CCTV: నిను వీడని నీడను నేనే..! | Twist in Bengaluru road rage Case | Sakshi
Sakshi News home page

CCTV: నిను వీడని నీడను నేనే..!

Published Tue, Apr 22 2025 5:50 PM | Last Updated on Tue, Apr 22 2025 6:17 PM

Twist in Bengaluru road rage Case
  • నాపై దాడి అంటూ వీడియో రిలీజ్ చేసిన ఐఏఎప్ ఆఫీసర్‌
  • నేను బాధితుడ్ని అంటూ స్టోరీ అల్లిక
  • సీసీటీవీ ఫుటేజ్ తో బండారం బట్టబయలు
  •  కేసులో ట్విస్ట్‌.. ఐఏఎప్‌ ఆఫీసర్‌పై హత్యాయత్నం కేసు నమోదు

బెంగళూరు: అతనొక ఐఏఎఫ్ ఆఫీసర్.. పేరు సలాధిత్య బోస్. .డీఆర్డీవో పైలట్. ఇదంతా బానే ఉంది. అయితే తనపై కొంతమంది దాడి చేశారని ఆరోపించాడు. తాను ఎయిర్ పోర్ట్ కు వెళుతుంటే పలువురు బైక్ పై అడ్డగించి తనను తీవ్రంగా గాయపరచడమే కాకుండా భార్యను కూడా అసభ్య పదజాలంతో తిట్టారన్నాడు.  ఇదంతా బోస్ రిలీజ్ చేసిన వీడియోలో చెప్పిన మాటలు.  దీని ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు షాక్ తగిలింది. 

బోస్ చెప్పిన దానికి పరిశోధనలో తేలిన దానికి పొంతనే లేకుండా ఉంది. కేసు దర్యాప్తులో భాగంగా సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించగా బోస్ చెప్పింది అంతా అబద్ధమేనని తేలిపోయింది.   ఆ సీసీటీవీ ఫుటేజ్ క్లిప్ ల్లో కేవలం  విక్రమ్ అనే వ్యక్తిపై బోస్ దాడి చేయడమే కనిపించింది. అతన్ని కిందపడేసి మరీ పిడుగు గుద్దులు కురిపించాడు.

ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. న్యాయాన్ని బ్రతికించడానికి ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ లు ఆధారమవుతున్నాయని, లేకపోతే అమాయకులు బలి అవుతారని నెటిజన్లు పేర్కొంట్నునారు. ప్రస్తుతం బోస్ పై హత్యాయాత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. కుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా బయ్యప్పనహళ్లి పోలీసులు.. బోస్ పై బీఎన్ఎస్ సెక్షన్ల కింద పలు కేసులు నమోదు చేశారు.  బీఎన్ఎస్ సెక్షన్లు 109 (హత్యాయత్నం), 115(2) (స్వచ్ఛందంగా గాయపరచడం), 304 (స్నాచింగ్), 324 (అల్లరి), మరియు 352 (శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

 

ఆఫీసర్‌ చెప్పిన కథ ఇది.. 
సోమవారం ఉదయం భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ కు వెళుతున్నాను. భార్య కారు డ్రైవ్ చేస్తుండగా, బోస్ పక్క సీట్లో కూర్చున్నా.  ఇంతలో మమ్మల్ని దాటుకుని వచ్చిన ఒక బైక్ మా కారుకు అడ్డంగా  ఆగింది. బైక్ పై నుంచి దిగిన ఓ వ్యక్తి మమ్ముల్ని కన్నడలో తిట్టడం ప్రారంభించాడు. వారు మా కారుకు అంటించి ఉన్న డీఆర్డీవో స్టిక్కర్ చూశారు. మీరు డీఆర్డీవో వారా అంటూ నిలదీశాడు. మా భార్యను కూడా తిట్టడం ప్రారంభించారు. నేను భయపడలేదు. ఆ సమయంలో కారు నుంచి కిందకు దిగాను.  ఓ వ్యక్తి తన బైక్ తాళం చెవితో నా నుదుటిపై దాడి చేశాడు. నా ముఖానికి తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. ఆర్మీకి చెందిన వారిని ఇలానే ట్రీట్ చేస్తారా అని మనసుకు బాధగా అనిపించింది.

వారు చేసిన దాడి నుంచి ఏదో రకంగా తప్పించుకుని బయటపడ్డాం. ఇక్కడ మాకు దేవుడు సాయం చేశాడు. దీనిపై ఫిర్యాదు చేస్తాం. వారు ఎందుకు మాపై దాడి చేశారో తెలియడం లేదు. ప్రతీకారం తీర్చుకోకుండా ఉండే శక్తిని దేవుడు నాకు ఇస్తాడనే అనుకుంటున్నా. ఒకవేళ మాకు న్యాయం జరగకపోతే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటా’ అని ఐఏఎఫ్ అధికారి తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement