
కర్ణాటక, బనశంకరి : పట్టపగలే నడిరోడ్డులో ఓ యువకుడు నీచ ఘటనకు పాల్పడ్డాడు. ఓ మహిళ దుస్తులు లాగేందుకు యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.కళ్యాణనగర చల్లకెరె వద్ద ఈ నెల 8న ఇంటినుంచి ఓ మహిళ దుకాణం వద్దకు వెళ్తుండగా వెంబడించిన కామాంధుడు ఆ మహిళ చేతులు పట్టుకుని దుస్తులు లాగేందుకు యత్నించాడు. అతడి భారీ నుంచి తప్పించుకున్న బాధితురాలు రక్షణకోసం గట్టిగా కేకలువేసింది. స్థానికులు అక్కడికి చేరుకుని సదరు యువకుడిని చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. హెణ్ణూరు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టగా యలహంక నివాసి అలుమీన్ అని తేలింది. గంజాయి సేవించడానికి హెణ్ణూరుకు వ చ్చిన అలుమీన్.. విదేశీయులకు గంజాయి విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.
Comments
Please login to add a commentAdd a comment