సాక్షి, గుంటూరు : అర్బన్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వి.రమేష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారని అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ విలేకర్లకు తెలిపారు. మేడికొండూరు మండలానికి చెందిన ఓ వివాహిత భర్తతో నెలకొన్న మనస్పర్థలపై ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ కోసం మహిళా పోలీస్ స్టేషన్‌కు సిఫార్స్ చేశారు. ఈ క్రమంలో మహిళతో డీఎస్పీ అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు గత సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో దీనిపై ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా విచారణ చేపట్టి నివేదికను ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ద్వారా డీజీపీకి పంపారు. నివేదికను పరిశీలించిన డీజీపీ వెంటనే డీఎస్పీని సస్సెండ్ చేశారు. ఈ మేరకు సస్పెండ్ ఉత్తర్వులు డీఎస్పీకి అందజేశామని ఎస్పీ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment