగళగిరి మండలం టీడీపీ అధ్యక్షుడు అభయం తీసుకున్నాడు. దీంతో టీడీపీ మండల అధ్యక్షుడు ఈ విషయంపై డీఎస్పీతో ముందుగా ఒప్పందం కుదిర్చాడు. మహిళను హత్య చేసినా కేసు కాకుండా ఉండేందుకు రూ.10 లక్షలు కోటేశ్వరరావు ఇచ్చేలా మాట్లాడాడు. దీంతో 2017లో కోటేశ్వరరావు సదరు మహిళను రేపల్లె సమీపంలోని నిర్జీవ ప్రాంతానికి తీసుకువెళ్ళి హత మార్చి శవం కనపడకుండా చేశాడు. మహిళ కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. డీఎస్పీ ఆదేశాల మేరకు క్రైం నంబర్ 336/2017 కింద మిస్సింగ్ కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకున్నారు. హత్య అనంతరం టీడీపీ మండల అద్యక్షుడు సహకారంతో డీఎస్పీ రామాంజనేయులుకు కోటేశ్వరరావు రూ.10 లక్షలు ఇచ్చాడు. వెలుగు చూసిందిలా... గతేడాది నవంబరులో కోటేశ్వరరావు మహిళను హత మార్చాడనే వివరాలతో మంగళగిరి పోలీస్‌స్టేషన్‌కు ఆకాశరామన్న పేరుతో ఉత్తరం వచ్చింది. ఉత్తరం ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. గతేడాది నవంబరు 21వ తేదీన “మంగళగిరిలో మహిళ హత్య?’ పేరుతో సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఉన్నతాధికారులు స్పందించారు. డీఎస్పీ రామాంజనేయులును అదే రోజున డీజీపీ కార్యాలయానికి పిలిపించి ప్రాథమికంగా విచారించారు. అయితే తనకేమీ సంబంధ లేదని చెప్పడంతో శాఖాపరమైన విచారణకు డీజీపీ ఆదేశించారు. విచారణలో నిందితుడి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకొని హత్యను మిస్సింగ్ కేసుగానే వదిలేసినట్లు తేలింది. సీరియస్‌గా పరిగణించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ తన కార్యాలయంలో వెయిటింగ్లో ఉన్న డీఎస్పీని సస్పెండ్ చేశారు. అక్రమ ఆస్తులను వెలికితీయాలి కృష్ణా జిల్లాకు చెందిన డీఎస్పీ రామాంజనేయులు సామాన్య కుటుంబంలో పుట్టారు. ప్రస్తుతం ఆయన కోట్ల రూపాయలకు పడగలెత్తారు. ఎస్ఐగా పోలీస్ శాఖలో చేరిన ఆయన గుంటూరు అర్బన్ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ వరకు పని చేశారు. ఈ క్రమంలో అనేక అక్రమాలు, అవినీతి కార్యకలాపాలకు పాల్పడినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. గత ప్రభుత్వం హయాంలో చిన్నబాబుకు నమ్మకస్తుడిగా ఉండటంతో రెండు సార్లు ఆయన్ను నార్త్ జోన్ డీఎస్పీ నుంచి తొలగించినా మళ్లీ రాత్రికి రాత్రే జీవోలను తెచ్చి అక్కడే పోస్టింగ్ పొందాడు. అతని కుటుంబ సభ్యులతోపాటు బినామీల పేర్లతో కోట్ల రూపాయల విలువచేసే అక్రమ ఆస్తులు కూడగట్టాడని సమాచారం. హత్య కేసును కూడా మాఫీ చేసేందుకు యతి్నంచిన డీఎస్పీ పని తీరుపై పూర్తి స్థాయిలో విచారణ చేయాల్సిన అవసరం ఉంది. -
ఆయన అవినీతి పరులకు సింహస్వప్నం
అవినీతి పరులకు ఆయన సింహస్వప్నం. సాధారణంగా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే చెప్పనవసరం లేదు. కానీ తన ముప్పై ఏళ్ల పోలీస్‌శాఖ ఉద్యోగ జీవితంలో ఏ మరక అంటని అధికారి ఆయన. దాదాపు పదిహేడు ఏళ్ల క్రితం తొలిసారిగా అందుకున్న రాష్ట్ర ఉత్తమ సేవా పతకం.. ఇప్పుడు రెండో సారి అందుకుంటున్నారు. గంజాయి వనంలో తులసీ మొక్కలా ఇలాంటి అధికారులు అక్కడక్కడ ఉంటారు. అటువంటి వారే అవినీతి నిరోధక శాఖలో కలికి తురాయిల్లా గుర్తింపు పొందుతుంటారు. వీరిలో నెల్లూరు ఏసీబీ డీఎస్పీ సీహెచ్ దేవానంద్ శాంతో ఒకరు. రెండు రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాష్ట్ర ఉత్తమ సేవా పతకానికి ఎంపికైన ఆయన తన పనితీరుకు కొలమానమే ఈ ఉత్తమ సేవా పతకమంటున్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం ‘సాక్షి’తో తన మనోగతాన్ని పంచుకున్నారు. – సాక్షి, నెల్లూరు ఒడిశాకు చెందిన మా కుటుంబం విజయనగరానికి వలస వచ్చింది. మా నాన్న పేరు సదానంద శాంత్రో, అమ్మ పేరు చంద్రప్రభదేవి. మాది జమీందార్ వారసత్వ కుటుంబం. మా నాన్న స్థానిక రాజకీయాల్లో చాలా యాక్టీవ్‌గా ఉండేవారు. నాకు సుస్మితతో వివాహం జరిగింది. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా పెద్దబ్బాయి సుదేష్ శాంతో యూఎస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. రెండో అబ్బాయి సిద్ధార్ధ శాంత్రో బీటెక్ పూర్తిచేసి గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. చదువు.. ఉద్యోగం నా బాల్యం అంతా విజయనగరంలోనే గడిచింది. స్థానికంగా డిగ్రీ పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీలో ఎకానివిుక్స్ సబ్జెక్ట్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాను. 1985లో చదువు పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ ప్రారంభించాను. 1986లో ఎల్ఐసీలో డెవలప్మెంట్ అధికారిగా ఎంపికయి రెండేళ్ల పాటు ఉద్యోగం బాధ్యతలు నిర్వహించాను. 1989లో జరిగిన పోలీస్ రిక్రూట్మెంట్లో ఎస్సైగా సెలక్ట్ అయ్యాను. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన చింతపల్లి, పాడేరుల్లో విధులు నిర్వహించాను. 2000లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ పొంది ఏసీబీలో ఐదేళ్లు పని చేశాను. విజయవాడలో పనిచేసే సమయంలో 2003లో ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యాను. ఆపై 2007లో డీఎస్పీగా పదోన్నతి పొంది పాలకొండ సబ్‌డివిజన్, విజయవాడలో లా అండ్ ఆర్డర్ డీఎస్పీగా పనిచేశాను. నాలుగున్నర ఏళ్లగా మళ్లీ ఏసీబీ విభాగంలోకి వచ్చి డీఎస్పీగా పనిచేస్తున్నాను. గుంటూరులో మూడేళ్లు చేసి నెల్లూరుకు వచ్చాను. అవినీతి పరులపై కొరడా నెల్లూరుకు వచ్చి పదహారు నెలలు అయింది. ఈ కాలంలో దాదాపు 50 వరకు అవినీతి కేసులు నమోదు చేశాను. ఇటీవల తెలుగుగంగలో పనిచేస్తున్న ఆర్డీఓ స్థాయి అధికారి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశాం. పేదలను పీడించే ఉద్యోగులకు, అధికారులకు ఏసీబీ ఉందన్న భయం కలిగించేలా చేస్తున్నాం. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తున్నట్లు మాకు ఫిర్యాదు వస్తే వదిలి పెట్టం. ప్రభుత్వం నుంచి నెల వారీగా జీతాలు తీసుకుంటూ పనిచేసే ఉద్యోగులు, అధికారులు ప్రభుత్వానికి, ప్రజలకు జవాబుదారీగా పనిచేయాల్సిన వారు లంచం తీసుకోవడం నేరం. అవినీతిలో రెవెన్యూ టాప్ ప్రభుత్వం అవినీతి నిర్మూలన కోసం ప్రవేశ పెట్టిన 14400 కాల్ సెంటర్‌కు చేసే ఫిర్యాదుల్లో అధిక భాగం రెవెన్యూ పైనే ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 158 ఫిర్యాదులు వస్తే అందులో 120పైగా రెవెన్యూ శాఖవే ఉన్నాయి. రెండో ప్లేస్ పోలీస్ శాఖపై వస్తున్నాయి. ఇంజినీరింగ్, వైద్యశాఖల పైనా ఫిర్యాదులు వచ్చాయి. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసిన వారికి న్యాయం జరిగేలా చేస్తున్నాం. బాధితులు మా పని జరిగితే చాలనుకున్న వారికి పని జరిగేలా చేస్తున్నాం. ఒక వేళ లంచం డిమాండ్ చేస్తున్నాడని చెబితే మాత్రం రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంటున్నాం. ఇటీవల కాల్ సెంటర్ నుంచి వచ్చిన ఫిర్యాదులు మేరకు నెల్లూరులోని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఓ చిన్న కాంట్రాక్టర్‌కు బిల్లు చేయాలంటే ఆ బిల్లులో రెండు శాతం లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అతనిపై కేసు నమోదు చేశాం. అల్లూరు మండలం తూర్పుగోగులపల్లె వీఆర్వో ఓ పేద రైతు భూమిని ఆన్లైన్ అడంగళ్‌లో నమోదుకు నెలల కాలంగా తిప్పుకుంటూ పనిచేయకుండా లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఆ రైతు వీఆర్వోకు æలంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేశాం. ఏసీబీ పెట్టిన కేసులు 80 శాతం వరకు శిక్షలు కూడా పడుతున్నాయి. నా పని తీరుకు కొలమానమే నా సర్వీసులో ఇప్పటికి రెండు సార్లు ఉత్తమ సేవా పతకానికి ఎంపికయ్యాను. రెండు సార్లు ఏసీబీలో పని చేసేటప్పుడు ఎంపిక కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటి వరకు నా కేరీర్లో అవినీతి మచ్చలేకుండా విధి నిర్వహణ చేశాను. సేవా పతకం ఎంపిక కావాలన్నా సర్వీసులో పనితీరును పరిశీలించి ఎంపిక చేస్తారు. ఎలాంటి మచ్చ ఉన్నా ఈ పతకానికి ఎంపిక చేయరు. నా సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం సేవా పతకానికి ఎంపిక చేసింది. ఈ పతకాలు నా పని తీరుకు కొలమానంగా భావిస్తున్నాను. ఉగాది రోజున ఉత్తమ పురస్కారం ఉగాది పండగను పురస్కరించుకుని పోలీసు శాఖలోని వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ఏపీ ముఖ్యమంత్రి శౌర్య పతాకం, ఏపీ పోలీసు/ఫైర్ సర్వీసెస్ మహోన్నత సేవా పతాకం, ఏపీ పోలీసు/ఫైర్ సర్వీసెస్ ఉత్తమ సేవా పతాకం, ఏపీ పోలీసు కఠిన సేవా పతాకం, ఏపీ పోలీసు/ఫైర్ సర్వీసెస్ సేవా పతాకాలు అందించనుంది. అందుకు సంబంధించిన జాబితాను మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం జాబితాను విడుదల చేసింది. ఇందులో జిల్లాకు చెందిన పలువురుకు పతకాలు వరించాయి. వారందరికి ఉగాది రోజు పతాకాలను బహూకరించనున్నారు. నెల్లూరు ఏసీబీ డీఎస్పీ సీహెచ్ దేవానంద్‌శాంతో ఏపీ స్టేట్ పోలీసు ఉత్తమ సేవాపతకం అందుకోనున్నారు. -
మహిళతో డీఎస్పీ అసభ్య ప్రవర్తన, సస్పెన్షన్
సాక్షి, గుంటూరు : అర్బన్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వి.రమేష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారని అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ విలేకర్లకు తెలిపారు. మేడికొండూరు మండలానికి చెందిన ఓ వివాహిత భర్తతో నెలకొన్న మనస్పర్థలపై ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ కోసం మహిళా పోలీస్ స్టేషన్‌కు సిఫార్స్ చేశారు. ఈ క్రమంలో మహిళతో డీఎస్పీ అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు గత సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో దీనిపై ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా విచారణ చేపట్టి నివేదికను ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ద్వారా డీజీపీకి పంపారు. నివేదికను పరిశీలించిన డీజీపీ వెంటనే డీఎస్పీని సస్సెండ్ చేశారు. ఈ మేరకు సస్పెండ్ ఉత్తర్వులు డీఎస్పీకి అందజేశామని ఎస్పీ వివరించారు. -
వివాహితతో సంబంధం.. అడ్డంగా బుక్కైన డీఎస్పీ
తిరుచానూరు: ఆయన ఒక బాధ్యత కలిగిన పోలీసు ఆఫీసర్. ప్రజలకు మంచి చేయాల్సిన వృత్తిలో ఉంటూ వివాహితకు మాయమాటలు చెప్పాడు. ఉద్యోగం ఇప్పిస్తానంటూ లొంగదీసుకున్నాడు. విషయం తెలుసుకున్న ఆమె భర్త వారిద్దరూ గదిలో ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన ఆదివారం తిరుచానూరు సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడి వివరాల మేరకు.. కలికిరి గ్రామానికి చెందిన రెడ్డిప్రసాద్‌కు వాయల్పాడుకు చెందిన యువతితో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వృత్తి రీత్యా రెడ్డిప్రసాద్ హైదరాబాద్‌లోని ఓ సంస్థలో అసిస్టెంట్ ఫార్మసిస్ట్‌గా పనిచేస్తుండడంతో అక్కడే కాపురం పెట్టాడు. అక్కడ వారికి ఒక డీఎస్పీతో పరిచయం ఏర్పడింది. ఆ డీఎస్పీ తరచూ రెడ్డి ప్రసాద్ ఇంటికి