బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మునిరత్నపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. రామనగర జిల్లా కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు.
కగ్గలిపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్‌లో అత్యాచారం ఘటన జరిగినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మెల్యే మునిరత్న సహా ఏడుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోద చేసినట్ల తెలిపారు. మునిరత్నం రాజరాజేశ్వరి నగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే.
Karnataka | A rape, sexual harassment case has been filed against Rajarajeshwari Nagar BJP MLA Munirathna. The case was registered at Kaggalipura police station in Ramanagara district. As per the complaint, the incident took place at a private resort under Kaggalipura police…
— ANI (@ANI) September 19, 2024
ఇప్పటికే మునిరత్న ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించిన కేసులో ప్రస్తుతం బెంగళూరు పోలీసుల కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్‌పై ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఇవాళ( గురువారం) విచారణ చేపట్టనుంది.అయితే మునిరత్న జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున బెయిల్ మంజూరు చేస్తే.. తాజాగా కేసులో ఆయన్ను జైలు దగ్గరే అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఒకవేళ బెయిల్ తిరస్కరణకు గురైతే కగ్గలిపుర పోలీసులు వారెంట్ దాఖలు చేసి ప్రొసీజర్ ప్రకారం అదుపులోకి తీసుకుంటారని తెలుస్తోంది. బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) కాంట్రాక్టర్‌ను బెదిరించినందుకు మునిరత్నను బెంగళూరు పోలీసులు సెప్టెంబర్ 14 రాత్రి అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment