misbehaving with woman
-
మహిళలపై కానిస్టేబుల్ దురుసు ప్రవర్తన
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ కృష్ణ తమపై దురుసుగా ప్రవర్తించి అసభ్య పదజాలంతో దూషించాడని, అతన్ని సస్పెండ్ చేయాలని కోరుతూ పోలీస్‌స్టేషన్ ఎదుట మహిళలు బుధవారం ధర్నా చేశారు. వివరాలిలా ఉన్నాయి. వింజమూరు గంగమిట్టకు చెందిన మహిళలు మంగళవారం అర్ధరాత్రి స్థానిక సబ్‌స్టేషన్‌కు వెళ్లి విద్యుత్ సరఫరా నిలిపివేతపై సిబ్బందిని నిలదీసి ఆందోళన చేశారు. దీంతో కొందరు కానిస్టేబుళ్లు సబ్‌స్టేషన్ వద్దకు చేరుకొని మహిళలకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కానిస్టేబుల్ కృష్ణ మహిళలనుద్దేశించి అసభ్య పదాలు ఉపయోగించాడు. ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో కొంతమంది పెద్దలు జోక్యం చేసుకొని సమస్యను సర్దుమణిగేలా చేశారు. అయితే తీవ్ర కలత చెందిన మహిళలు, వారి బంధువులు బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్ వద్దకు చేరుకొని కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయాలని ధర్నాకు దిగారు. ఎస్సై కోటిరెడ్డి వారికి సర్దిచెప్పి కానిస్టేబుల్‌పై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యుత్ సమస్యను కూడా త్వరలో పరిష్కరిస్తామని జెడ్పీటీసీ బాలకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు విజయకుమార్‌రెడ్డి, కొండారెడ్డి, కాలేషా తదితరులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. విద్యుత్ సమస్యను ఏఈ శ్రీనివాసరావు దృష్టికి సాక్షి తీసుకెళ్లగా గంగమిట్టలో లోఓల్టేజీ సమస్య ఉందని, దీనివల్ల విద్యుత్ అంతరాయం ఏర్పడుతోందన్నారు. అదనపు ట్రాన్స్ఫార్మర్ మంజూరైందని, రెండు మూడు రోజుల్లో పనులు పూర్తిచేసి విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామన్నారు. -
ఇంటికి వస్తావా..
యశవంతపుర: ఏదో కష్టం వచ్చి ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చిన మహిళతో అసభ్యంగా ప్రవర్తించి మంచంపైకి రావాలని కోరిన ఎస్ఐని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ప్రతాప్‌రెడ్డి సస్పెండ్ చేశారు. కొడిగేహళ్లి పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి ఒక మహిళ వెళ్లారు. ఆమెతో ఎస్ఐ రాజణ్ణ అసభ్యంగా ప్రవర్తించి, తన గదికి రావాలని కోరారు. ఆమె మొబైల్ నంబర్ తీసుకుని అసభ్యకరమైన చాటింగ్ కూడా చేశాడు. ఎస్ఐ ప్రవర్తనతో ఆవేదనకు గురైన మహిళ సాక్ష్యాధారాలతో ఈశాన్య విభాగం డీసీపీ లక్ష్మీ ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. విచారణలో అతని ఆగడాలు నిజమేనని తేలడంతో కమిషనర్ సస్పెన్షన్ వేటు వేశారు. -
మహిళతో డీఎస్పీ అసభ్య ప్రవర్తన, సస్పెన్షన్
సాక్షి, గుంటూరు : అర్బన్ జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న వి.రమేష్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారని అర్బన్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ విలేకర్లకు తెలిపారు. మేడికొండూరు మండలానికి చెందిన ఓ వివాహిత భర్తతో నెలకొన్న మనస్పర్థలపై ఫిర్యాదు చేయడంతో కౌన్సెలింగ్ కోసం మహిళా పోలీస్ స్టేషన్‌కు సిఫార్స్ చేశారు. ఈ క్రమంలో మహిళతో డీఎస్పీ అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు గత సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో దీనిపై ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా విచారణ చేపట్టి నివేదికను ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ ద్వారా డీజీపీకి పంపారు. నివేదికను పరిశీలించిన డీజీపీ వెంటనే డీఎస్పీని సస్సెండ్ చేశారు. ఈ మేరకు సస్పెండ్ ఉత్తర్వులు డీఎస్పీకి అందజేశామని ఎస్పీ వివరించారు. -
నడి రోడ్డులో దుశ్శాసన పర్వం
కర్ణాటక, బనశంకరి : పట్టపగలే నడిరోడ్డులో ఓ యువకుడు నీచ ఘటనకు పాల్పడ్డాడు. ఓ మహిళ దుస్తులు లాగేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.కళ్యాణనగర చల్లకెరె వద్ద ఈ నెల 8న ఇంటినుంచి ఓ మహిళ దుకాణం వద్దకు వెళ్తుండగా వెంబడించిన కామాంధుడు ఆ మహిళ చేతులు పట్టుకుని దుస్తులు లాగేందుకు యత్నించాడు. అతడి భారీ నుంచి తప్పించుకున్న బాధితురాలు రక్షణకోసం గట్టిగా కేకలువేసింది. స్థానికులు అక్కడికి చేరుకుని సదరు యువకుడిని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. హెణ్ణూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా యలహంక నివాసి అలుమీన్ అని తేలింది. గంజాయి సేవించడానికి హెణ్ణూరుకు వ చ్చిన అలుమీన్.. విదేశీయులకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. -
వీడియో సాక్ష్యంతో బుక్కైన దీపిక-రణ్వీర్...!
-
మహిళతో అసభ్య ప్రవర్తన, ఎమ్మెల్యేపై కేసు నమోదు
న్యూఢిల్లీ : మరో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జార్వాల్పై గ్రేటర్ కైలాష్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఆయనపై ఐపీసీ 354, 506, 509 & 34 సెక్షన్ల కింద ఢిల్లీ పోలీసులు కేసు నమోదు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన వారి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. ఆప్ సీనియర్ నేత అయిన ప్రకాశ్ జార్వాల్ దేవ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాగా గతంలోనూ దురుసుగా ప్రవర్తించినందుకు ప్రకాశ్ జార్వాల్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. కాగా 2014లో తన మాట వినలేదనే కోపంతో ఢిల్లీ జలబోర్డు అధికారిపై చేయిచేసుకున్నందుకు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఆప్ ఎమ్మెల్యేలు పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఇటీవలే ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ఆప్ ఎమ్మెల్యే దినేశ్ మోహనియాను అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. తాజాగా ప్రకాశ్ జార్వాల్ కూడా ఓ మహిళపై పట్ల అసభ్యంగా ప్రవర్తించి కేసులో చిక్కుకున్నారు. -
డబ్బులు ఇస్తానని మహిళతో అసభ్యంగా..
మంగళూరు: మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తిని స్థానికులు చితకబాదారు. కర్ణాటకలోని మంగళూరులో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువకుడు మంగళూరు సిటీ బస్ స్టేషన్ వద్ద ఓ మహిళకు డబ్బులు చూపి.. వస్తావని అడిగాడు. స్థానికంగా ఉద్యోగం చేసే ఆమె అతని ప్రవర్తన పట్ల అభ్యంతరం తెలిపింది. తనపట్ల అతను అసభ్యంగా ప్రవర్తించడాన్ని నిలదీసింది. దీంతో నలుగురు గూమిగుడి అతడిని చితకబాదారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకొని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారం చేసే మహిళగా భావించి తాను అలా అడిగానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. అతనిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.