వస్తూపోతూ ఉండేవాడు. ఈ క్రమంలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి రెడ్డిప్రసాద్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రెడ్డి ప్రసాద్ హైదరాబాద్‌లోని బూచుపల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో డీఎస్పీ రౌడీలను పూరమాయించి రెడ్డిప్రసాద్‌పై దాడి చేయించాడు. ఘటన అనంతరం టీటీడీలో ఉద్యోగం ఇప్పిస్తానని ఆ యువతికి డీఎస్పీ చెప్పాడు. ఆరు నెలల కిత్రం భార్య బలవంతం చేయడంతో తిరుచానూరు సమీపంలోని ఓ అపార్ట్మెంట్లోకి రెడ్డిప్రసాద్ కాపురం మార్చాడు. డీఎస్పీ అక్కడికీ వస్తూ పోతూ ఉన్నాడు. భార్యకు ఎంత చెప్పినా వినలేదు. ఆదివారం మరోసారి డీఎస్పీ ఇంటికి వచ్చి భార్యతో కలిసి ఉండడాన్ని గమనించిన రెడ్డిప్రసాద్ తాళాలు వేసి మీడియాతో పాటు పోలీసులకు సమాచారం అందించాడు. మీడియా సాక్షిగా తాళాలు తీయడంతో డీఎస్పీ, వివాహితతో సంబంధం బట్టబయలైంది. మీడియా రాకను చూసిన డీఎస్పీ అక్కడి నుంచి మెల్లగా జారుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు స్టేషన్‌కు రావాలని చెప్పగా కారులో వస్తానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. వివాహితను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు. బాధితుడు తిరుచానూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. డీఎస్పీ ప్రస్తుతం మంగళగిరిలోని ఏపీఎస్పీ 9వ బెటాలియన్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. -
ఆటగాళ్లకు అందలం
తొమ్మిది మంది క్రీడాకారులను డీఎస్పీలుగా నియమించిన పంజాబ్ ప్రభుత్వం న్యూఢిల్లీ: కొంతకాలంగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న తమ రాష్ట్ర క్రీడాకారులను పంజాబ్ ప్రభుత్వం సముచితంగా గౌరవించింది. తొమ్మిది మందినిS డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)లుగా నియమించింది. ఇందులో ఏడుగురు హాకీ క్రీడాకారులున్నారు. స్పోర్ట్స్ కోటా కింద వీరికి ఉద్యోగావకాశం కల్పించింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ వీరికి నియామక పత్రాలు అందించారు. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన పురుషుల హాకీ జట్టులో ఉన్న మిడ్‌ఫీల్డర్ మన్‌ప్రీత్ సింగ్, స్ట్రయికర్ ఆకాశ్‌దీప్ సింగ్, సర్వన్జిత్ సింగ్, రమణ్‌దీప్ సింగ్, గుర్విందర్ సింగ్ చండి, ధరమ్వీర్ సింగ్‌లు డీఎస్పీలయ్యారు. 2014 ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో అథ్లెటిక్స్ 400 మీటర్లలో స్వర్ణాలు సాధించిన మన్దీప్ కౌర్... ఆసియా క్రీడల్లో రజతం నెగ్గిన అథ్లెట్ ఖుష్బీర్ కౌర్ (20 కి.మీ. నడక)... ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన భారత మహిళల హాకీ జట్టు సభ్యురాలైన అమన్‌దీప్ కౌర్‌లను కూడా డీఎస్పీలుగా నియమించారు. -
‘డీఎస్పీ సీనియారిటీ’ జాబితా వెబ్సైట్లో
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసు శాఖలోని సివిల్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్(డీఎస్పీ) పదోన్నతులకు సంబంధించిన సీనియారిటీ జాబితాను అధికారిక వెబ్సైట్ (www.apstatepolice.org)లో ఉంచినట్లు డీజీపీ కార్యాలయం బుధవారం తెలిపింది. దీనిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల లోపు శాంతి భద్రతల విభాగం అదనపు డీజీకి(adg_lo@co.appolice.gov.in) ఈ-మెయిల్ ద్వారా తెలపాలని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోపక్క వెయిటింగ్లో ఉన్న సాయుధ రిజర్వ్ విభాగం డీఎస్పీ ఎం. మహేష్‌కుమార్‌కు ఆక్టోపస్‌లో పోస్టింగ్ ఇస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు.